
కరోనా కాలం.. ఆపై లాక్ డౌన్.. పనులు లేవు.. సినిమా కోసం పస్తులు పడుకోవటం అలవాటే.. అలాంటి సినీ జనమే ఆకలి కారణంగా కన్నీళ్లు పెడుతున్నారు. కడుపు గోల గురించి ఆ గోలకి పుట్టిన మంట గురించి కృష్ణా నగర్ లో కథలు కథలుగా చెబుతున్నా వినేవాడు లేడు.. ఆదుకుని గుప్పెడు సాయం చేసేవాడు లేడు.. ఏమిటి ఈ కలికాలం అని బాధ పడటం తప్ప చేయడానికి ఏమి లేదా.. హీరోలు కొంతమందికి సీసీసీ అంటూ సాయం అందించారు. కానీ, సాయం అందినవారి గురించి.. రాబోయే మూడు నెలలు గురించి ఏమిటి పరిస్థితి. సినిమాల షూటింగ్ లు లేవు.. సీరియల్ షూటింగ్ లు కొన్ని ఉన్నా.. పేమెంట్స్ దారుణం.. అసలు జబర్దస్త్ లాంటి సక్సెస్ ఫుల్ షోకి పని చేస్తున్న వారికే ఫుల్ పేమెంట్స్ అందట్లేదని టాక్ ఉంది.
పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?
ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలకు పని చేసినా డబ్బులు వస్తాయా… వచ్చే అవకాశాలు లేవు. రోజువారీ వేతనాలతో బ్రతికే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడటం అనేది కామన్ అని సరిపెట్టుకోవడం తప్ప ఏమి చేయగలం. వీరికి సహాయం చేయడం కోసం సినీ పెద్దలు కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో పెద్ద ఎత్తున ఫండ్ సేకరించి రెండు సార్లు సరుకులు అందించారు. మరి రాబోయే మూడు నెలలకు మరో రెండు సార్లు అన్నా సీసీసీ తరుపున సరుకులు అందివ్వాలని సినీ కార్మికులు స్టార్ హీరోలను వేడుకుంటున్నారు. మరి స్టార్ హీరోలు కరుణిస్తారా…? ఎంత లేదన్నా మళ్ళీ తలా పది లక్షలు ఇవ్వాలి.. ఇస్తారా.. !
చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?
నిజానికి అప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ముందుగా ఇనిషియేటివ్ తీసుకోవడంతోనే మిగతా హీరోలు కూడా ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా మెగాస్టార్ ముందుకు రావాలి.. రాబోయే మూడు నెలలు కోసం కూడా కార్మికులకు సరుకులు అందించాలి. పోయినసారి మెగాస్టార్ చిరంజీవి, నాగర్జున చెరొక కోటి రూపాయలు విరాళం ఇవ్వగా.. రామ్ చరణ్ రూ.30 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, బాలయ్య రూ.25 లక్షలు, నాగ చైతన్య రూ.25 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు, వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, శర్వానంద్ రూ.15 లక్షలు సీసీసీ కోసం విరాళంగా ఇచ్చారు. అప్పుడు ఇవ్వని హీరోలు హీరోయిన్ లు, నిర్మాతలు.. రోజుకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ లు ఇంకా చాలామందే ఉన్నారు. వారందరూ పెద్ద మనసుతో ఆదుకుంటే.. సినీ కార్మికులకు మరో రెండుసార్లు నిత్యావసరాలు తీర్చడం పెద్ద విషయమేమి కాదు. మరి ఆదుకుంటారా.. హీరోలూ మరోసారి హీరోయిజమ్ చూపించండి.