ఆధునిక భారతదేశ పితామహుడు, ఆర్కిటెక్షర్ ఆఫ్ ఇండియా,నవభారత రాజ్యాంగ నిర్మాత , డా॥ బాబా సాహేబ్ అంబేడ్కర్ ఇంటి ( రాజగృహం) పై గుర్తు తెలియని దుండగులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. ఇలా దాడి చేయడం ముమ్మాటికీ మనువాద ముస్కరుల ఉన్మాదానికి పరాకాష్ట అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దుశ్చర్యలో భాగంగా ఇంట్లో ఉన్న మొక్కల కుండీలను ధ్వంసం చేశారు. ఇంటి వద్ద ఉన్న సిసి టివి లను కూడా ధ్వంసం చేశారు. అద్దాలను కూడా పగుల గొట్టారు. రాజ్ గ్రుహ్ డా. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసం. ఈ ఇంటిని బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాల కోసం నిర్మించారు. ప్రపంచం నలుమూలల నుండి అంబేద్కర్ అనుచరులు రోజూ ఇక్కడకు వస్తారు. ఇది అంత ముఖ్యమైన ప్రదేశం. అంబేద్కర్ అనుచరులకు ఇది అత్యంత గౌరవనీయ భవనం . ఈ ఘటనకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పాలపడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి అంబేద్కర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు దుండగుల కోసం వేట మొదలు పెట్టారు.
అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని, ఈ దేశాన్ని ఎలా రక్షించాలో మార్గం చూపిన మహాను బావుని ఇంటి మీద దాడి జరిగితే ఇది దేశం మీద దాడిగా భావించి ఆధుర్మార్గులను చట్ట పరంగా శిక్షించాలాని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ambedkars home was attacked by unidentified thugs
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com