
కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు లాక్ డౌన్ ప్రకటించిన వారం రోజులకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేశారని పేర్కొన్నారు. ప్రధానితో సీఎం వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ ట్విట్టర్లో గాటుగా స్పందించారు. బాగోనిది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు, జగన్ గారి మానసిక పరిస్థితి అని పేర్కొన్నారు. జగన్ బీద అరుపులు విచిత్రంగా ఉన్నాయని తెలిపారు. ఇసుక, మట్టి దోపిడీ పై జగన్ కు ఉన్న శ్రద్ధ లో 10 శాతం కరోనా నివారణ పై పెట్టినా రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా జగన్ గారు మొద్దు నిద్ర,నిర్లక్ష్య ధోరణి పక్కనపెట్టి కరోనా నివారణ కు చర్యలు తీసుకోవాలని కోరారు.
కరోనా ఎఫెక్ట్ తో కష్టాల్లో కూరుకుపోయిన పేద వాళ్లకు 5 వేల ఆర్థిక సహాయం అందించడానికి జగన్ కు మనస్సు ఒప్పడం లేదన్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, రవాణా సౌకర్యం లేక కన్నీరు పెడుతున్న రైతన్నని ఆదుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి లేక, మూడు నెలల వేతన బకాయిలు విడుదల అవ్వక పోవడంతో ఉపాధి హామీ వేతనదారులు ఇబ్బందులు పడుతుంటే జగన్ గుండె చలించలేదని, కానీ ఉపాధి హామీ పధకంలో పనులు చేసిన వైకాపా కార్యకర్తలకు 961 కోట్లు బిల్లులు విడుదల చేశారని ఎద్దేవ చేశారు.\
Also Read: జగన్ కు కాంట్రాక్టర్ల పై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: లోకేష్