
ఒక సినిమాకి డైరెక్టర్ తరువాత అతి ముఖ్యమైన వ్యక్తి రైటరే. కానీ రైటర్ పాత్రకు సంబంధించి ఎప్పుడూ తగినంత ప్రాధాన్యత లేదన్నదే ప్రధాన విమర్శ. ఒక విధంగా ఈ విమర్శ నిజం కాబోలు.. అందుకే రైటరే తన పాత్ర పరిధిని పెంచుకుంటున్నాడు. నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా పిలవబడుతున్న వాళ్ళల్లో ఎక్కువగా రైటర్ నుండి డైరెక్టర్ అయినవాళ్లే. అలాంటి వాళ్లల్లో ప్రముఖుడు కూల్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. రైటర్ గా ఉన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురైన శివ.. కసితోనే డైరెక్టర్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ సినిమా చేసి పెట్టమని ఆడిగించుకునే స్థాయికి వెళ్ళాడు కొరటాల. ఇప్పుడు కొరటాల శివ మరో అవతారం కూడా ఎత్తబోతున్నాడు. నిర్మాతగా తన అభిరుచికి తగ్గ కథాబలం ఉన్న సినిమాలను ఓటీటీ కోసం చేయటానికి సన్నద్ధం అవుతున్నాడు.
విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు
ఇక ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన శైలిలోనే ఈ సినిమా సాగనుంది. రాష్ట్రంలోని దేవాలయాలతో పాటు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ గా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సమాజంలోని అన్యాయాలను అరికట్టే విధానం పై ఓ కొత్త థాట్ తో కథలు రాసే శివ.. ఆచార్య సినిమా కోసం కూడా అలాంటి కథనే తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో చరణ్ రోల్, ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట.
యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్
కరోనా దెబ్బకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనబడటం లేదు. అయితే ఆగష్టు నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై ఐదు రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అప్పుడు కూడా కేసులు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం షూట్ ప్లాన్ ను విరమించుకుంటారు. చరణ్ నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.