
మజిలీ , వెంకీ మామ తరవాత సినిమాల విషయం లో ఆచి తూచి అడుగు లేస్తున్నాడు . అక్కినేని నాగచైతన్య…. ఆ క్రమంలో ఇపుడు సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి’ సినిమాలో నటిస్తున్నాడు. ఫిదా ఫేమ్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. కరోనా లేక పొతే ఈ సినిమా ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల అయ్యేది
`లవ్ స్టోరీ `తర్వాత నాగచైతన్య హీరోగా పరుశురామ్ ఓ సినిమాను లాంఛనంగా ప్రారంబించడం జరిగింది. అయితే అనూహ్యంగా పరుశురామ్‌కు మహేశ్ బాబు సినిమా ఛాన్స్ రావడం తో నాగ చైతన్య సినిమాను పక్కన పడేసి వెళ్లిపోయాడు. దాంతో నాగ చైతన్య ఇప్పుడు మరో రెండు సినిమాలను లైన్లోకి తెచ్చుకొన్నాడు అందులో ఒకటి ” మనం ” ఫేమ్ విక్రమ్ కుమార్ తో కాగా రెండోది ఒక సక్సెసఫుల్ యువ దర్శకుడు తో వుండబోతోంది .
తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ” V ” మూవీ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమా చేయడానికి నాగ చైతన్య చర్చలు జరుపుతున్నాడట.. ప్రస్తుతం నాని 25వ చిత్రం ‘వి’ ని డైరెక్ట్ చేస్తున్న మోహనకృష్ణ ఇంద్రగంటి తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్య తో చేయాలని అనుకొంటున్నాడు. కాగా ఈ చిత్రం గురించిన పూర్తి వివరాలు కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దర్శక ,నిర్మాతలు అనౌన్స్ చేయాలని అనుకొంటున్నారు .