
అటు కమర్షియల్ సినిమాలు, ఇటు రీమేక్ సినిమాలు తెరకెక్కించడంలో హరీష్ శంకర్ దిట్ట . అలా రెండు రకాల క్వాలిటీస్ పుష్కలంగా వున్నా దర్శకుడు హరీష్ శంకర్..అంతేకాదు హీరోలను కమర్షియల్ గా ఎలివేట్ చేసి చూపిస్తూ తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి . హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే 28 వ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు ..
‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం తో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఇదిలా ఉంటే ఈమధ్య హరీష్ శంకర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నా నని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. మహేష్ బాబు ఇమేజ్ తగ్గట్టు ఓ కమర్షియల్ సబ్జెక్ట్ వ్రాస్తున్న అని వెల్లడించాడు . అంతేకాదు త్వరలో తను ఇద్దరు యువ నిర్మాతలతో కలిసి సినిమా నిర్మాణం చేపట్ట బోతున్నట్టు తెలిపాడు. కళ్యాణ్ రామ్ తో ” 118 .”చిత్రాన్ని నిర్మించిన మహేష్ కోనేరు , గీతా ఆర్ట్స్ బన్నీ వాస్ లతో కలిసి సినిమాలు నిర్మించాలను కొంటున్నట్టు తెలిపాడు. ప్రసుతం వెబ్ సిరీస్ కి కూడా రచన చేస్తున్నట్టు తెలిపాడు .