
జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా 2016లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమింపబడ్డారు. టీడీపీ సానుభూతిపరుడని పేరున్న నిమ్మగడ్డను ఆ పదవినుండి తొలగించాలని జగన్ సీఎం అయినప్పటి నుండి ప్రయత్నాలలో ఉన్నాడు. ఇక స్థానిక ఎన్నికల రద్దు వ్యవహారం జగన్ కి కోపం తెప్పించింది. స్థానిక ఎన్నికల రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వం… నిమ్మగడ్డపై న్యాయపోరాటానికి దిగింది. కోర్టు తీర్పుతో స్థానిక ఎన్నికలు రద్దు చేయగా.. కీలక పదవిలో రమేష్ కుమార్ ఉండడం సేఫ్ కాదని ప్రత్యేక జీ ఓ ద్వారా అతన్ని ఎన్నికల ప్రధాన అధికారి పదవి నుండి తొలగించారు.
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?
నిమ్మగడ్డ రమేష్ దీనిపై హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా అతనికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పుపై స్టే ఇవ్వాలని .. వైసీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. ప్రస్తుతం నిమ్మగడ్ద రమేష్ వ్యవహారం సుప్రీం కోర్ట్ లో కొనసాగుతుండగా..ఈయన టీడీపీ మాజీ ఎమ్ పి సుజనా చౌదరి,మాజీ మంత్రి టీడీపీ నేత కామినేని శ్రీనివాసరావుతో ఓ హోటల్ లో భేటీ కావడం వైసీపీ వర్గాలలో గుబులు రేపుతోంది. నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అనుకూలుడన్న అనుమానాలను ఈ సమావేశం బలపరచడంతో పాటు..జగన్ కి చెక్ పెట్టే దిశగా నిమ్మగడ్డ అడుగులు వేస్తున్నాడు అనిపిస్తుంది.
108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?
టీడీపీ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయాక బీజేపీ పార్టీలో చేరిన సుజనా చౌదరి మరియు టీడీపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస రావుతో ఆయన భేటీ కావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది వైసీపీ వర్గాలకు అర్థం కావడం లేదు. తమ ప్రభుత్వంపైన కుట్రలో భాగమే ఈ సమావేశం అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి నేతృత్వంలోని టీడీపీ సభ్యులు జగన్ ని ఇబ్బంది పెట్టేందుకు, కేంద్రం ప్రభుత్వం అండతో ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేపట్టారన్న అనుమానం కలుగుతుంది.