Home Blog Page 8528

బాలీవుడ్ బయోపిక్ కి పవన్ డైరెక్టర్

.
మణిరత్నం నిర్మించిన `అంజలి `చిత్రం తో బాల నటుడిగా చిత్ర సీమలోకి ప్రవేశించి ఆ తరవాతి కాలం లో అసిస్టెంట్ దర్శకుడిగా మేటి ఫోటోగ్రాఫర్ మరియు డైరెక్టర్ అయిన సంతోష్ శివన్ వద్ద పని చేసాడు . అలా ఎదిగి అజిత్ హీరోగా ` బిల్లా` ,` ఆరంభం` లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి దర్శకుడి గా మంచి పేరు తెచ్చుకొన్నాడు విష్ణువర్ధన్…. తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా`పంజా` సినిమాను రూపొందించాడు. తమిళ నాట స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న ఈ దర్శకుడు ఇపుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ఓ బయోపిక్ ని తెరకెక్కించ బోతున్నాడు . కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్నShershaah సినిమాతో విష్ణువర్ధన్ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు .

ఇక ఈ కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ నిర్మించే Shershaah సినిమాలో కీలక ఆర్మీ మేజర్ పాత్ర ఒకటుందట. దాంతో ఈ పాత్రలో నటించవలసిందిగా స్టార్ హీరో అజిత్ ను సంప్రదించగా అజిత్ కి ఆ పాత్ర నచ్చి విష్ణువర్థన్ తో ఓకే చెప్పినట్లు తెలిసింది . అజిత్ ఇదివరకే శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు,. ఇపుడు రెండో సారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నాడు .ఇంతకీ అసలీ విషయం ఏమిటంటే అజిత్ పుట్ట్టింది హైదరాబాద్ లో, అదీగాక తల్లి సింధీ మహిళా కావడం తో హిందీ బాగా మాట్లాడుతాడు .

నావికాదళంలో 26 మందికి కరోనా!


భారత నావికాదళంలో కరోనా కలకలం చెలరేగింది. నేవీలోని 26 మంది సెయిలర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ముంబైలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి వీరిని క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇండియన్ నేవీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. సెయిలర్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు.

ఈ సందర్భంగా నేవీ ఒక అధికారిక ప్రకటన చేసింది. యుద్ధ నౌకల్లో ఉన్న అధికారులు, సెయిలర్లు ఎవరికీ కరోనా రాలేదని వెల్లడించింది. ప్రస్తుతం కరోనా బారిన పడిన సెయిలర్లంతా ఒడ్డున (ఐఎన్ఎస్ యాంగ్రే షోర్ బేస్డ్ డిపో) ఉన్నవారేననని తెలిపింది. లాజిస్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగాల్లో వీరు విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పింది. సెయిలర్లకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ భాగం అసింప్టొమేటిక్ (ఇన్ఫెక్షన్ లక్షణాలు కనపడని) అని తెలిపింది. కేసులు బయటపడిన వెంటనే బ్లాకు మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.

ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్‌ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారుల అనుమానం. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రేను లాక్‌డౌన్‌ చేశారు. మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు చెపట్టింది. భారత త్రివిధ దళాలలో ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీలో 8 కరోనా కేసులు నమోదు అయినట్లు సమాచారం.

పచ్చి బంగాళాదుంపలు తింటూ కడుపు నింపుకుంటున్నారు!


విజయవాడ నగరానికి పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కార్మికులు తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. నగరంలోని లేడీస్ టీలరింగ్ షాపుల వద్ద మగ్గం పని చేసే వీరంతా అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు. లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటూ కాలక్షేపం చేస్తున్నట్లు చెప్పారు. క్రీస్తురాజపురంలో పశ్చిమ బెంగాల్ వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు. వీరంతా లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాధికారులు పట్టించుకోవడం‌ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడంతో ఏ ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదంటున్నారు. వాలంటీర్ లు కూడా వీరి వివరాలను నమోదు‌ చేసుకోపొవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వాళ్ల బాధను అర్ధం చేసుకుని ఆహారం అందించాలని లేనిపక్షంలో సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

శ్రద్ధా కపూర్ సూక్తులు చెబుతోంది


రీసెంట్ గా వచ్చిన వచ్చిన బాలీవుడ్ యువ హీరోయిన్ లలో శ్రద్ధా కపూర్ ఒక ప్రత్యేక శైలిలో వెళుతోంది . `ఆషీకీ 2 `చిత్రం తో స్టార్డం సంపాదించు కొన్న శ్రద్ద కపూర్ ఆ తరవాత ” ఏ బి సి డి , స్ట్రీట్ డాన్సర్ , బాఘీ , చిచోరే వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ లో సుస్థిర స్తానం సంపాదించు కొంది. ఒకనాటి విలన్ శక్తి కపూర్ కి కూతురు . హీరోయిన్ పద్మిని కొల్హాపురికి మేనకోడలు , పాపులర్ గాయని లతామంగేష్కర్ కి ముని మేనకోడలు అయిన శ్రద్ద కపూర్ వ్యక్తిగతం గా చాలా మంచి హృదయం కల అమ్మాయి అని పేరు తెచ్చుకొంది.

అంతేకాదు ప్రభాస్ హీరోగా నటించిన `సాహో` సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది. నటిగా విపరీతమైన క్రేజ్ ఉన్న శ్రద్ధకు పెంపుడు జంతువులు అంటే ప్రాణమట. తను పెంచుకునే కుక్క బాగోగుల గురించి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులే కాదు జంతువులు కూడా ఆకలితో అలమటిస్తుంటే.. వాటి ఆకలి తీర్చేందుకు స్వచ్చంధ సంస్థకు విరాళం కూడా అందించిందట శ్రద్ద కపూర్.

లాక్ డౌన్ అనగానే ఒంటరి తనం – ఒత్తిడి – మానసిక సమస్యలతో భయపడిపోతున్నారు. మరి జంతువుల గురించి ఆలోచించరే అంటూ ప్రశ్నిస్తోంది. మిలియన్ సంఖ్యలో జంతువులు జీవితం మొత్తం బంధించబడి ఉంటున్నాయి. ఇప్పటికైనా మారండి… మనం ఈ భూమి మీదకి కేవలం అతిథులుగా మాత్రమే వచ్చాం , జంతువులు కూడా మనలాగే వచ్చాయి. అందువల్ల తోటి ప్రాణులను హింసించే హక్కు మనకు లేదు అని సోషల్ మీడియా లో చక్కగా హెచ్చరించింది .

https://www.instagram.com/p/B-_cFGJJR4h/

గుడ్ న్యూస్ చెప్పిన వొడాఫోన్ ఐడియా,ఎయిర్‌ టెల్!

ఎయిర్‌ టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు శుభవార్త. అతి తక్కువ ఆదాయం కలిగిన ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ కాలపరిమితిని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఆయా కంపెనీల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ యూజర్ల ఇన్‌ కమింగ్ సర్వీసులను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. సరిగ్గా అదే రోజుతో దేశ వ్యాప్తంగా పొడిగించిన లాక్ ‌డౌన్ గడువు కూడా ముగియనుంది భారతీ ఎయిర్‌ టెల్ కూడా ఇంచుమించు ఇలాంటి ప్రకటనే చేసింది.

ఖాతాదారుల వ్యాలిడిటీ గడువు ముగిసినప్పటికీ మే 3 వరకు ఇన్ ‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. కాగా, లాక్‌ డౌన్ తొలి దశలో ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీ గడువును పొడిగిస్తూ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాదు, పది రూపాయల టాక్‌టైంను కూడా అందించాయి. ఇప్పుడు లాక్‌డౌన్ గడవు మరోమారు పొడిగించడంతో చెల్లుబాటు అయ్యే కాలపరిమితిని మరోమారు పొడిగించాయి.

మహేష్ కోసం కష్టపడుతోన్న హరీష్


అటు కమర్షియల్ సినిమాలు, ఇటు రీమేక్ సినిమాలు తెరకెక్కించడంలో హరీష్ శంకర్ దిట్ట . అలా రెండు రకాల క్వాలిటీస్ పుష్కలంగా వున్నా దర్శకుడు హరీష్ శంకర్..అంతేకాదు హీరోలను కమర్షియల్ గా ఎలివేట్ చేసి చూపిస్తూ తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి . హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే 28 వ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు ..

‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం తో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇదిలా ఉంటే ఈమధ్య హరీష్ శంకర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నా నని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. మహేష్ బాబు ఇమేజ్ తగ్గట్టు ఓ కమర్షియల్ సబ్జెక్ట్ వ్రాస్తున్న అని వెల్లడించాడు . అంతేకాదు త్వరలో తను ఇద్దరు యువ నిర్మాతలతో కలిసి సినిమా నిర్మాణం చేపట్ట బోతున్నట్టు తెలిపాడు. కళ్యాణ్ రామ్ తో ” 118 .”చిత్రాన్ని నిర్మించిన మహేష్ కోనేరు , గీతా ఆర్ట్స్ బన్నీ వాస్ లతో కలిసి సినిమాలు నిర్మించాలను కొంటున్నట్టు తెలిపాడు. ప్రసుతం వెబ్ సిరీస్ కి కూడా రచన చేస్తున్నట్టు తెలిపాడు .

వివాదంగా మారిన విరాళాలు!


కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ఆదాయాన్ని కోల్పోవడంతో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన సంస్థలు, సేవా సంస్థలు, వ్యక్తి గత విరాళాలు అందజేయాలని ప్రభుత్వం కోరింది. ఏ మేరకు పలు సంస్థలు, ఉద్యోగ సంఘాలు, వ్యక్తులు ఇప్పటి వరకు రూ.173 కోట్ల విరాళాలను ప్రభుత్వానికి అందజేశారు. ఇంత వరకూ అధికారికంగా సాగింది. విరాళాల మొత్తం ప్రభుత్వ ఖాతాకు జమ అయ్యింది. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ పరిధిలో విరాళాలు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది.

కరోనపై పోరులో భాగంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు సాయమందించేందుకు నియోజకవర్గ పరిధిలోని రైతులు, పరిశ్రమల యజమానులు, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ఏజెన్సీల నుంచి విరాళాలు బలవంతంగా వసూలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెయ్యి బస్తాల ధాన్యం, ఆక్వా రైతులు ఒక్కొక్కరి నుంచి రూ. 5 వేలు, రొయ్యల హేచరీ నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, కావాలి నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకులు వారి సొంత ట్రస్టు ఖాతాలోకి నగదు మళ్లించుకుని తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల అడ్డగోలు విరాళాల వసూళ్ళను తెలుగుదేశం పార్టీ సైతం తప్పుపట్టింది. అన్ని రంగాలు విపట్టును ఎదుర్కొంటుంటే సి.ఎం.ఆర్.ఎఫ్ కు విరాళాలు ఇవ్వాలంటూ వత్తిడి తేవడం సమంజసం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఇటువంటి అరాచకాలు మానుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ పరిస్థితుల్లో ‘కరోనా’ విరాళాలు వివాదంగా మారాయి.

Also Read: మోడీ ప్రభుత్వం పై విమర్శల్లో నిజమెంత?
జగన్ గ్రామ కార్యదర్శుల వ్యవస్థ కుప్పకూలిందా!

ఒక్కొక్క రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కరోనా కల్లోలం


దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులోకి వచ్చి నాలుగో వారంలో సగం రోజువు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. ఒక్కో రాష్ట్రంలో సగటున 69 శాతం (ప్రతి పది కేసుల్లో ఏడు) పాజిటివ్ యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

కేసుల సంఖ్యతో పాటు రికవరీ అయిన వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. రికవరీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా సగం కంటే ఎక్కువ (55.55 శాతం) డిశార్జ్ అయిన రోగులు కూడా ఒక రాష్ట్రంలోని ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. మరణాల విషయానికి వస్తే 63.9 శాతం మరణాలు కూడా ఈ మూడు జిల్లాల్లోనే రికార్డయ్యాయి.

కేంద్రం 25 రాష్ట్రాల్లోని 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా గుర్తించింది. రాష్ట్రాలవారీగా గుర్తించిన ఈ మూడు జిల్లాలు ఈ జాబితాలో కూడా ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లో 4,200 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీటిలో ప్రతి రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోనే 80 శాతం కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర విషయానికి వస్తే ముంబై, పుణె, థానే జిల్లాల్లోనే 89.27 శాతం కేసులు రికార్డయ్యాయి. రికవరీ అయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో 83 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే. ఇక గుజరాత్ విషయానికి వస్తే అహ్మదాబాద్, వడోదర, సూరత్ జిల్లాల్లోనే 84.87 శాతం కేసులు నమోదయ్యాయి. రికవర్ అయిన వారిలో 52.05 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే.

మధ్యప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మొత్తం కేసుల్లో 81.81 శాతం ఇండోర్, భోపాల్, ఖార్గావ్ జిల్లాల్లోనే రికార్డయ్యాయి. దక్షిణాది రాస్త్రాలలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కేసుల సంఖ్య, రికవర్ అయిన వారి సంఖ్యా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇదే సీన్ ఉంది.

కర్నాటకలోని బెంగళూరు, మైసూరు, బెళగావిలోనూ.. కేరళలోని కాసరగోడు, కన్నూర్, ఎన్నాకుళం జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని ఈ మూడు జిల్లాల్లో సగటున 63 శాతం కేసులు నమోదయ్యాయి. అలాగే రికవర్ అయిన పేషెంట్లలో 50 శాతం మంది ఈ మూడు జిల్లాలకు చెందిన వారే.

తమిళనాడులో కరోనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించింది. టాప్త్రీలో ఉన్న చెన్నై, కొయంబత్తూర్, ఇండస్ట్రియల్ హబ్ తిరుపూర్లో 33.46 శాతమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పర్సెంటేజ్లో కేసులు రికార్డయ్యాయి.

ఇక ఉత్తరప్రదేశ్లో పర్సంటేజ్ కాస్త తక్కువగా ఉంది. ఆగ్రా, లక్నో, గౌతం బుద్ధనగర్ జిల్లాల్లో 45 శాతం యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రం కావడం వల్ల అక్కడ కేసుల సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. అదే బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని మూడు జిల్లాల్లో యావరేజ్గా 60 శాతం యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి.

కిక్కు కోసం మందుబాబుల కొత్త రూట్!


దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలుతో నిత్యావరస సరుకుల షాపులు మినహా అన్ని బంద్ అయ్యాయి. దీంతో మద్యంప్రియులకు మద్యం దొరకక నానా అవస్థలు పడ్డాయి. బ్లాకులో కూడా మద్యం దొరకని పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ మద్యం లభించినప్పటికీ అధిక రేట్లకు దొరకుతున్నాయి. చాలాచోట్ల మద్యం రేట్లు తాగకముందే చుక్కలు చూపించడంతో మద్యంబాబులు సరికొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. మద్యంబాబులకు వచ్చిన ఐడియా చూస్తే అవాక్కాల్సిందే..

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందే లేదోగానీ.. మద్యం బాబుల కష్టాలను మాత్రం దూరం చేసింది. మద్యం దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి సరికొత్త కిక్కు నిస్తోంది. లాక్డౌన్లో మద్యంప్రియులు సొంతంగా మద్యాన్ని తయారు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్లో మద్యంబాబులు శానిటైజర్లనే ఆల్కాహల్ గా వాడేస్తున్నారని సమాచారం. విస్కీలో 40శాతం ఆల్కహాల్ మాత్రమే ఉంటుంది. కానీ శానిటైజర్లలో మాత్రం 70శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీంతో మందుబాబులో శానిటైజర్లో వాటర్ ను మిక్స్ చేసుకొని తాగేస్తున్నారట. ఇందుకోసం గూగూల్లో సెర్చ్ చేసి మరీ మద్యం తయారీపై ప్రయోగాలు చేస్తున్నారు.

అయితే దీని వల్ల తాత్కాలికంగా కిక్కు లభిస్తుందేగానీ ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. శానిటైజర్లలో ఆల్కహాల్ తోపాటు గ్లిజరిన్, హైడ్రోజన్ పైరాక్సైడ్ ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. గ్లిజరిన్, హైడ్రోజన్ పైరాక్సాడ్ కాలేయం, కిడ్నీలకు హానీ కలుగజేయస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల శానిటైజర్లపై పరిమితి విధించాలని వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సీసీసీకి నిర్మాత మోహ‌న్ చెరుకూరి విరాళం


మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తోన్న క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ప్ర‌ముఖ నిర్మాత మోహ‌న్ చెరుకూరి రూ. 5 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. షూటింగ్‌లు లేక ఉపాధి క‌రువై ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినంద‌నీయ‌మ‌నీ, అందులో త‌నూ భాగం కావాల‌నే ఉద్దేశంతో త‌న వంతుగా ఈ విరాళం అందిస్తున్నాన‌నీ ఆయ‌న చెప్పారు. క‌రోనా ఉధృతిని అరిక‌ట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌నీ, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా త‌మ విధుల‌ను అహ‌ర్నిశ‌లూ నిర్వ‌హిస్తున్నారనీ ఆయ‌న కొనియాడారు.

అలాగే ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచ‌డానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంత‌రం శ్ర‌మించ‌డం గొప్ప విష‌య‌మ‌ని మోహ‌న్ అన్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగాలు చేస్తున్న ఈ కృషికి త‌గ్గ‌ట్లు పౌరులుగా మనంద‌రం మ‌న ఇళ్ల‌ల్లోనే క్షేమంగా ఉంటూ క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌డంలో మ‌న వంతు పాత్ర పోషించాల‌ని ఆయ‌న కోరారు.

సూర్యాపేటకు పోటీగా బెజవాడ!


తెలంగాణాలోని సూర్యాపేటలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్న తరుణంలో ఏపీలోని విజయవాడలో కూడా అదే మొత్తంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సూర్యాపేటలో 16 కేసులు నమోదు కాగా నేడు విజయవాడలో కూడా 16 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కృష్ణా జిల్లాలో 18 కరోనా కేసులు నమోదు కాగా… అందులో నగరంలోని కార్మికనగర్‌ లో 8 కేసులు, ఖుద్దుస్ నగర్, విద్యాధరపురం, గుప్తా సెంటర్, గిరిపురం, పటమట, కొత్తపేట, కేదారేశ్వరపేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. దీంతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. బాధితులకు ఎవరి నుంచి వైరస్ సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైరస్ సోకిన వారు నగరంలో ఏయే ప్రాంతాల్లో తిరిగారు, ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

అయితే వీరికి ఎవరి నుంచి వైరస్ సోకిందనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన తరువాత ఇతరులకు సోకిన ఈ వైరస్… ఆ తరువాత మర్కజ్ ప్రార్థనాలకు వెళ్లొచ్చిన వారి ద్వారా ఇతరులకు సోకినట్టు అధికారులు గుర్తించారు. ఈ కోవలోనే విచారణ చేపట్టి… మిగతావారిని గుర్తించడమో లేక ఇతరులను క్వారంటైన్ చేయడమో చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కరోనా బాధితుల్లో ఎక్కువమందికి విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం లేకపోవడం, మర్కజ్ లింకులు కూడా లేకపోవడంతో… వారికి ఈ మహమ్మారి ఏ రకంగా సోకిందనే అంశం తెలుసుకునేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

20 నుంచి టోల్ వసూళ్లు ప్రారంభం!


గత నెల రోజుల నుంచి నిలిచిపోయిన టోల్ వసూళ్లు మళ్లీ ప్రారంభించడానికి టోల్ గెట్ ల సిబ్బంది సిద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం టోలు వసూలును నిలిపివేసింది. గత నెల 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాస్తూ ఏప్రిల్ 20 నుంచి టోలు వసూలు మొదలుపెట్టాలని సూచించింది.

కేంద్రం సూచనపై లారీ యజమానుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. నెల రోజులుగా లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలను నిలిపివేయడంతో ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన డ్రైవర్లు, క్లినర్లు డ్యూటీలకు వెళ్లేందుకు ముందుకు రావడం లేదంటున్నారు. ఎందుకు కరోనా భయం కారణంగా యజమానులు చెబుతున్నారు.
ఈ సమయంలో రవాణా రంగానికి ఊతం ఇచ్చే చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పేర్కొంతున్నారు.

ట్రంప్ కి తలనొప్పిగా మారిన మూడు ట్వీట్లు!


ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన మూడు ట్వీట్లు ఆ దేశంలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ ‌ని వ్యతిరేకిస్తూ ట్రంప్ ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లకు వ్యతిరేకంగా వందలమంది నిరసన కారులు లాక్ డౌన్ రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేబడుతున్నారు.

మిన్నెసోట, మిచిగన్, వర్జీనియా రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ పేరిట అమలు చేస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని, “లిబరేట్ మిన్నెసోట’’, ‘‘లిబరేట్ మిచిగన్’’, ‘‘లిబరేట్ వర్జీనియా’’ అంటూ ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. ట్రంప్ ట్వీట్లు చేసిన రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష డెమొక్రాట్లు పరిపాలిస్తున్న రాష్ట్రాలే కావడం గమనార్హం.

అయితే, ఆయా రాష్ట్రాల్లో లాక్ ‌డౌన్ ‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ నిబంధనలు ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాయని, అకారణంగా రాకపోకల్ని నియంత్రిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ పతనానికీ దారితీస్తున్నాయని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. తక్షణం లాక్ ‌డౌన్ ఎత్తేయాలని మిచిగన్, ఓహియో, నార్త్ కరోలినా, మిన్నెసోట, ఉటా, వర్జీనియా, కెంటకీల్లో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

జనంపై విచ్చలవిడిగా పన్నులు వేయనున్న జగన్


ఒక వంక ఉన్న కొద్దిపాటి ఆదాయం కరోనాతో కరిగి పోతుండటం, మరోవంక అదనపు ఆర్ధిక వనరుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించక పోవడం, కేంద్రం ఆదుకొంటుంది అనుకొంటే రిక్త హస్తం ఎదురవుతూ ఉండడం, అప్పులు కూడా పుట్టాక పోతూ ఉండడంతో ప్రభుత్వం నడవాలి అంటే జనంపై విచ్చలవిడిగా పన్నుల భారం మోపడమే మార్గంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

అందుకనే ఇప్పటికే ఉన్న పన్నులను పెంచడంతో పాటు, ఇప్పటి వరకు ఊహించని విధంగా కొత్త పన్నులు వేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రూ 5,000 నుండి రూ 10,000 వరకు వేతనం తీసుకురటున్న వారిపై ఇక నెలకు రూ 50 చొప్పున ఏటా రూ 600 పన్ను భారం వేయనున్నారు. ఇక రూ 10,000 నుండి రూ 15,000 వరకు జీతాలున్న వారిపై ఏడాదికి రూ 1200 భారం పడనుంది. ప్రస్తుతం రూ.1250 వృత్తి పన్ను పరిధిలో ఉన్న వారి నురచి ఇకపై రూ.2,500 వసూలు చేయాలని కూడా చూస్తున్నారు. అంటే వృత్తిపన్ను 100 శాతం పెరగనుంది.

స్వల్ప జీతంతో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రయివేటు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, చివరకు ఆటో, టాక్సీ డ్రైవర్లపైనా పన్ను భారం పడనుంది. ఈ మేరకు వృత్తి పన్ను చట్టాన్ని అవసరమైన మేరకు సవరిరచాలని చూస్తున్నారు. ఇటీవలే కీలక శాఖల అధికారులతో భేటీ అయిన ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు వీటికి సంబందించిన పలు అరశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేసారు.

రవాణా శాఖకు సంబంధిరచి ఆటోలు, టాక్సీలు, మిని క్యాబ్‌లు రాష్ట్రంలో 95,000 వరకు ఉన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబందించి చిట్ ఫండ్ సంస్థలలో పనిచేసే వారిని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రస్తుతం రిజిస్టర్‌ అయిన చిట్‌ఫండ్‌ సంస్థలు 717, చిన్న గ్రూపులు 12,328, వాటిల్లో ఉన్న వారు దాదాపు ఐదు లక్షల మంది ఉండగా, తద్వారా ఏటా రూ.765 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా వేశారు.

ఆర్‌టిసికి సంబంధిరచి అద్దె బస్సుల్లో ఎక్కువ మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారికి రూ.12 వేలు వేతనంగా చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో అనేక బస్టాండ్లలో వందల సంఖ్యలో దుకాణాలు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో పన్ను పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. పాఠశాల, ఇంటర్ విద్యాశాఖలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సిరగ్‌ విధానంతో దాదాపు 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

ఏదో రకంగా వీరందరిని పన్ను పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కసరత్తు సాగుతోంది. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వేలాదిమందిని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో అబ్కారీ, గనులు, చలనచిత్ర పరిశ్రమ వంటి అనేక ఇతర శాఖల్లోనూ పన్ను పరిధిలోకి రాని వారిని ఇప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు.

వలస కార్మికుల గోడు పట్టని కేంద్రం… మహారాష్ట్ర, యూపీ చొరవ!


కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా అందరికన్నా ఎక్కువగా జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటున్నది భుక్తి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి, చిక్కుకు పోయిన వలస కార్మికులే. చాలీచాలని ఎన్ డి ఆర్ ఎఫ్ నిధులతో వారికి వసతి, భోజనం ఏర్పాటు చేయమని ఉచిత సలహా ఇచ్చి మౌనం వహించింది.

వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించ వలసిన బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక వెసులుబాటు కలిగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న పరిమితమైన వనరులతో వారికి వసతి, భోజనం కల్పిస్తున్నా కనీసం తమ స్వస్థలాలకు వెళ్లే అనుమతి ఇవ్వమని వలస కార్మికులు పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు.

వివిధ రాష్ట్రాలలో చిక్కుకు పోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కారిమికులను పంపేందుకు సహకరింపమని బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు కోరినా కేంద్రం స్పందించడం లేదు. అయితే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కొంత చొరవ తీసుకొంటున్నాయి.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమారు 1,000 బస్సు లను ఏర్పాటు చేసి, రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకు పోయిన బీహార్ కు చెందిన వలస కార్మికులకు రవాణా ఏర్పాటు చేశారు. అట్లాగే రాజస్థాన్ లో చిక్కుకు పోయిన యూపీకి చెందిన విద్యార్థులను తీసుకు రావడానికి సహితం 300 బస్సులను పంపుతున్నట్లు ప్రకటించారు.

తాజాగా, మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన ల‌క్ష మందికి పైగా వ‌ల‌స కార్మికులను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌కు చెందిన కార్మికులు వేర్వేరు ప్రాంతాల్లోని 38 షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల్లో ప‌ని చేస్తున్నారు.

లాక్ డౌన్ తో ప‌నులు నిలిచిపోవ‌డం, ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో ఆ ఫ్యాక్ట‌రీలే తాత్కాలిక షెల్ట‌ర్లు ఏర్పాటు చేసి భోజ‌న స‌దుపాయం క‌ల్పించింది. ఇటీవ‌ల‌ వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తామంటూ నిర‌స‌న‌ల‌కు దిగుతున్న‌ నేప‌థ్యంలో వారిని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం.

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల్లో ప‌ని చేసే సుమారు ల‌క్షా 31 వేల మంది కార్మికుల‌ను వారి సొంత జిల్లాల‌కు పంపేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధ‌నంజ‌య్ ముండే తెలిపారు.

దేశంలో తొలి వైరస్ ఫ్రీ జోన్.. ఎక్క‌డో తెలుసా?


దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో రెండో విడుత లాక్డౌన్ మే3 వరకు కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. నిత్యం టూరిస్టులతో కళకళలాడే గోవా కరోనా ఎంట్రీ మూగబోయింది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గోవా దేశంలో తొలి వైరస్ ఫ్రీ జోన్ గా రికార్డు సృష్టించనుంది.

దేశంలో అందమైన టూరిస్టు ప్రాంతాల్లో గోవా ఒక్కటి. ఈ ప్రాంతానికి నిత్యం వేలాది మంది టూరిస్టులు వస్తూపోతుంటారు. ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేసిన కరోనా మహమ్మరి గోవాలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమాచారంతో గోవా ప్రభుత్వం అందరి కంటే ముందే అప్రమత్తమైంది. దేశంలో తొలిసారిగా విమానాశ్రయంలో ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించింది. అన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చి 22 నుంచే మూసివేసింది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో వైరస్ ప్రబలకుండా కట్టడి చేయగలిగింది.

అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు, పోటీలు, మత సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు పెద్దఎత్తున సహకరించారు. దీంతో ఏప్రిల్ 3నాటికి గోవాలో కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఒక్కరు చికిత్స పొందుతున్నారు. ఈ బాధితుడు కూడా త్వరలోనే కోలుకుంటాడని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే గోవాలో ‘సున్నా’ కరోనా కేసులతో దేశంలోనే తొలిసారి వైరస్-ఫ్రీ జోన్ కానుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కరోనా నుంచి ఒక టూరిస్టు ప్రాంతం కోలుకోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గోవా బాటలోనే అన్ని రాష్ట్రాలు నడవాలని పలువురు సూచిస్తున్నారు.

గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది


కరోనా ప్రభావం తో సినీ పరిశ్రమ స్తబ్దుగా ఉన్నసమయం లో ఒక కొత్త చిత్రం కామ్ గా పూజ జరుపుకొంది. హీరో గోపీచంద్ నటించ బోయే 29వ సినిమా ఆరంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. కాగా సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందించ నున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ఆరంభం కానుంది … యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆరంభోత్సవానికి కేవలం దర్శక – నిర్మాతలు మాత్రమే హాజరయ్యారు.కాగా బీవీఎస్ ఎన్ ప్రసాద్-గోపీచంద్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గత కొంతకాలంగా గోపీచంద్ సక్సెస్ లేక బాగా వెనకబడిపోయాడు .. గడిచిన మూడేళ్లలో గౌతమ్ నంద , ఆరడుగుల బుల్లెట్, పంతం , చాణక్య ,ఆక్సీజెన్ వంటి 5 వరుస డిజాస్టర్లను చవిచూశాడు. 2015 మార్చ్ 27 న వచ్చిన ‘జిల్’ సినిమా మాత్రమే యావరేజ్ విజయాన్ని అందించింది . ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ‘సీటీమార్’ చేస్తున్నాడు. ‘సీటీమార్’ గోపీచంద్ నటించే 28వ సినిమా కాగా ‘యూ టర్న్’లాంటి హిట్ సినిమా అందించిన చిట్టూరి శ్రీనివాసరావు ఈ సినిమా యొక్క నిర్మాత. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు.