
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచి సింగిల్ గా అధికారంలోకి వచ్చింది. దీంతో మోడీ సర్కార్ రెండోసారి ఢిల్లీలో కొలువుదీరింది. ఇక తెలంగాణలో అంతగా బలంగాలేని బీజేపీ కిందటి ఎన్నికల్లో ఏకంగా నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుపొంది సత్తాచాటింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తెలంగాణలో పార్టీ బలపడే అవకాశాలు మొండుగా ఉండటంతో ఆ దిశతో బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది.
1962 దొంగ దెబ్బ మళ్ళీ తగలనుందా?
కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను ఎన్నుకున్నారు. ఆయన పదవీ చేపట్టి దాదాపు వంద రోజులు పూర్తి కావస్తోంది. పార్టీలో తన కంటూ ఓ ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర రాజకీయాల్లోకి దూసుకెళుతారని భావించారు. అయితే ఇప్పటివరకు ఆయన బీజేపీలో కుదురుకునేందుకు అవకాశం లేకపోయింది. దీంతో ఆయన తనకంటూ ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకోలేకపోయారు. తాజాగా తనకంటూ ఓ టీమ్ ఏర్పాటు చేసుకునేలా పార్టీలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం.
ఈమేరకు రాష్ట్ర కమిటీల్లో తన మార్క్ చూపించాలని అనుకుంటున్నారట. అందుకనుగుణంగా పార్టీలోని కమిటీలను ప్రక్షాళన చేసేందుకు బండి సంజయ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈపాటికే పార్టీ పెద్దలతోపాటు సంఘ్ పరివారంతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కోర్ కమిటితోపాటు పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న యువ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, మైనార్టీ మోర్చాల నియమాకాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారట. పాతనేతలతోపాటు పార్టీలోకి కొత్తగా వచ్చినవారికి సముచిత స్థానం ఇవ్వనున్నారట.
నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ వాదనలకు ‘సుప్రీం’ అభ్యతరం..!
ఈ నియమకాల్లో తన మార్క్ ఉండేలా చూసుకొని తనకంటూ ఓ టీమ్ తో ముందుకెళ్లాలని బండి సంజయ్ భావిస్తున్నారని టాక్ విన్పిస్తుంది. వీలైనంత త్వరగా కమిటీ నియమకాలు చేపట్టి తెలంగాణలో బీజేపీని మరింత పటిష్టం చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు. అయితే తెలంగాణలో కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా పార్టీ కమిటీల ప్రక్షాళన ఇప్పట్లో చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కమలం పార్టీలో బండి సంజయ్ ప్రత్యేక టీం ఎప్పటిలోగా రెడీ అవుతుందోననే ఆసక్తి నెలకొంది.