‘అయినను పోయి రావలె హస్తినకు’.. ఈ టైటిల్ సోషల్ మీడియాలో వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్ లోగ్స్ తో ఎన్టీఆర్ పాత గెటప్స్ తో పోస్టర్లను డిజైన్ చేసి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ టైటిల్ ఫిక్సా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. త్రివిక్రమ్ మాత్రం ఇదే టైటిల్ ను ఖాయం చేశాడట. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. మరి టైటిల్ అన్ని భాషల్లో ఈజీగా రీచ్ అవ్వాలంటే.. అచ్చ తెలుగు టైటిల్ కాకుండా.. ఏ ఆర్ఆర్ఆర్ లాగానో అన్ని భాషల వాళ్లకు అర్ధం అయ్యేలా ఒకే టైటిల్ పెడితే బాగుంటుందని ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి సూచించాడట. త్రివిక్రమ్ కూడా ఆ దిశగా టైటిల్ ను మార్చాలనే ఆలోచనలో ఉన్నారు.
టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?
అన్నట్టు ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎన్నారైగా కనిపించబోతున్నాడని… పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని తారక్, అనుకోకుండా తన తాతయ్య కుటుంబం కోసం మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తోందని.. కానీ ఇక్కడ పరిస్థితులు ఎన్టీఆర్ ను కదిలిస్తాయని.. దాంతో తారక్ సెకెండ్ హాఫ్ నుండి ఓ డిఫరెంట్ లుక్ లో రాజకీయ నాయకుడుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం ఉంటుంది అట. అయితే రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రధానంగా హైలైట్ చేయబోతున్నారు.
టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కుదిరితే విజయదశమి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన సినిమాని లాంచ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ntr wants pan india range title
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com