Homeఆంధ్రప్రదేశ్‌రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్

రెండు పడవల ప్రయాణంలో ఉనికిని కోల్పోతున్న పవన్


2019 ఎన్నికల ఫలితాలు జనసేనకు ఊహించని షాక్ ఇచ్చినప్పటికీ… జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమికి భయపడం..ప్రజా పోరాటం సాగిస్తాం అని ఆత్మ విశ్వాసం ప్రదర్శించాడు. ఫలితాలకు నిరుత్సాహ పడకుండా, జగన్ ప్రభుత్వ లోపాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నాడు. ఇసుక కొరత, రాజధాని మార్పు, ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భూముల అమ్మకాలు వంటి అనేక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడడం జరిగింది. ఐతే ప్రజల్లో ఆయన పట్ల కొంచెం విశ్వాసం ఏర్పడుతున్న ప్రతిసారి ఎదో ఒక అనాలోచిన నిర్ణయం తీసుకొని మళ్ళీ మొదటికి వస్తున్నాడు.

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఆయన సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చి పార్ట్ టైం పొలిటీషియన్ అని ప్రత్యర్ధులు చేసే విమర్శలను నిజం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో ఇక సినిమా జోలికి వెళ్ళను.. ఈ జీవితం ప్రజా సేవకే అంకితం అన్నారు. దానికి భిన్నంగా ఆయన మళ్ళీ ముఖాన్ని రంగువేసుకోవడంతో, ఆయనది నిలకడలేమి తత్త్వం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాకు తెలిసింది.. సినిమా ఒక్కటే కుటుంబ పోషణ, పార్టీని నడపడానికి డబ్బులు అవసరం, అందుకే సినిమాలు చేస్తున్నాను..అని పవన్ సంజాయిషీ ఇచ్చుకున్నా…అది ప్రజలను సంతృపి పరచ లేదు. జనసేన కార్యకర్తలలోనే ఈ నిర్ణయానికి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా భయం?

రెండు పడవల ప్రయాణంలో పవన్ పోరాటానికి పసతగ్గిందన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఒకటికి రెండు చిత్రాల షూటింగ్స్ లో నిమగ్నమైన పవన్ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాడు. పగలు రాజకీయాలు..రాత్రుళ్ళు షూటింగ్ అన్నట్లు ఆయన వ్యవహారం సాగుతుంది. టీడీపీ లేవనెత్తిన అంశాలపై ఈయన కూడా సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేస్తూ అదే ప్రజా పోరాటంలా భావిస్తున్నారు. ప్రతి విషయంలో టీడీపీని ఫాలో అవుతున్న పవన్ తన ఉనికి మరియు ప్రత్యేకత కోల్పోతున్నాడు. ఇప్పటిదాకా పవన్ లేవనెత్తిన ప్రతి అంశం టీడీపీ వాళ్ళు మొదలుపెట్టిందే. మరి ఇప్పటికైనా పవన్ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించి…గట్టిపోరాటం మొదలుపెడితే బెటర్.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular