
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి తోమర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు అండగా నిలిచేందుకు 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
రైతులకు ఖరీఫ్ పంటలకు 50 నుంచి 83 శాతం అధిక మద్దతు ధర ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రైతులకు రుణాలు చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తామని, రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధిచేకూరుతుందన్నారు.