Home Blog Page 8527

కుమారస్వామికి అనూహ్యంగా యడ్డియూరప్ప దన్ను


లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి కుమారుడి వివాహాన్ని చేసిన మాజీ సీఎం కుమారస్వామిని లక్ష్యంగా చేసుకొని కర్ణాటకలోని బిజెపి నేతలు విమర్శలు చేస్తుంటే ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డియూరప్ప మాత్రం ఈ విషయంలో మాజీ సీఎంను వెనుకవేసుకు రావడం బిజెపి వర్గాలకు విస్మయం కలిగిస్తున్నది.

‘‘ఆ వివాహం గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదు. అవసరమైన అనుమతులన్నీ ఇచ్చాం. వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగింది. వారి వారి పరిమితుల్లో బాగానే చేశారు. అందుకు నేను వారిని అభినందిస్తున్నా’’ అంటూ యడియూరప్ప ఈ వివాదానికి ముగింపు పలికారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నా, ముందే నిర్ణయించిన తేదీ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి ఇంట వివాహ శుభకార్యం జరిగింది. రాంనగర జిల్లాలో ఉన్న ఆయన ఫాంహౌజ్‌లో ఈ వివాహం జరిగింది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన యడియూరప్ప… ఈ పెళ్లిపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరంచినట్లే అవుతుందని స్పష్టం చేశారు.

అయితే 24 గంటల లోపే ముఖ్యమంత్రి వైఖరిలో ఈ విధమైన మార్పు ఏమిటి ఎవ్వరికీ అర్ధం కాలేదు. బొటాబొటి మెజారిటీతో తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎప్పుడైనా అవసరమైతే జేడీఎస్ మద్దతు లభిస్తుందనే ముందు చూఫుతో యడ్డియూరప్ప అకస్మాత్తుగా తన ధోరణిని మార్చుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కక్షసాధింపు వదిలి కరోనా సంగతి చూడు జగన్


నేడు దేశం అంతా కరోనా ఉపద్రవం ఎదుర్కొంటున్న సమయంలో కక్షసాధింపు రాజకీయాలను వదిలి కరోనా కట్టడి సంగతి చూడమని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హితవు చెప్పారు.

కరోనా గురించి ఈ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని అంటూ పొరుగున ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసైనా తెలుసుకోమని సుజనా సూచించారు. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో రాగద్వేషాలు, రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కోరారు.

కరోనా నివారణకై కేంద్ర మార్గదర్శకాలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తుతూ, నడవడిని మార్చుకోమని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉండగలవాని హెచ్చరించారు. కరోనా సామాజిక వ్యాప్తి చెందింతే పరిస్థితి భయంకరంగా ఉంటుందని చెబుతూ, ఈ ప్రమాదం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇలాంటి సమయంలో వైసీపీ రాజ కీయాలు చేయడం దురదృష్టకరం అని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో పాలనలో విఫలమైతే ప్రజలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విశాఖకు మెడ్‌టెక్ జోన్‌ను తీసుకురావడం చాలా మంచి పరిణామం అని చెబుతూ ఇక్కడే కిట్లను తయారు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం కొరియా నుంచి టెస్ట్ కిట్లు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని సుజనా ఎద్దేవా చేశారు. టెస్టు కిట్ల ద్వారా వచ్చిన లాభాలేంటో చెప్పాలని నిలదీశారు.

పరిస్థితి తీవ్రతను పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరితో సంప్రదించి, సలహాలు, సూచనలు తీసుకోవడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

రక్తదానం చేసిన చిరంజీవి..


క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ధీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లున్న పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ర‌క్తం అవ‌స‌రం ప‌డేవారికి లాక్ డౌన్ పెను స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. బ్ల‌డ్ బ్యాంక్స్ లో ర‌క్త నిల్వ‌లు అడుగంట‌డంతో ఆస్ప‌త్రి వ‌ర్గాల్లోనూ తీవ్ర‌ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌జ‌లు అభిమానులు విరివిగా ర‌క్త‌దానం చేయాల‌ని అందుకు స‌మీప బ్ల‌డ్ బ్యాంక్స్ కి వెళ్లాల‌ని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఆయ‌న నేడు హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ కి ఆదివారం ఉదయం స్వయంగా వచ్చి ర‌క్త‌దానం ఇచ్చారు. చిరంజీవితో స‌హా హీరో శ్రీ‌కాంత్- రోష‌న్, శ్రీ‌మిత్ర చౌద‌రి.. వారి వార‌సులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెన‌ర్జీ, నటుడు భూపాల్, గోవింద‌రావు, విజ‌య్, సురేష్ కొండేటి త‌దిత‌రులు ర‌క్త‌దానం చేసిన వారిలో ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-“లాక్ డౌన్ వేళ ర‌క్త దాత‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ర‌క్తం ఇచ్చేవారు లేక‌ కొర‌త ఎక్కువ‌గా ఉంది. పేషెంట్స్ చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. త‌ల‌సేమియా-క్యాన్సర్ వ్యాధిగ్ర‌స్తులు.. బైపాస్ స‌ర్జ‌రీ – హార్ట్ రోగులు.. ప్ర‌మాదాల‌కు గురైన వారు.. ఎనీమియా వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ర‌క్తం లేక ఇబ్బంది ప‌డుతున్న వారిని ఆదుకునేందుకు ప్ర‌జ‌లు అభిమానులు ముందుకు రావాలి. మీకు స‌మీపంలో ఉన్న బ్ల‌డ్ బ్యాంక్స్ కి ర‌క్త‌దానం చేయండి. స్వ‌చ్ఛందంగా ర‌క్త‌దానం చేస్తే ప్రాణ‌దానం చేసిన‌వారు అవుతారు. ఈ బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. ర‌క్తం దొర‌క్క చ‌నిపోతున్నార‌నే ప‌రిస్థితి రాకుండా కాపాడండి. బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి. త‌మ్ముడు శ్రీ‌కాంత్.. మిత్రుడు శ్రీ‌మిత్ర చౌద‌రి .. వారి స్నేహితులు వ‌చ్చి ర‌క్త‌దానం ఇచ్చి స్ఫూర్తి నింపారు. దీనిని ఇన్ స్పిరేష‌న్ గా తీసుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లో నా అభిమానులు ర‌క్త‌దానం చేయాల‌ని కోరుతున్నాను. లాక్ డౌన్ ఉన్నా ర‌క్త‌దానం చేయొద్ద‌ని ఎవ‌రూ ఆప‌రు. బ‌య‌ట పోలీసుల వ‌ల్ల ఏ ఇబ్బందీ త‌లెత్త‌దు. ర‌క్త‌దానం చేస్తున్నాం అని తెల‌ప‌గానే బ్ల‌డ్ బ్యాంక్ వారి నుంచి మీ ఫోన్ వాట్సాప్ కు పాస్ వ‌స్తుంది. అది పోలీసుల‌కు చూపిస్తే స‌రిపోతుంది“ అని తెలిపారు.

విజయవాడలో కరోనా వ్యాప్తికి కారణమిదేనా?


విజయవాడ నగరంలో పాజిటివ్‌ కేసులు ఎలా పెరుగుతున్నాయో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నమోదైన కేసులను పరిశీలిస్తే కరోనా వైరస్‌ ఎలా విస్తరించిందనే విషయం తెలియడంలేదు. ఇప్పటికే 25 కు పైగా కేసులు నగరంలో నమోదయ్యాయి. వీటికి తోడు శనివారం ఒక్క రోజే మరో 16 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిలో మూడవ దశకు చేరుకున్నామా అనే సందేహం కలుగుతోంది. బయటి నుంచి వచ్చిన వారి నుంచి కాకుండా నగరంలోనే సామాజిక సంక్రమణ స్థాయికి చేరుకున్నామా అనే అంశంలో గందరగోళం నెలకొంది.

ఇటీవల మాచవరంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమె ఎలా సోకిందనే అంశంపై ఇంకాస్పష్టత రాలేదు. అధికారులు పలుమార్లు ఆరా తీస్తే కేవలం ఒకసారి జనరల్ స్టోర్‌కు వెళ్లానని, మరోసారి కూరగాయలకు తప్ప బయటకు వెళ్లలేదని ఆ మహిళ అధికారులకు సమాధానం ఇచ్చింది. దీంతో అవాక్కవడం అధికారుల వంతయ్యింది.

ఇదే మహిళ కుటుంబ సభ్యులకు తాజాగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రావడం చర్చానీయాంశమైంది. పొంతన లేని కేసులు రావడతో నగరంలో కరోనా విస్తరణ మూడో దశలో ఉందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదివారం బంద్ పాటించాలని ఆదేశించారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

రాజకీయ దుమారం రేపిన యుపి విద్యార్థుల తరలింపు


లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, అంతర్ రాష్ట్ర కదలికలపై నిషేధం అమలులో ఉన్న రోజులలో రాజస్థాన్ లోని కోట కోచింగ్ కేంద్రాలలో శిక్షణ పొందుతూ, కరోనా కారణంగా అక్కడి హాస్టల్స్ లలో చిక్కుకు పోయిన తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను రప్పించే ప్రయత్నం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేయడం రాజకీయ దుమారం రేపుతున్నది.

అక్కడ చిక్కుకు పోయిన సుమారు 7,000 మంది విద్యార్థులను రప్పించడం కోసం యోగి 300 బస్సు లను పంపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్ డౌన్ ను ఆయన పార్టీకి చెందిన ముఖ్యమంత్రియే ధిక్కరించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరకు కొందరు బిజెపి నేతలు సహితం ఈ విషయమై పెదవి విరుస్తున్నారు. తన రాష్ట్ర ప్రయోజనాలకోసం యోగి ధిక్కార ధోరణి ప్రదర్శించారని మాటలు వినబడుతున్నాయి.

మరోవంక ఈ అంశం పొరుగున ఉన్న బీహార్ లో రాజకీయ కలకలం రేపింది. వలస కారకులను గాలికి వదిలి వేసి విద్యార్థుల కోసం బస్సులను పంపడం లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధమని, అన్యాయమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు.

బీహార్ లో ప్రతిపక్ష నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ మాత్రం ఈ విషయమై నితీష్ ను తప్పుబట్టారు. యోగి తరహాలో నితీష్ కూడా బస్సులను పంపి బీహార్ విద్యార్థులను వెనుకకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

అయితే తేజస్వి మిత్రపక్షం కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో నితీష్ కు బాసటగా నిలిచింది. లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులను తరలించకుండా ఉండడమే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ జాతీయ ప్రతినిధి ప్రేంచంద్ర మిశ్రా స్పష్టం చేశారు.

మరోవంక ఈ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహితం యోగికి బాసటగా నిలిచారు. ఇతర ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి చెందిన వారిని రప్పించుకోవడం కోసం ఏదో చేస్తుంటే ఇంట్లో కూర్చొని నితీష్ కుమార్ లాక్ డౌన్ సూత్రాలను వాళ్ళన్నారని ఎద్దేవా చేశారు.

దేశంలో పలు చోట్ల చిక్కుకు పోయిన బీహార్ ప్రజలను రప్పించడం కోసం కనీసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడలేదని తప్పుపట్టారు.

ఎపిపై రూ.13 వేల కోట్ల అదనపు భారం!


ఎపిపై వచ్చే ఆదాయం రాకపోగా 13 వేల కోట్ల అదనపు భారం పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.

ఎపిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం దాదాపు రూ. 6 వేల కోట్ల నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనాని, వాస్తవంగా దీని కంటే ఎక్కువే రాబడిని ప్రభుత్వం కోల్పోయిందని అధికార వర్గాల సమాచారం. జనతా కర్ఫ్యూ మొదలైన మార్చి 22 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే 3వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ నెల 20 నుంచి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

దీనికి తోడు కరోనా వ్యాప్తి నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన పేదలకు సాయం చేయడానికి కాని, కరోనా నేపద్యంలో పేదలకు వెయ్యి రూపాయల పంపిణీ రూ. 1,300 కోట్లను 1.30 కోట్లమందికి అందజేశారు. అదనపు రేషన్ పంపిణీకి మరికొన్ని నిధులను వెచ్చించిండం కూడా అదనపు భారంగా మారాయి. కరోనా వైరస్ భరినపడిన వారికి వైద్యం, కరోనా లక్షణాలు గల వారిని క్వారంటైన్ లో ఉంచి సేవలు, ఆహారం అదిస్తున్నందుకు,
కరోనా నియంత్రణకు అయిన వ్యయం రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు ఇంకా పెరుగుతూ ఉంటుందని, ఎక్కడ ఆగుతుందనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ ఖర్చులన్నీ కలిపి ఇప్పటి వరకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఊహించని భారం ప్రభుత్వంపై పడిందనేది వాస్తవం.

మరోవైపు కేంద్రం కొన్ని పధకాల కింద నిధులను విడుదల చేయడం రాష్ట్రానికి కొంత ఊరట. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోయినా కరోనా నేపధ్యంలో స్థానిక సంస్థల అభివృద్ధి నిధులు మార్చి 21న రూ.1,301 కోట్లు, ఏప్రిల్ మొదటి వారంలో రెవెన్యూ లోటు సర్దుబాటుకు రూ.491.41 కోట్లు, జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.559.50 కోట్లను కేంద్ర అందజేసింది.

రేపటి నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు!


లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన పలు రకాల సేవలు తిరిగి ప్రారంభించడానికి అవకాశం వచ్చింది. మే 3 వరకు కొనసాగనున్న రెండవ విడత లాక్‌డౌన్‌ కు మినహాయింపులలో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై
ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు పాటించాల్సిన విధానాలపై సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం కేంద్ర హోంశాఖ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నిబంధనలను అనుసరించి మినహాయింపులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పరిశ్రమల శాఖ అధికారులు, రవాణా, కార్మిక శాఖ అధికారులకు ప్రభుత్వం పంపించింది.
రెడ్‌జోన్లు, కంటైన్మెంట్‌ జోన్లలో ఈ ఉత్తర్వులు వర్తివంచవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 97 మండలాలను రెడ్ జోన్ లుగా గుర్తించారు. వీటిలో అత్యధిక మండలాలు గల జిల్లాలో వరుసగా కర్నూలు లో 17 మండలాలు, నెల్లూరు లో 14 మండలాలు, గుంటూరు లో 12 మండలాలు ఉన్నాయి.

మినహాయింపులు వర్తించేది వీటికే:

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు, రైస్‌, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు. ఆర్వో ప్లాంట్లు, ఆహారోత్పత్తి పరిశ్రమలు, ఔషధ తయారీ సంస్థలు, సబ్బుల తయారీ కంపెనీలు, మాస్కులు, బాడీ సూట్లు తయారీ సంస్థలు, శీతల గిడ్డంగులు, ఆగ్రో పరిశ్రమలు, బేకరీ, చాక్లెట్ల తయారీ సంస్థలు, ఐస్‌ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్‌ కంపెనీలు మినహాయింపు వర్తిస్తోందన్నారు. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలు కొనసాగింపునకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే 20వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఈ-కామర్స్ సంస్థలు ప్రకటించాయి.

ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు అధిక ధర!


కరోనా వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించేందుకు కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ లకు ప్రభుత్వం అధిక ధర చెల్లించింది. దక్షిణ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ టెస్ట్ కిట్ లను కొనుగోలు చేసింది. ఈ నెల 17వ తేదీన లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు రాష్ట్రానికి దక్షిణ కొరియా సంస్థ పంపించింది. ఆ దేశం నుంచే ఛత్తీస్ గఢ్ కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లను కొనుగోలు చేసింది. ఛత్తీస్ గఢ్ ఒక్కో కిట్ ను రూ.377.44 లకు కొనుగోలు చేయడం విశేషం. ఈ మొత్తంలో రూ.337 ధర, 12 శాతం జిఎస్టీ మరో రూ. 40.44 అవుతుంది. ర్యాపిడ్ కిట్ల ధరను ఛత్తీస్ గఢ్ మంత్రి టి.ఎస్ సింగ్ ట్విట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్ లను ఒక్కొక్కటి జిఎస్టీ తో కలిపి రూ.640లకు కొనుగోలు చేసింది. ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో 10 లక్షల కిట్ లను కొనుగోలు చేస్తోంది. 75 వేల కిట్ లను మాత్రమే తీసుకుంటున్న ఛత్తీస్ గఢ్ కు ఒక్కో కిట్ రూ. 377.44 లకు అందజేస్తే, 10 లక్షల కిట్లను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరింత తక్కువకు ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు రెట్టింపు ధరకు టెస్ట్ కిట్ లను కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. కమీషన్ కోసమే ఈ చర్యలకు పాల్పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో 9 లక్షల కిట్ లు రాష్ట్రానికి రావాల్సి ఉంది.

ర్యాపిడ్ కిట్ల కొనుగోలలో ప్రభుత్వ పెద్దలు కమీషన్ కొట్టేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక్కొకిట్ రూ. 1,200 కొనుగోలు చేసి లక్ష కిట్ లకు రూ. 8 కోట్లు కొట్టేసారని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్లను ఇంతకు కొనుగోలు చేసిందనే వివరాలు వెల్లడించి పారదర్శకత నిరూపించుకోవాలని ట్వీట్ చేశారు.

ఇతర రాష్ట్రాలకు తక్కువ ధరకే ఇస్తే మేము ధర తగ్గిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
రెడ్డి మీడియాకు తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కిట్ కు రూ. 640 మాత్రమే చెల్లిస్తుందని చెప్పారు. మరిన్ని కిట్ లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నందున ధరలపై మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

సినీ పరిశ్రమకి ఓదార్పు కావాలి


మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తి వేసినా గాని, ఎత్తి వేయకున్నా గాని తమ ప్రొడక్షన్ , షూటింగ్ వంటి పనులు కొన‌సాగించ‌డానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. తెలుగు సినీ పెద్దలు … ఆ క్రమం లో మిన‌హాయింపులు ఇచ్చే రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ‌ను కూడా చేర్చాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరునున్నార‌ట‌.

కోవిడ్ 19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక నెల ముందరే థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి, షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేట‌ర్లు ఓపెన్ చేస్తే క‌రోనా వ్యాప్ మరింత పెరిగే ప్ర‌మాదం ఉంది కాబ‌ట్టి ప్ర‌భుత్వం జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు థియేట‌ర్లకు అనుమ‌తివ్వ‌దు అని తెలుస్తోంది .. ఒకవేళ జూలై లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న మొద‌లైనా..ప్రేక్షకులు వస్తారా . అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలి పోతోంది . అందుకే కొత్త సినిమాల విడుదల విష‌యంలో నిర్మాతలు ఏమాత్రం ఆశ‌లు పెట్టుకోవడం లేదు. అందుకే క‌నీసం షూటింగులైనా చేసుకోనిస్తే సినీ వర్గాలకు, మరీ ముఖ్యంగా కార్మికులకు ఉపాధి దొరుకుతుందని అనుకుంటున్నారు.

ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్ర‌తినిధుల బృందం.. తెలంగాణ ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విషయం లో తక్షణం స్పందించక పొతే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌లి చావులు త‌ప్ప‌వ‌ని.. తెలుగు సినీ రంగం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంద‌ని సినీ పెద్దలు భావిస్తున్నారు . ప్ర‌భుత్వం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేప‌థ్యంలో మే 3 త‌ర్వాత లాక్ డౌన్ ద‌శ‌ల వారీగా ఎత్తివేయ‌క తప్పేలా లేదు. అదే సమయంలో మిగ‌తా రంగాలతో పాటు సినిమా రంగం వాళ్ల‌కు కూడా లాక్ డౌన్ మిన‌హాయింపు ఇవ్వ‌డం ఖాయమంటున్నారు. ఆ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం తో పాటు, మాస్కులు, గ్లౌజులు వేసుకొని, వీలైనంత త‌క్కువ సిబ్బందితో షూటింగులు చేసుకోవ‌డానికి పర్మిషన్ రావొచ్చని సినీ పెద్దలు భావిస్తున్నారు .

నిత్య ప్రేమికుడు మళ్ళీ మొదలెట్టాడు


ప్రేమ సాగరం ఫేమ్ టి. రాజేందర్ కొడుకు గా మన్మథ చిత్రంతో తెలుగు వారికి బాగా పరిచయమైన శింబు నిజ జీవితంలో కూడా మన్మధుడే. ఈ నిత్య ప్రేమికుడు ఇప్పటికే అనేక మంది సెలెబ్రిటీలతో ప్రేమాయణం నడిపాడు. మొదటగా తమిళ సూపర్ స్టార్ కూతురు తో ప్రేమ మొదలెట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ హీరో….ఆ తరవాత కాలం లో హీరోయిన్స్ నయనతార, హన్సికలతో ఈయన ప్రేమ వ్యవహారం బాగా పాపులర్ అయ్యింది. చాలా కాలం నయనతార తో ఘాడమైన ప్రేమ కొనసాగించిన ఈ హీరో పెళ్ళి వరకు వెళ్లి వెనక్కి తగ్గాడు. నయనతార తో బ్రేక్ అప్ అయిన తరువాత గ్యాప్ ఇచ్చి హన్సిక తో ప్రేమ కొనసాగించాడు ..ఇక్కడ కూడా వీరి ప్రేమ బంధం కూడా చర్విత చరణం అయ్యింది.

ఇక హన్సిక తో బ్రేక్ అప్ అయిన తరువాత చాలా కాలం దూరం గా ఉన్న ఈ ప్రేమ పక్షులు మళ్ళీ ఈ మధ్య కలిసి సినిమాలలో నటిస్తున్నారు. ఇదే విషయమై హన్సికను కొందరు అడిగితే అవును మేము ప్రేమించుకొని విడిపోయిన మాట వాస్తవమే…ఐతే ప్రస్తుతం మేమిద్దరం మంచి స్నేహితులం అని చెప్పి వారి అనుమానం తీర్చింది.

చైనా పెట్టుబడులపై కన్నేసిన భారత్

చైనా విషయం లో అనుకున్నంతా జరుగుతుంది. కరోనా వైరస్ ఏమోగాని చైనా ని  ప్రపంచం మొత్తం  అనుమానంగా చూస్తుంది. ఈ రోజు భారత్ కూడా ఆ కోవలో చేరింది. కరోనా వైరస్ మహమ్మారి తో ప్రపంచం మొత్తం ఒకవైపు వణికిపోతుంటే రెండోవైపు దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ కంపెనీలని చైనా ఎక్కడ కొనేస్తుందోనని ఆదుర్దా ఎక్కువయ్యింది. యూరప్ లో కరోనా మహమ్మారి విశృంఖలత తో ప్రభుత్వాలు క్షణం తీరిక లేకుండా వుండి కూడా విదేశీ పెట్టుబడుల విషయం లో నిబంధనలు మార్పు చేసుకున్నారు. ఎందుకంటే చైనా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని షేర్లు డీలాపడిన తరుణం లో వాటిలో పెట్టుబడులు పెట్టి మెజారిటీ వాటా చేజిక్కించుకోవచ్చునని అంచనా వేశాయి. ఆ మేరకు వాళ్లకు ఉప్పందటం తో అత్యవసరంగా వాళ్ళ చట్టాలను మార్చుకున్నారు. ముఖ్యంగా యూరప్ , ఆస్ట్రేలియా దేశాలు ఇందులో వున్నాయి. ఇప్పటికే దీనితో సంబంధం లేకుండా  ఇటలీ లో చాలా కంపెనీలను చైనా సంస్థలు కోనేశాయి. ఆ చరిత్ర తెలుసుకాబట్టే జర్మనీ, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు మేలుకున్నాయి.

భారత్ లో కూడా ఇటీవలి కాలం లో చైనా పెట్టుబడులు గణనీయం గా పెరిగాయి. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత పడిపోయిన స్టాక్ మార్కెట్ నేపధ్యం లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు లో దాదాపు ౩ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1 శాతం వాటాని చేజిక్కించుకుంది .దీనితో సెబి మేల్కొంది. అసలు భారత్ లో చైనా ఏయే రంగాల్లో పెట్టుబడి పెట్టిందో ఆరా తీస్తుంది. ఇప్పటికే పేటిఎం లాంటి సంస్థ లో 40 శాతం వాటాని చేజిక్కించుకుంది. గత రెండు సంవత్సరాల్లోనే విపరీతమైన పెట్టుబడులు పెట్టింది. రెండో వైపు  వాణిజ్య లోటు తగ్గటం లేదు. భారత్ ఇప్పుడు రక్షణ రంగం కూడా విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. టెలికాం రంగం లో ఇప్పటికే చైనా ప్రవేశించింది. హువే 5 జి సేవలు వాడుకోవాలా వద్దా అనేది పెద్ద చర్చ నీయాంశమయ్యింది. అతిసున్నితమయిన రంగాల్లో విదేశీ పెట్టుబడులను సునిశిత పరిశీలన చేయాల్సి వుంది. అదేసమయం లో విదేశీ పెట్టుబడులు, సాంకేతికత బదిలీ అవసరం ఎంతయినా వుంది.

మరి ఈ నేపధ్యం లో భారత్ నిర్ణయాన్ని చూడాల్సి వుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి విదేశీ పెట్టుబడులు దానంతట అవే ( ఆటోమేటిక్ దారిలో) రావటాన్ని నిషేదించారు. ఇప్పుడు దీన్ని అన్ని భూ సరిహద్దు దేశాలకు విస్తరించారు. ఇది చైనాని దృష్టి లో పెట్టుకొనే మార్చటం జరిగింది. అదేసమయం లో వీటిని నిషేదించలేదు. సరిహద్దు దేశాలనుంచి ప్రభుత్వ అనుమతి ద్వారానే రావాలి. అంటే ఏ రంగాల్లో పెట్టుబడులను అనుమతించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే చైనా పై ఓ కన్ను వేసివుంచుతుందన్న మాట. కొంతమందికి సందేహం రావచ్చు. కేవలం ఈ దేశాలనుంచే ఎందుకు అనుమతించటం లేదని .

చైనా పెట్టుబడులపై ఎందుకు వ్యతిరేకత?

పాకిస్తాన్ విషయం లో ఎవరికీ సందేహం లేదు. బంగ్లాదేశ్ విషయం లో ఇప్పటికే అక్కడ చైనా సంస్థలు బాగా వేళ్ళూనుకున్నాయి. అవి ఆ వైపు నుంచి వస్తాయేమోనని సందేహం వుండివుండొచ్చు. ఇక చైనా విషయం లో  ఇన్నాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది.   వాస్తవానికి అన్నిదేశాల కన్నా ముందే భారత్ గట్టి వైఖరి తీసుకోవాల్సింది. కాకపోతే ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న మనం ఆచి తూచి అడుగేయాల్సి వుంది. అందుకే ఈ ఆలస్యం. ఇప్పుడు తప్పని పరిస్థితి. చైనా వైఖరి వలన ఎక్కువ నష్టపోయిన దేశ మేదన్నా వుందంటే అది భారత్ .

మొదట్నుంచీ భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంటూనే వుంది. అన్ని ప్రపంచవేదికల పై భారత్ ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ని సమర్ధిస్తూ వచ్చింది. 1962 యుద్ధాని కి ముందే గుట్టుచప్పుడు కాకుండా ఆక్సాయ్ చిన్ ని ఆక్రమించుకుంది. యుద్ధం తర్వాత 1963 లో పాకిస్తాన్ ఆక్రమణ లో వున్న మన  భూభాగాన్ని పాకిస్తాన్ నుంచి తీసుకుంది. అలాగే మన భూభాగం లో చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా పేరుతో రహదారి నిర్మించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ సంస్థ లపై ఎండకడుతుంటే పాకిస్తాన్ ని వెనకేసుకొస్తూ భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. భారత్ చుట్టూ సైనిక స్థావరాలు నిర్మిస్తుంది. చైనా రాబోయే కాలం లో భారత రక్షణ కు అత్యంత ముప్పుగా మారింది. ప్రశాంతంగా వున్న హిందూ మహాసముద్రంలో తన కదలికలను ముమ్మరం చేసింది. ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం భారత్ కి రాకుండా మొకాలడ్డుతుంది. అయినా భారత్ చైనా తో సత్సంబంధాల కోసమే కృషిచేస్తుంది. అదీగాక ప్రపంచం లో రెండో శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థ కాబట్టి జాగ్రత్తగా లౌక్యంతో వ్యవహరిస్తుంది. కానీ ఇప్పుడు భారత్ లోని కంపనీలపై కన్నేయటంతో భారత్ ఈ చర్యకు పూనుకోవాల్సి వచ్చింది. అదే సమయం లో విదేశీ పెట్టుబడులను భారత్ ఆహ్వానిస్తూనే వుంది. అవి లేకుండా ఏ దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి సాధించలేదు. ఇప్పుడు తీసుకున్న చర్యతో చైనా భారత్ కు  నమ్మదగ్గ దేశం కాదని అర్ధమయ్యింది. ఈ విషయం లోలోపల వున్నా మొట్టమొదటసారి  తప్పని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా బయట ప్రపంచానికి, ముఖ్యంగా చైనా కి అర్ధమయ్యేటట్లు చెప్పింది. ముందు ముందు భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుంది. అది ఎలావుండబోతుందో ఈ ప్రభుత్వ చర్య సూచనప్రాయంగా  చెప్పినట్లయ్యింది.

 

మత్స్యకారుల ఘోష వినండి!:పవన్

దేశంలో కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడంతో గుజరాత్‌ లో నాలుగు వేల మంది మత్స్యకారులు చిక్కుకుపోయారు. వారిని ఏపీకి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. లాక్‌ డౌన్ కారణంగా గుజరాత్‌ లో నాలుగు వేల మంది మత్స్యకారులు చిక్కుకుపోయారని అన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని వారందరినీ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని పవన్ కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులు, అధికారులను అయినా గుజరాత్‌ కు పంపించి.. అక్కడ చిక్కుకున్న మత్స్యకారులకు భరోసా ఇవ్వాలన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా వారందరినీ రాష్ట్రానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.

లాక్ డౌన్ లో ఉద్యోగుల్ని తొలగించొద్దంటున్న కేటీఆర్


రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్, ఐటీశాఖ శాఖ మంత్రి కేటీఆర్ భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. లాక్డౌన్ అనంతరం పరిస్థితులు మళ్లీ మూములు స్థితికి చేరుకుంటాయన్నారు. ఈలోపు ఐటీ ఉద్యోగులకు తొలగించే చర్యలు చేపట్టొద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వారికి ఆయన లేఖ కూడా రాశారు.

కరోనా ప్రభావంతో ప్రస్తుతం అన్నిరంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. త్వరలోనే ఐటీ రంగం మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలే తప్ప ఉద్యోగులు, సిబ్బందిని తగ్గించే ప్రయత్నం చేయద్దని సూచించారు. ఉద్యోగులపై కంపెనీలు ఉదారతతో వ్యవహరించాలని కోరారు. రెగ్యూలర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులెవరినీ తీసేయొద్దని కేటీఆర్ సూచించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక వ్యవస్థ పురోగమనంపై ప్రతినిధులతో చర్చలు జరిపారు.

మరోవైపు రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్ ఖుమార్, డీజీపీ మహేందర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 20న లాక్డౌన్ సడలింపు నేపథ్యం, ఆదివారం నిర్వహించే క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలపై సమీక్ష జరిపారు.

తల్లి నీ ప్రేమకు వందనం.. భావోద్వేగానికి గురైన పోలీస్ బాస్


దేశంలో కరోనా వైరస్ ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. తొలివిడత లాక్డౌన్ ఈనెల 14తో ముగియగానే రెండో విడుత లాక్డౌన్ మే 3వరకు పొడగిస్తున్న ప్రధాని ప్రకటించిన సంగతి తెల్సిందే. కరోనా నివారణలో పోలీసులు, వైద్య సిబ్బంది కృషి మరువలేనిది. కరోనా ఎఫెక్ట్ తో పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. మండుటెండలను కూడా లెక్కచేయకుండా పోలీసులు రోడ్లపైనే బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. కాగా విధుల్లో ఉన్న పోలీసులకు చూసిన ఓ పేద మహిళ వారికి చల్లటి కూల్ డ్రింక్స్ అందించే ప్రయత్నం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన ఏపీ పోలీస్ బాస్ భావోద్వేగానికి గురై ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

ఈమేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆమెతో వీడియో కాన్ఫరెన్లో మాట్లాడారు. మీ అమ్మతనానికి ముగ్ధుడిని అయ్యానని చెప్పారు. మీతోనే తానే స్వయంగా మాట్లాడాలకున్నానని చెప్పారు. మీరు చేసిన తనను కదలించిందని చెబుతూ ఆ మహిళకు డీజీపీ సెల్యూట్ చేశారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సహచర పోలీసులు చప్పట్లు కొట్టు హర్షం వెలిబుచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఆమె పేరు లోకమణి. ఆమె తూర్పు గోదావరి జిల్లాలోని తునిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పని చేస్తుంది. రోడ్లపై విధులను చేస్తున్న పోలీసులకు ఆమె కూల్ డ్రింక్ అందించేందుకు ముందుకొచ్చింది. అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న ఆ మహిళ తమకు కూల్ డింక్స్ తెచ్చివ్వడంపై పోలీసులు చలించిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డీజీపీ ఆమెతో వీడీయో కాన్ఫరెన్స్ తో ప్రత్యేకంగా మాట్లాడి ప్రశంసించారు. మీలాంటి వారి రక్షణ కోసమే పోలీసులు రేయింబవళ్లు పని చేస్తున్నారని తెలిపారు. డీజీపీ ఆమె సెల్యూట్ చేయగా.. లోకమణి చేతులు జోడించి నమస్కరించారు. ఆమె స్వచ్ఛమైన నవ్వు చూసి డీజీపీ కూడా ఫిదా అయ్యారు. ఇదే వీడీయోను టీడీపీ నేత నారా లోకేష్ ట్వీటర్లో పోస్టు చేసి ఆమె చేసిన సాయంపై ప్రశంసలు కురిపించారు. ఆమె సాయాన్ని వెలకట్టలేమని ప్రశంసించారు.

https://www.youtube.com/watch?v=pFu1XC-deyY

విచిత్రం.. విరాళం ఇచ్చి విడుదలయ్యాడు!

దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో పీఎం-కేర్స్‌ కు రూ.35వేల విరాళం ఇచ్చిన మాజీ ఎంపీని బెయిల్ పై విడుదల చేసిన ఘటన ఝార్ఖండ్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..ఝార్ఖండ్ లోని రాజమహల్ నియోజక వర్గంలో భాజపా మాజీ ఎంపీ సోమ్‌ మరండీ 2012లో నిర్వహించిన రైల్‌ రోకో కేసులో దోషిగా తేలారు. దీనిపై విచారణ చేపట్టిన సహిబ్‌ వ్గంజ్‌ రైల్వే జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌.. ఆయనతో పాటు మరో ఐదుగురికి ఒక సంవవత్సరం పాటు సాధారణ జైలు జీవితం గడపాలని శిక్ష ఖరారు చేశారు. ఒకవేళ బెయిల్‌ కావాలంటే పీఎం-కేర్స్‌ కు రూ.35,000 విరాళం సహా, ఆరోగ్య-సేతు యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుంటేనే బెయిల్‌ ఇస్తామని, వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. దీన్ని అంగీకరించి ఇటు బెయిల్‌ పొందడంతో పాటు.. కరోనాపై పోరులో భాగం కావాలన్న ప్రధాని మోదీ పిలుపును సైతం అందిపుచ్చుకున్నారు. న్యాయమూర్తి షరతులను అంగీకరిస్తూ.. జైలు జీవితం నుంచి విముక్తితో పాటు కొవిడ్‌-19పై పోరులో భాగమయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు.

సూపర్ స్టార్ సరసన సాహో బ్యూటీ!


సాహో మూవీలో ప్రభాస్ కు జోడీగా నటించిన శ్రద్ధకపూర్ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకుడు పర్శురాం కాంబినేషన్లో తెరకెక్కే మూవీలో ఈ బ్యూటీని ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. సాహోలో ప్రభాస్ కు జోడీగా నటించి మెప్పించిన ఈ బాలీవుడ్ బ్యూటీగా తాజాగా మహేష్ తో రోమాన్స్ చేసేందుకు రెడీ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది.

పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి!

మహేష్ బాబు ఇటీవలే ‘సరిలేరునీకెవ్వరు’ మూవీతో ఇండస్ట్రీ హిట్టందుకున్నాడు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. ఈ మూవీ సక్సస్ ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు ఫ్యామిలీతో కొన్ని రోజులు విదేశాలకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో మూవీ వస్తుందకున్నప్పటికీ స్ర్కీప్ట్ కుదరలేదు. ఈ మధ్యలో దర్శకుడు పర్శురాం మహేష్ ఓ కథ విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ మూవీని ప్రారంభించేందుకు దర్శకుడు పర్శురాం ఇప్పటికే సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ తీసుకునేందుకు దర్శకుడు పర్శురాం మొగ్గు చూపుతున్నారు. ఈమేరకు పలువురు బాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చాయి. కియారా అడ్వాణీ పేరు తెరపైకి వచ్చినా మహేష్ పక్కన కొత్త భామ అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. దీంతో సాహోలో ప్రభాస్ పక్కన నటించిన శ్రద్ధ కపూర్ ను తీసుకునేందుకు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మహేష్ తో రోమాన్స్ చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా శ్రద్ధాకపూర్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

మహేష్ బాబు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు


ఈ ఏడాది సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు కి చాలా బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి బరిలో నిలబడి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఆ జోష్ లో 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరిగాయి . కానీ కరోనా అడ్డుపడి షూటింగ్ లేట్ అవుతోంది. ముందు 27వ సినిమా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మ‌హేశ్‌ బాబు కి పూర్తి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. దరిమిలా వంశీ పైడిప‌ల్లి స్థానంలో గీత గోవిందం ఫేమ్ ప‌రుశురామ్ చేరాడు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబ‌ట్టి డైరెక్టర్ ప‌రుశురామ్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో పడ్డాడు.

అన్నీ కుదిరితే సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు అయిన మే 31న పరుశు రామ్ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. కాగా చాలాకాలం తరవాత మహేష్ బాబు ఈ మూవీ రూపం లో పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రం లో సైఫ్ అలీ ఖాన్ కూతురు ,” కేదార్ నాధ్”, ” సింబా” ఫేమ్ సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించ నుంది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే మ‌హేశ్ బాబు న‌టించిన గ‌త మూడు చిత్రాల‌కు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ని ప‌క్క‌న పెట్టి ప‌రుశురామ్ త‌న‌కు న‌చ్చిన, అచ్చి వచ్చిన గీత గోవిందం ఫేమ్ గోపీ సుంద‌ర్‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంచుకున్నాడ‌ని తెలుస్తోంది ఇక ఈ చిత్రం తరవాత మహేష్ బాబు రాజమౌళి తో చిత్రం చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాడట…కాగా ఈ చిత్రాన్ని హలో బ్రదర్ , .క్షణ క్షణం ఫేమ్ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఫై కె ఎల్ నారాయణ నిర్మించ నున్నాడు .