
నేచురల్ స్టార్ నాని టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రానున్న సినిమా ‘వి’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో సినిమా కథ మొత్తాన్నీ టర్న్ చేసే అద్భుతమైన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందని.. ఈ ట్విస్ట్ సినిమాలోనే బిగ్ హైలైట్ గా నిలుస్తోదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే ఈ ట్విస్ట్ నాని పాత్రకి సంబంధించిందట. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ అండ్ ప్రోమోలో నాని క్లాసిక్ విలనిజమ్ తో బాగా ఆకట్టుకున్నాడు.
మొత్తానికి ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫరెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మరో డిఫరెంట్ క్యారెక్టర్‌లో ఆవిష్కరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి కూడా నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. ఆమె క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి నానికి జోడిగా నటిస్తోందా లేక ఆమెది సెపెరేట్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది.
అలాగే సుధీర్‌బాబుతో సమ్మోహనం వంటి బ్యూటీఫుల్ లవ్‌స్టోరీని తెరకెక్కించిన ఇంద్రగంటి ఈసారి సుధీర్ ను పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో చూపిస్తున్నాడు. హిట్ సినిమాల నిర్మాత దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమా రానుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.