వియ్యంకుడు సాయి తేజ్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మంచు మనోజ్!

అదేంటి.. మంచు మనోజ్‌, సాయి ధరమ్‌ ఇద్దరూ యువ హీరోలే కదా అప్పుడే వియ్యంకులు ఎలా అవుతారని అనుకుంటున్నా? పైగా, సాయిధరమ్‌కు పెళ్లి కూడా కాలేదు.. ఇద్దరి మధ్య ఇలాంటి బంధుత్వం ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?. మనోజ్ లెక్క ప్రకారం ఇద్దరూ వియ్యంకులు అయ్యారు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్‌ ద్వారా వెల్లడించాడు. పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు? ‘భౌతిక దూరం పాటిస్తూ టాంగో, జోయాలు డేట్ చేస్తున్నారు. మంచి అల్లుడిని […]

  • Written By: Neelambaram
  • Published On:
వియ్యంకుడు సాయి తేజ్‌కు థ్యాంక్స్‌ చెప్పిన మంచు మనోజ్!


అదేంటి.. మంచు మనోజ్‌, సాయి ధరమ్‌ ఇద్దరూ యువ హీరోలే కదా అప్పుడే వియ్యంకులు ఎలా అవుతారని అనుకుంటున్నా? పైగా, సాయిధరమ్‌కు పెళ్లి కూడా కాలేదు.. ఇద్దరి మధ్య ఇలాంటి బంధుత్వం ఎలా? అని ఆశ్చర్యపోతున్నారా?. మనోజ్ లెక్క ప్రకారం ఇద్దరూ వియ్యంకులు అయ్యారు. ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్‌ ద్వారా వెల్లడించాడు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

‘భౌతిక దూరం పాటిస్తూ టాంగో, జోయాలు డేట్ చేస్తున్నారు. మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ప్రత్యేక ధ‌న్యవాదాలు. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభ‌లేఖ‌లు వేయిస్తాం’ అని రాసుకొచ్చాడు. ఇక్కడ టాంగో, జోయా అంటే ఇద్దరి పెంపుడు కుక్కలు. రెండు ఒకే బ్రీడ్‌కు చెందినవే. మనోజ్ దగ్గర ఆడ కుక్క ఉంటే.. తేజ్ దగ్గర మగ కుక్క ఉన్నంటుంది. ఎప్పుడు హుషారుగా కనిపిస్తూ.. ప్రతి ఒక్కరితో బంధుత్వం కలుపుకోవడం మనోజ్‌కు అలావాటు. అందుకే సాయి ధరమ్‌తో పాటు తమ పెట్‌ డాగ్స్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంచు వారి హీరో సరదా ట్వీట్‌ చేశాడు.

https://twitter.com/HeroManoj1/status/1277454303771279360?s=20

కాగా, వ్యక్తిగత కారణాల వల్ల మనోజ్‌ ఆ మధ్య సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాడు. తన భార్యతో విడాలకులు తీసుకున్నాడు. స్వల్ప విరామం తర్వాత అతను మళ్లీ చురుగ్గా మారాడు. ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సొంత ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్పై మనోజే ప్రొడ్యూసర్. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్‌ సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన థీమ్ వీడియో, నో పెళ్లి అనే సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు