Homeఎంటర్టైన్మెంట్బన్నీ పుట్టిన రోజు కానుక

బన్నీ పుట్టిన రోజు కానుక

కరోనా కారణంగా సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయాయి. దాంతో పెద్ద చిత్రాలు , చిన్న చిత్రాలు అన్న తేడా లేకుండా సినిమా న్యూస్ ఏవీ బయటికి రావడం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ ని అభిమానించే వాళ్లని సినీ వార్తల కొరత అసహనానికి గురి చేస్తోంది. ఇంకా చెప్పాలంటే పిచ్చిపట్టినట్టు అవుతోందట … ఇది గమనించే రాజమౌళి ” రౌద్రం రణం రుధిరం ” చిత్రానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎన్ టి ఆర్ […]


కరోనా కారణంగా సినిమా షూటింగులు అన్నీ ఆగిపోయాయి. దాంతో పెద్ద చిత్రాలు , చిన్న చిత్రాలు అన్న తేడా లేకుండా సినిమా న్యూస్ ఏవీ బయటికి రావడం లేదు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ ని అభిమానించే వాళ్లని సినీ వార్తల కొరత అసహనానికి గురి చేస్తోంది. ఇంకా చెప్పాలంటే పిచ్చిపట్టినట్టు అవుతోందట … ఇది గమనించే రాజమౌళి ” రౌద్రం రణం రుధిరం ” చిత్రానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎన్ టి ఆర్ , రామ్ చరణ్ అభిమానులను శాంతింప చేసాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ టీం కూడా తమ కొత్త సినిమా గురించి కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేయాల్సిన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కరోనా కారణాల వల్ల వాయిదా పడింది. మొత్తం ప్లానింగ్ అంతా దెబ్బ తినేసింది. సుక్కు , బన్నీ కాంబినేషన్లో సినిమా ఓకే అయ్యి ఏడాది దాటుతున్నా ఆ సినిమా గురించి చిన్న అప్ డేట్ కూడా లేకపోవడం అభిమానుల్ని బాగా నిరాశ పరుస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ, సుక్కుల అభిమానులకు ఊరటనిచ్చేందుకు కనీసం సినిమా ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తోంది. ఇందుకు మంచి సమయం కోసం ఎదురు చూస్తోంది.

సరిగ్గా ఈ టైం లో బన్నీ పుట్టిన రోజు వస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఏప్రిల్ 8 న బన్నీ బర్త్ డే నాడు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలను కొంటున్నారు. ఆ క్రమంలో బన్నీ పాత్రకు సంబంధించి ఫొటో షూట్ కూడా చేశారు. సో ఏప్రిల్ ఎనిమిదో తారీఖున విడుదల చేయడమే తరువాయి ….
many happy returns

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper