
భారత్-చైనా సరిహద్దుల్లో నెలరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న క్రమంలో చైనా భారత్ జవాన్లను దొంగదెబ్బ తీసింది. ఎల్ఓసీ వద్ద చైనా సైనికులు వెనక్కి వెళుతున్న క్రమంలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈనెల 15న చైనా సైనికులు గాల్వానాలో రాళ్లు, రాడ్లతో దాడిచేయగా భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. ఈ దాడిలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా 19మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెల్సిందే.
గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!
భారత జవాన్ల మృతిని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. చైనాతో అమీతుమీకి తేల్చకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారాన్ని కల్పించింది. త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం ఈమేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే భారత యద్ధ విమానాలను సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ ప్లాన్ చేస్తోంది. ఈమేరకు చైనా కంపెనీలకు చెందిన కాంట్రాక్టులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంటోంది. భారత జవాన్లపై మృతితో యావత్ దేశం చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమవుతోంది.
చైనా మరోవైపు సరిహద్దుల్లో భారత సైన్యాన్ని కవ్విస్తోంది. భారత సరిహద్దు దేశాలను మచ్చిక చేసుకొని తనవైపుకు తిప్పుకుంటోంది. నేపాల్, బంగ్లాదేశ్ లకు చైనా తాయిలాలు ప్రకటిస్తూ మచ్చిక చేసుకునేందుకు భారత్ ను ఒంటరి చేయాలని భావిస్తుంది. మరోవైపు పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత జవాన్లపై దాడికి యత్నిస్తుంది. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు చైనా కుటిలయత్నాలను తెరదీస్తుంది. భారత సైన్యం చైనాను సరిహద్దుల్లో నిలువరించడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. దీంతో పరోక్ష యుద్ధానికి తెరలేపుతోంది.
అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు
చైనా ఇప్పటికే కరోనా వైరస్ తో బయోవార్ కు తెరదీసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రికత్తల నేపథ్యంలోనే చైనా సైబర్ వార్ కు తెరదీసింది. గాల్వన్ లోయలో ఘర్షణ తర్వాత భారత సర్వర్లపై సైబర్ ఎటాక్‌లతో చైనీస్ హాకర్లు విరుచుకుపడుతున్నారు. భద్రతా సంస్థలతో అనుబంధం ఉన్న డేటా సర్వర్లపై జూన్ 15నుంచి నేటి వరకు చైనా హ్యాకర్లు 40,300సార్లు ప్రయత్నించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సైబర్ దాడుల్లో ఎక్కువ భాగం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి తెలుస్తోంది.
సిచువాన్ ప్రాంతం చైనా సైబర్ వార్‌ఫేర్ ప్రధాన కార్యాలయంగా ఉంది. అయితే ఈ దాడులు చైనా ప్రభుత్వం ప్రేరేపించిందా లేదా ప్రైవేట్ శక్తుల పనా? అని తెలుసుకునేందుకు భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ సైబర్ స్పేస్ పై పలురకాలుగా చైనా హ్యకర్లు దాడికి యత్నిస్తున్నారు. భారత సర్వర్లు హ్యాక్ చేసి ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను తమ నిఘా ప్రయోజనం కోసం మళ్లించే అవకాశం ఉండటంతో భారత సైబర్ నిపుణులు ధీటుగా ఎదుర్కొంటున్నారు.
భారత్‌పై చైనా అన్నిరకాల యుద్ధాలకు దిగుతోంది. చైనా హైబ్రిడ్ వార్‌ఫేర్ ను ఎదుర్కొనేందుకు భారత సైబర్ నిపుణులు రేయింబవళ్లు పని చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చైనా కుయుక్తులను భారత్ సమర్థవంతంగా తిప్పకొడుతూనే ఉంది. అయితే మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందనే భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొంది.