
కరోనా ప్రభావం తో సినీ పరిశ్రమ స్తబ్దుగా ఉన్నసమయం లో ఒక కొత్త చిత్రం కామ్ గా పూజ జరుపుకొంది. హీరో గోపీచంద్ నటించ బోయే 29వ సినిమా ఆరంభమైంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో బిను సుబ్రమణ్యం అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. కాగా సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందించ నున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ఆరంభం కానుంది … యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆరంభోత్సవానికి కేవలం దర్శక – నిర్మాతలు మాత్రమే హాజరయ్యారు.కాగా బీవీఎస్ ఎన్ ప్రసాద్-గోపీచంద్ కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
గత కొంతకాలంగా గోపీచంద్ సక్సెస్ లేక బాగా వెనకబడిపోయాడు .. గడిచిన మూడేళ్లలో గౌతమ్ నంద , ఆరడుగుల బుల్లెట్, పంతం , చాణక్య ,ఆక్సీజెన్ వంటి 5 వరుస డిజాస్టర్లను చవిచూశాడు. 2015 మార్చ్ 27 న వచ్చిన ‘జిల్’ సినిమా మాత్రమే యావరేజ్ విజయాన్ని అందించింది . ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ‘సీటీమార్’ చేస్తున్నాడు. ‘సీటీమార్’ గోపీచంద్ నటించే 28వ సినిమా కాగా ‘యూ టర్న్’లాంటి హిట్ సినిమా అందించిన చిట్టూరి శ్రీనివాసరావు ఈ సినిమా యొక్క నిర్మాత. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు.