Home Blog Page 8520

సినిమాలు వద్దు అనుకొన్న దగ్గుబాటి బ్రదర్స్


మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు తన ఇద్దరు కుమారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారట. అందుకే వీరిద్దరిని విదేశాలలో ఉన్నతమైన చదువులు కూడా చదివించారు. అయితే ఊహించని విధంగా ఇద్దరూ సినీ రంగం లోనే సెటిల్ అయ్యారు..

ప్రస్తుతం ప్రొడ్యూసర్ డి.రామానాయుడు గారికి వారసుడిగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను….సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్న సురేష్ బాబుకి మొదట్లో నిర్మాతగా మారాలనే ఆలోచన లేదట…ఆ క్రమంలో అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత సిరామిక్స్ బిజినెస్ చేసాడట సురేష్ బాబు. అయితే అది పెద్దగా లాభదాయకం కాకపోవడంతో సురేష్ ప్రొడక్షన్ సంస్థలో తాత్కాలికంగా పని చేయడం మొదలు పెట్టాడట …… అలా సురేష్ ప్రొడక్షన్స్ లో నాలుగేళ్లు పని చేసిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లి పోదామని అనుకున్నాడట .. అయితే తమ్ముడు వెంకటేష్ ను హీరోగా లాంచ్ చేసే సమయం కావడంతో ఆగి పోవాల్సి వచ్చిందట ..

ఇక విక్టరీ వెంకటేష్ సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అవడం చాలా సినిమాటిక్ గా జరిగిందట. నిజానికి బిజినెస్ మ్యాన్ అవ్వబోయి హీరో అయ్యాడట వెంకటేష్.. అదెలా జరిగిందంటే ‘కలియుగ పాండవులు’ మూవీ ని సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని రామానాయుడు అనుకున్నారట.. . ఈ విషయమై కృష్ణ తో మాట్లాడగా ఈ మూవీ సహ నిర్మాతగా ఏఎస్ ఆర్ ఆంజనేయులిని తీసుకోవాలని కృష్ణ కండిషన్ పెట్టారట … దీనికి రామానాయుడు ఒప్పుకోక, మరో హీరో కోసం వెతుకుతుండగా సన్నిహితులు.. మీ చిన్నబ్బాయి హీరోగా చక్కగా సరిపోతాడు అని సలహా ఇచ్చారట. అలా ‘కలియుగ పాండవులు’ సినిమాతో వెండితెరకు హీరోగా వెంకటేష్ పరిచయం కావడం జరిగింది .

కన్నడ లో మెగా అల్లుడు


ప్రస్తుతం తెలుగు సినీ రంగం లో మెగా హీరోల హవా కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , వరుణ్ తేజ్, బన్నీ , సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ మంచి ఫార్మ్ లో ఉన్నారు. అలాంటి టైం లో చిరంజీవి అల్లుడిగా ‘విజేత’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్ పరాజయం చవి చూసాడు. దాంతో ఇపుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా ‘సూపర్ మచ్చి’ చిత్రాన్నిచేస్తున్నాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రియా చక్రవర్తి మరియు రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అదలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయకొచ్చింది.

‘సూపర్ మచ్చి’ సినిమాని తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.దర్శక నిర్మాతలు…. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. సహజంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే అన్ని సినిమాలు కన్నడ లో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి .. . వాటికీ అక్కడ మంచి మార్కెట్ కూడా లభిస్తోంది . ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా అల్లుడిని కూడా కన్నడిగులకు పరిచయం చేయాలని ‘సూపర్ మచ్చి’ యూనిట్ భావిస్తోందట..

Nikita Sharma Latest Pics

Pooja Ramachandran Workout Pics

పాల్ఘర్ ఘటన వెనుక మతోన్మాదుల కుట్ర!

మహారాష్ట్రలోని పాల్ఘర్ లోని గాడ్చినలే గ్రామంలో ఇద్దరు సాధువులను, వారి డ్రైవర్ ని మొత్తం ముగ్గుర్ని కనికరం లేకుండా కర్రలతో, రాళ్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో అరెస్టైన నిందితుల జాబితాను ఉద్ధవ్ సర్కారు విడుదల చేసింది. 101 మంది నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ ముఖ్ తెలిపారు. ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతుండగానే ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేసింది. ఈ ముగ్గురి హత్య వెనుక ముస్లింలు ఉన్నారని కొంత మంది హిందూ మతోన్మాదులు దుష్ప్రచారానికి పాల్పడ్డారు.

సాధువుల హత్య కేసులో కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా అందులో ఒక్క ముస్లిం పేరు కూడా లేకపోవడంతో ఈ ఘటన కుట్ర పూరిత చర్య కాదని తేటతెల్లమైంది.

మరణించిన సాధువులను కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌ గా గుర్తించారు. తమ సమక్షంలోనే దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేకపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది.

యూపీ సీఎం యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడటంతో ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.

 

అసలేమి జరిగింది…?

ఏప్రిల్ 17 రాత్రి 9.30 నుండి 10గంటల మధ్యలో ఒక వ్యానులో ముంబయి నుండి సూరత్ కి బయల్దేరిన సుశీల్ గిరి మహారాజ్ (35), నీలేష్ తెల్గేన్ (35), చికానే మహారాజ్ కల్పవ్రిక్షిగిరి (70) అనే ముగ్గురి వ్యక్తుల్ని పాల్ఘర్‌ గ్రామ ప్రజలు ఆపి విచక్షణ రహితంగా కొట్టి చంపారు. ఆ ముగ్గురిలో ఇద్దరు సాధువులు కాగా మూడో వ్యక్తి డ్రైవర్. అయితే అంతకంటే ముందే ఆ గ్రామంలోకి పిల్లల్ని కిడ్నాప్ చేసి, అవయవాలు అమ్ముకునే వారు వస్తున్నారనే వార్త వైరల్ అయింది. దింతో ఆ గ్రామస్థులు మెలకువగా ఉండి సూరత్ లో అంత్యక్రియలకు వెళ్తున్న వ్యానిని ఆపి అనుమానంతో దాడి చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులందరు ఒక్కసారిగా దాడి చేయడంతో ఒక వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు సమీప ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.ఆ ముగ్గురి పై దాడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో.. కేంద్ర హోమ్ శాఖ నివేదిక ఇవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వన్ని కోరింది.

మేజర్ వర్క్ పూర్తి చేస్తున్న అడవి శేషు


కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన లాక్ డౌన్ సమయాన్ని చక్కగా ఉపయోగించు కొంటూ తన సినిమా పనులు కానిచ్చేస్తున్నాడట… యంగ్ హీరో అడవి శేష్. ఇంతవరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేసిన అడవి శేష్ ఇప్పుడు ‘మేజర్’అనే దేశ భక్తి ప్రబోధాత్మక మూవీ చేస్తున్నాడు. సదరు చిత్రాన్ని మహేష్ బాబు స్వంత సంస్థ జీఎమ్బీ ( G M B ) ఎంటర్టైన్మెంట్స్ ‘గూఢచారి ఫేమ్ డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో నిర్మిస్తోంది . కాగా ‘మేజర్’ సినిమా ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. దాంతో ఇప్పటివరకు అయిన షూటింగ్ పార్ట్ ని ఎడిట్ చేస్తూ బిజీగా ఉన్నాడట ` మేజర్ ` చిత్ర హీరో అడవి శేష్..

‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్సు చిత్రాలతో విజయాలు అందుకున్న అడవి శేషు, ఇంతకుముందు `కర్మ `, ` కిస్ ` అనే రెండు సినిమాలను డైరెక్ట్ కూడా చేశాడు. ఆ అనుభవం తో తను నటించే ప్రతి సినిమాకు సంబంధించిన విషయాలన్ని దగ్గరుండి చూసుకుంటాడట …. ఆ క్రమంలో `మేజర్ ` చిత్రాన్ని కూడా దగ్గరుండి మరీ ఎడిటింగ్ చేయిస్తున్నాడు. 2008 లో ముంబై ఉగ్ర వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన `మేజర్` సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మేజర్’ మూవీ తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కు స్తున్నారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లో డబ్ చేయబోతున్నారు.

కార్తికేయ సీక్వెల్ లో హీరోయిన్ మారింది

యంగ్ హీరో నిఖిల్ సినీ కెరీర్ లో మైలు రాయి అనదగ్గ చిత్రం ` కార్తికేయ `అనడం లో ఎటువంటి సందేహం అక్కరలేదు. 2014 అక్టోబర్ 24 న విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. కేవలం 6 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం 20 కోట్ల షేర్ రాబట్టి అందర్నీ ఆశ్చర్య పర్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం నిఖిల్ సిద్దార్ధ్ కే హీరోగా భారీ విజయాన్ని సాధించింది.ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘కలర్స్’ స్వాతి కి కూడా మంచి పేరు వచ్చింది . ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి సినిమాకి ‘కార్తికేయ 2’ టైటిల్ తో సీక్వెల్ రూపొందుతోంది.

కాగా ఈ సినిమాలో కూడా ‘కలర్స్’ స్వాతి హీరోయిన్ గా చేయనున్నట్టు రక రకాల వార్తలు వచ్చాయి. అది నిజమే గాని ఆమె పాత్ర హీరోయిన్ కాదు .. ఈ సినిమాలో ఆమె హీరోకి మాజీ లవర్ గా కనిపించనుందని అంటున్నారు. పెళ్ళైన తరువాత ‘కలర్స్’ స్వాతి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయిక పాత్ర కోసం మళయాళీ బొద్దు భామ అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటున్నారట.. నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ఫై విశ్వప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

టీఆర్ఎస్ వార్షికోత్సవం ఎలా జరుగనుందంటే?


కరోనా మహమ్మరి రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ మే7వరకు పొడగించిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల షాపులు మినహా అన్ని వ్యాపార సంస్థలు బంద్ అయ్యాయి. ప్రజారవాణా స్తంభించిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన కరోనా పోరాటంలో తమవంతు సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. వైద్యులు ఆస్పత్రుల్లో, పోలీసులు రోడ్లపై డ్యూటీలు చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ వార్షికోత్సవం దగ్గరపడుతోంది. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది.

సాధారణ పరిస్థితుల్లో అయితే టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేవారు. అందులో టీఆర్ఎస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. కరోనా ఎఫెక్ట్ లేనట్లయితే ఈపాటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు సందడి మొదలయ్యేది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పడింది. కరోనా విషయంలో సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని కొంచెం కఠినంగానే చెబుతోన్నారు. అలాగే ఎవరైనా శుభకార్యాలు లాంటివి ఉన్నట్లయితే వాయిదా వేసుకోవాలని అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వార్షికోత్సవం సింపుల్ గానే నిర్వహించేందుకే కేసీఆర్ మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈమేరకు టీఆర్ఎస్ యువ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు ఓ పిలుపు నివ్వడం ఆసక్తికరంగా మారింది. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంటూ.. సామాజికహితానికి పాల్పడదామంటూ ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ట్వీటర్లో టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్రపటంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించిన ఫోటోలను సంతోష్ కుమార్ ట్వీట్ చేశాడు. ఈ రకమైన మాస్క్ లను తయారుచేసి ప్రజలకు పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అంతేకాకుండా మాస్కులను ధరించిన ఫొటోలను తనకు షేర్ చేయాలని పార్టీ శ్రేణులకు, నాయకులకు ట్విటర్లో సంతోష్ కుమార్ కోరాడు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వార్షికోత్సవం ఎలా జరుగనుందనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఈసారి సింపుల్ గా కేసీఆర్ మాస్కులతో వార్షికోత్సవాన్ని ముగిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!

కేంద్రం బృందాలపై వ్యూహాత్మకంగా మమతా వెనుకడుగు


కోవిడ్-19 పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర బృందాలను పంపడం పట్ల మొదట్లో నిరసన వ్యక్తం చేయడంతో పాటు, అది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించగలదని నిప్పులు చెరిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసిన్నట్లు కనిపిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉంటామని ఆమె ప్రభుత్వం స్పష్టం చేయడం మారిన ఆమె వైఖరిని వెల్లడి చేస్తుంది.

మొత్తం ప్రపంచం ఆందోళన చెందుతున్న కరోనా వంటి అంశంపై కేంద్రంతో పోరుకు దిగితే ప్రజాసానుభూతి ఉండకపోవచ్చని ఆమె మాట మార్చి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ బృందాలను రాజకీయ ప్రయోజనాలకోసమే కేంద్రం పంపినట్లు మాత్రం ఆమె పార్టీ నేతలు భావిస్తున్నారు.

కరోనా వైరస్ పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందంటూ కేంద్రం మండిపడిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి తాజా వివరణ ఇస్తూ ఒక లేఖను పంపారు.

అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదనే మాట ఎంతమాత్రం నిజం కాదని, ఒక బృందంతో తాను రెండుసార్లు సమావేశమయ్యాయని, ఇతరులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

‘విపత్తు యాజమాన్యం చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాల అమలులో అత్యంత జాగరూకతతో ఉంటామని మీకు తెలియజేస్తున్నాను’ అని రాజీవ్ సిన్హా పేర్కొన్నారు. అయితే కేంద్ర బృందాలు తమతో ముందస్తు సంప్రదింపులు జరపకుండా వచ్చినందున కేంద్ర ఉత్తర్వులో పేర్కొన్న లాజిస్టిక్ సపోర్ట్ అందించలేకపోయామని తెలిపారు.

పైగా కేంద్ర బృందం సైతం ఎలాంటి సాయం కోరలేదని రాజీవ్ సిన్హా ఆ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 21న తాను భల్లాతో టెలిఫోన్ సంభాషణ జరిపి, కోవిడ్-19 నిరోధానికి తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేశానని కూడా ఆయన గుర్తు చేశారు.

కాగా, పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్న రెండు కేంద్ర బృందాలకు సహకరిస్తామంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇచ్చిన హామీని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు స్వాగతించారు. లాక్‌డౌన్ చర్యలు అమలుపై సమీక్షించేందుకు కేంద్ర ఆరు బృందాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌కు పంపింది. వీటిలో రెండు బృందాలు పశ్చిమబెంగాల్‌కు వెళ్లాయి.

కరోనా వైరస్ కట్టడిలో, లాక్ డౌన్ అమలులో బిజెపి నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కాకుండా ఈ సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ కు పంపడం పట్ల టిఎంసి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక బృందం కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, ఈస్ట్ మిడ్నాపూర్‌లో పర్యటించగా, మరో బృందం జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, కలింపాంగ్‌లలో పర్యటించింది. అయితే, కేంద్ర బృందాల రాకను ‘సహస పర్యటన’గా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తొలుత అభివర్ణించింది.

ఇన్‌ఫెక్షన్లు, హాట్‌స్పాట్‌లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎందుకు కేంద్ర బృందాలను పంపడం లేదని నిలదీసింది. పైగా, కేంద్ర బృందాలు వచ్చిన మూడు గంటల తర్వాత ఆ సమాచారాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేసారని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన చర్య కాదని టీఎంసీ ఎంపీలు డెరిక్ ఒబ్రెయిన్, సుదీప్ బంధోపాధ్యాయ్ విమర్శించారు.

అదీ కాకుండా, సరిహద్దు భద్రతా దళాల రక్షణలో కేంద్ర బృందాలు ఒక యుద్ధ భూమికి వస్తున్నట్లు రావడం ఏమిటని కేంద్రాన్ని వారు నిలదీశారు. రాష్ట్ర పోలీసులకు తెలిపితే వారు తగిన భద్రతను ఏర్పాటు చేసి ఉండేవారు గదా అని చెబుతున్నారు.

ఆ విషయంలో మోడీ ఫస్ట్, ట్రంప్ లాస్ట్!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ వైరస్ కట్టడికి పాటుపడుతున్న దేశాధి నేతలపై “మార్నింగ్ క‌న్స‌ల్ట్” ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రకారం.. కోవిద్19 నియంత్రణకి అత్యంత కృషి చేస్తున్న దేశాధి నేతగా భారత్ ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. ఆగ్రదేశాధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ జాబితాలో చిట్ట చివరి స్థానాన్ని పొందుకున్నారు.

ఇండియాలో కరోనా వైర‌స్‌ నియంత్రణ చర్యలను చేపట్టడంలో ప్రధాని మోదీ, ప్రపంచ దేశాల అధినేతలకంటే ముందు వరుసలో నిలిచారు. “మార్నింగ్ క‌న్స‌ల్ట్” సర్వే  ప్రకారం నరేంద్ర మోడీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.  మెక్సికో  అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ 35, ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్  26 పాయింట్లతో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంకా  ఈ జాబితాలో ట్రుడావ్ కు 21, మెర్కెల్ 16, బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, మార్కాన్ మైనస్ 21, షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు. అటు  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ 3 పాయింట్లతో చివ‌ర‌న నిలిచారు.

చిన్న పరిశ్రమలకు జగన్ ప్రభుత్వం రాయితీలు


ఆంధ్ర ప్రదేశ్ లో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా నెల రోజులుగా కరోనా వల్ల మూతపడి ఉరడడంతో వాటిని ఆదుకునేరదుకు వడ్డీ రాయితీని అమలు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. పెట్టుబడి రుణంగా తీసుకున్న మొత్తంపై ఆరు నెలలపాటు మూడు నుండి తొమ్మిది శాతం వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని చూస్తున్నారు.

2015 ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మధ్య కాలంలో ఉత్పత్తి ప్రారంభిరచిన సంస్థలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తింప చేయాలని చూస్తున్నారు. మిగిలిన సంస్థలకు ఆరు నెలలపాటు వడ్డీ రీయిరబర్స్‌మెరట్‌ అమలు చేసేందుకు ఆలోచిస్తున్నారు. దీనికోసం రూ 200 కోట్లు నిధిగా సమకూర్చాలని, ఇందుకు బ్యారకుల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు.

మొత్తం పది వేల జనుడికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని, రూ 140 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అలాగే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కావాల్సిన పెట్టుబడులను ఆరు శాతం వడ్డీపై బ్యాంకులకు తన హామీతో రుణాలను ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కరోనాతో 154 కోట్ల మంది విద్యార్థులకు నష్టం


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 154 కోట్లకు పైగా విద్యార్థులు నష్ట పోయే అవకాశం ఉన్నట్లు యునెస్కో అంచనా వేసింది. కరోనా నిర్మూలనకు దేశాలన్నింటిలో లాక్ డౌన్ ప్రకటించడంతో విద్యాసంస్థలు మూతపడి, విద్యార్థుల చదువుకుఆటంకం ఏర్పడింది. దానితో చాలామంది విద్యార్థలు తమ విద్యా సంవత్సరాన్ని కొల్పోయే ప్రమాదం ఏర్పడింది.

ముఖ్యంగా బాలికలు ఎక్కువగా నష్టపోయే అవకాశముంది. లాక్ డౌన్ కారణంగా బాలికల డ్రాప్-అవుట్ రేట్లు పెరగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పైగా ఇది విద్యారంగంలో కూడా లింగ అంతరాలను మరింత పెరుగుతాయని యునెస్కో భావిస్తున్నది.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పాఠశాలలను మూసివేయడం వల్ల కౌమారదశలో ఉన్న బాలికల డ్రాప్-అవుట్లు పెరిగే అవకాశం ఉందని యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియానిని హెచ్చరించారు. ఈ కరోనా ప్రభావం విద్యరంగంలో లింగ అంతరాలను పెంచడంతో పాటు.. మైనర్ వివాహాలు పెరగడానికి కారణమవుతందని ఆమె అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ప్రస్తుతం 89 శాతం మంది చదువుకు దూరమయ్యారని యునెస్కో అంచనా వేస్తున్నది. అది పాఠశాల లేదా విశ్వవిద్యాలయంలో చదువుతున్న 154 కోట్ల మంది విద్యార్థులకు సమానం. ఇందులో దాదాపు 74 కోట్ల మంది బాలికలు ఉన్నారు.

దాదాపు 11 కోట్ల మంది బాలికలు ప్రపంచంలోనే తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో నివసిస్తున్నారు. అక్కడ విద్యను పొందడం ఇప్పటికే కష్టంగా ఉంది. ఇప్పడు కరోనా వల్ల మరింత క్లిష్టం కానుంది. చాలా దేశాలలో ప్రభుత్వాలు పాఠశాలలను నిరవధికంగా కొంతకాలం పాటు మూసివేయాలని భావిస్తుండడం ఈ సందర్భంగా ఆందోళన కలిగిస్తున్నది.

పాఠశాలలను మూసివేస్తే శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్న విద్యార్థులు, అనాథ బాలికలకు చాలా పెద్ద సమస్య అవుతుందని యునెస్కో హెచ్చరించింది. అంతేకాకుండా పేద విద్యార్థలు మళ్లీ పాఠశాలలు తెరచిన తర్వాత రావడానికి ఇష్టపడరని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఆన్ లైన్ విద్యను ప్రోత్సహించాలని పలు ప్రభుత్వాలు భావిస్తున్నా సగం మందికి పైగా విద్యార్థులకు ఇంటర్ నెట్ అందుబాటులో లేన్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అటువంటి విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

కేడీ మెడికల్ రిప్రజెంటేటివ్‌!


లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం డిమాండ్‌ను పసిగట్టిన ఓ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ ఇదే అదునుగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా మద్యం తయారు చేసేందుకు రంగంలోకి దిగాడు. మెడికల్ రీప్రజెంటేటివ్ తనకున్న పరిచయాలతో అధిక సంఖ్యలో శానిటైజర్ లను తీసుకువచ్చాడు. మరో ముగ్గురితో కలసి శానిటైజర్‌ లో ఉండే ఆల్కహాల్కు మరికొన్ని పదార్థాలు కలిపి మద్యం తయారు చేసి విక్రయించ సాగాడు.

అనంతపురంలోని కమలానగర్‌ రఘువీరా కాంప్లెక్స్‌ ప్రాంతంలో నలుగురు కల్తీ సారా విక్రయిస్తున్నారని తెలుసుకుని అధికారుల ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. ఓ వ్యక్తిని సారా కొనేందుకు పంపారు. సదరు వ్యక్తి కొనుగోలు చేస్తుండగా అధికారుల బృందం నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి.. 18 శానిటైజర్ల సీసాలు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం ఆబ్కారీశాఖ కార్యాలయంలో ఉప కమిషనర్‌ విజయశేఖర్‌ విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. మద్యం అక్రమంగా విక్రయాలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కొందరు సారా కాస్తున్నట్లు సమాచారం అందడంతో ఇప్పటికే ఇటువంటి వారిని దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు.

వైద్యులపై దాడులు జరిపితే ఏడేళ్లవరకు జైలు


కరోనా వైరస్ కట్టడికి ముందుండి ప్రశంసనీయమైన కృషి చేస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దేశంలో పలు చోట్ల దాడులు జరుగుతున్న దృష్ట్యా, వాటి కట్టడికి కేంద్ర ప్రభుత్వం నేడు కఠినమైన చట్టం తీసుకు వచ్చింది. అటువంటి దాడులు జరిపే వారికి 6 నెలల నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే విధంగా ఆర్డినెన్సు తీసుకువచ్చారు.

1897 ఎపిడ‌మిక్ డిసీజెస్ యాక్ట్‌కు స‌వ‌ర‌ణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్న‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ప్రకటించారు. డాక్ట‌ర్ల‌పై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా ప‌రిగ‌ణిస్తారు. కేవ‌లం 30 రోజుల్లోనే విచార‌ణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్య‌క్తికి మూడు నెల‌ల నుంచి అయిదేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష విధిస్తారు. నిందితుల‌కు 50వేల నుంచి 2 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా కూడా విధించ‌నున్నారు.

ఒక‌వేళ చాలా తీవ్ర‌మైన దాడి జ‌రిగితే, దానికి మ‌రో విధ‌మైన శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. దాడి తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితుల‌కు 6 నెల‌ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష అమ‌లు చేస్తారు. వారికి ల‌క్ష నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా వ‌సూల్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ తెలిపారు.

రాష్ట్ర‌ప‌తి ఆమోదం త‌ర్వాత ఆ ఆర్డినెన్స్‌ను అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. ఒక‌వేళ హాస్పిట‌ల్ వాహ‌నాలు, క్లినిక్‌ల‌కు న‌ష్టం జ‌రిగితే, అప్పుడు మార్కెట్ విలువ ప్ర‌కారం రెండింత‌ల మొత్తాన్ని వసూల్ చేయ‌నుని ప్రకటించారు.

దాడులకు నిరసనగా దేశ వ్యాప్తంగా బుధవారం నిరసన దినంగా పాటిస్తామని వైద్యులు ప్రకటించడంతో వారి ప్రతినిధులతో ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ తో కలసి హోమ్ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేటి ఉదయం సమాలోచనలు జరిపారు.

కరోనా మహమ్మారిని పారద్రోలడంలో వైద్యుల పాత్ర అమోఘమనికొనియాడుతూ వైద్య సిబ్బందిపై ఎలాంటి దాడులు జరగకుండా వారికి పూర్తి రక్షణ చర్యలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఆర్డినెన్సు రావడం గమనార్హం.

మోదీ ప్రభుత్వం డాక్టర్లకు పూర్తి అండగా ఉంటూ, రక్షణ కల్పిస్తుందని, ఎలాంటి నిరసనలకు దిగవద్దని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఎలాంటి నిరసనలకు దిగవద్దని, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ ప్రతినిధులు కూడా వైద్యులకు విజ్ఞప్తి చేశారు.

తమపై కూడా ఎలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టాల్సిందేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు షాకు తేల్చి చెప్పారు. సాక్షాత్తూ హోంమంత్రి నుంచే భరోసా రావడంతో తలపెట్టిన ఆందోళనలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెనక్కి తీసుకుంది.

మరో వైపు మధ్యప్రదేశ్, యూపీ, బిహార్, బెంగళూరులో జరిగిన దాడులను సోషల్ మీడియాలో డాక్టర్ల బృందం మరోసారి విడుదల చేసింది. రోజురోజుకీ కరోనా వైద్యం చేస్తున్న సమయంలో తమపై దాడులు పెరిగిపోతున్నాయంటూ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓ చట్టాన్ని కూడా తీసుకుని రావాలని లేదంటే తాము బ్లాక్ డే పాటిస్తామని వైద్యులు హెచ్చరించిన విషయం తెలిసిందే.

వైసీపీ రంగు పడుతూనే ఉంది!


ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఇప్పటికే తీవ్రంగా తప్పుబట్టింది. పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాలు గడువు కోరింది. హైకోర్టు ఇందుకు అంగీకరించింది. రంగులు తొలగించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వేళ్ళవద్దని సూచించింది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో భయం విలవిల లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం మాత్రం హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ భవనాలకు రంగులమయం చేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమల్లెపాడు పంచాయతీ భవనానికి వైకాపా రంగులు వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదేవిధంగా విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ భవనానికి వైసిపి నాయకులు, అధికారులు పూర్తిగా వైసిపి రంగులు అద్దారు. దీనిని స్థానికంగా ఉన్న గిరిజునులైన గ్రామస్తులు అడ్డుకోవడంతో రంగులు వేస్తున్న సిబ్బంది వెయ్యకుండానే వెనుతిరిగారు. గిరిజన గ్రామమైన మూలబొడ్డవరలో గత ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం నిర్మాణం జరిగింది. ఆ భవనాన్ని ఆనుకొని సుజల స్రవంతి పథకం ఉంది. ఈ రెండింటికి వైసీపీ రంగులు వేస్తున్నారు.

క్వారంటైన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం!

తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు ప్రస్తుతం 14 రోజులు ఉండగా, దానిని 28 రోజులకు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా.. కేవలం ప్రైమరీ కాంటాక్టులపై కోవిద్-19 టెస్ట్ చేయాలని అధికారులకు సూచించింది. తాజాగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరింది.

భారత్ లోని కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. క్వారంటైన్ పీరియడ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో కరోనా లక్షణాలు బయటపడటానికి 14 నుంచి 28 రోజుల సమయం పడుతుంది. దింతో చాలా రాష్ట్రాలు క్వారంటైన్ పీరియడ్ ని 28 రోజులకు పొడిగించనున్నాయి.

వైరస్ సోకిన వారిలో వ్యాధి లక్షణాలు కనిపించడానికి 14 రోజులకంటే ఎక్కువ సమయం పడుతుందని ఐసీఎంఆర్ నిర్ధారించింది. దాదాపు 250 పట్టణాల్లో ఓ అధ్యయనం చేసి, వైరస్ సోకినవారిలో 70 శాతం మందికి 10 నుంచి 18 రోజుల తర్వాతే లక్షణాలు కనబడుతున్నాయని తేల్చింది. కొందరు పేషెంట్లలో 17 22 31 35 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతున్నాయని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది.

తెలుగు రాష్ట్రాలకు ‘తళపతి విజయ్’ భారీ విరాళం

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. కరోనా మహమ్మరిపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా తగ్గముఖం పట్టడంలేదు. మరోవైపు లాక్డౌన్ అమలుతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనాపై వైద్యులు, పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈమేరకు కరోనాపై పోరాటం పలువురు సెలబ్రెటీలు తమవంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబెట్రీలు పెద్దసంఖ్యలో విరాళాలు ప్రకటించగా తాజాగా తమిళ స్టార్ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ పీఎం సహాయనిధితోపాటు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి రూ.1.30కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

ప్రధానమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు, తమిళనాడు సీఎం సహాయనిధికి రూ.50లక్షలు, కేరళ సీఎం సహాయనిధికి రూ.10లక్షలు, తెలంగాణ, ఆంధప్రదేశ్, కర్ణాటక, పూదిచ్చేరి రాష్ట్రాల సీఎం సహాయనిధికి రూ.5లక్షల చొప్పున, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాకు రూ.25లక్షల విరాళాన్ని ఇళయ దళపతి విజయ్ ప్రకటించాడు. మొత్తంగా తమిళనాడుపాటు దక్షిణాది రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు విజయ్ విరాళం ప్రకటించడం చర్చనీయాంశం మారింది.

తాజాగా విజయ్ హీరోగా నటించిన ‘మాస్టర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. దేశంలో కరోనా ఎఫెక్ట్ లేనట్లయితే ఈపాటికే ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేది. కాగా లాక్డౌన్ ముగిశాక జూలైలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ‘మాస్టర్’ చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. అయితే కరోనా అనంతరం సినిమా షూటింగ్ ప్రారంభమైనా.. థియేటర్లకు ఎప్పుడు అనుమతిస్తారో తెలియడం లేదు. దీంతో ఈ మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అవడం కష్టంగానే కన్పిస్తుంది. భవిష్యత్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!