
నెపోటిజం. భారత సినీ పరిశ్రమలో ఇప్పుడు మార్మోగుతున్న పదం. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం (బంధుప్రీతి) అంశం తెరపైకి వచ్చింది. సినీ పరిశ్రమ కొన్ని ఫ్యామిలీల గుప్పిట్టో ఉందని, తమ వారసులకే వాళ్లు ఎక్కువ అవకాశాలు ఇస్తూ బ్యాక్‌గ్రౌండ్ లేని నటీ, నటులను.. స్వయం కృషితో ఎదిగే ప్రతిభావంతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని తట్టుకోలేకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కంగన రనౌత్ లాంటి వాళ్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జొహార్, కపూర్, సల్మాన్ ఖాన్ ఫ్యామిలీలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ను ఏలుతున్న కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా.. దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో ఆలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం ‘సడక్ 2’ కూడా దాని బారిన పడింది.
చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?
ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మహేశ్ భట్ సోషల్ మీడియాలో ‘సడక్-2’ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే నెటిజన్స్ అంతెత్తున లేశారు. దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోవైపు బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎంతలా ఉందో తెలియజేసేందుకు సోషల్ మీడియాలో ‘నెపోమీటర్’ ప్రారంభించారు. బాలీవుడ్ చిత్రాల్లో నెపోటిజం స్థాయి ఐదు కేటగిరీల్లో తేల్చేలా దీన్ని డిజైన్ చేశారు. సదరు చిత్రానికి నిర్మాత, దర్శకుడు, రచయిత, ప్రధాన పాత్రధారులు, ఇతర పాత్రధారుల బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా సినిమాలో ఎంతమేరకు బంధుప్రీతి ఉందో నిరూపిస్తూ ఫలితాన్ని వెల్లడిస్తుంది. దీనికోసం సోషల్ మీడియాలో నెపోమీటర్ అని అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. ఇందులో ఆలియాభట్ సడక్–-2ను పరీక్షించగా.. అది 98 శాతం నెపోటిస్టిక్ మూవీ అని తెలిపింది. ఈ చిత్రంలో ఐదు కేటగిరీల్లోని నాలిగింట్లో బాలీవుడ్ ప్రముఖుల వారసులే ఉన్నారని తేలింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సడక్–2 నెపోమీటర్ రిజల్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. దాంతో, ఆలియా ఆమె ఫ్యామిలీపై మరిన్ని విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. కాగా, బాలీవుడ్‌లో బంధుప్రీతిని రూపుమాపాలన్న ఉద్దేశంతోనే తాము నెపోమీటర్‌ను ప్రవేశపెట్టామని సుశాంత్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.