Home Blog Page 8424

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

Mudragada-padmanabham-retirement-letter


ఏపీలో కులం రాజకీయం మరోసారి ‘పసుపు’ రంగు పులుపుకుంటోంది. అభివృద్ధి చేసిన నాయకుల కంటే కులం పేరుతో ఓట్లు పొందే నాయకులే ఏపీలో ఎక్కువగా ఉన్నారు. ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య కుల రాజకీయాలు నడుస్తున్నాయి. టీడీపీ తొలి నుంచి ఏపీలో ఒక కులాన్ని బేస్ చేసుకునే రాజకీయాలను చేస్తుందనే నానుడి ఉంది. టీడీపీకి కాపు సామాజికవర్గం కొంత బలంగా ఉండగా వైసీపీ రెడ్ల నుంచి మద్దతు ఉంది. కిందటి ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగడంతో కాపులంతా కూడా ఆయనకే మద్దతు పలికారు. దీంతో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యాన్ని చాటింది.

చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!

ఏపీ సీఎంగా జగన్మోహన్ ఏడాది పాలన ఇటీవల పూర్తయింది. అనేక సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజలకు దగ్గరవుతున్నారు. కిందటి ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చిన కాపులను ఆదుకునేందుకు ఇటీవలే ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్థికసాయం చేయనున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. తొలి ఏడాది దాదాపు 2.36లక్షల మహిళలకు లబ్ధి చేకూరనుంది.

వైసీపీ కాపునేస్తం అమలు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాన్ కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్ గా అధికార పార్టీ నేతలు సైతం దీటుగా జవాబిచ్చారు. కాగా గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన 6శాతం ఓట్లలో కాపువర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పవన్ కల్యాణ్ తెరపైకి కాపు రిజర్వేషన్ అంశాన్ని తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ విన్పిస్తుంది. పవన్ కు వత్తాసుగా టీడీపీ నాయకులు వంతపాడుతుండటంతో ఏపీ రాజకీయాల్లో కాపు రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత టీడీపీ హయంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తే నాటి టీడీపీ ప్రభుత్వ ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో కొన్నిరోజులపాటు ముద్రగడ పద్మనాభం సైలంటయ్యారు.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

తాజాగా కాపు రిజర్వేషన్లపై ఏపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు  లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. అడిగిన వారికి, అడగని వారికి అందరికీ దానాలుచేసి దానకర్ణుడుగా  వరాలిస్తున్న సీఎం జగన్ కాపు రిజర్వేషన్లను సాధించే విషయంలో ఎందుకు సహకరించడంలేదని ప్రస్తావించారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడానికి కాపు జాతి మద్దతు చాలా ఉందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాపు రిజర్వేషన్ అంశం సరైనదేనని గతంలో జగన్ చెప్పారని ముద్రగడ గుర్తు చేశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్ కూడా అందరితో పూజలు అందుకోవాలని కోరారు. పదవిని మూన్నాళ్ళ ముచ్చటగా చేసుకోవద్దు అంటూ హెచ్చరించారు.

ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న ముద్రగడ ఒక్కసారిగా జగన్ కు లేఖరాయడం వెనుక పలు అనుమానాలను లేవనెత్తతున్నాయి. కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం కాపులకు దగ్గరవుతుండగా పవన్ కల్యాన్ కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంలో తాను మౌనం వహిస్తే కాపు సామాజికవర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని గ్రహించిన ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు లేఖ రాసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపై పవన్ కు క్రెడిట్ దక్కకుండా.. తన పరపతి పోకుండా ముద్రగడ ఇలా వ్యవహరించారనే వాదనలు విన్పిస్తున్నాయి. ఏదిఏమైనా కాపు రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాలను మరోసారి హీటెక్కించడం ఖాయంగా కన్పిస్తోంది.

కరోనా ప్రవాహంలో కూడా.. ఓ హాస్య గుళిక !


కరోనా తీవ్రత ప్రవాహంలో ప్రపంచం కొట్టుకుపోతూ ఉంటే.. మరోపక్క కరోనా పై కూడా జోక్స్ పుట్టిస్తున్నారు మన కామెడీ క్రియేటర్స్. జంధ్యాల లాంటి కామెడీ కింగ్ లేకపోయినా.. పేరడీ చేసే నాలాంటి అధముల ముష్టి హాస్యంతో కరోనా కష్టకాలంలో కూడా హాయిగా నవ్వుకోవచ్చు. తాజాగా ఒక ఇంట్రస్టింగ్ కామెడీ పోస్ట్ ఏమిటంటే.. ఇంట్లోనే కోవిడ్ కు సులభమైన పరీక్ష ఒకటి ఉంది. ప్రతీ రోజు రాత్రి 7 గంటలకు విస్కీ బాటిల్ మూత తీసి, గట్టిగా పీల్చి వాసన చూసి కళ్ళు మూసుకోండి. మీకు విస్కీ వాసన తెలిస్తే, మీ ముక్కు బాగా పనిచేస్తుంది కాబట్టి, మీకు కరోనా మొదటి పరీక్ష అయిపోయినట్టేనట. అంటే మీకు కొరోనా సోకలేదన్న మాట.

హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!

కానీ, మరోసారి పరీక్షించడం, సెకండ్ ఒపీనియన్, ఎందుకైనా మంచిది కదా, కాబట్టి… అదే విస్కీని గ్లాసులో పోసుకుని నాలికతో, మెల్లమెల్లగా చప్పరించి చూడండి. మీకు విస్కీ రుచి తెలిస్తే, ఖచ్చితంగా మీకు కొరోనా రానట్టే అని తీర్మానం చేసుకోవచ్చు. ఎందుకైనా మంచిది 180 యం. యల్ వరకు ఈ పరీక్ష కొనసాగిస్తూ, చప్పరిస్తూ ఉండటం ఉత్తమమండోయ్. మధ్యలో అప్పుడప్పుడు పల్లిలో, కాజూనో తిన్నా కూడా విస్కీ రుచిలో ఏం తేడా తెలియలేదంటే, ఇక ఈ రోజుకి మీకు కొరోనా ఖచ్చితంగా రానట్టే అని ఫిక్స్ అయిపోవచ్చు. ఏమైనా ఈ కష్టకాలంలో, ఏ రోజుకారోజు పరీక్షించుకోవడం చాలా ముఖ్యమండోయ్.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎందుకైనా మంచిది మీ భార్య పర్మిషన్ తోనే, ఈ టెస్టులు చేయవలెనని ముందు జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. లేనిచో కరోనా వలన కాక మరొక రకంగా స్వర్గస్తులయ్యే అవకాశాలు బహు అధికం అని మీకు తెలియంది కాదు. భారత్‌ లో కరోనా రోజురోజుకు పెరుగుతూనే ఉంది, కాబట్టి.. కరోనాకి మన బ్యాచిలర్ కుర్రాళ్లు వండుకున్న వంటకం గాని, లేదా మన డైలీ తెలుగు ప్లాప్ సీరియల్స్ లోని ఎమోషన్ ను గాని పదే పదే చూపించాలి. చివరగా మీకు నవ్వు రాకపోయినా ఇంతటితో నేను ముగించడం మంచింది.

ఇది పవన్ వ్యక్తిత్వం అనుకోవచ్చా..?

Pawan kalyan

Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాలలో రాజకీయాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. ఇటీవల “కాపు నేస్తం” పై జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 13 నెలల వ్యవధిలోనే 23లక్షలమంది కాపులకు 4,770కోట్లు ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన మీరు “ఏడాది తిరిగేలోగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ ఇవ్వడం వల్ల కాపు రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ సీఎం జగన్ జూలై 1న 1088 అత్యాధునిక అంబులెన్స్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించే అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రారంభించడం అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ విధంగా సీఎం జగన్ చేసే మంచి పనులను మెచ్చుకుంటునే.. మరోవైపు ప్రజలకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటే అదే స్థాయిలో విరుచుకుపడటం పవన్ నైజం. అంటే మంచిని మంచిగా చెడుగా చూడటం పవన్ వైఖరిగా కనిపిస్తోంది. ఇలాంటి మనస్తత్వం రాజకీయాలలో అరుదుగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మానవ జాతి అంతమైతే బాగుండు: సాయి పల్లవి


డ్యాన్సర్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి సాయి పల్లవి. దక్షిణాదిలో ఇప్పుడామెకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందం లేకపోయినా.. అభినయంతో వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటుందామె. బోల్డ్‌ క్యారెక్టర్లకు, స్కిన్ షోకు ఎప్పుడూ దూరంగా ఉండే సాయి పల్లవికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. మెడిసిన్‌ చదివిన ఆమె మనుషులు, మానవ సంబంధాలకు ఎక్కువ విలువనిస్తుంది. మహిళలు, చిన్నారులపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తుంది.

హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!

ఈ క్రమంలో తమిళనాడులో సంచలనంగా మారిన ఏడేళ్ల చిన్నారి జయప్రియ అత్యాచారం, హత్యపై ఆమె భావోద్వేగానికి గురైంది. తమిళనాడు పుదుకొట్టాయ్ జిల్లా ఎంబాల్ గ్రామంకి చెందిన‌ రెండో తరగతి బాలిక జయప్రియ ను కొందరు కామాందులు అత్యాచారం చేసి హత్య చేశారు. చిన్నారి మృత దేహాన్ని ముల్లపొదల్లో పడేశారు. ఈ వార్త తెలిసిన తర్వాత తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ జస్టిస్ ఫర్ జయప్రియ అనే హ్యాష్‌ట్యాగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది ఈ అమానవీయ ఘటనపై సాయి పల్లవి స్పందించింది. ట్వీట్టర్లో వరుసగా పోస్టులు చేసింది.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

‘మాన‌వ‌ జాతిపై విశ్వాసం వేగంగా న‌శిస్తుంది. తోడు లేని వారికి స‌హాయ‌ప‌డ‌టానికి ఇచ్చిన శ‌క్తిని మ‌నం దుర్వినియోగం చేస్తున్నాం. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాము. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిని బాధపెడుతున్నాం. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతున్నాం. ఇలాంటి ఘటనలు చూస్తూ దారుణమైన జీవితాన్ని గడిపేకంటే మానవజాతి అంతం అవడం ఉత్తమం అని ప్రకృతి మనకు సందేశం ఇస్తోంది. ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనిచ్చే అర్హత లేదు. సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవడం ద్వారా ఒక నేరం వెలుగులోకి వచ్చిన తర్వాతే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పటిదాకా గుర్తించబడని, వెలుగులోకి రాని నేరాల పరిస్థితి ఏంటి?. ఇప్పుడు ఎన్నో దారుణమైన నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని గుర్తించేందుకు మనం హ్యాష్ట్యాగ్‌ వాడే పరిస్థితి వచ్చింది’ అని ఆవేదన వ్యక్తం చేసిన పల్లవి జస్టిస్ ఫర్ జయప్రియ అనే హ్యాష్ట్యాగ్‌ జతజేసింది.

హాట్‌ ఫొటోతో తేజస్వి ‘కమిట్‌మెంట్‌’ పోస్టర్ రిలీజ్‌


‘నాకు కొంచెం క్యాస్ట్‌ ఫీలింగ్ ఎక్కువ. కాలేజీలో ఓ గ్యాంగ్‌ను కూడా మెయింటేన్‌ చేస్తున్నా’… సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈ డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తేజస్వి మదివాడ. ఆ తర్వాత మనం, హార్ట్‌ ఎటాక్‌ సినిమాల్లో చిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే ఆర్జీవీ ‘ఐస్‌క్రీమ్‌’ మూవీలో బోల్డ్‌ క్యారెక్టర్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ తర్వాత మళ్లీ సెకండ్, థర్డ్‌ హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు కొన్ని షోస్‌లో కూడా పార్టిస్‌పేట్‌ చేసింది. కానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోవవాలనే ఆమె ఆశ తీరడం లేదు. దాంతో, గేరు మార్చిన ఈ తెలుగమ్మాయి తన శరీరాన్ని మార్చుకుంది. స్లిమ్‌, సెక్సీగా మారి బోల్డ్‌ క్యారెక్టర్లకు ఓకే చెబుతోంది.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

ఈ క్రమంలో ‘కమిట్‌మెంట్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోందామె. లక్షీకాంత్ చెన్నా దీన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. శుక్రవారం తేజస్వి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ పోస్టర్ను రిలీజ్‌ చేశారు. బ్లాక్ టాప్‌, బాటమ్‌ బికినీలో వయ్యారంగా పడుకొని ఉన్న తేజస్వి ఫొటో కుర్రాళ్ల గుండెలను తాకింది. ఈ పోస్టర్ కోసం ఫొటో షూట్‌ చేసిన మరిన్ని ఫొటోను కూడా తేజస్వి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. అన్నింటిలోనూ సెక్సీ లుక్స్‌తో అదరగొట్టిందామె. పోస్టర్లోనే ఇంత హాట్‌గా ఉంటే.. వెబ్‌ సిరీస్‌లో మరెంత గ్లామర్గా ఉంటుందని కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారు. నలుగురు యువతులకు సంబంధించిన కథాంశంతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో తేజస్వితో పాటు ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ కూడా నటిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో యువతి కథ ఉంటుందట. ఈ సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకుంది తేజస్వి. ఇది హిట్టయితే కెరీర్ టర్న్‌ అవుతుందని భావిస్తోందామె.

 

https://twitter.com/SouthernTalkies/status/1278885373242798080

చరణ్ కి కథ చెబుతాడట !


సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత కూడా ఛాన్స్ రాకపోతే.. అదీ స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టిన స్టార్ డైరెక్టర్ కి అంటే.. కచ్చితంగా అది ఆ డైరెక్టర్ కి అవమానమే. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటే… ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మొదట వంశీ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని బాగానే ప్రయత్నాలు చేశాడు. మహేష్ కూడా వంశీతో మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చాడు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చకపోవడం, చివరికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చేయడం జరిగిపోయాయి. మొత్తానికి వంశీకి మహేష్ హ్యాండ్ ఇచ్చి.. పరుశురాంకి ఫిక్స్ ఆయిపోయాడు.

హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!

ఇక చేసేదేం లేక వంశీ మహేష్ ని వదిలేసి మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ దగ్గర నుండి తారక్, రామ్ చరణ్ దాకా అందరి పేర్లు వినపడ్డాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తున్నాడట. అయితే చరణ్ తో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఈ లోపు వెబ్ సిరీస్ చేయాలని చూస్తున్నాడు వంశీ.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

అయితే త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయ్యాడట. అన్నట్టు ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంతో చరణ్ తో చేయబోయే సినిమా పై భారీ ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి.

తెలంగాణ కాంగ్రెస్ ను నడిపించే నేతే లేడా?


అసలు ఉనికే లేని చచ్చుబడిన ఏపీలో పీసీసీ అధ్యక్షుడిని మార్చేసి కొత్తగా శైలజనాథ్ ను పెట్టేసింది కాంగ్రెస్ అధిష్టానం. చాలా యాక్టివ్ గా ఉన్న కర్ణాటకలోనూ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను పీసీసీ చీఫ్ గా నియమించింది. నెలలు గడుస్తున్నా కానీ తెలంగాణలో ఆ ఉలుకూ పలుకు లేదు. పైగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు దిగజారుతోంది. ఎందుకని అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ కు అసలు సిసలు నడిపించే నేతను ఎన్నుకోలేకపోతోంది? అన్నది ఇప్పుడు అందిరినీ తొలుస్తున్న ప్రశ్న. తెలంగాణ పీసీసీపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకని ఒక నిర్ణయానికి రావడం లేదన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!

హుజూర్ నగర్ లాంటి సొంత అసెంబ్లీ సీటులో ఓటమి తర్వాత పీసీసీ చీఫ్ గా తాను వైదొలుగుతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ కాడి వదిలేశాడట.. ఇప్పటికే ఉత్తమ్ ఐదేళ్ల పదవీకాలం కూడా ముగిసింది. ఆయన హయాంలో కాంగ్రెస్ గెలిచింది లేదు. ఇప్పటికే రెండు ఎన్నికలను పీసీసీ చీఫ్ గా ఎదుర్కొన్న ఉత్తమ్ రెండింట్లోనూ కాంగ్రెస్ ను గెలిపించలేకపోయాడు. దీంతో కాంగ్రెస్ వాదులంతా ఉత్తమ్ ను సాగనంపి కొత్త నేతను నియమించాలని అధిష్టానానికి విన్నవించారు.

ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్ జోరుగా సాగింది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హోరాహోరీగా లాబీయింగ్ చేశారు. శ్రీధర్ బాబు,జీవన్ రెడ్డిల పేర్లు కూడా వినిపించాయి. జగ్గారెడ్డి అయితే తనకు ఇస్తే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానన్నాడు. అయితే కరోనా-లాక్ డౌన్ తెలంగాణ నేతల ఆశలపై నీళ్లు చల్లింది.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?

రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా దాదాపు ఖాయం చేసుకున్న అధిష్టానానికి కాంగ్రెస్ సీనియర్లు అంతా మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో నియామకం ఆగిపోయిందట.. కోమటిరెడ్డికి సపోర్టుగా ఉత్తమ్ సహా నల్గొండ నేతలు లాబీయింగ్ చేశారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తేనెతుట్టను కదపితే మరింతగా పరిస్థితి దిగజారుతుందని కాంగ్రెస్ అధిష్టానం మిన్నకున్నట్లు తెలిసింది.

అందుకే ఉత్తమ్ ప్రస్తుతానికి కంటిన్యూ అయిపోతున్నారు. అయితే వచ్చే మూడేళ్లలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలంటే కొత్త పీసీసీ చీఫ్ అవసరమని.. ఇప్పుడు నియమించాలని కాంగ్రెస్ వాదులు ఎంత మొత్తుకుంటున్నా.. గ్రూపుల గోలతో తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడప్పుడే పీసీసీ పీఠం మార్పు సాధ్యమయ్యేలా లేదట.. అలా కాంగ్రెస్ పార్టీ చేజేతులారా తెలంగాణలో బలహీన పడుతోందని.. ఇదంతా కాంగ్రెస్ నేతల స్వయంకృతాపరాధం అని నేతలు వాపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను ఎవరో ఓడించనక్కర్లేదని.. కాంగ్రెస్ వోళ్లు ఓడిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-ఎన్నం

‘చంద్రబాబు గుడులను కూడా వదల్లేదుగా..!’

Jagan vs cbn

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానం లో రాష్ట్రంలోని గుడులను వదిలిపెట్టలేదని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్ లకు మేలు చేసే విదానాన్నే అమలు చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ సేవలను ప్రారంభించిన సందర్భంగా ఆయన టీడీపీ పై నిప్పులు చెరిగారు. తన పాదయాత్రలో ఈ సమస్యను అనేక మంది ప్రస్తావించారని ఆయన అన్నారు. చివరికి గుడులలో సైతం చంద్రబాబు తన బంధువు అయిన భాస్కర నాయుడుకు ఏడు గుడులలో ముప్పై లక్షల రూపాయల చొప్పున అవుట్ సోర్స్ కాంట్రాక్టు ఇచ్చాడని ఆయన అన్నారు. దీనివల్ల పనిచేసే సిబ్బందికి తక్కువ జీతాలు ఇవ్వడం, కాంట్రాక్టర్ లకు మేలు చేయడం జరిగేదని ఆయన విమర్శించారు. కాని ఇప్పుడు తాము తీసుకు వస్తున్న వ్యవస్థ వల్ల ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని, లంచాలతో పనిలేకుండా ఉద్యోగాలు వస్తాయని, ఖచ్చితంగా మొదటి తేదీనే జీతాలు ఇచ్చే విధంగా తాము ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కొత్త సంస్థ అవుట్ సోర్స్ ఉద్యోగులలో కూడా ఏభై శాతం బలహీనవర్గాలవారు ఉండేలా చూస్తుందని జగన్ తెలిపారు.నలభై ఏడు వేల మందికి అవుట్ సోర్స్ ఉద్యోగులకు నియామక పత్రాలను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌’ (ఆప్కాస్‌)కు శ్రీకారం సీఎం జగన్ చుట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆప్కాస్‌ ను సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం దానికి అనుగుణంగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆప్కాన్‌ ప్రారంభం సందర్భంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు పొందిన పలువురితో వీడియో కాన్ఫరెన్స్‌ లో సీఎం మాట్లాడారు.

కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ కు చైర్మన్‌ గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. దీంతో ఎక్కడా కూడా అవినీతి చోటుచేసుకునే అవకాశం ఉండదు. జీతాలు, ఉద్యోగాల్లో ఎక్కడా చేతివాటాలకు అస్కారం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుంది. ప్రతి ఒకనెలా 1వ తేదీనే జీతం చెల్లిస్తాం. ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి విధానాలు కచ్చితంగా పాటిస్తాం. ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా జీతాలు వారి చేతుల్లోకే వస్తాయి. ప్రస్తుతానికి 50,449 మందికి నియామక పత్రాలు ఇస్తాం. ఈ సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతాం. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లో 20 మంది పనిచేయాలని ఉంటే 15 మందితో పనిచేయించి.. మిగిలిన వారి జీతాలను కాంట్రాక్టర్లే తీసుకునేవారు. ఇకపై సిఫారసులు, దళారీలకు చోటు లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను ఇస్తాం’ అని అన్నారు. ఇక ఆప్కాస్‌పై కాంట్రాక్ట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

భారత్ లో చైనా హవా ఇదే!

India china

ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో చైనా సంస్థలు పాతుకొని పోయాయి. 2019 లో ఇండియా ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా కంపెనీలు ల‌క్షా 40 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయి. ఫార్మా,సోలర్, ఎలక్టికల్, ప్లాస్టిక్ మెటీరియ‌ల్‌, టాయ్స్ 80 శాతం చైనా నుంచే దిగుమతి. బిగ్ బాస్కట్, ఓలా లో మేజ‌ర్ షేర్ చైనా కంపెనీల‌దే. 70 శాతం ప్రజలు చైనా ఫోన్లు వాడుతున్నారు. పేటియం 40 శాతం వాటా చైనాదే. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లో 60 శాతం చైనాపెట్టుబడులు. జొమాటో, స్విగ్గిలో ర్ చైనాకు చెందిన మూడు కంపెనీల మేజ‌ర్ షేర్లు. పబ్జి మొబైల్ గేమ్ రోజు 5 కోట్ల మంది ఆడుతున్నారు.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్, సగానికి పైగా చైనా కంపెనీల నియంత్రణలో ఉంది. ఆ సంస్థలకు ఇక్కడ 45 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. భారత్‌ లో 4జీ అందుబాటులోకి వచ్చే నాటికే, చైనా కంపెనీలు 4జీ సదుపాయం ఉన్న చౌక ఫోన్లను విజయవంతంగా తయారు చేయగలిగాయి. దాంతో భారత మార్కెట్‌లోకి శరవేగంగా ఆ ఫోన్లను ప్రవేశపెట్టగలిగాయి. చూస్తుండగానే అనేక మంది 3జీ నుంచి 4జీ ఫోన్లకు మారిపోయారు. ఫలితంగా భారతీయ బ్రాండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

చైనా వైఖరితో భారత్ లో రాజకీయ రగడ!

China

చైనా వైఖరితో భారత్ లో రాజకీయ రగడ చెలరేగుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చారని..కానీ ప్రధాని మోడీ చోద్యం చూస్తున్నారని ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఐతే కాంగ్రెస్‌ కు అంతకు మించిన స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీజేపీ. సోనియా, రాహుల్‌ కు చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఏకంగా కేంద్రమంత్రులే సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌ మంత్రి, బీజేపీ నేతల కమల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాతో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కమల్ నాథ్‌ కు ఉన్న సంబంధాలను బయటపెట్టేందుకు సీబీఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

కాంగ్రెస్ అగ్ర నేతలకు చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాలతో సహా అన్ని రకాల సంబంధాలపై దర్యాప్తు జరిపించాలి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనీస్ ఎంబసీ నుంచి విరాళాలు వచ్చాయి. అందుకే అప్పట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి హోదాలో కమల్‌నాథ్ చైనీస్ దిగుమతులపై రిబేటు ఇచ్చారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలకు చూపించేందుకు సీబీఐ దర్యాప్తు అవసరం. చైనా, యూపీయే ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న మీడియా కథనాలను తోసిపుచ్చలేం. సోనియా గాంధీ నేతృత్వంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ కు చైనా ఎంబసీ నుంచి కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి. చైనాతో సరిహద్దు వివాదంలో కాంగ్రెస్ మెతక వైఖరికి కారణం ఇదేనా?” అని కమల్ పటేల్ ప్రశ్నించారు.

ఇదీ చంద్రబాబు, దేవినేని ఉమ ఘనకార్యమట?


టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్నీ తెలుసు.. ఎక్కడా దొరక్కుండా ఎలా పాలించాలో బాగా తెలుసు అని తెలుగు తమ్ముళ్లు కథలు కథలుగా చెప్పుకుంటారు. అధికారంలో ఉన్నా పోయినా అందుకే చంద్రబాబు దొరకడు అంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.

ఏకంగా 1638 కోట్లతో ప్రాజెక్టు చేపట్టి నీరు పారించి రైతులకు అందించి ఆహో ఓహో అని కీర్తినందుకు చంద్రబాబు.. కనీసం ఆ ప్రాజెక్టుకు అనుమతి తీసుకోవాలన్న చిన్న విషయాన్ని పెడచెవిన పెట్టాడు. ఇప్పుడు ఫలితం చంద్రబాబుకు రాగా.. పాపం ఇప్పటి వైసీపీ ప్రభుత్వానికి చుట్టుకుంది.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

టీడీపీ అధినేత చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా.. ప్రణాళిక లేకుండా సాగిన వైనం ఈ ఘటనతో కళ్లకు కట్టింది. టీడీపీ అధికారంలో ఉన్నపుడు నాటి సీఎం చంద్రబాబు నాయుడు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ రూ.1638కోట్లతో పురుషోత్తం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు సాగునీరు, విశాఖ, పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ వెంట ఉండే గ్రామాలకు తాగునీరు అందించాలని ప్లాన్ చేశారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించేందుకు ముందుకొచ్చింది. 2017ఆగస్టు 15న తొలిదశను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2017-18 ఖరీఫ్ సీజన్లో లో 1.95 టిఎంసీల నీటిని పంపింగ్ చేశారు. రెండో దశను చంద్రబాబు నాయుడు గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభించారు. పురుషోత్తపట్నం రెండు దశలకు ప్రభుత్వం 1638 కోట్లు ఖర్చు చేసింది.

అయితే బాబుగారు ఈ ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేసి ఇప్పుడు దాన్ని జగన్ పాలనలో అడ్డుకుంటూ చేస్తున్న కుట్రలపై వైసీపీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. తాజాగా ఈ పురుషోత్తమపట్నం ప్రాజెక్టుపై టిడిపీ నేత జమ్ముల చౌదరయ్య కోర్టును, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడం అందరినీ షాక్ గురిచేస్తోంది.

చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ తమ ఆదేశాలు వచ్చేంతవరకు పురుషోత్తపట్నం ఎత్తిపోత నుంచి నీటిని తరలించొద్దని ఉత్తర్వులు ఇచ్చింది. సాగునీటి కోసం కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. అప్పటి వరకు నీరు తరలించుకుండా స్టే విధించడంతో రైతులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీడీపీ కక్ష సాధింపు రాజకీయాల వల్ల రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. టీడీపీ తీరుపట్ల స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.

కనీస అనుమతులు లేకుండా చంద్రబాబు, దేవినేని ఉమలు కలిసి ఈ ప్రాజెక్టు కోసం 1638కోట్లు ఖర్చు చేశారని.. ఇప్పుడు అదే టీడీపీ అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా చంద్రబాబు పరిపాలన దక్షతకు ప్రాజెక్టు అతీగతీలేకుండా నిరుపయోగంగా మారిపోయింది.

సరిహద్దుల్లో మోదీ పర్యటన.. అసలేం జరుగుతోంది?


భారత్-చైనా సరిహద్దుల్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 15న రాత్రి 3గంటల సమయంలో చైనా సైన్యం దొంగదెబ్బ తీయడంతో భారత జవాన్లు 21మంది వీరమరణం పొందారు. ఆ దాడి నుంచి వెంటెనే తెరుచుకున్న భారత జవాన్లు చైనా సైన్యాన్ని సరిహద్దుల్లో నుంచి రెండుకిలో మీటర్ల మేర పరిగెత్తించినట్లు సమాచారం. ఈ సంఘటనలో చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీనిని చైనా అధికారికంగా ప్రకటించ లేదు. ఇటీవల చైనా-భారత్ చర్చల నేపథ్యంలో చైనాకు చెందిన ఓ కమాండర్ స్థాయి అధికారి చనిపోయినట్లు ప్రకటించింది. చైనా ప్రకటించిన తొలి మరణం ఇదే.

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?

ఈ సంఘటన జరిగి పక్షంరోజులు గడిచిన చైనా సైనికులు ఎంతమంది చనిపోయేరనేది లెక్కలు చెప్పడం లేదు. చైనా సైనికులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతోనే ప్రపంచం ముందు తన పరువుపోతుందని బయటికి లెక్కలు చెప్పడం లేదని తెలుస్తోంది. భారత సైన్యం చైనాను సమర్థవంతంగా తిప్పికొట్టడంపై చాలాదేశాలు భారత్ కు మద్దతు ఇస్తున్నారు. బహిరంగంగానే అమెరికా, జపాన్, రష్యా దేశాలు అవసరమైతే తమ మద్దతు ఉంటాయని ప్రకటిస్తున్నాయి. అయితే భారత్ వీలైనంత వరకు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తోంది. అప్పటి కూడా చైనా దారికి రాకపోతే ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈనేపథ్యంలో చైనా-భారత్ మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు సమస్య పరిష్కారం కాకుండానే అర్థాంతరంగా నిలిచిపోతున్నారు.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

ఈనేపథ్యంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లఢక్ లో ఆకస్మికంగా పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-చైనా ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మోదీ సైనికుల దుస్తుల్లో పర్యటించడం అందరినీ ఆకట్టుకుంటోంది. సీడీఎఫ్ చీఫ్ బీపీన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా టాప్ కమాండర్లతో సమావేశమై సరిహద్దుల్లో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. అలాగే గాల్వానా ఘర్షణలో గాయాలపాలైన జవాన్లను ప్రధాని పరామర్శించనున్నారని తెలుస్తోంది. సైనికులకు ఆత్మస్థైర్యం కల్పించడంతోపాటు.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకు మోదీ లడక్ లో పర్యటించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మోదీ లేహ్ లో పర్యటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోదీ సైనికుల దుస్తుల్లో పర్యటించడం ఆకట్టుకుంటోంది. కరోనా భయాన్నీ వీడి ఆయన సైనికులను కరచాలనం చేస్తూ వారిలో ఆత్మస్త్థైర్యాన్ని నింపుతున్నారు. సైనికులకు సెల్యూట్ చేస్తూ వారి భుజాలను తడుతూ అభినందించడం ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటోంది. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ భారత ప్రధాని లఢక్ లో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.

ఆర్జీవీ కొత్త హారర్ మూవీ ’12 ఓ క్లాక్’.. ఈ రోజే ట్రైలర్


కరోనా దెబ్బకు సినిమాలు, షూటింగ్‌లు ఆగిపోయి ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు దాదాపు మూడు నెలల నుంచి ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కరోనా భయంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఒకటి రెండు చిన్న చిత్రాలు మినహాయిస్తే.. పెద్ద ప్రాజెక్టుల విషయంలో అనిశ్చితి నెలకొంది. థియేటర్లు ఇప్పట్లో పున: ప్రారంభమయ్యే చాన్స్‌ లేకపోవడంతో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొంత మంది నిర్మాతలు ధైర్యం చేసి ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ముందుకొస్తున్నారు. టాలీవుడ్‌ మాత్రమే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీల పరిస్థితి ఇలానే ఉంది.

ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ నెగ్గాలో మోడీకి తెలుసు

ఇలాంటి టైమ్‌లో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. లాక్‌డౌన్‌లోనూ షూటింగ్స్‌ చేస్తూ అందరికీ సవాల్‌ విసురుతున్నాడు. ఇప్పటికే మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’, స్వీటీ అనే తెలుగమ్మాయితో ‘నగ్నం’ సినిమాలు చేసిన డిజిటల్‌ రిలీజ్‌ చేశాడు. ‘కరోనా’ పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. గాంధీని చంపిన గాడ్సే జీవిత చరిత్ర ఆధారంగా ‘ది మ్యాన్‌ హూ కిల్డ్‌ గాంధీ’, ‘మర్డర్ కుటుంబ కథా చిత్రమ్’, ‘పవర్ స్టార్’ సినిమాలను అనౌన్స్‌ చేశాడు. ఇప్పుడు మరో సినిమాతో ముందుకొస్తున్నాడు. తన తదుపరి చిత్రానికి ‘12 ఓ క్లాక్‌’ అనే టైటిల్‌ పెట్టినట్టు ఆర్జీవీ తెలిపాడు. మైండ్ ఈజ్‌ స్కేరియెస్ట్‌ అనేది ఉప శీర్షిక.

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. పరిస్థితి చేయిదాటుతోందా?

ఆర్జీవీనే డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రానికి టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ ఎమ్‌ ఎమ్‌ కీరవాణి స్వరాలు అందించాడు. ఈ మూవీ టీజర్ను ఈ రోజు (శుక్రవారం) రాత్రి ఏడు గంటలకు రిలీజ్‌ చేస్తున్నట్టు రాము ట్వీట్టర్లో వెల్లడించాడు. తన రీసెంట్‌ మూవీస్‌ మాదిరిగా ఇది షార్ట్‌ఫిల్మ్‌ కాదని, గంటా 45 నిమిషాల పూర్తి నిడివితో పూర్తి స్థాయి హారర్ చిత్రమని ప్రకటించారు. ప్రేక్షకులు సొంత ఊహలతో తమను తాము భయపెట్టుకునేప్పుడు హారర్ అనేది మరింత ప్రభావం చూపుతుందని ఆర్జీవీ అన్నారు. రాత్‌, భూత్‌ చిత్రాల్లో ఉపయోగించిన ఈ టెక్నిక్‌ను ఇప్పుడు ‘12 ఓ క్లాక్‌’లో వాడుతున్నట్టు తెలిపాడు.

అమ్మాయిలను బతకనివ్వరురా అంటున్న నందిత శ్వేత


‘రేప్‌ చేస్తారు… ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలను బతకనివ్వరురా?’ అని ప్రశ్నిస్తోంది యువ నటి నందితా శ్వేత. నిఖిల్‌ సిద్దార్థ్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైందామె. ఫస్ట్‌ మూవీతోనే ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు సొంతం చేసుకుంది . ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘కల్కీ’లో చిన్న పాత్రలు చేసిందీ బెంగళూరు చిన్నది.‘బ్లఫ్‌ మాస్టర్’, ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ రావడం లేదు. ఒకవైపు తమిళ్‌, కన్నడలో నటిస్తూనే తెలుగులో పేరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో రూటు మార్చి హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ మూవీకి ఓకే చెప్పింది.

ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్ర ‘ఐపీసీ 376’. రామ్‌కుమార్ సుబ్బరామన్‌ దర్శకత్వంలో ఎస్‌. ప్రభాకర్ నిర్మిస్తున్నారు. నందిత పవర్ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న మూవీ ట్రైలర్ను ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌. తమన్‌ రిలీజ్‌ చేశారు. సైన్స్‌ గొప్పతనాన్ని చెప్పే థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కింది. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య సంఘటనలు, అతీంద్రీయ శక్తులు, దెయ్యల ఉనికి గురించి, మహిళలపై జరిగే అత్యాచారల బ్యాక్‌ డ్రాప్‌లో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఖాకీ డ్రెస్‌లో విలన్లతో ఫైటింగ్‌ చేయడంతో పాటు చీరకట్టుకొని అచ్చతెలుగు ఆడపిల్లలా రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నందిత నటిస్తోంది. ట్రైలర్ చివర్లో రేప్‌ చేస్తారు… ప్రాణాలతో తగలబెడతారు.. అమ్మాయిలను బతకనివ్వరురా?’ అని నందిత చెప్పే డైలాగ్‌ ఆలోచింపజేసేలా ఉంది. కాగా, తెలుగుతో పాటు తమిళ్‌లో విడుదల కానున్న ఈ మూవీకి యాదవ్‌ రామలిక్కన్‌ సంగీతం అందిస్తున్నారు.

https://twitter.com/Nanditasweta/status/1278668199735595008

హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!


తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం పై కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గింది. కంటైన్‌ మెంట్ జోన్లలో మాత్రమే లాక్‌ డౌన్ అమల్లో ఉంటుందంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన అన్‌ లాక్-2 మార్గదర్శకాలకు అనుగుణంగా చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతటా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాస్తవానికి జూలై 2 కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌ లో లాక్‌ డౌన్ విధించే విషయమై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. హైదరాబాద్‌ లో లాక్‌ డౌన్ విధిస్తారనే ప్రచారం జరగడంతో నగరవాసులు అప్రమత్తమయ్యారు. చాలా మంది తమ సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందు జాగ్రత్తగా ఇంట్లోకి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం ఆలోచన మారడానికి చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా, విధించకపోయినా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.

కరోనా పై పోరాటం.. వ్యాక్సిన్ కోసం ఆరాటం!

2019 నుండి 2020 మే, జూన్ వరకు ‘కరోనా’ వైరస్‌ గూర్చి మాట్లాడిన ప్రజలు ఇప్పుడు ఆ మహమ్మారి నియంత్రణకు అవసరమైన వ్యాక్సిన్ గూర్చి మాట్లాడుకుంటున్నారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ఆగస్ట్‌ 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)  భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ రాసిన ఓ లేఖ తాజాగా వెలుగులోకి తెచ్చింది. ఆగస్టు 15 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో క్లినికల్‌ ట్రయల్స్‌ వేగవంతంగా జరిపేందుకు డీసీజీఐ అనుమతి సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, లక్ష్యాన్ని చేరుకోవడంలో క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం అత్యంత కీలకమని బలరాం భార్గవ లేఖలో పేర్కొన్నారు. జులై తొలి వారంలోనే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించేందుకు కావల్సిన అనుమతులన్నింటినీ వీలైనంత వేగంగా పొందాలని కోరారు. ‌ఈ మేరకు ఎంపిక చేసిన సంస్థలకు రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది.

దీనిపై స్పందించిన ఐసీఎంఆర్‌ లోని విశ్వసనీయ వర్గాలు లేఖను ధ్రువీకరించాయి. అయితే, అది కేవలం అంతర్గత సమాచారం కోసం మాత్రమే రాసిందని తెలిపాయి. భారత్‌ బయోటెక్‌ మాత్రం స్పందించడానికి నిరాకరించింది. దీంతో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురావడానికి తాజాగా పెట్టుకున్న గడువు ఇంకా కేవలం నెలన్నర రోజులే ఉండడం గమనార్హం. ఒకవేళ మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే.. ప్రపంచంలో కొవిడ్‌ పై సమర్థవంతంగా పనిచేసే తొలి వ్యాక్సిన్‌గా ‘కొవాగ్జిన్‌’ నిలవనుంది.

‘కొవాగ్జిన్‌’ టీకా మొదటి- రెండో దశ క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) ఇటీవలే అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను ఐసీఎంఆర్‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సార్స్‌- కోవ్‌- 2 వైరస్‌ స్ట్రెయిన్‌ ను ఎన్‌ఐవీ.. భారత్‌ బయోటెక్‌ కు బదిలీ చేసింది తదనంతరం హైదరాబాద్‌ సమీపంలోని భారత్‌ బయోటెక్‌ కు చెందిన బయో సేఫ్టీ లెవల్‌ – 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు.

ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. పరిస్థితి చేయిదాటుతోందా?


తెలంగాణలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. ఇక్కడ.. అక్కడ అనే తేడాలేకుండా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం ప్రస్తుతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవడంతో పలు వ్యాపార సంఘాలు స్వచ్చంధంగా లాక్డౌన్ పాటిస్తున్న పరిస్థితి నెలకొంది.

పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కార్యాలయాల్లో కరోనా తిష్టవేసి కూర్చుంది. దీంతో సిబ్బంది భయంభయంగానే పనులు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకడంతో ప్రజలెవరూ కార్యాలయానికి రావద్దని విజ్ఞప్తి చేసింది. ప్రజలెవరెవరికీ కార్యాలయంలోని అనుమతి లేదని స్పష్టం చేసింది. పనులపై ఎలాంటి ఫిర్యాదులున్నా ఆన్ లైన్లోనే సంప్రదించాలని కోరిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు కరోనా పాకింది. తాజాగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను కరోనా సెగ తాకింది. దీంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.

ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ నలుగురికి గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వీరితో కాంటాక్ట్ అయిన వారందరినీ హోంక్వారంటైన్ కు తరలించారు. ప్రగతి భవన్లో విధులు నిర్వహిస్తున్న వారందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రగతి భవన్‌కు వచ్చే సందర్శకులపై అధికారులు ఆంక్షలు పెడుతున్నారు.

బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

సీఎం కేసీఆర్ తన అధికారిక కార్యకలాపాలన్ని ప్రగతి భవన్ నుంచే చేస్తుంటారు. పరిపాలనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్న ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేస్తుంటారు. అలాంటి ప్రదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం యంత్రాంగం హడలిపోతుంది. ఎవరినీ ప్రగతి భవన్లోకి రాకుండా చర్యలు చేపడుతుంది. అత్యవసరం అయితే తప్ప ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. అయితే సీఎం కేసీఆర్ గత నాలుగురోజులుగా ప్రగతి భవన్లో ఉండటం లేదని తెలుస్తోంది. ఆయన గజ్వేల్లోని తన ఫౌంహౌజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రగతి భవన్లో వచ్చేలోపే పరిసరాలను శానిటైజ్ చేయనున్నారు. అయితే ప్రగతి భవన్లో కరోనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉంటే తెలంగాణలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,213 కేసులు నమోదవడం గమనార్హం. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. గురువారం నమోదైన 1,213 కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 998 కేసులుండగా 8మంది మృతిచెందారు. జీహెచ్ఎంసీ తర్వాత స్థానాల్లో మేడ్చెల్ 54, రంగారెడ్డిలో 48, ఖమ్మం 18, వరంగల్ రూరల్ 10, వరంగల్ అర్బన్ 9లు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కేసులు ఉండగా, 9,069మంది కరోనా నుంచి కోలుకున్నారు.