Home Blog Page 8431

 సడన్ గా కేసీఆర్ కు‘పీవీ’ఎందుకు గుర్తొచ్చాడు?

KCR-PV-birth-anniversary.

KCR-PV-birth-anniversary.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు సడన్ గా మాజీ ప్రధాని, మేధావి అయిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఎందుకు గుర్తొచ్చారు. కాంగ్రెస్ వదిలేసిన పీవీని కేసీఆర్ ఎందుకు నెత్తిన పెట్టుకున్నాడు? ఆయన సామాజికవర్గం అనా? లేక తెలంగాణకు చెందిన వ్యక్తి అనా కేసీఆర్ ఇంత ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. మరి ఇంకా ఏదైనా కారణం ఉందా అని ఆరాతీస్తున్నారు. దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ ను టార్గెట్ చేయడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అవును.. తన క్రేజ్ ను పెంచుకోవడంతోపాటు కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా డిఫెన్స్ లోకి నెట్టివేయడమే కేసీఆర్ ప్లాన్ వెనుక ఉన్న ఉద్దేశంగా చెబుతున్నారు. ఇంతకీ సీఎం కేసీఆర్ వెనుకున్న ప్లానేంటి?

భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం భారతరత్న.. దీన్ని దేశం కోసం సర్వం ధారపోసిన వ్యక్తులకు  ఇస్తారు. తాజాగా ఈ భారతరత్నను తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని  డిమాండ్ చేస్తున్నారు. పీవీ నరసింహారావు దేశం చరిత్రను మార్చి ఆర్థికపునాదులు వేశాడని.. ఆ అవార్డుకు అర్హుడని పేర్కొన్న ఆయన, ఈ విషయంలో రాష్ట్ర మంత్రివర్గం- రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానాన్ని ఆమోదిస్తుందని అన్నారు. ఈ విషయంలో  తాను వ్యక్తిగతంగా ప్రధాని నరేంద్రమోడిని కలుసుకుంటానని, పివికి భారత్ రత్నను ప్రదానం చేయాలని అభ్యర్థిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

అంతటితో ఊరుకోకుండా జయంతి శతాబ్ది ఉత్సవాలను కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రశంసించారు. జయంతి వేడుకలకు రూ .10 కోట్లు మంజూరు చేశారు. పీవీ అనేక రంగాలలో బహుముఖ వ్యక్తిగా చేసిన గొప్ప సేవలను గుర్తుంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.   హైదరాబాద్‌లోని పివి జ్ఞాన భూమిలో ప్రధాన కార్యక్రమం వారి సొంత నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ కుల్లుకునేలా కేసీఆర్ నిర్వహించి ఔరా అనిపించారు.  అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 50 ప్రదేశాలలో వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు.  పివి  ఐదు కాంస్య విగ్రహాలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగరా,  ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేయాలని  కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

రాజ్యసభ ఎంపీ కేశవ రావు నేతృత్వంలో కేసీఆర్ శతాబ్ది ఉత్సవాల కమిటీ నియమించారు.  రామేశ్వరంలో కట్టినట్టు పీవీ కాంస్య విగ్రహాల ఏర్పాటుకు కేసీఆర్ ఓకే చెప్పారు. హైదరాబాద్ వర్సిటీకి పీవీ పెట్టాలని కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపారు.

కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వెనుక కులం, ప్రాంతం మనిషి కంటే కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా ఏకాకిని చేయడమే పెద్ద ఎజెండా అని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఈ తెలుగు యోధుడు పీవీని చరిత్రలో చాలా అవమానించాయి. ఇప్పటికీ ఈయనను పట్టించుకోవడం లేదు. పీవీకి క్రెడిట్ దక్కకుండా కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఈ చర్యతో ఇరుకునపెట్టాడు.

పీవీ శతజయంతి ఉత్సవాల ద్వారా కాంగ్రెస్ పట్టించుకోని ఈ తెలంగాణ యోధుడిని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సోనియా గాంధీ సహించని పీవీ జయంతిని తెలంగాణ పండుగలా కేసీఆర్ నిర్వహించం   ద్వారా కాంగ్రెస్ ను డిఫెన్స్ లోకి నెట్టేయబోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తమ పార్టీకే చెందిన పీవీ జయంతిని చేస్తుందా? చేయకపోతే ఆ పార్టీపై విమర్శలు.. చేస్తే సోనియాతో ఇబ్బందులు.. ఇలా రాష్ట్ర కాంగ్రెస్ నే కాదు.. జాతీయ కాంగ్రెస్ ను కూడా పీవీ అస్త్రంతో కొట్టబోతున్నాడు కేసీఆర్. మోడీ, రాష్ట్రపతి వద్దకూ ఈ ఇష్యూని తీసుకెళితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను ఇరుకునపెట్టొచ్చు.  పీవీ చరిత్ర తవ్వితే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న స్ట్రాటజీతోనే పీవీకి భారతరత్న డిమాండ్ ను కేసీఆర్ తెచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-నరేశ్ ఎన్నం

జగన్ ని తొక్కేయడానికి బాబు, లోకేష్ ల కుట్ర.!

Lokesh-CBN-ysjagan-oktelugu
Lokesh-CBN-ysjagan-oktelugu

ప్రజల మంచి గురించి 5శాతం ఆలోచించే చంద్రబాబు…95 శాతం తన ఎదుగుదల, పార్టీ పటిష్టత గురించి ఆలోచిస్తాడు. ఆవగింజంత సాయం చేసి దానికి తాటి కాయంత ప్రచారం కోరుకుంటారు. ప్రచార ఆర్భాటం కోసం వందల కోట్లు ఖర్చుబెట్టే ఘనుడు. సగం కూడా పూర్తికానీ, పోలవరం ప్రాజెక్ట్ నేను కట్టేసేశాను… చూడండి అని బస్సులతో ప్రజల్ని తరలించిన ముఖ్యమంత్రి చరిత్రలో మరొకడు కానరాడేమో. అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా…అనుకూల పత్రికల ద్వారా భజన చేయించుకోవడం ఏళ్లుగా అలవాటు పడిన వ్యవహారం. కుటిల రాజకీయాలలో దార్శనికుడు అయిన ఈ మేధావి,  దశాబ్దాలుగా అనుకూల మీడియా రాతలతో ప్రజల్ని మభ్య పెడుతూ వస్తున్నాడు. మంచి చేయకపోయినా, మీడియా సపోర్ట్ తో ఎదగవచ్చనే నీతి తెలిసిన మొదటి రాజకీయ నాయకుడు బహుశా చంద్రబాబు నాయుడే అయ్యుండాలి.

సదరు పత్రికాధిపతులకు ఇవ్వాల్సింది ఇస్తుంటే.. ఈయనకు కావలసింది రాస్తూ ఉంటారు. అధికారంలో ఉంటే బాబు భజన, ప్రతిపక్షంలో ఉంటే అవాస్తవాలు వడ్డించడం సదరు పత్రికల ఎజెండా ఉంటుంది. గత ఏడాదిగా మనం చూస్తున్నది అదే.  నిరాధారణమైన రాతలతో రెచ్చిపోతుంటే చేసేదేమి లేక, న్యాయ పోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నాలుగేళ్లలో ఎన్నికలు ఉండగా ఎలాగైనా అధికార పార్టీ అధినేతపై ప్రజల్లో అసమర్థుడు, అవినీతి పరుడు అనే అభిప్రాయం తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు బాబు పాలనాదక్షుడని, ఆయన కొడుకు లోకేష్ అమాయకంగా కనిపించే అపర మేధావి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లోకేష్ పెట్టిన వంటలు మెచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు పెడతాం అని ముందుకు వచ్చిన పెట్టుబడిదారులు… అని రాసిన ఘనత ఆ పత్రికల సొంతం.

ఇక మీడియా సహకారంతోనే వచ్చే ఎన్నికలో గెలవాలని బాబు, లోకేష్ టార్గెట్ పెట్టుకున్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాపై విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో  జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చెయ్యడానికి, బాబు,లోకేష్ ఇమేజ్ పైకెత్తడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. విజయవాడ, గుంటూరు మరియు హైదరాబాద్ వేదికలుగా పనిచేసే ఈ టీంలు ఇప్పటికే అనేక వెబ్సైట్స్ స్థాపించి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియా విభాగాలు జగన్ వ్యతిరేక పోస్ట్స్ మరియు నెగెటివ్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నాయి. ఇక ఎప్పటి నుండో పాతుకుపోయిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఉండనే ఉంది. ఇలా మీడియా రాతల భ్రమలో పడేసి, ప్రజల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. మరి వీరి వ్యూహాలను జగన్ ఎలా తిప్పికొడతాడో చూడాలి.

ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి

Government Banks in India
Government Banks in India

ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి

ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రచార మాధ్యమాలు, వినియోగదారులు చివరకి యజమాని అయిన ప్రభుత్వం కూడా అవకాశం దొరికితే ప్రభుత్వరంగ బ్యాంకుల మీద ఒంటికాలితో లేవటం సర్వసాధారణం. కానీ అవి ఎదుర్కుంటున్న సవాళ్ళ గురించి , సామాజిక, ఆర్ధిక పరివర్తనలో వాటి పాత్ర గురించి ఎవరూ మాట్లాడరు. చివరకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలో వున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు విలీనాలు  సమస్యకు పరిష్కారంగా చూపటం తెలిసిందే. అదే ఇప్పుడు ప్రైవేటీకరణ పరిష్కారమని చెప్పటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తూంది. ఇందులో నిజానిజాలు , అసలు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అసలు సమస్యలు పక్కదారిపట్టే ప్రయత్నం

మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుతం 12 బ్యాంకులు గా మిగిలాయి. ఇందులో ఆరు బ్యాంకులు విలీనం బారినపడకుండా మిగిలిపోయినవే వున్నాయి. వీటిల్లో కొన్ని నిర్దిష్ట సూత్రాలను పక్కనపెట్టి ఎడాపెడా రుణాలు మంజూరు చేయటంతో 20నుంచి 25 శాతం నిరర్ధక అస్తులతో కునారిల్లుతున్నవే. వీటిని ప్రైవేటీకరణ చెయ్యాలన్నా కొనే వారు దొరక్కపోవచ్చు.ఇది కూడా ఇంకో ఎయిర్ ఇండియా ప్రహసనం లాగే మిగిలిపోవటం ఖాయం. మొత్తం మీద ఈ విలీనప్రక్రియలో నష్టపోయింది తెలుగు రాష్ట్రాలే. విలీనాలకు ముందు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ , ఆంధ్ర బ్యాంకులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేవి. ఇప్పుడు బ్యాంకింగ్ రంగం లో హైదరాబాద్ పేరు కనుమరుగయ్యింది. నిజాం స్థాపించిన స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ , ప్రముఖ స్వాతంత్ర యోధుడు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్ర బ్యాంకు పేర్లు చరిత్రలో సమాధి అయిపోయాయి. విశేషమేమంటే దేశంలోని అన్ని మెట్రోల్లో బ్యాంకు ప్రధాన కార్యాలయాలు వున్నాయి ఒక్క హైదరాబాద్ లో తప్ప. బెంగుళూరు తో సరిసమానంగా అభివృద్ధిలో పోటీపడుతున్న హైదరాబాద్ లో ఒక్క బ్యాంకు ప్రధాన కార్యాలయం లేకపోవటం శోచనీయం.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సమస్యలకు విలీనమో, ప్రైవేటీకరణమో పరిష్కారమయితే ఆనందంగా ఒప్పుకోవచ్చు. మరి ప్రైవేటు బ్యాంకు ఎస్ బ్యాంకు, పిఎంసి బ్యాంకు సంక్షోభానికి ఏమి కారణం? కాబట్టి, బ్యాంకులు ఎదుర్కుంటున్న సమస్యలకు పక్కదారి పట్టించే పరిష్కారాల కన్నా లోతుగా విశ్లేషించి పరిష్కారమార్గాలు కనుక్కోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. యజమాని తరఫున  ప్రభుత్వ డైరెక్టర్ , నియంత్రణను పర్యవేక్షించే రిజర్వు బ్యాంకు డైరెక్టర్ ప్రభుత్వరంగ బ్యాంకు బోర్డులో ప్రత్యక్షంగా హాజరు అవుతున్నప్పుడు వైఫల్యాలపై ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకు కి బాధ్యతలేదా? ప్రైవేటు బ్యాంకులపై రిజర్వు బ్యాంకు పర్యవేక్షణ వున్నప్పుడు అక్కడ వైఫల్యాలకు కారణాలేమిటి? కాబట్టి ఎవరు యజమాని అనే విషయం కన్నా ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారనేది ముఖ్యం.

ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కుంటున్న సవాళ్లేమిటి?

మార్కెట్ లో క్రమక్రమేణా ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా తగ్గి ప్రైవేటు బ్యాంకుల వాటా పెరుగుతున్నమాట వాస్తవం. అందులో దాపరికమేమీ లేదు. అయితే దానికి కారణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ప్రైవేటురంగంలో ఎంత ఆర్ధిక నైపుణ్యమున్న వారు వున్నారో ప్రభుత్వరంగంలో వారికన్నా ఎక్కువ సమర్ధులకు కొదవలేదు. ఎందుకంటే ఇక్కడివారే అక్కడకు వెళ్లి బ్యాంకులను వున్నత స్థానాలకు తీసుకెళ్ళారు. కాబట్టి అది సమస్యకాదు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిపాలనలో, నిర్ణయాల్లో రాజకీయనాయకుల జోక్యం, ప్రభుత్వ అధికారుల ప్రభావం బహిరంగ రహస్యమే. రుణ వితరణలో దీనివలన దుష్ఫలితాలు బ్యాంకులకు భారంగా మారటం కూడా బహిరంగ రహస్యమే. తీసుకున్న రుణాలు ఎగవేయటం, కంపెనీలు దివాలా తీసినా వీటి అధిపతులు సంపదను పోగేసుకోవటం కూడా బహిరంగ రహస్యమే. ఇంతవరకూ ఎంతమంది ఆర్ధిక నేరస్థులు శిక్షలనుభవిస్తున్నారు? సమస్యల్లా ఇక్కడేవుంది. ఒకవేళ వాళ్ళపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినా దాని విచారణ పూర్తికావటానికి జీవితకాలం పడుతుంది. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఎంతయినా వుంది. ఆర్ధిక నేరస్థులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో నిర్దిష్ట కాలపరిమితిలోగా విచారణ జరపాలి. అందుకనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. దివాలా కోరు చట్టం ద్వారా కేసు పరిష్కారంలో కొంత పురోగతి వున్నా, ఆర్ధిక నేరగాళ్ళను శిక్షదాకా తీసుకెళ్లటంలో మన వ్యవస్థ వెనకబడి వుంది.

ప్రభుత్వరంగ బ్యాంకులు సామాజిక బాధ్యతను భుజాన వేసుకొని ప్రభుత్వ భారాన్ని తాము మోయటం కూడా ఓ ప్రధాన కారణం. ప్రైవేటు బ్యాంకులు లాభార్జనే ప్రధాన  ధ్యేయంగా పనిచేస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు వెనకబడిన ప్రాంతాల్లో, కుగ్రామాల్లో కూడా శాఖలు తెరిచి సేవ చేయటం తెలిసిందే. మరి ఈపని ప్రైవేటురంగ బ్యాంకులు చేయటం  లేదుకదా. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తో కలిసి  రుణ వితరణ ప్రణాళికలు తయారుచేసి అమలుచేయటంలో ప్రధాన భూమిక ప్రభుత్వరంగ బ్యాంకులు చేస్తున్నాయి. మరి ఈపని ప్రైవేటురంగ బ్యాంకులు చేయవు కదా. ఉదాహరణకు వీధి వ్యాపారస్తులకు యాభై లక్షల మందికి పదివేల రూపాయల  చొప్పున రుణాలు ఇవ్వాలని ఇటీవల ప్రకటించిన పేకేజీ అమలుచేసేది ప్రభుత్వరంగ బ్యాంకులే కదా. ఇవి చేసే పనిని కొలవటానికి సరైన సాధనాలు లేవు. బ్యాంకుల పనితీరుని మదింపు చేయటానికి లాభమొక్కటే లెక్కతీసుకుంటే ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులతో సరితూగలేవు. ఎందుకంటే దీని మానవ వనరులను ప్రాధమిక బ్యాంకు పనికే కాకుండా మిగతా సామాజిక లక్ష్యాలకు వాడుకోవటం జరుగుతోంది. ప్రభుత్వ లక్ష్యాల కనుగుణంగా షుమారు 35 కోట్ల జన ధన ఖాతాలను తెరవటం జరిగింది. ఇవి వాణిజ్య లక్ష్యాలతో ముడిపెడితే లాభసాటి కాకపోవచ్చు. సామాజిక లక్ష్యాలతో ముడిపెడితే ఎంతో లాభం. ప్రైవేటు బ్యాంకులు వచ్చిన లాభాలతో సాంకేతికతను అభివృద్ధి చేసుకొని పనివిధానాన్ని మెరుగుపరుచుకోగలిగితే పరిమిత వనరుల్ని ఉపయోగించుకొని ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకొని పోటీలో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తుంది.

ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రైవేటు బ్యాంకులకు సమతుల్య పోలిక లేదు. ప్రభుత్వరంగ సిబ్బంది జీతభత్యాలకు ప్రైవేటు బ్యాంకుల జీతభత్యాలకు హస్తిమసికాంతం తేడా వుంది. వేతన పోలిక లేకపోగా రోజువారీ నిర్ణయాల్లో భయం భయంగా పనిచేయాల్సి వుంది. ఏ  మాత్రం చిన్న తప్పుజరిగినా ప్రభుత్వ నిఘా సంస్థల నియంత్రణలోకి వెళ్ళాల్సి వస్తుందనే భయం వెంటాడుతుంది. ప్రైవేటు బ్యాంకుల్లో ఆ భయం లేదు. అవసరమైన చోట రిస్కు తీసుకునే స్వాతంత్రం వాళ్ళకు వుంది. వివిధ సందర్భాల్లో ఆర్దికమంత్రులు అటువంటి భయం అవసరం లేదని హామీలు ఇస్తూ వచ్చినా ఆచరణలో వీరి అనుభవం వేరేలా వుంది. ఇటీవలికాలంలో కొన్నిమార్పులు జరిగినా ఇప్పటికీ ఆ కత్తి మెడ పై వేలాడుతూనేవుందనే భయం అధికారులలో పోలేదు. అదేసమయంలో విజయ మాల్యాలు, నీరవ్ మోడీలు లాంటి మోసగాళ్ళకు సహకరించే వాళ్లకు తీవ్ర శిక్షలు వుండాల్సిందే. కాకపోతే దాన్నడ్డం పెట్టుకొని ప్రభుత్వ నియంత్రణ పెరిగేకొద్దీ వాణిజ్య నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది. దీన్ని సున్నితంగా, సమర్ధవంతంగా నిర్వహించవలసి వుంది.

ఇకపోతే రాజకీయపార్టీలు రుణ మాఫీ పేరుతో ఇచ్చే వాగ్దానాలు ప్రభుత్వరంగ బ్యాంకుల్ని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది. రుణ వసూలు వాతావరణం ఇటీవలికాలంలో పూర్తిగా దెబ్బతింది. రిజర్వు బ్యాంకు ఎన్నోసార్లు హెచ్చరించినా ఈ విధానం మారలేదు. ప్రభుత్వం ఆర్ధికంగా దెబ్బతిన్న ప్రజలకు ఉపశమనం కల్గించటం తప్పుకాదు అయితే అది బ్యాంకుల ఆర్దికమూలాలపై దెబ్బతీసే విధంగా వుండకూడదు. రుణ వసూలు క్రమ శిక్షణకు భంగం కలగ కూడదు. ఇది ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే రాను రాను ప్రభుత్వ చర్యలు బ్యాంకుల పనితీరుని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలును మెల్లి మెల్లిగా బ్యాంకులపై మోపుతుంది. దీనితో బ్యాంకులు వాటి ప్రాధమిక బ్యాంకింగ్ కార్యకలాపాలకు సమయం వెచ్చించ లేకపోతున్నాయి. గ్రామీణ, పట్టణ బ్యాంకుల్లో ఈ పనిభారం పెరగటం వలన బ్యాంకు సిబ్బంది సాధారణ బ్యాంకు కార్యకలాపాలు నిర్వర్తించలేకపోతున్నారు. ఇవి మరో ప్రభుత్వ కార్యాలయాలుగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ఇటీవలికాలంలో చేపట్టిన సంస్కరణలు

ఇటీవలికాలంలో ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఎన్నో సంస్కరణలు అమలుచేసింది. ఇన్ని సవాళ్లు, ఇబ్బందుల్లో కూడా ప్రభుత్వరంగ బ్యాంకులు సంస్కరణల నేపధ్యంలో ఎంతో మెరుగైన పనితీరుని కనబర్చాయి. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నియామకాలన్నీ బ్యాంకు బోర్డు బ్యూరో ని ఏర్పరిచి దానిద్వారా చేపట్టింది. ఇందులో ప్రభుత్వ అధికారులు కన్నా నిపుణులే ఎక్కువమంది వున్నారు. నిరర్ధక ఆస్తుల గుర్తింపు ప్రక్రియను మరింత పకడ్బందీగా, పారదర్శకంగా చేయగలిగారు. రుణ ప్రతిపాదన మదింపు ప్రక్రియను మెరుగుపర్చారు. కావాలని ఎగ్గొట్టిన వారి జాబితాదారులను గుర్తించటంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు రుణ వితరణ ఆపివేయటంలో తప్పనిసరి పద్ధతుల్ని తీసుకొచ్చారు. సాంకేతికతను అభివృద్దిచేసి విరివిగా వాడుకలోకి తీసుకురావటం, డిజిటల్ మౌలిక సదుపాయాల్ని, రుణ వితరణను అమలుచేయటంతో పోటీ మార్కెట్లో మరింత మెరుగైన ఫలితాల్ని సాధించగలుగుతున్నారు.

నిరర్ధక ఆస్తుల్ని తగ్గించుకోవటం లో ఇటీవలి కాలంలో మంచి పురోగతిని సాధించగలిగారు. గత సంవత్సరంతో పోలిస్తే 14.6 శాతం నుంచి సెప్టెంబర్ 2019 కి 11.6 శాతానికి తగ్గించుకోగలిగారు. అదే నికర నిరర్ధక ఆస్తుల విషయం లో 8 శాతాన్నుంచి 4.8 శాతానికి తగ్గించుకోగాలిగారు. మొత్తం అప్పుల్లో 53 శాతం 5 కోట్ల రూపాయల పైబడిన పెద్ద అప్పుదారులవే. నిరర్ధక ఆస్తుల్లోనయితే  82 శాతం వారివేనని గమనించాలి. అదేవిధంగా బ్యాంకుల నిర్వహణ లాభాలు కూడా పెరిగాయి. అదేసమయంలో కొత్తగా నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరే జాబితా తగ్గింది. 2 సంవత్సరాల తర్వాత లాభాల బాటలో పయనించాయి. దివాలాకోరు చట్టం అమలుతో రుణ వసూళ్ళ వాతావరణం మెరుగుపడింది. ప్రభుత్వ మూలపెట్టుబడి నిధుల సహాయం కూడా ప్రభుత్వ బ్యాంకుల ఆర్దికపరిస్థితి మెరుగుపడటానికి దోహదపడింది. రిజర్వు బ్యాంకు  ఇటీవలే కార్పోరేట్ గవర్నెన్స్ మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. వీటితోపాటు ప్రభుత్వం ఇప్పటికే ఈజ్ ఇండెక్స్ ని, క్లీన్ బ్యాంకింగ్ సంస్కరణలను, స్మార్ట్ బ్యాంకింగ్ పనివిధానాన్ని అమలుచేయటం తో ప్రభుత్వరంగ బ్యాంకుల పనివిధానం మెరుగుపడింది.

అయితే కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపధ్యంలో ఏర్పడిన ఆర్ధిక మాంద్యంతో తిరిగి నిరర్ధక ఆస్తులు పెరిగే ప్రమాదం మెండుగా వుంది.  నిధుల లభ్యత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా రుణ వితరణ సజావుగా సాగటం గగనమే. కొన్ని పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తుల జాబితాకు అదనంగా చేరే అవకాశాలే మెండుగా వున్నాయి. ఆటో రంగం, హోటల్, పర్యాటక రంగాలు కుదేలుమనటంతో ఆ రుణాల చెల్లింపు వాయిదాలు బ్యాంకులకు వచ్చే అవకాశాలు లేవు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థ అధిక ఒత్తిడిలో వుంది. ప్రభుత్వం ప్రకటించిన 90వేల కోట్లు పంపిణీ సంస్థలు వాడుకున్నా అవి ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితి లేదు. దానితో విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు బ్యాంకులకు చెల్లించాల్సిన కిస్తీలు సకాలంలో చెల్లించటంలో ఇబ్బందు లేర్పడే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇలా ప్రతిరంగం ఒడిదుడుకుల్లో ఉండటంతో బ్యాంకుల ఆర్ధిక పరిస్థితి తిరిగి ఇబ్బందుల్లో పడబోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతికూల వాతావరణంలో పనిచేయాల్సివస్తుంది.

ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటుపరం కాబోతున్నాయా?

ప్రభుత్వ ఆర్ధిక సలహాదారు సుబ్రహమణ్యం మాటల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విలీనాలు ఇంకా కొనసాగుతాయని సెలవిచ్చాడు. అలాగే ప్రైవేటీకరణపై కూడా పరోక్షంగా సంకేతాలిచ్చాడు. కొన్ని బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ఆలోచన ప్రభుత్వానికి వున్నట్లు తెలుస్తుంది. అందరూ అనుకుంటున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ జనాభిప్రాయానికి వెరచో, యూనియన్ల ఒత్తిడికి భయపడో ప్రభుత్వం వెనకాడటం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వ అవసరాలను తీరుస్తున్నాయి కాబట్టే కొనసాగ్గిస్తున్నారు. లేకపోతే ఎప్పుడో ఆ పనికి తెరతీసేవారు. ప్రభుత్వరంగ బ్యాంకులు లేకపోతే ప్రభుత్వ ఆర్ధిక , సామాజిక లక్ష్యాలు నెరవేరటం కష్టం కాబట్టే అందుకు పూనుకోవటం లేదనేది వాస్తవం. కాకపోతే బాగా నష్టాల్లో వున్న బ్యాంకుల్ని వదిలించుకోవాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. అంటే పాలు ఇచ్చినంతవరకు ఆవుని వుంచుకొని తర్వాత అమ్మేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనుకోవాలి. అసలు సమస్య యాజమాన్యం కాదు యాజమాన్య పద్ధతులని ప్రభుత్వం గ్రహించాలి.

 

పవన్ కళ్యాణ్ పై జగన్ సైన్యం ఎదురుదాడి!

పవన్ కళ్యాణ్ ఇటీవల కాపులకి సంబంధించిన రెండు విషయాలపై ట్విట్టర్ లో స్పందించటం వివాదాస్పద మయ్యింది. అవి ఒకటి, కాపు సంక్షేమం కోసం గత 13 నెలల్లో రూ.4770 కోట్లు ఖర్చుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించటంపై, రెండోది, కాపు రిజర్వేషన్ల అంశంపై. దానికి ప్రతిగా వై ఎస్ ఆర్ పార్టీ మొత్తం ఆ పార్టీ లోని కాపు నాయకుల్ని రంగంలోకి దింపింది. అంటే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కాపు కులానికి సంబంధించిన వాడు కాబట్టి కాపు కుల నాయకులతోనే తిట్టించాలి. ఇది అదివరకు చంద్రబాబు నాయుడు చేసాడు, ఇప్పుడు జగన్ చేస్తున్నాడు. ఆరోజు చంద్రబాబు నాయుడు ఇలా కులంలో చిచ్చు పెట్టటాన్ని జగన్ తప్పు పట్టాడు. ఇప్పుడు అదే అస్త్రాన్ని తనూ వాడుతున్నాడు. అంటే అటు చంద్రబాబు నాయుడు కైనా ఇటు జగన్ కైనా కాపుల్ని ఎలా తికమకల్లో పెట్టాలనే విషయంలో ఒకే ఆలోచన, ఒకే దారి. పవన్ కళ్యాణ్ అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఆయన అట్లా ఇట్లా అని ఎదురుదాడి చేయటం చూస్తుంటే పవన్ కళ్యాణ్ అడిగినదాంట్లో నిజముందనిపిస్తుంది. లేకపోతే ఇంత గాభరా ఎందుకు పడుతున్నారనే సందేహం కలుగుతుంది? అసలు విషయమేమిటో చూద్దాం.

ముందుగా జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న కాపు సంక్షేమాన్ని గురించి పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యం లోని గత ప్రభుత్వం కాపులను మచ్చిక చేసుకోవటానికి కాపు కార్పోరేషన్ ని ఏర్పాటు చేసింది. సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల చొప్పున వాళ్ళ సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పింది. 2019 ఎన్నికల్లో జగన్ ఇంకొంచెం ముందుకెళ్ళి సంవత్సరానికి 2 వేల కోట్ల రూపాయల చొప్పున అయిదు సంవత్సరాల్లో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పాడు. మరి జరిగిందేమిటి? జగన్ ప్రభుత్వం సంవత్సరం లో 2 వేలేమిటి ఖర్మ ఏకంగా 4 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేసినట్లు ప్రకటన ఇచ్చుకుంది. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కాపు కార్పొరేషన్ కి ఇస్తామన్న 2 వేల కోట్లు ప్రత్యేకమా కాదా అని ప్రశ్నించాడు. అంటే ప్రభుత్వం అందరికోసం ప్రకటించిన సంక్షేమ పధకాలకు ఇది అదనమా లేక ఆ సంక్షేమ పధకాల్లో భాగమా అని సందేహం వెలిబుచ్చి వివరణ అడిగాడు. వీటిపై ఒక శ్వేత పత్రం ప్రకటించమని కోరాడు. అలాగే కాపు నేస్తం పధకం లబ్దిదారులు కేవలం 2.35 లక్షలమంది మాత్రమే నని ప్రకటించటం పై సందేహం వెలిబుచ్చాడు. వీటికి సూటిగా సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయటం , అదీ ఆ పార్టీ లోని కాపు నాయకులచేత తిట్టించటం జగన్ కి నష్టం తప్పితే లాభం కాదు. కాపు జనాభా రాష్ట్రంలోనే అత్యధికమని సామాజిక గణాంకాలు చెబుతుంటే ,45-60 సంవత్సరాల మధ్య కాపు స్త్రీలు రాష్ట్రం మొత్తం మీద కేవలం 2.35 లక్షలు మాత్రమేనని చెప్పటం ఎవరికైనా సందేహం కలగక మానదు. మీ లెక్కలు ఎంత శాస్త్రీయమో వివరించాల్సింది పోయి తిట్ల దండకం మొదలుపెట్టటం లోనే మీ ప్రతిస్పందనలోని డొల్ల తనం తెలుస్తుంది.ఇకపోతే కాపు కార్పొరేషన్ కి నిధులు సాధారణ పధకాలతో సంబంధం లేకుండా కేటాయించాలి. అంతేగాని అందరి ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పధకాల్ని కలిపి మీకు 4770 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పటం కాపుల్ని మోసం చేయటమేకదా. కాపు కార్పోరేషన్ కి కేటాయించిన, ఖర్చుచేసిన ప్రత్యేక నిధులు, సంక్షేమ పధకాలు చెప్పమంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం తరఫున అడుగుతున్నాడని చెప్పటం సమస్యను పక్కదారి మళ్ళించి జవాబు దాటవేయటమే. ఇప్పటికైనా జవాబు ఇవ్వండి. లేకపోతే వై ఎస్ ఆర్ పార్టీలోని కాపు నాయకులు  జగన్ ని కాపుకాయటం కోసం కాపుల్ని మోసం చేసినట్లే అవుతుంది.

ఇక రెండో విషయానికొద్దాం. కాపు రిజర్వేషన్లకు సంబంధించినది. అందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేమిటో అర్ధంకావటం లేదు. కాపు రిజర్వేషన్లపై క్లుప్తంగా జరిగిన చరిత్రని ఏకరువు పెట్టి 2019 ఎన్నికలముందు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు కేటాయిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయమని కోరారు. ఇందులో తప్పేముంది? ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో వివరించాల్సింది పోయి బిసి రిజర్వేషన్ చరిత్రను దీనికి లింక్ చేసి మాట్లాడటం కాపుల్ని అయోమయానికి గురిచేయటమే. బిసి రిజర్వేషన్ సాధ్యంకానప్పుడు ఇబిసి లో ఈ 5 శాతం ఎందుకు సాధ్యం కాదో చెప్పకుండా సమస్యను పక్కదారి పట్టించటం చూస్తుంటే జగన్ కి ఈ రిజర్వేషన్ ఇవ్వటం ఇష్టం లేదని అర్ధమవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పులేదు.

ఇక వై ఎస్ ఆర్ పి ఎదురుదాడిలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కాపుల తరఫున ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించే  హక్కు మీకుంది, కాదనటంలేదు. కాకపోతే దానికి దీనికి ముడి పెట్టటమేమిటి? పవన్ కళ్యాణ్ ఈ విషయం లో మొదట్నుంచీ స్పష్టత లో వున్నాడు. తనని ఒక కులానికి ఆపాదించవద్దని తను అందరివాడనని చెప్పాడు. ఇప్పుడు కూడా కాపు కులం తరఫున మాట్లాడుతున్నానని చెప్పలేదు. కాపు కులస్థుల విషయంలో చేసిన వాగ్దానాలు, ప్రస్తుత అమలు పై మాట్లాడితే తప్పేలా అవుతుంది. ఎస్ సి, ఎస్ టి , బిసి             కార్పోరేషన్ నిధులపై అవక తవకలు జరిగితే అందరూ మాట్లాడతారు. ఇదీ అంతే. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తే సమస్యను పక్కదారి మళ్లించటం, పార్టీలోని కాపు నాయకులచేత తిట్టించటం చూస్తుంటే చంద్రబాబు నాయుడు చేసినపనే జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నాడని అందరికీ అర్ధమవుతుంది. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ రెండు విషయాల్లో తెలుగుదేశం తరఫున మాట్లాడినట్లు ఎలా అవుతుంది? అంటే ప్రభుత్వం చేసే పనుల్ని ఎత్తిచూపితే తెలుగుదేశాన్ని సమర్ధించినట్లా? అంటే ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెలుగుదేశానికి మాత్రమే వుందని జగన్-చంద్రబాబు రహస్య ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా అని ముక్కున వేలేసుకోవటం ప్రజల వంతయ్యింది. వై ఎస్ ఆర్ పి లోని కాపు నాయకులు  ఉన్నదీ లేనిదీ కల్పించి పవన్ కళ్యాణ్ పై ఇలా బురదచల్లటం అదీ ఎవరిమెప్పుకోసమో ఇలా చేయటం కాపుల్లో ఆలోచనని రేపుతుంది. చంద్రబాబైనా , జగన్ మోహన్ రెడ్డయినా మాకు చేసిందేమీలేదు అనే నిర్ధారణకు కాపులు వచ్చినరోజు మూడో ప్రత్యామ్నాయం ఆంధ్ర రాజకీయాల్లో రావటం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు లాగా ఇటువంటి కుటిల రాజకీయాలు చేస్తే జరిగేది అదే. ఇంకా నాలుగు సంవత్సరాలు టైముంది. ఇప్పటికైనా కాపుల విషయంలో నిజాయితీ రాజకీయాలు చేస్తే మంచిది. లేకపోతే వాళ్ళలో తిరుగుబాటు తప్పదు. అప్పుడు ఈ రెండు పార్టీల్లోని కాపు నాయకులు వాళ్ళను కాపాడలేరు. అది గమనించి మసులుకుంటే మంచిది.

బాలయ్య  ఎంత బాధ పడి ఉంటారో ? 

balayya-rgv
balayya-rgv
వివాదాస్పద కామెంట్స్ తో ఏదొక రకంగా దర్శకుడిగా నెట్టుకొస్తోన్న  రాంగోపాల్ వర్మ  మళ్లీ పేలారు.  బాలయ్య గళం పై వర్మ కామెడీ చేశారు.  బాలయ్య ఆ మధ్య పాట పాడిన యవ్వారం తెలిసిందే. అయితే బాలయ్య పాడిన పాట పై మీ అభిప్రాయం ఏంటి? అని ‘జీవి కానీ ఆర్జీవీ’ని  అడిగితే.. తనదైన శైలిలో రెచ్చిపోతూ.. ‘ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. సింగింగ్ కని బెట్టిన తర్వాత ప్రపంచ చరిత్రలో నేను చూసిన అత్యుత్తమమైన గాయకుడు బాలయ్య బాబు’ అంటూ ఎంత ఎగతాళి చేయాలో అంతకన్నా ఎక్కువ వెటకారం చేసేశాడు వర్మ.
 
మరి నటసింహ నందమూరి బాలకృష్ణ  తన 60వ జన్మదినం సందర్భంగా  ప్రేక్షకాభిమానులను అలరించడానికి పాడిన పాట పై  వర్మ  కామెంట్స్ బాలయ్యకు  చేరితే ఆయన ఎలా స్పందిస్తారో..  బాలయ్య అభిమానులు మాత్రం ఆయన పాడిన పాటను బాగానే ఎంజాయ్ చేశారు.
 
ఏమైనా బాలయ్య  సినిమాలతో పాటు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గ పనులతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్విర్తిస్తూ బిజీ బిజీగా ఉంటూ ఒక పాట పాడితే వర్మ లాంటి వాళ్లు ఇలా కామెంట్స్ చేస్తే బాలయ్య మనసు ఎంత బాధ పడుతుంది. పాపం బాలయ్య. 

దేశాన్ని నిలబెట్టిన తెలుగు తేజం.. పీవీ

P-V-Narsimha-Rao-oktelugu
P-V-Narsimha-Rao-oktelugu
ప్రముఖ రాజనీతిజ్ఞుడు, బహు  భాషా కోవిదుడు,  దక్షిణాది రాష్ట్రాల నుండి ఎన్నికైన తొలి భారత ప్రధాని, గొప్ప సంస్కరణ అభిలాషి  కీ.శే. పి.వి.నరసింహారావు.  గొప్ప పండితుడు. వేయిపడగల్ని  హిందీలోకి  అనువదించాడు.
భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
*తొలి జీవితం
ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసారు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందారు.
*రాష్ట్ర రాజకీయాల్లో పీవీ
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు.
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.
*ముఖ్యమంత్రిగా
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నారు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన .
*కేంద్ర రాజకీయాల్లో పీవీ
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం
మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 – 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.
*ప్రధానమంత్రిగా పీవీ
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.
పీవీ విజయాలు
పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
కాశ్మీరు తివ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు .
*పీవీపై విమర్శ
పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.
1994 లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ( ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరినే దగ్గిరికి దరిచేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని లబ్దిపొందుతారని ఆయన భయం. అయితే ఎవరిని నొప్పించే స్వభావం కానందువల్ల ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది)
*సాహితీ కృషి
రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది.
.*పీవీ విశిష్టత
బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకా గతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన. పీవీ చివరిరోజుల్లో ఒకసారి ఆయన్ను కలిశాను.
తన బాల్యమిత్రుడు సుప్రసిద్ధ కవి కాళోజీ నారాయణరావు కు పద్మభూషణ్ ఇప్పించినప్పుడు ఇబ్బందికర సన్నివేశం ఏర్పడింది. కమ్యూనిస్టులతో సన్నిహితంగా ఉంటున్న కాళోజీ అది స్వీకరించడానికి తటపటాయిస్తే పి.వి. పట్టుబట్టి ఒప్పించారు.
పి.వి. ని గ్రామాలలో దొర అనేవారు. ఆయన దేశ్ ముఖ్ . ఎన్నో ఎకరాల ఆస్తి సాగులేకుండా వృధాగా పడుండేది
తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని ఆయనపై నంద్యాల పార్లమెంట్ సీటు ఎన్నికలలో ఎన్.టి.రామారావు పోటీ పెట్టలేదు.

పవన్ సినిమా కోసం ఫిల్మ్ సిటీలో.. !

Vakeelsab-movie

Vakeelsab-movie

కరోనా మహమ్మారి లేకుండా ఉండి ఉంటే ఈ పాటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తయిపోయి రిలీజ్ అయిపోయి ఉండేది. కానీ లాక్ డౌన్ కారణంగా 80 శాతం వద్ద ఈ సినిమా షూటింగ్ దగ్గరే ఆగిపోవడం పవన్ ఫ్యాన్స్ నిరాశే. లాక్ డౌన్ ముగియగానే షూట్ తిరిగి మొదలుపెట్టాలని టీమ్ ప్లాన్ చేస్తోన్నా.. పవర్ స్టార్ షూట్ కి వచ్చే పరిస్థితి కనబడటం లేదు.

అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా కోర్టు సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన షూటింగ్ మొత్తం ఫిల్మ్ సిటీలోనే పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమా ఓ ఫైట్ మీద ఓపెన్ అవుతుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనబడనున్న తొలి సీన్ ఫైట్‌ కావడం పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అంశం. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట.

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ లో చాలానే మార్పులు చేశారని.. ముఖ్యంగా పవన్ కోసం యాక్షన్ సాంగ్స్ యాడ్ చేశారని సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవర్ స్టార్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు.

సమర్థవంతంగా పనిచేయని మంత్రులపై వేటు?


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావడంతో మన పాలన – మీ సలహా పేరుతో ప్రజల నుంచి సలహాలు స్వీకరించారు. తాజాగా జగన్ తన మంత్రి వర్గం దృష్టి పెట్టారు. మంత్రి వర్గంలో మంత్రులు పనితీరుపై రూపొందించిన నివేదికల ఆధారంగా మంత్రుల పనితీరును విశ్లేషించే పనిలో పడ్డారు. మంత్రి వర్గంలో ఎక్కువ మంది పనితీరు సీఎం జగన్ ఆశించిన స్థాయిలో లేదని నివేదికల ఆధారంగా స్పష్టం అయినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఏడాది కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చురగొంది. మరికొన్ని నిర్ణయాలను తీసుకోవడం ప్రజల మెప్పు పొందింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం మరికొన్ని సాహసోపేత నిర్ణయాలను వైసీపీ ప్రభుత్వం తీసుకోవటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ అనేక అంశాలపై ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ ఎదుర్కోవడంలో వైసీపీ మంత్రులు విఫలమయ్యారని వాదనలు ఉన్నాయి.

పవన్ మౌనం.. పార్టీని దెబ్బతీస్తుందా?

అయితే మంత్రులు ప్రతిపక్ష పార్టీ టీడీపీని ఎదుర్కోవడం, వారి శాఖలపై సాధించిన పట్టు, వారి జిల్లాలో సమర్ధవంతంగా పనిచేయడం ఆధారంగా వీరి పనితీరు అంచనా వేశారు. సీఎం జగన్ వద్ద ఉన్న నివేధిక ఆధారంగా మంత్రివర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారిలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. సరైన పనితీరు లేనివారిలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఉన్నట్లు సమాచారం.

మరోవైపు రాష్ట్ర మంత్రివర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు ఎన్నిక అవడంతో వారి స్థానాలు ఖాళీ అవనున్నాయి. మరో రెండు రోజుల్లో వీరు తమ రాజీనామాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమించే క్రమంలో పనితీరు సక్రమంగా లేనివారిపైన వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. తొలుత రెండున్నర ఏళ్లకు మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తానని సీఎం జగన్ ప్రకటించారు. అయితే అనుకోకుండా మంత్రి వర్గంలోకి కొత్తవారికి తీసుకోవాల్సి వచ్చింది.

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?

మంత్రి వర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది. ఎవరిపై చర్యలు ఉంటాయనే విషయం ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో ఉప ముఖ్య మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ పేరు వినిపిస్తోంది. రాజ్యసభకు ఎన్నికైన మంత్రులు ఇద్దరూ రాజీనామా చేసిన అనంతరం కొత్తవారి పేర్లు ఖరారు చేస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పనితీరు సరిగా లేనివారిపైన చర్యలు ఉండనున్నాయనేది ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే నెలలో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది.

నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చిన అల్లరి నరేష్ !


గత కొన్నేళ్లుగా హీరోగా వరుస పరాజయాలతో సతమతవుతున్న అల్లరి నరేష్ ప్రయోగాత్మకంగా చేస్తున్న కొత్త చిత్రం ‘నాంది’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ వచ్చింది. పోస్టర్ లో అల్లరి నరేష్ పోలీస్ స్టేషన్ లో నగ్నంగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం టీజర్ జూన్ 30న విడుదల అవుతుందని మేకర్స్ పోస్టర్ తో సగర్వంగా చాటి చెప్పుకున్నారు. మరి టీజర్ లో మ్యాటర్ ఉందో లేదో చూడాలి.

విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. మరి ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసే నరేష్ అప్పుడప్పుడు ఇలాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా టచ్ చేస్తుంటాడు. గతంలో కూడా ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ లాంటి చిత్రాలతో మెప్పించిన నరేష్ లాంగ్ గ్యాప్ తర్వాత అలాంటి కథతో చేస్తున్న సినిమానే ఈ ‘నాంది’. కానీ నరేష్ టైం ఈ మధ్య అసలు బాగాలేదు.

మరి గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తోన్న అల్లరి నరేష్ ఈ వినూత్నమైన సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉన్న ఈ సినిమా ఆకట్టుకుంటుందా ఉండనున్నాయి.

సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన కేసీఆర్!

Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ భారతీయ సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నిపారని, భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్‌.. వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ప్రశంసించారు. అమర జవాన్లకు సాయంపై సీఎం కేసీఆర్‌ ఔదార్యాన్ని ఆయన కొనియాడారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ కి ఒక లేఖ రాశారు. ‘కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న పవార్‌.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చైనా సరిహద్దులో అమరుడైన సూర్యాపేట వీరయోధుడు కర్నల్‌ సంతోష్‌ బాబు కూడా కోరుకొండ సైనిక్ స్కూల్‌ లో విద్యనభ్యసించారు. కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన వెంటనే ఆయన కుటుంబానికి మీరు అండగా నిలిచిన తీరు, ఉదారంగా సహాయం ప్రకటించడం, దాన్ని వెంటనే అమలుచేయడం అపూర్వం, అనితర సాధ్యం’ అని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు.

మాతృభూమి రక్షణలో భారత సైనికుడు ప్రాణత్యాగానికి సైతం ఎన్నడూ వెరవడన్న వాస్తవాన్ని చరిత్ర అనేకమార్లు రుజువు చేసిందన్నారు వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌. జాతీయ యుద్ధస్మారకంపై మెరిసే అమరుల పేర్లు, ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌ కారిడార్లలో వెలిసిన శౌర్యపతాక విజేతల చిత్రపటాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి సాహసిక సైనికుల రుణాన్ని జాతి ఎలా తీర్చుకోవాలన్న దానికి మీరు ఈ రోజు ఒక ఉదాహరణలా నిలిచారని సీఎం కేసీఆర్ పై  ప్రశంసలు కురిపించారు. మీరిచ్చిన భరోసా ఈరోజు యుద్ధ సరిహద్దుల్లో నిలిచిన మన జవాన్ల ఆత్మబలాన్ని రెట్టింపుచేసిందని లేఖలో పేర్కొన్నారు. నాకేమైనా అయితే నా కుటుంబాన్ని చూసుకునేందుకు నా జాతి ఉంది అనే ఆత్మ విశ్వాసాన్ని సైనికుల్లో కలిగించారని .. ఇందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు” అంటూ సీఎం  కేసీఆర్‌ పై నౌకాదళాధికారి ప్రశంసల వర్షం కురిపించారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వ లక్షణాలను, ఒక నాయకుడిగా ఆయనలో ఉన్న ఆర్ద్రతను కూడా వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో ప్రస్తావించారు. సైనికుడు అమరుడైన ప్రతిసారీ ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి, ఒక ముఖ్యమంత్రి వందల కిలోమీటర్లు ప్రయాణించి, ఊరుదాకా వెళ్లకపోవచ్చు. వెళ్లడం సాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ మీరొక ముందడుగు వేసారని సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కర్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి సాయం ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మీరు స్వయంగా సూర్యాపేటదాకా వెళ్లి, ఆయన భార్యకు మీ చేతులతో అందజేయడం మాత్రం అపూర్వమన్నారు. ఇది మీ నాయకత్వ లక్షణాలకు, ఔదార్యానికి, ఆర్ద్రతకు, మానవత్వానికి నిదర్శనమని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు . కర్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు అమరులైన 19 మంది సైనికులకు, వారు తెలంగాణకు చెందిన వారు కానప్పటికీ, ఉదారంగా సాయం చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించిందన్నారు. ఆర్మీ పట్ల, సైనికుల పట్ల మీకున్న అవగాహనకు ఇంతకు మించి వేరే చెప్పనక్కర్లేదని సీఎం కేసీఆర్‌ను నేవీ డిప్యూటీ చీఫ్‌ ప్రశంసించారు.

సైనికులకు ఉదాత్తమైన సాయం అందడంలో సీఎం కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత కీలక పాత్ర పోషించి, విశేషమైన కృషి చేశారని  వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు. తాను, కర్నల్‌ సంతోష్‌బాబు చదువుకున్న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ను ఒకసారి సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్ ను పవార్‌ ఆహ్వానించారు. “కోరుకొండ స్కూల్లో తెలంగాణ పిల్లలు కూడా అనేకమంది చదువుకుంటున్నారని తెలిపారు. కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదువుకున్న ఎంతోమంది అనేకరంగాల్లో దేశవిదేశాల్లో రాణిస్తున్నారని..  అందువల్ల మీరొక్కసారి ఆ స్కూలును తప్పక సందర్శించాలని  వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పలికారు.

బీజేపీ డైరెక్షన్ లో.. పవన్ పాదయాత్ర..?


ప్రపంచ మంతా కరోనాతో పోరాడుతుంటే ఏపీలో మాత్రం రాజకీయాలు వెడేక్కిపోతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇటీవలే సీఎం జగన్మోహన్ మొదటి ఏడాది పాలన పూర్తయింది. ప్రజా సంక్షేమ పథకాలతో జగన్ సర్కార్ ప్రజల్లోకి తీసుకెళుతోంది. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులకు గురిచేసిన నేతలపై ఇప్పుడు జగన్ సర్కార్ తమ అస్త్రాలను వదులుతోంది. దీంతో ఏపీలో వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలోనే పాదయాత్ర చేయనున్నారనే వార్త ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

2019ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఇంతకముందున్న దూకుడు తగ్గించినట్లు కన్పిస్తుంది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణంగా ఓటమిపాలవడాన్ని పవన్ కల్యాణ్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 2014లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి గట్టి మద్దతు ఇచ్చారు. ఆయన మద్దతుతో ఆ కూటమి అధికారంలో వచ్చింది. టీడీపీ హయాంలోనూ పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారు. అయితే అనుహ్యంగా 2019లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి దూరంగా జరిగి వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన కూటమి కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అనంతరం జరిగిన పరిణాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కేంద్రంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యారు. ఈమేరకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే తనకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయంటూ ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా మూడు సినిమాలకు కమిటయ్యారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ చిత్రం చివరిదశకు చేరుకుంది. లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం నిలిచిపోయింది. అంతేకాకుండా క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ఈ మూడు చిత్రాల తర్వాత పవన్ తర్వాత పవన్ సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఏపీ కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకుగానే బీజేపీ డైరెక్షన్లో పవన్ పాదయాత్ర చేయనున్నారని ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ పక్కా స్కెచ్ రెడీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

2024లో జరిగే ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ ఇప్పటి నుంచి పావులు కదిపేందుకు మొగ్గుచూపుతోంది. పవన్ కల్యాణ్ తో పాదయాత్ర చేయిస్తే అది బీజేపీ-జనసేన కూటమికి కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. పవన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళితే పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. కొంతకాలంగా పవన్ దూకుడు తగ్గించడంతో జనసేన కార్యకర్తలు కూడా కొంత నిరుత్సాహంతో ఉన్నారు. ఒకవేళ పవన్ పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళితే జనసేన కార్యకర్తల్లోనూ తిరిగి ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంది.

పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు చేరువ కావాలని బీజేపీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు పవన్ కల్యాణ్ కూడా పాదయాత్రకు సై అన్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే ప్రచారం నేపథ్యంలో పవన్ ను ముందస్తు పాదయాత్రకు సిద్ధం చేస్తుందని చర్చ నడుస్తోంది. పవన్ నిజంగా పాదయాత్ర చేపడితే మాత్రం ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయంగా కన్పిస్తుంది.. మున్ముందు ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే..!

నో అవినీతి: చంద్రబాబుకు జగన్ క్లీన్ చిట్


40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అక్కడ. అందుకే ఎన్ని సార్లు సీఎం అయినా.. ఎప్పుడూ దొరకలేదు.. చిక్కలేదు. అవినీతిలో బయటపడలేదు. కోర్టుల్లో కూడా కేసులు నిలవలేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ లక్షణాలకు ఇదో మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. ఎక్కడ దొరుకుతాడా మూసేద్దాం అని చూస్తున్న వైసీపీ అధినేత, సీఎం జగన్ కు కూడా దొరకకుండా పకడ్బందీ గత ప్రభుత్వంలో పనులు చేసిన చంద్రబాబు తెలివిని నిజంగానే మెచ్చుకోవాల్సిందే.. ఎంతలా అంటే స్వయంగా జగన్ సర్కారే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. కేంద్రం కూడా అవినీతి లేదని తేల్చేసింది. ఇదీ మరీ చంద్రబాబు తెలివితేటలు అంటే అని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

పవన్ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఈ గోడవలేంది గురువా?

దశాబ్ధాలుగా పెండింగ్ లో ఉన్న ఏపీ కలల ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయడానికి ఎందరో ఏపీ సీఎంలు ప్రయత్నించి విఫలమయ్యారు. గత చంద్రబాబు హయాంలోనూ అంచనాలు పెంచేసి.. అడ్డదిడ్డంగా పనులు చేసి.. పగుళ్లు వచ్చి నాసిరకం అంటూ చాలా విమర్శలొచ్చాయి. విడిపోయిన నవ్యాంధ్రకు సాయంగా కేంద్రమే పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వేల కోట్ల నిధులు కేటాయించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ‘పోలవరం’ను ఏటీఎంలా వాడేసుకుందని వైసీపీ నాడు ఆరోపించింది.

అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టును రద్దు చేసి కొత్తవారికి ఇచ్చిన జగన్.. చంద్రబాబు హయాంలో పోలవరం అవినీతిపై విచారణ కమిటీ కూడా వేశారు. కానీ దాని రిజల్ట్ ఏంటనేది తెలియరాలేదు..

తాజాగా చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. దీనిపై విచారణ జరపాలని సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయనకు కేంద్ర జలశక్తి శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్రం అధికారికంగా స్పందించింది. షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాలు లేవని.. విచారణ అవసరం లేదని కేంద్ర జలశక్తి స్పష్టం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వేసిన కమిటీ నివేదికను రాష్ట్ర సర్కారే పక్కనపెట్టిందని.. నిబంధనల మేరకే పోలవరం నిర్మాణం జరుగుతోందని జగన్ ప్రభుత్వం కమిటీ చెప్పిందని కేంద్ర జలశక్తిశాఖ వెల్లడించింది. కాబట్టి పోలవరంపై విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.

దీన్ని బట్టి పోలవరంలో చంద్రబాబును బుక్ చేద్దామని చూసిన జగన్ కు ఆ లెక్కలు పత్రాల్లో ఏలాంటి బొక్కలు దొరకలేదని తెలుస్తోంది. చంద్రబాబు ఎంతో చాకచక్యంగా పోలవరంను కొనసాగించాడని తేలింది. పోలవరంలో అవినీతి లేదని అటు కేంద్రం.. ఇటు స్వయంగా ఆరోపణలు గుప్పించిన జగన్ ప్రభుత్వం కూడా క్లీన్ చిట్ ఇవ్వడం నిజంగానే చంద్రబాబుకు గొప్ప ఊరట అని.. ఆయన పనితనానికి ఇది నిదర్శనమని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబును ఏ కేసులోనూ ఇరికించలేరని అంటున్నాయి.

-ఎన్నం

షూటింగులకు మరోసారి లాక్ డౌన్ తప్పదా?


తెలంగాణలో రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. లాక్డౌన్ కఠినంగా అమలు చేసినన్నీ రోజులు కేసుల సంఖ్య అంతంత మాత్రంగా ఉంటేవీ. ఎప్పుడైతే రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు ఇచ్చారో నాటి నుంచి కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. మహానగరం హైదరాబాద్ అయితే కరోనా గుప్పట్లోకి వెళ్లినట్లు కన్పిస్తుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 985 కరోనా కేసులు నమోదుకాగా జీహెచ్ఎంసీ పరిధిలో 774 కేసులు నమోదవడం గమనార్హం.

పవన్ మౌనం.. పార్టీని దెబ్బతీస్తుందా?

టాలీవుడ్ పరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో సినిమా, టీవీలకు సంబంధించిన షూటింగులకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా షూటింగుల సందడి మొదలు కాలేదు. స్టార్ హీరో, హీరోయిన్లు కొద్దిరోజులపాటు వేచిచూసే ధోరణిలో ఉండటంతో ఇప్పట్లో షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. మరోవైపు హైదరాబాద్లో టీవీ సీరియల్స్, ఇతర షోలకు సంబంధించి షూటింగులు చేస్తున్నప్పటికీ కరోనా నియంత్రణ పాటించడం లేదని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఓ ప్రముఖ టీవీ సీరియల్ నటుడికి కరోనా రావడంతో షూటింగును నిలిపివేశారు. ఈ షూటింగుల్లో పాల్గొన్న వారందరిని నిర్మాత హోంక్వారంటైన్ కు తరలించారు. ఈ సంఘటన టెలివిజన్ రంగంలో కలకలం రేపింది. టీవీ షూటింగులు చేసే నిర్వాహాకులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తుండటంతో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిసారించింది. ప్రస్తుత నేపథ్యంలో షూటింగులు చేయడం వల్ల కరోనా మరింత మందికి సోకే అవకాశం ఉండటంతో ప్రభుత్వం షూటింగులను నిలిపివేసేందుకు మొగ్గుచూపుతుందని సమాచారం. ఈమేరకు 14రోజులపాటు షూటింగులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చిత్రపరిశ్రమ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పడిప్పుడే పట్టాలెక్కుతున్న టీవీ షూటింగులకు కరోనా మరోసారి బ్రేక్ వేసేలా కన్పిస్తుంది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు వ్యాపార సంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నారు. ఈనేపథ్యంలో షూటింగులు కూడా మరో రెండు వారాలు స్వచ్చంధంగా లాక్డౌన్ విధించుకుంటే వారికే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు చిత్రపరిశ్రమ నడుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగుల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

కరోనా సృష్టిస్తున్న కొత్త ఉద్యోగాలు.. యువతకు భారీ ప్యాకేజీలు!


2020 సంవత్సరం కరోనా నామ సంవత్సరంగా మారిపోయింది. చైనాలోని వూహాన్లోని సోకిన కరోనా మహమ్మరి క్రమంగా అన్నిదేశాలకు పాకింది. ఈ మహమ్మరి ధాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోయాయి. అమెరికా, బ్రిటన్, యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు సైతం కరోనా మహ్మమరి నుంచి తప్పించుకోలేక పోయాయి. కరోనా విజృంభణలో ప్రపంచంలోని చాలాదేశాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజారవాణా స్తంభించిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైవడంతో కంపెనీల ఆదాయానికి భారీగండి పడింది. దీంతో కంపెనీలు ఉద్యోగులకు తొలగించడం.. కోతలు విధించడం వంటి పనులను చేపట్టడంతో నిరుద్యోగం పెరిగిపోయింది.

పవన్ మౌనం.. పార్టీని దెబ్బతీస్తుందా?

ఇలాంటి సమయంలోనూ కొన్ని కంపెనీలు యువతకు భారీ పారితోషికాలు ఇస్తూ నియమకాలు చేపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. కరోనా సంక్షోభాన్ని కొన్ని రంగాలు తట్టుకొని నిలబడ్డాయి. రానున్న కాలంలో ఈ రంగాలు మరింత అభివృద్ధి చెందడంగా ఖాయంగా కన్పిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలు అన్ని అర్హతలు ఉన్న యువతకు భారీ పారితోషాలకు ఆఫర్ చేస్తూ నియమకాలను చేపడుతున్నాయి. ఆన్ లైన్, కంప్యూటర్, హెల్త్, బ్యాకింగ్, రక్షణ, ఫైనాన్స్, టెలికాం, ఫుడ్, ఔషధ రంగాలు కరోనాను టైంలోనూ రాణించాయి. దీంతో ఈ రంగాల్లో రానున్న కాలంలో పెద్దఎత్తున నియమాకాలు జరిగే అవకాశాలున్నాయని నిఫుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్-19 ఎంట్రీ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ స్వరూపంలో చాలా మార్పులు సంభవించారు. ప్రస్తుతం అన్నిదేశాలు వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ ను పాటిస్తున్నాయి. ఇది మంచి ఫలితాలను ఇవ్వడం విదేశీ కంపెనీలు సైతం ఉద్యోగ నియమకాలు చేపడుతూ ‘వర్క్ ఫ్రమ్ ఎనీ వేర్’ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ పరిస్థితులను తగ్గట్టుగా యువత తమ సామర్థ్యాలను పెంచుకుంటే రానున్న రోజుల్లో మంచి ఉద్యోగావకాశాలతోపాటు భారీ ప్యాకేజీలు దక్కించుకునే అవకాశం ఉందని తాజాగా నియమకాలు వెల్లడి చేస్తున్నాయి.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

రానున్న రోజుల్లో క్లౌడ్ కంప్యూటింగ్, కాంటాక్ట్ లెస్ టెక్నాలజీ, డేటా ప్రాసెసింగ్, టెలికాం, నెట్ వర్కింగ్ రంగాల్లో నిష్ణాతులైన వారికి మంచి డిమాండ్ ఉండనుంది. ఇలాంటి వారికి కంపెనీలు రెడ్ కార్పెట్ పరిచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఆన్ లైన్ బ్యాకింగ్, పైనాన్సియల్ సర్వీసుల్లో నిపుణులు అవసరం ఏర్పడింది. ప్రస్తుతం హెల్త్ కేర్ రంగాలు తయారుచేసే ప్రొడక్టులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఫుడ్, ఔషధ కంపెనీలు కరోనా టైంలోనూ భారీ లాభాలను ఆర్జించడంతో ఈ రంగాల్లోనూ జోరుగా నియమకాలు జరుగుతున్నాయి.

భవిష్యత్లోనూ ఈ రంగాలకు ఫుల్ డిమాండ్ ఉండటంతో పెద్దఎత్తున కంపెనీలు నియమాకాలను చేపడుతున్నట్లు సమాచారం. ఈ రంగాలకు తగట్టుగా యువత అవకాశాలను అందిపుచ్చుకుంటే భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌హేష్ చెబితేగాని నిజం తెలీదు !


దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’
(ఆర్ఆర్ఆర్) త‌ర్వాత రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించడంతో  ఈ సినిమా పై అనేక ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు.

పైగా కరోనా దెబ్బకు రాజమౌళి ప్లానింగ్ మొత్తం రివర్స్ అయింది. అటు మహేష్ ది కూడా అదే పరిస్థితి. ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళి సినిమానా లేక వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడా… ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు మహేష్ కే క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లికి మహేష్ సినిమా చేస్తానని చెప్పాడట.

దాంతో వంశీ పైడిప‌ల్లి ఇంకా స్క్రిప్ట్‌ని చెక్కే పనిలోనే ఉన్నాడు. మ‌రోవైపు పరశురామ్ మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడు. ఈ లోపు క‌రోనా వ‌చ్చి లాక్‌డౌన్ కారంణంగా సినీ పరిశ్ర‌మ మొత్తం ష‌ట్‌డౌన్ అయ్యింది. ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఆగిపోయాయి.

దీంతో ఎలాగూ గ్యాప్ వ‌చ్చింది క‌నుక మ‌రి మహేష్ కొన్ని రోజులు వెయిట్ చేసి, పరుశురామ్ తో సినిమా తరువాత రాజ‌మౌళితో సినిమాను స్టార్ట్ చేస్తాడని లేటెస్ట్ గా ఇండస్ట్రీలో ఒక పుకారు షికారు చేస్తోంది. మరి మ‌హేష్ నుండి క్లారిటీ వస్తే గాని నిజం ఏదనేది తెలీదు.

అయ్యో.. లెజండరీ దర్శకుడికి అవమానం !


డైరెక్టర్ అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన మొట్టమొదటి ‘దిగ్దర్శకుడు’ ఆయన, దర్శకరత్న అనే పదానికి పర్యాయ పదం ఆయన. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన ఆ దిగ్దర్శకుడు ‘డా. దాసరి నారాయణరావు’. ఆయన కుమారులు నేడు చేసుకుంటున్న ఆరోపణలను చూస్తుంటే కచ్చితంగా ఆ మహానుభావుడికి ఈ బాగోతం అంతా అవమానం లాగే అనిపిస్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

అత్యధిక చిత్రాల చేసి దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కిన ఆ గొప్పవ్యక్తి.. మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్న ఆ గొప్ప వ్యక్తికి ఇది కచ్చితంగా అవమానమే. ప్రతి సంక్షోభంలోనూ సినీ కార్మికుల పక్షాన నిలిచి వారిని ఆదుకొని వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన దాసరిని.. నేడు టీవీల్లో ఆయన విజువల్స్ మీద ఆయన కుమారుల వివాదాన్ని చూపిస్తూ ఉంటే ఆ దిగ్దర్శకుడి ఆత్మ ఎంత బాధ పడుతుంది.

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?

కానీ ఇప్పటివరకూ సినీ పెద్దలలో ఈ వివాదం గురించి ఇంకా స్పందించలేదు. ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన దాసరి కుటుంబం రోడ్డున పడకముందే సినీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించాలి. కానీ అది సాధ్యమేనా ? దాసరి మరణించిన సమయంలోనే కొంతమంది పెద్దలు ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి కూడా రాలేదని ఓ విమర్శ ఉంది. ఏది ఏమైనా దాసరి భౌతికంగా దూరమయినా ఆయన తీసిన అజరామ సినిమాలు అపురూపం. ఆయన కుమారుల సమస్య త్వరగా తీరిపోవాలని కోరుకుందాం.

పవన్ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఈ గోడవలేంది గురువా?

Pawan

వైసీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. కాపు నేస్తం పథకంపై పవన్‌ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సీఎం జగన్ అంటే పవన్ కళ్యాణ్‌ కు నచ్చదని… అందుకే ఆయనపై విమర్శలు చేస్తున్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్ల ప్రేమను పవన్‌ దాచుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఇదిలా ఉండగా.. పవన్ పై గత విమర్శలను ఇప్పటి విమర్శలను గమనిస్తే… జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలపై పవన్ స్పందించిన ప్రతిసారి వైసీపీ నేతలు చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం గమనార్హం. అదే సమయంలో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తుంటారు. పవన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు వైసీపీ నేతలు ఖచ్చితమైన సమాధానం లేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారా.. అనిపిస్తుంది.

ఇటీవల “కాపు నేస్తం” పై జగన్ మాట్లాడుతూ ఏడాదికి 2వేల కోట్లు కాపుల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పారు. అంతేకాకుండా 13 నెలల వ్యవధిలోనే 23లక్షలమంది కాపులకు 4,770కోట్లు ఇచ్చామని ప్రకటించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన మీరు “ఏడాది తిరిగేలోగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ ఎలా ఇస్తారనేది పవన్ ప్రశ్న..?” అలా చేస్తే “కాపు రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ అడుగుతున్నారు?” ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి తప్పించుకుపోవడం వైసీపీ నేతలకు పెద్ద ఫ్యాషన్ అయింది. అదే సమయంలో సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైంది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కాపు నేస్తం అద్భుతమైన పథకమని, కాపుల కోసం ఏడాదిలో రూ.4,770 కోట్లు ఖర్చు చేస్తున్నామని కన్నబాబు అంటున్నారు. రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడంలేదో వైసీపీ నేతలకే తెలియాలి.