Home Blog Page 8416

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత..


‘బజరంగీ భాయిజాన్‌’, ‘లింగా’, ‘పవర్’ వంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, కన్నడ నటుడు రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు కరోనా సోకిందా? ఆయన ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందా? అంటే కన్నడ వర్గాలు అవుననే అంటున్నాయి. అనారోగ్యం కారణంగా వెంకటేశ్‌లో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే, శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో ప్రచారం సాగుతోంది. ఎందుకంటే ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన వెంకటేశ్ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

ఈ క్రమంలో దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతతో కలిసి ఈ మధ్యే కర్నాటక సీఎం సీఎం యాడ్యురప్పను కలిశారు. అయితే, తనకు కరోనా సోకిందని సుమలత రెండు రోజుల కింద స్వయంగా ప్రకటించారు. దాంతో సుమలతను కలిసినందు వల్ల రాక్‌లైన్‌కు కూడా కరోనా సోకిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయాన్ని డాక్టర్లు ఇప్పటిదాకా వెల్లడించలేదు. రాక్‌లైన్ ప్రస్తుతం కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ హీరోగా ‘రాజవీర మడకారి నాయక( అనే పిరియాడికల్‌ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతగా వెంకటేశ్‌కు మంచి పేరుంది. తెలుగులో సూపర్ హిట్‌ అయిన పలు చిత్రాలను శాండిల్‌వుడ్‌లో రీమేక్‌ చేసి సక్సెస్‌ అయ్యారు. పలు చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు. తెలుగులో చివరగా ‘ఆటగదరా శివ’ అనే మూవీని నిర్మించారు.

పోకిరి తరువాత మహేష్ మళ్ళీ ఇప్పుడే.. !


మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది పోకిరి సినిమానే. దానిలో మహేష్ మొదటిసారి కొత్తగా కనిపించాడు. అప్పటివరకు ఉన్న పొట్టి జట్టును వదిలేసి.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా ఆ సినిమాలో మహేష్ గెటపే. మళ్ళీ ఇన్నేళ్లు తరువాత మహేష్ తన లుక్ మారుస్తున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో పూర్తి కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రింగుల జుట్టుతో కాలేజీకి వెళ్లే స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్ కొత్త కొత్తగా కనిపించి ఫ్యాన్స్ కు కొత్తదనం అద్దబోతున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ తన ఎకౌంట్స్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను చూస్తేనే అర్ధమవుతుంది మహేష్ కొత్త లుక్ ఎలా ఉండబోతోందనేది.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

పైగా ఈ సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి నుండే సినిమా పై ఆరా తీస్తున్నారు. సినిమా కథ ఏమిటి ? ఏ అంశం పై సినిమా ఉండబోతుంది ? టైటిల్ ను చూస్తే.. సినిమాలో రాజకీయ అంశాలు ఉంటాయోమోనని అనుమానం కలుగుతోంది. మరి ప్రధానంగా సినిమా ఎలా సాగబోతుంది ? ఇలా ఫ్యాన్స్ డైరెక్ట్ గా మహేష్ కే మెసేజ్ లు పెడుతున్నారు. అయితే సినిమా మాత్రం రాజకీయ నేపథ్యంతోనే సాగుతుందని.. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

అలాగే భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని.. వేలాది కోట్లు ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అన్నదే మెయిన్ పాయింట్ అని.. ఈ క్రమంలో మహేష్ చేసే ప్రయత్నాలు, మహేష్ వేసే ప్లాన్స్ ఇంట్రస్ట్ గా ఉంటాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. కరోనా లేకపోయి ఉండి ఉంటే.. ఈ పాటికే షూటింగ్ సగం పూర్తయిపోయేది.

ఈనాడు, ఆంధ్రజ్యోతిని వదలని జగన్!


ఏపీ సీఎం జగన్ సరిగ్గా ఏడాది పాలన ముగిశాక తన ప్రతీకారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన ప్రత్యర్థులైన టీడీపీ నేతలు ఇద్దరిని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు చంద్రబాబు కాళ్ల కిందకు నీళ్లు తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నేతల తప్పులే వారికి శిక్ష పడేలా చేస్తుండడం కూడా జగన్ పనిని సులువు చేస్తోంది.

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబుతో కలిసి తనను ముప్పుతిప్పలు పెట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఏపీ సీఎం జగన్ వదిలేలా కనిపించడం లేదు. కోడికత్తి నుంచి మొదలుపెడితే వైఎస్ వివేకా హత్యవరకు జగన్ ను ఆ రెండు పత్రికలు ఎంత అభాసుపాలు చేయాలో అంతా చేశాయి. ఎన్నోసార్లు జగన్ జైలు జీవితాన్ని దెప్పిపొడిచాయి. ఆయనపై దారుణంగా దుష్ప్రచారం చేశాయి. నాడు అధికారంలోని లేని జగన్ ఆ రెండు పత్రికలను కాచుకోలేదు.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

చంద్రబాబుతోపాటు ఆయనకు సపోర్టు చేసే ఆ రెండు పత్రికలకు జగన్ ప్రభుత్వం ఇటీవలే ఓసారి నోటీసులు పంపి వార్ మొదలుపెట్టాడు.. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని.. పౌరసరఫరాల శాఖ బియ్యం పంపిణీ కోసం అవసరమయ్యే సంచులను జగన్ కంపెనీ నుంచి ఎలాంటి టెండర్ లేకుండా కొనుగోలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని ఆ రెండు పత్రికలు ప్రచురించడమే జగన్ ఆగ్రహానికి కారణమైందట.. అందులో జగన్ పవర్ ప్రాజెక్టు కూడా ఉండడంతో ఆయనపై వ్యతిరేకంగా కథనాలను ఆ పత్రికలు వండివర్చాయి. ప్రభుత్వ వివరణను చిన్నగా మూలకు తొక్కేశాయి. చంద్రబాబుతోపాటు ఆ రెండు పత్రికలకు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా భేషరతుగా క్షమాపణ చెప్పాలని..లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తామని.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేది ప్రభుత్వం తరుపున స్పష్టం చేశారు.

ఇప్పటికే ఓసారి ఈనాడు, ఆంధ్రజ్యోతిలను టార్గెట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా మరోసారి నోటీసులు పంపి వాటి వెన్నులో వణుకు పుట్టించింది. 108 అంబులెన్స్ ల కొనుగోలులో కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేసినందుకు రెండు పత్రికలతోపాటు టీడీపీ నేతకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు పంపింది.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభితోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ప్రభుత్వం తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరెడ్డి లీగల్ నోటీసులు పంపారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా కథనాలు రాసినందుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు ప్రభుత్వం హెచ్చరించింది. అంబులెన్స్ ల కొనుగోలులో పూర్తి పారదర్శకంగా టెండర్ల ద్వారానే కొనుగోలు చేశామని.. దీని వల్ల ప్రభుత్వానికి 399 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని నోటీసుల్లో పేర్కొంది. ప్రభుత్వంపై బురద జల్లినందుకు క్షమాపణ చెప్పాలని లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇలా రెండోసారి జగన్ సర్కార్ ఆ రెండు పత్రికలపై నజర్ పెట్టింది. 108 అంబులెన్స్ లో కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు నోటీసులు పంపింది. చూస్తుంటే టీడీపీని, ఆ రెండు పత్రికలను జగన్ సర్కార్ అంత తేలికగా వదిలిపెట్టే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ మహిళ చేసిన పనికి ఐపీఎస్ ఫిదా


మానవుడు చేసే పాపాల వల్లే కరోనా లాంటి కొత్త రోగాలు పుట్టికొస్తున్నాయి. మానవత్వం మంటగలిచేలా జంతువులను క్రూరంగా హింసించడం, వాటి బాధను చూసి ఆనంద పడటం, వాటిని పిక్కుతినడం, ప్రకృతి సంపదను విచ్చలవిడిగా సొంతానికి వాడుకోవడం వల్లే మానవళి నాశనం దిశగా వెళుతుందనే వాదనలు ఉన్నాయి. తోటివారికి సాయం చేసే గుణమే మానవుల్లో కరువైపోయింది. అమ్మనాన్న, అక్కతమ్ముడు లాంటి బంధుత్వాలు కూడా కమర్షియల్ గా మారిపోతుండటం నిత్యం ఏదోఒక చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలోనూ మానవత్వం బతికే ఉందని ఓ మహిళ నిరూపించింది.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

కేరళీయులు మరోసారి వారి మంచి గుణాన్ని ప్రపంచానికి చాటారు. కేరళలో ఓ అంధుడు బస్సు కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. అయితే బస్సు వచ్చి వెళుతున్న విషయాన్ని అతడు గమనించలేదు. వెంటనే అక్కడే ఉన్న ఓ మహిళ బస్సు వెళుతుండటాన్ని గమనించి పరుగెత్తుకుంటూ వెళ్లి బస్సును ఆపేసింది. కండక్టర్ ను బస్సును ఆపాలని కోరి తిరిగి ఆ వృద్ధుడి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని బస్సులోకి ఎక్కించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

ఇదంతా రోడ్డుపై ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ వీడియోను విజ‌య్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ మహిళ చూపిన మానవత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ.. ప్రపంచంలో ఇంకా మానవత్వం బతికే ఉందని నిరూపించిందని ట్వీట్ చేశారు. ఒక్కరోజులోనే ఈ వీడియోకు 46.4వేల లైక్స్, 9వేల రీట్వీట్స్ రావడం గమనార్హం. పక్కనున్నోడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే సెల్ఫీ దిగి వీడియోలు పోస్టు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారని సదరు మహిళ నిరూపించి ఇంకా మానవత్వం బతికే ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహిళను ప్రశంసిస్తూ నెటిజన్లు ట్వీట్ చేసున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

https://twitter.com/vijaypnpa_ips/status/1280815032490549248

మమ్మల్ని కలిసేందుకు ఎవరూ రావద్దు: స్పీకర్, మంత్రి


రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో శాసనసభ స్పీకర్, మరో మంత్రి తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీరు తమ చాంబర్ లను మూసి వేసి 15 రోజుల పాటు తమను కలిసేందుకు ఎవరూ రావద్దని నోటీస్ బోర్డు పెట్టారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మంత్రులు సైతం కోవిడ్ భారిన పడ్డారు. ఏపీలో ప్రస్తుతం మంత్రులు ఎవరికీ కోవిడ్ సోకపోయినా ఎమ్మెల్యేలు ఒకరిద్దరు వైరస్ భారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా స్పీకర్, మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆర్ అండ్ బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ లు ఈ రోజు నుంచి తమ చాంబర్ లు మూసివేసి బయటి వారిని కలవకుండా ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని మరి కొందరు మంత్రులు ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎపి అసెంబ్లీలో కొద్ది రోజుల కిందట సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది.సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఛాంబర్ లో పనిచేసే అటెండర్ కు కరోనా అని తేలింది. సచివాలయంలో మరికొన్ని శాఖల సిబ్బందికి వైరస్ సోకింది. వీరంతా ఇప్పుడు కోలుకున్నారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!

మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకూ 23,814 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే 21,071 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,500 కొత్త కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఇటు ప్రజాప్రతినిధులలో, అటు అధికారులలో కొత్త వ్యక్తులను కలవడానికి ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు మూసివేత కొనసాగుతుంది. ఈ నెల 13 నుంచి ప్రాధమిక స్థాయి పాఠశాలలు వారానికి ఒక రోజు, ప్రాధమికొన్నత పాఠశాలలు వారానికి రెండు రోజులు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఎంత వరకూ అమలు జరుగుతుందనేది ప్రశ్నఅర్ధకంగా మారింది.

పవన్ పై అసాధారణ అభిమానమే సమస్యా ?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఓ పవర్ ఉంది. లక్షల మందికి ఎక్కడా లేని ఉత్తేజం తీసుకువచ్చే ఎనర్జీ ఉంది. సినిమా స్టార్ కి అభిమానులు ఉండటం సర్వసాధారణం.. కానీ భక్తులు ఉండటమే బహు అరుదు. ఆ ఘనత తెలుగునాట ఇద్దరికే సాధ్యం అయింది. మొదట సీనియర్ ఎన్టీఆర్ కి.. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కే. కానీ ఇక్కడే ఓ సమస్య కూడా ఉంది. అలాంటి అసాధారణ అభిమానం ఉన్న హీరోలు చిన్న చిన్న కథలు చేస్తే ప్రజలు జీర్ణించుకోలేరు. వీరు వెండితెరపై అద్భుతాలు చేయాలి. అద్భుతమైన హీరోయిజమ్ చూపించాలి. అలా చూపించకపోతే ఆ సినిమాని జనం చూడలేరు. ఎన్టీఆర్ ఖాతాలో మిగిలిపోయిన కొన్ని ప్లాప్ సినిమాలకు కూడా రీజన్ అదే. పవన్ కెరీర్ లో ప్లాప్ ల పరంపరకు కూడా కారణం అదే.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

ఇప్పుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచానాలు పెరిగిపోయాయి. కానీ పింక్ సబ్జెక్టు చిన్న కథ. పైగా పక్కా కమర్షియల్ అంశాలు లేని ఓ ఎమోషనల్ స్మాల్ స్టోరీ. మరి అలాంటి సినిమా పై ఫ్యాన్స్ అంచనాలు మరి ఎక్కువ అయితే.. సినిమాలో పవన్ నుండి అద్భుతాలు జరగవు కాబట్టి.. ఫ్యాన్స్ నిరాశ పడటం ఖాయం. నిజానికి అజ్ఞాతవాసికి కూడా ఇలాగే జరిగిందనేది వాస్తవం.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

ఒక్కసారి పవన్ రేంజ్ సినిమా కాదు అని పేరు బయటకు వస్తే.. ఇక పవన్ అభిమానులు ఆ సినిమాని పట్టించుకోరు. ‘వకీల్ సాబ్’ అలాంటి టాక్ వచ్చే అవకాశమే ఎక్కువ. ఇదే భయం నిర్మాత దిల్ రాజుకు ఉంది. అందుకే పవన్ పాత్రను మార్పులు చేయించాడు. కానీ కథ చిన్నది అయినప్పుడు పాత్ర పరిధిని పెంచింతే అసలుకే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ పిరియాడిక్ మూవీని చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం పవన్ రేంజ్ సినిమానే.

జగన్ సర్కార్ పై అంబులెన్స్ మరక ఇదేనా..?

Jagan
జగన్ సర్కార్ పై 108 అంబులెన్స్ మరక అంటినట్లుగాతెలుస్తోంది. అంబులెన్స్ నిర్వహిస్తున్న బీవీజీ ఇండియా లిమిటెడ్ ని తప్పించి.. అరబిందో ఫౌండేషన్‌ కు అప్పగించింది. బీవీజీ సంస్థ ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు.. నెలకు రూ. లక్షా 31వేలు ఇచ్చింది. అరబిందో ఫౌండేషన్‌ కు ఒక్కో అంబులెన్స్‌ కు రూ. లక్షా 78వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. అంటే.. ఒక్కో అంబులెన్స్‌కు నెలకు రూ. 47వేలు ఎక్కువ ఇవ్వడం మొదలైయింది. ఇలా 300 అంబులెన్స్‌ లు ఉన్నాయి. అంటే.. ఏడాదికి రూ. 17 కోట్లు ఎక్కువ. కొత్తగా మరో 412 అంబులెన్స్‌ లను కొనుగోలు చేసింది. వాటి నిర్వహణకు మరింత ఎక్కువగా రూ. 2 లక్షల 21వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అంటే.. ఇక్కడ ఏటా మరో రూ. 21 కోట్లు ఎక్కువ. పాత, కొత్త వాహనాలకు కలిపి ఏడాదికి రూ. 38 కోట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఇక ఇతరత్రా మెయింటెనెన్స్ లు కలిపి మొత్తం రూ. 300కోట్ల కంటే ఎక్కువే కుంభకోణమని తెదేపా ఆరోపణలు చేస్తోంది.

అరబిందో కష్టాలు ప్రభుత్వానివా..?: కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ఏదైనా పెరగబోయే ఖర్చులు.. మిగలబోయే సంపదకు బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకోదు. కానీ ఇక్కడ నిర్వహణ ఖర్చులు పెరగబోతున్నాయని అందుకే.. రేట్లు పెంచామని చెబుతున్నారు. అంబులెన్స్‌ లో పని చేసే డ్రైవర్లు, ఇతర మెడికల్ టెక్నిషియన్లకు జీతాలు పెంచుతారని.. ఏడేళ్లలో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని… నిర్వహణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ రేటు కేటాయించాల్సి వచ్చిందని వాదిస్తోంది. పాత వాహనాలకు ఎక్కువ రిపేర్లు వస్తాయి కాబట్టి కొత్త, పాత వాహనాలకు వేర్వేరు రేట్లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం తరపున ఆరోగ్య శాఖ వివరణ ఇస్తుంది. ఇక్కడ కొత్త వాహనాలకే ఎక్కువ నిర్వహణ వ్యయం చెల్లిస్తూండటం విశేషం.

పదో తేదీ.. పది గంటలకు… ప్రభాస్‌ ఫ్యాన్స్‌ రెడీనా..


బాహుబలి సిరీస్‌తో గ్లోబల్‌ స్టార్గా ఎదిగిన రెబల్‌ స్టార్ ప్రభాస్‌ చివరి చిత్రం ‘సాహో’ రిలీజై దాదాపు ఏడాది కావస్తోంది. పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ మూవీ అనుకున్న విజయం సాధించలేదు. అప్పటి నుంచి ప్రభాస్‌ కొత్త సినిమాపై ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. లాక్‌డన్‌కు ముందు వరకు జార్జియాలో షూటింగ్‌ చేశారు. దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ చిత్రీకరణ పూర్తయింది. ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పీరియాడిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. తొలుత ‘జాన్‌’ అనుకున్నా.. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తోందని సమాచారం. ‘సాహో’ రిలీజ్‌ కాకముందే ఈ మూవీని అనౌన్స్‌ చేశాడు ప్రభాస్‌. కానీ, ఇప్పటిదాకా టైటిల్‌ గానీ..పోస్టర్గానీ బయటకు రాలేదు. దీనిపై రెబల్‌ స్టార్ ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో అంసతృప్తిగా ఉన్నారు.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

ప్రభాస్‌, కృష్ణం రాజు పుట్టిన రోజులు, వివిధ పండగల టైమ్‌లో అయినా ఏదైనా అనౌన్స్‌మెంట్‌ వస్తుందని ఆశించినా రాలేదు. అయితే, సడెన్‌గా ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర బృందం. ఈ నెల పదో తేదీన ప్రభాస్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. పదో తేదీ ఉదయం పది గంటలకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఈ విషయాన్ని ప్రభాస్‌ కూడా ఫేస్‌బుక్‌, ట్విట్టర్లో షేర్ చేశాడు. మరి, తన 20వ మూవీలో ప్రభాస్‌ ఏ లుక్‌లో అలరిస్తాడో, మూవీ టైటిల్‌ ఏంటో చూడాలాంటే శుక్రవారం పది గంటల వరకూ వేచి చూడాలి.

తెలంగాణ సీఎం రేసులో కొత్త పేరు.. ఎవరంటే?


14ఏళ్ల టీఆర్ఎస్ పోరాటం ఫలితం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ ముందుండి పోరాటాన్ని సాగించారు. చావు అంచులదాకా వెళ్లి తెలంగాణను సాధించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను ప్రగతిలో పథంలోకి నడిపించారు. ఆయన పాలన ఐదేళ్ల పూర్తికాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ మెజార్టీ సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ ముందుచూపుతోనే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

సీఎం కేసీఆర్ వయస్సు పైబడిన ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేటీఆర్ ను ప్రకటించి ఆయన విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం జరిగింది. దీంతోపాటు కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లు గతంలో అనేకసార్లు మీడియా ముఖంగా చెప్పారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను కేసీఆర్ నియమించారని అప్పట్లో ప్రచారం జరిగింది. కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్న నేతలకే కేసీఆర్ మంత్రివర్గంలో చోటుదక్కడంతో కేటీఆరే కాబోయే సీఎం అంటూ ప్రచారం జరిగింది.

టీఆర్ఎస్ ఇలాంటి ప్రచారం జోరుగా జరుగుతుండటంతో సీఎం కేసీఆర్ కూడా దీనిపై స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. మీకు బాగోలేకపోతే చెప్పండి.. దిగుతానని కామెంట్ చేశారు. తాను బేషుగ్గానే ఉన్నానని సీఎంగా తానే కొనసాగుతానని తనదైన శైలిలో ఆ ప్రచారానికి చెక్ పెట్టారు. దీంతో కొంతకాలంగా సీఎం రేసులో కేటీఆర్ పేరు విన్పించకుండా పోయింది. తాజాగా సీఎం రేసులో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎక్కడ అంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్లో కాకుండా ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ లో ఉండటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎంపీ అరవింద్ ‘పట్టాభిషేకం సంతో ష్ కా కేటీఆర్ కా? అంటూ సోషల్ మీడియాలో పోస్టుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఒక్కసారిగా సంతోష్ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో సంతోష్ కుమార్ గురించి తెలుసుకునేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కు సంతోష్ వరసకు కొడుకు అవుతాడని సమాచారం. కేసీఆర్ పీఏగా ప్రస్థానం ప్రారంభించిన సంతోష్ అనతీకాలంలోనే పార్టీలో ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కెసిఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ సంతోష్ ఉంటారని వినికిడి. సీఎం ఢిల్లీకి వెళ్లినా వెంట సంతోష్ ఉండాల్సిందేనని అంటుంటారు. టీఆర్ఎస్ నెంబర్ 2గా కొనసాగుతున్న కేటీఆర్ ను పక్కన పెట్టి సంతోష్ కు సీఎం పదవీ కట్టబెడుతారా? అనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఎంపీ అరవింద్ రేపినకాక టీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో మరోసారి సీఎం రేసు మొదలవడం ఆసక్తిని రేపుతుంది.

అమ్మ ఆర్జీవీ .. అంకితను అప్సర చేసేశావుగా..


కంటెంట్‌ లేని చిత్రాలు తీసి, ట్రైలర్తో హీట్‌ పెంచి అసలు సినిమాలతో ఉసూరుమనిపించడంలో సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ ముందుంటాడు. తాను పరిచయం చేసే నటీనటుల విషయంలోనూ వర్మ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. ఒక్కోసారి పిచ్చోళ్లను చేస్తుంటాడు. తన తాజా చిత్రం ‘థ్రిల్లర్’ సినిమాతో అప్సర రాణి అనే ఏంజల్‌ని పరిచయం చేస్తున్నానని వర్మ ఈ మధ్యే సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. చూడ్డానికి నిజంగా అప్సరసలా ఉన్న ఆ అమ్మాయి హాట్‌ హాట్‌ ఫొటోలనూ వదిలాడు. ఆమె బుగ్గపై ముద్దు పెడుతున్న ఫొటో, సెట్‌లో ఆమెతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోనూ కూడా బయటపెట్టాడు. ఆమె ఒడిశాలో పుట్టి, డెహ్రాడూన్‌లో పెరిగి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటుందని. ఆమె మంచి నటి, అద్భుతమైన డ్యాన్సర్ అని చెప్పాడు. ‘అప్సర రాణిని కలవడానికి ముందు నాకు ఒడిశా గురించి ఏమీ తెలియదని, ఆ రాష్ట్రం అంటే ఇప్పటి వరకు తెలిసింది 1999లో వచ్చిన హరికేన్ మాత్రమే. కానీ, అప్సరని కలిసిన తర్వాత ఒడిశా అన్ని రకాల హరికేన్‌లను సృష్టంచిందని తెలుసుకున్నా. ఒడిశాలో ఇంత అందం దాగి ఉందని నాకిప్పుడే… అంటే అప్సరను కలిసిన తర్వాత తెలిసింది. ఈ బ్యూటీనే ఇప్పుడు ఒడిశాకు మరింత బలం’ తన దైన శైలిలో యువ నటిపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు చేశాడు.

ట్రెడిషినల్ బ్యూటీ హాట్ హాట్ సీన్స్ కి సై ?

అప్సరను తానే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నానని చెప్పాడు. కానీ, అది అబద్దం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘4 లెటర్స్‌’, ‘ఉల్లాల ఉల్లాల’ చిత్రాల్లో ఓ హీరోయిన్‌గా నటించింది. పైగా ఆమె పేరు అప్సర రాణి కాదు. అంకిత మహారాణా. ఆమె పేరు గూగుల్‌ చేస్తే వర్మ ఫొటో షూట్‌ కంటే ఎక్కువ హాట్‌ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. అప్సర రాణి.. అలియాస్‌ అంకితను వర్మ ఇది వరకే ఓ లైవ్‌ ఈవెంట్‌లో కలిశాడు. దాన్ని చాలా మంది చూశారు. నటుడు సత్య ప్రకాశ్‌ డైరెక్టర్గా తీసిన‘ఉల్లాల ఉల్లాల’ ఆడియో ఫంక్షన్‌లోనే అంకితను ఆర్జీవీ చూశాడు. ఆమె చాలా అందంగా ఉందంటూ స్టేజ్‌పైనే చెప్పిన అతను.. సినిమా చాన్సిస్తానని ఆమెకు మాటిచ్చాడు. ఈ విషయాన్ని అంకితనే ఇది వరకు పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. తన బాడీని మరింత సెక్సీగా మార్చుకొమ్మన్నాడని వెల్లడించింది. సో, మాటిచ్చినట్టే అంకితకు ఆర్జీవీ చాన్స్‌ ఇచ్చాడు. కానీ, ఎవరికీ తెలియని నటిని తానే ఒడిశా నుంచి తీసుకువచ్చి పరిచయం చేస్తున్నానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. అంకిత కూడా అప్సర రాణితో ఈ మధ్యే ట్విట్టర్ అకౌంట్‌ ఓపెన్‌ చేసింది. ఇది కూడా ఆర్జీవీ ప్లానే అయి ఉంటుంది. ఏదేమైనా అంకితను అప్సరను చేసిన రాము బాగానే నమ్మించే ప్రయత్నం చేశాడు గానీ.. గూగుల్‌ తల్లి సాయంతో నెటిజన్లు అసలు విషయం బయట పెట్టారు.

క్రియేటివ్ డైరెక్టర్ కి క్రియేటివిటీ ఉందా ?

ఎన్టీఆర్ ఒక్కడే పాన్ ఇండియా రేంజ్ ను.. !


‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ లోనే.. మంచి కిక్ ఉంది. పైగా రాజకీయ నేపథ్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరో నటించడం.. అసలుకే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు ఆశా దీపంగా వెలిగిపోతున్న ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మంచి కమర్షియల్ పొలిటికల్ మూవీ చేయాలనుకోవడం.. ఓవరాల్ గా ఈ సినిమా మొదలు కాకముందే తారక్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమా పట్ల ఓ తెలియని ఆకర్షణ ఉందనేది ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చేస్తోన్న కామెంట్స్ ను చూస్తే అర్ధమవుతుంది. పైగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్టీఆర్ తెలివితేటలను మెచ్చుకోవాలి. ఆర్ఆర్ఆర్ తరువాత తనకు వచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన తరువాత సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేసి.. కన్నడంలోని ప్రేక్షకులకు ఓన్ అయిపోవడం, డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేసి తమిళ ప్రజానీకం పై తన నటనా చాతుర్యాన్ని ప్రయోగించడం.. ఆ తరువాత ఓ బాలీవుడ్ బడా దర్శకుడితో కూడా ఓ సినిమా ప్లాన్ లో ఉన్నాడట తారక్. ఏమైనా తారక్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. అదే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవాడానికి చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. మరో పక్క చరణ్ కి ఆ ఇమేజ్ రాబోతుంది. కానీ చరణ్ తరువాత సినిమా ఇప్పుడే చేప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!

మొత్తానికి ఎన్టీఆర్ ఒక్కడే పాన్ ఇండియా రేంజ్ ను జాగ్రత్తగా మ్యానేజ్ చేసేలా కనిపిస్తున్నాడు. పైగా ఎన్టీఆర్ చూజ్ చేసుకున్న డైరెక్టర్స్.. ఆల్ రెడీ వాళ్ళకంటూ ఓ మార్కెట్ ఉంది. అది కూడా ఎన్టీఆర్ సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇక గురూజీ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యంలో చేస్తోన్న సినిమా కూడా ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇస్తే.. ఇక తెలుగులో ఎన్టీఆర్ ను మించే హీరో ఉండకపోవచ్చు. ఇక ఈ చిత్రంతో ఎన్టీఆర్ కి మలయాళంలో సాలీడ్ మార్కెట్ క్రియేట్ అవ్వాలని మలయాళీ స్టార్ మోహన్ లాల్ ను తీసుకోవాలనుకుంటున్నారు. త్రివిక్రమ్ ఆయన కోసం ఓ కీలక పాత్రను రాస్తున్నాడట. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అట, అన్నట్టు ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది.

వైపీసీని టార్గెట్ చేస్తున్న బీజేపీ?


ఏపీలో ఎలాగోలా బీజేపీ బలపడేందుకు పావులు కదుపుతోంది. ఏపీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీటుగా పోరాడుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఏపీలో బలపడటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏపీలో టీడీపీని సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీలోని ముఖ్యనేతలను బీజేపీ తనవైపు తిప్పుకుంటోంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!

బీజేపీలోకి టీడీపీ నేతలను ఆహ్వానిస్తూ టీడీపీని ఏపీలో మరింత బలహీనంగా మారుస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ వచ్చే ప్రతిఒక్కరిని కలుపుకుపోతూ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని బీజేపీ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుంది. పవన్ కల్యాణ్ చరిష్మాను ఓట్ల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎలాగూ టీడీపీ బలహీనపడటంతో అధికారంలోకి వైసీపీపై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది.

అధికారంలో ఉన్న వైసీపీ గట్టి షాకిచ్చేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ ఎంపీలను బీజేపీ తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీ రూట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన పదేపదే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ఇందులో భాగమనేనని అర్థమవుతోంది. ఆయనతోపాటు వైసీపీకి చెందిన పలువురు ఎంపీలను బీజేపీ తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. పలువురు ఎంపీలు బీజేపీతో ఇప్పటికే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

ఏపీకి కేంద్రంలోని బీజేపీ పెద్దఎత్తున సాయం చేస్తుందని స్థానిక బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం చేస్తున్న సాయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఓవైపు టీడీపీ నుంచి పెద్దఎత్తున భారీగా నాయకులను ఆ పార్టీలో చేర్చుకుంటూ అధికారంలోని వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఒకేసారి ఇరుపార్టీలను టార్గెట్ చేస్తూ ముందుకెళుతోంది. పలువురు వైసీపీ ఎంపీలు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల వరకు బీజేపీ ఏపీలో బలపడి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లురుతోంది. ప్రధాని మోదీ, పవన్ చరిష్మాతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఆకాంక్షను ఆ పార్టీ నేతలు వెలిబుచ్చుతున్నారు. టీడీపీ, వైసీపీలను దెబ్బకొట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

‘బ్యాచ్‌ల‌ర్’ బొమ్మ పై నాగ్ జాగ్రత్తలు !


హీరో కాకముందే సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లిపోతాడని విపరీతమైన హైప్ ను సంపాధించిన అక్కినేని అఖిల్.. హీరో అయ్యాక సూపర్ స్టార్ మాట పక్కన పెడితే.. స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడుతున్నాడు. ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ప్లాప్ అయితే ఇక అఖిల్ కి ఇప్పుడు ఉన్న మార్కెట్ కూడా లేకుండా పోతుంది. అందుకే నాగార్జున సైతం ఈ సినిమా పై ముందు నుంచీ విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లాక్ డౌన్ తో ఖాళీ సమయం దొరకడంతో నాగ్ అఖిల్ సినిమా పై ఫుల్ ఫోకస్ పెట్టారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!

బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న ఈ సినిమా ఎలా వచ్చిందో అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగ్ చూసి.. సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేయమని చెప్పారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నాగ్ చెప్పిన మార్పులకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను భాస్కర్ పూర్తి చేశాడట. లేటెస్ట్ వెర్షన్ లో చేసిన మార్పుల పట్ల నాగ్ చాల హ్యాపీగా ఫీల్ అయ్యాడట. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సీన్స్ ను షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఎలాగూ హీరో హీరోయిన్లు మాత్రమే ఉండే సీన్స్ కాబట్టి షూట్ కి కూడా పెద్దగా క్రూ ఆక్కర్లేదు.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?

మరి షూట్ ను ఎప్పుడు స్టార్ చేస్తారో చూడాలి. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల లాస్ట్ వీక్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లానింగ్ లో ఉన్నారు. ఇక కరోనా దెబ్బకు రిలీజ్ డేట్ అక్టోబర్ లేదా నవంబర్ కు మారే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. పూజా ఈ సినిమాలో కాస్త ఘాటు కిస్ లు పెట్టడానికి అదనంగా కోటి రూపాయలు డిమాండ్ చేసి తీసుకుందని వార్తలు వచ్చాయి. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫలితం పై అఖిల్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. సినిమా రిజల్ట్ తేడా కొడితే.. బొమ్మరిల్లు భాస్కర్ కి ఇక మరో బొమ్మ రావడం కష్టం అయిపోతుంది.

కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోడీషా ప్లాన్?


దొరికితేనే దొంగ.. దొరకపోతే దొరే.. కానీ దొరికేలా చేయడానికి అధికారం కావాలి.. చట్టం మన చుట్టమైతే పగోడు కూడా పాదాక్రాంతమవుతాడని కేంద్రంలో బీజేపీ వచ్చాక తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు తన చేతిలో ఉన్న సీబీఐ, ఈడీ లాంటి వాటితోనే దేశంలో రాజకీయాలను శాసిస్తోంది బీజేపీ.

కేంద్రంలో అధికారం బీజేపీకి అదనపు బలం అవుతోంది.. తమపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇరుకునపెడుతున్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని తాజాగా టార్గెట్ చేసింది. అయితే నిజానికి ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రెండూ సుద్దపూసలు కాదు.. మన దేశంతో కయ్యానికి కాలుదూస్తున్న చైనా నుంచి ఇద్దరూ విరాళాలు పొందారు. కానీ అధికారంలో ఉండి బీజేపీ సేఫ్ జోన్ లో ఉండగా.. ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ విచారణను ఎదుర్కొంటోంది. అంతే తేడా..

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

తాజాగా సోనియాగాంధీ కుటుంబానికి కేంద్రంలోని మోడీ సర్కార్ షాక్ ఇచ్చింది. గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాందీ మెమోరియల్ ట్రస్ట్ ల ఉల్లంఘనలపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ట్రస్టులకు మనీ ల్యాండరింగ్ ద్వారా చైనా సహా వివిధ దేశాల నుంచి అక్రమంగా నగదు వచ్చిందని ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటువంటి ట్రస్టులకు నిధులపై ఇప్పటిదాకా సమర్థంగా నిరూపించబడలేదు. అయినా ఐటి, పిఎంఎల్‌ఎ మరియు ఎఫ్‌సిఆర్‌ఎ నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడానికి బీజేపీ రెడీ కావడం నిజంగానే రాజకీయ కక్షసాధింపు అని కాంగ్రెస్ వాదులు ఆరోపిస్తున్నారు.

భారత్ -చైనా సరిహద్దు ఘర్షణ అనంతరం పీఎం మోడీ కేర్ కు చైనా నుంచి విరాళాలు అందాయని సోనియా, రాహుల్ గాంధీ విమర్శించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు కూడా అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రి రవిశంకర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే చైనాకు మోడీ లొంగిపోయారని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల మృతిపై ఇరుకునపెట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ ఈ ప్రతికార రాజకీయానికి పూనుకుందని అర్థమవుతోంది.

విప్లవ చైనా విస్తరణవాద చైనాగా మార్పు

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని బలహీనపరచడానికే బీజేపీ ఈ ఎత్తు వేసిందనే అపవాదు ఉంది. సోనియా, రాహుల్ గాంధీ సహా ఇతర కీలక కాంగ్రెస్ సీనియర్లను జైలుకు పంపడం లేదా కోర్టు మెట్లు ఎక్కేలా శిక్షలు వేయించడం.. వారి ఇమేజ్ ను జనాల్లో డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా సోనియా కుటుంబాన్ని మోడీ టార్గెట్ చేశారని అర్థమవుతోంది.

2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ నాయకత్వాన్ని విశ్వసనీయతను దెబ్బతీయడానికి బీజేపీ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకులందరూ కోర్టు కేసులను ఎదుర్కొంటారు. చాలా మంది 70 ఏళ్ల పైబడిన వారు కావడంతో తిరిగి పోరాడడానికి వారికి సంకల్పం సరిపోదు.. రెండో తరం నాయకత్వం కాంగ్రెస్ లో లేకపోవడం మైనస్. రాహుల్ శక్తి సామర్థ్యాలు తక్కువ. జ్యోతిరాధిత్య సింధియా లాంటి యువ కాంగ్రెస్ నేతలంతా బీజేపీలో చేరిపోయారు.కాబట్టి బీజేపీతో 2024 ఎన్నికల్లో పోరాడడం కాంగ్రెస్ కు తలకు మించిన భారమవుతుంది. కాంగ్రెస్ ను దెబ్బతీయడమే బీజేపీ ఈ ప్లాన్ వెనుక ఉద్దేశంగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

-ఎన్నం

కరోనా టైంలో రేవంత్ కు ఛాన్స్ దొరికిందా?

Revanth reddy


తెలంగాణలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతోన్నారు. లాక్డౌన్ సడలింపుల ముందు కరోనాను కట్టడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత చేతులెత్తేసిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు భయాందోళనలు చెందుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లంతా సొంతూళ్లకు పయనమవుతోన్నారు. దీంతో హైదరాబాద్లో నగరంలో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ తన ఫౌంహౌజ్ లో ఉండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి పాలన సాగించడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా విపక్ష నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉండకుండా ఫౌంహౌజ్ నుంచి పరిపాలన సాగించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ప్రగతిభవన్లో 30మందికి కరోనా పాజిటివ్ రావడంతో కరోనా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం హోదాలో ప్రస్తుతం కేసీఆర్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని.. ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని కోరుతూ తీన్మార్ మల్లన్న హైకోర్టులో మాండమాస్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

ఓవైపు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ఎక్కడా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం కేసీఆర్ బయట కన్పించకపోవడంతో విపక్షాలకు ఛాన్స్ దొరికినట్లయింది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదనను ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా సీఎం ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తొలి నుంచి కేసీఆర్ కు పక్కలో బల్లెంగా మారిన రేవంత్ రెడ్డికి కరోనా అంశం కలిసొచ్చేలా కన్పిస్తుంది. రోజుకురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ కు ఈ అంశంపై చుక్కలు చూపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కరోనా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ సక్సస్ అయితే ఆయనకు తిరుగుండదనే వాదన విన్పిస్తోంది. అయితే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేతలే వెనక్కి లాగుతుండటం గమనార్హం.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ కు సీఎంఓలో అందలం!


సీఎంఓలో జరుగుతున్న పరిణామాలు ఐఏఎస్ అధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అందలం ఎక్కిస్తూ సీనియర్లను పక్కన పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ముఖ్యమంత్రి జగన్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదు. ఆయన ఆదేశాల మేరకే ఈ మార్పులు చోటు చేసుకున్నాయనేది వాస్తవం. మాజీ సీఎస్ అజయ్ కల్లం, స్పెషల్ సీఎస్ పి.వి రమేష్ కుమార్ సీఎంఓలో సీనియర్ ఐఏఎస్ అధికారులు. కల్లం కీలక శాఖలు, రమేష్ కు వైద్య ఆరోగ్య శాఖల పర్యవేక్షణ బాధ్యతలు సీఎం జగన్ ఏడాది కిందట అప్పగించారు.. ఇప్పుడు ఏమైందోగాని ఉన్నట్టుండి వారిని తప్పించారు.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

ప్రస్తుతం కీలక శాఖల బాద్యతల నుంచి వారిని తప్పించి సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆ శాఖల బాధ్యత అప్పగించి మిగిలిన శాఖలను సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిలకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. తనకు తాను ఆదేశాలు జారీ చేసుకోవడం సరైన విధానం కాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు వాదనలు. తాజా ఉత్తర్వులతో అజయ్ కల్లం, పివి రమేష్ కుమార్ ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

మరోవైపు వివాదాలు, అవినీతి ఆరోపణలు ఉన్న ప్రవీణ్ ప్రకాష్ కు కీలక బాధ్యతలు అప్పగించడంపై ఐఏఎస్ లలో ఆందోళన నెలకొంది. ఐఏఎస్ అధికారిణి రమామణి మృతికి ప్రవీణ్ ప్రకాష్ వేధింపులే కారణమనే విమర్శలు వచ్చాయి. ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని, ప్రవీణ్ ప్రకాష్ భార్య వినియోగించే వాహనం అద్దె చెల్లించాలని డిమాండ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని బీజేపీ నేత రఘురాం డీఓపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

కొత్త సచివాలయ నిర్మాణానికి కారణాలు ఇవేనా!

గతంలో సీఎస్‌గా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీలో జరిగిన పరిణామాలపై ఐఏఎస్ అధికారులు అసంతృప్తితో ఉన్నారు. ఎల్వి కంటే జూనియర్ అధికారి ప్రవీణ్, ఎల్విని బదిలీ చేస్తూ ఉత్తర్వులను ఇవ్వడం సరికాదని అప్పట్లో వాదనలు వినిపించాయి. ఆయనను అవమానకరమైన రీతిలో సీఎస్‌ పదవి నుంచి తప్పించారనే చర్చ జరిగింది.

ఇటువంటి పరిస్థితుల్లో.. ప్రవీణ్ ప్రకాష్ కు కీలక శాఖల బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జగన్ తీస్తుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని, ఈ పరిణామాలకు ఎవరు బలికావాల్సి వస్తుందోనని ప్రశ్నలు ఐఏఎస్ అధికారుల్లో తలెత్తుతున్నాయి.

కేసీఆర్ ని ఎదుర్కోవడానికి జగన్ ని దించుతారా?


తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల ఆంతర్యం ఏమిటో కానీ… జై జగన్ అంటున్నారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు ఆయనకు సరిలేరని అంటున్నారు. సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నారని, కరోనాను ధీటుగా ఎదుర్కుంటున్నారని కితాబు ఇస్తున్నారు. కేసీఆర్ కరోనాను కట్టడి చేయడంలో ఫెయిల్ అయితే ఆయన్ని విమర్శిస్తే సరిపోతుంది. అలా కాకుండా జగన్ తో పోల్చుతూ కేసీఆర్ ని విమర్శించాల్సిన ఆవశ్యకత ఏమిటో తెలియడం లేదు. పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట ఈ పొగడ్తల కార్యక్రమం మొదలుపెట్టగా…మరో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలలో ఈ ఆకస్మిక మార్పు వెనుక కారణం ఏమిటనేది తెలియదు.

ఓ జర్నలిస్టు ఆవేదన.. కన్నీళ్లు పెట్టకమానరు

వైస్సార్ మరణం అనంతరం ఏర్పడిన గడ్డు పరిస్థితులు, కుర్చీల కుమ్ములాటల తరువాత తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ విభనతో తెలంగాణా రాష్ట్రము ఏర్పడింది. తెలంగాణా ఇవ్వడం వలన ఆంధ్రాలో ఓడినా…తెలంగాణాలో గద్దెనెక్కవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశించింది. ఐతే తెలంగాణా సాధన సెంటిమెంట్ మరియు క్రెడిట్ టి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కి దక్కడంతో ఆయన అఖండ విజయం సాధించారు. ఇటు ఆంద్రప్రదేశ్ కి ద్రోహం చేసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచిపోగా, ఘోర ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా వైస్సార్ సీపీ ఎదగడంతో కేడర్ అంతా అటు వైపు మళ్లింది.

2014 ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకున్న టీకాంగ్రెస్, 2018లో టీడీపీతో కూటమి కట్టి మరింత నష్టపోయింది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కేసీఆర్ కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉండి పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ కి హ్యాండిచ్చి కేసీఆర్ పంచన చేరడంతో, కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. ఇక ఆంధ్రాలో కాంగ్రెస్ కనుమరుగు కాగా అదే పరిస్థితి తెలంగాణలో దాపురించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

ఈ నేపథ్యంలో తెలంగాణా కాంగ్రెస్ నేతలు జగన్ ఇమేజ్ ఉపయోగించుకొని అక్కడ కేసీఆర్ కి ధీటుగా ఎదగాలని చూస్తున్నారా అనే అనుమానం రేగుతుంది. జగన్ కాంగ్రెస్ అధిష్ఠానాని వ్యతిరేకించిన తరువాత అనేక మంది సీనియర్ నాయకులు ఆయనపై విమర్శల దాడి చేశారు. కొందరు ఆయనపై ఎటువంటి విమర్శలు చేయలేదు. గత ఎన్నికలలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్, జగన్ అంగీకరిస్తే 2024లో ఎన్నికలలో వైసీపీ తో పాటు కలిసి పనిచేయాలనుకుంటున్నారనిపిస్తుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇంకా జగన్ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య పొత్తు సాధ్యమయ్యే పనేనా అనేది చూడాలి. దానికి తోడు జగన్ మొదటినుండి పొత్తులకు చాలా దూరం. గెలుపైనా, ఓటమైనా సింగిల్ గా వెళ్లే టైపు. కాబట్టి ఎటూ ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరి జగన్ ఇమేజ్ తో తెలంగాణాలో కేసీఆర్ కి గట్టిపోటీ ఇవ్వాలనేది వారి ఆలోచన కావచ్చు. తెలంగాణాలో కూడా వైసీపీని పునరుద్దరించాలని అనుకుంటున్న జగన్ ఈ డీల్ గురించే అవకాశం కలదు. మొదటి నుండి సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరు సీఎంల మధ్య నీటి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.