Home Blog Page 8425

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. పరిస్థితి చేయిదాటుతోందా?


తెలంగాణలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవడంతో పలు వ్యాపార సంఘాలు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్న పరిస్థితి నెలకొంది.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కార్యాలయాల్లో కరోనా తిష్టవేసి కూర్చుంది. దీంతో సిబ్బంది భయంభయంగానే పనులు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలెవరూ కార్యాలయానికి రావద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలెవరెవరికీ కార్యాలయంలోని అనుమతి లేదని స్పష్టం చేసింది. పనులపై ఎలాంటి ఫిర్యాదులున్నా ఆన్ లైన్లోనే సంప్రదించాలని కోరిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు కరోనా పాకింది. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను కరోనా సెగ తాకింది. దీంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.

ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ నలుగురికి గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వీరితో కాంటాక్ట్ అయిన వారందరినీ హోంక్వారంటైన్ కు తరలించారు. ప్రగతి భవన్లో విధులు నిర్వహిస్తున్న వారందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రగతి భవన్‌కు వచ్చే సందర్శకులపై అధికారులు ఆంక్షలు పెడుతున్నారు.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

సీఎం కేసీఆర్ తన అధికారిక కార్యకలాపాలన్ని ప్రగతి భవన్ నుంచే చేస్తుంటారు. పరిపాలనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్న ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటారు. అలాంటి ప్రదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం యంత్రాంగం హడలిపోతుంది. ఎవరినీ ప్రగతి భవన్లోకి రాకుండా చర్యలు చేపడుతుంది. అత్యవసరం అయితే తప్ప ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. అయితే సీఎం కేసీఆర్ గత నాలుగురోజులుగా ప్రగతి భవన్లో ఉండటం లేదని తెలుస్తోంది. ఆయన గజ్వేల్లోని తన ఫౌంహౌజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రగతి భవన్లో వచ్చేలోపే పరిసరాలను శానిటైజ్ చేయనున్నారు. అయితే ప్రగతి భవన్లో కరోనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదవడం గమనార్హం. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం నమోదైన 1,213 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులుండగా 8మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ తర్వాత స్థానాల్లో మేడ్చెల్ 54, రంగారెడ్డిలో 48, ఖమ్మం 18, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 9లు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మోడీకి తెలుసు


అవును.. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మన ప్రధాని నరేంద్రమోడీకి బాగా తెలుసు. అందుకే జాతీయవాదం ఆయన అస్త్రమైంది. సార్వత్రిక ఎన్నికల ముందర పాకిస్తాన్ తో ఫైట్ ఆయనకు లాభమైంది. ఇప్పుడు కరోనాను కంట్రోల్ చేయలేక.. 20 లక్షల కోట్ల మోడీ ప్యాకేజీ ఒట్టి గ్యాస్ అన్న విమర్శల వేళ కూడా మోడీ మళ్లీ ఒక్కసారిగా జీరో నుంచి హీరో అయిపోయాడు. ఈరోజు మోడీ చేసిన చర్యతో ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఎన్ని సమస్యలు, అభివృద్ధి లేకున్నా.. కరోనా ఉపద్రవం ముంచుకొస్తున్నా కానీ మోడీ ఈరోజు వేసిన అడుగు చూసి ప్రజలంతా శభాష్ మోడీ అనేస్తున్నారు.

అవును.. దీన్నిబట్టే ప్రధాని మోడీకి తెలిసినంతగా ప్రజా నాడి ఎవరికీ తెలియదని.. వారి భావోద్వేగాలే తనను పాపులర్ చేస్తాయని మోడీ నిరూపించారు. ఇన్నాళ్ల విమర్శలను ఒక్క చర్యతో పటాపంచలు చేశారు.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పెద్ద సాహసయాత్ర చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం లడ్డాఖ్ లో మోడీ ఆకస్మికంగా పర్యటించారు.

శుక్రవారం ఉదయం సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ తో కలిసి మోడీ లేహ్ కు చేరుకున్నారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై సైనిక అధికారులతో మోడీ సమీక్ష నిర్వహించారు.అలాగే టాప్ కమాండర్లతోనూ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలో తాజాగా పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకోనున్నారు. సైన్యాధికారులు, సైనికులతో భేటి అయ్యారు. ముక్కులకు మాస్క్ లతో మోడీ, సైనికులు సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ ఈ భేటిలో పాల్గొన్నారు.

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?

జూన్ 15న గల్వాల్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో మృతిచెందిన 20మంది సైనికులకు నివాళులర్పించిన మోడీ.. దాడిలో గాయపడ్డ సైనికులను సైతం ఆస్పత్రులకు వెళ్లి పరామర్శించారు.

భారత సైనికులకు భరోసానివ్వడం.. చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని మోడీ చైనా సరిహద్దుల్లో పర్యటించే సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇంతటి ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోడీ లఢక్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో యుద్ధానికి సిద్ధమైన మన జవాన్లకు భరోసానిచ్చిన మోడీని చూసి ఇప్పుడు దేశమంతా శభాష్ మోడీ అంటోంది. అందుకే అన్నారు మోడీ జాతీయవాదం ఫార్ములా ముందు అన్ని ఫెయిల్యూర్స్ దిగదుడుపేనని.. ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మోడీకి తెలుసు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-నరేశ్ ఎన్నం

హీరోలూ మళ్ళీ హీరోయిజమ్ చూపించండి !


కరోనా కాలం.. ఆపై లాక్ డౌన్.. పనులు లేవు.. సినిమా కోసం పస్తులు పడుకోవటం అలవాటే.. అలాంటి సినీ జనమే ఆకలి కారణంగా కన్నీళ్లు పెడుతున్నారు. కడుపు గోల గురించి ఆ గోలకి పుట్టిన మంట గురించి కృష్ణా నగర్ లో కథలు కథలుగా చెబుతున్నా వినేవాడు లేడు.. ఆదుకుని గుప్పెడు సాయం చేసేవాడు లేడు.. ఏమిటి ఈ కలికాలం అని బాధ పడటం తప్ప చేయడానికి ఏమి లేదా.. హీరోలు కొంతమందికి సీసీసీ అంటూ సాయం అందించారు. కానీ, సాయం అందినవారి గురించి.. రాబోయే మూడు నెలలు గురించి ఏమిటి పరిస్థితి. సినిమాల షూటింగ్ లు లేవు.. సీరియల్ షూటింగ్ లు కొన్ని ఉన్నా.. పేమెంట్స్ దారుణం.. అసలు జబర్దస్త్ లాంటి సక్సెస్ ఫుల్ షోకి పని చేస్తున్న వారికే ఫుల్ పేమెంట్స్ అందట్లేదని టాక్ ఉంది.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలకు పని చేసినా డబ్బులు వస్తాయా… వచ్చే అవకాశాలు లేవు. రోజువారీ వేతనాలతో బ్రతికే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడటం అనేది కామన్ అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. వీరికి సహాయం చేయడం కోసం సినీ పెద్దలు కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో పెద్ద ఎత్తున ఫండ్ సేకరించి రెండు సార్లు సరుకులు అందించారు. మరి రాబోయే మూడు నెలలకు మరో రెండు సార్లు అన్నా సీసీసీ తరుపున సరుకులు అందివ్వాలని సినీ కార్మికులు స్టార్ హీరోలను వేడుకుంటున్నారు. మరి స్టార్ హీరోలు కరుణిస్తారా…? ఎంత లేదన్నా మళ్ళీ తలా పది లక్షలు ఇవ్వాలి.. ఇస్తారా.. !

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

నిజానికి అప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ముందుగా ఇనిషియేటివ్ తీసుకోవడంతోనే మిగతా హీరోలు కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ ముందుకు రావాలి.. రాబోయే మూడు నెలలు కోసం కూడా కార్మికులకు సరుకులు అందించాలి. పోయినసారి మెగాస్టార్ చిరంజీవి, నాగర్జున చెరొక కోటి రూపాయలు విరాళం ఇవ్వగా.. రామ్ చరణ్ రూ.30 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, బాలయ్య రూ.25 లక్షలు, నాగ చైతన్య రూ.25 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, శర్వానంద్ రూ.15 లక్షలు సీసీసీ కోసం విరాళంగా ఇచ్చారు. అప్పుడు ఇవ్వని హీరోలు హీరోయిన్ లు, నిర్మాతలు.. రోజుకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ లు ఇంకా చాలామందే ఉన్నారు. వారందరూ పెద్ద మనసుతో ఆదుకుంటే.. సినీ కార్మికులకు మరో రెండుసార్లు నిత్యావసరాలు తీర్చడం పెద్ద విషయమేమి కాదు. మరి ఆదుకుంటారా.. హీరోలూ మరోసారి హీరోయిజమ్ చూపించండి.

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి


బాలీవుడ్‌ను విషాదాలు వెంటాడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వరుసగా పలువురు ప్రముఖులను కోల్పోతోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాలను మరచిపోకముందే ఇండస్ట్రీలో మరోసారి విషాదం అలముకుంది. దివంగత శ్రీదేవి, అలనాటి అద్భుత నటి మాధురి దీక్షత్‌ వంటి స్టార్స్‌కు నృత్యం నేర్పించి. ‘ది మదర్ ఆఫ్ డ్యాన్‌’గా పేరొందిన ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ఇకలేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు వెల్లడించారు. 71 ఏళ్ల సరోజ్‌ ఖాన్‌ కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి చికిత్స తీసుకునేందుకు రెండు వారాల కిందట ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. కరోనా అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌ అని తేలింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉంచి ఆమెకు చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్‌ చేశారు. కానీ శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఈ విషయం సరోజ్ అభిమానుల్లో విషాదం నింపింది. శుక్రవారమే స‌రోజ్ ఖాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. సరోజ్ మృతదేహాన్ని మలాద్ లోని అహ్లే సున్నత్ శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1961లో సోహన్‌ లాల్‌ను పెళ్లి చేసుకున్న సరోజ్‌.. నాలుగేల్ల తర్వాత ఆయనతో విడిపోయింది. ఆపై, 1975లో సర్దార్ రోషన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

భారత చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నృత్య దర్శకులు ఉన్నా.. సరోజ్‌ ఖాన్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ నుంచి లెజెండరీ కొరియోగ్రాఫర్ అనే స్థాయికి ఎదిగారు. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 200కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. రెండు వేల పైచిలుకు పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. శ్రీదేవి సూపర్‌ హిట్‌ మూవీ నాగిని, మిస్టర్ ఇండియా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అంతేకాదు సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ లోని ‘ డోలా రే డోలా’, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్‌లోని ‘ ఏక్ దో తీన్’, 2007లో వచ్చిన జబ్ వి మెట్‌లో ‘యే ఇష్క్ హాయే’ సహా మరెన్నో పాటలకు అద్భుత నృత్యం అందించారు. సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్‌లోని ‘డోలా రె డోలా’, జబ్‌ వి మెట్‌లో ‘యే ఇష్క్‌ హాయె’తో టు శ్రీంగారం అనే తమిళ్ మూవీల అన్ని పాటలకు ఆమె బెస్ట్‌ కొరియోగ్రాఫర్గా మూడుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తెలుగులోకూడా పలు చిత్రాలకు ఆమె పని చేసింది. మరో 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. చిరంజీవి.. చూడాలని ఉంది సినిమాకు బెస్ట్‌ కొరియోగ్రాఫర్గా నంది పురస్కారం అందుకున్నారు. సరోజ్‌ ఖాన్‌ మంచి రచయిత కూడా. 12 చిత్రాలకు రచయితగా వ్యవహరించారు.

మెగాస్టార్ అసిస్టెంట్ గా సెన్సేషనల్ స్టార్ !


మలయాళంలో ‘లూసిఫర్’ సూపర్ హిట్ అయిన మాట నిజమే. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ చేయాల్సిన మూవీనా అంటే అది అనుమానమే. మోహన్ లాల్ కే ఆ సినిమా కథ చిన్నగా అనిపించింది. అలాంటిది ఇక మెగాస్టార్ కి ఎలా ఉంటుంది. అందుకే చిరు కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఒకరకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ అది. అందుకే మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి బన్నీ కూడా ఆ పాత్ర చేయడానికి ఇంట్రస్ట్ గానే ఉన్నాడని కూడా మెగాఫ్యామిలీ సన్నిహితులు బాహాటంగానే స్పందించారు. కానీ తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీ కి సూట్ అవ్వదని మెగాస్టార్ ఫీల్ అవుతున్నారట.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

అందుకే ఆ పాత్రలో ఇప్పుడు మరో హీరో కనిపించబోతున్నాడు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, మెగాస్టార్ అనుచరుడి పాత్రలో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ ఆ పాత్రలో బాగుంటాడు. పైగా విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో.. ఏ రకంగా చూసుకున్న విజయ్ నే బెస్ట్ అప్షన్. ఇక ఈ రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో ఎమ్మెల్యే రోజా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మెగా బృందం నుంచి అధికారిక ప్రకటన రావాలి.

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?

అన్నట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలకమైన మార్పులను సూచించగా.. సుజీత్ రైటర్ సాయి మాధవ్ తో కలిసి ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి ఫుల్ స్క్రిప్ట్‌ చెప్పడం, లేటెస్ట్ వెర్షన్ మెగాస్టార్ కి బాగా నచ్చడంతో, టోటల్ సినిమా స్క్రిప్ట్ కి శుభం కార్డు వేసేశారు. అయితే సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాల టేకింగ్ లో మెహర్ రమేష్ కూడా వర్క్ చేయబోతున్నారట.

సరిలేరు.. సౌత్‌లో మహేశ్‌కెవ్వరూ..


సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మరో రికార్డు సృష్టించాడు. అది సినిమాలో కాదు సోషల్‌ మీడియాలో. అది మామూలు రికార్డు కాదు. తన నటతోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రిన్స్‌.. సోషల్‌ మీడియాలోనూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో పది మిలియన్ల (కోటి మంది) ఫాలోవర్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతిండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీస్‌లో ఈ ఫీట్‌ సాధించిన తొలి యాక్టర్గా నిలిచాడు. సినిమాలు, కుటుంబమే ప్రపంచంగా బతికే సూపర్ స్టార్ కొంత కాలం నుంచి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమాలు, ఫ్యామిలీ విశేషాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ట్విట్టర్లో స్పందిస్తున్నాడు. దాంతో, సినీ ప్రియులే కాకుండా కామన్‌ నెటిజన్స్‌ కూడా మహేశ్‌కు పాలోవర్స్‌గా మారుతున్నారు. ఆ సంఖ్య ఇంతితై అన్నట్టు కోటి దాటింది.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

ట్విట్టర్ ఫాలోవర్స్ లో సౌత్‌లో మరే హీరో కూడా మహేశ్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. కమల్ హాసన్ 6.1 మిలియన్లతో రెండో ప్లేస్‌లో ఉండగా.. సౌత్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ 5.7 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచారు. టాలీవుడ్‌ స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ 4.7 మిలియన్లు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ 4.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో టాప్‌-5లో ఉన్నారు. మహేశ్‌ ఫాలోవర్ల సంఖ్య కోటి దాటిన సందర్భంగా సోషల్‌ మీడియాలో 10 మిలియన్‌ ట్వీపుల్‌ ఫర్ ఎస్‌ఎస్‌ఎమ్‌బీ, 10 మహేషియన్స్‌, 1 క్రోర్ మహేషియన్స్‌ అనే హ్యాష్‌ట్యాగ్స్‌ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూతో భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్న మహేశ్‌… ఫాలోయింగ్‌లోనూ సౌత్‌లో తనకెవరూ సరిలేరు అనిపించుకున్నాడు. అతనిప్పుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఆలియా భట్‌ చిత్ర యూనిట్‌కు షాకిచ్చిన సుశాంత్ ఫ్యామిలీ


నెపోటిజం. భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు మార్మోగుతున్న పదం. బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్ సింగ్​ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం (బంధుప్రీతి) అంశం తెరపైకి వచ్చింది. సినీ పరిశ్రమ కొన్ని ఫ్యామిలీల గుప్పిట్టో ఉందని, తమ వారసులకే వాళ్లు ఎక్కువ అవకాశాలు ఇస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ లేని నటీ, నటులను.. స్వయం కృషితో ఎదిగే ప్రతిభావంతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేకే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కంగన రనౌత్‌ లాంటి వాళ్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కరణ్​ జొహార్​, కపూర్, సల్మాన్​ ఖాన్‌ ఫ్యామిలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ను ఏలుతున్న కపూర్‌‌ ఫ్యామిలీ మెంబర్స్‌ టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియా వేదికగా.. దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో ఆలియా భట్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సడక్ 2’ కూడా దాని బారిన పడింది.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

ఈ చిత్ర నిర్మాత‌ల్లో ఒకరైన మ‌హేశ్ భ‌ట్ సోష‌ల్ మీడియాలో ‘స‌డ‌క్‌-2’ మూవీ పోస్టర్ రిలీజ్‌ చేశారు. అంతే నెటిజన్స్‌ అంతెత్తున లేశారు. దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎంతలా ఉందో తెలియజేసేందుకు సోషల్‌ మీడియాలో ‘నెపోమీటర్‌‌’ ప్రారంభించారు. బాలీవుడ్‌ చిత్రాల్లో నెపోటిజం స్థాయి ఐదు కేట‌గిరీల్లో తేల్చేలా దీన్ని డిజైన్‌ చేశారు. సదరు చిత్రానికి నిర్మాత‌, ద‌ర్శకుడు, రచయిత, ప్రధాన పాత్రధారులు, ఇతర పాత్రధారుల బ్యాక్‌గ్రౌండ్‌ ఆధారంగా సినిమాలో ఎంత‌మేర‌కు బంధుప్రీతి ఉందో నిరూపిస్తూ ఫ‌లితాన్ని వెల్లడిస్తుంది. దీనికోసం సోష‌ల్ మీడియాలో నెపోమీట‌ర్ అని అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. ఇందులో ఆలియాభ‌ట్‌ స‌డ‌క్‌–-2ను పరీక్షించగా.. అది 98 శాతం నెపోటిస్టిక్ మూవీ అని తెలిపింది. ఈ చిత్రంలో ఐదు కేట‌గిరీల్లోని నాలిగింట్లో బాలీవుడ్‌ ప్రముఖుల వార‌సులే ఉన్నార‌ని తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సడక్‌–2 నెపోమీటర్‌‌ రిజల్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ మారింది. దాంతో, ఆలియా ఆమె ఫ్యామిలీపై మరిన్ని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. కాగా, బాలీవుడ్‌లో బంధుప్రీతిని రూపుమాపాలన్న ఉద్దేశంతోనే తాము నెపోమీటర్‌‌ను ప్రవేశపెట్టామని సుశాంత్‌ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

https://www.instagram.com/p/CCIHDsTAeOV/

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?


చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్ టాక్ ను భారత్ నిషేధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ యాప్ తిరిగి భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. ప్రధానంగా చట్టపరంగా ఉన్న అవకాశాలపై దృష్టిసారించింది. న్యాయపరంగా తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు భారత్ లోని ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కేంద్రంతో కూడా టిక్ టాక్ యాజమాన్యం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. దీనిపై కేంద్రం తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలేమని తేల్చిచెప్పింది. అనుమతి కావాలంటే కోర్టులో తేల్చుకోండని చెప్పడంతో టిక్ టాక్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదెబ్బ తీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రం భావిస్తోంది. భారత్ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనాకు రుచిచూపించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా చైనాను రక్షణ, ఆర్థిక, దౌత్యపరంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన కంపెనీల కాంట్రాక్టులను కేంద్రం రద్దుచేసింది. అదేవిధంగా 59యాప్స్ ను ఇటీవల భారత్ లో నిషేధించింది. దీంతో చైనాలో చలనం మొదలైంది. భారత్ లో చైనా యాప్స్ నిషేధం, కాంట్రాక్టుల రద్దుతో ఆ దేశానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లనుంది.

భారత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో చైనా నానయాగీ చేస్తోంది. భారత్ అంతర్జాతీయ సూత్రాలను కాలారాస్తుందంటూ ప్రచారం చేసుకుంటోంది. చైనా యాప్స్ నిషేధించాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతోంది. అంతర్జాతీయ నియమవళి ప్రకారం తమ ఉత్పత్తులను భారత్ లోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనికి కేంద్రం కూడా దీటుగానే సమాధానం ఇస్తోంది. సరిహద్దు నియమావళిని ఉల్లంఘించి భారత్ భూభాగాల్లోకి వచ్చినపుడే చైనాకు అంతర్జాతీయ నియమాలు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నిస్తుంది. దొంగదెబ్బతో భారత జవాన్లు మృతికి కారణమైనపుడు గుర్తుకురాని నియమవాళి చైనాకు ఆర్థిక నష్టం వస్తుందనే సరికి గుర్తుకొచ్చాయా? అంటూ ప్రశ్నిస్తోంది.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

మరోవైపు భారత్ లో నిషేధానికి గురైన టిక్ టాక్ ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది. తమ రీ ఎంట్రీకి అవకాశం ఇవ్వాలని టిక్ టాక్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది. కేంద్రం మాత్రం న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించింది. దీంతో టిక్ టాక్ యాజమాన్యం సుప్రీం కోర్టులో తమ వాదనలు విన్పించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ని టిక్ టాక్ యాజమాన్యం సంప్రదించగా కేంద్రానికి వ్యతిరేకంగా.. చైనాకు అనుకూలంగా న్యాయస్థానంలో తాను వాదించలేని చెప్పినట్లు సమాచారం. దీంతో తమ వాదనలు వినిపించేందుకు మరో న్యాయవాదిని వెతికే పనిలో టిక్ టాక్ పడింది.

గతంలోనూ కేంద్రం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తే సుప్రీంలో పోరాడి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా భారత్-చైనా ఉద్రిక్తతల పరిస్థితుల్లో నేపథ్యంలో టిక్ టాక్ సహా 59చైనా యాప్స్ పై కేంద్రం బ్యాన్ విధించింది. భారతీయుల సమాచారాన్ని ఈ యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయనే కారణంతో కేంద్రం వీటిని నిషేధించింది. దీంతో తాము ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేయాలని టిక్ టాక్ తాజాగా ప్రకటించింది. దీనిపై చట్టపరంగా పోరాడేందుకు సిద్ధమవుతోంది.

మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!

అయితే టిక్ టాక్ తరుఫున వాదించేందుకు న్యాయవాదులు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టిక్ టాక్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలడం యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. అయితే భారత్ లోని తమ ఉద్యోగులు, యాజర్లకు మాత్రం తాము త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తామంటూ భరోసా కల్పిస్తుంది. అయితే టిక్ టాక్ భారత్ లోకి ఎలా రీ ఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఫ్యామిలీకి దూరంగా చిరు చిన్నల్లుడు.. ఎందుకంటే


మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొద్ది రోజుల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇంటికి వెళ్తున్నా గ్రౌండ్‌ ఫ్లోర్‌‌లోనే ఉంటున్నాడు. భార్య శ్రీజ, ముద్దులొలికే కూతురు దగ్గరికి కూడా వెళ్లడం లేదు. అదేంటి ఒకో ఇంట్లో ఉంటూ భార్య, పిల్లల దగ్గరకి వెళ్లకపోవడం ఏంటి? కొంపదీసి దంపతుల మధ్య విభేదాలు వచ్చాయా? అనుకుంటున్నారా? అదేం లేదు. ఇది కరోనా కాలం కాబట్టి కళ్యాణ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘సూపర్‌ మచ్చి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు లాక్‌డౌన్‌కు ముందే ఈ చిత్రంలో కొంత భాగాన్ని చిత్రీకరించారు. కరోనా కారణంగా మధ్యలో బ్రేక్‌ వచ్చింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపులు ఇచ్చి సినిమా షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చాయి. దాంతో, సూపర్‌‌ మచ్చి షూటింగ్‌ను ఇటీవల రామానాయుడు స్టూడియోస్‌లో తిరిగి ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో షూటింగ్ మొత్తం పూర్తి చేయడమే కాకుండా, మిగిలి ఉన్న పాటలను కూడా చిత్రీకరించాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ఉధృతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన కొంత మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఆర్టిస్టులకు వైరస్ సోకడంతో కొన్ని సీరియల్స్‌ షూటింగ్స్‌ కూడా ఆగిపోయాయి. దాంతో, ప్రతి రోజూ షూటింగ్‌లో పాల్గొంటున్న కళ్యాణ్ దేవ్ తనతో పాటు తన ఫ్యామిలీ గురించి ఆలోచించాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుటుంబం డేంజర్‌‌లో పడుతుందని భావించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా స్వీయ నిర్భందం విధించుకున్నారు. బయట షూటింగ్‌లో పాల్గొని ఇంట్లోకి వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదని భావించిన మెగా అల్లుడు కుటుంబ సభ్యులెవరనీ కలవకూడదని తీర్మానించుకున్నాడు. షూటింగ్స్‌కు వెళ్లి వచ్చిన తర్వాత తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక్కడే ఉంటున్నాడట. సూపర్ మచ్చి షూటింగ్‌తో పాటు అన్ని పనులూ పూర్తయ్యాకే ఇంట్లోకి వెళ్లాలని భావిస్తున్నాడట. ఏదేమైనా మెగా అల్లుడి ముందుజాగ్రత్తకు, ఫ్యామిలీ పట్ల చూపించే శ్రద్ధకు శభాష్ అనాల్సిందే.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?


జాతిపిత గాంధీ మొదలుపెట్టిన పాదయాత్ర సాంప్రదాయం ఆ తరువాత రాజకీయ నాయకులకు అధికారం అందించే ఆయుధం అయ్యింది. ప్రజలకు చేరువ చేసే పాదయాత్ర ప్రతి నాయకుడికి విజయమే చేకూర్చింది. 2003 లో దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రెండునెలలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేయగా ఆయనకు 2004 ఎన్నికలలో అఖండ విజయం చేకూరింది. అదే స్పూర్తితో నారా చంద్రబాబు నాయుడు 2013లో పాదయాత్ర చేశారు. ఫలితంగా 2014లో టీడీపీ కూటమి విజయబావుటా ఎగరవేసింది.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

మొదటిసారి ఎన్నికలలో తృటిలో ఓటమి చవిచూసిన వై ఎస్ జగన్ 341 రోజుల సుదీర్ఘ పాద యాత్ర చేసి 2019 ఎన్నికలలో భారీ విజయాన్ని అందుకున్నారు. పాదయాత్ర సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఇద్దరు యువనాయకులు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. బీజేపీ సారథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐతే ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి పాదయాత్ర ఆలోచన ఉన్నా, అది ఎన్నికలకు ముందే ఉండే అవకాశం కలదు. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి మూడేళ్ళ సమయం పడుతుంది.

మరి ఈ పాద యాత్ర రేసులో ఉన్న మరో యువ కిశోరం లోకేష్ బాబు. టీడీపీ తరుపున తండ్రి చంద్రబాబు నేతృత్వంలో లోకేష్ బాబు పాదయాత్ర చేయడం ఖాయం అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ట్వీట్స్ కే బెంబేలెత్తుతున్నారు, ఇక ఫీల్డ్ లో దిగితే మటాషే అని వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు లోకేష్. నిజానికి చంద్రబాబు మరో సారి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉన్నా…లోకేష్ ఉండగా 70ఏళ్ల వయసులో ఆయన పాదయాత్రలు చేస్తే…లోకేష్ రాజకీయ భవిష్యత్ సమాధి అవుతుంది. కాబట్టి లోకేష్ బాబు పాదయాత్ర చేయడం ఖాయం.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

పవన్, లోకేష్ ఇద్దరూ పాదయాత్రపై పట్టుదలతో ఉన్న తరుణంలో ఈ పాదయాత్ర సెంటిమెంట్ ఎవరికి వర్క్ అవుట్ అవుతుంది అనేది ఆసక్తికరం. పాదయాత్ర చేసిన ఇద్దరిలో పవన్ గెలుస్తాడా లేక లోకేష్ గెలుస్తాడా? జగన్ దూకుడికి అడ్డుకట్ట వేయాలని కూటమి కట్టి గెలుపు అందుకుంటారా అనేది ఆసక్తికర అంశం. ఒకేసారి ఇద్దరు నాయకులూ చేశారు కాబట్టి పాదయాత్ర సెంటిమెంట్ మొదటిసారి ఫెయిల్ అవుతుందా అనేది చూడాలి. కాబట్టి ఈ సారి పాదయాత్ర ఆంధ్రా రాజకీయాల్లో చాలా ప్రత్యేకం కానుంది.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!


40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అని చెప్పుకొనే బాబు…గత మంతా లోపభూయిష్టమే. ప్రయోజనాలే పరమావధికగా సాగే ఆయన రాజకీయాలు విలువలు, నైతికతకు చాలా దూరం. అందితే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకొనే రకం. పదవుల కోసం పొత్తులు. ప్రయోజనాల కోసం కూటములు అనేది చంద్రబాబుకి తెలిసిన సిద్ధాంతం. తన ఈ సిద్ధాంతంతో ఏళ్లుగా ఆయనకు ప్రయోజనం చేకూరుతుండగా…అదే పద్దతిలో రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కూటమి కట్టి చంద్రబాబు ఎంతటి దిగగజారుడు రాజకీయాలు చేస్తాడో నిరూపించాడు. ఆయన బీజేపీని విమర్శించడానికి, విభేదించడాని కారణం ఆయన అడిగినట్లు ఆర్థిక ప్యాకేజి ఇవ్వక పోవడమే.

మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?

బీజేపీ ప్రత్యేక హోదా అంశం తుంగలో తొక్కితే బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. స్నేహం కొనసాగింత కాలం హోదాతో ఒరిగేదేముంది అన్నాడు. ప్యాకేజి ద్వారా హోదా కంటే మోడీ ఎక్కువ ప్రయోజనం చేకూర్చారు అన్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు అడగడంతో పాటు, కొత్త నిధులు ఆపేయడంతో బీజేపీతో బాబుకు చిక్కొచ్చిపడింది. కొన్నాళ్ళు బేరాలు చేసి నిధులు తెచుకున్నామని ప్రయత్నించి విఫలమైన బాబు మోడీపై తిరుగుబాటు ప్రకటించారు. నాలుగేళ్ళ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని గ్రహించి వెంటనే ఈ నేరాన్ని మోడిపైకి నెట్టాయలని, బీజేపీ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. రెండు లక్షలకు పైగా అప్పు చేసిన బాబు ఐదేళ్ల పాలనలో కనీసం అమరావతి, పోలవరం పూర్తి చేయలేదు. మరి అన్ని లక్షల కోట్ల అప్పులు ఈ దార్శనికుడు ఎందుకు చేశాడో. దానికితోడు రూ. 50వేల కోట్ల వరకు పెండింగ్ బిల్లులు.

మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!

కాగా నేడు కాన్ఫరెన్స్ పెట్టిన చంద్రబాబు కరోనా కాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంది బీజేపీ మాత్రమే అని వంత పాడుతున్నారు. దానికి రుజువుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో జగన్ ప్రజల్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. నేను ప్రతి కుటుంబానికి ఐదువేలు డిమాండ్ చేస్తే వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అన్నారు. రాష్ట్రంలో జరిగే సంక్షేమమం అంతా కేంద్ర ప్రభుత్వ చలవే అని మోడీ భజన చేస్తున్నాడు. రాష్ట్రంలో కరోనా సమయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అంటున్న బాబు…దేశ వ్యాప్తంగా లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతుంటే మోడీని ఎందుకు ప్రశ్నించరు?. అది మోడీ వైఫల్యం కదా?జాతీయ పార్టీ నాయకుడు అని చెప్పుకొనే బాబు విమర్శ కేవలం ఏపీకే ఎందుకు పరిమితం అవుతుంది. బాబు అవకాశవాద రాజకీయం చూసిన ప్రజలు ఆయన్ని నమ్మడం మానేశారు.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?


మనల్ని ఎవరైనా గుర్తించాలంటే ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అది మంచి కానీ, చెడు కానీ నలుగురు దృష్టి మనవైపు మరలేలా చేసుకోవాలి. ముఖ్యంగా రాజకీయాలలో ఇది చాల అవసరం. అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షాన ఉన్నా ఆరోపణలో… ఎదుటివారి ఆరోపణలకు గట్టి సమాధానాలు చెవుతూనో మీడియాలో కనబడుతూ ఉండేవారిని జనాలు బాగా గుర్తు పెట్టుకుంటారు. పార్టీల అధినాయకుల దృష్టిలో కూడా వారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక్కోసారి గెలిచిన మరియు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నేతలు కూడా వ్యతిరేక గళం, అసహనం అధినేతపై తెలియజేస్తారు. వీరి చర్యలు ప్రజలు మరియు ప్రతి పక్షాల దృష్టిని మరింత ఆకర్షిస్తాయి. అధికార పార్టీలో గెలిచిన ఎంఎల్ఏనో లేక ఎంపీనో సొంత పార్టీని తిట్టడం, ప్రశ్నించడం అరుదుగా జరిగే అంశం. అధికార పార్టీలో ఉంటూ అధినాయకుడుకి ఎదురుతిరిగి సమస్యలు తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు…కానీ వారికి ప్రత్యామ్నాయం, భద్రతకు భరోసా ఉన్నప్పుడు మాత్రమే ఈ సాహసానికి ఒడిగడతారు.

మూడు ప్రాంతాలను ముగ్గురికి పంచిన జగన్?

ఇంత సుదీర్ఘ వివరణ తరువాత మీకు ఖచ్చితంగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు గుర్తుకు వచ్చే ఉంటాడు. ఒక వారం రోజులుగా ఆంధ్రా రాజకీయాలలో రఘురామ కృష్ణం రాజు అనే పేరు హాట్ టాపిక్ మారింది. ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏమి మాట్లాడుతారు అనే ఆసక్తి నేతలలో…సామాన్య ప్రజల్లో నెలకొంది. వైసీపీ ప్రభుత్వ పనితీరుతో మొదలుపెట్టిన ఆయన ఏకంగా పార్టీ మూలాలు దాని అస్తిత్వం, వ్యవస్థీకృత విధానాలు ప్రశ్నించే వరకు వెళ్లారు. ఓ సందర్భంలో వైసీపీ కాళ్ళ బేరానికి వస్తేనే నేను ఆ పార్టీలో చేరాను అని..పరుష వ్యాఖ్యలు చేశారు. కారణం ఏదైనా… ఆయన ఆశిస్తున్న ప్రయోజనం ఏదైనా కానీ, జగన్ కి విధేయుడిని అంటూనే ఆయనతో యుద్ధం ప్రకటించారు.

మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!

దీనిలో భాగంగానే ఆయన ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ మరియు బీజేపీ నేతలను కలిసి వైసీపీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. తనపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా తనకు బీజేపీ అండ ఉందని చెప్పడమే రఘురామ కృష్ణం రాజు అసలు ఉద్దేశం. ఇంత చేసినా ఆయనకు జరిగిన ప్రయోజనం ఏమిటీ?. ధైర్యంగా జగన్ ని ఎదిరించి ప్రజల పక్షాన నిలిచాడు అనుకుందామంటే..ఆయన ఒక్క ప్రజా సమస్య గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక బీజేపీతో స్నేహం వలన ఆయనకు పదవులు దక్కవు…ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకుడిగా అగ్రతాంబూలం కూడా అందదు. ఈయన ఎంపీగా కొనసాగే నాలుగేళ్లు అటు వైసీపీ దృష్టిలో నమ్మక ద్రోహిగా…ఇటు బీజేపీ దృష్టిలో అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోవడం తప్ప…!

పబ్జి ఆటకు మంగళం?


టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ దేశ గేమింగ్ దిగ్గజం టెన్‌ సెంట్‌ కు కొత్త భయం పట్టుకుంది. ఇన్ని యాప్స్‌ ను ఒక్కసారిగా బ్యాన్ చేసిన భారత్ పబ్‌ జీ మొబైల్‌ ను కూడా నిషేధిస్తుందేమోనని వణికిపోతోంది. పబ్‌ జీ మొబైల్ ద్వారా భారత్‌ నుంచి వేల కోట్ల రూపాయలు టెన్‌ సెంట్ జేబులోకి చేరుతున్నాయి. అయితే ఇటీవల భారత్ నిషేధించిన చేసిన అప్లికేషన్ల జాబితాలో టెన్‌సెంట్‌కు చెందిన వియ్ చాట్ కూడా ఉంది. దీంతో తమ సంస్థకు చెందిన పబ్‌జీని కూడా భారత్ బ్యాన్ చేస్తుందేమోనని టెన్‌సెంట్ యాజమాన్యం భయపడిపోతోంది. ఒకవేళ అదే జరిగితే సంస్థకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. తిరిగి కోలుకోలేని దెబ్బ తగులుతుంది.

మరోవైపు టిక్‌ టాక్ యాప్‌ ను భారత ప్రభుత్వం నిషేధించిన చేసిన తర్వాత స్వదేశీ యాప్ మిత్రోన్‌ దూసుకుపోతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండు నెలల్లోనే కోటి డౌన్‌ లోడ్ల మైలురాయిని అందుకున్న మిత్రోన్ యాప్.. ఆ తర్వాత వారంలోనే 1.7 కోట్ల డౌన్‌ లోడ్లకు చేరుకోవడం విశేషం. యాప్‌ కు పాప్యులారిటీ పెరుగుతున్న నేపథ్యంలో రెండు వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థలు ‘3 వన్ 4’, ‘లెట్స్ వెంచర్’ల నుంచి నుంచి రెండు కోట్ల రూపాయలను సమకూర్చుకుంది. ఈ నిధులతో ప్రొడక్ట్ డెవలప్‌ మెంట్‌ ను మరింత వేగవంతం చేయనుంది. అంటే నైపుణ్యం ఉన్న కొత్త వారిని తీసుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన, ఇండియన్ కంటెంట్ క్రియేటర్లతో ఎంగేజ్ కావడం వంటివి చేయనుంది. కంటెంట్ నిర్మాణంతోపాటు దేశీయ కంటెంట్ క్రియేటర్లపై దృష్టి సారిస్తామని ‘మిత్రోన్’ వ్యవస్థాపకుడు శివాంక్ అగర్వాల్ తెలిపారు.

మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!


ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ న్యూస్ మద్యంప్రియులను ముచ్చెమటలు పట్టించింది. ముఖ్యంగా బీర్లను ఇష్టంగా సేవించేవారికి మాత్రం ఇది నిజంగా షాకింగ్ వార్తే.. అయితే చివర్లో ఓ చిన్న ట్వీట్ కూడా ఉంది. మద్యంప్రియులను అంతలా భయాందోళనకు గురిచేసిన వార్తంటో మనం కూడా ఓసారి చూద్దామా..!

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

బీర్లు తయారుచేసే కంపెనీలో ఓ ఉద్యోగి 12ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆ వ్యక్తికి బద్ధకం ఎక్కువ. దీంతో సదరు ఉద్యోగి బీర్ల తయారీకి ఉపయోగించే ట్యాంకులోనే మూత్రం పోస్తున్నాడట. ఈ వ్యవహారం అంతా 12ఏళ్లుగా సాగుతోందట. ఆ వ్యక్తి పని చేసిది బడ్వైజర్(Budweiser) బ్రేవరీలోనట. ఒకసారి తన ఫ్రెండ్స్ బడ్వైజర్ బీరు తాగుతుంటే ఆ ఉద్యోగికి జాలిసిందట. దీంతో తాను బద్దకంతో బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్న విషయం వారికి చెప్పాడట. దీంతో వారంతా షాకయ్యారు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

ఇక నుంచి తాను అలాంటి తప్పు చేయబోనని ఫ్రెండ్స్ కు ప్రామీస్ చేశాడు. అంతేకాకుండా తన యజమాని తనపై చాలా నమ్మకం పెట్టుకున్నాడని ఇక బీరు ట్యాంకులో మూత్రంపోయనని వారికి హామీ ఇచ్చాడట. అప్పటి నుంచి ఆ ఉద్యోగి బీరు ట్యాంకులో మూత్రం లేకుండా కేవలం నీటితో నింపుతున్నాడట. ఊహించని విధంగా అతడు అందరికీ షాకివ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గతంలో బడ్వైజర్ బీర్లు తాగిన వాళ్లంతా.. వాడు పోసిన బీరేనా ఇన్నిరోజులు తాగింది అంటూ తలలు పట్టుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

అయితే ఇదంతా కల్పితమని.. జస్ట్ ఫర్ ఫన్ కోసమేనని.. సదరు వెబ్ సైట్ ఈ కథనం చివర్లో ప్రచురించడంతో మద్యంప్రియులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ షాక్ నుంచి కోలుకున్నాక మద్యంప్రియులు, నెటిజన్లు ఆ వార్తను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు జోక్సు వేసుకుంటూ.. ఈ వార్తను షేర్ చేసుకుంటూ మద్యంప్రియులు చీర్స్ చెబుతుండటం గమనార్హం.

ఎన్టీఆర్ కి పాన్ ఇండియా రేంజ్ టైటిల్ కావాలట !


‘అయినను పోయి రావలె హస్తినకు’.. ఈ టైటిల్ సోషల్ మీడియాలో వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్ లోగ్స్ తో ఎన్టీఆర్ పాత గెటప్స్ తో పోస్టర్లను డిజైన్ చేసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ టైటిల్ ఫిక్సా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. త్రివిక్రమ్ మాత్రం ఇదే టైటిల్ ను ఖాయం చేశాడట. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. మరి టైటిల్ అన్ని భాషల్లో ఈజీగా రీచ్ అవ్వాలంటే.. అచ్చ తెలుగు టైటిల్ కాకుండా.. ఏ ఆర్ఆర్ఆర్ లాగానో అన్ని భాషల వాళ్లకు అర్ధం అయ్యేలా ఒకే టైటిల్ పెడితే బాగుంటుందని ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి సూచించాడట. త్రివిక్రమ్ కూడా ఆ దిశగా టైటిల్ ను మార్చాలనే ఆలోచనలో ఉన్నారు.

టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?

అన్నట్టు ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎన్నారైగా కనిపించబోతున్నాడని… పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, అనుకోకుండా తన తాతయ్య కుటుంబం కోసం మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తోందని.. కానీ ఇక్కడ పరిస్థితులు ఎన్టీఆర్ ను కదిలిస్తాయని.. దాంతో తారక్ సెకెండ్ హాఫ్ నుండి ఓ డిఫరెంట్ లుక్ లో రాజకీయ నాయకుడుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉంటుంది అట. అయితే రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు.

టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కుదిరితే విజయదశమి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన సినిమాని లాంచ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

పాయల్‌ జాక్‌పాట్‌.. ఇటు బన్నీతో అటు కమల్‌ హాసన్‌తో!


ఆర్ఎక్స్‌ 100 సినిమాలో అందల ప్రదర్శనతో పాటు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్తో యువత హార్ట్‌ బీట్‌ పెంచిన నటి పాయల్‌ రాజ్‌పుత్. ఆపై, ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’లో మరింత బోల్డ్‌గా కనిపించినప్పటికీ ఆ చిరు చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. కానీ, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో నటనలో మెప్పించి టాలీవుడ్‌లో నిలదొక్కుకుంది ఈ ఢిల్లీ భామ. కానీ, కెరీర్ను మలుపు తిప్పే బ్రేక్‌ కోసం ఎదురూ చూస్తూనే ఉంది. అందుకే మొన్నటిదాకా పంజాబీ సినిమాలతో తెలుగులో నటించగా… ఇప్పుడు కేవలం దక్షిణాదిపైనే దృష్టి పెట్టింది. ‘ఏంజెల్’ అనే సినిమాతో తమిళ్‌లో అరంగేట్రం చేయనుంది. మరోవైపు తెలుగులో ‘నరేంద్ర’ అనే మూవీల నటిస్తోందామె. ఓ వెబ్‌ సిరీస్‌కు కూడా ఓకే చెప్పింది. ఒకపక్క లీడ్‌, సెకండ్‌ హీరోయిన్‌ రోల్స్‌ పోషిస్తూనే ఐటమ్‌ సాంగ్స్‌ బాట పట్టిన పాయల్‌ రెండు చేతులా సంపాదిస్తోంది. తేజ దర్శకత్వం వహించిన ‘బుల్‌రెడ్డి’ అనే ఐటమ్‌ సాంగ్‌లో ఆల్రెడీ మెప్పించింది. ఇప్పుడు మరో రెండు భారీ ఆఫర్లు ఆమెకు వచ్చినట్టు సమాచారం.

టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?

అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’. తన ప్రతీ సినిమాలోనూ ప్రత్యేక పాట ఉండేలా చూసుకుంటాడు సుకుమార్. బన్నీతోనే చేసిన ఆర్య 1, 2 సినిమాల్లో ‘ ఆ అంటే అమలాపురం’, ‘రింగ రింగా’ పాటలతో ఒకరకంగా టాలీవుడ్‌లో ఐటమ్‌ నంబర్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు సుక్కు. తన లాస్ట్‌ మూవీ ‘రంగస్థలం’లో పూజా హెగ్డేతో ‘జిగేల్‌’ అనిపించాడు. దాంతో, సుకుమార్ సినిమా వస్తుందంటే హీరో, హీరోయిన్లు ఎవరు తర్వాత ఐటమ్‌ సాంగ్‌లో నటించేదెవరూ? అని అడిగే పరిస్థితి వచ్చింది. పైగా, డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌ అయిన బన్నీతో సాంగ్ అంటే మామూలుగా ఉండదు. ఈ క్రేజ్‌ దృష్ట్యా మొదట బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా ను చిత్ర బృందం సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మరో ఇద్దరు పేరున్న హీరోయిన్లను అడిగినా చివరకు పాయల్‌ రాజ్‌పుత్‌ను ఖాయం చేసినట్టు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇదే లక్కీ ఆఫర్ అనుకుంటే మరో పాన్‌ ఇండియా మూవీలో కూడా నర్తించే చాన్స్‌ పాయల్‌కు వచ్చిందని తెలుస్తోంది. సౌత్‌ స్టార్హీరో కమల్‌ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషనల్లో వస్తున్న భారతీయుడు-2లో కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం పాయల్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. హీరోయిన్‌గా కెరీర్ ఎలా ఉన్నా.. ఈ రెండు మూవీల్లో స్పెషల్‌ నంబర్స్‌ చేస్తే పాయల్‌ పేరు మార్మోగడం ఖాయమే.

క్రేజీ కలయికలో.. ఏదో జరగబోతుంది !


ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్నాచితకా క్యారెక్టర్స్ చేసుకుంటూ.. కన్నడనాట ఏకంగా రాకింగ్ స్టార్ గా ఎదిగిపోయాడు యశ్. పైగా యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఇంతవరకూ ఏ కన్నడ సినిమా సృష్టించలేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. దాంతో యశ్ మార్కెట్ కన్నడ టాప్ హీరోలందరీ కంటే ఎక్కువైపోయింది.

ఇక కెజియఫ్ సీక్వెల్ గురించి తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్విట్టర్ లో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘ఏదో జరగబోతుంది. మీరు అదేమిటో ఊహిస్తూ ఉండండి’ అంటూ రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

రెండు ఫోటోలలో యశ్ తో పాటు ప్రశాంత్ నీల్ కూడా ఉండటం, పైగా వీరిద్ధరి పై ఓ వీడియో చిత్రీకరిస్తుండగా.. ఫోటోలు తీసినట్లు ఆ ఫోటోలు ఉండటం.. ఆసక్తి రేపుతోంది. ఇంతకీ వీరి పై వీడియో దేని గురించి తీస్తున్నారో చూడాలి. ఆ వీడియోలో సీక్వెల్ సంగతులు తెలుపుతారో.. లేక కరోనా గురించి తమ వంతు జాగ్రత్తలు చెబుతారో. ఒకటి మాత్రం నిజం.. కెజిఎఫ్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సీక్వెల్ లో ప్రధానమైన ప్రతినాయకుడు అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేస్తుండటంతో బాలీవుడ్ లోనూ ఈ సినిమా పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే రఫ్ ఎడిటింగ్ పూర్తి అయిన ఈ సినిమాలో సంజయ్ దత్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయని సంజయ్ చాల కొత్తగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

https://www.instagram.com/p/CCGtO0OgU7D/

ఏమైనా ఇండియా లెవల్లో కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో నిలుస్తోంది. మొదటి పార్ట్ బంపర్ హిట్ అవ్వడంతో పాటు యాక్షన్ క్లాసిక్ అనే ముద్ర రావడం, ఈ సినిమా అన్ని భాషల ఇండస్ట్రీ ప్రేమికులను బాగా ఆకట్టుకోవడంతో అందరూ ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇక కేజీఎఫ్ అంటే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల పై రౌడీల కన్ను, ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ కోణంలో సినిమా సాగుతోంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.