Home Blog Page 8430

హైదరాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్.. అప్పటి నుంచే?


దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతోన్నాయి. ఇదిలా ఉంటే రేపటి నుంచి కేంద్రం విధించిన లాక్డౌన్ 5.0(అన్ లాక్ 1.0) ముగియనుంది. దీంతో కేంద్రం అన్ లాక్ 2.0 అమలు చేసేందుకు సన్నహాలు చేస్తోంది. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా కేంద్రం అన్ లాక్ 2.0లో పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కేంద్రం తీరు ఇలా ఉంటే రాష్ట్రాలు మాత్రం లాక్డౌన్ అమలు చేసేందుకే మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీనిని మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

తెలంగాణ రాష్ట్రంలోనూ లాక్డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు 500నుంచి 900పైబడి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. మహమ్మరి పంజా విసురుతుండటంతో హైదరాబాద్ పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నగరవాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇతర నేతలకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వ్యాపారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వచ్చంధ లాక్డౌన్ చేపట్టారు. హైదరాబాద్లో లాక్డౌన్ ప్రచారంపై తాజాగా మంత్రి ఈటల రాజేందర్ సైతం స్పందించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ అమలు చేసేందుకు వెనుకడే లేదని స్పష్టం చేశారు. దీంతో లాక్డౌన్ అమలు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో నగరవాసులు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే నగరవాసులు మార్కెట్లకు పొటెత్తుతున్నారు. అవసరమైన సరుకులను ఇప్పటికే తెచ్చిపెట్టుకున్నారు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

జూలై 1నుంచి ఆన్ లాక్ 2.0 అమలు కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. రెండుమూడ్రోజుల్లో క్యాబినేట్ సమావేశం నిర్వహించి త్వరలోనే నిర్ణయం ప్రకటించున్నారని తెలుస్తోంది. 15రోజులపాటు హైదరాబాద్లో కఠినంగా లాక్డౌన్ అమలు చేయనుందని విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ జూలై 2న ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది.

ట్రంప్ ఓడిపోతే భారత్ కు ఇబ్బందులు తప్పవా?


అమెరికాలో త్వరలోనే అధక్ష్య ఎన్నికల జరుగనున్నాయి. నవంబర్ లో కొత్త అధక్ష్యుడి ఎన్నిక ఉండనుంది. దీంతో ఇప్పటి నుంచి అమెరికా ఎన్నికల కోలాహాలం మొదలైంది. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ఎన్నికల తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమెరికాలో కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రతీఒక్క అమెరికా పౌరుడి అకౌంట్లో భారీమొత్తంలో నగదువేసి ఆదుకున్నారు. అమెరికన్లను ఆకట్టుకునే భాగంగానే హెచ్1బీ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకతలు వచ్చి ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అయితే కరోనా విషయంలో ట్రంప్ ఫెయిల్ అయ్యారని అమెరికన్లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు మరోసారి అధ్యక్ష పదవీ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

వరుస లాకప్ డెత్ లతో తమిళనాడులో కలకలం!

అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ పై ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యహరించారనే భావన అమెరికన్లలో ఉంది. అంతేకాకుండా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను పోలీసులు అత్యంతదారుణంగా హత్య చేసిన విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావునిచ్చింది. దీంతో నల్లజాతీయులుంతా వీధుల్లోకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సంగతి తెల్సిందే. ట్రంప్ నల్లజాతీయులను అణచివేసేందుకు యత్నించడంతో ఆయనపై అమెరికన్లలో వ్యతిరేకలు వ్యక్తమయ్యారు. ఈనేపథ్యంలో అమెరికన్ అధ్యక్ష పదవీకి రెండోసారి పోటీచేస్తున్న ట్రంప్ గెలిచే అవకాశం లేదనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

మరోవైపు అధ్యక్ష బరిలో ఉన్న జో బిడెన్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకరకంగా భారత్ కు ప్రతికూల అంశమే. జో బిడెన్ తొలి నుంచి భారత్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. కశ్మీర్ అంశంలో ఆయన పాకిస్థాన్ కు మద్దతుకు ప్రకటించాడు. మోడీ సర్కార్ చేపట్టిన సీఏఏపై వ్యతిరేకంగా మాట్లాడి భారత్ పై ద్వేషాన్ని వెళ్లగక్కారు. జో బిడెన్ క్రానికల్ కమ్యూనిస్టు ఐడియాలజీని అనుసరిస్తుంటారు. ఈయన వ్యవహర శైలితో పొలిస్తే ఒకరకంగా ట్రంప్ చాలా బెటరని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మోడీపై రాహుల్ నిప్పుల వెనుక అసలు కారణం ఇదీ

ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బిడెన్ గెలిస్తే భారత్ కు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇప్పటివరకు భారత్-అమెరికాకు ఉన్న మంచి సంబంధాలు దెబ్బతిసే అవకాశాలు ఉందనే వాదనలు విన్పిస్తున్నారు. పాకిస్థాన్ సైతం జో బిడెన్ అమెరికా అధ్యక్షుడి అయితే రెచ్చిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అమెరికా ఎన్నికలపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ నజర్ వేసినట్లు తెలుస్తోంది. రానున్న అమెరికా ఎన్నికల్లో ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే..!

వరుస లాకప్ డెత్ లతో తమిళనాడులో కలకలం!

Lockup death

Lockup death

వరుస లాకప్ డెత్ లు తమిళనాడులో వేడి పుట్టిస్తున్నాయి. మొన్న టుటికోరన్ లో తండ్రి కొడుకులు, జయరాజ్, బెనిక్స్ మృతి మరువకముందే నేడు మరో లాకప్ డెత్ వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. తిరునల్వేలికి చెందిన ఎన్.కుమరేశన్ అనే ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో పదిహేను రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఓ భూ వివాదం కేసులో అతడిని పోలీసులు తీసుకువెళ్లారు. లాకప్ లో అతడిని తీవ్రంగా హింసించారు. దీంతో అతడు ఇంటికి వచ్చిన తర్వాత రక్తపు వాంతులతో బాధపడటంతో కుమరేశన్ ని మొదట స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. చివరకు పరిస్థితి మరింత విషమించడంతో , తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని కిడ్నీ, ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బ తిడంతో, అంతర్గత స్రావం విపరీతం అవ్వడంతో వైటల్ ఆర్గన్స్ పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు. అయితే శనివారం సాయంత్రం కుమరేశన్ తీవ్ర అస్వస్థతతో మరణించాడు. ఈ ఘటనతో పోలీసుల అకృత్యాలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో, ఈ కేసుకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులోనే ట్యుటికోరన్ లాకప్ డెత్ లో తండ్రీకొడుకుల జయరాజ్, బెనిక్స్ ల మృతి కేసును సీబీఐకి లప్పగిస్తామని ఆ రాష్ట్ర సీఎం పళనిసామి ప్రకటించారు. ప్రస్తుతం ఆ కేసును మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ సొంతంగా దర్యాప్తు చేస్తోందని, కోర్టు అనుమతితో సీబీఐకి ఇస్తామని తెలిపారు.

తండ్రి కొడుకుల లాకప్ డెత్

జయరాజ్ , అతని కొడుకు బెనిక్స్ తమిళనాడులోని తూత్తుకుడిలో సెల్ ఫోన్ షాపును నడిపిస్తున్నా రు. లాక్ డౌన్ టైమ్ లో షాపును కరెక్టు సమయంలో మూసేయ లేదంటూ పోలీసులతో జరిగిన వాగ్వాదంతో అరెస్టయ్ యారు. తర్వాత ఇద్దరూ కోవిల్ పట్టి హాస్పిటల్ లో చనిపోయారు. అయితే లాకప్ లో తండ్రీ కొడుకులు మృతి చెందడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఘటనకు కారణమైన వాళ్లపై మర్డర్ కేసు పెట్టాలని జయరాజ్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. కాగా, కేసు విషయంలో మేజిస్ట్రేట్ బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని జయరాజ్ అల్లుడు పొన్షెకర్ చెప్పారు.

చిరు ‘చంటబ్బాయి’గా రవితేజ ?


మాస్ మహరాజా రవితేజకి హిట్ లేకపోయినా ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నాడు. కరోనా రాకపోయి ఉంటే… ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అట, ముఖ్యంగా సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఫుల్ కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ఉంటుందని.. చిరు ‘చంటబ్బాయి’ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

ఎలాగూ త్రినాథరావ్ నక్కినకి మంచి కామెడీ డైరెక్టర్ అని పేరు ఉంది. ఆయన గత చిత్రాలు కూడా ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్ వంటి కామెడి సినిమాలు మంచి ఎంటెర్టైమెంట్ తో సాగుతూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా అలాగే సాగుతుందని.. రవితేజ కామెడీ టైమింగ్ కి తగ్గట్లు సినిమా ఉంటుందట. ఏమైనా కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు రవితేజ.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

నిజానికి కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదనే చెప్పాలి. ఈ సారి రవితేజ ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించడం ఖాయంలా కనిపిస్తుంది. పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారట. అన్నట్టు రవితేజ ప్రస్తుతం క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే రమేష్ వర్మ డైరక్షన్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.

మోడీపై రాహుల్ నిప్పుల వెనుక అసలు కారణం ఇదీ


కరోనా లాక్ డౌన్ తో అందరి ఉపాధి పోయింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రజల ఆదాయం పడిపోయింది. ఇప్పుడు దేశమంతా దీన్ని అరికట్టడంపైనే కాచుకు కూర్చుంది. ప్రజలు, ఉద్యోగులంతా ఎప్పుడు కరోనా తగ్గుతుంది.? ఎప్పుడు పనులు చేసుకుందామని ఎదురుచూస్తున్నారు.

అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషంగా ఉన్నారట.. లాక్ డౌన్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారట.. దానికి కారణం ఏంటంటే… కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చాలా యాక్టివ్ కావడమేనట.. రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో కరోనాను మొదలుపెడితే చైనాతో ఫైట్.. 20మంది సైనికుల మరణం వరకు ప్రధాని మోడీని ఇరుకున పెడుతూ ఇరగదీస్తుండడంపై చాలా సంతోషంగా ఉన్నారట.. కరోనా లాక్ డౌన్ కు కాంగ్రెస్ నేతలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారట..

చైనాపై మోడీ వ్యూహం ఫలించేనా?

కరోనా లాక్ డౌన్ సమయంలోనే క్రియా రహితంగా ఉన్న రాహుల్ గాంధీ అకస్మాత్తుగా చురుకుగా మారారు. మోడీని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ ఇరుకునపెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ తిరిగి వార్తల్లోకి వచ్చింది.

అయితే కాంగ్రెస్ సభ్యులు సంతోషంగా ఉండడానికి మరో కారణం ఉంది. లాక్ డౌన్ కారణంగా ఏ విమానాలు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లడం లేదు. చీటికి మాటికి ధ్యానం.. యోగా సహా ఇతర రిలాక్స్ కావడానికి రాహుల్ గాంధీ దేశం వదిలి విదేశాలకు రహస్య పర్యటనలకు వెళ్లేవారు. ఏ ఏదేశం.. ఎక్కడికి వెళుతున్నాడో ఎవరికీ చెప్పేవాడు కాదు.. రహస్యంగా ఉంచేవాడు.

ప్రభుత్వరంగ బ్యాంకులపై ముప్పేట దాడి

ఇలా రాహుల్ గాంధీ తరచూ అదృశ్యం కావడంపై బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ వద్ద సమాధానం ఉండేది కాదట.. దాదాపు 15 రోజుల పాటు రాహుల్ ఆచూకీపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడేవారు. ఇప్పుడు విమానాలు రద్దుతో చచ్చినట్టు రాహుల్ దేశంలోనే ఉండి మోడీపై కారాలు మిరియాలు నూరుతున్నారు.

అందుకే ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కరోనాను దేవుడే పంపించాడని.. రాహుల్ గాంధీని విదేశీలకు పోనీయకుండా యాక్టివ్ చేశాడని కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ లోనే రాహుల్ ఉండడంతో బీజేపీపై, మోడీపై లాజిక్కులతో విరుచుపడుతూ ఇరుకునపెడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రాహుల్ తో హ్యాపీగా ఉందట.. రోజూ కాంగ్రెస్ వార్తలతో పండుగ చేసుకుంటోందట..

-ఎన్నం

జగన్ ను ఎంపీ కొత్త వివాదంలోకి లాగారా?


ముందుగా ప్రకటించిన విధంగానే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వంపై మతపరమైన బురద జల్లెందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వం క్రిస్టియానిటీని, మత మార్పిడులు ప్రోత్సహిస్తుందని బీజేపీ, హిందుత్వ సంస్థలు విమర్శించినట్లుగా…రఘురామ కృష్ణంరాజు అదేవిధంగా క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తుందని అర్ధం వచ్చేలా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో వైసీపీ ప్రభుత్వాన్ని కొత్త వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు.

తనకు విజయ సాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఇచ్చారని, అయితే ఎన్నికల సంఘం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడవద్దని గతంలో అనేక మార్లు సూచించిన విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. యువజన శ్రామిక రైతు పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉందా?..లేదా? అనే విషయాన్ని ప్రశ్నిస్తూ… గతంలో లేవనెత్తిన అంశాలనే మళ్ళీ ప్రస్తావించారు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలో లోక్ సభలో తాను చేసిన ప్రసంగం విషయంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, టిటిడి ఆస్తుల అమ్మకం విషయంలోనూ స్వతహాగా స్వామివారి భక్తుడనైన తాను… భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పానని, దీనికి సీఎం కోటరీలోని వ్యక్తులు తనపై క్రిస్టియన్ వ్యతిరేకి అనే ముద్ర వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ అనుకూల మీడియా సంస్థలు తనపై అసత్య కథనాలు రాశాయని వివరించారు.

ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను, ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు విషయంలో కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈ అంశాలపై స్పందించి మాట్లాడటం జరిగిందన్నారు. గతంలో తాను ఇచ్చిన విందుకు బీజేపీ నేతల్ని మాత్రమే ఆహ్వానించలేదన్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ఒక పాట రిలీజ్ చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

నరసాపురం ఎంపీగా తాను సాధించిన విజయంలో 90 శాతం క్రెడిట్ పార్టీ అధినేత జగన్ కే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో తన దిష్టిబొమ్మలను దహనం చేయడం, ఫోన్ లో బెదిరింపులకు పాల్పడటంతో కేంద్ర బలగాల భద్రత కోరినట్లు పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తాను నమ్మకమైన సైనికుడినని చెప్పుకున్నారు.

లేఖపై వైసీపీ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంశాలను జగన్ దృష్టికి తేవాలనే అభిప్రాయం ఉంటే ముందే సీఎం జగన్ కు లేఖ రాయకుండా ఎన్నికల సంఘంకు ఎందుకు ఫిర్యాదు చేశారనేది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మీడియా తో మాట్లాడిన విధానానికి, లేఖలో సమాధానం ఇచ్చిన విధానానికి సంబంధం లేదని పార్టీ వర్గాల వాదన.. ఈ లేఖపై సీఎం జగన్ స్పందన ఏ విధంగా ఉంటుందనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సామన్యులకేనా కరోనా నిబంధనలు.. ప్రముఖులకు వర్తించవా?


తెలంగాణలో కరోనా మహమ్మరి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులు భారీగా చేయడంతో కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. పదుల సంఖ్య ఉన్న కేసులు రోజుకు వేయ్యికి చేరువలో నమోదవుతోన్నాయి. నిన్నటి ఒక్కరోజు తెలంగాణలో 983కొత్త కేసులు నమోదయ్యే కొత్త రికార్డు సృష్టించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదుకావడం గమనార్హం. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి 47, మంచిర్యాల 33, మేడ్చల్ 29, వరంగల్ రూరల్ 19, సిద్ధపేట 12 ఉన్నాయి. లాక్డౌన్ సడలింపులకు ముందుగా ఒక్క కేసు కూడా నమోదుకానీ కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం కరోనా పంజా విసురుతుండటంతో ఆందోళనకు గురిచేస్తోంది.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

తాజాగా తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇటీవల తెలంగాణ హరితహారం కార్యక్రమంలో మహ్మద్ అలీతో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారులకు కరోనా టెస్టులను చేస్తున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మరి పోలీస్ శాఖపై ఉగ్రరూపం చూపుతోంది. కొంతమంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే కరోనా బారినపడి మృతిచెందగా కొంతమంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరికొంతమంది హోంక్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా పోలీస్ అకడామీలో 180మందికి కరోనా సోకడంతో వారందరికీ అకడామిలోనే ఐసోలేషన్ చేశారు. వీరిలో 100మంది ట్రైనీ ఎస్సైలు, 40మంది వరకు అకాడమీ సిబ్బంది, తదితరులు ఉన్నారని అకడమీ నిర్వాహకులు పేర్కొన్నారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలోనే మహ్మద్ అలీ పలు కార్యక్రమాల్లో విస్కృతంగా పాల్గొన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో 8మంది వరకు కరోనా పాజిటివ్ రావడంతో వారందరినీ హోంక్వారంటైన్ కు తరలించారు. నాటి నుంచి ఆయనను పలువురు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా ఆయన పట్టించుకున్నా పాపానా పోలేదు. ఈమేరకు ఆయన గురువారం నుంచి అనారోగ్యం బారిన పడినట్లు సమాచారం. ఆస్పత్రి కరోనా టెస్టు చేయగా ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గురువారం ఆయనతో హరితహారంలో పాల్గొన్న అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

హోంమంత్రికి కాంటాక్ట్ అయిన వారందరికీ టెస్టులను నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం, వైద్యశాఖ అప్రమత్తమైంది. ఈమేరకు ఇప్పటికే ఆయనతో కలిసి తిరిగిన ఉన్నతాధికారులు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్న తరుణంలో మీడియా కూడా హోంమంత్రిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే అధికారులు కరోనా నిబంధనలు, భౌతిక దూరం పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరించడం వల్లనే హోంమంత్రి కరోనా బారినపడినట్లు తెలుస్తోంది.

అందరికీ ఆదర్శంగా ఉండి కరోనాపై సూచనలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే కరోనా పట్ల నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనాపై తొలి నుంచి పోరాడుతున్న పోలీసులపై కరోనా పంజా విసురుతుండటంతో ఆ శాఖను కలవరానికి గురిచేస్తోంది. అయితే కరోనా నిబంధనలు సామాన్యులకేగానీ.. ప్రముఖులకు వర్తించడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తే కొంతమేర కరోనా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మహేష్ సినిమాలో చాన్స్‌ పుకార్లే అంటున్న రేణు దేశాయ్

I spent a lot of time with them - Renu Desai
I spent a lot of time with them - Renu Desai


రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. జానీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మోడల్, నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్, క్యాస్టూమ్‌ డిజైనర్ ఇలా చాలా పనులు చేయగలదు. కానీ, వీటన్నింటికంటే పవన్‌ కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమె అభిమానులకు సుపరిచతం. పవన్‌తో చాన్నాళ్లు సహజీవనం, ఆ తర్వాత పెళ్లి కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్‌ విడాకుల అనంతరం మళ్లీ మేకప్‌ వేసుకుంది. ఓ టీవీ షోలో హోస్ట్‌గా చేసిన ఆమె డైరెక్షన్ పైన ఫోకస్ పెట్టింది. సొంత నిర్మాణంలో 2014లోనే ‘ఇష్క్‌ వాలా లవ్‌’ మూవీ తీసిన ఆమె ఇప్పుడు వ్యవసాయంపైన ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది.

వైరల్ ఫేక్ న్యూస్ కి ఇవే నిజాలు!

పవన్ తో విడిపోయిన చాన్నాళ్లకు పుణేకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్తో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. ఈ మధ్య ఓ టీవీ ప్రోమోలో కనిపించిన రేణూ సీరియల్స్‌లో నటించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె గురించి మరో వార్త బయటకొచ్చింది. జానీ తర్వాత సినిమాలకు (యాక్టింగ్)కు దూరంగా ఉన్న ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుందన్న టాక్‌ నడుస్తోంది. అడవి శేష్‌ హీరోగా ‘మేజర్‌’ అనే పేరుతో సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోనీ పిక్చర్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఓ ఆర్మీ మేజర్‌ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రేణదేశాయ్ ను తీసుకున్నారన్న పుకార్లు గుప్పుమన్నాయి. అయితే, దీనిపై రేణుదేశాయ్ ఈ సినిమా పైన క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఇవన్నీ పుకార్లే అని కొట్టి పారేసింది. తాను ఎలాంటి సినిమాల్లో నటించడం లేదని స్పష్టం చేసింది. సినిమాలో తాను నటిస్తున్నానని చాలా మంది తనకి అభినందనలు తెలుపుతున్నారని అయితే ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తాను ఏదైనా సినిమాకు కమిట్ అయితే ఆ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తానని చెప్పింది.

పోండి సార్ మీతో కటీఫ్ అంటూ.. రామజోగయ్య శాస్త్రి ట్వీట్


కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడుతుంటే సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారారు. లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్స్‌ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. మూవీ షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. అయితే రాము మాత్రం షూటింగ్స్‌ చేయడమే కాదు వాటిని ఆన్‌లైన్ రిలీజ్‌ చేసి తెగ సంపాదిస్తున్నాడు. త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్‌, న‌గ్నం వంటి మూవీలను రిలీజ్ చేశారు.
క్లైమాక్స్‌కి టిక్కెట్ ధ‌ర రూ. 100 ఉండగా… న‌గ్నంకి రూ.200 వ‌సూలు చేస్తున్నాడు. క్లైమాక్స్‌ రిలీజైన కొద్దిసేపటికే పైరసీ అవగా… నగ్నం విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆర్జీవీ. మరోవైపు కరోనా సినిమా కూడా చేస్తున్న రాము తన తర్వాతి సినిమా టైటిల్‌ ‘పవర్ స్టార్’ అని ప్రకటించి మరోసారి వార్తలోకి వచ్చారు.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

ఇలా ప్రతి విషయంలో వివాదాలు సృష్టిస్తున్న రాము వ్యవహారశైలి తనకు నచ్చడం లేదని ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి అంటున్నారు. ఆర్జీవీ తీరుతో తాను హర్ట్‌ అయ్యానని పరోక్షంగా చెబుతూ ట్వీట్‌ చేశారు. రాముతో కటీఫ్ చెప్పేశారు. ‘ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం…మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్….మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు..తెలివిగా ఎదో చెప్పేస్తారు…నేను హర్ట్ :(’ అని ట్వీట్‌ చేసిన శాస్త్రి దాన్ని ఆర్జీవీ ట్యాగ్‌ చేశారు. దీనికి రాము ఎలాంటి రిప్లై ఇస్తారో చూడాలి.

వైరల్ ఫేక్ న్యూస్ కి ఇవే నిజాలు!

Fake news alert

Fake news alert

కరోనా నేపథ్యంలో గత మూడు నెలల్లో, వందలాది నకిలీ వార్తలు వైరల్ అయ్యాయి.కొంతమంది వ్యక్తుల మూర్ఖత్వం నుండి ఉత్పన్నమయ్యే ఈ నివేదికలు కూడా చాలా భయాన్ని వ్యాప్తి చేశాయి మరియు ప్రజలలో గందరగోళం మరియు ఉద్రిక్తతను సృష్టించాయి. అటువంటి వార్తల్లో కొన్ని వార్తలకు నిజాలు తతీసుకుందాం..

వైరల్ – అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరియు అతని భార్య కరోచీలోని ఆసుపత్రిలో కరోనా సోకడంతో మరణించారు.

నిజం: దావూద్ కు కరోనా ఇన్ఫెక్షన్ లేదని, ఆయన మరణించలేదని దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్ స్పష్టం చేశారు.

వైరల్– డాక్టర్ రమేష్ గుప్తా రాసిన ‘మోడరన్ యానిమల్ సైన్స్’ పుస్తకంలో కరోనా వైరస్ సమాచారం చాలా సంవత్సరాల ముందు ఇవ్వబడింది.

నిజం: జలుబు మరియు జలుబు లక్షణాలను నయం చేయడానికి డాక్టర్ గుప్తా పుస్తకంలో మందులు వ్రాయబడ్డాయి. భారత ప్రభుత్వం కూడా ఈ వాదనను అబద్ధమని పేర్కొంది.

వైరల్ – కరోనా పరీక్షతో బిల్ గేట్స్ ప్రజల శరీరాలల్లోకి ఇన్సర్ట్ చేసే చిప్ తయారు చేస్తున్నారు. తద్వారా ప్రజలను పర్యవేక్షించవచ్చు.

నిజం: బిల్ గేట్స్ ప్రజలను డిజిటల్ ధృవీకరించడం గురించి మాట్లాడారు.

వైరల్ – దేశవ్యాప్తంగా పాఠశాలలను తెరవడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

నిజం – వివిధ రాష్ట్రాలలో కొన్ని షరతులతో 10 వ మరియు 12 వ తరగతి పరీక్షలను మాత్రమే నిర్వహించడానికి మరియు పాఠశాలలను తెరవడానికి హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.

వైరల్ – మీరు ఒక సంవత్సరం బయటకు వెళ్ళలేరని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐసిఎంఆర్ పేరిట వాట్సాప్ సందేశంతో 21 మార్గదర్శకాలు విడుదల చేసింది.

నిజం-ఐసిఎంఆర్ కరోనా టీం సభ్యుడు డాక్టర్ సుమిత్ అగర్వాల్ మాట్లాడుతూ ఆ న్యూస్ నకిలీదని పేర్కొన్నారు.

వైరల్ – తాగేవారికి కరోనా వైరస్ ఉండదని వార్తాపత్రిక కట్టింగ్ ఒకటి బాగా షేర్ అయింది.

నిజం – దర్యాప్తులో అలాంటి వార్తలు ఏవీ కనుగొనబడలేదు. డబ్ల్యూహెచ్‌ఓ మద్యం సేవించిన తర్వాత కరోనారాకుండా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్‌ వాష్‌ ను ఉపయోగించమని కోరింది.

వైరల్ – కోవిడ్ -19 గురించి డెటోల్‌ కు ఇప్పటికే తెలుసు, కరోనావైరస్ పేరు అతని బాటిల్ వెనుక భాగంలో వ్రాయబడింది.

నిజం – కంపెనీ యొక్క కొన్ని ఉత్పత్తులు కరోనా వైరస్ కి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉన్నాయని చెప్పబడింది. అయినప్పటికీ, కోవిడ్ -19 తో డెటోల్ ఉత్పత్తిని పరీక్షించలేదు.

వైరల్ – చైనా కరోనా స్పెషలిస్ట్ టీ లోని రసాయనాలు కరోనావైరస్ ను చంపగలవని లి వెన్లియాంగ్ మరణానికి ముందు పేర్కొన్నాడు.

నిజం – డా. లి వెన్లియాంగ్ కరోనా వైరస్ నిపుణుడు కాదు, కంటి నిపుణుడు. అతను కరోనా సంక్రమణతో మరణించాడు. అతని పేరు మీద వైరల్ అయిన న్యూస్ నకిలీదని తేలింది.

వైరల్ – కరోనా వైరస్ ను తాజాగా ఉడికించిన వెల్లుల్లి నీటితో చికిత్స చేయవచ్చు.

నిజం – WHO ట్వీట్ చేసింది – వెల్లుల్లితో కరోనావైరస్ చికిత్సకు బలమైన ఆధారాలు లేవు.

వియ్యంకుడు సాయి తేజ్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మంచు మనోజ్!


అదేంటి.. మంచు మనోజ్‌, సాయి ధరమ్‌ ఇద్దరూ యువ హీరోలే కదా అప్పుడే వియ్యంకులు ఎలా అవుతారని అనుకుంటున్నా? పైగా, సాయిధరమ్‌కు పెళ్లి కూడా కాలేదు.. ఇద్దరి మధ్య ఇలాంటి బంధుత్వం ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?. మనోజ్ లెక్క ప్రకారం ఇద్దరూ వియ్యంకులు అయ్యారు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్‌ ద్వారా వెల్లడించాడు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

‘భౌతిక దూరం పాటిస్తూ టాంగో, జోయాలు డేట్ చేస్తున్నారు. మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ప్రత్యేక ధ‌న్యవాదాలు. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభ‌లేఖ‌లు వేయిస్తాం’ అని రాసుకొచ్చాడు. ఇక్కడ టాంగో, జోయా అంటే ఇద్దరి పెంపుడు కుక్కలు. రెండు ఒకే బ్రీడ్‌కు చెందినవే. మనోజ్ దగ్గర ఆడ కుక్క ఉంటే.. తేజ్ దగ్గర మగ కుక్క ఉన్నంటుంది. ఎప్పుడు హుషారుగా కనిపిస్తూ.. ప్రతి ఒక్కరితో బంధుత్వం కలుపుకోవడం మనోజ్‌కు అలావాటు. అందుకే సాయి ధరమ్‌తో పాటు తమ పెట్‌ డాగ్స్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు వారి హీరో సరదా ట్వీట్‌ చేశాడు.

https://twitter.com/HeroManoj1/status/1277454303771279360?s=20

కాగా, వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్‌ ఆ మధ్య సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాడు. తన భార్యతో విడాలకులు తీసుకున్నాడు. స్వల్ప విరామం తర్వాత అతను మళ్లీ చురుగ్గా మారాడు. ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సొంత ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్పై మనోజే ప్రొడ్యూసర్. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌ సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన థీమ్ వీడియో, నో పెళ్లి అనే సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..


తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న ఆయనకు అన్ని విధాలా కలిసొస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరకు కేసీఆర్ మాటే నెగ్గుతోంది. తాజాగా హైకోర్టులోనూ కేసీఆర్ తన పంతం నెగ్గించుకోవడం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర విడిపోయాక కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మాణం చేయాలని సంకల్పించారు. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో తొలి నుంచి ప్రభుత్వ వాదనను వ్యతిరేకించినా హైకోర్టు తాజాగా సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ వాసుల్లో.. కరోనా కొత్త లక్షణం..!

టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ సచివాలయంలో అడుగుపెట్టలేదు. కేసీఆర్ తొలి నుంచి వాస్తు, న్యూమరాలజీ, జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారని తెలంగాణలోని ప్రతీఒక్కరికి తెల్సిందే. ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయం వాస్తుపరంగా ఆయనకు కలిసి రాదనే కొందరు పండితులు ఆయనకు సూచించినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆయన పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని భావించారనే టాక్ రాజకీయవర్గాల్లో విన్పించింది. ఇందులో వాస్తవం ఎంతుందోగానీ మొత్తానికి పాత సచివాలయాన్ని కూల్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అయ్యారు. ఈమేరకు కొత్త సచివాలయ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో సచివాలయం కూల్చివేతకు బ్రేక్ పడింది.

ఇప్పుడున్న సచివాలయం కూల్చివేయడం వల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని దాదాపు పది పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. కొన్నినెలలుగా దీనిపై హైకోర్టు విచారణ చేపడుతోంది. తొలినాళ్లలో ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టింది. అయితే సోమవారం ప్రభుత్వం తన వాదనలను బలంగా విన్పించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వాస్తు వంటి అంశాలను చూపకుండా సాంకేతికపరమైన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లి విజయవంతంమైనట్లు సమాచారం. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు తిరగడానికి కూడా స్థలం లేదని కోర్టుకు విన్నవించింది. ప్రభుత్వ వాదనకు మద్దతుగా ఫైర్ డిపార్ట్ మెంట్ సర్టిఫికెట్ కోర్టు ముందుంచింది. సాంకేతికంగా ఏయే లోపాలు ఉన్నాయో ప్రభుత్వం కమిటీ నియమించి దాని నివేదిక ఆధారంగా పనులు చేపడుతున్నట్లు కోర్టుకు తెలిపింది.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

అంతేకాకుండా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో హైకోర్టుకు జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టంగా తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని ప్రభుత్వం హైకోర్టులో తన వాదన విన్పించింది. ప్రభుత్వ వాదనకు బలం చేకూరడంతో హైకోర్టు తీర్పుకు సర్కారుకు అనుకూలంగా వచ్చింది. దీంతో కొత్త సచివాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాతసచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలనే కేసీఆర్ పంతం నెగ్గడంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు తెలంగాణలో ఎదురులేదని మరోసారి హైకోర్టు తీర్పు ద్వారా వెల్లడైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వకీల్‌ సాబ్‌లో పవన్‌ కళ్యాణ్‌ లాయర్ స్టిల్‌ లీక్‌..

Vakeel Saab


రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంత విరామం తర్వాత ఆయన వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ లేటెస్ట్ ప్రాజెక్ట్ వకీల్ సాబ్. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బోనీ కపూర్తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

సాధారణంగా పవన్‌ మూవీ అంటే ఇండస్ట్రీలో భారీ క్రేజ్‌ ఉంటుంది. లాంగ్‌ బ్రేక్‌ తర్వాత వస్తున్నది కాబట్టి ‘వకీల్‌ సాబ్‌’పై అందరి దృష్టి నెలకొంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన పవన్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్, ఫస్ట్‌ సింగిల్.. మగువా మగువా (లిరికల్‌ వీడియో)కు విపరీతమైన స్పందన వచ్చింది. దాంతో మూవీపై క్రేజ్‌ అమాంతం పెరిగింది. లాక్‌డౌన్‌ సడలింపులు రావడంతో షూటింగ్‌ తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇలాంటి టైమ్‌లో చిత్ర యూనిట్‌కు తగిలింది. ఈ మూవీలో కోర్టు సీన్ ఫొటో లీక్ కావడం చర్చనీయాంశమైంది.

లాయర్ పాత్రలోని పవన్‌ నల్ల కోటుతో నిలుచొని వాదనలు వినిపిస్తున్న ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది. ఫొటోలో పవన్‌ ఎడమవైపు అంజిలి కూర్చుని ఉంది. ఫొటోపై ఉన్న వాటర్ మార్క్‌ చూస్తుంటే… వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతుండగా ఈ ఫొటోను లీక్‌ చేసినట్టు అర్థమవుతోంది. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

నిన్ను చూస్తే బాధేస్తోంది… ఆర్జీవీపై పూనమ్‌ కౌర్ ఫైర్!


సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపారు. ‘పవర్ స్టార్’ అనే టైటిల్‌తో మూవీ చేస్తున్నానని చెప్పడంతో అది పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశించి తీస్తున్నదే అన్న రచ్చ మొదలైంది. ‘ఆర్జీవి వర‌ల్డ్ థియేట‌ర్‌లో రిలీజ్ కానున్న నెక్ట్స్ మూవీ టైటిల్ ప‌వ‌ర్ స్టార్. పీకే, ఎంఎస్‌, ఎన్‌ బి, టీఎస్‌, ఒక రష్యన్‌ వుమన్‌, న‌లుగురు పిల్లలు, 8 గేదెలు, ఆర్జీవీ ఇందులో నటిస్తున్నారు. ఈ పాత్రలను అర్ధం చేసుకున్న వారికి ఎలాంటి బ‌హుమ‌తులు ఇవ్వబడ‌వు’ అని ట్వీట్‌ చేశాడు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

ఈ ట్వీట్‌ను షేర్ చేసిన నటి పూనమ్‌ కౌర్ నేరుగా పేరు ప్రస్తావించకుండా ఘాటు విమర్వలు చేసింది. ‘ఈ చిత్రంలో అందులో ఆర్జీవీ అనే పాత్రను కూడా చేర్చండి. అమ్మాయిలకు ఫోన్‌ చేసి వాళ్ల ఎమేషనల్‌ వీక్‌నెస్‌ ఏంటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అసభ్యమైన భాషను ఉపయోగించమని ప్రేరేపిస్తాడు. కొన్ని ట్వీట్లు పంపి వాటిని షేర్ చేయమంటాడు. అలా చేయగానే మీడియాకు సమాచారం వెళ్తుంది. మిమ్మల్ని నా చిన్నపుడు గౌరవించేదాన్ని.. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని చూసి బాధపడుతున్నా’ అని పూనమ్ ట్వీట్ చేసింది.

https://www.instagram.com/p/CB99OjAl5Lz/

అనంతరం ఆమె మరో ట్వీట్ చేసింది. ‘ ఆ దేశద్రోహి డైరెక్టర్ చేసిన ఫోన్ కాల్స్ రికార్డు చేసి ఉంటే బాగుండేది. అతడు నాకు ఫోన్ చేసి ఒకరి వ్యక్తిత్వం గురించి మాట్లాడాలని గంటల తరబడి నన్ను బ్రెయిన్ వాష్ చేసేవాడు. నాకు కొన్ని ట్వీట్లు పంపి షేర్ చేయమనేవాడు. ఆ ట్వీట్లను సంబంధిత పార్టీ వ్యక్తికి పంపించాను. మీడియాలో కొందరైనా నిజాయితీగా ఉన్నందుకు ఆ దేవుడికి కృతజ్క్షతలు. లేకపోతే నీ ఉద్దేశాలు ఏమిటో తెలిసేవి కాదు’ అని పూనమ్ రాసుకొచ్చింది.

ముగ్గురు హీరోయిన్లతో నాని రొమాన్స్!


టాలీవుడ్‌లో ఈ మధ్య డబుల్ హీరోయిన్ల ఫార్ములా నడుస్తోంది. చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటున్నారు డైరెక్టర్లు. యువ హీరోలతో పాటు సీనియర్ యాక్టర్లు కూడా ఇదే ఫార్ములా కొనసాగిస్తున్నారు. నేచురల్ యాక్టర్ నాని కూడా ఇదే కోవలో ఉన్నాడు. పిల్ల జమిందార్, ఎవడే సుబ్రమణ్యం, జెంటిల్మెన్, మజ్ఞు, కృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో ఇద్దరేసి హీరోయిన్లతో నటించాడు. జెర్సీ, గ్యాంగ్‌ లీడర్లో ఒక్క హీరోయిన్‌తో సరిపెట్టాడు. కానీ, ఇప్పుడు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్‌కు రెడీ అయ్యాడు. నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్‌’ . కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీకి ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వెరైటీ టైటిల్‌ పెట్టి అంతే వెరైటీగా దాన్ని రివీల్‌ చేసిన చిత్రం గురించి ఆసక్తికర విషయం తెలిసింది.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

ఈ మూవీలో నాని మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తాడట. అది తిపాత్రాభినయమా? కాదా? అనేది సస్పెన్స్‌. ముగ్గురు హీరోయిన్స్‌ కూడా ఉంటారట. ఇప్పటికే సాయి పల్లవిని సెలెక్ట్ చేశారని సమాచారం. మరో హీరోయిన్‌‌గా చేయమని రష్మిక మందాన్నను అడిగితే ఆమె నో చెప్పింది. మాళవిక మోహనన్‌‌ని, శోభిత ధూళిపాళని తీసుకున్నారని సమాచారం. ప్రధాన హీరోయిన్‌ సాయి పల్లవినే అని తెలుస్తోంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమవ్వాల్సిం ది. కానీ లాక్ డౌన్ కారణంగా ఇంకా పట్టాలెక్కలేదు. మరోవైపు విలన్‌గా నటించిన ‘వి’ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇంకోవైపు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ‘టక్ జగదీశ్‌’ చేస్తున్న నాని.. వివేక్ ఆత్రేయతో ఒక సినిమాకు కమిటయ్యాడు ఇంకోవైపు నిర్మాతగా కూడా బిజీగానే ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో కరోనా దెబ్బకు షూటింగ్స్‌ ఆగిపోవడంతో అందరిమాదిగానే అతను ఇంటికే పరిమితమయ్యాడు.

సరిహద్దుల్లో కరోనా కలకలం.. అసలేం జరిగింది?


దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజుకు రోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 5లక్షల 48వేల 318కి చేరాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 2లక్షల 10వేల 120లు ఉండగా 3లక్షల 21వేల 273మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 16,475మంది కరోనా మృతిచెందారు. గడిచిన 24గంటల్లోనే 19వేల 459 కొత్త కేసులు నమోదైనట్లు తాజాగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే భారత సరిహద్దుల్లో కరోనా కలకలం రేపుతోంది.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలోనే సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాల్వాన్ లోయలో ఇరుదేశాల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 21మంది వీరమరణం పొందగా చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ఓ కమాండర్ స్థాయి అధికారి మృతిచెందినట్లు చైనా ప్రకటించింది. నాటి నుంచి ఇరుదేశాల సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలు ఇరుదేశాల సరిహద్దుల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

తాజాగా భారత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు కరోనా పాజిటివ్ రావడంతో కలకలం మొదలైంది. ఆదివారంనాడు ఏకంగా 21మందికి క‌రోనా పాజిటివ్ తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారందరినీ ఐలేషన్ కి తరలించారు. ఇప్పటికే భారత సైన్యంలో 305మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వారందరికీ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరంతా త్వరలోనే కోలుకుంటారని ఆర్మీ వర్గాలు చెబుతోన్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో జవాన్లకు కరోనా సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

జగన్ కు కేసుల ఫీవర్ పోలేదా?

మరోవైపు చైనాలోనూ కరోనా మహమ్మరి సేకండ్ వేవ్ చూపిస్తుంది. చైనాలోని బీజింగ్లో కరోనా విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కరోనా.. మరోవైపు చైనాతో యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనైనా సత్తా భారత ఆర్మీకి ఉందని కేంద్రం చెబుతోంది. అయితే మన్ముందు పరిస్థితులు ఎలా మారుతాయనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.