Home Blog Page 8437

చంద్రబాబు కోటరీ బీజేపీని దెబ్బతీస్తుందా?


సైకిల్ కింద పడి కమలం నలిగిపోతోంది. బీజేపీలోనే ఉంటూ అదే పార్టీని దెబ్బతీస్తున్నారు చంద్రబాబు కోవర్టులు. స్వయంగా అడ్డంగా దొరికేశారు కూడా. ఏపీలో బలపడాలని అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఆ పార్టీలో చేరిన టీడీపీ నాయకులే ఎసరు పెడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ బీజేపీని చావుదెబ్బతీస్తున్నారు. పేరుకు బీజేపీ నేతలు.. పనిచేసేది మాత్రం టీడీపీ కోసం. ఈ రాజకీయం అర్థం చేసుకోకపోతే.. మేల్కోకపోతే ఏపీపై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

*బీజేపీలో టీడీపీ కోవర్టులు?
టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో టీడీపీ ఫైట్ చేస్తున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ భేటి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే ఈ ఘటనతో తేటతెల్లమైంది. అయితే నిమ్మగడ్డతో భేటి అయ్యింది బీజేపీ నేతలు.. పనిచేస్తుంది టీడీపీ కోసం.. ఇక్కడే బాద్నం అవుతున్నది బీజేపీ కాగా.. లాభపడుతున్నది మాత్రం టీడీపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తూ ఉన్నంత కాలం ఏపీలో బీజేపీకి అవకాశాలుండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కోర్టుల్లో పిటీషన్లు దాఖలు వేళ బీజేపీ లో ఉన్న చంద్రబాబు కోవర్టుల ప్రేమ బయటపడింది. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు.

ఇక ఇప్పుడు సుజనా చౌదరి సంగతి. సుజనా బీజేపీలో చేరినా మనసంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంటుంది. బీజేపీలో చేరాక కూడా చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తుంటాడనే పేరు సుజనా చౌదరికి ఉందంటారు. టీడీపీకి మొదట ఆర్థిక అండగా ఉన్న ఆయన బాబు ఓడిపోగానే మోడీ పంచన చేరాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయినా ఇప్పటికీ సుజనా మనసు టీడీపీపైనే ఉంటుందంటారు. బాబుకు, టీడీపీకి ఏమైనా జరిగితే తను బీజేపీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ముందు రచ్చ చేస్తుంటాడు సుజనా అనే అపవాదు ఉంది.

అయితే తాజాగా ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ ప్రభుత్వం చేత తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సెగలు కక్కుతోంది. ఆయన ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తిరిగి నియమించాలని జగన్ ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం విచారణ సాగుతోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయన నియామకాన్ని సహించడం లేదు. టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నిమ్మగడ్డ వ్యవహారం పీక్ స్టేజీలో ఉండగానే తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రాంగం చర్చనీయాంశమైంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ పార్క్ హయాత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్ తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తో గంటన్నర సేపు జరిపిన రహస్య భేటి. సుజనా, కామినేనిలు ఇద్దరూ చౌదరీలే.. ఒకే సామాజికవర్గం. అదీ చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్. సో బీజేపీలో ఉన్న ఈ ఇద్దరు నిమ్మగడ్డను కాపాడడానికి మంత్రాంగం నడిపారు. నిమ్మగడ్డ వైసీపీని ఎదురిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాగా..మిగిలిన ఇద్దరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు. కానీ టీడీపీ కోసం పనిచేస్తున్నారు.

* బీజేపీ కళ్లు తెరవాల్సిన టైం వచ్చిందా?
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీని ఇప్పుడు టీడీపీనే దెబ్బతీస్తోందని అర్థమవుతోంది. బీజేపీలోని చంద్రబాబు కోవర్టులు ఆ పార్టీలోనే ఉంటూ టీడీపీ కోసం చేస్తున్నారని తేటతెల్లమైంది. ఇలాంటి నేతలతో రాజకీయం చేస్తున్న బీజేపీ ఏపీలో ఎలా ఎదుగుతుందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏపీలో అధికారం రాకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే శాపంగా మారింది. సరైన నడిపించే నాయకుడు, దిశానిర్ధేశకుడు లేక బీజేపీ ఏపీలో నిలబడలేకపోతోంది. ఇప్పుడు కమ్మ నాయకుల చేతిలో మరోసారి బలిపశువు అవుతుందన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఇలా కోవర్టులను తరిమికొట్టి అనాదిగా బీజేపీ వెంట ఉంటున్న కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులను దరికి చేర్చుకొని వారికి పార్టీలో మంచి పదవులు ఇస్తే ఖచ్చితంగా బీజేపీ ఏపీలో నిలబడుతుందని అంటున్నారు. కానీ అవేవీ చేయకుండా కమ్మలనే నెత్తిన పెట్టుకుంటే బీజేపీని… టీడీపీ 2గా పిలుస్తారు తప్పితే సొంత గుర్తింపు అస్సలు దక్కదంటున్నారు.

* బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవలి..
బీజేపీ ఖచ్చితంగా ఏపీలో ఓటు బ్యాంకును పెంచుకోవాలి.. నమ్ముకున్న కాపు, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీకి రెడ్లు, టీడీపీకి కమ్మలు ఎలా అయితే బలంగా సపోర్టు చేస్తున్నారో అలానే.. బీజేపీ కాపు, బ్రహ్మ, వైశ్యలను అక్కున చేర్చుకోవాలి. అప్పుడే ధీటుగా నిలబడగలం.. ఇక బీజేపీ రాష్ట్ర రాజకీయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వెనుకుండి నడిపిస్తున్నారన్న అనుమానాలను ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఆయన వర్గాల వారికే లబ్ధి చేకూరుస్తుందని.. టీడీపీకి ఫేవర్ గా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా అందరూ కలిసి బీజేపీ పుట్టిని ఏపీలో ముంచుతున్నారని అర్థమవుతోంది. బీజేపీ కళ్లు తెరవకపోతే పుట్టిమునగడం ఖాయమంటున్నారు. ఎవరు తమ వారు.? ఎవరు కాదన్నది ముందు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

-ఎన్నం

భేటీ వెనుక ఉన్న బిగ్ బాస్ చంద్రబాబేనా?


ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎస్.ఇ.సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ విషయంలో తెర వెనుక ఉన్నది ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్.ఇ.సి నిమ్మగడ్డ ఒక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ రాజకీయ నాయకులతో హైదరాబాద్ లోని పార్క్ హాయత్ హోటల్లో ఈ నెల 13న ఉదయం సమావేశం అయిన దృశ్యాలు మీడియా ప్రసారం చేసింది. ఈ సమావేశం సారాంశం ఏంటి, సమావేశంలో ఏమి చర్చించారనే విషయం ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీ వెనుక రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలుగా ఉన్న ఇద్దరు బీజేపీ నేతలు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో ఈ భేటి వెనుక చంద్రబాబు ఉన్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను మళ్ళీ పదవిలో కూర్చోపెట్టేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రంలోని కీలక వ్యక్తుల నుంచి వత్తిడి తేచ్చేందుకు సమావేశంలో చర్చించి ఉంటారని సమాచారం.

చమురు ధరలపై బాబు వైఖరి వెనుక రహస్యం..!

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ చేసిన పోస్టులో ఆసక్తి కరమైమ విషయాన్ని వెల్లడించారు. హోటల్ లో సమావేశమైన ముగ్గురు వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరనేది త్వరలో బయటకు వస్తుందని ఆయన పోస్ట్ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో నిమ్మగడ్డ ఒక పావుగా మారారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు అదే విధంగా ఉండటం విశేషం.

అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్.ఇ.సిగా కొనసాగించాలని హైకోర్టు కొద్దీ రోజుల కిందట తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రమేష్ కుమార్ ను ఎస్.ఇ.సిగా ప్రకటించలేదు. దీంతో నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవి చేపట్టేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దీ రోజుల కిందట గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. అదేవిధంగా కోర్టుధిక్కార కేసును హైకోర్టు దాఖలు చేస్తారనే వార్తలు వినిపించాయి.

ట్రాజెడీ క్యారెక్టర్ లో నేచురల్ స్టార్ ?


తెలుగు ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో తయారవుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడట. సినిమాలో చాల భాగం ఫ్రెంచ్ కట్ తో పాటు వెరీ స్టైలిష్ లుక్ లో నాని కనిపిస్తాడట. పైగా నాని ఈ సినిమాలో ట్రాజెడీ క్యారెక్టర్ లో నటిస్తున్నాడట. అంటే సినిమాలో నాని క్యారెక్టర్ చనిపోతుందని.. సినిమా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఇక నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన రీతు వర్మ మెయిన్ హీరోయిన్ గా, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ సెకెండ్ లీడ్ గా ఈ సినిమాలో నాని సరసన నటిస్తున్నారు. ప్రెజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ సినిమాకి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి ‘నిన్నుకోరి’తో సూపర్ హిట్ అందుకున్న ఈ హిట్ కాంబినేషన్ ఆ హిట్ మేజిక్ ను రిపీట్ చేస్తోందా.. లేదా ఆమెది చూడాలి.

చమురు ధరలపై బాబు వైఖరి వెనుక రహస్యం..!

కాగా నానికి 26వ చిత్రంగా రానున్న ఈ సినిమాని షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘టక్ జగదీష్’ రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు సెకెండ్ వీక్ నుండి మళ్ళీ ఔట్ డోర్ లొకేషన్ లో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో తారాగణం విషయానికి వస్తే.. సీనియర్ హీరో జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.

బీజేపీ దోస్తీ పవన్ కి బలమా… భారమా?


సొంత నిర్ణయమో లేక ఎవరిదైన సలహానో… పవన్ బీజేపీతో దోస్తీ కట్టాడు. దాని వలన కలిగే ఫలితాలు..ఎదురయ్యే పర్యవసానాలు ఆలోచించారో లేదో… కానీ ఆయన బీజేపీ పంచన చేరడం జరిగింది. బీజేపీతో టీడీపీ విడిపోయాక మోడీపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ మోడీకి జైకొట్టడం వలన, పవన్ కూడా అందరిలాంటి రాజకీయ నాయకుడే అనే భావన ప్రజల్లో కలుగజేశారు. పవన్ బీజేపీ పార్టీతో మిత్రునిగా మారడానికి జగన్ విజయమే కారణం. తన భవిష్యత్తును కూడా పక్కన పెట్టి పవన్ జగన్ ని కట్టడి చేయాలని కసితో, బీజేపీ మిత్ర పక్షం అయ్యారు .

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

మరి పవన్ కోరుకున్నట్లు బీజేపీ అండతో జగన్ పై ఆయన ఆధిపత్యం సాధించగలుగుతున్నాడా అంటే అదీ లేదు. రాజధాని అమరావతి నుండి ఎలా మారుస్తారు..అది జరగనివ్వను అని పవన్ శపథం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలో అంశం, అందులో మేము జోక్యం చేసుకోము..అని కేంద్రం చెప్పడంతో పవన్ కి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. జగన్ బీజేపీతో సన్నితంగా ఉంటుండగా…పవన్ కి ప్రత్యేక గుర్తింపు ఏమి లేదు. జనసేన బీజేపీతో చేరింది కాబట్టి వారు జగన్ ని టార్గెట్ చేస్తారు అనుకోవడం అవివేకమే అవుతుంది. భవిష్యత్తులో బీజేపీ సంపూర్ణ విజయం సాధించకపోతే జగన్ లాంటి నాయకుడి అండ, వారి ఎంపీల మద్దతు వారికి అవసరం అవుతుంది.

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

రెండు నాల్కల ధోరణి గల బాబుని మోడీ నమ్మలేని పరిస్థితి. కాబట్టి జగన్ తో సన్నితంగా ఉండడం వలన వారికి కలిసొచ్చే అంశమే. ఇక ఒక శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ పార్టీ వలన పవన్ కి వచ్చే ప్రయోజనం ఏముంది?. పవన్ వలన రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీకి లాభమే కానీ.. బీజేపీ వలన పవన్ కి కొత్తగా ఒనగూరే ప్రయోజం ఏమి లేదు. దీనికి తోడు బీజేపీ మిత్ర పక్షం అని చెప్పుకోవడం వలన, వారిని ప్రశ్నించ లేని పరిస్థితి. గత బడ్జెట్ లో ఏపీకి కనీస కేటాయింపులు, సహకారం లభించకపోయినా ఆయన భేష్ అని పొగిడారు. ఇది ప్రజల్లో తన ఇమేజ్ కి డామేజ్ చేసే అంశమే. రేపు బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తారు.ఒకవేళ గతం కంటే కొన్ని మెరుగైన సీట్లు గెలిచినా ఆ క్రెడిట్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏవిధంగా చూసిన బీజేపీ పవన్ కి భారమే కానీ.. బలం కాదు.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదం రోజు రోజుకీ చిలికి చిలికి గాలివాన లాగా తయారవుతుంది. ఇప్పటికే తను రాసినట్లు చెబుతున్న లేఖపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇందులో కోర్టులు ఏం చెప్పాయనేదాన్ని ఒక్క నిముషం పక్కనపెట్టి ప్రజలేమనుకుంటున్నారు అని చూస్తే మాత్రం ఆ లేఖ చదివిన వాళ్లకు నిమ్మగడ్డ నిజాయితీపై సందేహాలు కలిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా కులం పేరుతో అభియోగం చేయటం మొరటుగా వున్నా పరిస్థితులు చూస్తే  ఒక సాధారణ పౌరుడికి దానిని నమ్మే పరిస్థితి వుంది. అయినా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆమాట మాట్లాడకూడదు. నిమ్మగడ్డ చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడని మాట్లాడటం వరకు ఒకే గానీ ముఖ్యమంత్రి గా అలా మాట్లాడటం సభ్యతకాదు. ఎందుకు కుమ్మక్కయ్యాడనేది ప్రజలకు వదిలిపెట్టాలి. అది కులం కోసమా, డబ్బు కోసమా, తనని నియమించాడని విశ్వాసమా అనేది ప్రజల ఆలోచనలకు వదిలివేయాలి. ఒక్కోసారి తను కులం కోసమే కుమ్మక్కయ్యాడని అనుకున్నా ముఖ్యమంత్రి సామాజిక బాధ్యతాపరంగా అలా మాట్లాడి వుండాల్సింది కాదు. అటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి మీదకూడా అవతలివాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా కులం ప్రస్తావన ప్రత్యక్షంగా తీసుకురావటం ఎవరుచేసినా తప్పే (అది వాస్తవమైనా). ఇక అసలు విషయానికి వద్దాం.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నిక కమీషనర్ గా తీసివేయటం తప్పని హై కోర్టు తీర్పు ఇచ్చినమాట నిజమే. దానిపై సుప్రీం కోర్టు కెళ్ళే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి వుంది. చివరకు కోర్టు ఏం చెబితే అది అమలుచేయ్యాల్సి వుంటుంది. ఈ లోపు ఇప్పుడు బయటకు వచ్చిన వీడియో క్లిప్పింగులు నిమ్మగడ్డ నిజాయితీ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం వర్ల రామయ్య చేత వితండవాదం చేపించటం చూస్తుంటే రాజకీయాలు ఎంత దిగజారేయో అర్ధమవుతుంది. ఎన్నికల కమీషనర్ గా వున్న వ్యక్తి ఒక ప్రైవేటు హోటల్ లో రహస్యంగా సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ ని  ఒక గదిలో కలవటం అనైతికం. వర్ల రామయ్య చేత ఎన్నైనా వాదనలు చేయించవచ్చు. ప్రజలు మాత్రం నిమ్మగడ్డ వీళ్ళతో కుమ్మక్కయ్యాడనే భావిస్తారు. ఒకవైపు నిమ్మగడ్డ తనకు తానే తన పదవిని పునరుద్ధరించుకున్న తర్వాత తన దృష్టిలో తను ఎన్నికల కమీషనరే కదా. అటువంటప్పుడు రహస్యంగా ఒక హోటల్ గదిలో కలవాల్సిన అవసరమేముంది? సాంకేతికపరంగా తప్పులేదని ఎవరైనా వాదించినా మనసాక్షిగా అది తప్పేనని వాళ్లకు తెలుసు. ఒక తప్పుని సమర్ధించుకోవటం కోసం జగన్ తప్పుల్ని ఏకరువు పెట్టటం సమర్ధనీయం కాదు. రెండోది, సాక్షి పత్రికకి ఈ క్లిప్పింగులు ఎలా వచ్చాయని మాట్లాడటంలో అర్ధం లేదు. పత్రికలు వార్తలు ఎలా సేకరించారో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు పూర్తి రక్షణ వుంది.

ఈ వార్త రాసేటప్పటికి బిజెపి వివరణ ఇవ్వలేదు. అసలే ఆంధ్రలో కునారిల్లుతున్న బిజెపికి ఇది దెబ్బే. దేశంలోనే అతి పెద్ద పార్టీ, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ  ఇలా అడ్డంగా దొరికిపోవటం దాని ప్రతిష్టకు పూర్తి దెబ్బనే. రాష్ట్రాల్లో తను అధికారంలో వున్నచోట రాజ్యసభ ఎన్నికల్లో , అధికారం కోసం ఇలా అనైతిక ప్రవర్తన కొత్తేమీ కాదు. కానీ ఇంకో పార్టీ నాయకుడి కోసం ఇలా చేయటం చూసిన వాళ్లకు ‘బిజెపి లో పచ్చ చొక్కాలు’ అని జగన్ పార్టీ ప్రచారం లో నిజమున్నదని అనుకోకుండా ఉండలేరు. ఇప్పటికైనా దీనిపై బిజెపి వివరణ ఇవ్వాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా ఈ ఘటన తో బిజెపి నాయకత్వానికి సంబంధంలేదని నిరూపించుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కి, జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కి తెలిసే జరిగిందని ఆరోపిస్తున్నారు. అది కాదని నిరూపించుకోవాల్సిన అవసరం వుంది. సుజనా చౌదరి పై ఇప్పటికే ఎన్నో ఆర్ధిక ఆరోపణలు వున్నాయి. అటువంటి వ్యక్తిని వెనకేసుకురావటం బిజెపి ప్రజల్లో ఇప్పటికే చులకనయ్యింది. అలాగే ఇప్పటికైనా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై బిజెపి అధినాయకత్వం నిర్ణయం తీసుకోవటం మంచిది. బిజెపి కనక సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పై వేటు వేయకపోతే నష్టపోయేది బిజెపి నే. ప్రస్తుతం రాజ్యసభలో వై ఎస్ ఆర్ సి పి కి ఆరు రాజ్య సభ స్థానాలు వున్నాయి. సుజనా చౌదరి కోసం పాకులాడితే బిజెపి కి కీలకమైన ఈ ఆరు స్థానాలు దూరమయ్యే అవకాశముంది. కాబట్టి ఏ విధంగా చూసినా సుజనా చౌదరిని దూరంగా పెట్టటమే బిజెపి కి లాభం.

ఇకపోతే జనసేన పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మౌనం వహించకూడదు. తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి. రాజకీయాల్లో మురికిని కడుగుతానని వచ్చిన పవన్ కళ్యాణ్ దీనిపై స్పష్టమైన ప్రకటన ఇస్తేనే తన నిజాయితీ రాజకీయాలకి విలువ వుంటుంది. నిమ్మగడ్డ ప్రవర్తన  ఆ పదవి కి మచ్చ తెచ్చే విధంగా వుంది. ముందు ముందు ఈ పరిణామాలు ఎలా మారతాయో చూద్దాం.

టీవీ పరిశ్రమపై కరోనా పంజా


కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా, టీవీ షూటింగులు వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సెలబెట్రీలంతా ఇంటికే పరిమితయ్యారు. లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో అభిమానులతో తమ అనుభవాలను పంచుకున్నాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్లో సినిమా, టీవీ షూటింగులకు ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగులు చేసుకోవాలని అనుమతి రావడంతో ఇటీవల టీవీ షూటింగులు ప్రారంభమయ్యాయి.

కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం

తాజాగా ఓ ప్రముఖ టీవీ సీరియల్ షూటింగ్ ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న ఓ ప్రముఖ యాక్టర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో కలకలం మొదలైంది. తిరుపతి నుంచి వచ్చిన సదరు యాక్టర్ ఇటీవల షూటింగులో పాల్గొన్నాడు. షూటింగు జరుగుతున్న సమయంలో ఆయనకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ తేలింది. దీంతో ఆయనను హోంక్వారంటైన్ కు తరలించినట్లు సమాచారం. సదరు యాక్టర్ తో కాంటాక్ట్ అయిన వ్యక్తులను కూడా క్వారంటైన్ కు తరలించినట్లు నిర్వాహాకులు తెలిపారు.

ఇటీవలే కొద్దిపాటి సిబ్బందితో టీవీ సీరియల్స్ ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు కరోనా ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది. ఏపీలోనూ ఆయన కరోనా సోకిందా? లేదా షూటింగుల్లో పాల్గొనక కరోనా సోకిందా? అనేది తేలాల్సి ఉంది. అయితే షూటింగ్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకడంతో షూటింగును ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే షూటింగు తిరిగి కొనసాగిస్తారా? లేదా అనేది మాత్రం నిర్వాహాకులు స్పష్టం చేయలేదు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినప్పటికీ నేటికి షూటింగులు ప్రారంభం కాలేదు. స్టార్ హీరోహీరోయిన్లు ఇప్పుడే షూటింగుల్లో పాల్గొనేందుకు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. కరోనాపై వేచిచూసే ధోరణిలో నటీనటులు ఉండటంతో టాలీవుడ్లో ఇంకా షూటింగుల సందడి మొదలు కాలేదని తెలుస్తోంది. కాగా ఇటీవల ఓ ప్రముఖ కామెడియన్, ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్ తేలడంతో టాలీవుడ్లో కరోనా కలకలం మొదలైంది. దీంతో ఇప్పట్లో సినిమా షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సారి రాజమౌళి పై.. !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో ఒకటిగా కనిపించబోతుండే సరికి ఈ సినిమా పై మొదటి నుండి నేషనల్ వైడ్ గా భారీ ఆసక్తి నెలకొంది. అయితే తెలుగులో మాత్రం రాజమౌళి పై కోపంగా ఉన్నారట ఇక్కడ ప్రేక్షకులు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ పాత్ర మీద రాజమౌళి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు.

కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం

కనీసం ఇప్పుడైనా షూట్ చేసి తమ కోసం ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన పోస్టర్ అయినా రిలీజ్ చెయ్యొచ్చు కదా, ఫ్యాన్స్ ను వారి మనోభావాలను రాజమౌళి పట్టించుకోవడం లేదని, తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి కరోనా కారణంగా ఎన్టీఆర్ పార్ట్ కి సంబంధించి వర్క్ మొత్తం ఆగిపోయింది. దాంతో ఫ్యాన్స్ కోసం ఏదో రిలీజ్ చేయాలి కదా అని ఏదొకటి రిలీజ్ చేయడం ఇష్టం లేకే రాజమౌళి తారక్ వీడియోను రిలీజ్ చేయలేదు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

అయితే ఎన్టీఆర్ వీడియో అద్భుతమైన అవుట్ ఫుట్ తోనే రిలీజ్ చేయాలనేది జక్కన్న ప్లాన్. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను మెప్పించటానికి రాజమౌళి ఏం చేస్తాడో చూద్దాం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగానే ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయోమయంలో క్రేజీ బయోపిక్ !


భారతీయ సినీ పరిశ్రమల్లోనే గత కోనేళ్ళుగా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ‘మహానటి సావిత్రి’ బయోపిక్, ‘మహానటుడు ఎన్టీఆర్’, ‘దివంగ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి’ లాంటి సినీ రాజకీయ ప్రముఖుల బయోపిక్ లతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన క్రీడాకారుల బయోపిక్ లు కూడా వెండితెర మీద కనువిందు చేస్తున్నాయి. ఇప్పటికే ‘ఎమ్ ఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్’ లాంటి మేటి క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చాయి.

ఈ క్రమంలోనే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ కూడా వస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా ఈ బయోపిక్ ను కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ క్రేజీ బయోపిక్ ను నిర్మాత విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని తెలుగులో కూడా ఏప్రిల్ 10నే రిలీజ్ చేయాలనుకున్నా.. కరోనా మహమ్మారి రాకతో సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. దాంతో పాపం ఈ లెజెండరీ క్రికెటర్ బయోపిక్ కు కాస్త ఓవర్ బడ్జెట్ అయింది. దాంతో డైరెక్ట్ గా ఒటిటిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మరో పక్క అన్ని కుదిరితే ఆగష్టు లాస్ట్ వీక్ లో ఈ బయోపిక్ ను డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి లెజెండరీ క్రికెటర్ బయోపిక్ అయోమయంలో పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇక ఈ బయోపిక్ ను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. ’83’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో ఎలా విజయం సాధించింది ? మొత్తం వరల్డ్ కప్ ను గెలుచుకునే క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటి ? ఫైనల్ గా కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అసలు కపిల్ దేవ్ జీవితం ఏమిటి ? ఆయన సాధించిన విజయాలు ఏమిటి ? ఇలా పలు ఆసక్తికరమైన విషయాలను ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ఇక ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ భార్య పాత్రలో బాలీవుడ్ బ్యుటి దీపికా పదుకొనె నటిస్తోంది.

తెలంగాణలో భూకంపం.. ఎక్కడంటే?


తెలుగు రాష్ట్రాలకు భూకంప ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా మహమ్మరి తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే మరోవైపు భూకంపాలు వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో భూకంపం సంభవించింది. అయితే ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3గా నమోదైంది. ఒక్కసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం

కొద్దిరోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తరుచూ భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ భూప్రకంనలు చోటు చేసుకున్నాయి. సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో భూమి నాలుగుసార్లు కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైందని అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా ఏపీలోని కృష్ణా జిల్లాలోనూ భూప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల కోటిలింగ క్షేత్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం భూమి నుంచి శబ్దాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే స్థానికులు వీటిని భూ ప్రకంపనలుగా భావించి ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రకంపనలు భూకంపం వల్ల వచ్చినవి కావని అధికారులు చెబుతున్నారు. భూమి నుంచి శబ్దం వస్తున్నట్లు గుర్తించారు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

కాగా సోమవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. గుజరాత్లోనూ గత 24గంటల్లో భూమి రెండుస్లార్లు కంపించినట్లు సమాచారం. గతకొంతకాలంగా ఢిల్లీలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్లోనూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కరోనా మరోవైపు భూకంపాలతో ప్రజలు ఇళ్లలో ఉండలేక బయట తిరుగలేక ఇబ్బందులు పడుతున్నారు.

కరోనా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం


తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడమేగానీ తగ్గడం లేదు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొద్దరోజులుగా ప్రతిరోజు 500పైగా కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో జీహెచ్ఎంసీ తాజాగా సంచలనం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయానికి ప్రజలెవరూ రావవద్దని సూచించింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఆన్ లైన్లోనే సంప్రదించాలని, కార్యాలయానికి వస్తే మాత్రం అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

నగరంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈమేరకు జీహెచ్ఎంసీ సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో వారంతా హోంక్వారంట్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ సైతం కరోనా బారి నుంచి త్రుటితో తప్పించుకున్నారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు పారిశుధ్య కార్మికులు కరోనా బారిన పడుతుండటంతో జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని పనులు, ఫిర్యాదులకు సంబంధించి ప్రజలు ఆన్ లైన్లోనే సంప్రదించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాలయాల్లోని ప్రజలను అనుమతించడం లేదని పేర్కొంది.

రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 872కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే 713, రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్‌లో 16, సంగారెడ్డిలో 12, వరంగల్‌ రూరల్‌ జిల్లా 6, మంచిర్యాలలో 5, కామారెడ్డి 3, మెదక్‌ జిల్లాలో 3, జనగామ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాలో 2 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం కరోనాతో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో మొత్తంగా 8,674పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 217మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

‘కరోనా’ దెబ్బకి రైతుగా మారిన ‘విలక్షణ నటుడు’ !


‘వ్యవసాయం’లోనే సాయం ఉందని ఓ సినీ కవి చెప్పినట్టు.. ఓ ప్రముఖ నటుడు వ్యవసాయం బాట పట్టారు. లాక్‌ డౌన్ కారణంగా వచ్చిన గ్యాప్ లో సినీ సెలబ్రిటీలు.. రకరకాల ఛాలెంజ్‌ లు విసురుకుంటూ కాలం కరిగించుకుంటూ వస్తుంటే.. విలక్షణ నటుడు పైగా నేటి నటనకే మేటి నటుడు అయిన ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’ మాత్రం రైతు అవతారం ఎత్తి తన సొంతూరికి వెళ్లి అక్కడే వ్యవసాయం చేసేస్తున్నాడు.

ఉత్తర ప్రదేశ్ లోని బుధాన అనే ఓ చిన్న టౌన్ లో పుట్టి పెరిగిన ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’ స్టేజి ఆర్టిస్ట్ నుండి చాలా కష్టపడి బాలీవుడ్ లోనే మేటి నటుడిగా ఎదిగారు. అయితే ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా షూటింగ్‌ లతో ఎప్పుడూ బిజీగా ఉండే నవాజుద్దీన్ కి, లాక్‌ డౌన్ పెద్ద ఉపశమనంగా మారింది.

కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడేందుకు విధించిన లాక్‌ డౌన్ సామాన్యులకు కష్టాలను తెచ్చినా, ప్రముఖులకు మాత్రం వారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి ఇష్టాలను తీర్చుకునే గొప్ప అవకాశాన్ని కల్పించింది. మొత్తానికి ‘నవాజుద్దీన్ సిద్దిఖీ’ లాంటి సెలబ్రిటీలు ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.

https://www.instagram.com/p/CBvki5wB-5a/

వైరల్… మహేష్ తో సితార ‘టంగ్ ట్విస్టర్ గేమ్’ !


మహేష్ బాబు అభిమానులకు సూపర్ స్టార్ అయినా, ఆయన కుమార్తె తన గారాలపట్టి సితార ముందు మాత్రం ఓ సాధారణ తండ్రే. ఇక సితార ఫుల్ ఎనర్జిటిక్.. మహేష్ తో సరదాగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి ‘నమ్రతా మహేష్’ సితారతో మహేష్ చేసే అల్లరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయ సితారతో చిన్నపిల్లాడిలా మారిపోయి టంగ్ ట్విస్టర్ గేమ్ ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

ఈ వీడియోలో సితార కష్టమైన ఓ పెద్ద పదాన్ని పలుకగా…అలా కాదు అంటూ మహేష్ సరిచేస్తుండగా.. సితార మాత్రం గేమ్ లో తానే గెలిచినట్లు తండ్రితో వాదనకు దిగడం, కూతురు అల్లరి చూస్తూ మహేష్ సరదాగా ఎంజాయ్ చేయడం.. వీడియోలో బాగా ఆసక్తి రేపుతోంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. ఇక సితార సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తన తండ్రి అభిమానుల కోసం తనకు సంబంధించిన రేర్ వీడియోలను ఫోటోలను పోస్ట్ చేస్తూ మహేష్ అభిమానుల్ని అలరిస్తుంటుంది.

కాగా ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఫ్యామిలీ డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో మెసేజ్ తో సాగే ఓ పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో, మహేష్ బాబు మాత్రం పూర్తిగా తన కుటుంబ సభ్యులుతోనే గడుపుతున్నాడు.

https://www.instagram.com/p/CBxAwpBnvrJ/

చమురు ధరలపై బాబు వైఖరి వెనుక రహస్యం..!


పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు సామాన్యులకు భారంగా మారింది. కరోనా నేపథ్యంలో రెండు నెలలు కట్టుదిట్టమైన లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రజలు ఆర్ధికంగా లాడుతుంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను రోజు, రోజు పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 15 రోజుల్లో డీజిల్ పై లీటరుకు రూ.8.88, పెట్రోల్ పై లీటరుకు రూ.7.97 ధర పెరిగింది. ఓ పక్క అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉండటం ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

చమురు ధరలు విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరి విడ్డురంగా ఉంది. పెంచిన చమురు ధరలు తగ్గించాలని కోరడంతో తప్పులేదు. ఆయన కేంద్రన్ని చమురు ధరలు తగ్గించమని ఆ పార్టీ తరుపున డిమాండ్ చేసే ధైర్యం చేయడం లేదు. కేంద్రాన్ని ధరలు తగ్గించమని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని డిమాండ్ చేయడం విడ్డురంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విధించే సెస్ తగ్గించమని కోరారు అంతవరకూ బాగానే ఉన్నా కేంద్రం విషయంలో ఆయన వైఖరిని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఇతర రాష్ట్రాల కంటే అధిక సెస్సు విధించడంతో రాష్ట్రంలోని పెట్రోల్ బ్యాంకుల యజమానులు ఆందోళనలు చేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా ఒరిస్సాలలో డీజిల్ ధరలు తక్కువగా ఉండటంతో లారీల యజమానులు అక్కడే ఇంధనాన్ని నింపుకోవడంతో మా వ్యాపారాలు ముసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బాంక్ లలో అమ్మకాలే లేవని పెట్రోల్ బంకుల యజమానుల సంఘము అప్పట్లో పలుమార్లు మీడియాకు వివరాలు వెల్లడించి, అప్పటి సీఎం, ఆర్ధిక మంత్రులకు వినతి పత్రాలు సమర్పించింది. చివరికి స్వచ్చందంగా ఆదివారాలు విక్రయాలు నిలిపివేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి సెస్సును 2018లో రాష్ట్రం విధించిన సెస్సు తగ్గించింది. దీని వెనుక ఉన్న కథ చెప్పని ప్రతిపక్షనేత చంద్రబాబు తాను ప్రజల కోసమే సెస్ తగ్గించినట్లు ప్రజలను మభ్య పెడుతున్నారు.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

మరోవైపు కేంద్రాన్ని చమురు ధరలు తగ్గించాలని వత్తిడి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి, సీఎం జగన్ కు సూచిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజల కోసం ప్రతి పక్ష స్థానంలో ఉన్న టీడీపీ కేంద్రాన్ని చమురు ధరలు తగ్గించమని కోరకూడదా?, ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని సీపీఐ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. కానీ టీడీపీ మాత్రం కేంద్రానికి వ్యతిరేకంగా కనీసం ప్రకటన కూడా చేయకుండా కేంద్రంపై వత్తిడి తేవాలని రాష్ట్ర సీఎం జగన్ కు సూచించడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. తన రాజకీయ లబ్ధికోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా కాలక్షేపం చేస్తూ, సీఎంను కేంద్రంపై వత్తిడి తేవాలని కోరుతుందనేది వాస్తవం.

రేవంత్ రెడ్డికి కొత్త పోటీని తెచ్చిన కాంగ్రెస్ సీనియర్లు?


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని కానీయవద్దని డిసైడ్ అయిన కాంగ్రెస్ సీనియర్లు తాజాగా కొత్త పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పదవి దక్కకుండా చేయాలని.. కాంగ్రెస్ లోనే అనాదిగా ఉన్న యువ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేతను తెరపైకి తెచ్చారు. ఇంతకీ ఎవరాయన.? ఎందుకు ఆయనను టీపీసీసీ చీఫ్ రేసులోకి తెచ్చారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

టీపీసీసీ రేసులోకి అనూహ్యంగా యువ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి వచ్చాడు. ఈ మాజీ ఎమ్మెల్యేగా సడన్ గా కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. తాజాగా ప్రెస్ మీట్లలో క్రమం తప్పకుండా మాట్లాడుతున్నారు. మీడియాలో హైలెట్ అవుతున్నారు.

కాంగ్రెస్ రాజకీయాల్లో వంశీచంద్ రెడ్డి పాత్ర ఎలా సడన్ గా పెరిగిందని ఆరాతీయగా.. టీపీసీసీ రేసులోకి కాంగ్రెస్ సీనియర్లు అంతా వంశీచంద్ రెడ్డిని తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?

రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ అవ్వకుండా ఆపాలన్నది కాంగ్రెస్ సీనియర్ల ప్రణాళిక. కానీ రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ హైకమాండ్ ఉందని సమాచారం. అందుకే ఆయనకు కౌంటర్ గా ధృడమైన యువ నేతను తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారట.. ఈ క్రమంలోనే యంగ్, ఫైర్ బ్రాండ్, చురుకైన వంశీ చంద్ రెడ్డిని రేవంత్ రెడ్డి వంటి శక్తివంతమైన నేతకు పోటీగా దింపారట.. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం కూడా రేవంత్ రెడ్డికి మైనస్ గా మారిందంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి మాదిరే వంశీచంద్ రెడ్డి కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేనే. రేవంత్ ఎమ్మెల్యేగా ఓడిపోయినా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. దీంతో ఆయన స్థానంలో వంశీ చంద్ అనాదిగా పార్టీని నమ్ముకొని ఉన్నాడని ఆయననే పీసీసీ చీఫ్ చేయాలని హైకమాండ్ కు ప్రతిపాదిస్తున్నారట.. మొత్తంగా రేవంత్ రెడ్డిని బలహీన పరిచే కుట్రలకు టీ కాంగ్రెస్ సీనియర్లు గట్టిగానే చేస్తున్నారని అర్థమవుతోంది.

-ఎన్నం

వ్యాక్సిన్ వచ్చేలోపే కరోనా అంతం కానుందా?


కరోనా(కోవిడ్-19) మహమ్మరి పేరు చెబితేనే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. అగరాజ్యాలు సైతం ఈ వైరస్ ను ఎదుర్కోలేక విలవిలలాడుతోన్నాయి. ప్రపంచం వ్యాప్తంగా కరోనా కేసులు తీసుకుంటే కోటికి చేరువలో ఉంది. ఒకట్రోండురోజుల్లో ఈ సంఖ్యను చేరడం ఖాయంగా కన్పిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?

చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ఒకటి అరా మినహా ప్రపంచంలోని అన్నిదేశాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొన్నిదేశాలు మాత్రమే కరోనాను సమర్ధవంతంగా నిలువరించగలిగాయి. మరోవైపు సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. ఈ వైరస్ ఉసరవెల్లిలా రంగులు మారుస్తుండటంతో వ్యాక్సిన్ తయారీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతోన్నాయి. అయినప్పటికీ త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందనే ఆశాభావాన్ని సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ వాటి నుంచి బయటేపడి వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈనేపథ్యంతో జెనోవాకు చెందిన ప్రొఫెసర్ బస్సెటీ మాటియో ఈ మహమ్మరి అంతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే కరోనా వ్యాక్సిన్ వచ్చేలోపే అదే అంతమవుతుందని అంటున్నారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి.

ఆ హోంగార్డు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..!

కోవిడ్-19 తొలినాళ్లలో విజృంభించినట్లుగా ప్రస్తుతం ప్రభావం చూపడంలేదని ఆయన అంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల నుంచి కరోనా క్రమంగా బలహీన పడిపోతుందన్నారు. గతంలో 60ఏళ్లుపైబడిన వాళ్లు కరోనా బారినపడితే కోలుకోవడం కష్టంగా ఉండేదని గుర్తుచేశారు. తాజాగా 80నుంచి 90వృద్ధులు సైతం కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. గతంలో కంటే మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయిందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఈ వైరస్ మరింత బలహీనపడి వ్యాక్సిన్ లేకుండా అంతమవుతుందని ప్రొఫెసర్ బస్సెట్టి మాటియో తెలిపారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొంతమేర సత్ఫలితాలు సాధించినట్లు ఆయా కంపెనీలు ప్రకటిస్తున్నారు. మరోవైపు భారత్ కు చెందిన గ్లేన్ మార్క్ ఫార్మా కంపెనీ కరోనాకు మెడిసిన్ తయారు చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన మందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే మార్కెట్లోకి మందును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

మరోవైపు హెటిరో కంపెనీ కూడా కరోనా ఇంజెక్షన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటన్నింటిని పరిశీలించినట్లయితే కరోనా అంతం త్వరలోనే అనే సంకేతం కన్పిస్తుంది. ఈ మయదారి రోగం వీలైనంత త్వరగా అంతమైంతే అంతేచాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది. ఇన్నిరోజులు మనవాళిని ఇబ్బందులకు గురిచేసిన కరోనాకు చెడ్డరోజులు ప్రారంభమయ్యాయని నిపుణులు అంటున్నారు.

‘మోనార్క్’ బాలయ్య కూడా కొట్టుడే !


నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘మోనార్క్’ అనే రొటీన్ యాక్షన్ కొట్టుడు సినిమా ఒకటి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలయ్య ఎప్పటిలాగే కత్తి పట్టి శత్రువుల తలలు నరిగే సీన్స్ తోనే నెట్టుకురావాలని చూస్తున్నాడు. ఇటీవలే బాలయ్య గెటప్ ను రివీల్ చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన టీజర్ లో కూడా బాలయ్య కొట్టుడు తప్ప కొత్తదనం ఏం లేదు. ఇప్పటికే కొంతమంది నెటిజన్లు బాలయ్య కొట్టుడు మాత్రం వదట్లేదు అని కామెంట్లు పెడుతున్నారు. ఇక రెండు విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రం తరువాత షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగనుంది.

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

ఈ షెడ్యూల్ లో కూడా ఫుల్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు బోయపాటి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు డిఫ‌రెంట్ లుక్స్‌ లో క‌న‌ప‌డబోతున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక అండ్ ఓ కొత్త హీరోయిన్ హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే వేదిక ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది.

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

అలాగే ఓ కీలకమైన పాత్రలో శ్రీయా కూడా కనిపించనుంది. శ్రీయాది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. అలాగే ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు. ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ డూపర్ హిట్స్ ను అందించిన బోయపాటి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకం పై నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఆ హోంగార్డు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..!


భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఎప్పుడేం జరుగుతోందోనని సరిహద్దుల గ్రామాల ప్రజలతో యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. గడిచిన నెలరోజులుగా చైనా-భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. జూన్ 15న అర్ధరాత్రి 3గంటల సమయంలో సరిహద్దుల్లోని గాల్వానాలోయలో ఇరుదేశాల మధ్య ఘర్షణ నెలకొంది. చైనా సైనికులు భారత్ సైనికులపై రాళ్లు, రాడ్లతో దొంగదెబ్బతీయడంతో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా దాడిని తిప్పికొట్టే క్రమంలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు వీరమరణం పొందారు.

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

చైనా సైనికులు పక్కా ప్లాన్ తో దొంగదెబ్బ తీసినప్పటికీ భారత్ సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుంది. 300మంది చైనా సైనికుల వందమంది భారత జవాన్లపై దాడి చేసినప్పటికీ వెనుకడుగు వేయకుండా చైనాను సరిహద్దుల్లోనే నిలువరించినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణలో భారత జవాన్లు మృతిచెందాడంపై కేంద్రం ప్రభుత్వం సీరియస్ అయింది. ఓవైపు శాంతి చర్చల పేరుతో భారత జవాన్లపై దాడికి యత్నించాన్ని తీవ్రంగా ఖండించింది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. త్రివిధ దళాలను సంసిద్ధంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా సరిహద్దుల్లోని జవాన్లు ఆయుధాలు ఉపయోగించుకునేందుకు అధికారం కల్పించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చైనా బరితెగిస్తే భారత సైన్యం తిప్పేకొట్టేలా కేంద్రం సైనికులకుు అన్ని అధికారులు ఇచ్చి వారిలో ఆత్మస్థైర్యం పెంచుతోంది.

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

భారత్ జవాన్ల మృతితో యావత్ దేశం రగిలిపోతుంది. వీరజవాన్లకు భారతీయులంతా ఘనంగా నివాళ్లర్పించారు. వీరజవాన్ల మృతి వృథాగాపోదని నినదిస్తున్నారు. ఈమేరకు చైనా వస్తువుల బహిష్కరణకు ప్రజలు పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో చైనా వస్తువులు బహిష్కరించాలంటూ ఉద్యమిస్తున్నారు. కేంద్రం కూడా చైనాకు చెందిన పలు కాంట్రాక్టులను రద్దుచేస్తూ షాకిస్తోంది. తాజాగా ఓ హోంగార్డు రక్తంతో రాష్ట్రపతికి లేఖరాసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. చైనాతో యుద్ధం వస్తే తనకు అవకాశం కల్పించాలని లేఖలో పేర్కొనడం ఆసక్తిని రేపుతోంది.

108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

రాయచూర్ జిల్లా మస్కీలో లక్ష్మణ్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా తనవంతు సాయంగా పేద విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లీష్, కన్నడ వ్యాకరణం, గణితం, సైన్స్‌ సబ్జెక్టులను బోధిస్తున్నాడు. గ్రామీణ పిల్లలకు క్రీడా మనోభావం, దేశభక్తి గురించి చెబుతున్నాడు. ఈక్రమంలోనే భారత్-చైనా సరిహద్దుల్లో భారత జవాన్లు వీరమరణం పొందాడంపై లక్ష్మణ్ చలించిపోయాడు. వెంటనే భారత రాష్ట్రపతికి రక్తంతో కూడిన లేఖను రాశాడు. చైనాతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తే తనకు అవకాశం కల్పించాలని రక్తంతో కూడిన మూడుపేజీల లేఖను రాష్ట్రపతికి రాశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రతీఒక్కరు అతడిని అభినందిస్తున్నారు. ఈ ఒక్క సంఘటన చైనా పట్ల భారతీయులు ఎలా స్పందిస్తున్నారనే దానికి అర్థంపడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.