Home Blog Page 8468

పంతం నెగ్గించుకున్న సూపర్ స్టార్..!


సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేను పురస్కరించుకొని ఇటీవలే మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ‘గీతగోవిందం’ ఫేం దర్శకుడు పరశురామ్ తో మహేష్ 27వ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేయగా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మహేష్ బాబు చెవికి రింగు పెట్టుకొని మాస్ లుక్కులో అదరగొట్టాడని ఫ్యాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ పోస్టర్ వైరల్ అయింది. అయితే ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ విషయంలో మహేష్ బాబు మాటే నెగ్గిందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.

‘సర్కార్ వారి పేట’ మూవీ కోసం దర్శకుడు పరశురామ్ తన తొలి మూవీకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ ను తీసుకోవాలని అనుకున్నాడట. ‘గీతగోవిందం’ సినిమాకు గీపిసుందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ మూవీలోని ‘ఇంకేం.. ఇంకేం.. కావాలే’ సాంగ్ అప్పట్లో ఒక్క ఊపుఉపేసింది. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. తన తదుపరి మూవీలోనూ గోపిసుందర్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్నే మహేష్ కు చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరుగుతోంది.

https://twitter.com/urstrulyMahesh/status/1266937240808157185

అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీతో సంగీత దర్శకుడు థమన్ మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీలోని కొన్నిపాటలు వంద మిలియన్ వ్యూస్ దాటి కొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో మహేష్ తన సినిమాకు మ్యాజిక్ విషయంలో థమన్ కే ఓటేసినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు మహేష్ ఇష్టపడకపోవడంతోనే థమన్ కు ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా గతంలోనూ థమన్-మహేష్ కాంబోలో ‘దూకుడు’, ‘ఆగడు’, ‘బిజినెస్ మేన్’ మూవీలు మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. దీంతో మహేష్ బాబు మాటను కాదనలేక దర్శకుడు పరశురామ్ థమన్ వైపు మొగ్గుచూపాడని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.

ప్రభాస్ సరసన దీపిక?


ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కనుంది. అత్యంత ప్రతిష్టాత్మంగా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కనుంది. సైంటిఫిక్ కథాంశంతో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు అశ్విన్ ఇప్పటికే సన్నహాలు మొదలెట్టారు. ప్రభాస్ కు జోడీని ఎంపిక చేసేపనిలో పడ్డాడు. ప్రస్తుతం ప్రభాస్ యూవీ క్రియేషన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ‘రాధే’, ‘డియర్’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా జీగేల్ రాణి పూజా హెగ్డే నటిస్తుంది.

నాగ్అశ్విన్ తెరకెక్కించే మూవీలో ప్రభాస్ జోడీగా అలియాభట్ నటిస్తుందని ప్రచారం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో అలియాభట్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుంది. ప్రభాస్ పక్కన అలియా భట్ బాగుంటుందని రాజమౌళి సూచించారని అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ విన్పించింది. దీంతో ప్రభాస్ మూవీలోనూ అలియాభట్ నటిస్తుందని అంతా అనుకున్నారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా దీపిక పదుకోన్ దర్శకుడు నాగ్అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’ మూవీపై స్పందించింది. ఈ మూవీ చాలా బాగుందని.. అందరూ చూడాలని కోరింది. దీంతో ప్రభాస్ కొత్త మూవీలో దీపిక నటించనుందనే వార్తకు బలం చేకూరింది. నాగ్అశ్విన్ ఇటీవల దీపికను కలిసి తన దర్శకత్వ ప్రతిభ తెలుసుకునేందుకు ‘మహానటి’ చూడాలని సూచించారట. ఎలాగూ లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన దీపిక ‘మహానటి’ మూవీని తిలకించిందట. ఈ మూవీ నచ్చడంతో ప్రభాస్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సరసన ఇప్పటికే బాలీవుడ్ భామ శద్ధాకపూర్ ‘సాహో’లో నటించి మెప్పింది. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకునే ప్రభాస్ సరసన నటించేందుకు సిద్ధమవుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

కరెంట్ బిల్లులకు కొత్త లెక్క!

Electricity Bills

Electricity bills

లాక్‌ డౌన్ కారణంగా మీటర్ రీడింగ్ లెక్కించకుండానే వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలల బిల్లుల్ని ఇలాగే చెల్లించారు. గతేడాది ఇదే నెలలో ఎంత బిల్లు వచ్చిందో అంత మొత్తాన్ని ప్రొవిజనల్ బిల్లుగా చెల్లించారు. ఇకపై ఎప్పట్లాగే కరెంట్ బిల్లుల్ని జారీ చేసేందుకు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏర్పాట్లు చేస్తోంది. అంటే ఎప్పట్లాగే కరెంట్ బిల్లులు చెల్లించొచ్చు. అయితే ఏప్రిల్, మే నెలల మీటర్ రీడింగ్ ఎలా లెక్కిస్తారన్న సందేహాలు వినియోగదారుల్లో ఉన్నాయి. తక్కువ యూనిట్స్ వాడినా ఎక్కువ బిల్లు చెల్లించడం లేదా ఎక్కువ యూనిట్స్ వాడి తక్కువ బిల్లు చెల్లించడం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్, మే నెలల మీటర్ రీడింగ్‌ ను అడ్జెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ బిల్లును ఏ పద్ధతిలో లెక్కిస్తారు? ఎక్కువ చెల్లించినవారికి రీఫండ్ ఏ విధంగా అడ్జెస్ట్ చేస్తారు? తక్కువ చెల్లించినవారి నుంచి ఎలా వసూలు చేస్తారో తెలుసుకోండి.

ముందుగా మీటర్‌ లో మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎన్ని యూనిట్స్ ఉపయోగించారో లెక్కిస్తారు. ఉదాహరణకు ఓ ఇంట్లో మూడు నెలల్లో 600 యూనిట్స్ కరెంట్ వాడారనుకుందాం. మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగిస్తారు. అంటే 600/3 చేస్తారు. 200 యూనిట్స్ వస్తుంది. ఇది యావరేజీ బిల్లు. దీని ప్రకారం మూడు ఒరిజినల్ బిల్లులు వస్తాయి. అంటే 200 యూనిట్ల చొప్పున లెక్కించి మూడు బిల్లుల్ని ఇస్తారు. మూడు ఒరిజినల్ బిల్లుల టోటల్ ఎంతో లెక్కిస్తారు. ఇక ఇప్పటికే రెండు ప్రొవిజనల్ బిల్లులు కట్టేశారు కాబట్టి ఆ రెండు ప్రొవిజనల్ బిల్లుల మొత్తాన్ని మూడు బిల్లుల మొత్తం నుంచి తీసేస్తారు. ఒకవేళ మీరు ఇంకా ప్రొవిజనల్ బిల్లులో ఎక్కువ చెల్లించి ఉంటే తర్వాతి నెలలో వచ్చే బిల్లులో అడ్జెస్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పటికీ బిల్లులు చెల్లించనివారు మూడు బిల్లుల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడింగ్, బిల్లుల జారీ మొదలవుతుంది. మరోవైపు కరోనా వైరస్ భయాల్లో ప్రజల్లో ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు తీసుకుంటున్నారు టీఎస్ఎస్‌పీడీసీఎల్ అధికారులు. మీటర్ రీడింగ్ నమోదు చేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరిస్తారు. శానిటైజర్లు ఉపయోగిస్తారు. సిబ్బంది ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లినప్పుడు శానిటైజర్ ఉపయోగిస్తారు.

వైద్యుడిగా మారిన నిఖిల్ సిద్దార్థ్


వైవిధ్యమైన సినిమాలు తో యంగ్ హీరో నిఖిల్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిఖిల్ ఎంచుకునే కథ, కథనాలే కాదు వాటిల్లో పాత్రలు కూడా చాలా వైవైద్యం గా ఉంటాయి. ఇక నిఖిల్ – డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ కి ఇటీవలే సీక్వెల్ పనులు మొదలు అయ్యాయి. కార్తికేయ 2 టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ డాక్టర్ గా నటిస్తున్నాడు. కార్తికేయ లో మెడికల్ స్టూడెంట్ గా నటించిన నిఖిల్ ఇప్పుడు ఈ సీక్వెల్ లో డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు కార్తికేయ 2 చిత్ర బృందం. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో నిఖిల్ మేడలో స్టేథస్ స్కోప్ ఉంది. అలానే వైద్యో నారాయణో హరి – వైద్యుడే నారాయణుడు – నారాయణుడే వైద్యుడు అని ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్ లో పెట్టారు..! ఐతే ఇదే పోస్టర్ తో కరోనా తో యుద్ధం చేస్తున్న వైద్యులు కు కూడా కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ చందు మొండేటి మరియు చిత్ర బృందం.

‘ల‌వ్, లైఫ్ అండ్ ప‌కోడి’ ఫ‌స్ట్ లుక్..


క‌ల‌ర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై మ‌ధురా శ్రీధ‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌ణ లో రూపొందిన చిత్రం “ల‌వ్ లైఫ్ అండ్ ప‌కోడి” జ‌యంత్ గాలి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆసక్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్ కి సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

కార్తిక్ , సంచిత హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్నారు.ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ లో వీరి ఫోజ్ రోటీన్ లుక్స్ భిన్నంగా ఉంటూ సినిమా పై ఆస‌క్తిని క‌లిగించింది. ఒక రిలేష‌న్ కి కమిట్ అయ్యేందుకు క‌న్ ఫ్యూజ్ అయ్యే జంట కు వారి మ‌ద్య ప్రేమే స‌మ‌స్య‌గా ఎలా మారుతుంది అనేది ఆస‌క్తిగా తెర‌మీద‌కు క‌నువిందు చేయ‌బోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూ, ఈ జ‌న‌రేష‌న్ ఏ రిలేష‌న్ క‌యినా క‌మిట్ అవ‌డానికి భ‌య‌ప‌డ‌తారు.క‌న్ ఫ్యూజ్ అవుతారు..క‌రెక్టా కాదా అనే సందేహాల‌లో ప‌డిపోతారు.వారి మ‌ద్య ఆక‌ర్ష‌ణ‌లు, ప్రేమ‌లు ఉంటాయి. కానీ వారి బాండింగ్ కి ఎలాంటి రిలేష‌న్ తో ముడి పెడ‌తానికి ఇష్ట‌ప‌డ‌రు.. అదే మా ప్రేమ క‌థ. మోడ్ర‌న్ క‌ల్చ‌ర్ లో నేటి జ‌న‌రేష‌న్ లివింగ్ స్టెయిల్ ని ప్ర‌తి బింబించే ఈ క‌థ త‌ప్ప‌కుండా యూత్ కి క‌నెక్ట్ అవుతుంద‌నే నమ్మ‌కం మాకు ఉంది.ఈ రోజు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.థియేట‌ర్స్ కి అనుమ‌తులు ల‌భించ‌గానే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటాం.అన్నారు.

కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ‌, జంట‌గా న‌టిస్తున్న ఈచిత్రంలో ఆక‌ర్ష్ రాజ్ భాగ‌వ‌తుల‌, క్రిష్ణ హాబ్బ‌ల్ , క‌ళా జ్యోతి , అనురాధ మ‌ల్లికార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

కృష్ణా జలాలపై పోరుకు బండి సంజయ్ కసరత్తు


తెలంగాణ ప్రజలకు కృష్ణానదీ జలాల వినియోగం విషయంలో గత కొన్నేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర బిజెపి కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం కాబడ్డప్పుడు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఈ అన్యాయం అదేవిధంగా కొనసాగిందని విచారం వ్యక్తం చేశారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతానికి నికర మరియు వరద జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం, అదేవిధంగా తెలంగాణ సీఎం, ఏపీ సీఎంతో చేసుకున్న రహస్య ఒప్పందం, వైఫల్యాలపై ఉద్యమించటం కోసం కృష్ణా నదీ జలాల పోరాట కమిటీ ఏర్పాటు చేస్తామని సంజయ్ ప్రకటించారు.

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కలేదని విమర్శించారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర మన వాటా మనకు వచ్చే విధంగా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందిని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ సర్కార్ గత ఆరేళ్లుగా ఈ ట్రిబ్యునల్ ముందు మన వాదనలు సరిగా వినిపించలేదని మండిపడ్డారు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా 811 టీఎంసీలలో మన వాటాను పెంచుకునేందుకు ఉన్న చక్కటి అవకాశాన్ని కూడా కేసీఆర్ వినియోగించుకోలేకపోయారని సంజయ్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా గత నెల 5వ తేదీన ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ మరియు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలు పెట్టడానికి జీవో జారీ చేసినప్పుడు కేసీఆర్ గట్టిగా స్పందించలేదని పేర్కొన్నారు.

ఆ ప్రాజెక్టులు మన తెలంగాణకు కేటాయించబడిన నికర జలాలు వాడుకునే పరిస్థితి కల్పించబడిందని చెబుతూ దక్షిణ తెలంగాణ జిల్లాలైన పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితి తలెత్తిందని హెచ్చరించారు. దక్షిణ తెలంగాణ జిల్లాల ప్రజలకు చెందిన నీటిని కాపాడుకునేందుకు బిజెపియే ముందుగా పోరాటం చేసిందని గుర్తు చేశారు.

కేసీఆర్ ఈ విషయంలో నామమాత్రంగానే కృష్ణా బోర్డుకు లేఖ వ్రాసి ఉరుకున్నారని దుయ్యబట్టారు. బిజెపి పోరాటానికి స్పందించిన కేంద్రం ఈరోజు కృష్ణా-గోదావరి బోర్డు సమావేశం నిర్వహించాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయబద్దంగా రావాల్సిన నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై బిజెపి పోరు కొనసాగుతుందని ప్రకటించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో సమగ్రంగా చర్చించి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట సమితి’ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతామని తెలిపారు.

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్!

Narendra sing tomar

Narendra sing tomar

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్రమంత్రి తోమర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచేందుకు 14 రకాల ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

రైతులకు ఖరీఫ్‌ పంటలకు 50 నుంచి 83 శాతం అధిక మద్దతు ధర ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రైతులకు రుణాలు చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తామని, రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధిచేకూరుతుందన్నారు.

చంద్రబాబు, లోకేష్ లతో టీడీపీ క్యాడర్ మనస్తాపం


2019 ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబులో పూర్తిగా నిస్సత్తువ ఆవహించిందని.. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు మునుపటిల ఉత్సాహంగా పర్యటించడం లేదన్న వాదనను తెలుగు తమ్ముళ్లు తెరపైకి తెస్తున్నారు. చంద్రబాబు వయోభారం, కరోనాతో పర్యటించకున్నా.. కనీసం లోకేష్ అయినా పర్యటించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటు చంద్రబాబు రాక.. లోకేష్ కనిపించక తెలుగు తమ్ముళ్లు వీరిద్దరిపై మనస్తాపం చెందారని.. వారి తీరుపై అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది.

తాజాగా ఎల్.జీ పాలిమర్స్ బాధితులను ఓదార్చడానికి చంద్రబాబు వైజాగ్ కు విమానంలో వెళ్లాలనుకున్నారు. కానీ పర్మిషన్ లేక అమరావతికి రోడ్డుమార్గాన వచ్చారు. సరే వచ్చి వారం దాటినా చంద్రబాబు అమరావతిలోని తన ఇంటిని వదలకపోవడంపై తెలుగు తమ్ముళ్లు నిరాశ చెందుతున్నారు. వైజాగ్ బాధితులను రోడ్డు మార్గాన వచ్చి చంద్రబాబు పరామర్శిస్తాడని అంతా అనుకున్నారు. కానీ వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లి అమరావతి కదలడం లేదు.

సరే.. కరోనా భయానికి బాబు భయపడి పర్యటించడం లేదని అనుకుంటే.. కనీసం అమరావతిలోని రైతులను.. ప్రజలను కలుస్తాడని అందరూ అనుకున్నారు. అమరావతి రైతులు రాజధాని మార్పుపై ఆందోళనగా ఉన్నారు. వారినైనా చంద్రబాబు కలుస్తారని అంతా అంచనావేశారు. కానీ తండ్రి కొడుకులిద్దరూ అమరావతిలోని ఇంటిని వదిలి బయటకు రాకపోవడంపై తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహపడుతున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు మహానాడు ఊపులో ఉన్నారు. ఆయన జూమ్ యాప్ లో ఇంట్లోనే ఉండి తెలంగాణ, ఏపీలోని విశాఖ, సీమ, విజయవాడ నేతలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాడు. ఇంతదానికి అమరావతి రావడం ఎందుకని.. హైదరాబాద్ లోనే జూమ్ యాప్ తో సమీక్షించవచ్చు కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు చినబాబు లోకేష్ కు కూడా ఏమైందని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన కూడా ఇల్లు విడిచి రాకపోవడంపై తాము కలత చెందామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ అయినా అమరావతి, వైజాగ్ లో పర్యటించి బాధితులను పరామర్శిస్తే పోయేది అని అంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్ నే ప్రేమిస్తాడని.. ఏపీకి కేవలం అతిథిగా వచ్చి వెళ్లిపోతాడని టీడీపీ నేతలు అంతర్గతంగా సంభాషిస్తున్నారు..

ఇక ఎన్టీఆర్ జన్మదినం నాడు ఆయన మరణించిన ఎన్టీఆర్ ఘాట్ కానీ.. ఆయన ఫాంహౌస్ లో కానీ ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు. కానీ రాజకీయంగా ఏం కారణమో కానీ సరిగ్గా ఎన్టీఆర్ జయంతినాటికే చంద్రబాబు నివాళులర్పించకుండా ఏపీకి రావడంపై టీడీపీ శ్రేణులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయినా బాబు రాజకీయం అంతుబట్టదని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

–నరేశ్ ఎన్నం

‘ఆర్థికవ్యవస్థ బలోపేతంలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర’

prakash javadekar

prakash javadekar

దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతంలో ఎంఎస్‌ఎంఈలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 6 కోట్లకుపైగా ఎంఎస్‌ఎంఈలున్నాయని. ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మరింత విస్తరించామని జవదేకర్ అన్నారు. కేంద్రకేబినెట్‌ సమావేశమనంతరం ప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్‌ భేటీలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతులు, ఎంఎస్‌ఎంఈల విషయమై కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.

ఆర్థికవ్యవస్థ బలోపేతంలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర అని..దేశప్రగతిలో ఎంఎస్‌ఎంఈలు ముఖ్యపాత్ర పోషించాల్సి ఉందని జవదేకర్‌ అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్నారు.  కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేశామని పేర్కొన్నారు.

తెలంగాణలో బడిగంట మోగేది అప్పుడే?


ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ 5.0 కొనసాగుతుంది. జూన్ 1న నుంచి జూన్ 30వరకు లాక్డౌన్ కొనసాగనుంది. అయితే లాక్డౌన్ 5.0లో కేంద్రం కొన్ని రంగాలకు మినహా దాదాపు అన్నింటికి సడలింపులు ఇచ్చింది. రైల్వే, విమాన, విద్యా, దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, మాల్స్ వంటి వాటిపై కూడా లాక్డౌన్ 5.0లో నిర్ణయం ప్రకటించింది. జూన్ 8నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. మెట్రో టైన్లు, అంతర్జాతీయ విమానాలకు సడలింపులను ఇవ్వడం లేదు. ఇక విద్యారంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నిర్ణయం ప్రకటించింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభంపై జూలైలో నిర్ణయం ప్రకటించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఇక తెలంగాణలో జులై 1నుంచి బడిగంట మోగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తొలుత జులై 1నుంచి ఉన్నత పాఠశాలలను మాత్రమే ప్రారంభిస్తారు. వీటి పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించనున్నారు. ఒక్కో తరగతిగదిలో 15మంది విద్యార్థులను అనుమతించరు. ఒక్కో తరగతిలో ఎక్కువగా విద్యార్థులుంటే షిప్ట్ పద్ధతిలో అనుమతిస్తారు. ప్రాథమిక పాఠశాలకు ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. 8, 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రం ఒక్క ఆదివారం సెలవు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తరగతులకు అనుమతించరు. ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి.

పాఠశాల పనిదినాలను 150 రోజులకు విద్యాశాఖ తగ్గించింది. అేలాగే ఈ సంవత్సరం ప్రాథమిక పాఠశాల సిలబస్ 70శాతానికి తగ్గిస్తారు. పదో తరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష అన్నమాట. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాగానే పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నహాలు చేస్తుంది.

మరో సంచలన నిర్ణయం తీసుకున్న మోదీ..!


బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మోదీ రైతులకు శుభవార్త అందించబోతున్నారు. లాక్డౌన్ కారణంగా దేశంలోని వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఇటీవల ‘వన్ నేషన్-వన్ రేషన్’ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే సోమవారం మోదీ కేంద్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో జూన్ 1న నుంచి 30వరకు లాక్డౌన్ 5.0 కొనసాగనుండటంపై చర్చించారు. అదేవిధంగా కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, 20లక్షల కోట్ల ప్యాకేజీ, చైనా సరిహద్దు వివాదం తదితర అంశాలపై క్యాబినేట్లో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధానంగా రైతుల కోసం కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు రైతులు పంటలు పండించటం ఒక ఎత్తయితే.. వాటిని అమ్ముకోవడం మరొక ఎత్తవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘వన్ నేషన్.. వన్ మార్కెట్’(ఒకే దేశం-ఒక మార్కెట్)ను తీసుకొచ్చేందుకు సన్నహాలు చేస్తుంది. ఈమేరకు క్యాబినెట్లో ఈ ప్రస్తావించి దీనిపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని రైతులంతా ఎక్కడి నుంచి ఎక్కడైనా అధిక ధరకు దిగుబడులను అమ్ముకునేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురానుందని విశ్వసనీయ సమాచారం.

వన్ నేషన్.. వన్ మార్కెట్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలను విడుదల చేస్తుందోనని ఆసక్తి నెలకొంది. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సమయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కూాడా రైతులకు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టారు. అయితే ప్రధాని మోదీ మాత్రం దేశంలోని రైతులందరిని దృష్టిలో ఉంచుకొని వన్ నేషన్.. వన్ మార్కెట్ తీసుకొచ్చి ముందుగానే గుడ్ న్యూస్ చెప్పడం విశేషం.

వైసీపీని చంద్రబాబు ఇలా దెబ్బకొడుతున్నాడా?


40 ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన.. ఎక్కడ.. ఎలా ఎవరిని దెబ్బకొట్టాలో బాగా తెలుసు.. చంద్రబాబు కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అందుకే.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయనపై కోర్టుల్లో కేసులు నిలబడవు.. కానీ ప్రత్యర్థులు మాత్రం చంద్రబాబు వలలో పడిపోతుంటారు.. దెబ్బైపోతుంటారు.. ఇప్పుడూ అదే జరిగింది. అనుభవరాహిత్యం ఉన్న జగన్ వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆడుకుంటున్నారు. వైసీపీ లీక్స్ ను తెలివిగా వాడుకుంటూ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మీడియా మేనేజ్ మెంట్ లో తనను మించిన వాడు లేడని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు.

తాజాగా టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. టీడీపీకి సంబంధించిన వెబ్ మీడియాలో వైసీపీ లూప్ హోల్స్ పై ఆర్టికల్స్ వేయించాలని చంద్రబాబు , టీడీపీ డిసైడ్ అయ్యారట.. ఈ మేరకు టీడీపీకి సంబంధించిన వెబ్ సైట్ లలో ట్రాఫిక్ ను బట్టి రూ.3-5 వేల వరకు ఒక ఆర్టికల్ కు చెల్లించి రాయించి పోస్ట్ చేయిస్తున్నారని.. వైసీపీ హైకమాండ్ లో పెద్ద ఎత్తున వార్ జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని లీకులు వస్తున్నాయి.. టీడీపీ డబ్బులు ఖర్చు పెట్టి మరీ వైసీపీ హైకమాండ్ పై వెబ్ సైట్లలో బురద జల్లుతున్నారని సమాచారం. చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ పై సీఎం జగన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని లేదంటే పార్టీ పరువు పోయి ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయి వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్ ప్రభుత్వ పాలనతో బిజిబిజీగా ఉన్నారు.. కానీ వైసీపీ పార్టీ హైకమాండ్ లో కొందరు కీలక వ్యక్తులు మాత్రం చీటికి మాటీకి ఆధిపత్య పోరుతో కొట్లాటలకు దిగుతున్నారట… జగన్ ఎంత సర్దుబాటు చేసుకోమన్నా నేతలు పెడచెవిన పెడుతూ కొట్లాడుకుంటున్న తీరు ప్రతిపక్ష టీడీపికి వరంగా మారుతోందట.. ఈ కొట్లాటను రికార్డ్ చేసి ప్రధాన వెబ్ సైట్లకు డబ్బులిచ్చి మరీ టీడీపీ అభాసుపాలు చేస్తున్న వైనం వైసీపీకి షాకింగ్ గా మారిందట… వైసీపీ హైకమాండ్ లోని కొందరి వల్ల ఆయన జగన్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోందని.. పాలనను చూస్తున్న జగన్.. పార్టీపై నజర్ వేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని వైసీపీ నేతలు వాపోతున్నారు.

వైసీపీ హైకమాండ్ లో కొట్లాట ఎంత వరకు వచ్చింది అంటే ఈ మధ్య కాలంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏది అయినా జరిగినా.. మెల్లిగా ఆ విషయాలు, గొడవలు, వీడియోలు ఎలక్ట్రానిక్ మీడియాకు వచ్చిచేరుతున్నాయి. వెబ్ సైట్లలో హైలెట్ అవుతున్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లో టీడీపీ సోషల్ మీడియా వింగ్ రచ్చరచ్చ చేస్తోంది.. వైసీపీ కొట్లాట విషయాలు బహిర్గతం చేస్తూ మీడియాలో హైలెట్ చేస్తూ టీడీపీ పెద్ద దుమారం సృష్టిస్తోంది.

వైసీపీ హైకమాండ్ లో విభేదాలతో సీఎం జగన్ ను కలిసి ఫిర్యాదులు చేశారట. సీఎంకు హైకమాండ్ లోని ఇద్దరు కీలక వ్యక్తులు వెళ్లి కలిసి ఫిర్యాదు చేసినా సీఎం జగన్ వారిని అనునయించారని తెలిసింది.. పార్టీలో ఇలాంటివి సహజమని.. పార్టీలో సర్దుకుపోవాలని సీఎం సూచించారట.. పెద్దగా ఫిర్యాదులపై స్పందించలేదని సమాచారం. అయితే ఈ తంతును టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం అందిపుచ్చుకొని రచ్చ రచ్చ చేస్తోంది..

ఏపీ సచివాలయంలో రెండు బ్లాక్ లు మూసివేత

Secretariat employees

corona-in-ap-secretariat

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్‌ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. ఆ రెండు బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సచివాలయం‌లోని మొత్తం ఐదు బ్లాకులను శానిటైజ్‌ చేయనున్నారు. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులను గత నెల 27న ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకువచ్చారు.

అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతనితోపాటు హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారు.

ఇలా ఉండగా, ఎపిలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 105 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎపిలోనే 76 కేసులు రాగా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మరో 28 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
విదేశాల నుండి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,118కి చేరిందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతిచెందడంతో.. మృతుల సంఖ్య 64కు చేరింది. 885 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 2, 169 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

మోదీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ ఝలక్!


కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బిజెపితో కలసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఝలక్ ఇచ్చారు. లాక్‌డౌన్‌ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని స్పష్టం చేశారు.

లాక్‌డౌన్‌తో పన్నులు వసూలు కానందున ఏడాది పాటు 66 కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్రం వాటాను కూడా కేంద్రమే చెల్లించాలని కోరారు. ఈ ఏప్రిల్‌లో సొంత వనరుల నుండి రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పన్నులు 85 శాతం నిలిచిపోయాయని పేర్కొన్నారు.

2019-20 ఆర్థిక సంవత్సరంలో 66 కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర వాటా రూ.10,000 కోట్లు ఖర్చు చేశామని, కానీ లాక్‌డౌన్‌ కొనసాగింపు దృష్ట్యా..రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు దారుణంగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఆ ఖర్చు భరించే పరిస్థితి లేదని బిజెపి నేత అయినా ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ వెల్లడించారు.

కేంద్ర డబ్బులు ఇవ్వకపోతే మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, మధ్యాహ్న భోజన పథకం, ఇతర ముఖ్యమైన పథకాల అమలును నిలిపేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇప్పటికే కేరళ, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రభుత్వాలు ఆదాయ వనరులు కోల్పోయిన రాష్ట్రాలను కేంద్రమే ఆదుకోవాలని కోరుతూ ఉండడం గమనార్హం. పైగా రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూర్చే విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండడం పట్ల కొందరు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి మాజీ ఎల్యేల్యే చింతలకు కరోనా

Ramachandra Reddy

Ramachandra Reddy

తెలంగాణలో క‌రోనా వైర‌స్ అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. పేద‌, ధ‌నిక, హోదా, అధికారం అనే భేదం లేకుండా చాలామంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కి కరోనా వైర‌స్ సోకింది.

దీంతో జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ పాజిటివ్ తేలింది. చింతల రామచంద్రరెడ్డి భార్య, కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

లాక్‌డౌన్ టైంలో చింతల చాలామందికి ‌నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇప్పుడు అందరూ చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా పాజిటివ్‌గా తేలినా తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ఏ ఆందోళన అక్కర్లేదని చింత‌ల తెలిపారు.

గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు..

tcongress leaders

tcongress leaders

ఉస్మానియా యూవవర్సిటీ(ఓయూ) భూముల అన్యాక్రాంతంపై కాంగ్రెస్ నేతలు సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళ సై దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పెద్దల అండతోనే ఓయూ భూములు ఆక్రమణకు గురవుతోందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్ హన్మంతరావులు ఆరోపించారు. యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతుందన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించే యూనివర్సీటీలను నిధులు విడుదల చేయకపోవడం అన్యాయమని దీనిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఓయూ భూములను ప్రభుత్వ పెద్దల అండదండలతో కొందరు అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోవడంలో అంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఓయూలో కేంద్ర సర్వే డిపార్ట్‌మెంట్‌తో భూములను సర్వే చేయించాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని విన్నవించారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

అదేవిధంగా గిరిజనుల రిజర్వేషన్లో విషయంలో టీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తుందని కాంగ్రెస్ నేత రాములు నాయక్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు గడిస్తున్నా గిరిజనులకు రిజర్వేషన్లను కేసీఆర్ పెంచలేదన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలారాస్తుందని ఆయన అన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

కేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది?

tcongress

tcongress

కేసీఆర్ సిక్సర్ కొట్టాడు.. రెండో దఫా మొదటి ఏడాదిని రేపటితో పూర్తి చేసుకోబోతున్నాడు. జూన్ 2తో తెలంగాణ పాలన ఆరేళ్ల క్రితం కేసీఆర్ సీఎంగా ప్రమాణంతో మొదలైంది. ఈ ఆరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించి అభివృద్ధి పథాన తెలంగాణ పయనించింది. ఆరేళ్ల సంబురానికి కొత్త రాష్ట్రం రెడీ అవుతున్న వేళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ ను ఢీకొట్టలేకపోతోంది. ఇప్పటికీ పీసీసీ చీఫ్ కోసం సీనియర్లు మంకు పట్టు పట్టి తగవులాడుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు వత్రం చెడ్డా ఫలితం దక్కలేదు. మొన్నటిసారి చుక్కెదురైంది. మరి కాంగ్రెస్ ను తెలంగాణలో నిలబెట్టే మగాడెవరు? అన్న ఆలోచనలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది అని చర్చించుకుంటున్నారు..

*ఉత్తమ్ పని అయిపోయింది..
తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించలేదు. పైగా తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో కూడా ఓడిపోయి పీసీసీ చీఫ్ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజల సానుభూతి వల్ల మూడు ఎంపీ సీట్లు దక్కి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాంగ్రెస్ పరువు దక్కింది. ఇప్పుడు కరోనా-లాక్ డౌన్ ముగిస్తే మొదట కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడి మార్పే మొదటి ప్రియారిటీగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

*రేవంత్ రెడ్డి అందరికంటే ముందు..
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ చీఫ్ రేసులో అందరికంటే ముందు రేవంత్ రెడ్డియే ఉన్నాడు. ఇటు పార్టీ యువ కేడర్ లో.. నేతల్లో రేవంత్ కు మేనియా పీక్స్ లో ఉంది. మాస్ లీడర్ గా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డినే చేయాలని ఉబలాటపడుతోంది. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ చీఫ్ ను చేయడానికి వీల్లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.. కానీ కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడిగా తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఆ పేరుంది. వాగ్ధాటిలో, నాయకత్వశైలిలో రేవంత్ అందరికంటే ముందున్నారు.

*కోమటిరెడ్డిపై శీతకన్ను
నిజానికి ఉత్తమ్ తర్వాత అత్యంత బలంగా కనిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ చీఫ్ ఇవ్వండి టీఆర్ఎస్ లోని 50 మంది ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని అంటున్నాడు. కానీ ఆయన తమ్ముడు బీజేపీకి సపోర్టు చేయడం.. నిలకడలేని రాజకీయం వల్ల కోమటిరెడ్డిని నమ్మేస్థితిలో అధిష్టానం లేదన్న వాదన వినిపిస్తోంది.

*వీహెచ్, జీవన్ రెడ్డి , జగ్గారెడ్డి, జానాలకు డౌటే
పేరు మోసిన కాంగ్రెస్ కురువృద్ధులైన వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, జానారెడ్డిలకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడం డౌటే అన్న చర్చ పార్టీలో సాగుతోంది. వీరు పార్టీని ముందుండి నడిపించలేరనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ రేసు నుంచి సీనియర్లను పక్కనపెట్టారనే చర్చ సాగుతోంది.

*భట్టి, శ్రీధర్ బాబులకు ఇచ్చేనా?
ఇక రేవంత్ రెడ్డికి వద్దనుకుంటే రేసులో దళిత నేత మల్లు భట్టివిక్రమార్క్, మరోనేత శ్రీధర్ బాబుల పేరు వినిపిస్తోంది.కానీ వీరికి రేవంత్ రెడ్డిలా మాస్ ఫాలోయింగ్ లేకపోవడం.. వీరికి అప్పగించినా పెద్దగా పురోగతి ఉండదన్న అభిప్రాయాలు పార్టీలో ఉంది.

మిగతా నేతలున్నా కూడా పీసీసీ బరిలో వీరి పేర్లే వినిపిస్తున్నాయి. మొత్తంగా అందరిలోకి రేవంత్ రెడ్డి బలంగా కనిపిస్తున్నా.. కేసీఆర్ ను ఢీకొట్టే శక్తి సామర్థ్యాలున్నా.. ఆయన ఆ పీఠం ఎక్కనీయకుండా సీనియర్లు అడ్డుపడుతున్నారు. మరి ఈ పీఠాన్ని అధిష్టానం ఎవరికి ఇస్తుందనేది వేచిచూడాల్సిందే..

–నరేశ్ ఎన్నం