Home Blog Page 8529

కరోనా రెడ్ జోన్లోకి సీఎం నివాసం.. అధికారుల్లో టెన్షన్!


ఏపీ ముఖ్యమంత్రి నివాసం తాజాగా కరోనా రెడ్ జోన్లోకి వెళ్లింది. గురువారం వరకు సీఎం నివాసం బఫర్ జోన్లో ఉండగా రెండ్రోజుల్లోనే రెడ్ జోన్ గా మారిపోయింది. సీఎం నివాసానికి కొద్దిరూరంలో మహిళ కరోనాతో మృతిచెందింది. దీంతో ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా గుర్తించారు. సీఎం నివాసానికి కొద్దిరూరంలో కరోనాతో మృతిచెందడంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఓ మహిళ అనారోగ్యంతో మృతిచెందింది. అనుమానం వచ్చిన వైద్యులు శవానికి టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. చనిపోయిన మహిళ తాడేపల్లి పాత గేట్ వద్ద అపార్ట్ మెంట్లో ఉండేది. ఈ ప్రాంతం సీఎం నివాసానికి కొద్దిదూరంలోనే ఉంది. దీంతో ఆ ప్రాంతాన్నిఅధికారులు మార్కింగ్ చేసి రెడ్ జోన్ గా గుర్తించారు.

అలాగే రెండ్రోజుల క్రితం డోలాస్ నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. మంగళగిరి కమర్షియల్‌ టాక్సెస్‌ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న సదరు ఉద్యోగి తాడేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్నాడు. దీంతో అపార్టుమెంట్లోని వారిని బయటకు రాకుండా నిబంధనలు అమలు చేస్తున్నారు. అపార్టుమెంట్ వారితోపాటు చుట్టుపక్కల వారి వివరాలు సేకరించి పలువురిని అధికారులు క్వారెంటైన్‌‌కు తరలించారు. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించి అటుగా ఎవరూ వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కాగా గుంటూరులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సీఎం నివాసమే రెడ్ జోన్లోకి వెళ్లడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

కేంద్ర జోక్యం కోరుతున్న టిడిపి

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టడం కోసం టిడిపి నేతలు వ్యూహం మారుస్తున్నారు. నేరుగా విమర్శలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ ప్రస్తావనను తరచూ తీసుకు రావడం ద్వారా జగన్ ను ఇరకాటంలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో ప్రధాని మోదీ తో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడడంతో జగన్ ఖంగు తిన్నట్లు ప్రచారం జరగడం తెలిసిందే.

ప్రధానితో చంద్రబాబు రాజకీయ అంశాలను ప్రస్తావించే అవకాశం లేకపోయినా కేంద్ర పేరు చెబితేనే జగన్ ప్రభుత్వం ఒక విధంగా అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా కరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో కేంద్రం జోక్యం చేసుకోవాలని సీనియర్ టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఏపీ ప్రభుత్వ బరితెగింపు విధానాలకు కళ్లెం వేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికి కేంద్రం పలు రూపాలలో జగన్ ను ఇబ్బందులలోకి నెట్టివేస్తున్నది. వాటికి టిడిపి నేతలు తరచూ కేంద్రం ప్రస్తావన తెస్తూ మరింతగా ఇరకాటం సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నది.

రాష్ట్రంలో కరోనా తీవ్రత పెద్దగా లేదని చూపుతూ, కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే 20కు పైగా పాజిటివ్ కేసులు ఉండడంతో రెడ్ జోన్ లోకి వస్తాయని వాదించింది. అయితే ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, వాటిల్లో 11 జిలాలలను రెడ్ జోన్ లో ఉంచుతూ కేంద్రం ప్రకటించింది.

దానితో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం, రాజధానిని విశాఖకు మార్చడం కోసం జగన్ ఏర్పర్చుకున్న రాజకీయ ఎజెండాకు గండి పడినట్లు అయింది. కేంద్రం జోక్యం చేసుకుని సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇదే సరైన సమయం అని పేర్కొనడం ద్వారా జగన్ ప్రభుత్వంలో, ముఖ్యంగా అధికారులలో ఒక విధమైన భయం కలిగించేందుకు యనమల అస్త్రం సంధించినట్లు కనబడుతున్నది.

వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతం అవుతోందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని యనమల ధ్వజమెత్తారు. వైరస్ నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని యనమల ఆరోపించారు.

అయితే రాష్ట్రంలో కరోనా కట్టడికి జగన్ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రులు పలువురు ప్రశంసిస్తున్నట్లు పలువురు వైసిపి నేతలు ప్రకటనలు చేశారు. కానీ ఆ విధంగా ప్రశంసించిన కేంద్ర మంత్రుల పేర్లను మాత్రం చెప్పడం లేదు.

అర్ధాంతరంగా ఎన్నికల కమీషనర్ ను తొలగించడం, కేంద్ర ప్రమేయం లేకుండా, కోర్ట్ ల ఆదేశాలతో సంబంధం లేకుండా దొడ్డిదోవన రాజధానిని మార్చే ప్రయత్నాలు చేయడం వంటి అంశాలపై టిడిపి నేతలు కేంద్ర ప్రభుత్వంకు పలు ఫిర్యాదులు, నివేదికలు పంపుతున్నట్లు తెలుస్తున్నది.

కరోనా పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోతలు విధించిన జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుల జీతాల్లో మాత్రం కోతలు పెట్టకపోవడాన్ని ఈ సందర్భంగా యనమల ప్రశ్నించారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సుమారు 25 మంది సలహాదారులను నియమించుకున్నారు. వారిలో పలువురు జగన్ కుటుంభంకు చెందిన సాక్షి ప్రచురణలో కీలక పదవులలో ఉన్నవారు కావడం గమనార్హం.

10రోజుల్లోనే కరోనా కేసులు సంఖ్య రెట్టింపు!


భారత్ లో ఈ నెల(ఏప్రిల్) 9వ తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 7వేలు దాటగా ఇప్పుడు ఆ కేసుల సంఖ్య 14వేలు దాటింది. అంటే గత 10 రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. గత 24 గంటల్లో 991 కేసులు నమోదు కావడంతో కోవిడ్-19 కేసుల సంఖ్య 14వేలు దాటింది.

భారతదేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 14,378 అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందులో 11,906 యాక్టివ్ కేసులు కాగా, 1992 మంది కోలుకున్నారు. 480 మంది చనిపోయారు.గత 24 గంటల్లో 991 కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 22,40,191 మంది కరోనావైరస్ బారినపడ్డారు. 1,53,822 మంది ప్రాణాలు విడిచారు. 5,68,343 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు.
అమెరికాలో కేసుల సంఖ్య 7 లక్షలకు సమీపంలో ఉంది. ఇప్పటివరకు 36,773 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వుహాన్ ‌లో ఒక్కసారిగా మరణాల సంఖ్యలో 50శాతం పెరుగుదల నమోదైంది. దేశం మొత్తంగా 4,636 మంది చనిపోయారు. భారత్ ‌లో 14378 కేసులు నమోదయ్యాయి. 480 మంది మరణించారు.
కోవిడ్-19 కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌ లో 603, తెలంగాణలో 766కు చేరుకుంది.

భర్తను ఏడిపించిన స్టార్ హీరోయిన్


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ తో ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. కరోనా దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 15నుంచి రెండో విడుత లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లులు, క్రీడలు వాయిదా పడ్డాయి. దీంతో ఇండియన్ క్రికెటర్ కోహ్లీ, స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు సరదాగా గడిపేందుకు సమయం దొరికింది. వీరిద్దరు క్వారంట్లోనూ ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అనుష్క తన భర్త కోహ్లీని ఆటపట్టించే వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

‘ఏయ్ కోలీ.. చౌకామార్.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ అనుష్క క్లోహ్లీని ఆటపట్టింది. ఆమె చేసిన పనికి కోహ్లీ బిత్తర చూపులు చూస్తూ గమ్మున ఉండిపోయాడు. ఈ వీడియోను అనుష్కనే స్వయంగా తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఫన్నీగా ఉండటంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. కోహ్లీ క్రికెట్ గ్రౌండ్లో లక్షలాది మంది ఫ్యాన్స్ కు దూరమయ్యాడని పేర్కొంది. అభిమానులు ప్రత్యేకంగా అరిచే అరుపులు మిస్ అవుతుండటంతో ఆయనకు ఆ అనుభవాన్ని తాను గుర్తు చేసినట్లు ట్వీట్ చేసింది అనుష్క. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/B_EwaTjJL-G/

కర్నూలు వైద్యుడి కుటుంబంలో ఆరుగురికి కరోనా!


కర్నూలులో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. పట్టణంలో 13 కేసులు నమోదు కాగా, వీటిలో ఆరు కేసులు ఇటీవల కరోనాతో మరణించిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి కుటుంబ సభ్యులవే కావడం గమనార్హం. అదేవిధంగా కర్నూలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలికి వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు.

వ్యాధుని కుటుంబ సభ్యులతో పాటు ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వారందరినీ గుర్తించే చర్యలు అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. సుమారు 1,500 మంది వరకూ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఇతని వద్ద వైద్యం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రి ఓ.పి రికార్డులను పరిశీలించి వైద్యం చేయించుకున్న వారి వివరాలను అధికారులు సేకరించారు. మరోవైపు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన వైద్యుడు వద్ద చికిత్స చేయించుకున్న వారు తమ వివరాలను సమీపంలోని అధికారులకు తెలియజేయాలని కోరుతూ బహిరంగ ప్రకటన జారీ చేశారు.

రాష్ట్రం మొత్తం కేసుల్లో 44 శాతం వరకు గుంటూరు, కర్నూలు జిల్లాలలోనే నమోదు కావడం గమనార్హం. ఇక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నా రెండు జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఫస్ట్ బ్లడ్ ఫేమ్ మూవీ స్టార్ బ్రేన్ డెన్నీ మృతి


హాలీవుడ్ లో వరుస మరణాలు సంభవిస్తున్నాయి సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. రీసెంట్ గా ఆండ్రూ జాక్ . హిల్లరీ హీత్ , అల్లెన్ ద్రావియా ,రిక్ మేరీ , టెరెన్స్ ఎంసీనాలీ వంటి పది మంది సీనియర్ నటులు ఒకరి తరవాత ఒకరు కరోనా ప్రభావం తో మరణించారు. విశేషం ఏమిటంటే వీరందరి వయసు 70 ఏళ్ళ పైమాటే ….ఇపుడు తాజాగా మరో సీనియర్ నటుడు కరోనా తో కన్నుమూశాడు .సుమారు 40 ఏళ్ళ నుంచి చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు హీరో బ్రేన్ డెన్నీ బుధవారం తన స్వగృహంలో కన్నుమూశారు. బ్రేన్ డెన్నీ 1938లో అమెరికాలోని కనెక్టికట్ లోని బ్రిడ్గ్ ఫోర్ట్ లో జన్మించాడు. ఈయన భార్య పేరు జెన్నిఫర్ కాగా వీరికి ఒక కొడుకు , కూతురు ఉన్నారు .

1982 లో విడుదలైన ఫస్ట్ బ్లడ్ చిత్రం లో హీరో సిల్వెస్టర్ స్టాలిన్ కి గురువు షెరీఫ్ విలియం గా అద్భుత నటనతో ప్రపంచాన్ని కట్టిపడేసాడు. బ్రేన్ డెన్నీ నటుడి గా 40 ఏళ్లలో సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా కనిపించాడు. 1985లో వచ్చిన స్కిఫికాకూన్ సినిమాలో ఏలియన్స్ లీడర్‌గా కనిపించి మెప్పించాడు 1996లో రోమియో జూలియట్ సినిమాలో రోమియో తండ్రిగా నటించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. కాగా బ్రేన్ డెన్నీ మరణం కరోనా వల్ల కాదని ఈయన కూతురు అందరి అనుమానం నివృత్తి చేసింది 82 ఏళ్ళ .బ్రేన్ డెన్నీ గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో వైద్యుల వద్ద చికిత్స పొందుతూ మరణించి నట్టు తెలుస్తోంది .

తెలంగాణాకి కేంద్ర బృందం కితాబు!

Telangana

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. బుధవారం 44 కేసులు, గురువారం 50 మందికి పాజిటివ్‌, శుక్రవారం ఏకంగా 66 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఇక్కడ కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు సేకరించింది. ఆ బృందం సభ్యులు గాంధీ, ఛాతీ ఆస్పత్రులకు వెళ్లి కరోనా బాధితులకు అందుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏర్పాట్లు పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు.

వైరస్‌ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాలను ప్రభుత్వం కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 28 జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి చెందగా, శుక్రవారం నాటికి 13 జిల్లాల్లో 209 కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఇందులో తాజాగా 1,09,975 ఇళ్లకు వెళ్లి, 4,39,900 మందిని వైద్య బృందాలు కలిసి వారి వివరాలు సేకరించాయి. కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఏవైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు చేస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి నోటిఫైడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఎల్లప్పుడు పవన్ అభిమానినే అంటున్న డైరెక్టర్


తానేప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను డైరెక్టర్ గా చూడలేదని కేవలం అభిమానిగానే చూశానని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తో తాను చేయబోయే మూవీపై ఆయన స్పందించారు. పవన్ తో చేసే సినిమా ఆయన అభిమానులను అలరించేలా ఉంటుందని తెలిపారు. ఈ మూవీ తర్వాత పవన్ అభిమానులు ఆయనను మరింతగా ఆరాధిస్తారని ఆయన తెలిపారు.

తాజాగా ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నిర్మాతలు మహేష్ ఎస్.కొనేరు, బన్నీ వాస్‌లతో కలిసి త్వరలో చిత్రాలను నిర్మించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో తన తదుపరి మూవీ పవన్‌తో కాకుండా మహేష్ ఉంటుందని హింట్ ఇచ్చారు. కాగా గతంలో పవన్-హరీష్ కాంబినేషన్లలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.

ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ మూవీని తెరెకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. త్వరలో పవన్ చేసే సినిమా పవన్ అభిమానులను అలరించేలా ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా కరోనా బాధితులను ఆదుకునేందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఎన్ఆర్ఐ స్నేహితుల సహకారంతో పేదలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు సాయంచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు.

Also Read: మహేష్ కోసం కష్టపడుతోన్న హరీష్

విజయసాయిరెడ్డి చట్టాలకు అతీతమా!


వైసిపి ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చట్టాలకు అతీతుడా అనే అనుమానాలు స్వయంగా ఆయన పార్టీ వారికే కలుగుతున్నాయి. ఆయన ఒక అధికార కేంద్రంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా, ఉత్తరాంధ్రలో ఆయన విస్తృతంగా తిరుగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆధారాతో సహా విమర్శలు గుప్పిస్తున్నాయి.

తాజాగా ఆయన విశాఖపట్నంలో ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తూ తనకు కూడా రక్తదానం చేయడం మరో వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. వారెవ్వరూ సాంఘిక దూరాన్ని పాటించిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రక్తదాన శిబిరాలనుద్దేశించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 14న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రక్తదాన శిబిరాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో కొన్ని సడలింపులు చేశారు. రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కొరకు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లడానికి వీలుగా ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను, రక్తమార్పిడి అవసరాన్ని తెలిపే ఆధారాలను పోలీసులకు చూపించి అనుమతి తీసుకోవాలని తెలిపారు.

రెగ్యులర్‌గా ఆసుపత్రులను సందర్శించే వీలుగా పాస్‌లను జారీ చేస్తారని ప్రకటిస్తూ, ఆ తర్వాతే రక్తదానం చేయాలని స్పష్టం చేశాయి. కానీ విజయసాయిరెడ్డి గాని, ఆయనతో వెళ్లిన వారు గాని ఈ నిబంధనను అస్సలు పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తుంటే వైసీపీ నేతలు సాంఘిక దూరం పాటించకుండా ఆయన చుట్టూ చేరి గుంపుగా నిల్చున్నారు.

దీనికి తోడు వైద్య సిబ్బంది సాధారణ మాస్కులు ధరిస్తే.. విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్-95 మాస్కులు ధరించి ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేరళలో లాక్ డౌన్ సడలింపు!


కేరళ రాష్ట్రంలోని గ్రీన్ జోన్‌లో ఈ నెల 20వతేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్యను బట్టి రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా జిల్లాలను విభజించింది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం, ఇడుక్కీ జిల్లాలను గ్రీన్ జోన్ గా గుర్తించినందున ఆయా జిల్లాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను సడలించాలని సర్కారు నిర్ణయించింది. ఆరంజ్ ఏ జోన్ జిల్లాలైన ఎర్నాకులం, కొల్లం, పధానమితిట్ట ల్లో ఏప్రిల్ 24 నుంచి కర్ఫ్యూ ఎత్తివేయాలని నిర్ణయించారు.

కరోనా కేసులు వెలుగుచూసిన కాసర్ గడ్, కన్నూర్, కోజికోడ్, మలప్పురం జిల్లాలను రెడ్ జోన్ గా గుర్తించినందున అక్కడ మే 3వతేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. అలప్పుజా, తిరువనంతపురం, పాలక్కాడ్, వయానాడ్, త్రిస్సూర్ జిల్లాలను ఆరంజ్ బి కేటగిరి జోన్ గా గుర్తించి అక్కడ ఈ నెల 20 నుంచి లాక్ డౌన్ ఆంక్షలను సడలించాలని కేరళ సర్కారు నిర్ణయించింది. కేరళలో 245 మందికి కరోనా సోకగా, వారిలో ముగ్గురు మరణించారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ఆ రాష్ట్ర సర్కారు లాక్ డౌన్ సడలింపుపై నిర్ణయం తీసుకుంది.

మరోవైపు తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ జోన్ లలో లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై 20 తరువాత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఏపీలో కేంద్రం ప్రకటించిన విధంగా గ్రీన్ జోన్ లు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 11 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్ లుగా పేర్కొంది. దీంతో మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ కొనసాగించాల్సిందే.

మంత్రులే లేకుండా శివరాజ్ చౌహన్ రికార్డు


మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అనేక రికార్డు లను ఇది వరకే బద్దలు చేశారు. కొద్దీ నెలల క్రితం మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సుదీర్ఘకాలం, 14 ఏళ్లకు పైగా విరామం లేకుండా దేశం మొత్తంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బిజెపి నాయకుడిగా రికార్డు సృష్టించారు.

ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో వృద్ధిలో గ్రామాలు, వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యాలకు గురిచేస్తూ, ఆ రంగాలలో ప్రతికూల అభివృద్ధిని దేశంలో అందరూ నమోదు చేస్తుండగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నదా ఆ రంగాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి చరిత్ర సృష్టించారు. దేశం అంతా వ్యవసాయ రంగంలో 2 లేదా 3 శాతానికి ముంచి దశాబ్దాలుగా వృద్ధి సాధించని పరిస్థితులలో 10 శాతంకు పైగా సాధించి రికార్డు నెలకొల్పారు.

ప్రస్తుతం అసలు మంత్రులు ఎవ్వరు లేకుండా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా దేశంలో తాజాగా రికార్డు సృష్టిస్తున్నారు. లాక్ డౌన్ విధించడానికి రెండు రోజుల ముందు హడావుడిగా గత నెల 23న ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేశారు. అప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ లేకుండా 26 రోజులుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు దేశంలో ఎక్కువకాలం – 24 నాలుగు రోజుల పాటు మంత్రువర్గం లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగిన ఘనత కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడియూరప్ప రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ రికార్డు ను చౌహన్ బద్దలు చేసిన్నట్లు అయింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా ఓ ట్వీట్‌లో చౌహన్ ను అవహేళన చేశారు. ‘శివరాజ్‌జీ..మీకు అభినందనలు. ఎంపీలోని ప్రస్తుత విషాద పరిస్థితుల్లో మీరు మంత్రులు లేకుండా ఎక్కువ కాలం సేవలందించిన సీఎంగా భారత్ లోనే సరికొత్త రికార్డు సృష్టించారు. 24 రోజుల రికార్డు గతంలో యడియూరప్ప పేరు మీద ఉంది”అంటూ పేర్కొన్నారు.

పైగా, “ఇద్దరి మధ్యా ఓ పోలిక కూడా ఉంది. ఇద్దరూ నాలుగోసారి ముఖ్యమంత్రులుగా ఫిరాయింపుదారుల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పరచిన వారే” అంటూ తంఖా తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. అనుచిత పద్ధతుల్లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చారంటూ విమర్శలు గుప్పించారు.

వాస్తవానికి మంత్రివర్గం విస్తరించడం కోసం ఇప్పటికే పలు దఫాలుగా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆ చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోయిన్నట్లు తెలుస్తున్నది. మొదటి విడతలో కనీసం వచ్చేవారమైన కీలకమైన శాఖలను సీనియర్లకు ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు.

మరో మల్టీ స్టారర్ చిరంజీవి తో అల్లు అర్జున్


తెలుగులో మల్టీ స్టారర్ ల సీజన్ నడుస్తున్నట్టు వుంది. వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలకు నిర్మాతలు క్యూ కడుతున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే రవితేజ , రానా దగ్గుబాటి కూడా ఒక మల్టీ స్టారర్ చిత్రం లో నటిస్తున్నారు . `అయ్యప్పనుం కోషియుమ్ `అనే మళయాళ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తయారౌతుంది. రమేష్ వర్మ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించ బోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ , రవి తేజ కాంబో లో కూడా ఒక ముల్టీస్టారర్ నిర్మించే ప్లాన్ ఉంది . కాగా ఈ చిత్రాన్ని నేల టికెట్ , డిస్కో రాజా చిత్రాల నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించాలని ఉవ్విల్లూరు తున్నాడు .

ఇవన్నీ ఒకెత్తయితే భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్ `( రౌద్రం రణం రుధిరం ) షూటింగ్ దశలో ఉంది అలాగే నాని నటించిన ” వి ” చిత్రం కూడా మల్టీ స్టారర్ అనే చెప్పాలి .

అలా మల్టీ స్టారర్ చిత్రాల వెల్లువ తెలుగు సినీ రంగాన్ని ముంచెత్తుతోంది . కాగా ప్రస్తుతం `ఆచార్య ` చిత్రం తరవాత చిరంజీవి చేయబోయే సినిమా కూడా మల్టీ స్టారర్ అనే చెప్పాలి. ‘లూసిఫర్’ అనే మళయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ చిత్రం లో చిరంజీవి తో పాటు అల్లు అర్జున్ కూడా నటించ బోతున్నాడు. అని తెలిసింది. మళయాళం లో మోహన్ లాల్ నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం లో రెండో హీరోగా పృథ్వీరాజ్ నటించడం జరిగింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించ బోతున్న ఈ తెలుగు రీమేక్ చిత్రాన్ని ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది .

Also Read: సీసీసీకి నిర్మాత మోహ‌న్ చెరుకూరి విరాళం
సి.సి.సి కి రామోజీరావు విరాళం

మరింత పకడ్బందీ ప్లాన్ తో జగన్!

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా రక్కసి ఏపీలో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ కు కట్టడి చేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు.

ఏపీలో కరోనా నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష జరిపారు. కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని జగన్ స్పష్టం చేశారు. వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు పేదలకు 2 వేల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. పౌష్టికాహారం తీసుకునేలా సూచనలు చేయకపోతే.. సమస్య మొదటికి వస్తుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. హాట్ స్పాట్ల ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని సూచించారు జగన్. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు…రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం తెలుసుకున్నారు. రెడ్‌ జోన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని, టెస్టులను క్రమంగా పెంచాలని సూచించిన సీఎం,  రెండవ విడత రేషన్ పంపిణి అంశాలపై చర్చించారు. ఈ విధంగా ఏపీలో కరోనా కట్టడికి మరింత పకడ్బందీతో సీఎం జగన్ ముదుకెళ్తున్నారు.

సి.సి.సి కి రామోజీరావు విరాళం

Ramoji rao enters the business again
Ramoji rao enters the business again


మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా రామోజీరావు గారు 10 లక్షలు విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ సీసీసీకి రామోజీ రావు గారి ద‌గ్గ‌ర నుండి ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్టీజీఎస్ ద్వారా వ‌చ్చింద‌ని తెలిసిన త‌ర్వాత నేను ప్ర‌త్యక్షంగా ఆయ‌న‌కు ఫోన్ చేసి ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డం జ‌రిగింది. మీలాంటి వాళ్ళు మేము చేస్తున్న కార్య‌క్ర‌మాన్ని గుర్తించ‌డ‌మే కాకుండా దాన్ని ప్రోత్స‌హిస్తూ ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది అన్నాను. దీనికి ఆయ‌న చిరంజీవి గారు , నేను మీరు చేసే కార్యకమాలను , ఇంటింటికి సరఫరా చేసే విధానము గమనిస్తున్నాను. బాగాచేస్తున్నారు , అయినా నేను ఇచ్చింది చాలా చిన్న అమౌంట్ అన్నారు.. అమౌంట్ గురించి కాదండి.. మీలాంటి వాళ్ళు మేము చేస్తున్న సేవ‌ల్ని గుర్తించి వెన్ను తట్టటమే కోట్ల విలువ , మాకందే ప్ర‌తి పైసా క‌ష్టాల్లో ఉన్న‌వారికి నేరుగా అందాలని చేస్తున్న ప్రయత్నం చాల సంతృప్తినిస్తుంది అన‌గానే.. మీరు నిజాయితీగా చేస్తారు చిరంజీవి గారు… మీరు అందించే ప్ర‌తి పైసా వారి చేతికి, నోటికి అందుతుంద‌నే న‌మ్మ‌కం నాకుంది… అంటూ రామోజీరావు గారు ఎంత‌గానో ప్రోత్స‌హిస్తూ, ఉత్సాహ‌ప‌రిచారు. వారికి ప్ర‌త్యేకించి నా ట్విట్ట‌ర్ ద్వారా ధ‌న్య‌వాదాలు తెలుపుకోవ‌డం కూడా జ‌రిగింది. మా సీసీసీ సభ్యులందరి త‌ర‌ఫున మ‌రొక్క‌సారి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి

ఎన్.టి.ఆర్ తో అదిరింది దర్శకుడు


ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ ముగిసిన వెంటనే ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఆ సినిమా కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది . ఇక ఆ సినిమా తరువాత సినిమాను “ రాజా రాణి , అదిరింది “ ఫేమ్ అట్లీకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడనే వార్త ఒకటి బయటి కొచ్చింది ఆ క్రమంలో ఎన్టీఆర్- అట్లీకుమార్ కాంబినేషన్ ఎలా సెట్ అయిందన్న అనుమానం చాలా మంది లో ఉంది .

అదెలా జరిగిందంటే తమిళంలో విజయ్ హీరోగా అట్లీ కుమార్ ‘మెర్సల్’ (అదిరింది) సినిమా తీసిన టైం లో ఆ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే ను సమకూర్చారు. అప్పటి నుంచి అట్లీ కుమార్ కి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కి మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది . ఆ సమయంలోనే తన దగ్గరున్న ఒక కథ గురించి అట్లీ కుమార్ విజయేంద్ర ప్రసాద్ కి చెప్పాడట. దానికి ఆయన స్పందిస్తూ ఈ కథ ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పి, ఆ ఇద్దరినీ కలిపాడట . అలా అట్లీ కుమార్ .. ఎన్టీఆర్ ను ఒప్పించి గోల్డెన్ ఛాన్స్ చాలా ఈజీగా దక్కించుకున్నాడు అదలా ఉంటే ఆశ్వినీదత్ కంత్రీ , శక్తి తరవాత మూడో సారి ఎన్టీఆర్ తో సినిమా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి తరుణం లో అట్లీ కుమార్ ప్రొపోజల్ వచ్చింది . అలా ‘విజిల్’ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు అట్లీ కుమార్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్టు రెవీల్ చేసాడు.

గజినీ బిజీ బిజీ గా ఉన్నాడు


కె .బాలచందర్ ఫేవరేట్ యాక్టర్ శివకుమార్ తనయుడు , స్టార్ హీరోఆయిన సూర్య తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడు గజినీ చిత్రం అరవాత తెలుగులో సూర్య మార్కెట్ విపరీతం గా పెరిగింది అందుకనే ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సూర్య సినిమాలు ఎన్జీకే, బందోబస్త్ వంటి అనువాద చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేక పోయాయి. అయితే ఈ ఏడాది సమ్మర్లో `ఆకాశం నీ హద్దురా` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న సూర్య ఆశను కరోనా వైరస్ అడ్డుకొంది .

వెంకటేష్ హీరోగా నటించిన `గురు ` ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించిన ఈ `ఆకాశం నీ హద్దురా` సినిమాలో 40 ఏళ్ల సూర్య చాలా బాగా వర్కవుట్స్ చేశాడు. ఆ కష్టాన్నిఅందరికీ తెలియజేయాలని చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో 40 ఏళ్ల వ్యక్తి 19 ఏళ్ల వ్యక్తిగా ఎలా మారాడు అనే దానిపై విజువల్స్ ఉన్నాయి. కాగా ఆ వీడియో చూసిన వాళ్లంతా సూర్య కమిట్మెంట్ కి శభాష్ అంటున్నారు. ఆయన ఎలాంటి ఎక్సర్సైజులు చేశారు. ఎలాంటి డైట్ తీసుకున్నారనే విషయాన్ని వీడియో లో చూపించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత `ఆకాశం నీహద్దురా` సినిమా విడుదల తేదీపై ఓ క్లారిటీ వస్తుంది . అలాగే సూర్య సింగం ఫేమ్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో“అరువా` అనే సినిమాను చేయబోతున్నాడు దీనితో పాటు ” అసురన్ ” (తెలుగులో నారప్ప ) ఫేమ్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుందట .

జగన్ కు కరోనా టెస్ట్ రిపోర్ట్.. ఏమొచ్చిందంటే?


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుండి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కు సంభందించిన లక్ష కిట్లు రాష్టానికి వచ్చాయి. తాడేపల్లిలోని తన నివాసంలో ఆ కిట్ లను పరిశీలించి ప్రారంభించిన సీఎం స్వయంగా తనే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకున్నారు.

ఈ టెస్ట్ ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ టెస్ట్ కు సమయం 10 నిముషాలు పడుతుందని తెలిపారు. సీఎం నివశిస్తున్న తాడేపల్లి పట్టణంలో ఒకరికి కరోనా సోకింది. బఫర్ జోన్ లో ఆయన నివాసం ఉండటంతో అధికారులు, ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.