
చైనాలోని వూహాన్లో సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి పేరు వింటేనే అగ్రరాజ్యాలు సైతం భయాందోళనకు గురవుతోన్నాయి. ఈ మహ్మమరి కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతిన్నాయి. కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుందన్నాయి. మరణాలు సైతం భారీగా నమోదవుతుండటం శోచనీయంగా మారింది. ఓవైపు కరోనా మహమ్మరికి వ్యాక్సిన్ కనుగోనేందుకు సైంటిస్టులు శాయశక్తుల కృషి చేస్తున్నారు. మరోవైపు వైద్యులు ప్రజలకు కరోనా అవగాహన కల్పిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?
కరోనా కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. ప్రజలందరూ కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీఒక్కరు మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం జీవితంలో భాగమై పోయింది. ప్రస్తుతం వాడుతున్న మాస్కులు ప్రజలను ఎంతమాత్రం కాపాడుతాయనే అనుమానాలు ప్రతీఒక్కరిలో ఉన్నాయి. అయితే ఇజ్రాయిల్ కు చెందిన సోనోవియా తయారు చేసిన మాస్కులు వాడితే మాత్రం కరోనా వైరస్ రాదని తాజాగా ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
ఇప్పటికే తాము తయారుచేసిన మాస్కును ప్రయోగశాలల్లో ప్రయోగించినట్లు సోనోవియా కంపెనీ పేర్కొంది. ఈ మాస్క్ తయారీలోవాడే ఫ్యాబ్రిక్‌ను జింక్ ఆక్సైడ్ నానో పార్టికల్స్‌తో కోట్ చేసినట్లు తెలిపింది. దీనికి బ్యాక్టిరియా, ఫంగి, వైరస్ కణాలను అడ్డుకొని చంపేసే శక్తి ఉంటుందని పేర్కొంది. ఈ మాస్క్ లోని క్లాత్‌లో ఉండే ఈ నానో పార్టికల్స్ ఒకరకంగా శానిటైజర్‌గా పనిచేస్తాయని చెప్పింది. దగ్గు, గాలి నుంచి వచ్చే తుంపిళ్లను ఈ మాస్కులు సమర్థవంతంగా అడ్డుకుంటుదని పేర్కొంది. మాస్క్ వద్దకు వచ్చే అన్ని సూక్ష్మ క్రిములను నాశనం చేసేలా వీటిని రూపొందించినట్లు ప్రకటించింది. షాంఘైలోని మెక్రో స్పెక్ట్రమ్ ల్యాబ్‌లో మాస్క్‌లను పరీక్షించగా 90శాతం వైరస్ లను నివారించి ఆ కంపెనీ ప్రకటించింది.
రేపటి నుంచి పూరీ రథయాత్ర.. సుప్రీం గ్రీన్ సిగ్నల్
మాస్కుల తయారీలో ఈ ఫార్ములా విజయవంతం కావడంతో వీటిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సోనోవియా సంస్థ ప్రకటించింది. మాస్కులతోపాటు త్వరలోనే దుస్తులను కూడా తయారు చేయనున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు ఆస్పత్రుల్లో వాడే టెక్స్‌టైల్స్, డాక్టర్లు ప్రొటెక్టివ్ ఎక్విమెంట్, ఇతర వస్త్రాల్లోనూ ఈ ఫార్మూలాను ఉపయోగించనున్నట్లు ఆ కంపెనీ స్పష్టం చేసింది. దీని ద్వారా కరోనా వైరస్ ధీటుగా ఎదుర్కోనే అవకాశం ఉంటుందని ఆ కంపెనీ నిర్వాహాకులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతీఒక్కరు మాస్కులను తప్పనిసరిగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ ను తరిమికొట్టేలా సోనోవియా సంస్థ మాస్కులను తయారు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మాస్కులు మార్కెట్లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయంగా కన్పిస్తుంది.