
దేశంలో లాక్డౌన్ కారణంగా సెలబ్రెటీలంతా ఇంటికి పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో సినీ స్టార్లు, క్రికెట్ల సందడి మూములుగా ఉండటంలేదు. లాక్డౌన్ అనుభవాలను నిత్యం సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. సినిమా స్టార్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా క్రికెటర్లు సోషల్ మీడియాలో తమ పోస్టులతో హల్చల్ చేస్తున్నారు. ముఖ్యంగా విరుష్క దంపతులు లాక్డౌన్లో తమ సరదా అనుభవాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల అనుష్క శర్మ తన భర్త కోహ్లీని ఆటపట్టిస్తూ ఓ వీడియో పోస్టు చేసింది. ‘ఏయ్ కోలీ.. చౌకామార్.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ అనుష్క క్లోహ్లీని ఆటపట్టింది. ఆమె చేసిన పనికి కోహ్లీ బిత్తర చూపులు చూస్తూ గమ్మున ఉండిపోయాడు. ఈ వీడియోను అనుష్కనే స్వయంగా తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఫన్నీగా ఉండటంతో వైరల్ అయింది.
తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మ నిర్మించిన ‘పాతాళ్ లోక్ సీజన్ 1’ వెబ్ సిరీస్‌కు రివ్యూ రాశాడు. అనుష్క శర్మ రూపొందించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ ఎంతో అద్భుతంగా ఉందని కోహ్లీ ప్రశంసించాడు. కథ, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉందని.. నటీనటులు బాగా చేశారని కితాబిచ్చాడు. ఈ రివ్యూకు తన ఇన్ స్ట్రాలో పోస్టు చేసిన కొద్దిగంటల్లోనే 13లక్షల మందికిపైగా లైక్ కొట్టారు. అనుష్క నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా రివ్యూ రాసి కోహ్లీ తనలోని మరో టాలెంట్ బయటకుతీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడు బ్యాటింగ్లో అదరగొట్టే కోహ్లీ.. సినిమా రివ్యూలు రాసి అదరగొట్టడంతో అభిమానులు ఖుషీ అవుతోన్నారు.