Home Blog Page 8470

మిడతల బిర్యానీ ట్రై చేస్తారా?


తెలుగు రాష్ట్రాల ప్రజలు మిడతల దండు పేరు చెబితేనే వణికిపోతుండగా అక్కడ మాత్రం వాటిని ఏకంగా బిర్యానీ చేస్తున్నారు. మిడతలు దాడి నుంచి ఎలా తప్పించుకోవాలనేదిపై రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగుల మీద మీటింగు పెట్టి మరీ చర్చిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అనుబంధ, ఫారెస్టు అధికారులను అప్రమత్తం చేశారు. కాగా మిడతల దండు పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించాయి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేశాయి. డీజే సౌండ్లు, రసాయనాలు చల్లి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మిడదల దండు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాయి. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే తమ పంటల పొలాలను, ఆహార ధాన్యాలను ఖతం చేస్తున్న మిడతలపై రాజస్థానీయులు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఈ మిడతలతోనే స్థానిక రెస్టారెంట్లలో బిర్యానీ, వేపుళ్లు, కూరలు వండటం చేస్తున్నారు. ‘మకాడ్ బిర్యానీ’ పేరుతో ధార్, జైపూర్ రెస్టారెంట్లలో అమ్మకాలు చేపట్టారు. ఒక్కో ప్లేటు బిర్యానీని రూ.200కు విక్రయిస్తుండటం విశేషం. తొలుత పాకిస్థాన్‌లో మిడతలను స్నాక్స్‌లా తయారుచేశారు. ఆ తర్వాత బిర్యానీ చేయడం ప్రారంభించారు. దీనికి ‘మాక్ బిర్యానీ’ అని పేరుపెట్టారు. ఒక ప్లేటు రూ.300లు పలుకుతోంది. వీటిని పాకిస్థానీయులు వీటిని లోట్టలేసుకొని తింటున్నారు

పాకిస్థాన్లోని బిర్యానీ చూశాకే రాజస్థాన్లోనూ బిర్యానీ చేయడం ప్రారంభించారు. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో టెస్టీగా ఉంటాయని రెస్టారెంట్ నిర్వహకులు చెబుతున్నారు. కొందరు మిడతలతో తయారుచేసిన వంటకాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందనీ ఆహారాన్ని మిడతలు కబళిస్తుంటే వాటినే మనోళ్లు బిర్యానీగా చేస్తుండటం విశేషం. ఈ విషయం చైనా వాళ్లు తెలిసిందంటే రకరకాల వంటకాలతో మిడతలను భూమ్మీద లేకుండా చేయడం ఖాయమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మిడతల బిర్యానీ కనువిందు చేయడం ఖాయంగా కన్పిస్తుంది. ఈ విషయం మిడతలకు తెలిస్తే ఇటూవైపు కన్నెత్తి కూడా చూసేవీ కాదేమో..!

వరవరరావు ఆరోగ్యంపై నివేదిక కోరిన ముంబై కోర్ట్


ఎల్గర్‌ పరిషద్‌- బీమా కొరెగావ్‌ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయిత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక సమర్పించాలని ముంబయిలోని ప్రత్యేక కోర్టు కోరింది. రెండు రోజుల క్రితం తలోజా సెంట్రల్‌ జైలు గదిలో అపస్మారకస్థితిలో ఉన్న ఆయనను అధికారులు జెజె ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఆయన తాత్కాలిక బెయిల్‌ పిటిషన్‌పై జూన్‌ 2న విచారణ చేపడతామని పేర్కొంది. కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని జెజె ఆస్పత్రి డీన్‌ డా. రంజిత్‌ మంకేశ్వర్‌ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆయనతో వీడియో కాల్‌లో మాట్లాడే అవకాశం కల్పించాలంటూ కేంద్ర, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ వరవరరావు భార్య పి. హేమలత ఒక ప్రకటనను విడుదల చేశారు.

కల్పిత ఆరోపణలపై ఎటువంటి విచారణ లేకుండా 18 నెలల శిక్ష అనుభవించారని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని, బెయిల్‌ కోసం జాతీయదర్యాప్తు సంస్థ (ఎన్‌డడిఎ)ను కేంద్ర హోంశాఖ ఆదేశించాలని ఆమె కోరారు.

ఇలా ఉండగా తన తండ్రికి వెంటనే తాత్కాలిక బెయిల్ ఇచ్చి జైలు నుండి విడుదల చేయాలనీ ఆయన కుమార్తె పవన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలని ఆమె కోరారు.

కోర్ట్ అనుమతి కోసం పిటిషన్ వేశామని చెబుతూ, కోర్ట్ అనుమతిస్తే ముంబై వెళ్లి తండ్రిని కలుస్తామని ఆమె చెప్పారు.

సాంకేతికతతో నకిలీ విత్తనాలకు చెక్..


రైతులు నాసిరకం విత్తనాలతో మోసపోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ విత్తనాలతో అన్నదాతలు నిత్యం ఏదో ఒక చోట మోసపోతూనే ఉన్నారు. దీనివల్ల రైతు తన సమయాన్ని నష్టపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నుంచి రైతులను గట్టేక్కించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమైంది. విత్తన ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు చేపడుతుంది. ఇక నుంచి తయారుచేసే ప్రతీ పత్తి విత్తన ప్యాకెట్లపై బార్ లేదా క్యూఆర్ కోడ్ ను తప్పనిసరిగా ముద్రించాలని విత్తన కంపెనీలను కేంద్రం తాజాగా ఆదేశించింది. ఈమేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయశాఖ తగు చర్యలు చేపట్టాలని సూచించింది.

పత్తి ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ విధానం వల్ల విత్తనాన్ని ఉత్పత్తి చేసిన కంపెనీ, ప్రాంతం, మార్కెటింగ్ చేసిన సంస్థ, రిటైలర్ డీలర్, సాగుచేసిన రైతు తదితర వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని కేంద్రం భావిస్తుంది. క్యూఆర్ లేదా బార్ కోడ్ ఉన్న పత్తి ప్యాకెట్లనే రైతులకు అందుబాటులో ఉంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లాట్ నంబర్, లేబులింగ్ ఉంచాలని సూచించింది. ఈ నిర్ణయం వల్ల పత్తి రైతులు మోసపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెబుతోంది. అయితే ఈ నిర్ణయం కేవలం పత్తి ప్యాకెట్లు తయారు చేసే కంపెనీలకేనా? లేదా అన్ని విత్తనాల కంపెనీలకు వర్తిస్తుందా అనేది క్లారిటీ స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా సాంకేతికతతో రైతుల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ముందుకు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతు చుట్టూ కేసీఆర్ పాలన:పువ్వాడ

Puvvada Ajay Kumar

Puvvada Ajay Kumar

రైతు చుట్టూనే కేసీఆర్ పాలన కొనసాగుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న రైతు కోణం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తుంటారని మంత్రి తెలిపారు. కేసీఆర్‌ ముందు చూపుతో నేడు దేశానికి అన్నంపెట్టే స్థితికి తెలంగాణ చేరుకుందని ఆయన తెలిపారు. తెలంగాణలో ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేదని అన్నారు.

నియంత్రిత సాగు విధానం పై నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులో మంత్రి పువ్వాడ ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా సమగ్ర పంటలకు చిరునామాగా మారాలని అన్నారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో రైతు వేదికలు విధిగా ఏర్పాటు చేసుకోవాలనారు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను చూసుకుని వేదికలు నిర్మించుకోవాలని అన్నారు. దాతలు ముందుకొచ్చి విరాళంగా నిర్మాణం చేసి ఇస్తే తమకు నిచ్చిన వారి పేర్లు పెట్టుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. సోనా సాగు పై రైతులు దృష్టిపెట్టాలని అన్నారు. చెరుకును ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలతోనే రైతులకు లాభం వస్తుందన్నారు. ఆ దిశగా రైతులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వ సూచనలు చేస్తుందని చెప్పారు. అన్ని పంటల్లో నూతన వంగడాలతో రైతుల దిగుబడులు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తుల మార్కెటింగ్‌ అవకాశాలు, డిమాండ్‌ ఉన్నపంటలు , పంటల నిలువకు గోడౌన్లు ప్రతి అంశాన్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తుందన్నారు. ప్రతి పంటకు ముందు వ్యవసాయ శాఖ ద్వారా భూసార పరీక్షలు, రైతు వేదికల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు పువ్వాడ తెలిపారు.

వాహనదారులకు బ్యాడ్ న్యూస్..


దేశంలోకి చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా గత రెండున్నర నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పేద, మధ్యతరగతి, వలస కార్మికుల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్డౌన్ కారణంగా ఎంతోమంది నిరుద్యోగులుగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ఆదుకుంటున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కడ కన్పించడం లేదు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీతో పేద ప్రజలకు ఒరిగేందేమీలేదనే అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలను చూపుతూ పెట్రో, డీజిల్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జూన్లో లీటర్ పెట్రోల్ ధర రూ.5కు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

లాక్డౌన్ కారణంగా జీతాల్లేకుండా ఇబ్బందులు పడుతున్నవారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూసే.. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరలను పెంచితే అదంతా ట్రాన్స్ పోర్టు రంగంపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల నిత్యావసర సరకులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రాన్స్ పోర్టు రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి మరింత భారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మే 31 తర్వాత లాక్డౌన్ ఎత్తేసినా.. లేదా కొనసాగించినప్పటికీ ఆయిల్ కంపెనీలు రోజువారీగా ధరలను సమీక్షించనున్నాయి. గడిచిన వారం క్రితమే ఇంధన కంపెనీలు ధరల పెంపుపై చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా పెట్రోల్, డిజీల్ ధరలు పెంపునకు అనుమతి ఇస్తుందనే అభిప్రాయాన్ని ఆయిల్ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేకపోవడంతో రానున్న రెండు వారాల్లో రోజుకు 50పైసలు చొప్పున పెంచుకుంటూ పోతూ నష్టాలను తగ్గించుకునేందుకు ఆయిల్ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ పెంపుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉండటంతో వాహనదారులకు పెట్రో మంట తప్పేలా కన్పించడం లేదు. ఓ వైపు జనం డబ్బుల్లేక అల్లాడుతుంటే కేంద్రం ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకడం చూస్తుంటే ‘ములిగే నక్కపై తాడిపండుపడ్డ చందంగా సామన్యుడి పరిస్థితి’ మారిందని పలువురు వాపోతున్నారు.

కాళేశ్వరం నీళ్లన్నీ గోదావరి పాలేనా!


గోదావరి నుంచి నీటిని లిఫ్ట్ చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమై ఏడాది పూర్తికావస్తున్నది. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు తొలి ఏడాదిలో అనుకున్నంత నీటిని లిఫ్ట్ చేసిందా? ఇంతకీ ఎంత ఆయకట్టుకు నీరందించింది? అనే వివరాలను అధికారులు ఎవ్వరు ప్రస్తావించడం లేదు.

గోదావరి నదిపై కట్టిన మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలనేది లక్ష్యం. ఈ తొలి ఏడాది మోటార్లను ట్రయల్ చేయటంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంప్ హౌస్ లను విజయవంతంగా రన్ చేసినా కొత్త ఆయకట్టుకు మాత్రం నీరందించలేక పోయిన్నట్లు చెబుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఏడాది రాష్ట్ర ప్రభుత్వానికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసిన రెండు నెలల్లోనే అటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ఎగువన కడెం ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అప్పటివరకు ఎల్లంపల్లి, సుందిళ్ల వరకు లిఫ్ట్ చేసిన నీళ్లన్నీ మళ్లీ గేట్లెత్తి గోదావరిలోకి వదిలేయాల్సి వచ్చింది. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ గేట్లను ఎత్తేయటం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది.

దీంతో జూన్‌‌, జులై నెలల్లో 40 రోజులకు పైగా శ్రమించి, రూ. 50 కోట్ల విద్యుత్ వాడి ఎత్తిన నీళ్లన్నీ వదిలేయాల్సి వచ్చింది. దాదాపు 18 టీఎంసీల నీళ్లు తిరిగి గోదావరిలోకి పోయాయి. వీటితో పాటు ఈ ఏడాది పొడవునా మంచిగా కురిసిన వర్షాలతో వెయ్యి టీఎంసీల నీళ్లు మేడిగడ్డకు దిగువకు వదిలేయాల్సి వచ్చింది.

దీంతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎంత ఫలితం వచ్చింది? అదనంగా ఏం సమకూరింది? అనేది అంచనా వేయటం ఇరిగేషన్ విభాగానికీ పరీక్షగా మారింది. ఈ ఏడాది అన్ని పంప్ హౌస్ లను రన్ చేయించి నీటిని మిడ్ మానేరు వరకు లిఫ్ట్ చేయటాన్ని ఇరిగేషన్ విభాగం తొలి ఏడాదిలో నమోదు చేసిన విజయంగా చెప్పుకుంటోంది.

గత ఏడాది జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళేశ్వరం నుంచి మొత్తం 225 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసి18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల పాత ఆయకట్టుకు సాగు నీరు అందించామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. గత 11 నెలల్లో లిఫ్ట్ ‌‌ చేసిన నీళ్లను లెక్కగడితే అనుకున్న లక్ష్యంపై చేరుకోలేక పోయారని స్పష్టం అవుతుంది.

ఇప్పటివరకు మేడిగడ్డ బ్యారేజీ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా 60 టీఎంసీల నీళ్లను ఎత్తిపోశారు. అంటే తొలి ఏడాదిలో కేవలం 26 శాతం నీళ్లనే లిఫ్ట్ చేశారు. అన్నారం బ్యారేజీ నుంచి 56 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీ నుంచి 53 టీఎంసీల నీళ్లు లిఫ్ట్‌‌ చేసి ఎల్లంపల్లికి ఎత్తిపోశారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ రూట్లో నందిమేడారం నుంచి 68 టీఎంసీలు, లక్ష్మీపూర్ పంపుహౌస్‌ నుంచి 66 టీఎంసీలు లిఫ్ట్ చేశారు. ఈ భారీ మోటార్లన్నీ నడిపేందుకు కరెంటు బిల్లుల ఖర్చే వందల కోట్ల రూపాయలు దాటిపోయింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ పనులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. మొత్తం 7 లింక్‌‌లుగా పనులు చేపట్టారు. లింక్ వన్లో మేడిగడ్డ (లక్ష్మీ), అన్నారం (పార్వతి), సుందిళ్ల (సరస్వతి) బ్యారేజీలతోపాటు, మూడు పంప్‌‌హౌజ్‌లున్నాయి. లింక్‌‌ వన్ కింద 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వాలి.

ఇదంతా పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోనే ఉంటుంది. మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పటికీ సైడ్ కాల్వలు, కొత్త ఆయకట్టుకు నీరందించే ప్లానింగ్ లేకపోవటంతో లింక్ వన్లో ఒక్క ఎకరం భూమికి కూడా కాళేశ్వరం నీళ్ల తడి అందలేదు.

‘సాగునీరు పనులను వేగవంతం చేయండి’

Indrakaran reddy

 

Indrakaran reddy

నిర్మల్ జిల్లాలోని 27-ప్యాకేజీ పంప్‌ హౌస్‌ పనులను అటవీ ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. ఈసందర్భంగా పంట కాలువ నిర్మాణం పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రతి ఎకరాలకు నీళ్లందించేలా దృష్టిసారించాలన్నారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా పంటలకు సాగునీరు అందించే దిశగా పనుల్లో వేగం పెంచాలన్నారు.

గోదావరి ఆధారిత కాళేశ్వరం 27, 28 ప్యాకేజీ పనుల్లో నిర్మల్‌, ముదోల్‌ నియోజక వర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు కొనసాగుతున్నాయని అన్నారు. 65శాతం పనులు పూర్తయ్యాయని ఇంకా 35శాతం పూర్తికావాల్సి ఉందన్నారు. మాడేగావ్‌ వద్ద నిర్మిస్తున్న అండర్‌ టన్నుల్‌ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు ఇంకా 5 కి.మీ.లకు గాను నాలుగున్న కిలోమీటర్ల పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ ప్యాకేజీ పనులు పూర్తయితే నిర్మల్‌ జిల్లా మరింత సస్యశ్యామం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, ఎస్‌ఆర్‌ఎస్పీ సీఈ శంకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన జగన్

ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ ఆరంభించారు.

మొట్టమొదటిగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బికెలో లభించే సేవలను పరిశీలించారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు సిఎం యాప్‌ను జగన్‌ ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా రైతులకు నగదు చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా కాల్‌ సెంటర్‌ 155251ను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం ఆనందంగా ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేస్తూ ఈ పథకం కింద 49 లక్షల రైతు కుటుంబాలకు రూ.10వేల కోట్లు ఇచ్చామని చెప్పారు.

పెట్టుబడులు తగ్గాలి, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకూ సూచనలు, సలహాలు ఇస్తాయని పేర్కొన్నారు. పంట రుణాలు, ఇన్సూరెన్స్‌, గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ఆర్‌బికెలు పనిచేస్తాయని వివరించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చి 11 ఏళ్ళు పూర్తయిందని, రాష్ట్రంలో తిరగని ప్రదేశమూ, తొక్కని గడపా లేదని చెబుతూ ఈ ప్రయాణంలో ఎన్నో కన్నీళ్లు చూశానని, బాధలు తెలుసుకున్నాని తెలిపారు. గిట్టుబాటు ధర లేక రైతులు పంటలను పొలాల్లోనే వదిలిపెట్టడం చూశానని, అక్కాచెల్లెమ్మల కష్టాలూ చూశానని, విద్యార్థుల కష్టాలూ, ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితులు అన్నీ చూశానని, వీటన్నిటికీ సమాధానంగా మేనిఫెస్టో తీసుకొచ్చానని వివరించారు.

అది కూడా రెండే రెండు పేజీల్లో పెట్టామని గుర్తు చేస్తూ తనకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నవరత్నాలతో ప్రజల జీవితాలు బాగుపడతాయని తాను నమ్మానని చెబుతూ ఏడాది కాలంలోనే 90 శాతం హామీలను నెరవేర్చామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి రైతుల జీవితాల్లో విప్తవాత్మక మార్పు రాబోతోందని భరోసా వ్యక్తం చేశారు.

టీడీపీ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు..


మొన్ననే టిడిపి ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై పెను వివాదం లేవదీసిన మెగా బ్రదర్ నాగబాబు తాజాగా టిడిపి ఇక మరెప్పటికీ అధికారంలోకి రాలేదని శాపం పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాబోయే రోజులలో అధికారమలోకి వస్తే వైసిపి, జనసేన, బీజేపీ లకు అవకాశం ఉండవచ్చు గాని టిడిపికి మాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. వీటిల్లో ఏ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.

వైసిపి ఒక సంవత్సరం పాలన వార్షికోత్సవం రోజున ఇచ్చిన ట్వీట్ లో ఆ పార్టీ పాలన గురించి గాని, ఆ పార్టీ అధినేత గురించి గాని ఒక్క మాట కూడా అనకపోవడం గమనార్హం. వైసిపి పాలన గురించి మాట్లాడని నాగబాబు టిడిపి హయాంలో మాత్రం ప్రజలకు ఏమీ చేయలేదని తేల్చి చెప్పారు. పైగా, వారి అభివృద్ధి అంతా టీవీల్లో, పేపర్లలోనే ఉందని అంటూ ఎద్దేవా చేశారు.

మళ్లీ అధికారం లోకి వస్తామనే భ్రమల నుంచి టీడీపీ వాళ్లు బయటపడాలని వారికి హితవు చెప్పారు. టీడీపీ వాళ్లు నిజాన్ని గుర్తించాలంటూ నాగబాబు చేసిన ట్వీట్స్ మీరే చూడండి

 

 

పేద ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా!: ఉత్తమ్

Uttam

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. వలస కార్మికులు, నిరుపేదలకు భద్రత, ఆహారం, వసతి, రవాణా సౌకర్యం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నాలుగు అంశాలపై ‘స్పీకప్‌ ఇండియా’ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో సోషల్ మీడియా పోరాటం కొనసాగుతోందని ఈ సందర్భంగా ఉత్తమ్‌ తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఈ అన్‌ లైన్‌ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారని ఉత్తమ్ వివరించారు.

హైదరాబాద్‌ లోని గాంధీభవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే అత్యంత తక్కువ కరోనా పరీక్షలు జరిగింది ఒక్క తెలంగాణలోనే అని ఉత్తమ్‌ అన్నారు. రోజుకు 5 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌.. ఆ దిశగా ఎందుకు కరోనా పరీక్షలు చేయడంలేదో చెప్పాలన్నారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం తీరుమార్చుకోవడం లేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ట్రంప్.. నిజంగానే మగాడ్రా బుజ్జీ.!


ఆడు మగడ్రా బుజ్జీ.. అంటున్నారట ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చూసి.. అమెరికాకు ధీటుగా ఎదిగి.. ఆర్థిక వ్యవస్థతో అగ్రరాజ్యాన్నే ఢీకొట్టాలని చూస్తున్న చైనాకు ట్రంప్ గట్టి షాక్ ఇచ్చాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థను గుప్పిట పట్టి చైనా చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టాడు. ఇప్పుడు డబ్ల్యూ.హెచ్.వోతోపాటు చైనాపై ఆంక్షలు వేసి ట్రంప్ మొండోడిని అని అనిపించుకున్నారు. ఇంతవరకూ ఏ అమెరికా అధ్యక్షుడు చేయలేని సాహసాన్ని చేసి ట్రంప్ ఔరా అనిపించుకున్నాడు.

*ఇంతకీ ట్రంప్ ఏం చేశాడు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో)తో తాము పూర్తిగా తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నెలకొల్పిన ఐక్యరాజ్యసమితిలో భాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఇప్పుడు ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ ఆరోగ్య సంస్థలు నడిచేవి అమెరికా ఇచ్చే నిధులతోనే. అలాంటిది అమెరికా ఇప్పుడు వైదొలగడం డబ్ల్యూహెచ్.వోకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

*చైనాను వెనకేసుకొచ్చినందుకు ఈ చర్య
శుక్రవారం వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడారు. మహమ్మారి విషయంలో చైనాను డబ్ల్యూ.హెచ్.వో వెనకేసుకొచ్చి నిర్లక్ష్యం వహించి ప్రపంచవ్యాప్తంగా అపార ప్రాణ, ఆర్థిక నష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. డబ్ల్యూ.హెచ్.వోకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ తెలిపారు.

*చైనాపై ఆంక్షలతో ట్రంప్ సంచలనం
డబ్ల్యూ.హెచ్.వోపైనే కాదు.. వైరస్ విషయంలో నిజాలను దాచిన చైనాపై ఆంక్షలు విధిస్తున్నట్టు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే చైనా పౌరులను ఇకపై అమెరికాలోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు.

*అమెరికాలో చైనా పెట్టుబడులకు చెక్
ఇక నుంచి అమెరికాలో చైనా పెట్టుబడుల విషయంలోనూ నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు పొడిచే బిల్లును చైనా ఆమోదించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ట్రంప్ ఆరోపించారు. మేధో హక్కులతోపాటు బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడుల్ని అక్రమమార్గాన మళ్లించుకుందన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో చైనాతో రాజీపడమని ట్రంప్ తేల్చిచెప్పారు.

*ప్రపంచానికే షాకిచ్చిన ట్రంప్
ఇలా ట్రంప్ ఇన్నాళ్లు చైనాను కేవలం బెదిరిస్తున్నాడనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు నిజంగా ఆంక్షలువేస్తూ.. చైనా కంపెనీలకు అమెరికాలో చెక్ పెడుతూ తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను విస్తుపోయేలా చేశాయి. చైనాకు ఇది పెద్ద ఆర్థికనష్టంగా అభివర్ణిస్తున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కరోనాను వ్యాపించిన చైనాపై చర్యలకు దిగి అమెరికన్ల సానుభూతి కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చైనాపై ఆంక్షలతో ప్రపంచానికే షాకిచ్చేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో నిజంగానే ట్రంప్ మగాడ్రా బుజ్జి అని అనిపించుకున్నాడు

–నరేశ్ ఎన్నం

డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ వచ్చినట్టేనా?


దేశంలోని చైనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం లాక్డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31తో లాక్డౌన్ 4.0 ముగియనుంది. లాక్డౌన్ 3.0 నుంచి కేంద్రం పలు సడలింపులిస్తూ వస్తోంది. క్రమంగా ఒక్కో రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులిస్తున్నారు. ఈనేపథ్యంలో లాక్డౌన్ 3.0లో, లాక్డౌన్ 4.0లో దాదాపుగా అన్నిరంగాలకు సడలింపులు వచ్చినట్లే కన్పిస్తోంది. అయితే కొన్ని భారీ పరిశ్రమలు, థియేటర్లు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, పాఠశాలలు, కళాశాలలకు మాత్రం మినహాయింపు మాత్రం లభించడం లేదు. అయితే లాక్డౌన్ 5.0లో మరికొన్ని రంగాలకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. అయితే ఇందులో విద్యారంగం ఉంటుందా? అనేది మాత్రం తేలాల్సి ఉంది. విద్యార్థులకు పరీక్ష నిర్వహించకపోతే ఆ ప్రభావం అకాడమిక్ క్యాలెండర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షల నిర్వహాణపై తగు చర్యలు తీసుకుంటున్నాయి.

డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ..
ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 8నుంచి నుంచి జూలై 5 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తాజాగా డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 20నుంచి పరీక్షలు నిర్వహించుకోవచ్చని యూనివర్సిటీలకు అనుమతినిచ్చింది. తుది సెమిస్టర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని సూచించింది.

అదే విధంగా పరీక్షా సమయాన్ని రెండు గంటలకు కుదించాలని, ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించింది. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్లోనే నిర్వహించాలని స్పష్టం చేసింది. మిగతా సెమిస్టర్లు రాసే విద్యార్థులకు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఈ విద్యార్థులను పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్‌ చేయాలని ఉన్నతా విద్యామండలి సూచనలు చేసింది.

రైతులకు సీఎం చెప్పే తీపి కబురు ఇదేనా?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టిన సంగతి తెల్సిందే. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ రైతులనుద్దేశించి మాట్లాడారు. త్వరలోనే దేశం మొత్తం వీస్తుపోయేలా రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నన్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి రైతుల్లో నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలకు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద ప్రతీ ఎకరానికి ఏడాదికి 10వేల పెట్టుబడిని రైతులకు అందజేస్తోంది. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇలాంటి పథకమే కేసీఆర్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నారని రైతులు చర్చించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం వరిసాగులో గణనీయమైన దిగుబడి సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రకటించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పంటలకు సాగునీరు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణలో నియంత్రిత పంటల సాగుపై దృష్టి సారించారు. రైతులకు ఏయే పంటలు వేయాలనేది కూడా వ్యవసాయాధికారులు సూచించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు కూడా రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వం చెప్పిన పంటలు వేసే రైతులకు ప్రోత్సాహాకాలను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చర్చ జరుగుతుంది.

రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, మద్దతు ధర కల్పించడం, బోనస్ ఇవ్వడం లాంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రైతులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఏదిఏమైనా తెలంగాణలో ఎక్కడా చూసిన కేసీఆర్ చెప్పబోయే గుడ్ న్యూస్ గురించే చర్చ జరుగుతుండటం విశేషం.

డబ్ల్యూహెచ్​వోకు అమెరికా గుడ్ బై


ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు అమెరికా గుడ్ బై చెప్పింది. అమెరికా – చైనా ల మధ్య చిచ్చు పెట్టిన కరోనా మహమ్మారి చివరకు ఈ పరిణామానికి దారితీసింది డబ్ల్యూహెచ్వోతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల సంభవించిన మరణాలు, విధ్వంసాలకు ఆ సంస్థ, చైనాలే కారణమని ఆయన మరోసారి ఆరోపించారు. ఇప్పటివరకు డబ్ల్యూహెచ్వోకు ఇస్తున్న నిధులను ప్రజా ఆరోగ్య సంస్థలకు మళ్లించనున్నట్లు వెల్లడించారు.

కరోనాను కట్టడి చేసే విషయంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫలమైనట్లు ట్రంప్ కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నెల‌ రోజుల కిందట ఆ సంస్థకు నిధులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్. తాజాగా డ‌బ్ల్యూహెచ్‌వోతో పూర్తిగా సంబంధాలు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.

అంతటితో ఆగకుండా, వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ మరి కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. చైనీస్ కు అమెరికాలో ప్రవేశంపై నిషేధం విధిస్తామని, చైనా పెట్టుబడులకు వ్యతిరేకంగా రూల్స్ కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. హాంకాంగ్ ప్రజల స్వాతంత్రంను హరించేలా ఉన్న చైనా జాతీయ భద్రతా బిల్లును ట్రంప్ తప్పుపట్టారు.

ఇక హాంకాంగ్ ఇచ్చిన స్పెషల్ స్టేటస్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికాను చైనా కొల్లగొడుతోందని ఆరోపించారు. అమెరికా టెక్నాలజీని, మేధో సంపత్తిని దొంగిలించి వాడుకుంటోందని, బిలియన్ డాలర్ల విలువైన ఉద్యోగాలను పోగొట్టేందుకు కారణమైందని మండిపడ్డారు.

ప్రపంచ వాణిజ్య సంస్థ పట్ల కూడా తన నిబద్ధతను ఉల్లంఘించిందని, ఇండో-పసిఫిక్ మహాసముద్రంలో చట్టవిరుద్ధంగా భూభాగాలను క్లెయిమ్ చేసిందని, నావిగేషన్..అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోందని ఆరోపించారు. వైరస్ ను అంటగట్టిన చైనా.. ప్రపంచానికి చాలా సమాధానాలు చెప్పాల్సి ఉందని హెచ్చరించారు.

మోడీ2.0 ఏడాది పాలనపై జాతికి లేఖ!

Modi letter

Modi letter

మోడీ2.0 ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు మోడీ ప్రధానిగా రెండోవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పాలన పూర్తిచేసుకున్నామని, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందని మోడీ తెలిపారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సవాళ్లను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందన్నారు. అదేవిధంగా దేశం వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు.

మన దేశం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటుందని ప్రధాని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు రాత్రనక, పగలనక తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని తనకు తెలుసన్నారు. తనలో లోపాలు ఉండొచ్చు.. కానీ దేశానికి కాదన్నారు. కాబట్టే తనకంటే దేశ ప్రజల్ని, వారి బలాన్ని, వారి సామార్థ్యాలను నమ్ముతున్నట్లు తెలిపారు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తుందని, ఆర్థిక పునరుజ్జీవనంలో భారతదేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్యర్యపరుస్తుందన్నారు. భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందన్నారు. ఇందుకు మీరే కారకులన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం అన్నారు. చప్పట్లు చరవడం గానీ, దీపాలు వెలిగించడం గానీ, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం గానీ, జనతా కర్ఫ్యూ గానీ, దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ నియమాలను కచ్చితంగా పాటించడం ఇలా ప్రతి సందర్భంలోనూ ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ అని నిరూపించారని ప్రధాని పేర్కొన్నారు.

సంచలనాలు, సవాళ్ల మధ్య మోదీ మొదటి ఏడాది పాలన

Modi


ఒక కాంగ్రెసేతర వ్యక్తి వరుసగా రెండోసారి పూర్తి ఆధిక్యతతో ఎన్నికలలో విజయం సాధించి, సొంతబలంపై ప్రధాన మంత్రి పదవి చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ రెండో సారి మొదటి ఏడాది పాలన మొత్తం సంచలనాలు, సవాళ్ల మధ్య జరిగింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటి ద్వారా సంచలనాలకు దారితీయగా, మొత్తం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం పెను సవాల్ గా పరిణమించింది.

ఏది ఏమైనా దేశ ప్రయోజనాలను కాపాడటం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టతను ఇనుమడింప చేయడంలో మరెవ్వరికీ తీసిపోని విధంగా ప్రధాని మోదీ ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించారు. కరోనాతో మొత్తం ప్రపంచానికే భారత్ ఎక్కడ భారంగా అమారుతుందో అని అందరు ఆందోళన చెందుతున్న సమయంలో ప్రపంచానికే మందులు, ఇతరత్రా సహకారం అందించడం ద్వారా విస్మయం కల్గించారు.

మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి నేటికి ఏడాది అవుతోంది. ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ మోడీ 2.0 మొదటి సంవత్సరం సాహసోపేతంగా గడిచింది. మొదటి ఐదేళ్లలో సంస్కరణలు, పలు మౌలిక మార్పులు, సాధారణ ప్రజల జీవనాలలో వెలుగులు నింపడం పట్ల దృష్టి సారించగా, రెండో సారి సుదీర్ఘకాలం దేశాన్ని పట్టి పీడిస్తున్న భావాత్మక సమస్యలపై దృష్టి సారించారు.

జామ్ (జన్‌‌ధన్‌‌, ఆధార్‌‌, మొబైల్‌‌) త్రయాన్ని ఉపయోగించి ఆర్ధికంగా సాధారణ ప్రజలకు సాధికారికత కలిగించిన ప్రధాని, స్వచ్ఛ భారత్‌‌తో శుభ్రత పెంపొందించడం, ఆయుష్మాన్ భారత్‌‌తో ఆరోగ్య భరోసా కలిగించడంలో రికార్డు సృష్టించారు. దానితో ప్రతిపక్షాల దుష్ప్రచారాలు తిరస్కరించిన దేశ ప్రజలు తిరిగి 2019లో మరోసారి మోదీకి పాలనా బాధ్యతలు అందించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్ ను కేంద్రంగా మార్చడంలో విజయం సాధిస్తున్నారు. సులభతరం వాణిజ్యంలో భారత్ పటిష్టతను ఎంతగానో ఇనుమడింప చేశారు. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశంగా అవతరించింది.

ఒకవిధంగా కొవిడ్ 19 రూపంలో పెద్ద సవాలు దేశాన్ని చుట్టుముట్టింది. ప్రాధమిక వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉన్న భారత్ వంటి దేశం ఈ వైరస్ ను ఎదుర్కోవడం అసాధ్యం అని అందరూ అనుకొంటున్న సమయంలో ఆర్ధికంగా ముందున్న దేశాలను సహితం ఆచార్య పరచే రీతిలో చర్యలు చేపట్టారు. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడమే కాకుండా ప్రజా సహకారంతో విజయవంతంగా అమలు పరుస్తున్నారు.

రాజకీయంగా ఎన్ని వైమష్యాలు నెలకొన్న ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడిగా పనిచేయడం మన ప్రజాస్వామ్య పరిణితికి నిదర్శనం. పరసర్పం సంప్రదింపులతో సహకార సమాఖ్య వ్యవస్థకు జీవం పోశారు. రెండు నెలలోనే అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చు కోవడమే కాకుండా, విదేశాలలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం మన సామర్ధ్యానికి నిదర్శనంగా నిలిచింది.

ఇప్పటి వరకు దేశం పట్టించుకోనని వలస కార్మికుల సమస్య ఈ సమయంలో ఎంత జఠిలమైనదో దేశ ప్రజలు ఆదృష్టికి వచ్చింది. ఆ సమస్యను సహితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు, ఔదార్యం ప్రదర్శించిన సాధారణ ప్రజలు మరోవైపు వారికి అండగా ఉంది, వారికి అవసరమైన సేవలు అందించడం అపూర్వం. మన సామజిక శక్తికి నిదర్శనం అని చెప్పవచ్చు.

ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పేదల గౌరవం ఇనుమడిస్తుందని ఈ సందర్భంగా దేశ ప్రజలకు వ్రాసిన బహిరంగ లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన ప్రభుత్వ నిర్ణయాల ఫలితంగా గ్రామీణ-పట్టణాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని తెలిపారు.

ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నట్లు చెబుతూ సవాళ్లను ఎదుర్కోవడంలో తమ ప్రభుత్వం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం గడిచిన ఏడాదిలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుందని, అదేవిధంగా దేశం వేగంగా అభివృద్ధి సాధించిందని సంతృప్తి వ్యక్తం చేశారు.

కరోనా భారతదేశాన్ని తాకినప్పుడు భారత్‌ ప్రపంచానికి సమస్యగా మారుతుందని చాలా మంది భయపడ్డారని, కానీ నేడు మనం తీసుకున్న చర్యలతో ప్రపంచమే మన వైపు చూస్తుందని ప్రధాని గుర్తు చేశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్‌ ప్రపంచాన్ని ఆశ్యర్యపరుస్తుందని చెబుతూ భారతీయుల సమిష్టి బలం, సామర్థ్యంతో ఇది నిరూపితమైందని పేర్కొన్నారు.

“ఇందుకు మీరే కారకులన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన, సంపన్న దేశాలతో పోల్చితే ఇది అసమానం” అంటూ ప్రజా సహకారాన్ని కొనియాడారు. చప్పట్లు చరవడం గానీ, దీపాలు వెలిగించడం గానీ, కరోనా యోధులను ఆర్మీ గౌరవించడం గానీ, జనతా కర్ఫ్యూ గానీ, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నియమాలను కచ్చితంగా పాటించడం ఇలా ప్రతి సందర్భంలోనూ ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ అని నిరూపించారని ప్రధాని పేర్కొన్నారు.

మన దేశం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కొంటుందని ప్రధాని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు రాత్రనక, పగలనక తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉందని తనకు తెలుసని అంటూ తనలో లోపాలు ఉండొచ్చు.. కానీ దేశానికి కాదని స్పష్టం చేశారు. కాబట్టే తనకంటే దేశ ప్రజల్ని, వారి బలాన్ని, వారి సామార్థ్యాలను నమ్ముతున్నట్లు తెలిపారు.

యడియూరప్పకు సొంత పార్టీ నుండే ముప్పు!


దేశంలో ఉన్న బిజెపి ముఖ్యమంత్రులు అందరిలో ప్రజాబలం గల ఏకైక నేత కర్ణాటక సీఎం బిఎస్ యడియూరప్ప మాత్రమే. ఆ ప్రజాబలమే ఆయనకు సొంత పార్టీ నేతల నుండి తరచూ ముప్పు కలిగిస్తున్నది. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రావడానికి ఆయనే ప్రధాన సూత్రధారి. ప్రజాబలం కూడదీసుకోగల మరో నేత లేరు. అందుకనే 75 సంవత్సరాల వయస్సు దాటినా ఆయనను సీఎంగా చేయక తప్పలేదు.

బీజేపీలో ఇతర ముఖ్యమంత్రులు, కేంద్ర నాయకులు అందరు తెరవెనుక నేతలను ప్రసన్నం చేసుకొని కీలక పదవులలోకి వస్తున్నవారే. అందుకనే ప్రజాబలం ఉన్న కళ్యాణ్ సింగ్, ఉమా భారతి, మదన్ లాల్ ఖురానా, శంకర్ సింగ్ వాఘేలా వంటి నేతలంటే బిజెపి కేంద్ర నాయకత్వం తొలినుండి భయపడుతూ వస్తుంది.

తమకెక్కడ పోటీకి వస్తారో అన్నదే వారి భయం. అదే భయంతో గతంలో యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుండి దించడానికి స్వయంగా ఎల్ కె అద్వానీ మంత్రాంగం నడిపారు. ఇప్పుడు మరోసారి అట్టి ప్రయత్నమే జరుగుతున్నది. బొటాబొటి ఆధిక్యతతో ఉన్నప్పటికీ ఆయనను పదవి నుండి దించాలని ప్రతిపక్షాలు ఏవీ పెద్దగా ప్రయత్నం చేయడం లేదు.

కానీ బిజెపి కేంద్ర నాయకత్వంలో కీలకమైన కర్ణాటకకు చెందిన ఒక నేత తెరవెనుక నుండి సీఎంను అస్థిరం కావించడానికి మొదటినుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సహితం మంత్రిపదవులపై సీఎంకు స్వేచ్ఛ ఇవ్వకపోవడం, వారే మంత్రిపదవులు దక్కనివారిని ఆయనపైకి రెచ్చగొట్టడం చేస్తున్నారు.

తాజాగా తనను కేబినెట్‌లోకి తీసుకోనందుకు అసంతృప్తితో రగిలిపోతున్న ఆ పార్టీ సీనియర్‌ నేత ఉమేశ్‌ కత్తి సీఎం యడియూరప్పపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. తన నివాసంలో ఆయన గురువారం కొందరు అసంతుష్ట ఎమ్మెల్యేలకు విందు ఏర్పాటు చేయడం పార్టీలో కలకలం రేపుతున్నది. గత రెండు వారాల్లో విందు భేటీ జరగడం ఇది రెండోసారి.

బెళగావి జిల్లాకు చెందిన ఉమేశ్‌ కత్తి 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చి తనకివ్వనందుకు ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చించేందుకు భేటీ అయ్యామని, అంతకుమించి ఏమీ లేదని ఉమేశ్‌ చెప్పినా ఎవ్వరు నమ్మడం లేదు. కాగా, యడియూరప్ప రాష్ట్రానికే ముఖ్యమంత్రి అని.. తమకు నాయకుడు కాదని.. తమ నేతలు ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా మాత్రమేనని ఈ భేటీలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్‌ యత్నాళ్ పేర్కొనడం గమనార్హం.