Home Blog Page 8438

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్


2019 ఎన్నికల ఫలితాలు జనసేనకు ఊహించని షాక్ ఇచ్చినప్పటికీ… జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమికి భయపడం..ప్రజా పోరాటం సాగిస్తాం అని ఆత్మ విశ్వాసం ప్రదర్శించాడు. ఫలితాలకు నిరుత్సాహ పడకుండా, జగన్ ప్రభుత్వ లోపాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. ఇసుక కొరత, రాజధాని మార్పు, ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భూముల అమ్మకాలు వంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడడం జరిగింది. ఐతే ప్రజల్లో ఆయన పట్ల కొంచెం విశ్వాసం ఏర్పడుతున్న ప్రతిసారి ఎదో ఒక అనాలోచిన నిర్ణయం తీసుకొని మళ్ళీ మొదటికి వస్తున్నాడు.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఆయన సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చి పార్ట్ టైం పొలిటీషియన్ అని ప్రత్యర్ధులు చేసే విమర్శలను నిజం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఇక సినిమా జోలికి వెళ్ళను.. ఈ జీవితం ప్రజా సేవకే అంకితం అన్నారు. దానికి భిన్నంగా ఆయన మళ్ళీ ముఖాన్ని రంగువేసుకోవడంతో, ఆయనది నిలకడలేమి తత్త్వం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాకు తెలిసింది.. సినిమా ఒక్కటే కుటుంబ పోషణ, పార్టీని నడపడానికి డబ్బులు అవసరం, అందుకే సినిమాలు చేస్తున్నాను..అని పవన్ సంజాయిషీ ఇచ్చుకున్నా…అది ప్రజలను సంతృపి పరచ లేదు. జనసేన కార్యకర్తలలోనే ఈ నిర్ణయానికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

రెండు పడవల ప్రయాణంలో పవన్ పోరాటానికి పసతగ్గిందన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఒకటికి రెండు చిత్రాల షూటింగ్స్ లో నిమగ్నమైన పవన్ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. పగలు రాజకీయాలు..రాత్రుళ్ళు షూటింగ్ అన్నట్లు ఆయన వ్యవహారం సాగుతుంది. టీడీపీ లేవనెత్తిన అంశాలపై ఈయన కూడా సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేస్తూ అదే ప్రజా పోరాటంలా భావిస్తున్నారు. ప్రతి విషయంలో టీడీపీని ఫాలో అవుతున్న పవన్ తన ఉనికి మరియు ప్రత్యేకత కోల్పోతున్నాడు. ఇప్పటిదాకా పవన్ లేవనెత్తిన ప్రతి అంశం టీడీపీ వాళ్ళు మొదలుపెట్టిందే. మరి ఇప్పటికైనా పవన్ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించి…గట్టిపోరాటం మొదలుపెడితే బెటర్.

వైసీపీ వర్గాలలో గుబులు రేపుతున్న ఆ ముగ్గురి భేటీ..


జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా 2016లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమింపబడ్డారు. టీడీపీ సానుభూతిపరుడని పేరున్న నిమ్మగడ్డను ఆ పదవినుండి తొలగించాలని జగన్ సీఎం అయినప్పటి నుండి ప్రయత్నాలలో ఉన్నాడు. ఇక స్థానిక ఎన్నికల రద్దు వ్యవహారం జగన్ కి కోపం తెప్పించింది. స్థానిక ఎన్నికల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వం… నిమ్మగడ్డపై న్యాయపోరాటానికి దిగింది. కోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలు రద్దు చేయగా.. కీలక పదవిలో రమేష్ కుమార్ ఉండడం సేఫ్ కాదని ప్రత్యేక జీ ఓ ద్వారా అతన్ని ఎన్నికల ప్రధాన అధికారి పదవి నుండి తొలగించారు.

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

నిమ్మగడ్డ రమేష్ దీనిపై హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా అతనికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని .. వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. ప్రస్తుతం నిమ్మగడ్ద రమేష్ వ్యవహారం సుప్రీం కోర్ట్ లో కొనసాగుతుండగా..ఈయన టీడీపీ మాజీ ఎమ్ పి సుజనా చౌదరి,మాజీ మంత్రి టీడీపీ నేత కామినేని శ్రీనివాసరావుతో ఓ హోటల్ లో భేటీ కావడం వైసీపీ వర్గాలలో గుబులు రేపుతోంది. నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అనుకూలుడన్న అనుమానాలను ఈ సమావేశం బలపరచడంతో పాటు..జగన్ కి చెక్ పెట్టే దిశగా నిమ్మగడ్డ అడుగులు వేస్తున్నాడు అనిపిస్తుంది.

108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

టీడీపీ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయాక బీజేపీ పార్టీలో చేరిన సుజనా చౌదరి మరియు టీడీపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస రావుతో ఆయన భేటీ కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది వైసీపీ వర్గాలకు అర్థం కావడం లేదు. తమ ప్రభుత్వంపైన కుట్రలో భాగమే ఈ సమావేశం అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి నేతృత్వంలోని టీడీపీ సభ్యులు జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు, కేంద్రం ప్రభుత్వం అండతో ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేపట్టారన్న అనుమానం కలుగుతుంది.

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?


కరోనా ఎంత పనిచేశావే అంటూ ఇప్పుడు ఏపీలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట.. కరోనా భయంతో ఆందోళనగా ఉన్నారట.. అందరూ క్వారంటైన్లు, టెస్టులు చేయించుకునేందుకు ఇప్పుడు క్యూ కడుతున్నారట..

సీఎం జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. అవును ఆ ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాడట.. ఎవ్వరినీ స్థిమితంగా ఉండకుండా చేశాట.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఎందుకిలా జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారో తెలుసా?

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబొండ శ్రీనివాసరావుకు కరోనా సోకింది. ఏపీలో ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకడం ఇదే ప్రథమం. ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇటీవలే తన వ్యక్తిగత పని నిమిత్తం అమెరికా వెళ్లి కొన్నాళ్లు అక్కడే ఉండి ఇటీవలే వచ్చారు. అనంతరం కొన్నాళ్లు ఐసోలేషన్ లో ఉన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఆయన విశాఖ శివారుల్లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాడట..

ఎస్.కోట ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా తేలడానికి ముందుగా తాజాగా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో అసెంబ్లీకి వచ్చి మరీ ఓటేశాడు. ఓటు వేసేటప్పుడు ఆ పోలింగ్ బాక్సును తాకాడు. సంతకం చేశాడు. ఆ తరువాత చాలా మంది ఎమ్మెల్యేలు ఇవే చేశారు. ఇక అంతుకుమందు అసెంబ్లీలో జరిగిన రెండు రోజుల మాక్ పోలింగ్ లో పాల్గొన్నాడు. చాలామందిని కలిశాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ఈయనతో చేతులు కూడా కలుపుకున్నారు అని వినికిడి. వీరంతా సీఎం జగన్ ను కలిసి గెలుపోటములపై చర్చించారు.

108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

అసెంబ్లీ ఆవరణలో సోషల్ డిస్టేన్స్ లేకుండా కలుపుగోలుగా ఎమ్మెల్యేలంతా తిరిగారు. మరి ఎస్.కోట ఎమ్మెల్యే వల్ల వైసీపీకి చెందిన ఎంతమందికి కరోనా సోకి ఉంటుందనే భయం ఇప్పుడు ఆయనను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలను పట్టిపీడిస్తోంది. వారు సీఎం జగన్ ను కలవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి వరకూ ఆ కరోనా భయం వెంటాడుతోందట..

ఎస్.కోట ఎమ్మెల్యేకు కరోనా అని తెలియగానే ఆయనను కలిసిన వారంతా క్వారంటైన్ వెళ్లారని తెలిసింది. ఇప్పుడు సదురు ఎమ్మెల్యేలను కలిసిన వారు కూడా ఆందోళన చెందుతున్నారట.. ఇలా ఒక్క ఎమ్మెల్యేతో సీఎం జగన్ తోపాటు వైసీపీ ఎమ్మెల్యేలకు వారి అనుచరులకు కరోనా భయం పట్టుకుంది. మొత్తంగా వైసీపీ శిబిరం అంతా ఆందోళనగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

జూన్ వేతనంపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి


తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ నెల వేతనంపై గత కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈనెల కూడా సగం జీతమే వస్తుందా? లేక పూర్తి వేతనం వస్తుందా? అనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు జూన్ నెల వేతనం ఉద్యోగులకు కోతల్లేకుండా మంజూరు చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అన్నిరాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం ఉద్యోగుల స్థాయిని బట్టి 10నుంచి 75శాతం వరకు కోతలను విధిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, విద్యుత్ సిబ్బంది మినహా రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం జీతాల్లో కోతలను విధిస్తుంది. దీంతో గడిచిన రెండు నెలలుగా ఉద్యోగులకు సగం జీతమే అందుతుండటంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో జూన్ నుంచైనా తమకు పూర్తి వేతం చెల్లించాలని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు మంగళవారం ఆర్థిక మంత్రి హరీష్ రావును కలిశారు.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

జీతాల్లో కోతలు విధించడంతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జూన్ నుంచి తమకు ఎలాంటి కోతల్లేకుండా వేతనం చెల్లించాలని కోరారు. దీనిపై మంత్రి హరీష్ స్పందిస్తూ ఉద్యోగులందరికీ జూన్ నుంచి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు కూడా పూర్తి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారట. బకాయిలకు సంబంధించి జీపీఎఫ్‌లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీపీఎస్, పెన్షనర్లకు బకాయిలను వాయిదాల్లో చెల్లించాలని ఆలోచిస్తున్నట్లు వారికి చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలను కూడా జీపీఎఫ్‌లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిని ఐక్యవేదిక కోరగా సానుకూలంగా స్పందిచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా లాక్‌డౌన్లో ఉద్యోగుల జీతాలను కోత విధించడాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు, పెన్షనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుతవ్ం ఏ నిబంధనల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లో కోత విధించాలో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో పాక్షికంగా, పూర్తిగా కోత విధించేలా తెలంగాణ డిజాస్టర్‌‌ అండ్‌ హెల్త్‌ ఎమర్జెన్సీకి అధికారం కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ పెన్షన్‌దారులకు కూడా వర్తిస్తుంది. దీనిపై మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?

దీనిపై హైకోర్టు విచారించి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు ఆర్డినెన్స్‌పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులను ఆదుకోవాల్సింది పోయి కోతలు విధించడం ఏంటని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తమకు జూన్ నుంచి పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావును ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారు. జూన్ నుంచి ఉద్యోగులకు పూర్తి చెల్లించేందుకు సానుకూలంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. అయితే హరీష్ రావు ఈ నిర్ణయం సీఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారా లేక స్వంతంగా నిర్ణయం ప్రకటించారా అనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ప్రకటించాలన్నా సీఎం కేసీఆర్ అడిగి చేయాల్సిందేనని అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఉద్యోగుల జీతాలపై ఇచ్చిన హామీ ఏమేరకు నిలబెట్టుకుంటారనేది వేచి చూడాల్సిందే..!

ఏదిఏమైనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుండటంతో జూన్ నెల నుంచి పూర్తిస్థాయి వేతనాలు అందుతాయనే ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

కరోనా బారినపడుతున్న క్రికెటర్లు.. ఆందోళనలో పీసీబీ


కరోనా మహమ్మరి ఎవరినీ విడిచిపెట్టడం లేదు. గీత దాటారో.. వేటువేసేందుకు రెడీ అన్నట్లు ఉంది కరోనా తీరు.. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా ఏమాత్రం చూపించడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారినపడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. పలువురు ప్రముఖులకు కరోనా సోకగా హోంక్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నాయి. ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ తీసుకునే క్రీడాకారులు సైతం కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

పాకిస్థాన్లో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ చెందిన ఇద్దరు క్రికెటర్లు కరోనా మహమ్మరికి బలయ్యారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జాఫర్ సర్ఫరాజ్, రియాజ్ షేక్ కరోనాతో మృతిచెందిన సంగతి తెల్సిందే. ఇటీవలే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అఫ్రిదినే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. దీంతో అఫ్రిది హోంక్వారంటైన్లోకి వెళ్లాడు.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?

తాజాగా మరో ముగ్గురు పాకిస్థానీ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంగ్లండ్ టూర్ కు వెళ్లేముందు రావల్పిండిలో ఆదివారం క్రికెటర్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో క్రికెటర్లు హైదర్ అలీ, హరీష్ రవూఫ్, షాదాబాద్ లకు పాజిటివ్ అని తేలింది. వీరిలో కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ పాజిటివ్ గా తేలడం గమనార్హం. వీరిని వెంటనే హోం క్వారంటైన్ కు తరలించినట్లు పీసీబీ తెలిపింది.

వీరితోపాటు మరికొందరు ఆటగాళ్లకు పీసీబీ కరాచీ, లాహోర్, పెషావర్లలో టెస్టులు నిర్వహించింది. వీరిలో షోయబ్ మాలిక్, వకార్ యూనిస్ ఉన్నారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. వీరిలో ఇంకేంతమందికి కరోనా పాజిటివ్ వస్తుందనే ఆందోళనలో పీసీబీ ఉంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కరోనా బారినపడి చికిత్స పొందుతుండగా కొత్తగా మరో ముగ్గురికి కరోనా రావడంతో క్రికెటర్లలో ఆందోళన నెలకొంది.

సంచలనం: నిమ్మగడ్డతో సుజనా, కామినేని రహస్యభేటి..

SEC


మరో తాజా సంచలనం.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా బీజేపీ ఎంపీ, బీజేపీ మరో నేతతో రహస్య భేటి జరిపారు. నిమ్మగడ్డ వ్యవహారం పీక్ స్టేజీలో ఉండగానే తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రాంగం చర్చనీయాంశమైంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ పార్క్ హయాత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్ తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావుతో గంటన్నర సేపు జరిపిన రహస్య భేటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు? బీజేపీ నేతలతో నిమ్మగడ్డ ఎందుకు చర్చ జరపాల్సి వచ్చింది? బీజేపీని మచ్చిక చేసుకోవడానికి నిమ్మగడ్డ ఇలా చేశాడా అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇలాంటి మీటింగ్ తో నిమ్మగడ్డ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ మీటింగ్ లో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటాయి. బీజేపీలో చేరిన టీడీపీ విధేయులు ఇప్పటికీ టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించడానికి కృషి చేస్తూనే ఉన్నారన్న ప్రచారం ఉంది. తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కేసులోనూ చంద్రబాబుపై ప్రేమ బీజేపీ లో ఉన్న ఆయన కోవర్టుల ద్వారా బయటపడిందంటున్నారు. ఇందుకు ఉదాహరణలు చూపిస్తున్నారు..

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ వివాదాస్పద నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు. హైకోర్టుకు ఎక్కడంతో ఈయన చంద్రబాబు కోవర్టా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కామినేని బీజేపీ లో ఉన్నా మనసంతా టీడీపీ నే అని నిమ్మగడ్డ వ్యవహారంతో నిరూపితమైంది.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?

ఇక ఇప్పుడు సుజనా చౌదరి సంగతి. సుజనా బీజేపీలో చేరినా మనసంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంటుంది. బీజేపీలో చేరాక కూడా చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తుంటాడనే పేరు సుజనా చౌదరికి ఉందంటారు. టీడీపీకి మొదట ఆర్థిక అండగా ఉన్న ఆయన బాబు ఓడిపోగానే మోడీ పంచన చేరాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయినా ఇప్పటికీ సుజనా మనసు టీడీపీపైనే ఉంటుందంటారు. బాబుకు, టీడీపీకి ఏమైనా జరిగితే తను బీజేపీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ముందు రచ్చ చేస్తుంటాడు సుజనా అనే అపవాదు ఉంది.

అయితే తాజాగా ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ ప్రభుత్వం చేత తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సెగలు కక్కుతోంది. ఆయన ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తిరిగి నియమించాలని జగన్ ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం విచారణ సాగుతోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయన నియామకాన్ని సహించడం లేదు. టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

పార్క్ హయాత్ హోటల్ లోని 8వ అంతస్థు గదిలో ఈ సమావేశం జరిగినట్టు వీడియోలను బట్టి తెలుస్తోంది. ఈనెల 13న ఉదయం బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి పార్క్ హయాత్ హోటల్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన తర్వాత అరగంటకు మాజీమంత్రి కామినేని కూడా ఇదే పార్క్ హయత్ హోటల్ కు వచ్చారు. వీరిద్దరి తర్వాత చివర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హోటల్ కు వచ్చారు. వీరు ముగ్గురు వేర్వేరు లిఫ్టుల ద్వారా 8వ అంతస్తులోకి చేరుకున్నారు. కానీ ముగ్గురిని ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకోవడం వీడియోలో కనిపించింది. ముగ్గురు ఒకే గదిలోకి వెళ్లడం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.

నిమ్మగడ్డ, సుజనా, కామినేనిలు ఒకే గదిలో దాదాపు గంట పాటు ఈ రహస్య మీటింగ్ నిర్వహించారు. మొదట కామినేని ఆ గది నుంచి బయటపడగా.. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బయటకు వచ్చారు. చివర్లో హొటల్ నుంచి సుజనా చౌదరి చల్లగా జారుకున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి. సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ వ్యవహారంపై విచారణ సాగుతున్న వేళ ఈ ముగ్గురు రహస్య భేటి జరపడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఇలా నిమ్మగడ్డ రమేష్ ఇలా రాజకీయ పార్టీ నేతలతో మీటింగ్ కావడం.. ఆ రహస్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సైబర్ వార్ కు తెరదీసిన చైనా..


భారత్-చైనా సరిహద్దుల్లో నెలరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో చైనా భారత్ జవాన్లను దొంగదెబ్బ తీసింది. ఎల్ఓసీ వద్ద చైనా సైనికులు వెనక్కి వెళుతున్న క్రమంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈనెల 15న చైనా సైనికులు గాల్వానాలో రాళ్లు, రాడ్లతో దాడిచేయగా భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ దాడిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 19మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెల్సిందే.

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

భారత జవాన్ల మృతిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. చైనాతో అమీతుమీకి తేల్చకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించింది. త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే భారత యద్ధ విమానాలను సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. ఈమేరకు చైనా కంపెనీలకు చెందిన కాంట్రాక్టులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంటోంది. భారత జవాన్లపై మృతితో యావత్ దేశం చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమవుతోంది.

చైనా మరోవైపు సరిహద్దుల్లో భారత సైన్యాన్ని కవ్విస్తోంది. భారత సరిహద్దు దేశాలను మచ్చిక చేసుకొని తనవైపుకు తిప్పుకుంటోంది. నేపాల్, బంగ్లాదేశ్ లకు చైనా తాయిలాలు ప్రకటిస్తూ మచ్చిక చేసుకునేందుకు భారత్ ను ఒంటరి చేయాలని భావిస్తుంది. మరోవైపు పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత జవాన్లపై దాడికి యత్నిస్తుంది. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు చైనా కుటిలయత్నాలను తెరదీస్తుంది. భారత సైన్యం చైనాను సరిహద్దుల్లో నిలువరించడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. దీంతో పరోక్ష యుద్ధానికి తెరలేపుతోంది.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

చైనా ఇప్పటికే కరోనా వైరస్ తో బయోవార్ కు తెరదీసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తల నేపథ్యంలోనే చైనా సైబర్ వార్ కు తెరదీసింది. గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత భారత సర్వర్లపై సైబర్‌ ఎటాక్‌లతో చైనీస్ హాకర్లు విరుచుకుపడుతున్నారు. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై జూన్ 15నుంచి నేటి వరకు చైనా హ్యాకర్లు 40,300సార్లు ప్రయత్నించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సైబర్ దాడుల్లో ఎక్కువ భాగం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి తెలుస్తోంది.

సిచువాన్ ప్రాంతం చైనా సైబర్ వార్‌ఫేర్ ప్రధాన కార్యాలయంగా ఉంది. అయితే ఈ దాడులు చైనా ప్రభుత్వం ప్రేరేపించిందా లేదా ప్రైవేట్ శక్తుల పనా? అని తెలుసుకునేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ సైబర్ స్పేస్ పై పలురకాలుగా చైనా హ్యకర్లు దాడికి యత్నిస్తున్నారు. భారత సర్వర్లు హ్యాక్ చేసి ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను తమ నిఘా ప్రయోజనం కోసం మళ్లించే అవకాశం ఉండటంతో భారత సైబర్ నిపుణులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.

భారత్‌పై చైనా అన్నిరకాల యుద్ధాలకు దిగుతోంది. చైనా హైబ్రిడ్ వార్‌ఫేర్ ను ఎదుర్కొనేందుకు భారత సైబర్ నిపుణులు రేయింబవళ్లు పని చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చైనా కుయుక్తులను భారత్ సమర్థవంతంగా తిప్పకొడుతూనే ఉంది. అయితే మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందనే భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొంది.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?


శాసన మండలిలో బలం ఉన్న టీడీపీ మండలి రద్దు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో బలం లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతుంది. శాసన మండలిలో మాత్రం ప్రస్తుతం తనమాటే నెగ్గించు కుంటుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు.

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

అదేవిధంగా శాసన మండలిలో గతంలో చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లుల విషయం తెలకుండానే, మరోమారు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మరోసారి శాసన మండలికి పంపడంపైన మరో పోటీషన్ దాఖలు చేశారు. శాసన సభ తీర్మానం ఎమ్మెల్సీల హక్కులను కాలరాసేదిగా ఉందని, పార్లమెంట్ కు విజ్ఞప్తి చేస్తూ శాసన సభ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

శాసన మండలి రద్దు కోరుతూ శాసన సభ శీతాకాలం సమావేశాల్లో తీర్మానం చేసిన విషయం విదితమే. అనంతరం కరోనా ప్రభావంతో పార్లమెంట్ సమావేశాలు జరగక పోవడం, గత సమావేశాల్లో సభ ముందుకు ఈ అంశం రాకపోవడంతో మండలి రద్దుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టీడీపీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీకి మండలిలో బలం ఉండటంతో ప్రభుత్వాన్ని ఎదుర్కోనెందుకు అవకాశం మండలి వేదికగా లభిస్తుంది. ఆ అవకాశం వదులుకోకూడదని టీడీపీ భావిస్తోంది. ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకుని మండలి రద్దు అవకుండా ప్రయత్నాలు ప్రారంభించింది.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

మరోవైపు మండలిలో ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి అమలు చేయడం లేదని దీపక్ రెడ్డి గతంలోనే పిటీషన్ దాఖలు చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై కార్యదర్శి బలకృష్ణమాచార్యులు తదుపరి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా ప్రభుత్వం నుంచి తన పదవి విరమణ వయస్సు ఏడాది కాలం పొడిగింపు పొందారని పోటీషన్ లో పేర్కొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?


రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే కరోనా వైరస్ భారిన పడిన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణాలో ఎమ్మెల్యేలు కొద్ది మందితో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు వైరస్ భారిన పడ్డారు. విజయనగరం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సొంత పనుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి వన్డే భారత్ మిషన్ కార్యక్రమంలో కేంద్రం ఏర్పాటు చేసిన విమానంలో విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ట్రూనాట్ మెషిన్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో స్వాబ్ సేకరించి ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం పంపారు. జిల్లా కలెక్టర్ హరిజవాహర్ లాల్ మాట్లాడుతూ పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకులుగా వైసీపీ ఎమ్మెల్యేలు మారారని టిడిపి, ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వైరస్ భారిన పడటం మరింత ఇబ్బంది కలిగించే విషయం. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ను జిల్లా కలెక్టర్ లు విధిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కేసుల నమోదును బట్టీ స్థానికంగా లాక్ డౌన్ ను కలెక్టర్ స్థానిక పరిస్థితుల ఆధారంగా విధిస్తున్నారు.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయనుంది. వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. దీని కోసం 104 వాహనాలను వినియోగించు కోవాలని, అనుమానం ఉన్న వారి నుంచి కోవిడ్‌ శాంపిల్‌ తీసుకునే సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, వారికి అక్కడే మందులు ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా 104లో సదుపాయాలను కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ చేయనున్నారు. స్క్రీనింగ్, పరీక్షలు చేసిన తర్వాత వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్య కార్డులో పొందుపరచనున్నారు. పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని చేసేందుకు సిద్ధమవుతున్నారు.

108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?


టీడీపీ హయాంలో ఇ.ఎస్.ఐ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే..టీడీపీ ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు విషయంలో రూ.300 కోట్ల అవినీతికి వైసీపీ నేత ఒకరు పాల్పడ్డారన్న విషయాన్ని బయట పెట్టింది. దీనిపై టీడీపీ నాయకుడు పట్టాభి ఆరోపణలు చేయడంతో హౌస్ అరెస్ట్ కు గురయ్యారు. వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి తన అల్లుడికి లబ్ది చేకూరే విధంగా 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు అమలులో ఉండగా రద్దు చేసి కొత్త సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిన విషయాన్ని టీడీపీ నాయకులు పట్టాభి వెల్లడించారు.

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

ఈ కాంట్రాక్టు కేటాయింపులో రూ.300 కోట్లు స్కామ్ జరిగిందని ఇందుకు ఎంపీ విజయ సాయిరెడ్డి కారణమని పట్టాభి తెలిపారు. ఇందుకు తగిన ఆధారాలు అన్ని తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే అంశం కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 108 స్కామ్ ఇన్ ఏపీ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. దీంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ ఈ విషయం విదితమే.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ సాయిరెడ్డి ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు, మరోవైపు మీడియా ముందు ఈ విషయంపై స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారోనా టెస్టింగ్ కిట్ ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ అధ్యక్షుడు కన్నాపై తీవ్ర విమర్శలు చేసిన సాయిరెడ్డి, టీడీపీ నేరుగా తనపై విమర్శలు గుప్పించినా స్పదించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని అరెస్ట్ చేసిన ప్రభుత్వం మరి ఎంపీ విజయ సాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంపీ విజయ సాయిరెడ్డిని జగన్ కొంత కాలంగా దూరంగా ఉంచుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది

జమ్మూ-కాశ్మీర్ జాతీయ స్రవంతి లో భాగస్వామ్యమవుతుందా?

గత ఆగస్టు లో జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేయటం, ఆర్టికల్ 370, 35ఎ ని రద్దుచేయటం మోడీ 2.0 పాలనలో సంచలనాత్మక నిర్ణయాలు. దీని పర్యవసానం ఎలా వుంటుందో అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు.  రాజకీయపార్టీల నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకోవటం, పూర్తి సైనిక దిగ్బంధం లో వుంచటంతో తక్షణ ప్రతిచర్యలు పెద్దగాలేవు. ఒకవిధంగా చెప్పాలంటే అదివరకటి కంటే ఉగ్రవాద చర్యలు తగ్గాయనే చెప్పాలి. దీనికి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, సైన్యం సమన్వయం తో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పకడ్బందీ నియంత్రణ చర్యలు చేపట్టటం కారణం. సంవత్సరాంతానికి శాంతిభద్రతలు పూర్తి అదుపులో వుండటంతో మెల్లి మెల్లిగా నిర్బందాల్ని సడలించటం మొదలుపెట్టారు. ప్రస్తుతం కొద్దిమందిని తప్పిస్తే  రాజకీయ నాయకుల్ని విడుదల చేయటం కూడా జరిగింది. ఫోన్,మొబైల్ సదుపాయాల్ని పునరుద్ధరించారు. ఇంటర్నెట్ 2 జి వరకు అనుమతిచ్చారు. మిగతా రాజకీయ నాయకుల్ని కూడా త్వరలో విడుదల చేస్తారని తెలుస్తుంది. మధ్యలో కరోనా మహమ్మారి నేపధ్యం లో గత మూడు నెలలనుంచి ప్రాధాన్యం మారింది. అయినా రెండోవైపు రాజకీయ ప్రక్రియ సమాంతరం గా నడుస్తుంది.

ముఖ్యమైన రాజకీయ ప్రక్రియ ఆరంభం 

మార్చి లో జరిగిన రెండు  ప్రభుత్వ చర్యలతో  జమ్మూ-కాశ్మీర్ రాజకీయాలు వేడెక్కాయి. ఒకటి , నియోజక వర్గాల పునర్విభజన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ ని నియమించటం . రెండోది, స్థానికతని నిర్ధారించి నివాస ప్రమాణ పత్రాన్ని జారీచేయటానికి మార్గదర్శకాలు విడుదల చేయటం. ఈ రెండూ జమ్మూ-కాశ్మీర్ భవిత్యాన్ని మార్చే రాజకీయ ప్రక్రియలే. అందుకే దీనిపై రాజకీయ పార్టీలు, నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవేమిటో విపులంగా పరిశీలిద్దాం.

నివాస ప్రమాణ పత్రం ( Domicile Certificate)

దీని వివరాల్లోకి వెళ్లేముందు ఇంతకుముందు పరిస్థితి ని కూడా తెలుసుకోవాల్సివుంది. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రం లో కేంద్ర చట్టాలు వర్తించవు. అవి తిరిగి జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ అనుమతి పొందిన తర్వాతనే ఆ రాష్ట్రాల్లో అమలవుతాయి. ఎందుకంటే జమ్మూ-కాశ్మీర్ కి ప్రత్యేక రాజ్యాంగం వుంది. దాని ప్రకారం అసెంబ్లీ లో ఆమోదం తప్పనిసరి. మన భారత రాజ్యాంగం లో అధికరణ 370, 35 ఎ లు ఈ ప్రత్యేక ప్రతిపత్తిని  కాపాడుతున్నాయి. అధికరణ 35 ఎ ప్రకారం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం లో ” శాశ్వత నివాసి” అనే నిబంధన ని తీసుకొచ్చారు. ఈ “శాశ్వత నివాసి” కే అన్ని హక్కులూ వుంటాయి. ఆస్తిని కొనుగోలుచేయటం దగ్గర్నుంచి చివరకు అసెంబ్లీ కి ఓటు హక్కు కూడా వీరికే వుంటుంది. అందుకే దేశం లో ఎక్కడా లేనివిధంగా ఈ రాష్ట్రం లో రెండు ఓటర్ల లిస్టులు ఉండేవి. పార్లమెంట్ లో ఓటు వేసే అందరికీ అసెంబ్లీ లో ఓటు హక్కు లేదు. అసెంబ్లీ లో ఓటు వేయాలంటే “శాశ్వత నివాసి” అయి వుండాలి. ఆ అర్హత అందరికీ రాదు. ఉదాహరణకు పాకిస్తాన్ విభజనతో జమ్మూ-కాశ్మీర్ కి వచ్చిన శరణార్ధులు ఇప్పటికీ ” శాశ్వత నివాసులు ” కారు. అలాగే ఎంతోమంది ని వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించారు. 1990 ఘటనల తర్వాత లక్షలాది కాశ్మీర్ పండిట్లు అక్కడనుంచి తరిమివేయబడిన తర్వాత వాళ్ళు ఆ రాష్ట్ర శాశ్వత నివాసులు కారు. వాళ్ళ పేర్లన్నీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. గత సంవత్సరం లో ఆగస్టులో పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం ఈ కాలం చెల్లిన నిబంధనలు రద్దయ్యాయి.

వీటి స్థానంలో కొత్తగా స్థిర నివాస ( domicile) నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా 15  సంవత్సరాలు జమ్మూ-కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం లో నివాసమున్నా, 7 సంవత్సరాలు చదివి 10 వ లేక 12 వ తరగతి పరీక్షలకు హాజరైనా,వలసదారుడిగా కమీషన్ ముందు నమోదు చేసుకున్నా, 10 సంవత్సరాలు ప్రభుత్వం లో గానీ, ప్రభుత్వ రంగం లో గానీ, ప్రభుత్వ బ్యాంకు ల్లోగానీ కేంద్ర విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో గానీ పనిచేసిన ఉద్యోగుల పిల్లలూ, బయట పనిచేసే , వ్యాపారం చేసుకునే జమ్మూ-కాశ్మీర్ వాసుల పిల్లలకు, పశ్చిమ పాకిస్తాన్ శరణార్ధులకు, స్థానికేతరులను పెళ్ళాడిన కాశ్మీర్ స్త్రీల పిల్లలకు స్థిర నివాస నిర్వచనం వర్తిస్తుంది. అంటే ఇన్నాళ్ళు జమ్మూ-కాశ్మీర్ తో సంబంధముండి కూడా శాశ్వత నివాసం పేరుతో కాశ్మీర్ సమాజం లో భాగస్వామ్యం కాని అందరూ మొట్టమొదటసారి అర్హులయ్యారు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రమాణ పత్రం కోసం  దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో కనుక తహిసిల్దార్ ఇవ్వకపోతే 50 వేల రూపాయలు  ఆ అధికారి కి శిక్షగా వేస్తారు. దీనికింద బయటనున్నలక్షలాది కాశ్మీర్ పండితులతో పాటు ఎంతోమంది కొత్తగా స్థానికులుగా నమోదు అయ్యే అవకాశం వచ్చింది. కొంతమంది కాశ్మీర్ నాయకులు  ప్రచారం చేస్తున్నట్లు ఈ ప్రక్రియతో రాష్ట్ర జనాభా లో ఏమీ మార్పులు రావు. ఈ కొత్త విధానంతో జమ్మూ-కాశ్మీర్ లోకి మిగతా ప్రాంతాలనుంచి విచ్చలవిడిగా వలస వచ్చే అవకాశాలు లేవు. అంతకుముందు జరిగిన తప్పుల్ని సరిదిద్దటం వరకే ఈ విధానం లో అవకాశముంది.

దీనితోపాటు 2010 జమూ-కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం లో శాశ్వత నివాసం స్థానం లో స్థిరనివాసం పదాన్ని చేరుస్తూ ఈ సంవత్సరం మార్చి , ఏప్రియల్ లో సవరణలు చేసింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం షుమారు 84 వేల ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్నాయి. అందులో 10 వేలు తక్షణం భర్తీ చేయటానికి ప్రకటన ఇచ్చింది. దీనిపై రాజకీయ పార్టీలు స్థానికులకు ఉద్యోగాలు రాకుండా బయట వాళ్లకు కొత్త నిబంధనల ప్రకారం వస్తాయని విమర్శచేస్తున్నారు. నిరుద్యోగం అధికంగా వున్న కాశ్మీర్ లో ప్రభుత్వ కొత్త స్థిర నివాస నిబంధన ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీని ఏ విధంగా కాశ్మీరీ యువత స్పందిస్తుందో చూడాలి. ఇది అతి సున్నిత సమస్య.

నియోజకవర్గాల పునర్విభజన కమీషన్ నియామకం 

జమ్మూ-కాశ్మీర్ తో పాటు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ లకు కలిపి నియోజక వర్గాల పునర్విభజన కమీషన్ ని నియమించారు. 2019 జమ్మూ-కాశ్మీర్ పునర్నిర్మాణ చట్టం ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా జమ్మూ-కాశ్మీర్ లో ఈ పునర్విభజన చేపడతారు. మిగతా రాష్ట్రాల్లో 2002 పునర్విభజన చట్టం ప్రకారం 2001 జనాభా లెక్కర ప్రకారం చేబడతారు( ఇక్కడ భద్రతా కారణాలతో 2002 లో పునర్విభజన జరగలేదు). అన్నింటికీ కలిపి సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ కమీషనరుగా, ఎన్నికల కమీషనరు సుశీల్ చంద్ర సభ్యుడిగా, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ఎన్నికల కమీషనర్లు సభ్యులుగా నియమితులయ్యారు. వీరికి సలహా సభ్యులుగా ఆయా రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు/ శాసన సభ్యులు వుంటారు. ఒక సంవత్సరం లోపు ఈ కమీషన్ తన నివేదికను సమర్పిస్తుంది.

జమ్మూ-కాశ్మీర్ లో 1995 లో చివరిసారిగా పునర్విభజన జరిగింది. మొత్తం దేశం లో నాలుగు సార్లు జరిగితే జమ్మూ-కాశ్మీర్ లో కేవలం రెండు సార్లే జరిగింది. అదీ జనాభాతో సంబంధం లేకుండా కాశ్మీర్ లోయకు ఎక్కువ స్థానాలు కేటాయించటం జమ్మూ ప్రాంత వాసులకు ఖేదం కలిగించింది. దీనిపై మతంతో సంబంధం లేకుండా జమ్మూ వాసులందరూ మొదట్నుంచీ కాశ్మీర్ నాయకులపై గుర్రుగా వున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లో 68 లక్షల 88 వేల జనాభావుంటే జమ్మూ లో 53 లక్షల 78 వేల జనాభా వున్నారు. ఈ లెక్కలపై కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కాశ్మీర్ లోయకు అసెంబ్లీ లో 46 స్థానాలుంటే జమ్మూ కి 37 స్థానాలు వున్నాయి. జమ్మూ-కాశ్మీర్ పునర్నిర్మాణ చట్టం ప్రకారం జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 107 నుంచి 114 కి పెరుగుతాయి. ఇందులో 24 స్థానాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కోసం పక్కన ఉంచుతారు. అవి పోతే ప్రస్తుత 83 స్థానాలు 90 కి పెరుగుతాయి. 2011 జనాభా ప్రకారం జమ్మూకి అదనంగా 5 , కాశ్మీర్ కి 2 స్థానాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనితో జమ్మూ ప్రాంత బలం అసెంబ్లీ లో అదివరకటి కన్నా పెరుగుతుంది. ఇది కాశ్మీరీలకు ఏ మాత్రమూ ఇష్టం లేదు.

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ ప్రాంత వాసులే ఎన్నిక అవుతూ వచ్చారు. గులాం నబీ ఆజాద్ జమ్మూ నుంచి ఎన్నికైనా కాశ్మీరీలదే హవా. అందుకే అక్కడ రాజకీయ పార్టీలు ఈ కమీషన్ ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పునర్విభజన సలహా సంఘం లో జమ్మూ-కాశ్మీర్ కి చెందిన అయిదుగురు పార్లమెంటు సభ్యుల్లో ఇద్దరు భారతీయ జనతా పార్టీకి, ముగ్గురు నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందినవారు. నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు ముగ్గురూ ఈ సలహా సంఘం లో చేరటానికి నిరాకరించారు. ఇప్పటికే మహబూబా  ముఫ్తీ ఆధ్వర్యం లోని పిడిపి దీన్ని వ్యతిరేకించింది. ఇది ఇలావుంటే జమ్మూ లోని పాంథర్స్ పార్టీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన చేపట్టటాన్ని వ్యతిరేకిస్తుంది. 2011 జనాభా లెక్కలు  తప్పుల తడక అనీ దీని ప్రకార మయితే జమ్మూ వాసులకు అన్యాయం జరుగుతుందని వాదిస్తుంది. అలాగే డిల్లీ లోని కాశ్మీర్ పండిట్ల సంఘం కూడా ఈ కమీషన్ నియామకాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే 2 లక్షలకు పైగా బయట వున్న కాశ్మీర్ పండిట్లకు ఓటు హక్కు కల్పించకుండా ఈ పునర్విభజన జరిగితే వాళ్ల గొంతు వినిపించే అవకాశం కోల్పోతామని చెబుతున్నారు. కాబట్టి కొత్త స్థిర నివాస నిబంధనల ప్రకారం స్థిర నివాస ప్రమాణ పత్రం అందరికి వచ్చిన తరవాత వీరిని  ఓటరుగా నమోదు చేసుకున్న తర్వాతనే ఈ పునర్విభజన చేపట్టాలని చెబుతున్నారు. అంటే 2021 జనాభా లెక్కల ప్రకారమే నన్నమాట. ఇప్పటి కమీషన్ ప్రకారం వచ్చే కొద్దిపాటి వెసులుబాటు కూడా ఇలా అయితే రాదు. అందుకే ప్రభుత్వం వున్నరాజ్యాంగ పరిమితుల్లో జమ్మూ కి న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయి.

మోడీ నూతన కాశ్మీర్ విధానం విజయవంతమవుతుందా?

ఈ రెండు ప్రక్రియలు జమ్మూ-కాశ్మీర్ లో సున్నితంగా తయారయ్యాయి. వీటిని ప్రభుత్వం స్థానిక ప్రజల్ని ఒప్పించి అమలుచేయగలిగితేనే మోడీ ప్రభుత్వ కాశ్మీర్ విధానం విజయవంతమవుతుంది  .దీనితోపాటు ఈ 10 నెలల్లో జమ్మూ-కాశ్మీర్ లో గణనీయమైన ఆర్ధిక, సామాజిక పురోగతి కన్పించలేదు. ఇదే అన్నింటికన్నా ప్రధానమయినది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర యంత్రాంగం పూర్తి అవినీతి, బంధుప్రీతి, అసమర్ధ పరిపాలన కు పేరుగాంచింది. గత పది నెలల నిర్బంధం తో జమ్మూ-కాశ్మీర్ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోయింది. ప్రధాన ఆదాయ వనరులైన పర్యాటకం, హస్తకళలు, ఐటి లు నిర్వీర్యమయ్యాయి. దానిమీద ఆధారపడ్డ లక్షలాది మంది  నిరుద్యోగులయ్యారు.ఉద్యానవన రంగం కుదేలయ్యింది. ఇంటర్నెట్ నిషేధం తో మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఏ విధంగా చూసినా జమ్మూ-కాశ్మీర్ ప్రజల ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో కోలుకోలేనంత దెబ్బతింది. దీనిపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.

ఈ నేపధ్యం లో జమ్మూ-కాశ్మీర్ పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేము. ప్రస్తుతానికయితే శాంతి భద్రతలు ఫర్వాలేదనిపిస్తుంది. కరోనా మహమ్మారి రాకముందే శ్రీనగర్ సాధారణ పరిస్థితులకు దగ్గరగా వున్నట్లు , ట్రాఫిక్ జాం లు లాంటి పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయని పరిశీలకులు భావించారు. దానితోపాటు సంతోషకర వార్తా ఏమిటంటే ఉగ్రవాదం లోకి స్థానిక రిక్రూట్మెంట్ అదివరకటి కన్నా తగ్గిందని గూఢచారి వర్గాల కధనం. ఆగస్టు 5 కి ముందు నెలకు 14 మంది స్థానిక యువత ఉగ్రవాదం లో చేరితే తర్వాత ఆ సంఖ్య 5 కి తగ్గిందని చెబుతున్నారు. ఈ 10 నెలల్లో భద్రతా వర్గాలు ఉగ్రవాదం పై పట్టు సంపాదించాయని చెప్పొచ్చు. అయితే ఇది శాశ్వతం కావాలంటే ప్రభుత్వం చక చకా పునర్నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెల్లగలగాలి. అప్పుడే జమ్మూ-కాశ్మీర్ జాతీయ స్రవంతి లో కలిసి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.

 

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!


రెండు రోజుల కిందట ప్రతిపక్ష నేత చంద్రబాబు గవర్నర్ ను కలిసి గంట సేపు వివిధ అంశాలపై చర్చించినారు. ప్రభుత్వంపై 14 పేజీల లేఖను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు అందజేశారు. ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ఎజెండాగా బాబు గవర్నర్ ను కలిశారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ గవర్నర్ ను రెండు రోజుల వ్యవధిలోనే కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ముఖ్యమంత్రి జగన్ రాజ్ భవన్ లో గవర్నర్ ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు వివరించారు. శాసన సభలో బడ్జెట్ సమావేశాల్లో నెలకొన్న పరిస్థితిని గవర్నర్ దృష్టికి తెచ్చారు. శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదించకుండా నిరవధికంగా వాయిదా వేయడం, టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రులపై దాడి చేశారని గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. అసెంబ్లీలో ఆమోదించిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, సహా మరో మూడు బిల్లులను శాసన మండలి ఆమోదించక పోవడాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చారని తెలిసింది.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

అదేవిధంగా ఇ.ఎస్.ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, బిఎస్ – 3 వాహనాల కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి, అతని తనయుడు లను అరెస్ట్ చేసిన అంశంపై పూర్తి వివరాలను గవర్నర్ కు సీఎం వెల్లడించారని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల జరిగిన తీరు, వైసీపీ అభ్యర్థుల విజయం, టీడీపీ అభ్యర్థి ఓటమి, ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికవడం వంటి విషయాలను సీఎం గవర్నర్ క్ వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారని తెలిసింది.

వైరస్ ను చంపే మాస్కులు రెడీ.. త్వరలో మార్కెట్లోకి..!


చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి పేరు వింటేనే అగ్రరాజ్యాలు సైతం భయాందోళనకు గురవుతోన్నాయి. ఈ మహ్మమరి కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుందన్నాయి. మరణాలు సైతం భారీగా నమోదవుతుండటం శోచనీయంగా మారింది. ఓవైపు కరోనా మహమ్మరికి వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు శాయశక్తుల కృషి చేస్తున్నారు. మరోవైపు వైద్యులు ప్రజలకు కరోనా అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. ప్రజలందరూ కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీఒక్కరు మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం జీవితంలో భాగమై పోయింది. ప్రస్తుతం వాడుతున్న మాస్కులు ప్రజలను ఎంతమాత్రం కాపాడుతాయనే అనుమానాలు ప్రతీఒక్కరిలో ఉన్నాయి. అయితే ఇజ్రాయిల్ కు చెందిన సోనోవియా తయారు చేసిన మాస్కులు వాడితే మాత్రం కరోనా వైరస్ రాదని తాజాగా ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.

ఇప్పటికే తాము తయారుచేసిన మాస్కును ప్రయోగశాలల్లో ప్రయోగించినట్లు సోనోవియా కంపెనీ పేర్కొంది. ఈ మాస్క్ తయారీలోవాడే ఫ్యాబ్రిక్‌ను జింక్ ఆక్సైడ్ నానో పార్టికల్స్‌తో కోట్ చేసినట్లు తెలిపింది. దీనికి బ్యాక్టిరియా, ఫంగి, వైరస్ కణాలను అడ్డుకొని చంపేసే శక్తి ఉంటుందని పేర్కొంది. ఈ మాస్క్ లోని క్లాత్‌లో ఉండే ఈ నానో పార్టికల్స్ ఒకరకంగా శానిటైజర్‌గా పనిచేస్తాయని చెప్పింది. దగ్గు, గాలి నుంచి వచ్చే తుంపిళ్లను ఈ మాస్కులు సమర్థవంతంగా అడ్డుకుంటుదని పేర్కొంది. మాస్క్‌ వద్దకు వచ్చే అన్ని సూక్ష్మ క్రిములను నాశనం చేసేలా వీటిని రూపొందించినట్లు ప్రకటించింది. షాంఘైలోని మెక్రో స్పెక్ట్రమ్ ల్యాబ్‌లో మాస్క్‌లను పరీక్షించగా 90శాతం వైరస్ లను నివారించి ఆ కంపెనీ ప్రకటించింది.

రేపటి నుంచి పూరీ రథయాత్ర.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

మాస్కుల తయారీలో ఈ ఫార్ములా విజయవంతం కావడంతో వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సోనోవియా సంస్థ ప్రకటించింది. మాస్కులతోపాటు త్వరలోనే దుస్తులను కూడా తయారు చేయనున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు ఆస్పత్రుల్లో వాడే టెక్స్‌టైల్స్, డాక్టర్లు ప్రొటెక్టివ్ ఎక్విమెంట్, ఇతర వస్త్రాల్లోనూ ఈ ఫార్మూలాను ఉపయోగించనున్నట్లు ఆ కంపెనీ స్పష్టం చేసింది. దీని ద్వారా కరోనా వైరస్ ధీటుగా ఎదుర్కోనే అవకాశం ఉంటుందని ఆ కంపెనీ నిర్వాహాకులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రతీఒక్కరు మాస్కులను తప్పనిసరిగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను తరిమికొట్టేలా సోనోవియా సంస్థ మాస్కులను తయారు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మాస్కులు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయంగా కన్పిస్తుంది.

అదే జరిగితే పూజా హెగ్డేకి తిరుగుండదు !


టాలీవుడ్ లో ప్రస్తుత లీడింగ్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ‘పూజా హెగ్డే’నే. పూజా ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ ను బాగానే కవర్ చేస్తోంది. తెలుగులో వరుసగా పెద్ద స్టార్స్ తో నటిస్తూనే, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ అక్షయ్ కుమార్ చేస్తున్న ‘బచ్చన్ పాండీ’ చిత్రంలో పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా పూజా నటిస్తుందని అనుకున్నారు అందరూ.

రేపటి నుంచి పూరీ రథయాత్ర.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

కానీ ‘పూజా హెగ్డే’ది కూడా మెయిన్ హీరోయిన్ రోల్ నని, సినిమాలో కృతి సనన్ కంటే కూడా పూజా హెగ్డేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కే ప్రస్తుతం లీడింగ్ హీరోగా ఉన్న అక్షయ్ కుమార్ లాంటి హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే.. పూజా హెగ్డేకి దశ తిరిగినట్టే. ఏమైనా లక్ అంటే ‘పూజా హెగ్డే’దే. గత సినిమా ‘అల వైకుంఠపురంలో’తో ఇండస్ట్రీ సూపర్ హిట్ ను దక్కించుకున్న ఈ టాల్ బ్యూటీ ప్రభాస్ సినిమాలో కూడా మెయిన్ లీడ్ చేస్తోంది.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

పైగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఫిల్మ్ వర్గాల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్ సినిమాతో గాని బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంటే… ఇక పూజా హెగ్డేకి బాలీవుడ్ లోనూ తిరుగుండదు. అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

‘ఆర్ఆర్ఆర్’ను అందుకే ఒప్పుకున్నాడట !


నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో సైడ్ పాత్రలో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఎలా ఒప్పుకున్నాడా అని అందరిలో పెద్ద డౌట్ ఉంది. అయితే అజయ్ కి, ఆర్ఆర్ఆర్ లో తన పాత్ర బాగా నచ్చిందట. సినిమా మొత్తంలోనే ఆయనది కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర.. కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అజయ్ కనిపించినా.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ పోరాట విధానాన్ని మార్చుకుంటారని.. వారి పాత్రలకు ప్రధానంగా అజయ్ దేవగణ్ పాత్రనే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని, అందుకే అజయ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

ఇక అజయ్ దేవగణ్ నే తమ సినిమాలో ఎందుకు తీసుకున్నాననే విషయం గురించి ఇటివలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈయన చెబుతుంది కరెక్ట్.. ఈయన మాట్లాడిన మాట ప్రతిదీ నిజమే అని బలంగా అనిపించాలి. బాలీవుడ్ హీరోల్లో ఒక్క అజయ్ దేవ్‌గణ్ చెబితేనే అది మనకు నిజమే అనిపిస్తోంది. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. అందుకే అజయ్ దేవగణ్ ను ఆర్ఆర్ఆర్ లో తీసుకున్నాను అని’ రాజమౌళి చెప్పుకొచ్చాడు.

ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?

కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంలా నటిస్తున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే మరో కీలక పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.

అమ్మ ‘తలైవి’తో శోభన్ బాబు లవ్ సీన్స్ ను.. !


తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితంలో చోటు చేసుకున్న ఓ వివాదాస్పద విషయం ఆమెను జీవితాంతం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబుతో జయలలితకు ఏర్పడిన పరిచయం. ఆ రోజుల్లో శోభన్ బాబు – జయలలిత మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ లో వాస్తవం ఎంత.. నిజంగానే వారి మధ్య ప్రేమ ఉందా.. నిజంగానే వాళ్లిద్దరికీ ఓ పాప పుట్టిందా.. ? మరి ఏ కారణాల చేత వాళ్ళు పూర్తిగా దూరం అయ్యారు.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

ఇలాంటి విషయాల గురించి జయలలిత జీవితం ఆధారంగా రానున్న ‘తలైవి’ బయోపిక్ లో మొదట చూపించాలనుకున్నారు. కానీ అమ్మ అభిమానులు మనోభావాలు దెబ్బ తింటాయని ఈ సినిమాలో శోభన్ బాబు పాత్రను చాల వరకూ తగ్గించబోతున్నారు. అయితే శోభన్ పాత్రను పూర్తిగా తగ్గిస్తారా లేక కొంత పార్ట్ వరకూ తగ్గిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏది ఏమైనా ‘అమ్మ’ అభిమానుల కోసం శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం తగ్గించి చూపించడం బాగాలేదు.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ఇక జయలలిత పాత్రలో బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కంగనా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ డైరెక్టర్ ‘ఏ ఎల్ విజయ్’ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో జయలలిత పై జరిగిన కుట్రల్లో ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది ? తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది ? విషయాలను ప్రధానంగా చూపించనున్నారు.

‘బాయ్ కాట్’ చైనా సాధ్యమేనా?


అమెరికాకు చెందిన యాపిల్ ఐఫోన్ ధర దాదాపు 96వేలపైనే ఉంటుంది. కొన్ని లక్ష దాటి ఉంటాయి. అదే ఫీచర్లతో అంతే కాన్ఫిగరేషన్ తో చైనా దేశపు ఫోన్లు 25లోపే అటూ ఇటూగా దొరుకుతాయి. అందుకే ఎంఐ, వన్ ప్లస్ లాంటి అద్భుతమైన ఫీచర్ల ఫోన్లు ఫ్లిప్ కార్ట్, అమేజాన్ లో ఇలా రిలీజ్ కాగానే భారతీయులు ఎగబడి కొంటున్నారు. ఇటీవల భారత్-చైనా ఘర్షణలతో 20 మంది భారత సైనికులను చంపిన చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని అందరూ ‘బాయ్ కాట్ చైనా వస్తువులు ’ అంటున్నారు. కానీ తాజాగా 20మంది భారత సైనికులు చనిపోయిన తరువాత కూడా చైనా మొబైల్ కంపెనీ ‘వన్ ప్లస్ 8ప్రో’ భారత మార్కెట్లో ఆన్ లైన్ లో అద్భుత ఫీచర్లతో ఫోన్ విడుదల చేసింది. ఈ స్టాక్ మొత్తాన్ని మన భారతీయులు ఎగబడి కొనేశారు. ఇక దేశభక్తి ఎక్కడిది అని సగట వాదులు ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు ఊగిపోతున్నారు. రాజకీయ పార్టీ నేతలు గొంతెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ చైనా’ వస్తువులంటూ పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఇంతకీ చైనా వస్తువుల నిషేధం దేశంలో సాధ్యమేనా? అత్యంత చీప్ గా దొరికే ఈ వస్తువులను ఇన్నాళ్లు భారతీయులే ఎగబడి కొన్నారు.

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

భారత్ లోని అన్ని కుటుంబాల్లో చైనా చీప్ వస్తువులు ఉన్నాయి. అమెరికా, జపాన్ తదితర క్వాలిటీ ప్రోడక్టుల కంటే చైనా వస్తువులు చాలా చీప్. అందుకే చైనా ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతూ నడిచేనన్ని రోజులు నడిపిస్తూ ఆ తర్వాత భారతీయులు పారేస్తున్నారు.

ఇక మన గొంతెత్తే రాజకీయ నేతలందరూ ముందుగా చైనా నుంచి దిగుమతులే నిషేధిస్తే భారతీయులు ఎవరూ కొనరు కదా.. కానీ అది సాధ్యం కాదని వారికి కూడా తెలుసు. ఎందుకంటే చైనా వస్తువులను నిషేధిస్తే అంతకు పదింతలు ఖరీదైన వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఆ ఆర్థిక భారం ప్రభుత్వం, ప్రజలు భరించలేరు. పైగా ఇప్పటికిప్పుడు చైనా వస్తువులను భారత్ లో అంత చీప్ గా తయారు చేయడం కుదరదు. అందుకే దేశభక్తి ఎంత ఉప్పొంగినా.. భారత్ లో ‘బాయ్ కాట్ చైనా’ వస్తువుల నిషేధం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

చైనా ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే భారత ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. చైనా కూడా మనకు ఎగుమతులు బంద్ చేస్తే భారత్ కే నష్టం అంటున్నారు.

చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా కేవలం 3 శాతం మాత్రమే. అదే క్రమంలో చైనా నుండి 70 బిలియన్ డాలర్ల వస్తువులను భారతదేశం దిగుమతి చేసుకుంటోంది. 60 శాతం ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇందులో ఉన్నాయి. భారత్ కు మూడవ అతిపెద్ద మార్కెట్ గమ్యస్థానంగా చైనా ఉంది. చైనా నుండి 67 శాతం ఫార్మా ముడిపదార్థాల దిగుమతులు భారత్ కు మందుల తయారీలో ఎంతో లాభం చేకూరుస్తున్నాయి. మన ఎగుమతులు తక్కువ.. దిగుమతులే ఎక్కువ. అందుకే చైనా నుంచి ఒక్కసారిగా దిగుమతులు బంద్ చేస్తే ఆర్థికంగా భారత్ కే నష్టం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సో దేశభక్తి కోణంలో చైనా వస్తువుల బాయ్ కాట్ నిజమే. అందరూ చేయాల్సిందే.

కానీ ఆర్థిక వ్యవస్థ కోణంలో మన నిస్సహాయత మన పారిశ్రామిక ఉత్పత్తి లోపాలను తాజాగా ఘటనలు నిరూపిస్తున్నాయి. అన్ని వస్తువులను మనం తయారు చేసి స్వావలంబన సాధించాలన్న వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి.. మన వస్తువులన్నీ మనం ఉత్పత్తి చేసినప్పుడే ‘బాయ్ కాట్ చైనా ’ వస్తువులను చేయగలం.

-ఎన్నం