Home Blog Page 8486

బస్సు ఎక్కేందుకు రేడినా!


రాష్ట్రంలో బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అధికారులు బస్సుల్లో సీట్లు మధ్య సామాజిక దూరం పాటిస్తూ డీలక్స్ బస్సులో సింగిల్ సిట్టింగ్ మూడు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్లపై మార్క్ంగ్ చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ ప్రారంభించింది, పల్లె వెలుగు బస్సులకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించారు. బస్సులు అన్ని సింగిల్ స్టాప్ విధానంలో నడపబడతాయి. బస్సు బయలుదేరే ప్రదేశంలో ఎక్కడం, గమ్యస్థానంలో దిగేందుకు అవకాశం ఉంటుంది. మధ్యలో పాసింజర్లను ఎక్కించుకోవడం, దింపడం రెండింటికి అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.

బస్సు ఎక్కే, దిగే సమయాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే బస్సులో ప్రయాణించడానికి అవకాశం ఇవ్వరు. మరోవైపు స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుని, వారి అభ్యర్థనను జిల్లా అధికార యంత్రాంగం అంగీకరించిన వారికే ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బస్సులు నడిపి క్రమేణా వాటి సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని ఆర్టీసీ భావిస్తోంది.

కేంద్రం డబ్బిస్తే పంచుకుందామనా కేసీఆర్!


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తం అవుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ విమర్శలు కురిపించడం పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే తలింతా పంచుకుందామని కొందరు రాబందుల్లా ఎదురుచూస్తున్నారని సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలి అని కేసీఆర్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రం నేరుగా నగదు ఇస్తే తమ జేబులు నింపుకుందామనా? అభివృద్ధి పనుల పేరుతో కమీషన్లు దండుకుందామనా? అంటూ ప్రశ్నించారు. గతంలో ఇదంతా జరిగిందేమో….మోడీ సర్కార్ హాయాంలో ఇది సాధ్యం కాదని సంజయ్ స్పష్టం చేశారు.

పదిహేను రోజుల జీతాలకు కోత విధించిన కేసీఆర్ కు కేంద్రాన్ని విమర్శించే హక్కు ఎక్కడిది? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్దీపనలు ఫ్యూడల్‌ విధానంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ అనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. భూస్వామ్య విధానం గురించి, ఫ్యూడల్ స్వభావం గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు కేంద్రం డబ్బులు ఇవ్వాలా? అంటూ ప్రశ్నించారు. ఏమైనా అంటే రైతు బంధు ఇస్తున్నా అంటున్నాడని ధ్వజమెత్తారు. వ్యవసాయంలో రైతు బంధు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇంకేమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఇబ్బముబ్బడిగా రుణాలు తీసుకుని ప్రజలపై భారం మోపకుండా ఉండేందుకు ఎఫ్.ఆర్.బీ.ఏం చట్టం ఒక పరిమితిని విధించిందని గుర్తు చేశారు. అందుకే ఎఫ్ ఆర్ బీఎం విషయంలో ఖచ్చితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.

” అయినా ..మేము 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాం… నువ్వెన్ని కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తున్నావో చెప్పు?” అంటూ సంజయ్ సవాల్ చేశారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒకవైపు ప్రధాని మోడీ ఆద్భుతంగా ప్రజల ఆదరణను చూరగొంటుంటే, ఇంకోవైపు కేసీఆర్ ప్రజల చీత్కారానికి గురవుతున్నారని దుయ్యబట్టారు.

తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకుల్లో కూడా అత్యంత ప్రజాస్వామిక దృష్టితో ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ ఎంత ఉపయోగకరమో….ప్రజలు రాబోయే రోజుల్లో తెలుసుకుంటారని సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మద్యం అమ్మకాల కేసు విచారణ వాయిదా..!


లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరుపుతున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాలను నిలుపుదల చేయాలంటూ మొత్తం మూడు పిటీషన్ లు దాఖలు అయ్యాయి. మద్యం అమ్మకాల సమయంలో భౌతికదూరం పాటించడం లేదంటూ పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా వాటిని పాటించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. నిబంధనలు పాటించకపోతే కరోనా మరింత వ్యాపి చెందుతుందని తెలిపారు.

మరోవైపు ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగానే వైన్ షాపులకు అనుమతి ఇచ్చామని ప్రభుత్వం తరుపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లలో వైన్ షాపులు తెరవడం లేదని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంపై హైకోర్టులో పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు ఉద్యోగి లక్ష్మీనరసింహమూర్తి పిటిషన్‌ వేశారు. మార్చి, ఏప్రిల్‌ వేతనాల్లో కోత విధించడం చట్టవ్యతిరేకమైన చర్యగా పేర్కొన్నారు. రెండు నెలలు పూర్తి వేతనం ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సుధాకర్ పై దాడిని ఖండించిన ప్రభుత్వ వైద్యుల సంఘం..!


విశాఖ రోడ్లపై ప్రభుత్వ వైద్యుడిని అర్ధనగ్నంగా చూడటం బాధగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ జయధీర్ అన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులపై ఇలాంటి ఘటన దారుణమన్నారు. సాటి వైద్యుడు సుధాకర్‌పై దాడిని చూసి వైద్యులంతా నిర్ఘాంతపోయామని జయధీర్‌ అన్నారు. వైద్యుడు సుధాకర్‌పై దాడిని ప్రభుత్వ వైద్యులుగా ఖండిస్తున్నామని తెలిపారు. గత నెల రోజుల నుంచి సుధాకర్ మానసిక క్షోభతో ఉన్నారని తెలిపారు. సుధాకర్ చేతులు వెనక్కికట్టిన వ్యవహరించిన తీరు మంచిది కాదని అభిప్రాయ వ్యక్తం చేశారు.

పోలీసులపై న్యాయపరమైన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధాకర్​కు వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్స్‌పైనా విచారణ చేపట్టాలని సుధీర్ కోరారు. సుధాకర్‌కు న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సీఎంపై వైద్యుడు సుధాకర్‌ వ్యాఖ్యలనూ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఖండిస్తోందని వెల్లడించారు. ప్రధాని, సీఎంపై వైద్యుడు సుధాకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ఎల్.జి అనుమతులపై చర్చకు బాబు ఛాలెంజ్..!


ఎల్‌జీ పాలిమర్స్‌కు వైకాపా ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదనడం అవాస్తవమని చంద్రబాబు ఆరోపించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయ లాభం పొందాలని చూడటం హేయంగా అభివర్ణించారు. జగన్‌ చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నామని తెలిపారు. తెదేపా హయాంలో ఎకరం భూమి కూడా ఎల్‌జీ పాలిమర్స్‌కు కేటాయించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మేం సమర్పించిన వివరాలపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ చేశారు. 1961 నుంచి 2020 వరకు ఈ కంపెనీ పూర్వాపరాలను ప్రజల దృష్టికి తెస్తున్నామని వివరాలను చంద్రబాబు వెల్లడించారు.

ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వినియోగిస్తున్న 219ఎకరాల భూమిని 1964 నవంబర్ 23వ తేదీన అప్పటి ప్రభుత్వం ఎకరం రూ. 2,500 చొప్పున కేటాయించిందని తెలిపారు. ( జివో నెం 217). ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపులను 1992 అక్టోబర్ 1వ తేదీన అప్పటి ప్రభుత్వం (జీవో నెం 1033)ఇచ్చిందన్నారు. టిడిపి హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా ఎల్జీ పాలిమర్స్ కు కేటాయించలేదని చెప్పారు. భూముల కేటాయింపుపై వైసిపి చేస్తున్న దుష్ప్రచారం దీనిని బట్టే తెలుస్తోందన్నారు.

అదేవిధంగా 2007 మే 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందని, 2009 సెప్టెంబర్ 1వ తేదీన మరోసారి రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2012 ఏప్రిల్ 13వ తేదీన, అదేవిధంగా 2012 మే 6వ తేదీన క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు సార్లు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రెండు సార్లు పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్స్ లు ఇచ్చాయని చెప్పారు. టిడిపి ప్రభుత్వం గత ప్రభుత్వాల పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసిందే తప్ప కొత్తగా అనుమతి ఇవ్వలేదు. పైగా పాలిస్టైరీన్ ఉత్పత్తులకు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి నిరాకరించిందని, కంపెనీకి ఎప్పుడెప్పుడు ఏయే ప్రభుత్వాలు ఎలాంటి అనుమతులు ఇచ్చాయో మావద్ద ఉన్నాయని చెప్పారు. వీటిపై చర్చకు సిద్దమా అని ఛాలెంజ్ చేస్తున్నామని తెలిపారు.

టీడీపీ హయాంలో పరిశ్రమ విస్తరణకు అనుమతి నిరాకరించిందన్నారు. 2018 జూన్ 20వ తేదీన, డిసెంబర్ 27వ తేదీన టిడిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వైసిపి నాయకులు, దొంగ సాక్షి చేస్తున్న ప్రచారం వాస్తవాలు వక్రీకరించడమేనని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కేటగిరి మార్పు వెనుక హస్తం వైసిపి ది కాదా అని ప్రశ్నించారు. ఈ కంపెనీ స్టైరీన్ ఉత్పత్తుల విస్తరణకు అనుమతి ఇచ్చింది, 2019 జులై 9న కేంద్రానికి సిఫారసు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. (ఏపి స్టేట్ లెవెల్ ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ అథారిటి పంపిన సిఫారసు ఇదిగో) విశాఖలో జరిగిన దుర్ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హుటాహుటిన స్పందించి రూ.50కోట్ల డిపాజిట్ చేయాలని కంపెనీని ఆదేశించిందని, దీనిపై స్టే కోసం ఎల్జీ పాలిమర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక హస్తం వైసిపిదేనన్నారు.

ఏపీ, తెలంగాణాలకు కృష్ణా బోర్డు ఝలక్..!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతానికి కేటాయింపునకు మించి నీటిని వినియోగించుకున్నందున పలు ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగం నిలిపివేయాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. సాగర్‌ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం లేఖ రాశారు. మే నెల వరకు చేసిన కేటాయింపుల కన్నా ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో బోర్డు పేర్కొంది. నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులను విధిగా పాటించాలని బోర్డు ప్రభుత్వానికి సూచించింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని బోర్డు స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వానికి సాగర్ కుడి కాల్వ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటి వరకు 48.328 టీఎంసీల నీటిని వినియోగించినట్లు తెలిపింది.

రుతుపవనాలు ప్రారంభమయ్యే వరకూ తాగునీటి అవసరాల కోసం మిగిలిన నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని బోర్డు అభిప్రాయం వ్యక్తం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తీసుకున్నందున ఆయా కాల్వల ద్వారా నీటి విడుదలను ప్రస్తుతానికి నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో పేర్కొంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బోర్డు చర్యలు చేపట్టింది.

మరోవైపు తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నదిపై అనుమతి చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు సమర్పించాలని ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. పోతిరెడ్డిపాడుపై తన వాదనలు వినిపించిన సమయంలో కృష్ణా నదిపై తెలంగాణా ప్రభుత్వం అనుమతులు లేకుండా ఐదు ప్రాజెక్టును నిర్మించినట్లు ఏపీ అధికారులు పిర్యాదు చేశారు. దీంతో ఈ పాలమూరు-రంగారెడ్డి, దిండి, భక్తరామదాసు, తుమ్మిళ్ల, ప్రాజెక్టుల డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్)లు, కల్వకుర్తి, నెట్టంపాడు, ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపుపై పిర్యాదులు అందడంతో వాటి వివరాలతో హాజరు కావాలని తెలంగాణా జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. గతంలోనే ఈ ప్రాజెక్టుల వివరాలు అందజేయాలని ఆదేశించినా నేటివరకూ అందజేయలేదని తెలిపింది. ఏ పర్యాయం ఇచ్చిన గడువులోగా వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.

ఈ వారం యావరేజ్ కేసులు 5వేలు?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం యావరేజ్ కేసుల సంఖ్య 4వేలు ఉండగా ఈ వారం 5వేలు గా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా కరోనా కేసులు 5వేలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 5611గా ఉన్న‌ది. ఈ వారం మొత్తం రోజుకి సరాసరి కేసుల సంఖ్య 5వేలు దాటే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. గత 24 గంటల్లో 140 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఇక   దేశ‌వ్యాప్తంగా మొత్తం వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 106750గా న‌మోదు అయింది.  దేశ‌వ్యాప్తంగా 61,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 3303గా రికార్డు అయ్యింది.  కేంద్ర ఆరోగ్య‌, సంక్షేమ శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

తెలంగాణ‌లో కొత్తగా 42 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1634కు చేరుకున్న‌ది.  దీంట్లో 1011 మంది కోలుకున్నారు.  585 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. 38 మంది మ‌ర‌ణించిన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, సంక్షేమ శాఖ తెలిపింది.

200 నాన్ ఏసీ రైళ్ళుకి గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రద్దైన సాధారణ రైళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జూన్‌ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన సమయ పట్టికను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని.. కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వలస కార్మికుల కోసం నడిపే 200 శ్రామిక్‌ రైళ్లతోపాటు అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. అయితే రిజర్వేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

వివాదాన్ని రాజేస్తున్న నాగబాబు ట్వీట్..


నేడు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు అనుకూలంగా ట్వీట్ చేయడం వివాదస్పదంగా మారింది. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెండువర్గాలు విడిపోయి వరుస కామెంట్లు పెడుతోన్నారు. కొందరు నాగబాబును సమర్థిస్తుండగా మెజార్టీ ప్రజలు మాత్రం ఆయనను తప్పుబడుతున్నారు. ఇంతకీ నాగబాబు ఏం ట్వీట్ చేశారంటే..

‘ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గ్యుమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీ ని చంపితే.. అపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు. కానీ నాధురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాధురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్..’ అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు నాగబాబుపై తీవ్రస్థాయిలో మండిపడుతోన్నారు. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే నాగబాబు గాడ్సేకు అనుకూలంగా ట్వీట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి నాగబాబుకు గాడ్సేపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని పలువురు ప్రశ్నిస్తుండటం కొసమెరుపు.

ఏక్తాకపూర్ పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు


బాలీవుడ్ దిగ్గజ నిర్మాత ఏక్తాకపూర్ పై తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌ను కలిసిన ఏక్తా కపూర్ చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన ఏక్తాకపూర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏక్తాకపూర్ చెందిన బాలాజీ టెలీ ఫిలింస్ నిర్మించిన ‘ అన్ సెన్సార్డ్ సీజన్-2’లో కొన్ని సన్నివేశాలు ఆర్మీ జవాన్లను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. ఈ వెబ్ సీరిసులోని అలాంటి సన్నివేశాలను తొలగించి వెంటనే క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

‘అన్ సెన్సార్డ్ సీజన్‌ -2’ వెబ్ సిరీస్ ట్రైలర్‌ ఇటీవలే రిలీజైంది. ఇందులో ఆర్మీ యూనిఫామ్‌ను కించపరిచేలా సన్నివేశాలుండటంతో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోన్నాయి. ప్రజల రక్షణ కోసం దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఏక్తాకపూర్ పై దేశంలోని పలుచోట్ల నుంచి ఫిర్యాదులు నమోదవుతోన్నాయి. ఇదే అంశంపై నగరానికి చెందిన విశాల్ కుమార్ అనే యువకుడు సోమవారమే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫామ్ ను అపహస్యం చేసేలా చిత్రీకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫేస్ బుక్ పేజీలో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ వెంటనే తొలగించాలని కోరాడు.

Actor Teja with coffee brand

తెలంగాణ పీసీసీ చీఫ్ ఆయనేనా?

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉత్తం కుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానం కోసం మల్కాజిగిరి ఎమ్.పి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు,సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు వంటివారు క్యూలో ఉన్నారు. అయితే వీరందరిని కాదని భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించవచ్చని సమాచారం. ఢిల్లీలో ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాందీని కలిశారని, ఆమె కోమటిరెడ్డిని పిసిసి అధ్యక్షునిగా నియమించాలన్న అభిప్రాయానికి వచ్చారని కాంగ్రెస్ లో కొందరు నేతలు అంటున్నారు. తెలంగాణలో మరికొందరు నేతలు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు, అయినప్పటికీ పార్టీ అదిష్టానం కోమటిరెడ్డివైపు మొగ్గుచూపవచ్చని అంటున్నారు. మరో వారం , పది రోజులలో తెలంగాణ పిసిసి అద్యక్షుడు కోమటిరెడ్డి వెంకటిరెడ్డా..? లేక మీరెవరినైనా నియమిస్తారా అన్నది స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కోవిడ్ సోకనివారు ఉండరేమో: జగన్


జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే నా బలమని తాను ప్రతి సారి చెబుతున్నానని, మీరంతా ఉత్తమ సామర్థ్యం ఉన్న వారిగా గుర్తించి పూర్తి నమ్మకం, విశ్వాసం మీపై పెట్టానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలను ఉద్దేశించి పేర్కొన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు బాగా పరిపాలన చేస్తే ప్రభుత్వం కూడా బాగా పరిపాలన చేసినట్టే అని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కరోనా వైరస్‌ నివారణలో అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో గ్రామ వాలంటీర్, సచివాలయం, ఆశావర్కర్లు, ఏఎస్‌లు, డాక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎస్సైలు, పారిశుద్ధ్య కార్మికులు అంతా అద్భుతంగా పని చేశారన్నారని తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షను మంగళవారం నిర్వహించారు.

ఇప్పుడు నాలుగో విడత లాక్‌డౌన్‌లో కొనసాగుతుందని, ఇంతకుముందు మనం అనుసరించిన పద్దతి వేరు, నాలుగో విడత లాక్‌డౌన్లో అనుసరిస్తున్న పద్దతి వేరని చెప్పారు. ఈ విడతలో మనం ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్‌ -19 నివారణపై మన దృష్టి ఉంచుతూనే, మరోవైపు ఆర్థిక వ్యవస్థను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.ఎకానమీ పూర్తిగా ఓపెన్‌ కావాలని, కలెక్టర్లు, ఎస్పీలు అందులో భాగస్వామ్యం కావాలని సూచించారు. షాపింగ్‌ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు ఇవి తప్ప మిగిలిన చోట అంతా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకుని వాటిని ప్రారంభించాల్సి ఉందన్నారు. చిన్న చిన్న దుకాణాల దగ్గరినుంచి ప్రతీదీ తిరిగి పునఃప్రారంభం చేయాలన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా ప్రజా రవాణా ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేటు వాహనాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ రెండూ తప్పనిసరిగా పాటిస్తూ అన్నీ ప్రారంభం కావాలన్నారు. మనం కోవిడ్‌-19తో కలిసి జీవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కోవిడ్‌ -19 సోకిన వారిని వివక్షతో చూడ్డం అన్నది సమాజం నుంచి తొలగించాలన్నారు. రాబోయే కాలంలో కోవిడ్‌ రానివారు ఎవ్వరూ ఉండరేమో అని చెప్పారు. అది వస్తుంది.. పోతుందన్నారు. కోవిడ్‌ పట్ల భయాన్ని తొలగించాలని, ఈ వైరస్‌ పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కలిగించాలని సూచించారు.

ప్రజలు తమకు తాముగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. స్వచ్ఛందంగా తమ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పే పరిస్థితి రావాలని కోరారు. దీన్ని మనం ప్రోత్సహించాలని చెప్పారు. పరీక్షల కోసం ఎవర్ని సంప్రదించాలి, ఎక్కడకు వెళ్లాలి, ఎలా పరీక్షలు చేయించుకోవాలనే అంశాలపై ఎడ్యుకేట్‌చేయాలన్నారు. పరీక్షల సదుపాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. వీటి నిర్మాణం కలెక్టర్ల ప్రథమ పనిగా భావించాలని స్పష్టం చేశారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల పరిధిని తగ్గించుకుంటూ వెళ్లాలని, భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని తెలిపారు.

వలస కార్మికుల తరలింపుపై కేంద్రం కీలక ఆదేశాలు!

Hyderabad

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రాష్ట్రాలు వలస కార్మికులను రానివ్వబోమని అంటుండడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం గైడ్ లైన్స్ మార్చింది. ఇక మీదట కార్మికుల తరలింపుపై రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది. రాష్ట్రాల అనుమతి ఉంటేనే వలస కార్మికులను పాత నిబంధనను తొలగించింది.

అలాగే లాక్‌ డౌక్‌ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కూలీల కోసం స్థానిక ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. వలస కార్మికుల తరలింపు కోసం ప్రస్తుతం నడుపుతునన రైళ్ల సంఖ్యను పెంచాలని రైల్వేమంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు రైల్వేలతో రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇస్తే సరిపోతుందని కేంద్రం తెలిపింది.

ఎన్టీఆర్ ను సర్ ప్రైజ్ చేయనున్న ‘బిగ్ బాస్’


రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రెషన్స్ దూరంగా ఉంటున్నాడు. దేశంలోని విపత్కర పరిస్థితుల్లో అభిమానులు ఇళ్లలోని ఉండాలని సెలబ్రేషన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించద్దని కోరారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానులు భావించారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ బర్త్ డేకు సర్ ప్రైజ్ ఉంటుందని.. కానీ అదేంటో ఇప్పుడే చెప్పలేనని ప్రకటించడంతో అభిమానులు అత్రుతగా ఎదురుచూశారు. అయితే ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఎన్టీఆర్ కు బర్త్ డే గిప్ట్ ఇచ్చే పరిస్థితి లేదని ప్రకటించడం అభిమానులు నిరాశ చెందారు. ఇదిలా ఉండగా తాజాగా ‘బిగ్ బాస్-1 హౌజ్ మేట్స్’ ఎన్టీఆర్ బర్త్ డేకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేయడం ఆసక్తిని రేపుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రాణిస్తూ బుల్లితెరపై హోస్టింగ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు రియాలిటీ షోలను బిగ్ బాగ్ నిర్వాహకులు పరిచయం చేశారు. బాగ్ బాస్ తొలిసీజన్ ‘బిగ్ బాస్-1’కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ షో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘బిగ్ బాస్-3’ కాంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కోసం కంటెస్టెన్స్ ను ఎంపిక చేస్తోంది. త్వరలోనే ‘బిగ్ బాస్-4’ రాబోతుంది. అయితే ఈ షోకు వాఖ్యతలుగా నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరూ బిగ్ బాస్-4 వ్యాఖ్యతగా వ్యవరిస్తారనే త్వరలోనే తేలనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్-1 హౌజ్ మేట్స్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ స్పెషల్ వీడియో ప్లాన్ చేశారు. రేపు ఉదయం 9.30గంటలకు సంగీత దర్శకుడు థమన్ ఈ వీడియోను విడుదల చేయనున్నాడు. దీంతోపాటు దర్శకుడు త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో ప్రారంభం కానున్న మూవీ టైటిల్, ఫస్టు లుక్ విడుదల చేయనున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ పర్సనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ప్రకటించాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన తెలంగాణ మంత్రి!

కరోనా భయంతో లాక్ డౌన్ కారణంగా 55 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ రోజు రోడ్లపైకి వచ్చాయి. హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో బస్సులు  నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రయాణించారు. బస్సులో భౌతిక దూరం, శానిటైజర్ల ఏర్పాట్లను   అడిగి తెలుసుకున్నారు.  సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు.  ప్రయాణికులు ఆర్టీసీ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అంతకుముందు మహబూబ్‌ నగర్‌ బస్టాండ్‌ ను మంత్రి తనిఖీ చేశారు.

కాశ్మీర్ లో సరికొత్త ఉగ్ర ముఠా రెసిస్టెన్స్ ఫ్రంట్


భారత్ తో ప్రత్యక్ష యుద్ధంలో తట్టుకోలేమని 1971లోనే గ్రహించిన పాకిస్థాన్ అప్పటి నుండి సీమాంతర ఉగ్రవాదం ద్వారా కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించేందుకు వీలు చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేస్తూనే ఉండడం తెలిసిందే. భారత్ లో ఉగ్రదాడులు చేయడమే లక్ష్యంగా పాకిస్థాన్ శిక్షణ ఇచ్చి పంపిన ల‌ష్క‌రే, జైషే వంటి ఉగ్రవాద ముఠాలు ఈ మధ్య కాలంలో భారత సైన్యం ముందు తగ్గుకోలేక తోక ముడుస్తూ ఉండటం తెలిసిందే.

అందుకనే ఇప్పడు తాజాగా పాకిస్తాన్ మరో ఉగ్రవాద ముఠాను సృష్టించి కాశ్మీర్ లోయలోకి పంపినట్లు భారత్ సైన్యం గుర్తించింది. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో కొత్త ఉగ్ర ముఠాను తయారు చేసింది. ఈ విషయంలో పాక్ కుయుక్తులను పసిగట్టి, తిప్పికొట్టడంలో భారత్ సైన్యం ఎప్పుడు సంసిద్దంగానే ఉంటుందని భారత్ ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ స్పష్టం చేశారు.

అయితే రెసిస్టెన్స్ ఫ్రంట్ ను తాము టెర్ర‌ర్ రివైవ‌ల్ ఫ్రంట్ గా పిలుస్తామని ఆయన తెలిపారు.. ఇలాంటి ఉగ్ర‌ మూక‌ల‌ను భార‌త సేన‌లు స‌మ‌ర్థంగా అంత‌మొందిస్తాయ‌ని, క‌శ్మీర్ లో ఎలాంటి ముష్క‌ర శ‌క్తులు ప్ర‌వేశించ‌కుండా చేస్తాయ‌ని భరోసా ఇచ్చారు

ఇటీవ‌ల క‌శ్మీర్ లో వ‌రుస‌గా ఉగ్ర‌వాదుల ఎన్ కౌంట‌ర్ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డానికి కార‌ణంగా వాతావ‌ర‌ణ మార్పులేన‌ని ఆర్మీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ చెప్పారు. చ‌లికాలం ముగిసిన త‌ర్వాత పాక్ ఉగ్ర‌వాదుల చొర‌బాట్లతో పాటు ముష్క‌రుల క‌ద‌లిక‌లు పెరుగుతాయ‌ని, దీంతో ఆర్మీ కౌంట‌ర్ ఆప‌రేష‌న్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని వివరించారు.

క‌శ్మీర్ అంశాన్ని అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప్ర‌స్తావించి మ‌ద్ద‌తు కోసం పాక్ చేసే ప్ర‌య‌త్నాల‌ను ఏ దేశాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న గుర్తు చేశారు. క‌శ్మీర్ లో ఏదో జ‌రిగిపోతోంద‌ని ప్ర‌పంచ దేశాలకు భ్ర‌మ క‌ల్పించేందుకు పాక్ తీవ్ర‌మైన ఉన్మాదానికి పాల్పడే అవకాశం ఉన్నదని తెలిపారు.

అయితే భార‌త సైన్యం ఎటువంటి దుర్ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా నిలువ‌రించేందుకు పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉంద‌ని చెప్పారు. ముష్క‌రుల చొర‌బాట్ల‌కు చెక్ పెట్టేందుకు కౌంట‌ర్ ఆప‌రేష‌న్లు ఎప్ప‌టికప్పుడు అప్ డేట్ చూస్తూనే ఉంటామ‌ని తెలిపారు.