Home Blog Page 8489

ఆ సంఘటనతో ‘బాబు’కు ఉత్సహం..!


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రాజధానిలో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం చంద్రబాబులో ఉత్సాహం నింపిందని అంటున్నారని ట్వీట్లర్ లో పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తయితే తన పార్టీకి పుట్టగతులుండవనే భయం బాబుకు పట్టుకుందన్నారు. జిల్లా నేతలకు ఫోన్లు చేసి ప్రభుత్వం సేకరించిన భూములపై వివాదాలు సృష్టించాలని ఒత్తిడి తెస్తున్నాడట అని వెల్లడించారు.

‘బాబు’ వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుందన్నారు. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది.

రాజకీయాలకు బలైన డాక్టర్ సుధాకర్ రావు..!


వివిధ పార్టీల రాజకీయాలకు మత్తు వైద్యుడు సుధాకర్ రావు ఒక పావుగా మారాడు. రాష్ట్రంలో వైద్యుడు సుధాకర్ రావు వ్యవహారం చర్చ నీయాంశంగా మారింది. నర్సీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే సమయంలో సుధాకర్ రావు గురించి ఆసుపత్రిలో సిబ్బందికి, ఆయన నివాసం ఉండే ప్రాంతంలో కొందరికి తప్ప ఇతరులు ఎవరికి తెలియదు. ఏప్రిల్ 6వ తేదీన నర్సీపట్నంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాస్క్ లు ఇవ్వడం లేదంటూ ప్రభుత్వంపై మీడియా వద్ద విమర్శలు చేశారు. అప్పటికే ఆసుపత్రుల్లో మాస్క్ లు, పిపిఈ కిట్లు లేవంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో ఉన్న టీడీపీ ఈ విషయాన్ని టీడీపీ తమ వాదనలకు బలం చేకూర్చుకునేందుకు వాడుకుంది. వైద్యుడు సుధాకర్ రావు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసింది.

దీంతో అధికార పక్షం సుధాకర్ రావుకు టీడీపీ ముద్ర వేసింది. ఏప్రిల్ 7వ తేదీన సర్సీపటం ఎమ్మెల్యే పి.ఉమా శంకర గణేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సుధాకర్ రావు ఆసుపత్రికి వచ్చే ముందు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసానికి వెళ్లాడని చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నివేదిక కోరడం సుధాకర్ రావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సస్పెన్షన్ వేటు వేయడం జరిగి పోయింది.

సస్పెన్షన్ లో ఉన్న సుధాకర్ రావు మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. 40 రోజుల అనంతరం సుధాకర్ రావు కనిపించిన పరిస్థితి ఆందోళన కలిగించేదిగా ఉంది. అతను మద్యం మత్తులో ఉండటం ఒక అంశమైతే, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విధానం బాధాకరంగా ఉంది. మండు వేసవిలో అర్ధనగ్నంగా చేతులు కట్టేసి నడి రోడ్డుపై పడుకోపెట్టిన విధానం చేస్తే ఆయన కుటుంబ సభ్యులకు గుండె కోతే. చివరికి మానసిక స్థితి సరిగా లేదని ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ రాధ రాణి వెల్లడించారు. టిడిపి, సీపీఐ సుధాకర్ రావు వ్యవహారంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. దళిత సంఘాలు ప్రభుత్వ తీరును తప్పు బడుతున్నాయి. ఏదిఏమైనా రాష్ట్ర రాజకీయలకు సుధాకర్ రావు బలి అయ్యాడనేది వాస్తవం.

Mannara Chopra Glamorous Photos

ప్రేమలో సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్ధపడుతున్న శృతిహాసన్


సెలబ్రెటీలు ఎంత తొందరగా ప్రేమలో పడుతారో.. అంతే తొందరగా విడిపోతుందటం రోజు చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో హీరోహీరోయిన్లను మార్చినంత ఈజీగా రియల్ లైఫ్ లోనూ ప్రేమికులు మారిపోతుంటారు. అందరూ ఇలా ఉంటారని కాదు.. కొందరు సీన్సియర్ గా ప్రేమించి పెళ్లిపీఠలెక్కిన జంటలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం పెళ్లిపీఠల వరకు రాకుండానే మీడియా ముఖంగా విడిపోతుండటం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. చాలామంది తారలు ప్రేమలో విఫలమై.. మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించినవారు ఉన్నారు. వీరిలో శృతిహాసన్ మినహాయింపు ఏమీ కాదు. ఈ భామ గతంలో మైఖేల్ క్రోసన్ అనే వ్యక్తితో కొన్నాళ్ల ప్రేమ వ్యవహారం నడిపింది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, ప్రేమ ముచ్చట్లను అభిమానులతో పంచుకుంది. అయితే ఉన్నట్టుండి వీరిద్దరి విడిపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా శృతిహాసన్ మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధమేనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఒకసారి ప్రేమ విఫలమైతే మళ్లీ ప్రేమించకూడదని ఎక్కడా ఉందా అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం తాను ప్రేమలో పడే వయస్సులోనే ఉన్నానని అంటోంది. గొప్ప ప్రేమ దొరికితే తాను ప్రేమించేందుకు సిద్ధమంటూ ప్రకటించేసింది. ప్రేమ అనేది గమ్మత్తయిన అనుభవమని శృతిహాసన్ అంటోంది. తాను ప్రేమలో విఫలమైనందుకు ఎప్పుడు బాధపడలేదని.. అది తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని శృతిహాసన్ స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే శృతిహాసన్ ప్రేమలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసేందుకు రెడీగా ఉందని అర్థమవుతోంది. శృతిహాసన్ కోరుకుంటున్నట్లుగా ఆమెకు గొప్ప ప్రేమ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే శృతిహాసన్ ను ప్రేమలో దించే ఆ లక్కీ ఫెల్లో ఎవరా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

వామ్మో.. పాయల్ స్పీడు చూశారా.!


దేశంలో లాక్డౌన్ కారణంగా ప్రతీఒక్కరూ ఇంటికే పరిమితయ్యారు. ఎప్పుడూ బీజీగా ఉంటే సెలబెట్రీలు మాత్రం లాక్డౌన్ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. హీరోహీరోయిన్లు తమలోని కొత్త టాలెంట్ ను బయటికి తెస్తున్నారు. కొందరు కిచెన్లో కొత్తకొత్త వంట ప్రయోగాలు చేస్తుండగా మరికొందరు ఫిటెనెస్, యోగాపై దృష్టిసారిస్తున్నారు. ఆన్ లైన్ కోర్సులు, కొత్తకొత్త ఛాలెంజ్ లు, హాట్ హాట్ ఫొటోల ముచ్చట్లతో సెలబ్రెటీలు నిత్యం అభిమానులతో టచ్లోనే ఉంటున్నారు.

‘ఆర్ఎక్స్-100’ మూవీతో పాయల్ రాజ్ ఫుత్ తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ మూవీ హిట్టుతో ఈ భామకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళుతోంది. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన పాయల్ రాజ్ ఫుత్ సోషల్ మీడియాలో మాత్రం యమయాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తోంది. ఇటీవల పిల్లో ఛాలెంజ్లో భాగంగా పిల్లో చాటున అందాలను ఆరబోసి అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంది పాయల్ రాజ్ ఫుత్. సినిమాల్లో హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్స్ తో అలరిస్తూనే మరోవైపు షార్ట్ ఫిల్మ్ లో నటిస్తోంది.

లాక్డౌన్ సమయంలోనూ ‘ది రైటర్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి పాయల్ జోరు చూపించింది. ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం 24గంటల్లోనే చిత్రీకరించారు. దర్శకుడు సౌరభ్ తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ అన్ని భాషల్లో విడుదల కానుందట. ఒక్కరోజునే షార్ట్ ఫిల్మ్ పూర్తి చేయడంపై హీరోయిన్ పాయల్, దర్శకుడు సౌరభ్ ను పలువురు అభినందిస్తున్నారు. పాయల్ రాజ్ ఫుత్ ఇటీవల ‘వెంకీమామ’తో అభిమానుల ముందుకొచ్చి సందడి చేసింది. ప్రస్తుతం ఓ లేడి ఓరియంటేడ్ మూవీలో నటిస్తోంది. కెరీర్ తొలినాళ్లలో గ్లామర్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ ప్రస్తుతం నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తుండటం గమనార్హం.

లాక్ డౌన్ ఎఫెక్ట్.. నటుడు ఆత్మహత్య


లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. 50రోజులుగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతుండటంతో ప్రతీఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ ప్రభావంతో వలస కార్మికులు, సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇక ఈ ప్రభావం సీనిరంగంపై కూడా పడుతోంది. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు వాయిదా పడగా, థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈరంగంలో పనిచేసే కార్మికులు, నటులు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పట్లో సినిమా షూటింగులు ప్రారంభమయ్యే పరిస్థితులు కన్పించకపోవడంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా పంజాబీ నటుడు మ‌న్మీత్ గైవాల్(29) ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడటంతో చిత్రపరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. లాక్డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోవడంతో మాసిసిక ఒత్తిడికి గురయ్యాడు. దీనికితోడు ఆర్థిక సమస్యలు భారం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆదత్ సే మజ్బూర్’, ‘కుల్దీపాక్’ వంటి సీరియల్స్ లో మన్మీత్ నటించాడు. అంతేకాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనల్లోనూ నటించాడు. ఢిల్లీకి చెందిన మ‌న్మీత్ పెళ్లి త‌ర్వాత‌ ముంబైకి వెళ్లాడు. భార్యతో కలిసి నవీ ముంబైలో ఉంటున్నాడు. మ‌న్మీత్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పుగోదావరిలో మరోసారి గ్యాస్ లీక్..!


విశాఖపట్నం విష‌వాయువు లీక్ దుర్ఘటన నుంచి రాష్ట్రం మరువక ముందే తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీక్ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని తూర్పుపాలెం వ‌ద్ద‌ ఓఎన్‌జీసీ పైప్‌ లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్‌ కలెక్టింగ్‌ స్టేషన్‌కు వెళ్లే పైప్‌లైన్ ‌పగిలిపోవడంతో భారీగా గ్యాస్ బ‌య‌ట‌కు వెలువ‌డుతోంది. దీంతో ఆ ప్రాంత ప్ర‌జ‌లు తీవ్ర‌ భయాందోళనకు గురవుతున్నారు.

చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ సిబ్బంది లీకైన గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీక్ కి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు. పైపులైన్ వల్ల గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఈ జిల్లాలో అనేక పర్యయాలు జరిగాయి. 2014 జూన్ లో నగరం గ్రామంలో పైప్ లైన్ నుంచి గ్యాస్ వల్ల జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోగా అనేక మంది గాయాల పాలయ్యారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమకా


యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు ఈసారి డబుల్ ధమకా ఉండబోతుంది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సర్ ప్రైజ్ ఉంటుందా? లేదా అనే అయోమయంలో ఉండగా నిర్మాత డీవీవీ దానయ్య క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పకుండా సర్ ప్రైజ్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఆ సర్ ప్రైజ్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ఇటీవల రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘భీమ్ ఫర్ సీతరామరాజు’ పేరిట విడులైన వీడియో అభిమానులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్.. చరణ్ యాక్షన్ సీన్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండటంతో అతడినేలా చూపిస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి వచ్చే సర్ ప్రైజ్ కోసం అభిమానులు అత్రతుగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దర్శకుడు త్రివిక్రమ్ మరో గుడ్ న్యూస్ చెప్పాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో కొత్త మూవీ ప్రారంభం కానుందని ప్రకటించాడు. ఈమూవీ ఫస్టు లుక్, టైటిల్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిపాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2021మేలో సినిమాను విడుదల చేయనున్నట్లు సీతార ఎంటటైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలోనే ప్రకటించారు. ఈ మూవీకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇదే టైటిల్ ప్రకటిస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.. ఈసారి యంగ్ టైగర్ పుట్టిన రోజుకు ఒకేసారి డబుల్ ధమకా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

నీళ్ల చోరీకి జగన్ స్కెచ్…


ఒక వంక పోతిరెడ్డిపాడు జల సామర్ధ్యాన్ని రెట్టింపు చేసే ప్రయత్నంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్ర స్థాయికి వెళ్ళేటట్లు చేసిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో పేచీకి సిద్దపడుతున్నరు. అంతకు మించి ఏకంగా శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచి కృష్ణ నదిలోనే పంప్ హౌస్ ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నీరు రాకుండా తరలించుకునేందుకు పధకం వేసిన్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.

పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే నీటిని లిఫ్ట్ చేసుకొని పోయే డైవర్షన్ స్కీమ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. సంగమేశ్వరం నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది.

ఎగువ ప్రాంత వరద జలాలను వాడుకుంటామని, అంటే.. కృష్ణా నదికి వరదలొచ్చినపుడు శ్రీశైలం నుంచి పొంగిపొర్లే జలాలను వాడుకుంటామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం లేకుండా కాజేసేందుకు అనుమతులు ఇచ్చిందని తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు.

దీంతో శ్రీశైలం దాటి కృష్ణా జలాలు కిందికి రావటం సాధ్యం కాదని, దానితో శ్రీశైలం నీటి ఆధారంగా తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ వట్టిపోగలవని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నాగార్జునసాగర్ కు కూడా నీరు రావడం కష్టం కాగలదు.

శ్రీశైలం రిజర్వాయర్ నిండి పొంగితే, అంటే పూర్తి నీటి మట్టం 885 అడుగులు దాటితేనే దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు నీరు వెళ్లడం గాని జరుగుతుంది. కానీ ఇప్పుడు శ్రీశైలం గేట్లకు దిగువన ఉన్న నాగార్జునసాగర్ నిండాలి. అప్పుడే వరద జలాలుగా పరిగణించ వలసి ఉంటుంది.

సగటున ప్రతి ఐదేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే కృష్ణాకు వరదలొస్తున్నాయి. మిగతా నాలుగేళ్లు కృష్ణా బేసిన్లో అంతకంతకు సరిపడే నీళ్లే ఉంటున్నాయి. కృష్ణా బోర్డు సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి నిల్వమట్టం 834 అడుగులు మెయింటెన్ చేయాలి.

కానీ పోతిరెడ్డిపాడు నుంచి లెక్కలేనన్ని నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతోంది. నీటి మట్టం .. 790 అడుగులకు పడిపోయినా కూడా .. ఉన్న నీరంతా ఖాళీ చేసేలా పంపింగ్ స్కీమ్ ను జగన్ ప్రభుత్వం డిజైన్ చేసుకున్నట్లు తెలంగాణ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. దీంతో సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు నుంచి నీరు గలగల పారుతుంటే శ్రీశైలం చుక్కనీరు లేకుండా ఖాళీ కావటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగోరోజు ఆర్ధిక సంస్కరణల సంచలనం

ఈరోజు ఏ రంగాలపై మాట్లాడబోతుందనేది ముందుగా జాతీయ చానళ్ళు ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు ఊహించుకొని ముందుగానే చర్చలు జరిపారు. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ కీలకమైన రంగాల్లో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చారు. మన తెలుగు చానళ్లయితే జనం జేబుల్లో ఈరోజు డబ్బులు పెడతారేమోనని ఆశలు కల్పించారు. వీటన్నింటికీ భిన్నంగా కీలకమైన బొగ్గు, ఖనిజాలు , రక్షణ లాంటి రంగాల్లో కీలక సంస్కరణలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది నిర్మలమ్మ. అవేమిటో ఒక్కసారి చూద్దాం.

అన్నింటికీ వర్తించేవి :

  • ఫాస్ట్ ట్రాక్ లో పెట్టుబడుల కు అనుమతులు . దీనికోసం సెక్రటరీ స్థాయి గ్రూప్ ఏర్పాటు
  • ప్రాజెక్టుల అభివృద్ధి సెల్  ప్రతి డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేస్తారు
  • కొత్త పెట్టుబడులను ఆకర్షించటంలో రాష్ట్రాలకు ర్యాంకులు
  • అధునాతన రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రోత్సాహకాలు
  • కొత్త పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటులో రాష్ట్రాలకు కొత్త పధకం
  • భూ బ్యాంక్ వివరాలు అందరికీ అందుబాటులో వుండే సమాచార వ్యవస్థ

వీటితోపాటు 8 రంగాల్లో కీలక సంస్కరణలను ప్రకటించింది. అవేమిటో ఒక్కసారి చూద్దాం.

బొగ్గు పరిశ్రమలో సంస్కరణలు :

  • ప్రైవేటు బొగ్గు గనులకు సరళీకృత విధానం . ఎవరైనా పాట పాడుకోవచ్చు, తర్వాత వచ్చిన బొగ్గుని బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.
  • కొత్తగా 50 బ్లాకులు అమ్మకానికి సిద్ధం.
  • మొత్తం అభివృద్ధి చేసినవే కాకుండా , అసంపూర్తి గా వున్నవి కూడా అమ్ముతారు. ముందుగా ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తారు.
  • బొగ్గుని గ్యాస్ గా మార్చే పనికి ప్రోత్సాహకాలు
  • మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రూపాయల కేటాయింపు.
  • బొగ్గు బెడ్ మిథేన్ వెలికితీత హక్కులు కోల్ ఇండియా అమ్ముతుంది.
  • వ్యాపారానికి అనుకూలమైన విధానాలు

ఖనిజ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహకాలు :

  • సంస్థాగత సంస్కరణలు
  • అన్నీకలిపి ( వెలికితీత, మైనింగ్ , ఉత్పత్తి) ఒకే విధానం
  • 500 బ్లాకులు ప్రైవేటుకు అమ్మకానికి సిద్ధం
  • బొగ్గు, బాక్సైట్ కలిపి వుమ్మడి అమ్మకం
  • కాప్టివ్, నాన్ కాప్టివ్ బొగ్గు గనుల వ్యత్యాసం తొలగింపు
  • మినరల్ సూచీ త్వరలో తయారు
  • స్టాంప్ డ్యూటీ హేతుబద్ధత

రక్షణ రంగం లో అనేక మార్పులు :

  • ‘ భారత్ లో తయారి ‘ దిశగా విధాన మార్పులు
  • కొన్ని ఆయుధాలు / సామాగ్రి  దేశీయ రంగానికే కేటాయింపు. ఆ రంగాల్లో విదేశీ ఆర్డర్ల పై నిషేధం.
  • విడి భాగాలను దేశం లోనే తయారీకి పధకం.
  • దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింపు
  • విదేశీ పెట్టుబడులపై ప్రస్తుతం వున్న 49 శాతం నిబంధనను 74 శాతానికి పెంపు. దీనితో విదేశీ పెట్టుబడులు విరివిగా వచ్చే అవకాశం.
  • నిర్దిష్ట కాల పరిమితి లో రక్షణ పరికరాల కొనుగోలు .

సివిల్ వాయురంగం :

  • సమర్ధవంతంగా వాయు స్పేస్ వినియోగం
  • దీనితో 1 వేయి కోట్ల రూపాయలు ఆదా .
  • ఇంధనం , కాలం కూడా ఆదా
  • ఇంకా 6 విమానాశ్రయాలు ప్రైవేటీకరణ .
  • దీనితో మొత్తం మొదటి , రెండవ రౌండ్ కలిపి 13 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు.
  • ఎం ఆర్ ఓ ( Maintenance, Repair and Overhaul) హబ్ గా భారత్

విద్యుత్తు రంగం లో సంస్కరణలు :

  • కొత్త టారిఫ్ పాలసీ త్వరలో వస్తుంది.
  • ఇందులో వినియోగదారుడి హక్కులు పరిరక్షించబడతాయి. అసమర్ధ పంపిణీ సంస్థల భారం వినియోగదారుడు పై పడకుండా జాగ్రత్తలు
  • విద్యుత్తు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
  • సరయిన చెల్లింపు విధానం
  • సబ్సిడీ నేరుగా వినియోగదారుడి ఖాతా లోకి.
  • దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ
  • రాష్ట్ర పంపిణీ సంస్థల్లో పనితీరు మెరుగు

సామాజిక మౌలికరంగంలో పెట్టుబడులు :

  • కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధిని మొత్తం ప్రాజెక్టులో 20 శాతం నుంచి 30 శాతానికి పెంపు.
  • దీనికోసం 8100 కోట్ల రూపాయలు కేటాయింపు.
  • దీనివలన ఆసుపత్రులు, పాఠశాలలు కొత్తవి వచ్చే అవకాశం వుంది.

అంతరిక్ష పరిశోధన లో ప్రైవేటు రంగం పాత్ర 

  • అనేక అంతరిక్ష ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం

అణుశక్తి రంగం లో సంస్కరణలు 

  • మెడికల్ ఐసోటోప్సు తయారీలో ప్రైవేటీ రంగాన్ని ఉపయోగించుకోవటం . దీనివలన క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లో వెసులుబాటు.
  • ఆహార భద్రతకి సంబంధించి సాంకేతికత పరిజ్ఞానాన్ని ప్రైవేటు పెట్టుబడులతో ఉపయోగించుకోవటం.
  • స్టార్ట్ అప్ రంగాన్ని ప్రోత్సహించటం

ఈరోజు ప్రకటించిన 8 రంగాల్లో 7  కేవలం సంస్కరణలకు సంబంధించినవే కావటం గమనార్హం. మోడీ కరోనా మహమ్మారి సంక్షోబాన్ని ఓ బంగారు అవకాశంగా మార్చుకొని ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే భాగం గానే ఈ సంస్కరణలను చూడాల్సివుంటుంది. 1991 సరళీకృత విధానం తర్వాత ఇదో పెద్ద ముందడుగా ఈ సంస్కరణలను చెప్పొచ్చు. అందరికీ భారత్ అగ్రగామి ఆర్ధిక వ్యవస్థగా మారాలని కోరికగా వుంది. అది ఇటువంటి సాహసోపేత నిర్ణయాల వలనే జరుగుతుంది. ఈ సంస్కరణలను తీసుకొచ్చినందుకు మరొక్కసారి మోడీ కి అభినందనలు . చూద్దాం రేపు విశేషాలు ఎలా ఉంటాయో .

 

తెలంగాణలో ‘నాన్ వెజ్’ రూల్స్!

 

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు కాస్త తగ్గుమొహం పట్టాయి.  హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  కంటోన్మెంట్ ఏరియాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో దాదాపుగా షాపులు తెరుచుకుంటున్నాయి.  ఇక నాన్ వెజ్ షాపులకు కూడా అనుమతిస్తున్నారు. అయితే, అన్ని రకాల నాన్ వెజ్ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తూనే కొన్ని రకాల మార్గదర్శకాలను రిలీజ్ చేశారు.  మార్గదర్శకాలకు అనుగుణంగానే షాపుల నిర్వహణను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ మార్గదర్శకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అన్ని దుకాణాల్లో తప్పనిసరిగా చెత్తబుట్టల ఉండాలి.  వాటికి ఎలాంటి రంద్రాలు ఉండకూడదు. మాంసం కోసేందుకు ఉపయోగించే కత్తులు వంటి వాటిని తప్పనిసరిగా వేడి నీళ్లలో కడగాలి.  షాపుల్లో పనిచేసే వ్యక్తులు తప్పనిసరిగా అఫ్రాన్, హెడ్ గేర్, గ్లౌజులు తొడుక్కోవాలి.  దుకాణాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసుకోవాలి.  దుకాణాల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి చర్మ వ్యాధులు ఉండకూడదు.  గోర్లు పెంచుకోకూడదు.  అదే విధంగా దుకాణాల్లో ఈగలు వాలకుండా చూసుకోవాలి.  ఇక వ్యర్ధాలను ఎలాంటి పరిష్టితుల్లో కూడా బయట పడెయ్యకూడదు. టన్నుకంటే తక్కువ వ్యర్ధాలు ఉంటె వాటిని భూమిలో పూడ్చిపెట్టాలి.  అంతకంటే ఎక్కువ వ్యర్ధాలు ఉంటె వాటిని బయో మేధనేషన్ ప్రక్రియ ద్వారా విచ్చిన్నం చేయాలి.  ఒకవేళ వీటినుంచి ఎరువులు తయారు చేసేందుకు వీలైతే దానిని ఎరువుగా మార్చి హరితహారంలో వాడాలని ప్రభుత్వం సూచించింది.

మోడీ.. ప్రభుత్వ ఆస్తులను పంచిపెడుతున్నారా?

ప్రధాని మోడీ దాచిపెడుతున్నారా? దోచిపెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను పప్పూ బెల్లాల్ల పంచిపెడుతున్నారా? 20 లక్షల కోట్ల ప్యాకేజీ మాటున మోడీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు.. మేధావి వర్గాలు.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ ప్యాకేజీ చూస్తే సర్వం ప్రైవేటు పరం చేస్తుండడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చి.. లాభాల్లో ఉన్న సంస్థలను, ఖనిజాలు, గనుల యజమాన్యాలను కూడా వదిలించుకోవడం దేనికి సంకేతం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ఇటీవలే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట కేంద్రంలోని మోడీ సర్కార్ 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 4వ రోజు కూడా వివిధ రంగాలకు ప్యాకేజీలు, సంస్కరణలను ప్రకటించారు. ఈ మేరకు సంచలన నిర్ణయాలను వెలువరించారు. వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు బార్లా తీశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

* ప్రైవేటుకు 6 ఎయిర్ పోర్టులు అర్పణం
ఎయిర్ పోర్టుల నిర్వహణను మోడీ ప్రభుత్వం వదిలించుకుంటోంది. లాభాలు వస్తున్నా సరే ప్రైవేటుపై ప్రేమ చూపిస్తోంది. తాజాగా దేశంలోని మరో 6 ఎయిర్ పోర్టులను సైతం ప్రైవేటుకు అప్పగిస్తున్నామని.. తద్వారా ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా రూపుదిద్దేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీనివెనుక పరమార్థం ఏంటో నిపుణులకు కూడా అంతుబట్టడం లేదు. ఇప్పటికే దేశంలో 12 ఎయిర్ పోర్టులు పీపీపీ విధానంలో ప్రైవేటు కంపెనీలకు కేటాయించామన్నారు. విమానాశ్రయాల అభివృద్ధికి రూ.2300 కోట్లు కేటాయిస్తామన్నారు. 12 నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణానికి 13వేల కోట్లు కేటాయిస్తామన్నారు. మరి ఆ ఎయిర్ పోర్టులను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.

*బొగ్గురంగంలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
బొగ్గురంగం ఇన్నాళ్లు ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. సింగరేణి, కోల్ ఇండియా చేతుల్లోనే బొగ్గు గనులుండేవి. కార్మికులకు లక్ష వరకు జీతాలు.. సంక్షేమం, హక్కులు ఉండేవి. ఇప్పుడు వాటిని కాదని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ సర్కార్ చర్యలు తీసుకోవడం కార్మికులను, యాజమాన్యాలను షాక్ కు గురిచేసింది. బొగ్గురంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇక నుంచి ఎవరైనా బొగ్గు వేలంలో పాల్గొనవచ్చని.. బహిరంగ మార్కెట్ లో బొగ్గును విక్రయించుకోవచ్చని.. 50 బ్లాకులను ప్రైవేటుకు తక్షణమే కేటాయిస్తున్నామన్నారు. బొగ్గు తవ్వకాలు, మౌళిక వసతులకు రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇలా మంచి లాభాలిచ్చే బొగ్గు సంస్థలను.. జాతి సంపదను మోడీ సర్కార్ ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నదన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేటు దోచిపెట్టడానికా అని విమర్శలు మొదలయ్యాయి.

*ఖనిజ రంగంలోనూ ప్రైవేటు పరం
ఇక ఖనిజ పరిశ్రమల రంగంలో 500 మైనింగ్ బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. అల్యుమినియం పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇక బాక్సైట్, బొగ్గు బ్లాకులకు సంయుక్త వేలం నిర్వహిస్తామన్నారు. విలువైన బాక్సైట్, అల్యుమినియం కూడా ప్రైవేటుకు ధారదత్తం చేస్తే ప్రైవేటు వ్యక్తులు బాగుపడడం తప్ప కార్మికులకు, ప్రభుత్వాలకు మిగిలేది ఏమీ ఉండదు.

*విద్యుత్ డిస్కంలు ప్రైవేటీకరణ
విద్యుత్ సంస్థలు నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. వాటి ద్వారా ఉచిత విద్యుత్ కు ప్రభుత్వాలు తెరతీశాయి. ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తే ఆ సంస్థలు ముక్కుపిండి వసూలు చేస్తాయి. రైతులకు ఉచిత విద్యుత్ కు ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నాయి. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు చేసేలా డిస్కంలలో సంస్కరణలు తెస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్ లను ప్రైవేటీకరిస్తున్నామన్నారు. నష్టాలను వినియోగదారులపై పడకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కలు ఆర్థికభారంతో సతమతమవుతున్నాయని.. వాటిని గాడిన పెట్టడానికి రూ.90వేల కోట్లను కేంద్రం కేటాయించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేటు పరం చేస్తున్నామని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రవేశపెడుతామని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించి విద్యుత్ వినియోగదారులకు షాకిచ్చారు. ఇలా ప్రైవేటుకు అప్పగిస్తే విచ్చలవిడిగా విద్యుత్ వినియోగదారులను దోచుకోవడం తప్పితే సంక్షేమం ఆలోచించవని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి.

*రక్షణ రంగంలో ఎఫ్.డీ.ఐల పరిమితి పెంపు
దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ రంగంలో ఎఫ్.డీ.ఐల పెంపు మన రక్షణరంగ రహస్యాలకు పెనుముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్షణ రంగంలో ఏకంగా ఎఫ్.డీ.ఐ పరిమితిని 49శాతం నుంచి 75శాతానికి పెంచుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. మేకిన్ ఇండియాను ప్రోత్సహించి రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారితనం పెంచుతామన్నారు.

*ప్రభుత్వంతో సంక్షేమం.. ప్రైవేటుతో సంక్షామం..
ప్రభుత్వంలో ఉంటే సంక్షేమం ఉంటుంది.కార్మికులకు, ప్రభుత్వాలకు లాభదాయకం గా ఉంటుంది. అదే ప్రైవేటుకు అప్పగిస్తే వారికి దోచుకున్నోళ్లకు దోచుకున్నంత సంపద అవుతుంది. ఉదాహరణకు సింగరేణి ప్రభుత్వ సంస్థలో ఒక్కో కార్మికుడికి జీతం 80వేల వరకు ఉంటుంది. అదే ప్రైవేటు పరం చేస్తే ముసలివాళ్లకు రిటైర్ మెంట్ ప్రకటించి 20 వేలకు మించి జీతాలివ్వరు. యంత్రీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తీసేస్తారు. ప్రభుత్వంలో ఉంటే కార్మిక హక్కులు, సంక్షేమంతోపాటు అభివృద్ధి సాధ్యం.. అదే ప్రైవేటుకు గనులు, సంస్థలు ఇస్తే వాటిదే ఇష్టారాజ్యం.. ఉద్యోగాలకు భద్రత ఉండదు.. జీతాలు ఉండవు.. ప్రైవేటుకు దోచుపెట్టేందుకేనా ఈ నిర్ణయాలు అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు..

-నరేశ్ ఎన్నం

దారుణమైన స్థితిలో మత్తు డాక్టర్ సుధాకర్ రావు..!

కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మత్తు వైద్యుడు సుధాకర్ రావు దారుణమైన స్థితిలో విశాఖ రోడ్లపై కనిపించాడు. అర్ధనగ్నంగా, గుండుతో దర్శనమిచ్చాడు. విశాఖ నగర వీధుల్లో డా.సుధాకర్ ను తాళ్లతో కట్టేసి పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. తాటిచెట్లపాలెం పోర్టు ఆస్పత్రి వద్ద ఈ ఘటన చూసినవారికి హృదయ విధారకంగా సుధాకర్ కనిపించారు. అనంతరం ఆటోలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఏపీ ప్రభుత్వం పై మాస్కుల విషయంలో ఇటీవల ఆరోపణలు చేసిన డా.సుధాకర్ ను సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఆస్పత్రిలో మాస్కులు లేవని డాక్టర్లకు సదుపాయాలు లేవని విమర్శించారు. పోలీసులు ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరించారనే విషయం వెల్లడించలేదు. సంఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

వెబ్ సీరీసుకు రివ్యూ రాసిన కోహ్లీ

దేశంలో లాక్డౌన్ కారణంగా సెలబ్రెటీలంతా ఇంటికి పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో సినీ స్టార్లు, క్రికెట్ల సందడి మూములుగా ఉండటంలేదు. లాక్డౌన్ అనుభవాలను నిత్యం సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా క్రికెటర్లు సోషల్ మీడియాలో తమ పోస్టులతో హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా విరుష్క దంపతులు లాక్డౌన్లో తమ సరదా అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల అనుష్క శర్మ తన భర్త కోహ్లీని ఆటపట్టిస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. ‘ఏయ్ కోలీ.. చౌకామార్.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ అనుష్క క్లోహ్లీని ఆటపట్టింది. ఆమె చేసిన పనికి కోహ్లీ బిత్తర చూపులు చూస్తూ గమ్మున ఉండిపోయాడు. ఈ వీడియోను అనుష్కనే స్వయంగా తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఫన్నీగా ఉండటంతో వైరల్ అయింది.

తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మ నిర్మించిన ‘పాతాళ్‌ లోక్‌ సీజన్‌ 1’ వెబ్‌ సిరీస్‌కు రివ్యూ రాశాడు. అనుష్క శర్మ రూపొందించిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థిల్లర్‌ ఎంతో అద్భుతంగా ఉందని కోహ్లీ ప్రశంసించాడు. కథ, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని.. నటీనటులు బాగా చేశారని కితాబిచ్చాడు. ఈ రివ్యూకు తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే 13లక్షల మందికిపైగా లైక్‌ కొట్టారు. అనుష్క నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా రివ్యూ రాసి కోహ్లీ తనలోని మరో టాలెంట్ బయటకుతీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడు బ్యాటింగ్లో అదరగొట్టే కోహ్లీ.. సినిమా రివ్యూలు రాసి అదరగొట్టడంతో అభిమానులు ఖుషీ అవుతోన్నారు.

కష్టకాలం..ఉద్యోగుల కడుపు కొట్టకండి:పవన్

ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ పొరుగు సేవల ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ‘సుమారు 7,600 మంది పొరుగు సేవల ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారు. ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగుల జీతాలు రూ. 6 వేల నుంచి రూ.15 వేలు మాత్రమే. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న కాలంలో జీతాలు చెల్లించకపోతే వారు జీవనం ఎలా సాగిస్తారు? ఈ కష్ట కాలంలో ఉద్యోగులను తొలగించొద్దు అని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణమే వేతన బకాయిలు చెల్లించి.. ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా ఇవ్వాలి’ అని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే రాష్ట్రంలోని పండ్ల తోటల రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక శక్తి లేకపోయినా తోటివారిని ఆదుకోవాలనే మంచి మనసు జనసైనికుల్లో ఉందని.. జనసైనికులే పార్టీకి ఇంధనమని పవన్‌ పేర్కొన్నారు.

కరోనా సమయంలో బాధ్యతలు విస్మరించిన ప్రజాప్రతినిధుల గురించి ప్రజలకు తెలియజేయాలని పవన్‌ కళ్యాణ్ పార్టీ నేతలను కోరారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదని పవన్‌ మండిపడ్డారు. ఎర్ర చందనం తరలిపోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ ప్రశ్నించారు.

మెగా అల్లుడి డబ్ల్యూ ఫీలిం.. ఓటీటీలో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న బ్యాక్ గ్రౌండ్ మరే ఫ్యామిలీకి లేదు. మెగాస్టార్ చిరంజీవి వారసులుగా దాదాపు డజను మంది హీరోలు ఇప్పటికే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మరింత మంది ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే వీరంతా తమకంటూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో రాణిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ‘ఉప్పెన’ మూవీతో గ్రాండ్ అభిమానుల ముందు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న వైష్ణవ్ తేజ్ ఆశలు లాక్డౌన్ కారణంగా గల్లంతైనట్లు కన్పిస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా థియేటర్లు ఇప్పట్లో మొదలయ్యేలా కన్పించకపోవడంతో ‘ఉప్పెన’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

‘ఉప్పెన’ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ‘రంగస్థలం’ దర్శకుడు సుకుమార్ వద్ద బుచ్చిబాబు పని చేశాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వైష్ణవ్ తేజ్ కు మెగా బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో అతడి డబ్ల్యూ మూవీకే 25కోట్ల మేర బడ్జెట్ నిర్మాతలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కన్పించకపోవడంతో అందరిచూపు ఓటీటీలపై పడింది. భారీ బడ్జెట్లో నిర్మించిన పలు చిత్రాలు సైతం ఓటీటీలో రిలీజవుతుండటం విశేషం. ఈనేపథ్యంలో ‘ఉప్పెన’ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ లేదా అమెజాన్ ప్రైమ్ లో మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కొత్తభామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఉప్పెనలో విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ అదిరిపోయే బాణీలను సమకూర్చాడు. ఇప్పటికే ఈ మూవీ సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వైష్ణవ్ తేజ్ డబ్ల్యూ మూవీ ఓటీటీలో నేరుగా రిలీజవుతుండటంతో మెగా అభిమానుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. మెగా సపోర్ట్ వైష్ణవ్ కు ఎంత ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ చిత్రం ఓటీటీలో రిలీజవుతుందా? లేక థియేటర్లలో రిలీజవుందా? అనేది వేచి చూడాల్సిందే..!

మత సామరస్యం-కులరహిత హిందూ సమాజం (భాగం 7)

పోయినసారి హిందూ మతం రెండు సార్లు తన వునికి కోల్పోయే ప్రమాదం నుండి బయటపడిందని చర్చించుకున్నాం. అలాగే మూడోసారి అటువంటి ప్రమాదం అంచులకు చేరినా తన ఉనికి కోల్పోయే అంత స్థాయిలో లేదుకానీ ప్రమాదపు ఘంటికలయితే మోగినాయని చర్చించుకున్నాం. దానికి ప్రధాన కారణం హిందూ మతం లో ఏర్పడిన నిచ్చెన లాంటి కుల వ్యవస్థ అనేది కూడా క్లుప్తంగా మాట్లాడుకున్నాం. ఇదే ఆరోజు నుంచి ఈ రోజు వరకు హిందూ మతానికి అంతర్గత శత్రువు లాగా తయారయ్యింది. దీనిపై దృష్టి సారించకుండా, దీనిపై సంస్కరణల పధంలో ముందుకెళ్ళకుండా వుంటే ఎప్పటికైనా హిందూ మతానికి ముప్పు పొంచే ఉంటుందని మరిచిపోవద్దు. హిందూ మతాన్ని గురించి జబ్బలు చరుచుకునే వాళ్ళలో దీనిపై దృష్టి పెట్టే వాళ్ళు బహుకొద్దిమంది. ఈ విషయం కొచ్చేసరికి వాళ్ళ కులాన్ని వదులుకోవటానికి ఇష్టపడరు. కులం హిందూ మత రక్షణకు అవరోధమని గుర్తించటానికి వీళ్ళకు మనసొప్పదు. అటు హిందూ మతం కావాలి , ఇటు కులమూ కావాలి అనుకునే వాళ్ళ వలనే ఎప్పటికైనా హిందూ మతానికి ప్రమాదం పొంచి వుందని గుర్తించకపోతే నష్టపోయేది హిందూ మతమే. అసలు ఈ కులం ఎలా వచ్చిందో ఒక్కసారి పరిశీలిద్దాం.

కులవ్యవస్థ అనాదినుంచి ఉందా?

దీనికి ఎటువంటి సందేహం లేకుండా లేదు అనే జవాబు వస్తుంది. అటువంటప్పుడు అనాదిగా లేని ఈ కులం ఈరోజు శాశ్వతం ఎలా అవుతుంది? వేదకాలం లో ఆ తర్వాత అసలు కుల ప్రస్తావనే లేదు. హిందూ మత పరిరక్షకులైన ఋషులు, సాధువులు, సంతులు , మునులు వీటికి అతీతంగానే వుండేవారు. ఇతిహాసాల్లో , పురాణాల్లో ఎంతోమంది ఋషులు బ్రాహ్మణులు కాని వారు వున్నట్లు ఆ సాహిత్యం ద్వారా తెలుస్తుంది. అప్పటికి వున్న వర్ణ వ్యవస్థ కూడా పుట్టుకను బట్టి కాక అతని గుణగణాలు, ఆధ్యాత్మిక శక్తి బట్టి పరిగణించ బడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఋషులు, ఋషుల సతీమణులు కూడా  బ్రాహ్మణేతర వర్ణాల నుండి ఎంతోమంది వచ్చారు. అంతెందుకు మహా పవిత్ర కావ్యం రామాయణం రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు. అయితే ఈ పరిస్థితి నుంచి తర్వాత దశలో పుట్టుక తోటే అర్హతలు పొందటం దగ్గరనుంచే వ్యవస్థలో అవలక్షణాలు మొదలయ్యాయి. అయినా అప్పటికీ కుల వ్యవస్థ ఆవిర్భవించలేదు. వర్ణ వ్యవస్థ కే పరిమితమయ్యింది. బుద్ధుడు ఈ పుట్టుకతో వచ్చిన వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. మానవులందరూ ఒకటేనని తన తాత్విక చర్చల ద్వారా నిరూపించాడు. ప్రతిభకే పట్టం తిరిగి ఆవిష్కరించ గలిగాడు.

బౌద్ధం క్షీణించి తిరిగి హిందూ పునరుజ్జీవం జరిగిన తర్వాత మరలా పాత ఆచారాలు , వ్యవహారాలూ మొదలయ్యాయి. అప్పుడూ హిందూ తత్వవేత్తలు , సాధువులు ఎక్కువమంది  వర్ణ వ్యవస్థపై పెద్దగా  దృష్టి సారించలేదు. ఎవరో కొంతమంది తప్పించి.  కాని హిందూ సమాజం మాత్రం వర్ణ వ్యవస్థ మీదే ఆధారపడింది. క్రమ క్రమేణా అదే కుల వ్యవస్థకు దారితీసింది. వృత్తిని బట్టి కులం ఏర్పడింది. అయినా వెయ్యి సంవత్సరాల క్రితం వరకూ కూడా కులం వున్నా అంతగా స్థిరీకరణ జరగలేదు. కులాంతర వివాహాలు , సహపంక్తి భోజనాలు జరిగేవి. కాకతీయుల కాలం లో కూడా కులం వివాహాలకు పెద్ద ప్రతిబంధకంగా లేదు. రాను రాను హిందూ మత ఉనికి ఇస్లాం దాడితో ప్రమాదం లో పడిన దగ్గరనుంచి కులం పూర్తిగా కరుడుకట్టుకు పోయింది. ప్రతిదీ అదే కులం కట్టుబాటుల్లోనే కుచించుకు పోయింది. దీనికి ఆత్మరక్షణ కోసం ఏర్పడిన పరిణామంగా సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై మరింత పరిశోదన జరగాల్సి వుంది. అయితే ఇది రాను రాను హిందూ సమాజాన్ని చీలికలు, పేలికలుగా తయారు చేసింది. సామాజిక అసమానతలు, బేధ భావాలు పెరిగి అసలు హిందూ మత ఉనికికే ప్రమాదం తెచ్చే స్థాయికి ఎదిగింది.

సామాజిక పరివర్తన దిశగా అడుగులు

ఓ విధంగా బ్రిటిష్ వారి రాక, వారి పరిపాలన తో పాటు సామాజిక విషయాలపై అవగాహన మొదలయ్యింది. క్రైస్తవ మిషనరీలు హిందూ మతం లోని కుల అంతరాలను ఎత్తి చూపటం, ఆధునిక విద్యను  ప్రవేశపెట్టటం లాంటి చర్యలు కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. కుల అంతరాలకు వ్యతిరేకంగా సాంఘికోద్యమాలు మొదలయ్యాయి. జ్యోతిరావు ఫూలే లాంటి వాళ్ళు దీనిపై పెద్ద ఉద్యమాన్నే తీసుకొచ్చారు. మద్రాస్ ప్రావిన్సు లోనూ అటువంటి ఉద్యమాలు మొదలయ్యాయి. మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించటం మొదలుపెట్టాక దీనిపై మరింత అవగాహన పెరిగింది. కులం హిందూ మత ఐక్యతకు పెద్ద అవరోధమని గుర్తించాడు. ముఖ్యంగా అస్పృశ్యత పేరుతో కొనసాగుతున్న దురాచారాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. దానిపై సాంఘిక ఉద్యమాన్ని చేపట్టాడు. రెండోవైపు అంబేద్కర్ విదేశీ చదువులు చదివి భారత్ కి వచ్చి బొంబాయి లో స్థిర పడ్డాడు. తను ఈ వివక్షపై అలుపెరగని పోరాటం చేశాడు. ప్రత్యక్షంగా ఈ పోరాటాలను దగ్గరుండి నడిపించాడు. మహద్ గ్రామ పోరాటం పెద్ద మలుపు.  ఇవి ఎంతోమంది హిందూ మత శ్రేయోభిలాషుల మీద కూడా ప్రభావితం చేసింది.  గాంధీజీ , అంబేద్కర్ ఎవరి  పంధాలో వారు వుద్యమాన్ని నడిపినా ఇద్దరూ ఈ సాంఘిక దురాచారం పోవాలనే కోరుకున్నారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలనే దానిపై ఇద్దరిలో విభేదాలు తీవ్రమయ్యాయి. గాంధీజీ  కుల వ్యవస్థ పోవాలని కోరుకున్నా, ఆ మిషతో  హిందూ సమాజం విడిపోకూడదని కోరుకున్నాడు. అందుకే ప్రత్యేక  నియోజక వర్గాల్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చివరకు పూనా ఒడంబడిక తో ఈ వివాదం సమసి పోయింది. ఈ ఒప్పందం తో  హిందూ సమాజాన్ని విభజన నుంచి గాంధీజీ  కాపాడాడని చెప్పొచ్చు.  ఈ ఘటన హిందూ సమాజ చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టం గా చెప్పొచ్చు.

హిందుత్వానికి  ఆద్యుడైన వీర సావర్కర్ కూడా కుల వ్యవస్థని వ్యతిరేకించాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్ ఎస్ ఎస్ కూడా తమ పత్రికల్లో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాసాలు రాయటం చూసాను. అంటే హిందూ మతస్తుల కోసం పనిచేసే వారు కూడా కులం హిందూ మత ఐక్యతకు ముప్పని గ్రహించారు. కానీ ఆచరణలో కులాన్ని నిర్మూలించ టానికి ఎటువంటి నిర్దిష్ట ఉద్యమం చేపట్టలేదు. ఇది ఈ సంస్థలకు నాయకత్వం వహించే వారిలోని బలహీనతగా చెప్పొచ్చు. ఒకవైపు సమాజం లో వస్తున్న మార్పుల్ని గమనించినా , సూత్రబద్ధంగా కుల వ్యవస్థ తప్పని గ్రహించినా దాని నిర్మూలకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కులాంతర వివాహానికి సర్ సంఘ్ చాలక్ హాజరైనట్లు మాత్రమే వ్యాసాల్లో   చూసాను. అది ఒక్కటే సరిపోదు. వాస్తవానికి హిందూ సంస్థలు తీవ్రంగా ఈ సమస్యను తీసుకొని వుంటే ఈ 72 సంవత్సరాల్లో హిందూ సమాజం మరింత ఇక్యతను సాధించేది. ఈ సంస్థలు అగ్రకుల ఆధిపత్యం లో వున్నవనే ఆరోపణల నుండి బయట పడేవి. ముఖ్యంగా హిందూ సమాజానికి ఎంతో మేలు జరిగేది. అంబేద్కర్ హిందూ మతాన్ని విడిచిపోయిన తర్వాతయినా ఈ సమస్య తీవ్రతని గుర్తించ లేకపోవటం ఈ సంస్థల బలహీనత . అయితే బిజెపి రాజకీయపరంగా దీన్ని గుర్తించిందని చెప్పొచ్చు. అధికారం లో ఆ పార్టీ తరఫున వెనకబడిన కులాల వాళ్ళని, దళితుల్ని, ఆదివాసుల్ని, స్త్రీలను కీలక పదవుల్లోకి తీసుకోవటంతో కొంతమేరకు ఈ సమస్యను రాజకీయంగా అధిగమించిందని చెప్పాల్సి వుంటుంది. కానీ సామాజిక సంస్కరణలు రాకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యిందనుకుంటే పొరపాటు. ఈ గుర్తింపు రాజకీయాలు తాత్కాలిక ప్రయోజనాన్నే ఇస్తాయి. దీనికి శాశ్వత పరిష్కారం హిందూ సమాజం లో కులం అంతర్ధానం కావటం ఒక్కటే. అదెలానో చూద్దాం.

రిజర్వేషన్లు పరిష్కారమా?

అంబేద్కర్ , గాంధీజీ పూనా ఒప్పందం తో హిందూ సమాజం లో భాగంగానే  దళితులకు రిజర్వేషన్లు అమలులో కొచ్చాయి. రాజ్యాంగం లో దీనిపై స్పష్టమైన హామీలు ఉండటంతో సామాజిక అన్యాయాన్ని నిర్మూలించటం లో ఈ రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తర్వాత దశలో వెనకబడిన కులాలకు కూడా మండల్ కమీషన్ నివేదికతో మరింత స్పష్టంగా రిజర్వేషన్లు అమలుచేయబడ్డాయి. అయితే దీనిపై అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. ఈ రిజర్వేషన్లు కోరుకున్న అంబేద్కర్ ఆశయం ఎప్పటికైనా కులాన్ని పూర్తిగా నిర్మూలించటమే. కానీ ఈ 72 సంవత్సరాల సామాజిక చరిత్ర చూస్తే కుల గుర్తింపు రాను రాను ఎక్కువవుతుంది తప్పిస్తే తగ్గటం లేదు. సరే ఆ మహాశయుని విశాల దృక్పధాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు తీసుకురావటానికి గల ప్రధాన కారణాన్ని పరిశీలిద్దాం. సామాజిక అసమానతలను, అన్యాయాన్ని తొలగించి సమన్యాయం చేయటం ఆయన ఉద్దేశం. అందుకే వీటిని పదేళ్ళకొకసారి సమీక్షించుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆశించిన ఫలితం ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చిందా అంటే పాక్షిక ఫలితమేనని చెప్పొచ్చు. ఈ 72 సంవత్సరాల్లో రిజర్వేషన్లు వుండటం వలనే ఎంతోమందికి ఉద్యోగాలు, రాజకీయాధికారం వచ్చిందనేది సత్యం. ఆ సదుపాయమే లేకుంటే ఈ అవకాశాలు వీరిలో ఎక్కువమందికి వచ్చివుండేవి కాదనేది కూడా సత్యం. వీటితో పాటు ఇంకో సత్యం కూడా వుంది. ఈ రిజర్వేషను సదుపాయం కల్పించి ఇప్పటికి రెండు తరాలు దాటి మూడో తరం నడుస్తుంది. అంటే మొదటి తరం లో రిజర్వేషన్లతో వుద్యోగం వచ్చిన వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఈ రిజర్వేషను సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇందులో వున్నత ఉద్యోగాలు చేసిన వారి ( క్లాస్ 1 ,2 ) తర్వాత రెండు తరాల వాళ్లకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావటంతో పోటీలో దళితుల్లో సమాజం లో తక్కువ స్థాయి లో వున్న ( గ్రామీణ, పట్టణ పేద  , క్లాస్ 3 , 4 ఉద్యోగుల వారసులు) వారు ఈ పోటీలో తట్టుకునే పరిస్థితి లేదు. ఇది కూడా సత్యమే. అలాగే వెనకబడిన వర్గాల్లో సామాజికంగా , ఆర్ధికంగా ఉన్నతంగా వున్న వాళ్ళే ఈ సదుపాయాన్ని దక్కించుకుంటున్నారు. అదే వారిలోని పేద ప్రజలు ఎప్పటిలాగే అన్యాయానికి గురవుతున్నారు. కొంతమేరకు ఆదివాసుల్లోనే పేదవారికి కూడా అవకాశం దక్కుతుంది.   ఏ ఆశయం కోసం రిజర్వేషన్లు కల్పించారో ఆ ఆశయం పూర్తిగా నెరవేరటం లేదు. సమాజం లోని అట్టడుగు వారికి ఈ ఫలాలు అందినప్పుడే ఈ రిజర్వేషన్ల ఆశయం సార్ధకమవుతుంది. అదే సమయం లో కులరహిత సమాజ నిర్మాణం దిశగా ఇప్పటికైనా అడుగులు వేయాల్సివుంది.

రిజర్వేషను వ్యవస్థలో మార్పులు రావాలి 

సమాజం లో అత్యున్నత స్థానం లో వుండి , మొదటి,  రెండో తరగతి ప్రభుత్వ ఉద్యోగాల్లో వుండి  వారి రెండో తరం వారసులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని సమీక్షించటం అవసరం. ఆ స్థానంలో ఇప్పటివరకు అదే కులంలో వుండి ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం పొందని వాళ్ళు , మూడో, నాలుగో తరగతి ఉద్యోగస్తుల వారసులు , గ్రామీణ, పట్టణ పేద ప్రజలకి అవకాశం కల్పించాలి. ఏ రిజర్వేషన్ క్యాటగిరీలో వుంటే వారికే ఈ సదుపాయం వర్తిస్తుంది. అంటే రిజర్వేషన్ క్యాటగిరీ మారదు. అందులో కొంతమంది అనర్హులవుతారు. ఈ సంస్కరణ అదే కులం లో వున్న అట్టడుగు వారికి లబ్ది చేకూరుతుంది.

అలాగే అంబేద్కర్ ఆశయమైన కులరహిత సమాజం ఏర్పడాలంటే కులాంతర వివాహాల్ని ప్రోత్సహించాలి. ఇందులో భాగంగా కులాంతర వివాహం చేసుకున్నవారికి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించాలి. అందులోనూ ఏ రిజర్వేషన్ క్యాటగిరీలో వాళ్ళను చేసుకుంటే ఆ క్యాటగిరీ రిజర్వేషన్ వర్తించాలి. అలా జరిగినప్పుడే సమాజం లో మార్పు వచ్చే అవకాశముంది. అదే రిజర్వేషన్ లేని ‘వున్నత ‘ కులాల్లో కులాంతర వివాహాలు జరిగినా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కాకపోయినా మిగతా ప్రోత్సాహకాలు కల్పించాలి. ఇలా జరిగినప్పుడే దీర్ఘకాలం లో కులరహిత సమాజం ఏర్పడుతుంది.

కులరహిత సమాజమే హిందూ సమాజానికి శ్రీరామ రక్ష

హిందూ సమాజం ఇప్పటివరకు నిలబడిందంటే కారణం దాని తాత్విక బలం, వైవిధ్య సంస్కృతి, అన్ని ఆలోచనల్ని తనలో ఇముడ్చుకునే శక్తి . ఇప్పటివరకు తన ఉనికికి వచ్చిన ప్రమాదాల్ని ఎదుర్కుంటూనే వచ్చింది. అయితే ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా వుండవు. అంతర్గతంగా వున్న బలహీనతలను తొలగించుకున్నప్పుడే అది మరింత శక్తిమంతంగా , ఐక్యంగా ముందుకెళ్ళగలదు. దానికి ప్రధాన ముప్పు ఎప్పటికైనా కులమే. ఇది మొదట్నుంచీ ఉన్నదీ కాదు, మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలి. 21 వ శతాబ్దం లో పాత కుల వృత్తులు అంతర్దానమయ్యాయి. దానికి అనుగుణంగా మారాలి. అలా మారటమే శ్రీ రామ రక్ష అవుతుంది. లేకపోతే ప్రమాదం ఎప్పుడూ పొంచివుంటుంది. ఇక స్వాతంత్రానంతర హిందూ సమాజం ఎలా మార్పులు చెందిందో వచ్చే భాగం లో చూద్దాం.