
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై చూసి చాలా రోజులైంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన‘అజ్ఞాతవాసి’ ఆయన చివరి మూవీ. అది బాక్సాఫీస్ దెబ్బ డిజాస్టర్గా మారింది. అప్పటికే రాజకీయాల్ల అడుగు పెట్టిన పవన్ ‘అజ్ఞాతవాసి’ అనంతరం ఇండస్ట్రీకి దూరయ్యాడు. అప్పటి నుంచి పవన్ తిరిగి వెండితెరపై కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాడు పవన్. పాలిటిక్స్‌కే జీవితం అంకింతం అని ప్రకటించిన తర్వాత మనసు మార్చుకున్న జనసేనాని మళ్లీ మేకప్ వేసుకున్నాడు. ‘వకీల్ సాబ్’ అంటూ మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు రెడీ అవుతుతున్నాడు. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ హిట్ ‘పింక్’ మూవీ రీమేక్‌గా వస్తున్న ‘వకీల్ సాబ్’తో పవన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకురానున్నారు.
జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?
విరామం తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ కావడంతో దీనిపై సహజంగానే భారీగా అంచనాలున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కొన్ని షెడ్యూల్స్‌లో షూటింగ్ కూడా చేశారు. ఇప్పటికే పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. కొన్ని రోజుల కిందట పవన్ లాయర్ గెటప్‌లో ఉన్న పవన్ కోర్టు సీన్ స్టిల్ లీక్ కాగా…సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌పై పాత్రపై సస్పెన్స్ వీడడం లేదు. దాంతో, దీని గురించి రోజుక వార్త చక్కర్లు కొడుతోంది. పవన్ సరసన నటిస్తున్నట్టు పలువురి పేర్లు వినిపించాయి. చివరకు శ్రుతి హాసన్‌ను ఫిక్స్ చేశారని చెప్పారు. కానీ, ఇప్పుడు తమన్నా భాటియా పేరు తెరపైకి వచ్చింది. మాతృక హిందీ ప్రకారం ఇందులో ముగ్గురు ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లకు అవకాశం ఉంది. ఇప్పటికే అంజలి, నివేదా థామస్, అనన్య పేర్లు ఖరారయ్యాయి. మొన్న లీకైన కోర్టు సీన్‌లో కూడా పవన్ పక్కన అంజలి కనిపించింది. ఆమెనే ప్రధాన హీరోయిన్ అన్న అభిప్రాయం కలుగుతోంది. వాస్తవానికి హిందీ కథ ప్రకారం.. హీరోతో రొమాన్స్ చేసే హీరోయిన్‌కు ఆస్కారం లేదు. కానీ, ‘పింక్’లో అమితాబ్ వృద్ధ లాయర్గా కనిపిస్తాడు. కానీ, పవన్ వయసు, స్టార్డమ్‌ను దృష్టిలో ఉంచుకొని తెలుగులో అనేక మార్పులు చేశాడట దర్శకుడు శ్రీరామ్.
టీవీ9 రవిప్రకాష్, ఆ హీరోకు బిగుసుకుంటున్న ఉచ్చు?
ఈ క్రమంలోనే హీరోతో ఆడిపాడే హీరోయిన్ క్యారెక్టర్ను రాసుకున్నాడట. ఆ పాత్ర కోసం ఇలియానా నుంచి శ్రుతి హాసన్ వరకూ పలువురిని సంప్రదించగా… చివరకు తమన్నాకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమన్నాతో సంప్రదింపులు జరిగాయని తెలుస్తోంది. పవన్ తో ఇది వరకు ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’లో నటించిన మిల్కీ బ్యూటీ పవర్స్టార్తో మరోసారి సినిమా అనగానే వెంటనే అంగీరించిందని టాలీవుడ్ టాక్. కానీ, ఇది ఎంత వరకు నిజం? ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలో హీరోతో ఆడిపాడే హీరోయిన్‌కు చాన్సుందా? అనేది చిత్ర బృందమె వెల్లడించాలి.


చైనాపై ప్రపంచ దేశాలలో వస్తున్న వ్యతిరేకతను వివిధ మొబైల్ కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. మనదేశంలో కూడా ప్రస్తుతం చైనాపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కరోనా విషయంలో చైనాపై ముందునుంచే మనదేశంలో వ్యతిరేకత నెలకొంది. అయితే సరిహద్దుల్లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఈ వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. మనదేశంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చైనా కంపెనీలకు చెందిన మొబైల్స్ ను కూడా ఇకపై కొనుగోలు చేయకూడదని కొంతమంది నిర్ణయించారు. ప్రస్తుతం మనదేశంలో అన్ని ధరల స్థాయిలో చైనా బ్రాండ్ల ఫోన్లు కాకుండా ఉన్న టాప్-10 స్మార్ట్ ఫోన్లు ఇవే!
దేశాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ప్రపంచంలో కోవిడ్19 విజృభిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడిలో ప్రపంచ దేశాల మధ్య సహకారం కొరవడినట్లు ఆయన తెలిపారు. ఒంటరిగా పోరాటం చేయాలన్న విధానంతో వైరస్ ను ఓడించలేక దేశాలు ఒడిపోయాయని ఆయన తెలిపారు. ఓ విూడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వ్లెడిరచారు. ఒంటరి పోరాటం వల్ల వైరస్ ను నియంత్రించలేమన్న విషయాన్ని ఆయా దేశాలు అర్థం చేసుకోవాలని, వైరస్ నియంత్రణలో ప్రపంచ దేశాల సహకారం అవసరమన్నారు. చైనాలో మొదలైన కోవిడ్ ఆ తర్వాత యూరోప్, అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, భారత్ లోనూ విజృంభించిందన్నారు.
ఫామ్ హౌస్ కేసుపై సుప్రీంకోర్టు లో కేవియట్ ను మంత్రి కేటీఆర్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సుప్రీంకోర్టు లో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు చేశారు. కేటీఆర్ తో పాటు మరో రెండు కేవియట్ల ను బద్వేలు ప్రదీప్ రెడ్డి వేశారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం పై గతంలో ఎన్ జి టి ని రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. విచారణ తర్వాత గత నెల ఐదో తేదీన కేటీఆర్ సహా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ జి టి. నోటీసులు జారీచేసింది. వివాదాస్పద ఫాం హౌస్ అక్రమమా, సక్రమంగా జరిపారో తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఎన్ జి టి ఏర్పాటు చేసింది. ఎన్ జి టి ఆదేశాలను సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు లో మంత్రి కేటీఆర్ కి ఊరట లభించింది. జూన్ పదవ తేది ఎన్ జి టి ఆదేశాలపై స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే స్టే ఆర్డర్ కాపీ వెలువడడానికి ముందే సుప్రీంకోర్టు లో కెటిఆర్ కెవియట్ దాఖలు చేశారు.
తెలంగాణలో సచివాలయం కూల్చివేతపై అన్ని ఆడంకులు తొలిగిపోవడంతో ఆ భవనాల కూల్చివేతకి కేసీఆర్ సర్కార్ సిద్ధపడ్డది. దింతో ఆ భవనాలను కూల్చకుండా కాంగ్రెస్ కొత్త డిమాండ్ తో కేసీఆర్ కి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతన్న వేళ సచివాలయ భవనాలను కోవిడ్ ఆస్పత్రిగా మారిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖంగా ప్రవర్తించొద్దని సూచించారు. సెక్రటేరియట్ అందరికీ అందుబాటులో ఉంటుందని, పేదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తూ ఆందోళనకరంగా మారిందన్నారు. ‘రోగులు పెరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోరా.. సచివాలయాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చలేరా? సచివాలయం కూల్చివేత ప్రజా వ్యతిరేకం. 10 వేల పడకల ఆస్పత్రిగా చేయొచ్చు. పేదలకు అండగా నిలవచ్చు.’ అని అనిల్ కుమార్ సూచించారు.























