ఈరోజు ఏ రంగాలపై మాట్లాడబోతుందనేది ముందుగా జాతీయ చానళ్ళు ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్ళు ఊహించుకొని ముందుగానే చర్చలు జరిపారు. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ కీలకమైన రంగాల్లో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చారు. మన తెలుగు చానళ్లయితే జనం జేబుల్లో ఈరోజు డబ్బులు పెడతారేమోనని ఆశలు కల్పించారు. వీటన్నింటికీ భిన్నంగా కీలకమైన బొగ్గు, ఖనిజాలు , రక్షణ లాంటి రంగాల్లో కీలక సంస్కరణలు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది నిర్మలమ్మ. అవేమిటో ఒక్కసారి చూద్దాం.
అన్నింటికీ వర్తించేవి :
- ఫాస్ట్ ట్రాక్ లో పెట్టుబడుల కు అనుమతులు . దీనికోసం సెక్రటరీ స్థాయి గ్రూప్ ఏర్పాటు
- ప్రాజెక్టుల అభివృద్ధి సెల్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఏర్పాటు చేస్తారు
- కొత్త పెట్టుబడులను ఆకర్షించటంలో రాష్ట్రాలకు ర్యాంకులు
- అధునాతన రంగాల్లో కొత్త పెట్టుబడులను ఆకర్షించటానికి ప్రోత్సాహకాలు
- కొత్త పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటులో రాష్ట్రాలకు కొత్త పధకం
- భూ బ్యాంక్ వివరాలు అందరికీ అందుబాటులో వుండే సమాచార వ్యవస్థ
వీటితోపాటు 8 రంగాల్లో కీలక సంస్కరణలను ప్రకటించింది. అవేమిటో ఒక్కసారి చూద్దాం.
బొగ్గు పరిశ్రమలో సంస్కరణలు :
- ప్రైవేటు బొగ్గు గనులకు సరళీకృత విధానం . ఎవరైనా పాట పాడుకోవచ్చు, తర్వాత వచ్చిన బొగ్గుని బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవచ్చు.
- కొత్తగా 50 బ్లాకులు అమ్మకానికి సిద్ధం.
- మొత్తం అభివృద్ధి చేసినవే కాకుండా , అసంపూర్తి గా వున్నవి కూడా అమ్ముతారు. ముందుగా ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తారు.
- బొగ్గుని గ్యాస్ గా మార్చే పనికి ప్రోత్సాహకాలు
- మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం 50 వేల కోట్ల రూపాయల కేటాయింపు.
- బొగ్గు బెడ్ మిథేన్ వెలికితీత హక్కులు కోల్ ఇండియా అమ్ముతుంది.
- వ్యాపారానికి అనుకూలమైన విధానాలు
ఖనిజ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహకాలు :
- సంస్థాగత సంస్కరణలు
- అన్నీకలిపి ( వెలికితీత, మైనింగ్ , ఉత్పత్తి) ఒకే విధానం
- 500 బ్లాకులు ప్రైవేటుకు అమ్మకానికి సిద్ధం
- బొగ్గు, బాక్సైట్ కలిపి వుమ్మడి అమ్మకం
- కాప్టివ్, నాన్ కాప్టివ్ బొగ్గు గనుల వ్యత్యాసం తొలగింపు
- మినరల్ సూచీ త్వరలో తయారు
- స్టాంప్ డ్యూటీ హేతుబద్ధత
రక్షణ రంగం లో అనేక మార్పులు :
- ‘ భారత్ లో తయారి ‘ దిశగా విధాన మార్పులు
- కొన్ని ఆయుధాలు / సామాగ్రి దేశీయ రంగానికే కేటాయింపు. ఆ రంగాల్లో విదేశీ ఆర్డర్ల పై నిషేధం.
- విడి భాగాలను దేశం లోనే తయారీకి పధకం.
- దిగుమతి బిల్లు గణనీయంగా తగ్గింపు
- విదేశీ పెట్టుబడులపై ప్రస్తుతం వున్న 49 శాతం నిబంధనను 74 శాతానికి పెంపు. దీనితో విదేశీ పెట్టుబడులు విరివిగా వచ్చే అవకాశం.
- నిర్దిష్ట కాల పరిమితి లో రక్షణ పరికరాల కొనుగోలు .
సివిల్ వాయురంగం :
- సమర్ధవంతంగా వాయు స్పేస్ వినియోగం
- దీనితో 1 వేయి కోట్ల రూపాయలు ఆదా .
- ఇంధనం , కాలం కూడా ఆదా
- ఇంకా 6 విమానాశ్రయాలు ప్రైవేటీకరణ .
- దీనితో మొత్తం మొదటి , రెండవ రౌండ్ కలిపి 13 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు.
- ఎం ఆర్ ఓ ( Maintenance, Repair and Overhaul) హబ్ గా భారత్
విద్యుత్తు రంగం లో సంస్కరణలు :
- కొత్త టారిఫ్ పాలసీ త్వరలో వస్తుంది.
- ఇందులో వినియోగదారుడి హక్కులు పరిరక్షించబడతాయి. అసమర్ధ పంపిణీ సంస్థల భారం వినియోగదారుడు పై పడకుండా జాగ్రత్తలు
- విద్యుత్తు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు
- సరయిన చెల్లింపు విధానం
- సబ్సిడీ నేరుగా వినియోగదారుడి ఖాతా లోకి.
- దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు
- కేంద్రపాలిత ప్రాంతాల్లో పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ
- రాష్ట్ర పంపిణీ సంస్థల్లో పనితీరు మెరుగు
సామాజిక మౌలికరంగంలో పెట్టుబడులు :
- కేంద్రం ఇచ్చే ప్రోత్సాహక నిధిని మొత్తం ప్రాజెక్టులో 20 శాతం నుంచి 30 శాతానికి పెంపు.
- దీనికోసం 8100 కోట్ల రూపాయలు కేటాయింపు.
- దీనివలన ఆసుపత్రులు, పాఠశాలలు కొత్తవి వచ్చే అవకాశం వుంది.
అంతరిక్ష పరిశోధన లో ప్రైవేటు రంగం పాత్ర
- అనేక అంతరిక్ష ప్రాజెక్టుల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించటం
అణుశక్తి రంగం లో సంస్కరణలు
- మెడికల్ ఐసోటోప్సు తయారీలో ప్రైవేటీ రంగాన్ని ఉపయోగించుకోవటం . దీనివలన క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స లో వెసులుబాటు.
- ఆహార భద్రతకి సంబంధించి సాంకేతికత పరిజ్ఞానాన్ని ప్రైవేటు పెట్టుబడులతో ఉపయోగించుకోవటం.
- స్టార్ట్ అప్ రంగాన్ని ప్రోత్సహించటం
ఈరోజు ప్రకటించిన 8 రంగాల్లో 7 కేవలం సంస్కరణలకు సంబంధించినవే కావటం గమనార్హం. మోడీ కరోనా మహమ్మారి సంక్షోబాన్ని ఓ బంగారు అవకాశంగా మార్చుకొని ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే భాగం గానే ఈ సంస్కరణలను చూడాల్సివుంటుంది. 1991 సరళీకృత విధానం తర్వాత ఇదో పెద్ద ముందడుగా ఈ సంస్కరణలను చెప్పొచ్చు. అందరికీ భారత్ అగ్రగామి ఆర్ధిక వ్యవస్థగా మారాలని కోరికగా వుంది. అది ఇటువంటి సాహసోపేత నిర్ణయాల వలనే జరుగుతుంది. ఈ సంస్కరణలను తీసుకొచ్చినందుకు మరొక్కసారి మోడీ కి అభినందనలు . చూద్దాం రేపు విశేషాలు ఎలా ఉంటాయో .