Home Blog Page 8445

మూడో పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్‌ హీరోయిన్‌!


చిత్ర పరిశ్రమలో నటీ నటుల లైఫ్ స్టైల్ విచిత్రంగా ఉంటుంది. క్రేజ్‌, స్టార్డమ్‌ ఉన్నప్పుడే ఆఫర్లు వస్తాయి. యాక్టర్లుగా స్క్రీన్ పై వాళ్ల లైఫ్‌స్పాన్‌ తక్కువే. వాళ్ల రిలేషన్‌షిప్స్‌ కూడా అంతే. ప్రేమ, పెళ్లి బంధాలు త్వరగా ముగుస్తుంటాయి. అందుకే చాలా మంది ఒకటి మించి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆ లిస్ట్‌లో ఇప్పటికే చేరిపోయిన నటి వనితా విజయకుమార్‌ మూడో పెళ్లింది రెడీ అయింది. తమిళ్‌ బిగ్‌బాస్‌ 3 ద్వారా క్రేజ్‌ తెచ్చుకున్న వనిత.. నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు. 1995లో నటుడు విజయ్‌కు జంటగా ‘చంద్రలేఖ’ అనే తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించింది. ఓ సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యహరించింది.

తెలుగులో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన దేవి సినిమాలో న‌టించిన వనితా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. మనస్పర్థల కారణంగా 2005లో ఆకాశ్‌తో డైవర్స్‌ తీసుకుంది. ఆ తరువాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్తను రెండోపెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు పుట్టింది. కానీ, ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలువలేదు. ఇద్దరూ విడిపోయారు. జయదర్షన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో కొంత కాలం సహజీవనం సాగించిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌–3లో పాల్గొని వార్తలోకి వచ్చింది. తాజాగా ఆమె మూడో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. పీటర్ పాల్‌ అనే వ్యక్తితో ఈ నెల 27న చెన్నైలోని తన ఇంటి వద్దే వివాహం జరగనున్నట్లు పెళ్లి పత్రిక సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వెడ్డింగ్‌ కార్డ్‌ నిజమో కాదో వనిత, పీటర్ ధ్రువీకరించలేదు.

దర్శకుడిపై పూనమ్‌ సంచలన విమర్శలు


బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న తర్వాత పలువురు నటీనటులు తమ మానసిక సమస్యల గురించి బయటకు చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైన అవమానాల గురించి మాట్లాడుతున్నారు. డిప్రెషన్‌కు గురైతే చికిత్స తీసుకోవాలని, అంతే కాని ఆత్మహత్య ఆలోచనలు మానుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు నటి పూనమ్ కౌర్ కూడా తన అనుభవాలను వెల్లడించింది. కొంతకాలంగా తాను డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పిన ఆమె ఓ దర్శకుడి కారణంగానే తాను కుంగిపోయానని చెప్పింది. ఓ తెలుగు దర్శకుడిపై వరుస ట్వీట్స్ చేసి సంచలనానికి తెరలేపింది. అయితే.. ఆ దర్శకుడు ఎవరనే విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. కానీ ట్వీట్స్‌లో మాత్రం గురూజీ అని హాష్ట్యాగ్ జత చేసి హింట్ ఇచ్చింది. సదరు దర్శకుడు తనను అణగదొక్కే ప్రయత్నం చేశాడని.. తప్పుడు వార్తలు రాయించి తన పేరు చెగడొట్టాడని వివరించింది.

‘కొంతకాలం కిందట నేను అనారోగ్యానికి గురయ్యా. ఇదే విషయాన్ని నా ఫ్రెండ్ ఆ డైరెక్టర్ కు చెప్పింది. నేను అస్సలు బాగాలేనని, చాలా సమస్యలు చుట్టు ముట్టాయని ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు చెప్పింది. ఆ టైమ్లో నాకు హెల్ప్‌ చేయాలని కోరింది. కానీ, ఆయన పట్టించుకోలేదు. దీంతో.. నేనే ఆ దర్శకుడిని నేరుగా సంప్రదించా. నా పరిస్థితి ఏం బాగోలేదని, ఆత్మహత్య చేసుకోవాలని ఉందని చెప్పా. ఒకసారి కలిసి మాట్లాడదాం అన్నా. దానికి అతను ‘ఏమీ జరగదు. నువ్వు చచ్చిపోతే వన్‌ డే న్యూస్ అవుతావు’ అన్నాడు. అలాంటి కనికరం లేని మాటలు నన్ను మరింత కుంగదీశాయి. మీడియాను, మూవీ మాఫియాను, ప్రకటనలను అతను కంట్రోల్ చేయగలడు. ఆన్‌లైన్‌లో పరోక్ష ఆర్టికల్స్‌ ద్వారా నన్ను మరింత బాధపెట్టాడు. లేనిపోని వార్తలు నన్ను కుంగదీశాయి. నన్ను డిప్రెషన్‌లోకి నెట్టాయి. ఆ టైమ్‌లో ఆ దర్శకుడికి నేను డైరెక్ట్‌ రిప్లే ఇచ్చా. ఆ మనిషితో నా ప్రయాణం ‘మధ్య రాత్రి కూడా ప్రాబ్లమ్ ఉంటే నేను వస్తాను అనే దగ్గరి నుంచి నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ అవుతావు’ అనే వరకు వెళ్లింది. ఇప్పుడనిపిస్తోంది నేను ఎందుకు కుంగిపోయా? ఇంకా ఎందుకు మామూలు మనిషిని కావడం లేదు అని. ఎందుకంటే నువ్వు నా పేరు సినిమా క్యాస్టింగ్ లిస్ట్ నుంచి తొలగించావు. ఆడియో ఫంక్షన్ లో నా ఫొటోలు తీసేయమన్నావు కదా? ఆ మాటలు నా చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సావిత్రి గారి గురించి వేదికలపై మాట్లాడే నువ్వు.. లోకల్ టాలెంట్ ను ఎప్పుడూ ఎంకరేజ్‌ చేయవు.పైగా ఎవరైనా ప్రోత్సహిస్తే అడ్డుపడతావు. ఎందుకంటే ఆ అమ్మాయి అందంగా ఉందని ఇతరులు డిక్లేర్ చేస్తే నీకు నచ్చదు కాబట్టి. నీకు మంత్రుల కొడుకులు తెలుసు. బడా కుటుంబాలతో సంబంధాలున్నాయి. అయితే, ఏంటి? నువ్వో మానసిక రోగివి. మాయగాడివి.

నీ స్నేహితుడి జీవితాన్ని నాశనం చేసి లాభపడ్డావు
నీ స్వలాభం కోసం నీ స్నేహితుడి జీవితాన్ని కూడా నాశనం చేశావు. అలా చేసి నీకంటే మరెవరూ లాభపడి ఉండరు. నువ్వో మాయగాడివి. మానసిక రోగివి.. #గురూజీ. నీ స్నేహితుడు తిరిగి తన భార్య దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నావు. ఆమె అంటే ఆయనకు చచ్చేంత ఇష్టం. కానీ, ఆ స్టార్ను ఈ రోజు అందరూ తిడుతున్నారంటే దానికి కారణం నువ్వు ఆ దంపతుల మధ్యలోకి రావడమే. వాళ్ల పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆయన ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇలా ఎందుకు చేశావు. స్లో పాయిజన్‌ మాదిరిగా ఆయణ్ని చంపాలనుకుంటున్నావా? ఇందతా జరిగి పదేళ్లు ఏమీ కాదు 2017లో జరిగింది. ఏదేమైనా నాకు సాయం చేయాలని నేను చాలా వినయంగా అర్థించినా నువ్వు పెడచెవిన పెట్టడంతో నేను షాక్‌ అయ్యా. నేను ఏ తప్పూ చేయకపోయినా నువ్విచ్చిన షాక్స్‌ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నా. ఇప్పుడు సుశాంత్ సింగ్‌ కు జరిగింది తెలిసి నిర్ఘాంతపోయా. కానీ, నేను ఆయన మాదిరిగా జీవితాన్ని ముగించను. చికిత్స తీసుకుంటున్నా’ అని పూనమ్‌ వరుస ట్వీట్స్‌లో వివరించింది.

పంతం నెగ్గించుకున్న టీడీపీ..!


శాసన మండలిలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీకి మెజారిటీ సభ్యులు ఉండటంతో అధికార పక్షానికి ఇబ్బందులు తప్పడం లేదు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మండలిలో ఆమోదం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి ప్రభుత్వంపై పైచేయి సాధించింది. ఈ రెండు బిల్లులను ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని భావించిన ప్రభుత్వం ఎటువంటి సవరణలు లేకుండా రెండవసారి శాసన సభలో ఆమోదించి మండలికి పంపింది. గతంలో మండలి ఏ బిల్లులపై చర్చ జరిపి సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ విషయం ఏమీ తెలకుండా, మరోసారి బిల్లులు ఎలా ప్రవేశపెడతారని టీడీపీ అడ్డు తగిలింది.

మూడు నెలల సమయం దాటినందున అధికార పక్షం బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని, బిల్లులపై చర్చించాలని అధికార పక్షము పట్టుబట్టింది. ముందు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చిచాలని టీడీపీ సభ్యులు కోరడంతో డిప్యూటీ ఛైర్మెన్ అనుమతి ఇచ్చారు.అనంతరం నెలకొన్న గందరగోళం, కేకలు, సభ ఆర్డర్ తప్పె పరిస్థితి నెలకొనడంతో డిప్యూటీ ఛైర్మెన్ సభను నిరవధిక వాయిదా వేశారు. దీంతో తొలుత మూడు రోజులు మండలిని నిర్వహించాలని నిర్ణయించిన రెండు రోజులకే సమావేశాలు పరిమితం అయ్యాయి.

బిల్లులు ఆమోదించకుండా సభను వాయిదా వేయండంలో టీడీపీ వ్యూహం స్పష్టం అవుతుంది. శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ ఆ పార్టీకి చెందిన వారే కావడంతో టీడీపీ బిల్లులను ఆమోదించకుండా సభను వాయిదా వేయించుకోగలిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలోని తన ఛాంబర్ లోనే మండలి సమావేశాలు ముగిసే వరకూ ఉన్నారు. సభ్యులకు తగు సూచనలు ఇస్తూ ప్రభుత్వ రాజధాని తరలింపు నిర్ణయానికి చట్టపరంగా చెక్ పెట్టారు. దీంతో విశాఖకు రాజధానిని తరలించే విషయంలో ప్రభుత్వానికి మరికొన్నాళ్లు అడ్డంకులు తప్పవు. ఎందుకంటే చట్ట సభలు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించే వరకూ రాజధానిని తరలించమని ఈ అంశంపై దాఖలైన కేసులో హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది.

కేంద్రం సంచలనం.. సైన్యం సిద్ధంగా ఉండాలని ఆదేశం


గడిచిన నెలరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారత్-చైనా మధ్య ఇటీవల ఆర్మీ, దౌత్య ఉన్నతాధికారులు చర్చలు చేపడుతున్నారు. ఈక్రమంలోనే ఎల్ఓసీ నుంచి ఇరుదేశాల సైనికులు తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఘర్షణ చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక కల్నల్ స్థాయిలో అధికారితోపాటు 19మంది సైనికులు వీరమరణం పొందారు ఈ ఘటనపై యావత్ దేశం వీరజవాళ్లకు కన్నీటి నివాళి పలుకుతోంది.

సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో చైనా భారత్ ను దొంగదెబ్బతీసింది. సరిహద్దుల్లో వెయ్యమంది చైనా జవాన్లు భారత సైనికులతో రాళ్లు, రాడ్లతో దాడికి దిగారు. దీంతో భారత సైనికులు ప్రతిదాడి చేశారు. ఈ సంఘటనలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అదేవిధంగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే చైనా మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. ఈసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో మృతిచెందిన కల్నల్ సంతోష్ బాబు తెలుగువాడు కావడం గమనార్హం. ఆయన తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవాడు. ఆయన మృతితో సూర్యాపేటలో తీవ్రవిషాదం నెలకొంది.

ఈ ఘటనపై రక్షణ శాఖా మంత్రి సైనికాధికారులతో పలుదఫాలుగా చర్చించారు. సైనికుల త్యాగం వృథాకాదని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. ఈ విషయంపై ప్రధానితో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షిస్తున్న ఆర్మీ కమాండర్లలకు పరిస్థితిని బట్టి స్వయంగా నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిది. తమకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వడంపై ఆర్మీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులకు కేంద్రం ఆదేశాలను జారీ చేసింది. భారత్-చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది.

అరె.. థియేటర్స్ తీరు మారబోతుంది !


మానవాళికే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్‌ సినిమా రంగం పై విసిరిన పంజా దెబ్బకు.. సినిమా థియేటర్స్‌, మల్టీపెక్స్‌ల తీరు మారబోతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌ తో థియేటర్స్‌ అన్ని మూసేశారు. దేశవ్యాప్తంగా క్లోజ్ లో ఉన్న థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. ఓపెన్ అయినా కరోనా భయంతో జనం థియేటర్స్ వస్తారా.. ? వచ్చేలా అనేక జాగ్రత్తలు తీసుకోవడానికి థియటర్ల యజమానులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

థియేటర్‌ లో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చునే విధానాన్ని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి షో ముగియగానే అన్ని సీట్లను శానిటైజ్‌ చేసి ఎర్ర రిబ్బన్‌ పెట్టాలని.. దీనికి ఎక్కువ సమయం అయితే రోజుకు నాలుగు షోలకు బదులు మూడే ప్రదర్శించాలని అనుకుంటున్నారట. అలాగే పేపర్ టిక్కెట్లను ఎత్తివేసి, క్యూఆర్‌ కోడ్‌ తో టికెట్‌ను సెల్‌ఫోన్‌ కు పంపేలా ప్లాన్ చేయనున్నారు. అలాగే స్టాల్స్‌ వద్ద, బాత్ రూమ్ ల దగ్గర, భౌతికదూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

జూలై రెండో వారం నుండి నగరంలోని ఒక ప్రముఖ థియేటర్లో ఈ విధానాలను అమలు చేసి చూడాలని చూస్తున్నారట. ప్రభుత్వం ప్రదర్శనలకు అనుమతి ఇవ్వడానికి ముందే థియేటర్లలో వైరస్‌ నిరోధానికి తమంతట తామే కొన్ని చర్యలు తీసుకుని ప్రభుత్వ పెద్దలను కలిసి నివేదికను అందజేయాలని థియేటర్ల యజమానులు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఉద్యోగులకు భారీ షాకిచ్చిన సీఎం కేసీఆర్


దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం లాక్డౌన్ కొనసాగిస్తూ పోతుంది. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ 5.0 జూన్ 30వరకు కొనసాగనుంది. కేంద్రం ఓవైపు లాక్డౌన్ అమలు చేస్తూనే మరోవైపు సడలింపులు ఇస్తోంది. లాక్డౌన్ వల్ల కేంద్రం, ఆయా రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం భారీ సడలింపులు ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలకు కొంతమేర ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ జీతాలు, పెన్షన్లపై మంగళవారం రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది.

అయితే తెలంగాణలో మాత్రం లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీ కోత పడింది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య, విద్యుత్ శాఖలకు మినహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల్లో కోత విధిస్తు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సేవా అధికారులు మరియు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు 10శాతం నుంచి 75 శాతం వరకు వేతన కోతలను ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే అందుతోంది. అయితే తెలంగాణలో భారీ సడలింపులు రావడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండటంతో మే నెల జీతం పూర్తిగా వస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే వీరి ఆశలపై కేసీఆర్ నీళ్లుచల్లి సగం వేతనమే మంజూరు చేశారు.

ఇక జూన్ నెల వేతనంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాల్లో కోతలు విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం పెన్షన్లలో కోత విధించే అధికారం తమకు ఉందని హైకోర్టులో వాదనలు విన్పించింది. దీంతో ప్రభుత్వానికి ఏ హక్కు ఉందో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారంగా రాష్ట్రంలో ఏవైనా విపత్తులు లేదా ప్రజారోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు ఏ వ్యక్తికైనా, సంస్థకైనా, పెన్షనర్లకైనా చెల్లింపులను వాయిదా వేసే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.

ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ చూస్తే ఉద్యోగులకు జూన్ నెలలోనూ పూర్తి వేతనం వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లో కోత వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చూస్తుంటే ప్రభుత్వం ఇప్పట్లో పూర్తిస్థాయి జీతాలు చెల్లించేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరునెలలు ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించబోదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

అయితే ఆర్డినెన్స్ నియమ నిబంధనలు మార్చే అధికారం ప్రభుత్వానికి ఉండనుండటంతో వారికి జూన్ నెలలో పూర్తిస్థాయి వేతనాలు వస్తాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మూడునెలలుగా సగం జీతంతో ఇబ్బందులు పడుతుండటంతో తమకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

పవర్ స్టార్ ‘విరూపాక్ష’లో ఎమోషనల్ సీన్ ?


క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ సరసన హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె యువరాణిగా కనిపిస్తుందట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆమె పాత్ర సెకెండ్ హాఫ్ లో చనిపోతుందని, ఆమె చనిపోయే ఎమోషనల్ సీన్ సినిమాలోనే కీలకం అని తెలుస్తోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందట.

మరి ఇంతకీ ఆ రాజు ఎవరు? ఆ పీరియాడిక్ డ్రామా ఏమిటి? అనేది చూడాలి. ప్రస్తుతానికి, ఈ చిత్రం అయితే పాన్-ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారు. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పీవీపీ బ్యానర్ పై పరం వి.పొట్లూరి ఓ చిత్రాన్ని నిర్మించే ప్లాన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పీవీపీ పవన్ ను అప్రోచ్ అయ్యాడని సినిమా చేయడానికి పవన్ నుండి కూడా సానుకూల స్పందనే వచ్చిందని, అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 చివర్లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయట. ఏమైనా పవన్ నుండి ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన పవర్ స్టార్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

నిర్మాతలు మనసు మార్చుకుంటారా ?


క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌ల‌మవుతుంది. లాక్‌డౌన్ తో ఆపేసిన సినిమాల షూటింగ్స్ మళ్లీ మొదలైనా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఇంకా క్లారిటీ లేదు. దాంతో ఏ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా తెలియకుండా పోయింది. నాలుగు నెలలు ముందే దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది. దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అవ్వక తప్పలేదు.

కాగా నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాయి. లాక్ డౌన్ పెరిగే కొద్దీ నిర్మాతలకు అదనపు వడ్డీ రూపంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి చిన్న సినిమాలు ఓటిటీలో రిలీజ్ అయితే బెటర్ అని ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినా ఓటిటీ ప్లాట్ ఫామ్ పై డైరెక్ట్ రిలీజ్ కి మాత్రం ఆయా సినిమాల మేకర్స్ అంగీకరించట్లేదు.

అయితే నిశ్శబ్దం మాత్రం ఓటిటీలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై ఓటిటీ ప్లాట్ ఫాన్స్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికైనా నిర్మాతలు మనసు మార్చుకుని, రెడ్, ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఓటిటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయితే బెటర్. మరి నిర్మాతలు మనసు మార్చుకుంటారా చూడాలి.

టీఆర్ఎస్ కోవర్టులే కేటీఆర్ ను ఇరికించాయా?


ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ ఫాంహౌస్ వివాదంలో ఆయన చెడ్డపేరు తెచ్చుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏకంగా కేటీఆర్ ఫాంహౌస్ అంటూ అన్ని పత్రాలు సంపాదించి మరీ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఎక్కి ఇరుకునపెట్టారు. ఎంతో పకడ్బందీగా ఉండే కేసీఆర్, కేటీఆర్ లకు ఈ వ్యవహారం లీక్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే దీనిపై ఆరాతీసిన కేసీఆర్, కేటీఆర్ లకు టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ కోవర్లులే ఈ లీకులను ఆధారాలను రేవంత్ రెడ్డికి ఇచ్చారన్న విషయం తెలిసిందట. టీఆర్ఎస్ లోని ఒక కోవర్టు విభాగం కేసీఆర్ తర్వాత ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ ను అణిచివేయడానికి లేదంటే ఆయన పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని గులాబీ దళపతికి తెలిసినట్టు ప్రచారం సాగుతోంది.

కేటీఆర్ ఆస్తుల గురించి కొన్ని కీలకపత్రాలను టీఆర్ఎస్ కోవర్టులు ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నారని.. కేటీఆర్ ఆస్తుల గురించి పత్రాలకు కాంగ్రెస్ కు లీక్ చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ధారణ కు వచ్చిందట.. ఇందుకు బలమైన ఆధారాలను కూడా సేకరించినట్టు తెలిసింది.

ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒక పావు మాత్రమేనని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందట.. వెనుక నుంచి నడిపిస్తున్న వ్యక్తి వేరే ఉన్నాడని గులాబీ నాయకత్వం అంచనావేసిందట.. కేసీఆర్ తీరుపై అసంతృప్తిగా ఉన్న కొందరు టీఆర్ఎస్ నాయకులు అదును చూసి దాడి చేయాలని నిర్ణయించుకున్నారని టీఆర్ఎస్ కు ఉప్పందింది.

అయితే కేసీఆర్ పై ఏదైనా దాడి చేస్తే తెలంగాణపై దాడిగా చిత్రీకరిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణను సాధించిన వ్యక్తిగా కేసీఆర్ కు కాస్త క్రెడిబులిటీ ఉంది. కాబట్టి తెలంగాణ పోరాట చరిత్రలో లేని కేటీఆర్ ను టార్గెట్ చేసి ఇలా అభాసుపాలు చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.

టీఆర్ఎస్ లో కీలక నేత హరీష్ ను పక్కనపెట్టి ఇప్పుడు కీలక నేతగా ఎదుగుతున్న కేటీఆర్ పై ఫోకస్ చేసిన కోవర్టులు ఆయన ఎన్నికల అఫిడవిట్లు, ఇతర పత్రాలను రేవంత్ రెడ్డి ద్వారా లీక్ చేస్తున్నట్టు టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది.

అయితే ఇప్పటికిప్పుడు కేటీఆర్ ను దెబ్బతీయడం కష్టమే అయినా ఆయనపై ప్రతీకూల ప్రచారం చేసి ఆయన విశ్వసనీయతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సమాచారం. తద్వారా భావి సీఎం అనుకుంటున్న కేటీఆర్ ను అభాసుపాలు చేయడానికి నిర్ణయించారట.. రేవంత్, ఇతర కాంగ్రెస్ నాయకులకు డేటాను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.

వీరమరణం పొందిన 20మంది జవాన్లు వీరే..


గడిచిన నెలరోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో భారత్-చైనా మధ్య కొన్నిరోజులుగా ఆర్మీ, దౌత్య ఉన్నతాధికారులు చర్చలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు ఇరుదేశాలు ఎల్ఓసీ వద్ద తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సోమవారం రాత్రి 3గంటల సమయంలో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగింది. చైనా భారత సైనికులపై దొంగదెబ్బతీయడంతో ఒక కల్నల్ స్థాయిలో అధికారితోపాటు 19మంది సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనపై యావత్ దేశం ఆవేదన వ్యక్తం చేస్తూ వీరజవాళ్లకు ఘన నివాళి పలికింది.

ఇరుదేశాల మధ్య ఒక్కతూటా పేలకపోయినప్పటికీ ఇరుదేశాల సైనికులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తుంది. చైనా సైనికులు ప్లాన్ ప్రకారంగా రాళ్లు, రాడ్లతో దాడిచేయగా భారత జవాన్లు ప్రతిదాడికి సిద్ధమయ్యారు. దీంతో ఈ ఘర్షణలో 20మంది భారత జవాన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. చైనా సైనికులు దాదాపు 40మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆ దేశం అధికారిక ప్రకటన చేయలేదు. భారత సైనికులే తమ సరిహద్దుల్లోకి వచ్చి దాడి చేశారని చైనా ఆరోపిస్తోంది. చైనా వ్యాఖ్యలను కేంద్రం తిప్పికొడుతోంది.

ఈనేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 19న అన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులతో మీటింగ్ నిర్వహించి చైనాను ఎలా ఎదుర్కోవాలో వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. కాగా భారత జవాన్ల మృతిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమరులైన బలిదానాలు ఊరికేపోవు.. ఈ అంశంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు.. భారత్ శాంతి కోరుకుంటోంది. కానీ, సరైన సమయం వస్తే దీటుగా జవాబు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అమర జవాన్ల విషయంలోదేశం గర్వ పడుతుంది. వారు పోరాడుతూ ప్రాణాలు అర్పించారు..’ అని ప్రధాని మోదీ తెలిపారు. సీఎంలతో నిర్వహిస్తూ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమర జవాన్లకు అంజలి ఘటించారు.

20మంది వీరజవాన్ల వివరాలు..
తాజాగా చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్ల వివరాలను భారత సైన్యం ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా చైనా-భారత్ ఘర్షణలో వీరమరణం పొందారు. కల్నల్ సంతోష్ బాబు(సూర్యాపేట), నాయబ్ సుబేదార్ నాథూరామ్ సోరెన్(మయూర్ భంజ్), నాయబ్ సుబేదార్ మన్‌దీప్ సింగ్(పాటియాలా), నాయబ్ సుబేదార్(డ్రైవర్) సత్నం సింగ్(గురుదాస్ పూర్), కె. పళని(మధురై), హవల్దాన్ సునీల్ కుమార్(పాట్నా), హవల్దాన్ బిపుల్ రాయ్(మీరట్), ఎన్‌కే(ఎన్ఏ) దీపక్ కుమార్(రేవా), సిపాయి రాజేష్ ఓరంగ్(బీర్ఘుం), సిపాయి కుందన్ కుమార్ ఓఝా(సాహిబ్‌గంజ్), సిపాయి గణేష్ రామ్(కాంకేర్), సిపాయి చంద్రకాంత ప్రధాన్(కందమాల్), సిపాయి అంకుష్(హమీపూర్), సిపాయి గుర్బీందర్(సంగ్రూర్), సిపాయి గుర్తేజ్ సింగ్(మాన్సా), సిపాయి చందన్ కుమార్(భోజ్‌పూర్), సిపాయి అమన్ కుమార్(సమస్తిపూర్), సిపాయి జై కిశోర్ సింగ్(వైశాలి), సిపాయి గణేష్ హండ్సా(ఈస్ట్ సింగ్‌భూమి), సిపాయి కుందన్ కుమార్(సహర్ష)లు వీరమరణం పొందినట్లు భారత ఆర్మీ ప్రకటించింది.

స్టార్ హీరో బర్త్ డే స్పెషల్ గా.. !


తమిళ స్టార్ హీరో విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది. దాంతో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఏర్పడింది. కాగా ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ‘మాస్టర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయట.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే విజయ్ తన పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కానున్నాయి. తెలుగులో విజయ్ పాత్రకు హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు.

కాగా విజయ్ పుట్టినరోజు స్పెషల్‌ గా జూన్ 22 న మాస్టర్‌ సినిమా నుండి ఓ ఇంట్రస్టింగ్ ట్రైలర్ ను విడుదల చేయాలని యూనిట్ యోచిస్తోంది. విజయ్ గత సినిమా ‘బిగిల్’ కంటే కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా హడావుడి స్టార్ట్ చేసారు. మరి కరోనా తగ్గాక ‘మాస్టర్’ ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

నాని ఇచ్చే ట్విస్టే బిగ్ హైలైట్ అట !


నేచురల్ స్టార్ నాని టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రానున్న సినిమా ‘వి’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సినిమా కథ మొత్తాన్నీ టర్న్ చేసే అద్భుతమైన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందని.. ఈ ట్విస్ట్ సినిమాలోనే బిగ్ హైలైట్ గా నిలుస్తోదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ ట్విస్ట్ నాని పాత్రకి సంబంధించిందట. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ అండ్ ప్రోమోలో నాని క్లాసిక్ విలనిజమ్ తో బాగా ఆకట్టుకున్నాడు.

మొత్తానికి ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి కూడా నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. ఆమె క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి నానికి జోడిగా నటిస్తోందా లేక ఆమెది సెపెరేట్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది.

అలాగే సుధీర్‌బాబుతో స‌మ్మోహ‌నం వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిస్తున్నాడు. హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రానుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

చైనా దూకుడుకు చెక్ పెట్టనున్న మోదీ!


భారత సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాతో తేల్చుకునేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు శాంతియుతంగా చర్చలు అంటూనే దొంగదెబ్బ కొడుతున్న చైనాను కట్టడి చేసేందుకు కేంద్రం తగిన వ్యూహాన్ని రచిస్తోంది. గాల్వానాలో చైనా దుస్సాహాసం చేసి 20మంది జవాన్లు పొట్టనపెట్టుకున్నదే కాకుండా భారత సైనికులే సరిహద్దు దాటి చైనాలోని ప్రవేశించి దాడి చేశారని ఆరోపణలు చేస్తోంది. చైనా మీడియాలో భారత సైనికులే ముందు దాడి చేశారంటూ తప్పుడు కథనాలను ప్రచురితం చేస్తూ ప్రపంచం దృష్టిలో భారత్ ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దు వివాదంలో చైనా వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. చైనా అంశాన్ని త్వరగా తేల్చేందుకు ప్రధాని మోదీ ఈనెల 19న ఆల్ పార్టీ పిలుపుకు పిలువడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సోమవారం రాత్రి 3గంటల సమయంలో గాల్వానాలో చైనా-భారత్ మధ్య ఘర్షణ జరుగగా భారత జవాన్లు 20మంది వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. గత నెలరోజులుగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడగా ఇరుదేశాలు ఆర్మీ, దౌత్య భేటిలు నిర్వహిస్తున్నారు. ఇందులో చర్చలు కొలిక్కిరాగా ఎల్ఓసీ నుంచి ఇరుదేశాల సైనికులు కొంతమేరకు వెనక్కి వెళుతున్న క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. చైనీయులు పక్కా ప్లాన్ తో రాళ్లు, కర్రలతో భారత జవాన్లపై దాడి దిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే భారత జవాన్లు చైనా సైనికులపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో భారత్ కు చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందగా చైనాకు చెందిన 35మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. అయితే చైనా సైనికులు ఎంతమంది చనిపోయారనేది అధికారికంగా చైనా ఆర్మీ ప్రకటించలేదు.

సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20మంది జవాన్లు వీరమరణం పొందటంపై యావత్ దేశం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు భారత్-చైనా సరిహద్దుల్లోని లఢక్ ప్రాంతంలో ఏం జరుగుతుందో మోదీ సర్కార్ ప్రజలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత జవాన్ల మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ చైనా అంశాన్ని త్వరగా తేల్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 19న సాయంత్రం 5గంటలకు అన్నిపార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి చైనా అంశంపై అభిప్రాయాలు తీసుకోనునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్నిపార్టీల అధ్యక్షులు పాల్గొని వారి అభిప్రాయాలు తెలియజేయాలని ఈమేరకు ప్రధాని కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో కోరినట్లు తెలుస్తోంది. ఈ బేటీలో సమష్టి నిర్ణయం తీసుకొని తదునుగుణంగా ముందుకెళ్లాలని కేంద్రం ఆలోచిస్తుంది. భారత జవాన్ల మృతికి భారతీయులంతా నివాళ్లర్పిస్తూనే చైనా దుస్సాహసానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ చైనాకు ఏవిధంగా చెక్ పెడుతుందనేది ఆసక్తిని రేపుతోంది.

మండలిలో రెచ్చిపోయిన మంత్రి అనిల్..!


శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బడ్జెట్ పై చర్చ జరుగుతున్న క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర రావు మాట్లాడుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని అక్రమంగా అరెస్టు అంశాన్ని లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని అన్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ.. ఆయన దొంగ కాబట్టే అరెస్టు చేశారని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ జోక్యం చేసుకుని టీడీపీ హయాంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ను అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు.

ఈ సమయంలో సభ్యులు ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తనను ఓడించడాని కోట్లు ఖర్చు చేశారని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహంతో సభలో తొడగొట్టి మరీ టిడిపి సభ్యులను బెదిరించే యత్నం చేశారు. ఓ సందర్భంలో ఇరువురు సభ్యులు ఒకరి వైపుకు మరొకరు దూసుకు రావడంతో తోటి సభ్యులు నిలువరించారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మంత్రుల వేష, భాషలపై అంతటా చర్చ జరుగుతుందని అన్నారు. గడ్డం పెంచుకున్న వాళ్ళంతా రౌడీలా… చంద్రబాబు గడ్డం పెంచుకున్నారు. ఛైర్మన్ కు గడ్డం ఉంది…వారు రౌడిలా అంటూ దీపక్ రెడ్డిని మంత్రి అనిల్ ప్రశ్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన మండలి ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

వాయిదా అనంతరం సమావేశమైన మండలిలో తమ సభ్యులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి రికార్డుల నుంచి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఛైర్మన్ ను కోరారు. అధికార పక్షం సభ్యులు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఉంటే రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ ను కోరారు. రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ షరీఫ్ మహ్మద్ తెలిపారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ప్రవేశపెట్టక ముందే మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

కేసీఆర్, జగన్ వరమిచ్చినా సినీ పూజారి కరుణించడం లేదా?


దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత ఎంతో పాపులర్. కరోనా-లాక్ డౌన్ తో అన్నింటికి మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వాలను సినిమా ఇండస్ట్రీకి మాత్రం మొదట ఇవ్వలేదు. అయితే బతిమాలి.. బమాలి మరీ సినిమా షూటింగ్ లకు అనుమతులు తెచ్చుకున్నా టాలీవుడ్ సినీ ప్రముఖులు. సీఎంలు కేసీఆర్, జగన్ లతో భేటి అయ్యి మరీ సాధించుకున్న అనుమతులు ఇప్పుడు వృథా అయ్యాయి. సినిమా షూటింగ్ లు మొదలైతే.. తమ కడుపులు నిండుతాయని భావించిన సినీ కార్మికులకు నిరాశే ఎదురైంది.

రాజమౌళి, కొరటాల శివ సహా ప్రముఖ దర్శకులతో సగంలో ఆగిపోయిన తమ సినిమాలను తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇస్తే చేద్దామని ప్లాన్ చేశారు. ఈ మేరకు తిరిగి ప్రారంభించడానికి తమ ప్రణాళికలు కూడా రూపొందించారు. అంతా సిద్ధమనుకుంటున్న తరుణంలో హీరోలు, సినీ ప్రముఖ నటులు హ్యాండిచ్చారట..

ప్రస్తుతం సీఎంలను అడిగినప్పటి కంటే ముందే దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో అయితే అంతుచిక్కడం లేదు. దీంతో ఇలాంటి విపత్కర పరిస్థితిలో పనిచేయడానికి హీరోలు, సినీ నటులు ఆసక్తి చూపించడం లేదు. ఇక షూటింగ్ లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి నటులు హైదరాబాద్ రావడానికి నిరాకరిస్తున్నారు.

ప్రస్తుత కరోనా వేళ షూటింగ్ లకు వచ్చే నటీనటులు హోటళ్లలో బసచేయడం.. విమానాలు, కార్లలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం. అందుకే షూటింగ్ లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నటులు ఎవరూ రావడానికి ధైర్యం చేయడం లేదట.. వైరస్ తగ్గే వరకు షూటింగ్ లో పాల్గొనమని స్పష్టం చేశారట..

ఇక మన అగ్రహీరోల్లో అంతా 60 ఏళ్లు పైబడిన వారే. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో కూడా 60ఏళ్లకు అటూ ఇటూగా ఉన్న వారు కూడా షూటింగ్ లో పాల్గొనే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇతర రాష్ట్రాల నటీనటులు కూడా ఈ సమయంలో తాము రిస్క్ చేయలేమని దర్శకులు, నిర్మాతలకు స్పష్టం చేస్తున్నారట..

ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రానికి అనుమతులు రాగానే మాక్ షూట్ ప్లాన్ చేసిన రాజమౌళి కూడా తన ప్రణాళికలను కొన్ని రోజులు వాయిదా వేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ మినహా తెలుగు చలనచిత్ర , టీవీ పరిశ్రమ ఇప్పటికీ లాక్ డౌన్ లోనే ఉంది.

జూలై 31 వరకు పరిస్థితి మెరుగుపడితే ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి తిరిగి సినిమా షూటింగ్ లలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి కేసీఆర్, జగన్ అనుమతులు ఇచ్చినా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా లాక్ డౌన్ లోనే ఉండడం గమనార్హం.

-నరేశ్ ఎన్నం

సంతోష్ బాబుకి కేసీఆర్ ఘన నివాళి


భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రుడైన సూర్యాపేట బిడ్డ క‌ల్న‌ల్ బిక్కుమ‌ల్ల సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ‌లో ఆయ‌న మ‌ర‌ణించ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం.. ఆయ‌న కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ల‌ఢ‌ఖ్‌ లోని గాల్వాన్ లోయ వ‌ద్ద సోమ‌వారం రాత్రి స‌మ‌యంలో అక‌స్మాత్తుగా చైనా సైనికులు భార‌త భూభాగంలోని మ‌న జ‌వాన్ల‌పై దాడికి పాల్ప‌డ్డారు. రాళ్లు, ఇనుప రాడ్ల‌తో కొట్లాట‌కు దిగడంతో ప్ర‌తిఘ‌టించారు భార‌త జ‌వాన్లు. ఈ స‌మ‌యంలో ప‌ర‌స్ప‌రం హోరాహోరీగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త ఆర్మీ క‌ల్న‌ల్ సంతోష్ స‌హా మ‌రో ఇద్ద‌రు సైనికులు అమ‌రుల‌య్యారు. మ‌న జ‌వాన్ల ప్ర‌తి ఘ‌ట‌న‌లో చైనాకు చెందిన సైనికులు కూడా న‌లుగురైదుగురు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.

సురేశ్‌ బాబు కూడా ఆపేస్తున్నాడు!


కరోనా వైరస్ సమాజంలో చాలా మార్పు తెచ్చింది. ప్రజల అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఈ వైరస్‌ ఎప్పుడు అంతం అవుతుందో తెలియదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవిష్యత్‌ ప్రణాళికలు, ప్రయాణాలు, ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కరోనా దెబ్బకు అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. చిత్రీకరణ పూర్తయిన సినిమాలను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో నిర్మాతలు వందలు, వేల కోట్ల నష్టం చవిచూస్తారని అంచనా వేస్తున్నారు. షూటింగ్స్‌ ఆగిపోయిన చిత్రాల విషయంలో కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక, ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తర్వాత కొత్త సినిమాలను ఇప్పట్లో ప్రారంభించేది లేదంటూ దిల్‌ రాజు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. మరో ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కూడా దిల్‌ రాజు బాటలో నడవాలని నిర్ణయించుకున్నారట. ఇప్పట్లో కొత్త సినిమాలను ప్రొడ్యూస్‌ చేసే ఆలోచనే లేదని చెప్పారట. అదే సమయంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాల షూటింగ్స్‌ కూడా ఇప్పట్లో ప్రారంభించకూదని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్‌ నిర్మాణలో.. వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రంతో పాటు మరో రెండు మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. కరోనా కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడింది. అయితే, కరోనా వ్యాప్తి రోజు రోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు వాటి చిత్రీకరణ తిరిగి ప్రారంభించబోరని తెలుస్తోంది.

మరో వైపు రాజమౌళి కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ తిరిగి ప్రారంభించే విషయంలో వెనకడుగు వేశారట. లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటిస్తూ తొలుత మాక్ షూటింగ్‌ చేయాలని అనుకున్నారు. హైదరాబాద్‌లో రోజూ వందల కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో షూటింగ్‌కు వెళ్లే సాహసం చేయకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుందట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న యూనిట్‌లో ఏ ఒక్కరికి వైరస్ సోకినా.. అందరికీ ముప్పు ఉంటుందని చాలా మంది దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే షూటింగ్స్‌ను మొదలు పెట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు.