Home Blog Page 8432

ఏపీలో టీడీపీ పతనానికి తెలంగాణ ఫార్ములా?


తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయినట్టే. కీలక నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోవడంతో ఇక తెలంగాణలో ఆ పార్టీ అంతర్థానం అయినట్టే కనిపిస్తోంది. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ బలీయమైన శక్తిగా ఉండేది. 2009లో కూడా టీఆర్ఎస్ కు తక్కువ సీట్లు ఇచ్చి మెజార్టీ సీట్లలో టీడీపీ పోటీచేసింది. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేయడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజయవంతమయ్యారు. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఏపీలో కూడా అమలు చేసే దిశగా వైసీపీ అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

టీడీపీని నమ్ముకున్న నేతలు, కార్యకర్తల్లో ఆ నమ్మకం సడలేలా వైసీపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోందని పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది. దారికి రాని బలమైన టీడీపీ నేతలను జైలుకు పంపడం..తద్వారా అలిగేషన్స్ ఉన్న నేతలను డిఫెన్స్ లో పడేయడం.. మాజీ మంత్రులు, నేతలను వైసీపీలో చేర్చుకోవడం.. టీడీపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తున్నట్టు అర్థమవుతోంది.

ప్రస్తుతం జగన్ ధాటికి ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్భర స్థితిలోకి జారిపోయింది. పార్టీ తన ఉనికి కాపాడుకోవడానికి.. నేతలను నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కావడం లేదు. తెలంగాణలో లాగే ఏపీలోనూ చంద్రబాబు ప్రయత్నాలన్నీ ఫలించడం లేదు. చంద్రబాబుపై నేతలు, కార్యకర్తల్లో నమ్మకం సడలేలా చేయడంలో జగన్ వ్యూహాలు బాగా పనిచేస్తున్నాయంటున్నారు.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

కానీ ఇప్పటికీ టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబే టీడీపీకీ ఆయువు పట్టు అని పేర్కొంటూ ప్రచారం చేస్తున్నా నేతలు, కార్యకర్తల్లో ఆయనపై నమ్మకం కుదరడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను కూడా ప్రభావితం చేయగలనని ఒకప్పుడు ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు ఆ చాణక్యం పనిచేయకపోవడం.. ఏపీలో వరుస ఎదురుదెబ్బలు టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీపై చంద్రబాబు పట్టు సడలిపోతుందనడానికి తాజా ఉదాహరణలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆ జిల్లాలో నిరసన తెలుపాలని చంద్రబాబు పిలుపునిచ్చినా ముఖ్య టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ నిరసన చేపట్టలేదు. పార్టీ కార్యకర్తలు కూడా హాజరు కాలేదు. ఇక అచ్చెన్నాయుడును అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నా అక్కడ టీడీపీ నేతల్లో ఉలుకుపలుకూ లేదు. క్యాడర్ కూడా ప్రశాంతంగానే ఉంది.

ఇలా చంద్రబాబు పిలుపునిచ్చినా క్యాడర్, నేతలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. స్వయంగా నారాలోకేష్ పర్యటించినా అనంతపురం, శ్రీకాకుళంలో ఆయన వెంట ఆ జిల్లా టీడీపీ నేతలు ఉండలేదు. దీన్ని బట్టి జగన్ ధాటికి టీడీపీ నేతలంతా సర్దుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన స్ట్రాటజీనే ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు. చంద్రబాబుపై , పార్టీపై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు. తద్వారా టీడీపీ నేతలను దూరం చేసే ఎత్తుగడను అమలు చేస్తున్నారు.

-ఎన్నం

ఎన్టీఆర్ జాన్వీకి రాజకీయానికి ఫిక్స్ !


త్రివిక్రమ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గతంలో పండించిన కామెడీ రేంజ్ లో కాకపోయినా.. కాస్త డెప్త్ డైలాగ్స్ తో భారీ హంగుఆర్భాటలతో భారీ సినిమాలు చేసి వరుసగా రెండు భారీ సక్సెస్ లు కొట్టాడు. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అలవైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తరువాత, త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే సినిమా మొత్తం తారక్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా లేక ప్లాష్ బ్యాక్ లో సెకెండ్ రోల్ వస్తోందా అనేది తెలియాల్సి ఉంది.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

అయితే తారక్ రెండు పాత్రల్లో ఒక పాత్ర గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, తారక్ ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట. పలనాడు ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకుడిగా తారక్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. మెయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయనున్నారు. ఆమె సినిమాలో మెయిన్ హీరోయిన్ అట.. తారక్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తే.. జాన్వీకి మంచి లాంచింగ్ అవుతుంది. ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారు త్రివిక్రమ్.

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?

పూజా అయితే చెప్పిన టైంకు డేట్స్ ఇస్తుందని త్రివిక్రమ్ నమ్మకం. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?


పాత ఒక రోత.. కొత్త ఒక వింత అన్న సామెతను అక్షరాల అమలు చేసేందుకు గులాబీ దళపతి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ లోని సీనియర్లకు ఇక పదవులు ఇవ్వరాదని.. యువతను పార్టీలో ప్రోత్సహించాలని యోచిస్తున్నారట.. గులాబీపార్టీకి కాబోయే అధిపతి కేటీఆర్ కు రెడ్ కార్పొట్ పరిచేందుకే ఇలా చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ లో సీనియర్లు.. ఆది నుంచి పార్టీని పట్టుకొని ఉన్న నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి సహా ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ఉన్న జోగు రామన్న,మహేందర్ రెడ్డి తదితర పాత నేతలకు ఇక పదువులు ఇచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాత నేతలకు మంగళం పాడిన కేసీఆర్ కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. పువ్వాడ అజయ్,మల్లారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి,మల్లారెడ్డి లాంటి కొత్త నేతలను మంత్రులను చేసి ఆశ్చర్యపరిచాడు.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

రెండోసారి ప్రజలు పూర్తి మెజార్టీ ఇవ్వడంతో కేసీఆర్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ సమాజం భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చనిపోయిన కర్నల్ సంతోష్ కుటుంబానికి 5 కోట్లు ఇచ్చి ఇలా అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక తన మాట వినని వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆదరించిన వారిని నెత్తిన పెట్టుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చినా నాన్చివేతతో వ్యవహరించి చివర్లో ట్విస్ట్ తో హీరోగా మిగిలిపోతున్నారు.

తెలంగాణలో అధికారంపై ఆశలు పెంచుకుంటున్న కాంగ్రెస్, బీజేపీలకు కొరకరాని కొయ్యగా మారిపోతున్నారు. రెండోసారి గద్దెనెక్కిన కేసీఆర్ లో ఈ స్పష్టమైన మార్పు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

ఈ క్రమంలోనే తన కుమారుడు కేటీఆర్ కు రంగం సిద్ధం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాత తరం నేతలకు ఎమ్మెల్సీలు సహా రాజ్యసభ విషయంలో నమ్మిన వారికే పదవులు ఇవ్వడం.. యువతను ప్రోత్సహించి కేటీఆర్ వర్గాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్లను పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు టీఆర్ఎస్ కు ఈ మధ్య వస్తున్నాయట.. చాలా మంది పాత సీనియర్లు టీఆర్ఎస్ అధిష్టానం తీరుతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళుతున్నారు. కానీ ప్రయోజనం ఉండడం లేదని వాపోతున్నారు. దీంతో గులాబీ తోట కొత్త పుష్పాలకే ఇక ప్రాధాన్యం దక్కబోతోందని ఆ పార్టీలో చర్చ మొదలైంది.

-నరేశ్ ఎన్నం

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?


దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించించిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ అమల్లోకి ఉన్న సమయంలో పాజిటివ్ కేసులు పదుల సంఖ్యలో మాత్రమే నమోదయ్యావి. లాక్డౌన్ కొద్దిరోజులు ఉంటుందని భావించిన కేంద్రానికి వైరస్ షాకిచ్చింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగుతుండటం, లాక్డౌన్ అమలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతోపాటు కేంద్రానికి ఆదాయం తగ్గిపోతూ వచ్చింది. దీంతో చేసేదీమేక కేంద్రం లాక్డౌన్లో భారీ సడలింపులను ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్రాలు కూడా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల పేరిట సడలింపులు ఇచ్చాయి.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

ప్రస్తుతం లాక్డౌన్ 5.0కొనసాగుతోంది. ఈనెల 30వరకు ఇది కొనసాగనుంది. దీనిని కేంద్రం ఆన్ లాక్ 1.0 అంటోంది. ఇటీవల ప్రధాని మోదీ సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇకపై లాక్డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు. జూన్ 30తర్వాత ఆన్ లాక్ 2.0పైనే దృష్టిసారించినట్లు తెలిపారు. కరోనా ఎంట్రీ సమయంలో ఆదాయం కంటే ప్రజల ప్రాణాలమే ముఖ్యమని చెప్పిన మోడీ ప్రభుత్వం ప్రస్తుతం కరోనాతో సహజీవనం అనే కొత్త నినాదాన్ని ఎంచుకొంది. దీనినే రాష్ట్రాలు కూడా ఫాలో అవుతోన్నాయి. దీంతో కరోనా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వాలు లైట్ తీసుకోవడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

ఇక తెలంగాణలో గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్‌, రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా టెస్టులను ప్రభుత్వం తక్కువ టెస్టులు చేయడంతోనే నేడు పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైందని బీజేపీ ఆరోపిస్తుంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారు. దీనికి ప్రతీగా టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

ఈనేపథ్యంలోనే కేంద్రం బృందం రాష్ట్రానికి నాలుగోసారి రానుండటం ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పరిస్థితిపై అధ్యాయనం చేసి కేంద్రానికి నివేదికలను పంపనుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేంద్రం బృందం పర్యటించి ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. తగిన సలహాలు, సూచనలు ఇస్తుంది. ఈ బృందం రాష్ట్రంలోని పరిస్థితి తెలుసుకునేందుకు వ‌స్తోందా లేక‌పోతే బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారును టార్గెట్ చేసేందుకేనా అనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కేంద్రం బృందం తెలంగాణలో మూడుసార్లు పర్యటించి తగు సూచనలు చేసింది. అయినప్పటికీ కరోనా కేసులు సంఖ్య తగ్గకపోవడంపై మరోసారి పరిశీలన చేయనుంది. ప్రభుత్వం కరోనాపై తీసుకుంటున్న చర్యలను పరిశీలించిన కేంద్రానికి నివేదిక అందించనుంది. బీజేపీ రాష్ట్ర నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

అసలు రంగు బయటపెట్టిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు


వైసీపీ ధిక్కార ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిన్న ఢిల్లీ వెళ్లినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఆయన కదలికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు వైసీపీ పార్టీ నేతలను ఆగ్రహానికి గురిచేయడంతో చర్యలకు సిద్ధం అయ్యారు. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా షో కాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణం రాజు బీజేపీ గూటికి చేరాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని నిర్ధారించుకున్న తరువాతే పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!

ఓ ప్రక్క వైసీపీ పార్టీ అధినేత జగన్ కి నేను విధేయుడను అని చెవుతూనే..షో కాజ్ నోటీసులపై అనేక అభ్యంతర వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అసలు నాకు షో కాజ్ నోటీసులు ఇచ్చే పద్ధతి ఇదేనా? నోటీసులు పంపడానికి మీరెవరూ? అన్నట్లు ఆయన వాదన సాగింది. ఇక పార్టీ అనుమతి లేకుండా నిన్న ఢిల్లీ వెళ్లిన కృష్ణం రాజు భారత ఎన్నికల కమిషనర్ తో గంటకు పైగా భేటీ అయ్యారు.ఐతే నేడు రఘురామ కృష్ణం రాజు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ని కలవడం మరింత చర్చకు దారితీస్తుంది.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?

జగన్ అనుమతి లేకుండా బీజేపీ మంత్రితో ఆయన కలవడంతో వైసీపీతో బంధానికి బై బై చెప్పి, బీజేపీతో దోస్తీ చేయడానికి సిద్ధం అవుతున్నాడన్న సంకేతాలు పంపారు. ఇది వైసీపీకి తెలిసిన అంశమే కావడంతో వారికి పెద్ద ఆశర్యం కలగకపోవచ్చు. అలాగే రఘురామ కృష్ణం రాజు పై సస్పెన్షన్ వేటు పడడంతో పాటు పార్లమెంటు లో కూడా చర్యలు తీసుకునేలా తీర్మానం చేసే అవకాశం ఉంది. ఇక మనసులో బీజేపీ పంచన చేరాలనే ఉద్దేశం పెట్టుకొని కృష్ణం రాజు వైసీపీ పై ప్రతికూల వ్యాఖ్యలు చేశాడన్న విషయం..స్పష్టం అయ్యింది. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అని తెలుస్తుండగా, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలివుంది. మొత్తంగా రఘురామ కృష్ణం రాజు మనసు ముసుగు తీశాడు.

అదృష్టం అంటే అతడితే.. రాత్రికిరాత్రే కోటిశ్వరుడయ్యాడు..!


అప్పుడప్పుడు కొందరీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతుంటాయి.. అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే సంఘటన.. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో అనడానికి ఇదొక ప్రతక్ష్య ఉదాహరణగా నిలుస్తుంది. అతనొక కూలీ.. గనిలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.. రోజులానే ఆరోజు కూడా పనికి వెళ్లాడు.. అదే అతడి జీవితాన్ని మార్చేవేసింది.. అప్పటిదాకా గని కార్మికుడిగా కాలం వెళ్లదీసిన అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కరోజులోనే ఆ వ్యక్తి కోటిశ్వరుడిగా మారాడు.. దీంతో అదృష్టం అంటే అతడి దేనని తోటి కార్మికులు జలసీ ఫీలవుతున్నారు. ఈ సంఘటన ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో జరిగింది.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

ఆఫ్రికాలోని టాంజానియా గనుల్లో లైజర్ అనే వ్యక్తి కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా గనిలో తవ్వకాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే ఆరోజు కూడా లైజర్ గనిలో తవ్వకాలు చేపట్టాడు. అయితే అతడికి ఉన్నట్టుండి రెండు పెద్ద రత్నాలు లభించాయి. లైజర్ ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం అతడికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి వాటిని కొనుగోలు చేసింది.

ఆ రెండు రత్నాలకు ప్రభుత్వం ఏకంగా అతడికి రూ.25కోట్లను చెల్లించింది. ఇంకేముందీ అతడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. రెండు రత్నాల్లో ఒకటి 9.27కేజీల బరువు ఉండగా, మరొకటి 5.10కిలోల బరువు ఉందని సమాచారం. మిరేరానీ గనుల్లో ఎప్పటి నుంచో తవ్వకాలు జరుపుతున్నా.. ఇంత భారీ సైజులో రత్నాలు ఎప్పుడు లభించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిసారి అంతపెద్ద రత్నాలు దొరికినట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం.

‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

అదృష్టమంటే లైజర్ దేనని తోటి కార్మికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తమకెప్పుడు ఆ అదృష్టం వస్తుందోనంటూ ఆశతో మరింత ఉత్సాహంతో పని చేస్తున్నారు. వీరిలో ఇంకేంతమంది అదృష్టవంతులుగా మారుతారో వేచి చూడాల్సిందే..! అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే అతడు గని కార్మికుడిగా పని చేసేనందుకు వల్లే అతడికి అదృష్టం లభించిందనే విషయాన్ని మర్చిపోకూడదు.. ప్రతీఒక్కరు పెద్ద జీతం.. మంచి పని వస్తేనే చేస్తా అని ఖాళీగా కూర్చోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోతే ఏదొక ఒకరోజు అదృష్టం కలిసొస్తుందనేది ఈ సంఘటన ద్వారా అర్థం అవుతుంది.

ప్రమాదంలో పిల్లల ప్రాణాలు!

Chidrens corona

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మరిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం కోవిద్, దక్షిణ ఆసియాలోని లక్షలాది మంది పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్‌ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వివరించింది.

కరోనా కేసులే కాదు మ‌ర‌ణాల సంఖ్య మరింత పెరుగుతుంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. ప్రజలు మాత్రం కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని డబ్ల్యూహెచ్ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాబోయే రోజుల్లో వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం వుంది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం ” అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్!

కరోనాకు ఈ ఏడాది చివరి లోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, సామర్థ్యంలో రెండు ఫార్మా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. అందులో ఆస్ట్రాజెనికా మొదటి స్థానంలో ఉండగా.. మోడర్నా కూడా పోటీ పడుతుందని చెప్పుకొచ్చారు. కరోనా కోసం ప్రపంచవ్యాప్తంగా 200 కన్నా ఎక్కువగా వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతుండగా.. 15 మాత్రమే క్లినిక్ ట్రయల్స్ దశలో ఉన్నాయని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. సినోవాక్ సహా చైనాకు చెందిన పలు సంస్థలతో కరోనాకు సూది మందు అభివృద్ధి గురించి మాట్లాడిందని సౌమ్య పేర్కొన్నారు.

సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?


బిజెపి ఎంపీ సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ లు సమావేశం అయిన వీడియోను బయట పెట్టిన వైసీపీ రాజకీయంగా లబ్ధిపొందాలని చూసింది. ఈ అంశాన్ని సొంత మీడియాలో మూడు రోజులపాటు కథనాలు, వార్తల రూపంలో ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఎంపీ సుజనా చౌదరిపై నిఘా పెట్టడంతో ఈ వీడియో వైసీపీకి లభించిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఓగట్టి షాక్ తగిలింది. వైసీసీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు సుజనను కలిసి వీడియోలకు చిక్కినట్లు చర్చ నడుస్తోంది. దీంతో వైసీపీ అధిష్టానంలో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని బయటపెడితే పార్టీ, ప్రభుత్వం పరువు పోతుందని ఆలోచించిన రహస్యంగా ఉంచుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న ఇద్దరు కీలకమైన వ్యక్తులు సుజనను కలిసి వీడియోలో దొరికిన నేతలను పిలిచి, సుజనాను ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏ అంశాలు మాట్లాడారనే వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఒక పక్క వైసీపీ చెందిన పది మంది ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో పుటేజ్ ల దృశ్యాలు ఆ వార్తలు నిజం చేసేదిగా ఉండటంతో వైసీసీలో కలవరం మొదలైంది.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ సమస్యలను ఎదుర్కొంటుంది. షోకాజ్ నోటీస్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. ఆయనకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ ను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తనకు బి ఫామ్ ఇచ్చిన లెటర్ హెడ్ నుంచి కాకుండా వేరే లెటర్ హెడ్ నుంచి షోకాజ్ నోటిస్ ఇచ్చారనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సుజనాను వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసిన విషయం వెలుగులోకి రావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితిగా విశేషకులు భావిస్తున్నారు.

‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

మరోవైపు తనపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచడాన్ని ఎంపీ సుజనా చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతల్లో గుబులు మొదలైంది. తమపైనా ప్రభుత్వం నిఘా ఉంటుందని భావిస్తున్నారు.

చంద్రబాబు బినామీ… టీడీపీకి గుడ్ బై చెవుతున్నాడా?


సాధారణ నటుడిగా ప్రస్థానం ప్రారంభించి టీడీపీ పార్టీ అండతో…రాజకీయ నాయకుడిగా, వ్యాపార వేత్తగా ఎదిగారు మాజీ ఎంపీ మురళీ మోహన్. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన మురళి మోహన్ ఆయనకి అత్యంత ఆప్తుడు మరియు సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే ఏళ్లుగా సాగుతున్న చంద్రబాబు అక్రమ ఆర్జనకు అధికారిక కాపలాదారు. చంద్రబాబు ఆస్థులలో సగానికిపైగా ఈయన బినామీ జమానాలోనే ఉన్నాయి. అందుకే ఏళ్ల తరబడి వీరి మధ్య దృఢమైన బంధం కొనసాగుతుంది.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

చంద్రబాబులో సగమైన మురళి మోహన్ పార్టీకి గుడ్ బై చెవుతున్నారనే వార్త ఇప్పుడు టీడీపీ వర్గాలలో కలకలం రేపుతోంది. ఆయన అధికారికంగా రాజకీయ సన్యాసం తీసుకోనున్నారట. ఆరోగ్య కారణాలతో పాటు, తన వ్యాపారాలపై పూర్తి స్థాయిలో ద్రుష్టి కేంద్రీకరించడం కోసం ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట. పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక విషయాలపై స్పందించాల్సి ఉంటుంది. కావున రాజకీయ నాయకుడనే ముద్ర పోగొట్టుకోవాలని ఆయన ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.

‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

గత ఎన్నికల్లోనే మురళీ మోహన్ పోటీ నుండి తప్పుకున్నారు. ఆరోగ్య కారణాలు చూపి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయలేదు. చంద్రబాబు ఎంత బతిమిలాడినా ఆయన ససేమిరా అన్నారు. బాబు గారి మాట కాదనలేక తన కోడలు రూపా దేవిని రంగంలోకి దింపాడు. వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ చేతిలో ఆమె ఓటమి చెందారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత మురళీ మొహన్ కానీ ఆయన కుటుంబం కానీ రాజకీయ విషయాలపై స్పందించడం కానీ, టీడీపీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చేయలేదు. టీడీపీ మహానాడు వేడుకలలో కూడా మురళీ మోహన్ కనిపించకపోవడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే మురళీ మోహన్ సైకిల్ దిగుతున్నాడన్న వార్తలలో నిజం ఉందనిపిస్తుంది.

వామ్మో కరెంట్ బిల్లు.. షాకైన నటి కార్తీక


లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. దీంతో ఇళ్లల్లో కరెంట్ వినియోగం పెరిగిపోవడం కామన్. అయితే ఇదే అదనుగా విద్యుత్ శాఖ ప్రజలపై పెద్దఎత్తున భారంమోపుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరికీ వదలకుండా బాదుడు మొదలెట్టింది. లాక్డౌన్లో విద్యుత్ తీయకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా బిల్లుల స్లాబ్ లలో తేడాలు చూపించి ఎక్కువ మొత్తంలో వినియోగదారుల నుంచి ఆ శాఖ డబ్బులను దండుకుంటోంది. ప్రతీనెల వచ్చే బిల్లు మాదిరిగానే సిబ్బంది రీడింగ్ తీస్తున్నారనే చెబుతున్నా బిల్లులు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

కరోనా కాలంలో బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమైన ప్రజలపై విద్యుత్ శాఖ నిర్దాక్షిణ్యంగా బిల్లులను వసూలు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు విద్యుత్ బిల్లులను చూసి షాక్ తింటున్నారు. విద్యుత్ శాఖ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న గుడిసెలకే వేలల్లో బిల్లులు వస్తున్నారు. ఇక సెలబ్రెటీల ఇళ్లకైతే ఏకంగా లక్షల్లో బిల్లులు వస్తుండటం గమనార్హం. ఇటీవల హీరోయిన్ స్నేహ ఇంటికి 70వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించింది. 70వేల కరెంటు కట్టేందుకు తమకు స్థోమత ఉందని అయితే ఇదే సామాన్యుల వస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి వారి ఇంటికి మరోసారి రీడింగ్ తీసి బిల్లు ఇస్తామని ప్రకటించారు.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

తాజాగా మరోనటి తమ ఇంటికి వచ్చిన విద్యుత్ బిల్లు చూసి షాకైంది. నటి కార్తీక ఇంటికి అక్షరాలా లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చినట్లు ట్వీటర్లో వెల్లడించింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ముంబైలో ఏ కుంభ‌కోణం జ‌రుగుతుందని అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆమె ప్రశ్నించింది. భారీ పరిశ్రమలకు సైతం లక్షల్లో కరెంట్ బిల్లులు రావని అలాంటిది ఒక ఇంటికి జూన్ నెలలో లక్ష రూపాయాల కరెంటు బిల్లు రావడం ఏంటని ప్రశ్నించింది. విద్యుత్ సిబ్బంది కరెంట్ మీటర్ రీడింగ్‌ తీయకుండా వాళ్లకు ఇష్టమొచ్చినట్లు వేస్తున్నారని ఆమె ఆరోపించింది. ముంబయివాసుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అనేక వస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!

ఫ్యాన్స్ కు ‘బిగ్‌బాస్‌’ షాక్..!


లాక్డౌన్ కారణంగాలో సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. స్టార్ హీరోహీరోయిన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. క్వారంటైన్లో తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోలంతా ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక హీరోయిన్లయితే ఫిట్నెస్, యోగా, కుకింగ్, పిల్లో ఛాలెంజ్, మేకప్ ఛాలెంజ్, హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటూ ఆకట్టుకుంటున్నారు.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

తాజాగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం అనమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు సినిమా షూటింగుల సందడి మొదలుకాలేదు. స్టార్ హీరోహీరోయిన్లు కరోనాపై వేచిచూసే ధోరణిలో ఉండటంతో ఇప్పట్లో షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. సినిమాలు మొదలు కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే టీవీ సీరియళ్లు, టీవీ షోల సందడి మాత్రం బుల్లితెరపై మొదలైంది.

బుల్లితెర రియల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు చాలామంది అభిమానులున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌-4 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కాంటెస్టెంట్ ఎంపిక షూరు అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ నిర్వాహాకులు ఫ్యాన్స్ షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. బిగ్‌బాస్‌ మొదటి సీజన్ 70రోజులు కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన బిగ్‌బాస్‌-2, బిగ్‌బాస్‌-3 సీజన్లు వంద రోజులు సాగింది. అయితే నాలుగో సీజన్ మాత్రం కేవలం 50రోజులకే పరిమితం చేయనున్నారని సమాచారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.

‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

ఇక సీజన్ జూలై లేదా ఆగష్టులో ఈ సీజన్‌ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్‌బాస్‌-4కు హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్‌ ఎంపిక పూర్తినట్లు టాక్ విన్పిస్తోంది. 12మంది కంటెస్టెంట్‌లతో బిగ్‌బాస్ 4 ఉండనుందట. కరోనా నేపథ్యంలో కంటెస్టెంట్‌లకు బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూమ్‌ల వరకు అన్నీ సెపరేట్‌గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట. టాస్క్‌లు కూడా భౌతిక దూరం పాటించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇప్పటికే బిగ్‌బాస్‌-4కు సంబంధించిన సెట్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసినట్లు సమాచారం. త్వరలోనే బిగ్‌బాస్‌-4 ప్రారంభ తేదిని నిర్వాహాకులు అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..


ప్రపంచ వ్యాప్తంగా నేతలు, పారిశ్రామికవేత్తలు అక్రమంగా సంపాదించిన డబ్బునంతా స్విట్జార్యాండ్ లోని బ్యాంకుల్లో జమ చేసేవారు. నల్లడబ్బు దాచుకోవడానికి సురక్షితమైన దేశంగా స్విట్జర్లాండ్ ఒకప్పుడు ఉండేది. అక్కడ వివరాలు బయటకు పొక్కేవి కావు. కానీ వికీలీక్స్ సహా కొన్ని సంస్థల ఉద్యమంతో ఈ నల్లడబ్బు దారుల బండారం బయటపడి ఇరుక్కుపోయారు. ఇక నరేంద్రమోడీ దేశ ప్రధాని అయ్యాక దౌత్య ఒత్తిడి ద్వారా నల్లడబ్బు దాచిన వారి వివరాలు సేకరించి రికవరీ చేయించాడు. అంతేకాదు.. 2016లో పెద్దనోట్లను రద్దు చేసి నల్లకుబేరుల ఆట కట్టించాడు. నల్లడబ్బును అంతా ఆ సమయంలోనే వైట్ గా నల్లకుబేరులు మార్చేసుకున్నారు. స్థలాలు, ఆస్తులు, రియల్ ఎస్టేట్ రంగాలు ఇతర రంగాల్లో పెట్టుబడులుగా మళ్లించారు.

సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు

అయితే తాజా రిపోర్టు ఏంటంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి, ప్రభుత్వాల నజర్ పెరిగిపోవడంతో భారతీయుల నల్లడబ్బు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో తరిగిపోతోంది. ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండంతో ఆ సొమ్మును చాలా మంది తగ్గించుకున్నారు.

తాజాగా స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన వార్షిక గణాంకాల ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లోని భారతీయులు మరియు సంస్థల నిధులు 6శాతం తగ్గాయి. ఇది రూ.6625 కోట్లకు పరిమితమయ్యాయి. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల స్థూల నిధులు వరుసగా రెండో సంవత్సరం కూడా పడిపోయాయి. నిధుల క్షీణత ఏకంగా 6శాతానికి పరిమితమై మూడో అతి తక్కువ వ్యయంగా నిలిచింది.

చైనా కాచుకో.. భారత్ కు అమెరికా బలగాలు!

స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల ఖాతాదారుల డబ్బు 55 మిలియన్లకు పడిపోయింది. ఇది మొత్తం దాచుకున్న బ్యాంకుల్లోని మొత్తంలో కేవలం 5.8శాతం భారతీయులది కావడం గమనార్హం. 2006లో భారతీయుల నల్లడబ్బు ఏకంగా 6.46 బిలియన్లు ఉండేది. అత్యధిక నల్లడబ్బు దాచుకున్న దేశంగా ఇండియా టాప్ లో ఉండేది. 2014 సంవత్సరానికి వచ్చేసరికి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడంతో 1.81 బిలియన్లకు నల్లడబ్బు తగ్గింది. అంటే 14400కోట్లకు నల్లడబ్బు పరిమితమైంది.

నల్లధనాన్ని అరికట్టడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయులకు శరాఘాతంగా మారాయి. అందుకే ఈ నల్లడబ్బు నిధులు భారతీయులవి భారీగా తగ్గాయి.

ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఖాతాదారుల పరంగా భారత్ పోయిన సంవత్సరం 74వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మోడీ దెబ్బకు నల్లడబ్బు కరిగిపోయి భారత్ మూడు స్థానాలు పడిపోయి 77వ స్థానంలో నిలిచింది. అందరికంటే ఖాతాదారుల పరంగా బ్రిటన్ దేశం అగ్రస్థానంలో నిలిచింది. వారి ఖాతాదారులు, డిపాజిట్లు భారీగా స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి.

-నరేశ్ ఎన్నం

బన్నీకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాలట ?

Bunny


అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని బాగా కోరికగా ఉందనేది వాస్తవం. సుకుమార్ కలయికలో రానున్న ‘పుష్ప’ సినిమాలో ఎలాగైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఒప్పించాలని మేకర్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఏ స్టార్ హీరోయిన్ బన్నీతో స్టెప్స్ వేయడానికి ఒప్పుకుంటుందో చూడాలి. స్టార్ హీరోయిన్ ఒప్పుకోకపోతే అప్షన్ గా బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోవాలనుకుంటున్నారు. మరి బన్నీకి స్టార్ హీరోయిన్ దొరుకుతుందో లేక ఊర్వశితోనే ఎడ్జెస్ట్ అవ్వాలో తెలియాల్సి ఉంది.

సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు

ఇక ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకునట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి విషయం ఇంకా ఫైనల్ అవ్వలేదట. విజయ్ తప్పుకుంటే… అతని ప్లేస్ లో మాధవన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఆమె గిరిజన యువతిగా కనిపించనుంది.

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో బన్నీ దొంగగా అలాగే పోలీస్‌ ఆఫీసర్‌ గా కూడా నటిస్తున్నాడు. మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని ఈ సినిమా రేంజ్ ను పెంచాలకుంటున్నారు. పైగా ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్ నుండి ఈ పుష్ప సినిమా వస్తుండటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

Ladak

ఒకప్పుడు శివసేన, బీజేపీ కలిసి కట్టుగా ఉండేవి. రెండు పార్టీలు కూటమిలో మహారాష్ట్రలో గత ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే మడేంత విమర్శల యుద్ధం జరుగుతోంది.

ఈ రోజు శివసేన ప్రధాని మోడీ పై ఘాటైన విమర్శలు చేసారు. రానున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ.. లఢాఖ్‌ లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో భారత సైనికుల ఘర్షణ నాటకం ఆడుతున్నదని శివసేన ఎద్దేవా చేసింది. భారత సైనికుల త్యాగాన్ని ఉపయోగించుకొని బీహార్‌ ఎన్నికల్లో లబ్ధి పొందాలని నరేంద్ర మోదీ యోచిస్తున్నారని తీవ్రమైన ఆరపణలు చేసింది. బీహార్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘కుల, ప్రాంతీయ కార్డు’ రాజకీయాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

ఇటీవల గల్వాన్‌ వ్యాలీలో చైనా-ఇండియా సైనికుల ఘర్షణ అనంతరం “ఈ రోజు, నేను బీహార్ ప్రజలతో మాట్లాడుతున్నాను, ప్రతి బిహారీ చైనా సైన్యంతో పోరాడుతున్న వారి శౌర్యం గురించి గర్వపడుతున్నారు. నేను బిహారి రెజిమెంట్‌ అమరులకు నివాళులు అర్పిస్తున్నాను.” అని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై శివసేన తమ అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. “ప్రధాని మోడీ అటువంటి రాజకీయాల్లో నిపుణుడు. గల్వాన్‌ వ్యాలీలోని ‘బీహార్ రెజిమెంట్’ యొక్క శౌర్యాన్ని ఆయన ప్రశంసించారు. అంతకుముందు, దేశం సరిహద్దుల్లో ముప్పును ఎదుర్కొన్నప్పుడు మహర్, మరాఠా, రాజ్‌ పుత్, సిక్కు, గూర్ఖా, డోగ్రా రెజిమెంట్లు పనిలేకుండా కూర్చున్నాయా? రాబోయే బీహార్ ఎన్నికల కారణంగా భారత సైన్యంలో కులం, ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు ఒక వ్యాధి వంటివి. ఇది కరోనా వైరస్ కంటే తీవ్రమైనది” అని వ్యాఖ్యానించింది.

“చంద్రుడిపై బాత్ రూం..ప్లాన్ ఇవ్వండి ప్రైజ్ కొట్టండి!”

Toilet on Moon

Toilet on Moon

2024కల్లా చంద్రుడి పై బాత్ రూం కట్టాలని నాసా సన్నాహాలు చేస్తోంది. బాత్ రూం టెక్నాలజీ అనేది భూమిపై కంటే అడ్వాన్స్ డ్ గా ఉండాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. దీనికి బెటర్ ప్లాన్ ఇస్తే 35వేల డాలర్ల ప్రైజ్ లు ఉంటాయని చెప్తుంది. నాసా, ఆస్ట్రోనాట్స్ ను 2024 కల్లా చంద్రుడిపైకి పంపేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అయితే వారు ల్యూనార్ సర్ఫేస్ కు చేరుకున్న తర్వాత బాత్రూంకు వెళ్లేందుకు చోటు కావాలని వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే సోలార్ సిస్టమ్ లో బెస్ట్ మూన్ టాయిలెట్ కోసం ప్లాన్లు ఇవ్వాలని ఇంజినీర్లకు ఆఫర్ చేస్తుంది. ల్యూనార్ రెస్ట్ రూం కోసం ఎవరు బెటర్ ఐడియా ఇస్తే వారికి ప్రైజ్ కూడా నాసా ప్రకటించింది.

నాసా హీరో ఎక్స్ తో కలిపి ల్యానార్ లూ ఛాలెంజ్ కాంపిటేషన్ నిర్వహిస్తోంది. భవిష్యత్ లో ల్యూనార్ తలానికి చేరుకుంటే అక్కడ టాయిలెట్ ఎలా వాడాలనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. చంద్రుడిపైకి 2024కల్లా తొలి మహిళ, తొలి పురుషుడ్ని పంపాలని నాసా ప్లాన్ చేస్తుంది. రెస్ట్ రూం అనే వర్సటైల్ గా ఉండడంతో పాటు అది ఆర్బిట్ లోనే పనిచేసేదిగా ఉండాలి. ఆ కక్ష్యలో ఆస్ట్రోనాట్స్ కూడా తేలిగ్గా అనిపించే సమయంలో రెస్ట్ రూం పనిచేయాల్సి ఉంటుంది. భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు అక్కడి తలంలో ఉంటుంది. గురుత్వాకర్షణ పనిచేయని సమయంలో పనితీరు అనేది సరిగ్గా పనిచేయాల్సి ఉంటుంది. మనుషులను 50సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచే చంద్రునిపైకి పంపిస్తున్నప్పటికీ స్పేస్ టాయిలెట్స్ గురించి నాసా ఇప్పుడే ఆలోచిస్తుంది.

విశాఖ నుంచే పాలన.. ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్


శాసన, చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఆరు నెలలుగా ఆగిపోయిన ఏపీ రాజధాని మార్పు ప్రక్రియ తాజాగా ఊపందుకుంది. అమరావతి నుంచి విశాఖపట్నంకు రాజధాని మార్చే ప్రక్రియకు సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే అక్టోబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగాలే సీఎం జగన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు

సీఎం జగన్ మూడు రాజధానులపై వెనక్కి వెళ్లకూడాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా గవర్నర్ ప్రసంగంలోనూ జగన్ వినిపించారు. వచ్చే అక్టోబర్ నాటికి తరలింపు ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీలోనూ దీన్ని చర్చించారు.

గతేడాది డిసెంబర్‌లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణ అవసరమని తేల్చారు. విశాఖపట్నం వద్ద కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని మరియు కర్నూలులో న్యాయ రాజధానిని ప్రకటించారు.

వైసీపీకి కొత్త చిక్కులు తెచ్చిన షోకాజ్ నోటీస్..!

అయితే జనవరి 21న రాష్ట్ర అసెంబ్లీ మొదట మూడు రాజధానుల బిల్లులను ఆమోదించింది. కాని ఈ బిల్లును రాష్ట్ర శాసనమండలిలో టీడీపీ అడ్డుకుంది. ఈ బిల్లును తరువాత సెలెక్ట్ కమిటీకి పంపారు. ఇంతలో, ఈ సమస్య రాష్ట్ర హైకోర్టుకు చేరింది.

పది రోజుల క్రితం, మూడు రాజధానుల బిల్లులు మరియు ఏపీసిఆర్డిఎను రద్దు చేయడం రెండవ సారి ఆమోదించారు. మరోసారి వాటిని శాసనమండలికి పంపారు. జూలై మొదటి వారంలో కౌన్సిల్ నుండి స్పందన లేకపోతే బిల్లులు ఆమోదించబడతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాజధాని బదిలీకి ఉన్న అడ్డంకులను తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.అయితే రాష్ట్రం కరోనావైరస్ మహమ్మారితో బాధపడుతున్నందున, రాజధాని మార్పుకు నెమ్మదిగా సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరినట్లు తెలిసింది.

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!

అక్టోబర్ 25 విజయదశమి పండుగ కల్లా సచివాలయం, సీఎం కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. భీమిలిలోని మూతబడిన ఓ ఇంజినీరింగ్ కాలేజీని తాత్కాలిక సచివాలయంగా మార్చవచ్చని తెలుస్తోంది. మాజీ సీఎం రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్ కు చెందిన పైడా ఇంజినీరింగ్ కాలేజీ రెండేళ్ల నుంచి మూతపడింది. దీన్నే సచివాలయంగా మారుస్తారని సమాచారం.

విశాఖ శారదా పీఠాధిపతి సూచనల మేరకు దసరా నాటికి సచివాలయాన్ని తరలిస్తారంటూ వార్తలు వచ్చాయి.ఇదే మూహూర్తాన్ని జగన్ విశాఖ నుంచి పాలించడానికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఆర్జీవీ.. యాంకర్.. ఓ బికినీ.. నెట్‌లో హల్‌చల్‌!


వివాదస్పద సినిమాలు తీసే రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన చేసే సినిమాలు, బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తో సెన్సేషన్‌ సృష్టిస్తాయి. అయితే సినిమాలతో, ట్వీట్లతో లేదంటే యూట్యూబ్‌ చానల్స్‌లో ఇంటర్వ్యూలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు ఆర్జీవీ. టీవీలకే కాకుండా పిలిచిన ప్రతీ యూట్యూబ్‌ చానల్‌కు వెళ్లి ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడుతాడు. అదే టైమ్‌లో యాంకర్ అమ్మాయి అయితే ఆమె అందంగా ఉంటే తెగ పొగిడేస్తుంటాడు. తాజా ఓ ఇంటర్వ్యూలో ఓ అందమైన యాంకర్ పై ఇలాంటి కామెంట్లే చేశాడు .

సోనియా గాంధీ చేష్టలతో కాంగ్రెస్ పరువు గంగపాలు

‘మీకు ఇటీవల ఏ అమ్మాయిని చూస్తే వావ్‌ అనిపించే డిజైర్ కలిగింది’ అని ఆమె ఆడగ్గా నీతో పాటు చాలా మంది అని అన్నాడు. దాంతో ఆమె సిగ్గు పడుతూ నవ్వింది. అంతేకాదు ‘మీకేమైనా మూడు క్రేజీ డిజైర్స్‌ (కోరికలు) ఉన్నాయా’ అని ఆమె మరో ప్రశ్న వేసింది. తనకు చాలా ఉన్నాయని చెప్పిన ఆర్జీవీ.. ‘నాకు మిమల్ని బికినీలో చూడాలనుంది. మీకు నా మూవీలో ఓ ఆఫర్ ఇస్తా’ అని చెప్పడంతో ఆ యాంకర్ ముఖంలో ఆనందంతో కూడిన షాక్‌ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. నెటిజన్స్‌ తమ ఎడిటింగ్‌ స్కిల్స్‌తో రకరకాల వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. ఖుషీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ని జతచేసి ఎడిట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆర్జీవీ కంట కూడా పడింది. దీన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన రాము ‘సోషల్‌ మీడియాలో క్రియేటివిటీకి హద్దులే ఉండవు. నాకు ఇంటర్వ్యూవర్ అరియానాకు మధ్య ఏం జరిగిందో చూడండి’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.