
సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డేను పురస్కరించుకొని ఇటీవలే మహేష్ బాబు కొత్త సినిమా అప్డేట్ వచ్చింది. ‘గీతగోవిందం’ ఫేం దర్శకుడు పరశురామ్ తో మహేష్ 27వ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీకి ‘సర్కార్ వారి పాట’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేయగా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మహేష్ బాబు చెవికి రింగు పెట్టుకొని మాస్ లుక్కులో అదరగొట్టాడని ఫ్యాన్స్ నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ పోస్టర్ వైరల్ అయింది. అయితే ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ విషయంలో మహేష్ బాబు మాటే నెగ్గిందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.
‘సర్కార్ వారి పేట’ మూవీ కోసం దర్శకుడు పరశురామ్ తన తొలి మూవీకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ ను తీసుకోవాలని అనుకున్నాడట. ‘గీతగోవిందం’ సినిమాకు గీపిసుందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ మూవీలోని ‘ఇంకేం.. ఇంకేం.. కావాలే’ సాంగ్ అప్పట్లో ఒక్క ఊపుఉపేసింది. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. తన తదుపరి మూవీలోనూ గోపిసుందర్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని భావించాడు. ఈ విషయాన్నే మహేష్ కు చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరుగుతోంది.
https://twitter.com/urstrulyMahesh/status/1266937240808157185
అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ మూవీతో సంగీత దర్శకుడు థమన్ మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీలోని కొన్నిపాటలు వంద మిలియన్ వ్యూస్ దాటి కొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో మహేష్ తన సినిమాకు మ్యాజిక్ విషయంలో థమన్ కే ఓటేసినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు మహేష్ ఇష్టపడకపోవడంతోనే థమన్ కు ఛాన్స్ దక్కిందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా గతంలోనూ థమన్-మహేష్ కాంబోలో ‘దూకుడు’, ‘ఆగడు’, ‘బిజినెస్ మేన్’ మూవీలు మ్యూజికల్ హిట్టుగా నిలిచాయి. దీంతో మహేష్ బాబు మాటను కాదనలేక దర్శకుడు పరశురామ్ థమన్ వైపు మొగ్గుచూపాడని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.