Home Blog Page 8521

ఏపీలో ర్యాపిడ్ టెస్ట్ లకు ఫుల్ స్టాప్!


ఆంద్రప్రదేశ్ లో అధికార పక్షానికి, విపక్షాలకు మధ్య రాజకీయ వేడి రాజేసిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు ఇప్పుడు అన్ని జిలా కేంద్రాలకు చేరాయి. ఏ రోజు నుంచి అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. నిన్న రాత్రి ఐ.సి.ఎం.ఆర్ నుండి రెండు రోజులు రాపిడ్ టెస్ట్ లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ర్యాపిడ్ టెస్టులు నిలిచిపోయాయి. దీంతో బుధ, గురు వారాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయిందని గుంటూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు.

ర్యాపిడ్ టెస్టుల ఫలితాలు 5.4 శాతం మాత్రమే ఖచ్చితత్వం వస్తోందని రాజస్థాన్ రాష్ట్రం ఐ.సి.ఎం.ఆర్ దృష్టికి తెచ్చింది. దేశంలోనే కరోనా అనుమానితులకు అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్టంగా రాజస్థాన్ గుర్తింపు పొందింది. ఛత్తీస్ ఘడ్ కూడా ర్యాపిడ్ టెస్టుల పనితీరు సక్రమంగా లేదనే విషయాన్ని వెల్లడించింది. ఐ.సి.ఎం.ఆర్ తదుపరి ఆదేశాలు, టెస్ట్ ల మార్గదర్శకాలు ఇచ్చే వరకూ రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు వినియోగించే అవకాశం కనిపించడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ కొరియా సంస్థ నుంచి 10 లక్షల కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో కిట్ కు ప్రభుత్వం రూ.730 లకు చెల్లిస్తోంది. తొలివిడతగా కేవలం లక్ష కిట్ లు మాత్రమే రాష్ట్రానికి చేరుకున్నాయి. మరో 9 లక్షల టెస్ట్ కిట్ లు భవితవ్యం ఇప్పుడు అర్థం కాకుండా పోయింది. ఒకవైపు రూ. 337 కిట్ ను రూ.730 కొని కుంభకోణానికి పాల్పడ్డారని రాజకీయంగా విమర్శలు వస్తుంటే..రూ.337 లకే కొనుగోలు చేస్తామని ఒప్పడంలో ఆ షరతు ఉందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించారు. మరోవైపు ఈ కిట్ ల పనితీరు సక్రమంగా లేదని ఐ.సి.ఎం.ఆర్ ఈ కిట్ లతో పరీక్షలు 48 గంటలు నిలిపివేయాలని కోరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఏదేమైనా రాష్ట్రంలో ప్రస్తుతానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో కరోనా అనుమానితులకు పరీక్షలు నిలిపివేశారు.

సూర్యాపేటపై సీఎం స్పెషల్ ఫోకస్


తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో ఇప్పటివరకు 928కరోనా కేసులు నమోదుకాగా 190మంది కోలుకున్నారు. 23కరోనాతో మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్, సూర్యపేటలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. మంగళవారం రాష్ట్రంలో 56 కొత్త కేసులు నమోదుకాగా ఒక్క సూర్యాపేటలోనే 26నమోదు కావడం గమనార్హం. హైదరాబాద్ తర్వాత స్థానంతో సూర్యపేట జిల్లా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం ఆదేశాలతో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూర్యాపేట జిల్లాలో బుధవారం పర్యటించారు.

జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదైన సూర్యాపేట కూరగాయాల మార్కెట్‌ను వారు సందర్శించారు. కరోనా వైరస్ కట్టడికి అధికారులు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సూర్యాపేటలో సిబ్బంది ఇప్పటివరకు కరోనా నియంత్రణ చర్యలు బాగా చేపట్టారన్నారు. సిబ్బందికి తాము మరింత సహకారం అందించేందుకు తాము జిల్లాలో పర్యటించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.

సూర్యాపేటది ఓ స్పెషల్ కేసని.. ఇక్కడ ఒక్కరి నుంచి చాలామందికి వ్యాపించిందని డీజీపీ తెలిపారు. అధికారులకు ధైర్యం కల్పించేందుకు తాము వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సూర్యాపేట పర్యటన తర్వాతం వారంతా జోగులాంబ గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లోని హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయాలేనా?: పవన్


ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ అధికార పార్టీ నేతలు రాజకీయాలు చేస్తుండటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైరవుతోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిందిపోయే ఏపీలో మాత్రం రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు మానుకోకపోతే ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజలను సాయం చేయాలని బుధవారం ఆయన ఓ ప్రకటనలో హితవు పలికారు.

కరోనాతో అగ్రరాజ్యాలు సైతం బెంబెలెత్తిపోతున్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతోందన్నారు. ఈ పరిణామాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతీఒక్కరిపై ప్రభావం చూపనుందన్నారు. దీని వల్ల దేశంలో లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో ఉంటూ ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. రైతులు పంటను అమ్ముకోలేక పోతున్నారని అన్నారు. దీంతో పంటను చెత్తకుప్పల్లో పోస్తున్నారని అన్నారు.

కరోనా ఆంధ్రప్రదేశ్‌ను సైతం వదలడం లేదన్నారు. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ అధికార పార్టీ నాయకులు రాజకీయాలకు పాల్పడుతుండటం హేయమన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సమయంలో రాజకీయాలకు పాల్పడుతుంటంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత రెండు మూడురోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగమేనని అన్నారు. ఆయనపై జరుగుతున్న వ్యక్తిగత దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండిచాలని కోరారు. దేశం, రాష్ట్రం నుంచి కరోనాను తరిమేంత వరకు రాజకీయాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని’ జనసేనాని పిలుపునిచ్చారు. పవన్ యాక్షన్ పై వైసీపీ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..!

కాలం మారింది..14రోజుల క్వారంటైన్ సరిపోదు!


దేశంలో కరోనా విస్తరిస్తున్న వేళ వైరస్ పై పరిశోధనలు కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే మరో కొత్త వార్త తెర పైకి వచ్చింది. ఇప్పటి వరకు కోవిద్19 వ్యాధిని గుర్తించడానికి 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ సరిపోయేది. కానీ తాజాగా కొన్ని కేసులను అధ్యాయనం చేయగా ఈ 14 రోజుల ఇంక్యుబేషన్ పీరియడ్ సరిపోవడం లేదు. కొందరిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు 14 నుంచి 28 రోజుల మధ్య బయటపడుతున్నాయి. దీనివల్ల కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడమాలజిస్ట్ కు చెందిన డాక్టర్ నవీన్ వెల్లడించారు. చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య హఠాత్తుగా పెరగడానికి ఇదే ముఖ్య కారణం అని డాక్టర్ నవీన్ తెలిపారు. చాలా రాష్ట్రాల్లో రెండుసార్లు మాత్రమే పరీక్షలు చేసి కరోనా ఉందొ లేదో నిర్దారిస్తున్నారని అనుమానితులకు నెలలో మూడుసార్లు పరీక్షలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని వివిధ రాష్ట్రాలకు తెలియజేశామని.. దీంతో కొన్ని రాష్ట్రాలు ఐసోలేషన్ కాలాన్ని 14 నుంచి 28కి పెంచాయని డాక్టర్ నవీన్ వివరించారు.

ఐసీఎంఆర్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. దాదాపు 250 పట్టణాల్లో ఓ అధ్యయనం చేసి, వైరస్ సోకినవారిలో 70 శాతం మందికి 10 నుంచి 18 రోజుల తర్వాతే లక్షణాలు కనబడుతున్నాయని తేల్చింది. కొందరు పేషెంట్లలో 17 22 31 35 రోజుల తర్వాత కూడా లక్షణాలు బయటపడుతున్నాయని మరికొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఈ విషయంలో కేరళ ముందు చూపు!

దేశంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదయ్యింది కేరళలోనే, మొదట్నుంచే కేరళ ఈ క్వారంటైన్ పీరియడ్ విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టిందనే చెప్పవొచ్చు. జనవరి చివరి వారం నుంచే ఆ రాష్ట్రంలో క్వారంటైన్ పీరియడ్ 28గా ఉండటం గమనార్హం. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఆ రాష్ట్రంలో చాలామందికి కరోనా లక్షణాలు 20 తరువాతనే బయటపడుతున్నాయి. కేరళలోని కన్నూర్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి దుబాయ్ నుంచి మనదేశానికి మార్చి 17న వచ్చాడు. 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉన్నాడు. కానీ.. 26 రోజుల తర్వాత అతడికి వైరస్ పాజిటివ్ వచ్చింది. అలాగే.. మార్చి 15న యూఏఈ నుంచి వచ్చిన 11 ఏళ్ల బాలుడికి.. ఏప్రిల్ 8న అంటే అక్కణ్నుంచి వచ్చిన 24వ రోజున పాజిటివ్ వచ్చింది. కేరళలో ఏకంగా 22 మందికి వైరస్ సోకిన 20 రోజుల తర్వాతే లక్షణాలు బయటపడ్డాయి.

కపిల్ దేవ్ న్యూ లుక్.. అదిరిపోయింది..


దేశంలో కరోనా ఎంట్రీతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లతోపాటు క్రీడలు వాయిదాపడింది. దీంతో సినీ, క్రికెటర్లకు బోలెడంతా సమయం దొరికినట్లయింది. సెలబ్రెటీలు సోషల్ మీడియాలో లాక్డౌన్ సమయంలో తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వినియోగించుకుంటున్నారు. తాజాగా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ లాక్డౌన్ సమయాన్ని తన మేక్ ఓవర్ కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ఒకప్పటి కపిల్ దేవ్ కు ప్రస్తుతం ఉన్న కపిల్ దేవ్ పూర్తిగా భిన్నంగా మారిపోయాడు.

కపిల్ దేవ్ అనగానే ముందుగా తన ఉంగాల జట్టు గుర్తొస్తుంది. 1983లో టీమిండియా కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి వరల్డ్ కప్ గెలుచుకుంది. నాటి నుంచి ఇప్పటివరకు కపిల్ దేవ్ ఒకే హెయిల్ స్టైల్ మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా కపిల్ దేవ్ కొత్త లుక్కులో దర్శనమిచ్చారు. పూర్తిగా గుండు గీయించుకొని గడ్డంతో మాత్రమే కన్పించాడు. బ్లాక్ సూట్ ధరించి కొత్త లుక్కులో ఉన్న ఫొటోలను కపిల్ దేవ్ తన స్నేహితుడు చేతన్ శర్మ, అభిమానులతో పంచుకున్నాడు.

దీనిపై చేతన్ శర్మ స్పందిస్తూ కపిల్ దేవ్ లుక్కు అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు. కపిల్ లుక్ చూసిన అభిమానులు మాత్రం క్రికెట్ దిగ్గజం రిచర్డ్ తో కపిల్ ను పోలుస్తున్నారు. అంతేకాదు రిచర్డ్ బయోగ్రఫీలో నటిస్తున్నారా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. కపిల్ దేవ్ న్యూ లుక్ సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టెస్ట్ కిట్లపై దుమారం…జగన్ కి అర్థమైందా?

కరోనా వైరస్ ని గుర్తించే ర్యాపిడ్ టెస్ట్ కిట్లపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈ చర్చ మరింతగా పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల అనుభవాల నుండి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పాఠాలు లేకపోలేదు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో నాణ్యత కొరవడిందా? లేక, దక్షిణ కొరియా సంస్థ పంపిన కిట్స్ బాక్స్ లలో సంఖ్యా తక్కువగా ఉందా? అనేదే.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని వేధిస్తున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే, కిట్ల నాణ్యత విషయంలో రాజస్థాన్ పిర్యాదు చేయగా, పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి పంపిన కిట్స్ బాక్స్ లలో, కిట్స్ సంఖ్య తక్కువగా ఉండటంపై కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తునకు దిగటంతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా డైలమాలో పడింది.

కిట్ల సంఖ్య, నాణ్యత లేమితో రాజస్థాన్ ప్రభుత్వం దక్షిణా కొరియా సంస్థకు తెలియచేసింది. ఇప్పుడు ఏపీ కూడా అదే తరహాలో తన అభ్యంతరాన్ని దక్షిణ కొరియాకు తెలియచేయాల్సి ఉంటుంది. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాల అనుభవాల నుంచి ఏపీ ఇప్పుడు గుణపాఠం నేర్చుకోవాలన్న మాట.

ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌భుత్వం ఒక్కోటి రూ.337 రూపాయ‌ల‌కే కొన్న కిట్ల‌ను ఏపీ స‌ర్కారు రూ.700 చొప్పున‌ పెట్టి కొన‌డంపై దుమారం రేగింది. చివ‌రికి రేటు త‌గ్గించే ప్ర‌భుత్వానికి అంద‌జేసేందుకు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన కంపెనీ అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. ఐతే ఈ వ్య‌వ‌హారం ఇంత‌టితో స‌ద్దుమ‌ణిగిందిలే అనుకుంటే.. ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల నాణ్య‌త‌పై సందేహాలు వ్య‌క్తం చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ‌ రెండు రోజుల పాటు వాటి వినియోగాన్ని ఆపేయాల‌ని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ప‌ది నుంచి 30 నిమిషాల లోపే ఫ‌లితాలు వెల్ల‌డిస్తాయ‌ని అంటున్నారు. ఐతే వీటి ఫ‌లితాల్లో క‌చ్చిత‌త్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. ఈ కిట్లు త‌యారైన కొరియాలోనే వీటి నాణ్య‌త మీద సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అక్క‌డి వైద్యులు ఈ కిట్ల‌ను ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని సూచించారు. అయినా స‌రే.. ఏపీ స‌హా కొన్ని రాష్ట్రాలు ఆ కిట్ల‌ను తెప్పించుకున్నాయి. ఐతే ఈ కిట్ల ప‌నితీరును ప‌రిశీలిస్తే క‌చ్చిత‌మైన ఫ‌లితాలు రావ‌ట్లేద‌ని వెల్ల‌డైంద‌ని.. ఫలితాల్లో తేడా ఉంటోంద‌ని.. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల పాటు ఈ కిట్ల విని‌యోగం ఆపాల‌ని.. త‌దుప‌రి మార్గ‌ద‌ర్శ‌కాలు వ‌చ్చే వ‌ర‌కు ఎదురు చూడాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌తినిధి మీడియా స‌మ‌వేశంలో తెలిపారు. మ‌రి ల‌క్ష ర్యాపిడ్ కిట్లు తెప్పించుకొని టెస్టింగ్స్ సంఖ్య ఒక్క‌సారిగే పెంచేద్దాం అనుకున్న ఏపీ స‌ర్కారుకు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. ఈ అంశంపై జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. వేచి చూడాలి.

లాక్ డౌన్ లో అత్తారింటికి వెళ్లిన ఎస్సై.. ఆ తర్వాత ఏమైందంటే!


దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికైతే పోలీసులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.. అయితే ఓ ఎస్సై చేసిన పని ఉన్నతాధికారులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. కరోనా పోరాటంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా అత్తగారింటికి వెళ్లాడు. రెండ్రోరోజులు అక్కడే ఉండి తిరిగొచ్చి విధులు నిర్వహించిన విషయం తెలియడంతో పోలీసులు ఎస్సై కుటుంబాన్ని, అతడి అత్తగారి కుటుంబాన్ని ముందుజాగ్రత్తగా క్వారంటైన్ కు తరలించారు.

పశ్చిమ గోదావరి జిల్లా జీలుమిల్లి ఎస్సై సాధిక్ భార్య ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీంతో అతడు తన తల్లిదండ్రులతో కలిసి తన భార్యను చూడటానికి తెలంగాణలోని సత్తుపల్లికి వెళ్లాడు. అత్తగారింట్లో రెండ్రోజులు ఉండి తిరిగి పశ్చిమ గోదావరికి చేరుకున్నారు. సరిహద్దు దాటి వెళ్లిన విషయం అధికారులతో తెలిసింది. దీంతో ఎస్సై కి వైద్యులతో పరీక్షలు నిర్వహించి క్వారంట్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఎస్సైతోపాటు అతడి కుటుంబాన్ని, అత్తగారి కుటుంబాన్ని క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అలాగే తెలంగాణలో ఒకరిద్దరు కానిస్టేబుళ్లు క్వారంటైన్లో ఉన్నారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తే సామాన్యులను కఠినంగా శిక్షిస్తున్న పోలీసులకు లాక్డౌన్ నిబంధనలు వర్తించావా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

వైరల్ అవుతున్న ప్రియాంక చొప్రా డాన్స్.. ఎందుకంటే?


బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్టైలే సపరేట్. తన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను ప్రియాంక చోప్రా తనవైపు తిప్పుకుంది. నటనతోపాటు గ్లామర్ తో కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. బాలీవుడ్లో రాణిస్తూనే హాలీవుడ్ సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో బోల్డ్ సీన్లకు ఏమాత్రం వెనుకడానికి ప్రియాంక హాలీవుడ్లో అదే రేంజ్లో రెచ్చిపోయింది. ప్రియాంక గ్లామర్ కు హాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అవడంతో ఏకంగా యూనివర్సల్ స్టార్ గా మారిపోయింది ప్రియాంక చొప్రా.

భారత వైద్యురాలికి అమెరికా సెల్యూట్..

ఇటీవల అమెరికా పాప్ సింగర్ నిక్ జోసన్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. తమ అన్యొన్యతకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. అమెరికాలో స్థిరపడిన ప్రియాంక అప్పుడప్పుడు ఇండియాకు చుట్టపు చూపుగా వస్తూ పోతుంది. ఇదిలా ఉంటే ప్రియాంక చొప్రా పూర్తిగా హాలీవుడ్ స్టైల్ అలవర్చుకున్నట్లు కన్పిస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆమె బ్రా వేసుకోకుండా ఎద అందాలు కనిపించేలా పార్టీలో డాన్స్ చేసింది. ఇంకేముంది.. ఈ వీడియోను కుర్రకారు షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారుతోంది. కాగా కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. పార్టీకి వెళ్లినప్పుడు కనీసం బ్రా వేసుకొవచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/p/B_OytPfn-sU/

కన్నపై ఆరోపణలు చేస్తుంటే బీజేపీ నేతల మౌనం


బిజెపి రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కడుగా రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వ అక్రమాలను, కరోనా వైరస్ కట్టడిలో వైఫల్యాలను ఎండగడుతూ ఉంటె సహించలేక వైసిపి నేతలు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతలు మౌనంగా ఉండటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.

చంద్రబాబునాయుడు వద్ద రూ 20 కోట్లు తీసుకొని వైసిపి ప్రభుత్వంపై కన్నా విమర్శలు చేస్తున్నారని, బిజెపి విధానానికి భిన్నంగా సొంత ప్రయోజనాలకోసం చేస్తున్నారని విజయసాయిరెడ్డి వంటి వారు పదే పదే ఆరోపణలు చేస్తుంటే బీజేపీ ప్రముఖులు ఎవ్వరు మాట్లాడక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

వారంతా విజయసాయిరెడ్డి ప్రలోభాలకు లొంగి, కన్నాను ఒంటరి వారు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చివరకు ఆయన కార్యవర్గంలో కీలకమైన ప్రధాన కార్యదర్శులుగా ఉన్న నలుగురు సహితం మౌనం వహిస్తున్నారు.

కన్నాకు బిజెపితో సంబంధం లేదన్నట్లు వైసిపి నాయకులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా బీజేపీ నాయకులు వ్యవహరిస్తుండటం గమనార్హం. పార్టీ ఎమ్యెల్సీ సోము వీర్రాజు ఒక ప్రకటన చేస్తినా “మీరా విధంగా ఆరోపణలు చేయడం బాగోలేదు” అంటూ విజయసాయిరెడ్డిని బ్రతిమిలాడుతున్నట్లు వ్యవహరించారు గాని “మా పార్టీ అధ్యక్షుడిని అంతమాట అంటారా” అంటూ ఆగ్రహం వ్యక్తం చేయలేదు.

మరో ఎమ్యెల్సీ పివి మాధవ్ ఈ రోజులలో ఏమయ్యారో తెలియడం లేదు. ఇక కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న డి పురందేశ్వరి తన పేరును కూడా కలపడంతో కేవలం “మా పార్టీ అంతర్గత వ్యవహారాలు మీకెందుకు” అన్నట్లు మాటవరసకు అన్నారు. రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న సునీల్ దేవధర్ సహితం వైసిపి నేతలకు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లు మొక్కుబడి ప్రకటన చేశారు.

ఇక జగన్ ప్రభుత్వాన్ని ఏమైనా అంటే అంతెత్తున లేచే పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ఎక్కడున్నారో అసలు కనిపించడం లేదు. కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ఏకైక నేత జి కిషన్ రెడ్డి సహితం తమ పార్టీ అధ్యక్షుడిపై అనుచిత ఆరోపణలు చేస్తుంటే నోరు విప్పడం లేదు. ఆయనకు సహితం వైసిపి నేతలను ఇరకాటంలో పెట్టడం ఇష్టంగా ఉన్నట్లు లేదు.

నిత్యం వార్తలలో కనిపించే యువమోర్చ, మహిళామోర్చా, ఎస్సి మోర్చా అద్యక్షులు సహితం మౌనవ్రతం పాటిస్తున్నారు. వీరంతా కన్నాకు మద్దతు ఇస్తే వైసిపి నేతలకు ఎక్కడ ఆగ్రహం కలిగించినట్లు అవుతుందో అని వెనుకడుగు వేస్తున్నారా?

బీజేపీలో చౌహన్ – సింధియా కుమ్ములాట


భారత దేశంలో మంత్రివర్గం అంటూ లేకుండా ఒక్కడిగానే ప్రభుత్వం సుదీర్ఘకాలం నడిపి రికార్డు సృష్టించిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చివరకు నాలుగోసారి పదవి చేపట్టిన 29 రోజులకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు.

లాక్ డౌన్ కు రెండు రోజుల ముందే సీఎం పదవి చేపట్టిన ఆయన కీలకమైన ఇటువంటి సమయంలో ఒక్క మంత్రి కూడా లేకుండా, కనీసం ఆరోగ్య మంత్రి కూడా లేకుండా ఒంటరిగా పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండడంతో విమర్శలకు గురికావలసి వచ్చింది.

గతంలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన బిఎస్ యడ్డియూరప్ప కర్ణాటకలో 26 రోజులపాటు మంత్రివర్గం లేకుండా ముఖ్యమంత్రి పదవిలో ఉండి రికార్డు సృష్టింస్తే, ఇప్పుడు చౌహన్ 29 రోజులపాటు ఉండి ఆ రికార్డును బద్దలు చేశారు. మొదట్లోనే మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి చౌహన్ ప్రయత్నం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి, బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకు కారణమైన 19 మంది ఎమ్యెల్యేలతో వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా కోర్కెలకు తలవంచలేక జాప్యం చేస్తూ వచ్చారు.

కమలనాథ్ మంత్రివర్గంలో ఉన్న తన మద్దతుదారులైన ఏడుగురికి కూడా మొదటే మంత్రి పదవులు ఇవ్వాలని, అందుకోసం 16 నుండి 22 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేయమని సింధియా చెబుతూ వచ్చారు. మొదటినే కాంగ్రెస్ ఫిరాయింపుదారులు అందరికి పదవులిస్తే మంత్రిపదవులు ఆశిస్తున్న బీజేపీ వర్గాలలో అసంతృప్తి ఏర్పడుతుందని, మొదటగా 5 నుండి 7 మందితో మంత్రివర్గ ఏర్పాటు చేద్దామని చౌహన్ ప్రతిపాదించారు. చివరకు ఆ విధంగానే ఇదు మందితో మంత్రివర్గం విస్తరించారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని సంకేతం ఇచ్చారు.

ఐదుగురిలో ఇద్దరు కాంగ్రెస్ వారున్నా సింధియాకు ప్రాబల్యం గల గ్వాలియర్ – చంబల్ ప్రాంతంలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. అదే విధంగా బీజేపీలోని తన ప్రత్యర్థులకు సహితం మంత్రిపదవులు దక్కకుండా చౌహన్ జాగ్రత్త పడ్డారు. 1984 నుండి ఎమ్యెల్యేగా గెలుస్తూ, మొన్నటి వరకు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గోపాల్ భార్గవకు కూడా మంత్రిపదవి దక్కలేదు. చౌహన్ ను సీఎంగా మార్చవలసి వస్తే భార్గవను ఆ పదవిలోకి తీసుకు రావాలని మోదీ – అమిత్ షా భావిస్తూ ఉండడమే అందుకు కారణంగా కనిపిస్తున్నది.

ఈ మంత్రివర్గ విస్తరణతో సింధియా మద్దతుదారులు పెదవి విరుస్తున్నారు. “మహారాజ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం పడగొట్టడానికి ఉపయోగించుకున్న బీజేపీ ఇప్పుడు మొండిచెయ్యి చూపిస్తున్నది” అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో చేరిక కొన్ని గంటలకే రాజ్యసభ సభ్యత్వం పొందిన సింధియా కేంద్ర మంత్రి పదవి కోసం ఎదురు చూస్తూ ఉండడంతో రాష్ట్రంలో మంత్రిపదవులు కోసం ఎక్కువగా పట్టు బట్టలేక పోతున్నారని వారు అసంతృత్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా ఈ మంత్రివర్గ విస్తరణ మధ్యప్రదేశ్ బీజేపీలో మరిన్ని కుమ్ములాటలకు, మరింత అసంతృత్తికి దోహదపడే విధంగా ఉన్నట్లు చెప్పవచ్చు.

ఇమ్మిగ్రేషన్ రూల్స్ పై ట్రంప్ క్లారిటీ!


అమెరికాలోకి ఇమ్మిగ్రేషన్ గ్రీన్ కార్డుల ను రద్దు చేయడం పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. వీసాలను రెండు నెలలపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

తాజా ఉత్తర్వులు అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే వారిని మాత్రమే అడ్డుకుంటుందని, కానీ తాత్కాలిక ఉద్యోగుల్ని నిలువరించదని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రకటన వల్ల అమెరికాలో శాశ్వతంగా ఉండాలనుకునే వారు (గ్రీన్ కార్డు దారులు) ఇబ్బందుల్లో పడినట్లే… ట్రంప్ రూల్ అమల్లోకి రాగానే… వారు 60 రోజులపాటూ శాశ్వతంగా ఉండేందుకు అప్లై చేసుకోవడానికి వీలుండదు. 60 రోజుల తర్వాత ట్రంప్… ఆ నిషేధం కొనసాగిస్తారో లేక ఎత్తేస్తారో తెలియదు. అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న టైం. ఈ సమయంలో… స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కొత్త రూల్ తేబోతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 819164కి చేరడం, మృతుల సంఖ్య 45వేలు దాటేయడంతో… ఈ కరోనాను ఎలా కంట్రోల్ చెయ్యాలన్నది అమెరికాకు పెద్ద తలనొప్పిగా సవాలుగా మారింది. ఐతే… అమెరికాలో వైద్య సేవల్లో పాల్గొంటున్న వారిలో విదేశీ వలసదారులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందువల్ల ట్రంప్… తన కొత్త రూల్ ‌లో వాళ్లకు మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆహార సరఫరాదారులపై కొత్త రూల్ ప్రభావం చూపదని తెలుస్తోంది.

తెలుగు ముఖ్యమంత్రులు క్వారంటైన్ లో ఉన్నారా!


రాజకీయంగా ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ కరోనాను కట్టడి చేసే విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆయన వలే వీరిద్దరూ కూడా గత నెలన్నర రోజులుగా దాదాపు తమ అధికార అనివాసాలకే పరిమితమై ఉంటున్నారు.

ప్రస్తుత సంక్షోభ సమయంలో తమ అధికార నివాసాలను దాటి బైటకు వచ్చిన్నట్లు ఎక్కడ కనబడటం లేదు. దానితో వారిద్దరూ స్వీయ నిర్బంధంలో ఉన్నారా అంటూ ప్రతిపక్ష నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలతో సహా అన్ని అధికార సమీక్షలను అధికార నివాసంలోనే జరుపుతున్నారు.

అయితే వారికి, ప్రధాన మంత్రి మోదీకి ఒక్క విషయంలో విబేధం కనిపిస్తున్నది. తెలుగు ముఖ్యమంత్రులు అవసరమైనప్పుడు మంత్రులను, అధికారులను, ఇతరులను కలిసి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కువగా సోషల్ మీడియా సందేశాలను, వీడియో కాన్ఫరెన్స్ లకు ప్రధాని పరిమితం అవుతున్నారు.

అయితే దేశంలో పలువురు ముఖ్యమంత్రులు కరోనా మహమ్మారిని లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నారు. అధికార యంత్రాంగానికి, ప్రజలకు భరోసా కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. 77 ఏళ్ళ వయస్సులో కూడా కర్ణాటక ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డియూరప్ప తిరుగుతున్నారు. 65 ఏళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ మంగళవారం కలకత్తా వీధులలో తిరుగుతూ, కారులో నుండే ప్రజలు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు సహితం క్షేత్రస్దాయిలో కనిపిస్తున్నారు. ఉత్తరాదిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహితం ప్రజలకు దూరం కావడం కాకుండా క్రియాశీలకంగా తిరుగుతున్నారు. రాజస్థాన్, ఢిల్లీ, మేఘాలయ ముఖ్యమంత్రులు సహితం అధికార నివాసాలకు పరిమితం కావడం లేదు.

దేశంలో యువకుడైన ముఖ్యమంత్రిగా పేరొందిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం కావడంతో ‘మిస్సింగ్ ముఖ్యమంత్రి’ అంటూ కొందరు టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు మొదటినుండి అధికార నివాసానికి ఎక్కువగా పరిమితమవుతున్నా పాలనా యంత్రాంగంపై పర్యవేక్షణ చేస్తుండటం తెలిసిందే.

వకీల్ సాబ్ చిత్రంలో పవన్ ఎంట్రీ అదిరిపోద్ది

pawan


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ యొక్క షూటింగ్ ఫినిషింగ్ దశలో ఉంది. అమితాబ్ బచ్చన్ , తాప్సి కీలక పాత్రల్లో నటించిన హిందీ హిట్ మూవీ ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. హిందీలో ఒక క్లాసిక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కొన్ని మార్పులు చేశారని తెలుస్తోంది. వెరసి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మారి పోయింది .. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడంతో, ఈ సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ సీన్ చాలా ప్రాముఖ్యతని సంతరించు కొంది.. దాంతో దర్శక , నిర్మాతలు ఆ దిశగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది .

భారత వైద్యురాలికి అమెరికా సెల్యూట్..

కాగా ” వకీల్ సాబ్ ” చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ .. ఒక భారీ యాక్షన్ సీన్ తో ఉంటుందని తెలుస్తోంది పవర్ స్టార్ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఈ యాక్షన్ సీన్ ను డిజైన్ చేయించారని కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ సీన్ ఉంటుందని కూడా తెలుస్తోంది . ముందుగా ఈ సినిమాను మే 15వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఆగస్టుకు నెలలో విడుదల అయ్యేలా చిత్రాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా యొక్క మూల కథ సోషల్ ప్రాబ్లమ్ తో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆగస్టు నెల విడుదల కరెక్ట్ అను కొంటున్నారు దర్శక నిర్మాతలు .

రాజధానిలో పులి సంచారం.. నిజమెంత?

పుష్ప చిత్రంలో నాది కెరీర్ బెస్ట్ పాత్ర: రష్మిక మందన్న


ఆల వైకుంఠపురం లో చిత్రం తరవాత భారీగా పెరిగిన ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేలా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథ మొత్తం నడుస్తుంది. ఈ సినిమాలో కలప అక్రమ రవాణా చేసే లారీ డ్రైవర్ గా, మాఫియా డాన్ గా రెండు విభిన్న గెటప్ లలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఆద్యంతం అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న నటిస్తోంది.

భారత వైద్యురాలికి అమెరికా సెల్యూట్..

తాజాగా ఈ సినిమాను గురించి రష్మిక మందన్న మాట్లాడుతూ .. ‘పుష్ప’ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది .. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది.. నటన పరంగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. కెరీర్ ఆరంభం లోనే ఇంతటి డెప్త్ ఉన్న పాత్రను చేస్తానని నేను అసలు కలలో కూడా ఊహించలేదు అని ఎమోషనల్ గా చెప్పిందట.

మళ్ళీ మొదటికి వచ్చిన రానా సినిమా


లీడర్ చిత్రం తో సినీ రంగానికి పరిచయం కాబడ్డ దగ్గుబాటి రానా సోలో హీరోగా ఇంతవరకు సక్సెస్ దక్కించు కోలేదు బాహుబలి విజయం కూడా టీం కి వెళ్ళిపోయింది . ఆ క్రమంలో ఇపుడు చేస్తున్న సినిమాలు రానాకీ చాలా ముఖ్యం గా మారాయి. ప్రస్తుతం రానా చేస్తున్న విరాట పర్వం , అరణ్య లాంటి సినిమాలు హిట్ అవ్వచ్చు గాని బాహుబలి ద్వారా సంపాదించుకొన్న పాన్ ఇండియా పాపులారిటీ కి మ్యాచ్ అవ్వవు .

అందుకే రానా తండ్రి సురేష్ బాబు తనయుడు రానా నటుడిగా పేరు తెచ్చుకుని దేశ వ్యాప్తంగా పాపులర్ అవ్వాలన్న ఉద్దేశం తో ఒక భారీ బడ్జట్ సినిమా చేయాలను కొన్నాడు. ఆ క్రమంలో సురేష్ బాబు. పాన్ ఇండియా మూవీగా “ హిరణ్య కశ్యప “ సినిమా తీయాలని అనుకొంటున్నాడు .

రుద్రమదేవి ఫేమ్ గుణశేఖర్ ఈ `హిరణ్య కశ్యప ` కథ మీదే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాడు. దర్శక నిర్మాతలు ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించాలి అనుకొంటున్నారు. . ఆమధ్య రానా ఆరోగ్య కారణాల వల్ల ఈ `హిరణ్య కశ్యప ` చిత్రం మొదలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ రానా హెల్తీ గా ఉండడంతో ` హిరణ్య కశ్యప ` సినిమా చేయడానికి ఇదే తగిన సమయం అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో వచ్చిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా సురేష్ బాబు చాలా నష్టపోతున్నసమయం లో అంత భారీ బడ్జట్ సినిమా తలపెట్టడం మంచిది కాదని భావిస్తున్నారట.

వెంకటేష్, రానా లతో సింపుల్ బడ్జట్ సినిమాలు తీసుకుని , రెండేళ్ల తర్వాత పరిస్థితులు కుదుట పడ్డాక అప్పుడు ` హిరణ్య కశ్యప ` చేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నారట. మరి అంతవరకూ గుణశేఖర్ ఆగుతాడా లేక వేరే హీరో, నిర్మాతని వెతుక్కుంటాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.

10రోజుల్లోనే 10వేల కరోనా కేసులు!


దేశంలో మొదటి 10వేల కరోనా కేసులు నమోదుకావడానికి పట్టిన సమయం దాదాపు 3నెలలు కానీ మరో 10వేల కేసులకు పట్టిన సమయం 10రోజులకంటే తక్కువే. కేరళ లో జనవరి 18న మొదటి కరోనా కేసు నమోదయింది. అప్పటినుండి 10వేల మార్క్ చేరుకోవడానికి (ఏప్రిల్ 13నాటికి) 85 రోజుల సమయం పట్టింది. 20వేల మార్కు చేరుకోవడానికి కేవలం 10రోజులు సమయం పట్టడం గమనార్హం.

దీనిని బట్టి దేశంలో కరోనా మరింత విజృంభిస్తోందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు కొత్తగా 1400 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20వేలకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం 19,984 కరోనా కేసులు నమోదయ్యాయి. 3870 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 640 మంది మృతి చెందారు.

ఇక, మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఆ రాష్ట్రంలో 5218 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2178, ఢిల్లీలో 2156, రాజస్థాన్‌లో 1659, తమిళనాడులో 1596, మధ్యప్రదేశ్‌లో 1552, ఉత్తరప్రదేశ్ ‌లో 1294, తెలంగాణలో 928, ఏపీలో 757, కేరళలో 427, పశ్చిమ బెంగాల్‌ లో 423, కర్ణాకటలో 418, జమ్మూకశ్మీర్ ‌లో 380, హరియాణాలో 254, పంజాబ్ ‌లో 245, బిహార్‌ లో 126, ఒడిసాలో 79, ఉత్తరాఖండ్‌ లో 46, జార్ఖండ్‌ లో 45, హిమాచల్‌ప్రదేశ్ ‌లో 39, ఛత్తీస్‌గఢ్ ‌లో 36, అసోం లో 35, ఛండీగఢ్‌ లో 27, లడఖ్ ‌లో 18, మేఘాలయాలో 12, గోవాలో 7, పుదుచ్చేరిలో 7, మణిపూర్‌లో 2, త్రిపురలో 2, అరుణాచల్‌ప్రదేశ్‌లో 1, మిజోరంలో ఒక కరోనా కేసు నమోదైంది.

భారత్ కు కరోనాతో లక్ష కోట్ల డాలర్ల నష్టం


దేశ ఆర్ధిక వ్యవస్థను 2022 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకు వెడతామని అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల ముందు ఒక కలల ప్రపంచాన్ని ఆవిష్కరించారు.

అయితే కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఉన్న మూడు లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థలో లక్ష కోట్ల డాలర్ల మేరకు కోల్పోవలసి వస్తుందని ప్రముఖ ఆర్ధిక వేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భావిస్తున్నారు.

ప్రపంచ బ్యాంకు వెబనార్ లో భారత ఆర్ధిక వ్యవస్థపై కరోనా ప్రభావం అంశం గురించి మాట్లాడుతూ కరోనా ముందు కూడా దేశ ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదని గుర్తు చేశారు. పెద్ద పెద్ద స్టిమ్యులస్‌ ప్యాకేజిలను అందించడానికి కూడా ప్రభుత్వం వద్ద తక్కువ మార్గాలున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం పన్నుల వారానికి 60–70 బిలియన్ డాలర్లను సంపాదిస్తుందని చెబుతూ పేదలకు, ధనవంతులకు మధ్య తేడా ఇంకా పెరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పైనే దృష్టిసారించాలని అయన సూచించారు. లేని పక్షంలో మరో 20 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.

కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడానికి గల మార్గాలను ప్రభుత్వం వెతకాలని చెబుతూనే, కానీ వాటివల్ల కూడా ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని స్పష్టం చేశారు. బయట నుంచి మరింత పెట్టుబడులు పొందేందుకు సంస్కరణలు తీసుకురావాలని రాజన్ సూచించారు.

వ్యక్తుల పరంగా చూస్తే, ప్రజల ఆరోగ్యం, భద్రతలకు మొదటి రెండు ప్రాధాన్యతలు వచ్చాయని, ఇప్పటి వరకు ఇవి మూడు, నాలుగు స్థానాలలో ఉన్నాయని రాజన్ పేర్కొన్నారు. ఇతర వాటిపై ఖర్చులు తగ్గి, ఆరోగ్యంపై ఖర్చులు పెరిగాయి. ప్రజలు కూడా ఇక నుంచి ఖరీదైన ఉత్పత్తులపై ఖర్చు తగ్గించి, చౌకరకం వస్తువులు కొనేందుకే మొగ్గుచూపుతారని ఆయన భావిస్తున్నారు.

గూడ్స్‌‌ ను కూడా గుడ్ కాస్ట్స్, బాడ్ కాస్ట్స్‌‌ లుగా వర్గీకరించారు. గుడ్ కాస్ట్స్ అంటే డిజిటైజేషన్, టెక్ కాస్ట్స్, డిజిటల్ మార్కెటింగ్, బెస్ట్ ఎంప్లాయూస్. బాడ్ కాస్ట్స్ అంటే అనసరమైన ఖర్చులు. హోమ్ ఎడ్యుకేషన్, హోమ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, హోమ్ ఫిట్‌‌నెస్‌‌ వంటి వాటిల్లో డిజిటల్ ఎకానమీ పూర్తిగా పెరుగుతోందని చెప్పారు.

అయితే స్టేక్‌‌హోల్డర్స్ మధ్య నమ్మకం పోయింది. వెండర్లు, కస్టమర్లు, ఎంప్లాయిస్, బారోవర్స్, బ్యాంక్‌‌ల మధ్య నమ్మకం తగ్గిపోయింది. సప్లయిర్స్, ఎంప్లాయీస్‌‌తో ఓపెన్ కన్వర్జేషన్స్ ఉండాలని వివరించారు.

ఈ కరోనా సంక్షోభంలో కూడా విన్నర్లు, లూజర్లు ఉంటారని చెబుతూ విన్నర్లు ఈ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తారని తెలిపారు. చైనాకు ఎదురుదెబ్బ తగలవచ్చని పేర్కొంటూ భారత్ ఈ అవకాశాన్ని వాడుకోవాలని రాజన్ సూచించారు. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌‌‌‌గా మారాలని, భారత్ లోకి లిక్విడిటీని ఆకర్షించాలని పేర్కొన్నారు.