
మోడలింగ్ నుంచి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన నటి రకుల్ ప్రీత్ సింగ్. కెరటం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆమె ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో హిట్ ఖాతాలో వేసుకుంది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. అంతకుముందు కన్నడ, హిందీలో చేసిన పూర్తిగా తెలుగు సినిమాలపై దృష్టి సారించి సక్సెస్ ట్రాక్లో పడింది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, రామ్ చరణ్, నాగార్జునఇలా దాదాపు అందరు అగ్రహీరోలతో నటించింది. ఆమె భారీ అంచనాలు పెట్టుకున్న స్పైడర్, మన్మధుడు-2 నిరాశ పరచడంతో తెలుగులో కాస్త వెనుకడింది. ఆ మూవీస్ తర్వాత ఆమె పూర్తిగా హిందీ, తమిళ్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్-2లోనూ ఆమె నటిస్తోంది. కరోన లాక్‌డౌన్ టైమ్‌లో ముంబైకే పరిమితయం అయిన ఆమె.. ఈ మధ్యే తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్… టాలీవుడ్‌కు కాస్త దూరంగా ఉన్నా అభిమానులతో మాత్రం టచ్‌లోనే ఉంది.
జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా.. యోగా చేస్తుండగా తీసుకున్న హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారిని అలరించింది. వంటల కోసం ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ చానల్ ను ఓపెన్ చేసింది. ఫిట్‌నెస్, ఫుడ్ గురించి మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొన్ని విషయాలను ఆమె ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఏలాంటి అర్హతలు ఉన్న వ్యక్తి మీకు భర్తగా రావాలని అని కోరుకుంటున్నారు అని ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆమెను ప్రశ్నించాడు. దీనికి ఆమె చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. కాబోయే వాడిలో ఎలాంటి క్వాలిటీస్‌లో ఉండాలో వివరించింది. ‘ నిజం చెప్పాలంటే నాకు ప్రేమ అన్నా, పెళ్లి అన్నా చాలా గౌరవం. నాకు కాబోయే భర్త విషయంలో కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. .ఫస్ట్ అతను మంచి హైట్ ఉండాలి. ఎంతగా అంటే నేను హైహిల్స్ వేసుకున్నా సరే అతడిని తలెత్తే చూసేంత ఎత్తుండాలి. దాంతో మంచి మనసు, ఆలోచనలతో పాటు తెలివైన వాడు అయి ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఇప్పటిదాకా నాకు ఎదురు పడలేదు’ అని చెప్పుకొచ్చింది.