
కరోనా ప్రభావం తో ఎన్నో సినిమాలు లాస్ట్ షెడ్యూల్ లో ఆగిపోయాయి అలాంటి సినిమాల్లో .పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కూడా ఉంది . నిజానికి ఈ చిత్రం ఈపాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లాల్సింది. అలాగే ఈ సినిమా మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించడం కూడా జరిగింది.
షూటింగ్ అంతా సజావుగా సాగిపోతుండగా కరోనా మహమ్మారి వచ్చి అడ్డు పడింది. దీంతో దిల్ రాజు చిత్ర బృందం సైలెంటుగా ఉండిపోయింది ఇపుడు పరిస్థితి చూస్తే .మేలో అసలు థియేటర్లు తెరుచుకునే ప్రసక్తే లేదు. దానికి తోడు వకీల్ సాబ్’ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి ‘వకీల్ సాబ్’ ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా అనిపించడం లేదు.
దరిమిలా ‘వకీల్ సాబ్’ దసరాకు వాయిదా పడ్డట్లు వార్త లొచ్చాయి .ఐతే దిల్ రాజు ఆలోచన వేరే విధంగా ఉంది. జూన్ నెలాఖరు వరకు థియేటర్లు మూతపడే ఉన్నట్టయితే ఆగస్టు 15కు ‘వకీల్ సాబ్’ను రెడీ చేయాలని దిల్ రాజు అనుకొంటున్నాడట.. మే లేదా జూన్ లో షూటింగులు స్టార్ట్ అయితే పెండింగ్ లో ఉన్న `వకీల్ సాబ్’ మిగతా భాగం యొక్క షూటింగ్ పూర్తి చేయాలను కొంటున్నాడు .
ఆ లెక్కన పవన్ కళ్యాణ్ కేవలం 8 రోజుల డేట్లు కేటాయిస్తే చాలు..సినిమా లో ఆయన పార్ట్ ఫినిష్ అవుతుంది .ఇక మిగతా నటీనటులతో ముడిపడ్డ ప్యాచ్ వర్క్ కూడా వేగంగా పూర్తి చేసి. స్వాతంత్ర దినోత్సవ కానుకగా `వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేద్దామని దిల్ రాజు ఆలోచిస్తున్నట్టు తెలిసింది .
Also Read: లోకేష్ కు సైకిల్ ఎక్కాలని ఆశ!