
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో రికార్డు సృష్టించాడు. అది సినిమాలో కాదు సోషల్ మీడియాలో. అది మామూలు రికార్డు కాదు. తన నటతోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రిన్స్.. సోషల్ మీడియాలోనూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్విట్టర్లో పది మిలియన్ల (కోటి మంది) ఫాలోవర్లతో సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌతిండియా ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి యాక్టర్గా నిలిచాడు. సినిమాలు, కుటుంబమే ప్రపంచంగా బతికే సూపర్ స్టార్ కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమాలు, ఫ్యామిలీ విశేషాలతో పాటు సామాజిక అంశాలపై కూడా ట్విట్టర్లో స్పందిస్తున్నాడు. దాంతో, సినీ ప్రియులే కాకుండా కామన్ నెటిజన్స్ కూడా మహేశ్‌కు పాలోవర్స్‌గా మారుతున్నారు. ఆ సంఖ్య ఇంతితై అన్నట్టు కోటి దాటింది.
బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!
ట్విట్టర్ ఫాలోవర్స్ లో సౌత్‌లో మరే హీరో కూడా మహేశ్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. కమల్ హాసన్ 6.1 మిలియన్లతో రెండో ప్లేస్‌లో ఉండగా.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ 5.7 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచారు. టాలీవుడ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ 4.7 మిలియన్లు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 4.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో టాప్-5లో ఉన్నారు. మహేశ్ ఫాలోవర్ల సంఖ్య కోటి దాటిన సందర్భంగా సోషల్ మీడియాలో 10 మిలియన్ ట్వీపుల్ ఫర్ ఎస్‌ఎస్‌ఎమ్‌బీ, 10 మహేషియన్స్, 1 క్రోర్ మహేషియన్స్ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరూతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న మహేశ్… ఫాలోయింగ్‌లోనూ సౌత్‌లో తనకెవరూ సరిలేరు అనిపించుకున్నాడు. అతనిప్పుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా ఎంపికైంది.
First & Only South Indian actor to have 1 Crore followers in Twitter 💥@urstrulyMahesh 👑 #MaheshBabu #SarkaruVaariPaata #10MilliontweepleForSSMB #10MillionMaheshians #1CroreMaheshians pic.twitter.com/s0PoDm6ZL6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) July 2, 2020