Home Blog Page 8401

సమస్యని దారి మళ్ళించడంలో వైస్సార్సీపీ నేతల తర్వాతే..!

Ysrcp
మనిషికో రూ.వంద విరాళంగా ఇచ్చి పార్టీ ఫండ్ రూ.200 కోట్లు చేద్దామని పిలుపునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానిపై వివిధ మీడియా ఛానళ్లు, కొంతమంది పార్టీ పెద్దలు అదే పనిగా పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ పార్టీ నేతలు కూడా మరీ రెచ్చిపోతున్నారు. ఇంతకీ పవన్ అభిమాని చేసిన తప్పేంటంటే.. పార్టీకి రెండు వందల కోట్ల మేర విరాళం ఇవ్వాలని పిలిపునివ్వడం. నిరుద్యోగుల నుంచి అక్షరాల రూ.200 కోట్ల వసూళ్లు చేసినట్లు చేసిన జగన్ సర్కార్ కంటే ఇది పెద్ద నేరమేమి కాదు. అయినా ఆ అభిమాని పిలుపును ఇంత రాద్ధాంతం చేయడం అర్థంలేని వాదన. ప్రజలను మభ్యపెట్టి రూ.200 కోట్లు వసూల్ చేసిన జగన్ ప్రభుత్వ అధికారులు చేసిన దానికంటే.. జనసేన కార్యకర్త చేసిన తప్పు చాలా చిన్నదనేది కొంత మంది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం నిరుద్యోగుల నుండి పెద్ద మొత్తంలో వసూల్ చేసిన జగన్ సర్కార్ తప్పిదాన్ని డైవర్ట్ చేయడానికి వైస్సార్సీపీ నేతలు ఇటువంటి జిమ్మిక్కులు లాజిక్కులు చేస్తుంటారు అనేది అనేకమంది అభిప్రాయం.

గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ పెద్ద ఎత్తున వైస్సార్సీపీ ప్రభుత్వం పై విరుచుకుపడింది. ఆ సమయంలో సాక్షాత్తు సీఎం జగన్ రంగప్రవేశం చేసి పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శించారు. నీ భార్యల పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారని జగన్ అన్నారు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం సమస్య ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వైపు తిరిగింది. ఇప్పుడు కూడా వైస్సార్సీపీ నేతలు అదే చేస్తున్నారు. వారి పాలనలో జరిగిన రూ.200 కోట్ల స్కాం ని జనసేన అభిమాని పై తిప్పి వారి పాలనలో జరిగిన తప్పిదాన్ని కప్పి పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

రూ.200 కోట్ల వ్యవహారం ఇదే..

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు పడ్డాయి. దాదాపు 12000 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే పర్మినెంట్ అవుతుందని.. జీతం బాగుంటుందని.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతామని తెలిసి నిరుద్యోగులు ఎగబడడంతో కొందరు ఎమ్మెల్యేలు దీన్ని క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో కొలువును రూ.10లక్షలకు అమ్ముకున్నారని.. 5వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని అంటున్నారు. మొత్తం రూ.200 కోట్ల వరకు ఈ వసూళ్లు జరిగాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు 10లక్షల చొప్పున రూ.200కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. ఈ విషయం సీఎం జగన్ కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఆదేశించారు.

అయినా ఒక్కో నిరుద్యోగి నుంచి వసూలు చేసిన రూ.10లక్షలను శాసనసభ్యులు తిరిగి ఇవ్వలేదని సమాచారం. పోస్టులు భర్తీ చేస్తామంటూ డబ్బులు తీసుకున్న వారిని ఏమారుస్తున్నారని వినికిడి.ఈనేపథ్యంలో నిరుద్యోగుల నుంచి సదరు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరగడంతో వారు అధికారుల మెడపై కత్తులు పెట్టి తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.నెల్లూరు జిల్లాలో ప్రస్తుతమున్న పదిహేను మంది షిఫ్ట్ ఆపరేటర్లను తొలగించి ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారిని నియమించడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు రోడ్డెక్కి ఆందోళన చేయటంతో ఈ ఆమ్యామ్యాల వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది.

సిఎం జగన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా, నియామకాలను నిలిపివేసినా శాసనసభ్యులు వెనక్కు తగ్గడం లేదు.ఉన్న వాళ్లను సైతం తీసేసి తమకు డబ్బులిచ్చిన వారిని ఆ ఉద్యోగాల్లో నియమించిన వ్యవహారం నెల్లూరు జిల్లాలో జరగడంతో విషయం రచ్చకెక్కింది. అవినీతిని సహించేది లేదంటున్న ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

సల్మాన్‌తో చేయనంటే బెదిరించారు.. కంగనా


కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ క్వీన్‌. ఓ ఫైర్ బ్రాండ్‌. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అగ్ర హీరోయిన్‌గా ఎదిగిన వ్యక్తి. ఏ విషయానైనా సూటిగా మొహం మీదే చెప్పేయడం ఆమె నైజం. బాలీవుడ్‌లో బడా హీరోయిలు, నిర్మాతలు, డైరెక్టర్లను ఎదిరించే ధైర్యం ఉన్న నటి. బాలీవుడ్‌లో బంధుప్రీతి మాత్రమే కాదు పురుషాధిక్యతను చాటుకోవాలనే అహంకారం కూడా దర్శక, నిర్మాతలు, హీరోల్లో ఉందని ఆమె ఆంటోంది. దానికి తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పిస కంగనా సంచలన విషయాలు బయటపెట్టింది. బాలీవడ్‌ సూపర్ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ ‘సుల్తాన్‌’ లో హీరోయిన్‌ కోసం ముందు తననే సంప్రదించారని చెప్పింది. అయితే, అందులో నటించను అన్నందుకు తనను కొందరు బెదిరించారని తెలిపింది. అయితే, వాళ్లకు భయపడకుండా తన మనసుకి నచ్చిన మరో కథలో నటించి విజయం సాధించానని చెప్పింది.

Also Read: ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

‘సల్మాన్‌ఖాన్‌ హీరోగా రూపొందబోయే సుల్తాన్‌ సినిమాలో నటించమని అడిగారు. దీని కోసం ఆ దర్శకుడు మా ఇంటికొచ్చి కథ చెప్పారు.ఆ తర్వాత నేను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్య చోప్రాను కలిసి ఈ సినిమాలో నటించలేనని చెప్పాను. అప్పుడు ఆయన బాగానే ఉన్నారు. ఏమీ అనలేదు. కానీ, ఆ తర్వాత కంగనా సుల్తాన్‌ సినిమాకి నో చెప్పింది.. అంటూ కొన్ని వార్తలొచ్చాయి. ‘నీకెంత ధైర్యం?, నా సినిమాకే నో చెప్తావా? నీ పని అయిపోయింది’ అంటూ ఆదిత్య చోప్రా నాకు మెసేజ్‌ చేశారు. కొన్నాళ్ళ తరువాత నేను నీతో ఎప్పటికీ సినిమా చేయనని మరో మెసేజ్‌ పంపించారు’ అని కంగనా వివరించింది.

Also Read: రెండో ‘బిచ్చగాడు’ వస్తున్నాడు..

తాను సుల్తాన్‌లో నటించకపోవడానికి కారణం ఏంటో కూడా ఆమె చెప్పింది. సల్మాన్‌ లాంటి హీరో పక్కన నటించి నా ప్రాధాన్యతని తగ్గించుకోదల్చుకోలేదు అని కంగనా స్పష్టం చేసింది. సుల్తాన్‌కు నో చెప్పిన రనౌత్‌ ఆ టైమ్‌లో ‘తను వెడ్స్‌ మను’ అనే మూవీ చేసింది. అది భారీ విజయం సాధించడంతో పాటు కంగనాకు మరింత పేరు తెచ్చిపెట్టింది. దానికి సీక్వెల్‌గా రూపొందించిన ‘తను వెడ్స్‌ మను రిటర్స్న్‌’ చిత్రం కూడా హిట్‌ అయింది.

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్..!


సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని కేసీఆర్ కలలుకన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. సస్పెన్స్ థిల్లర్ ను తలపించించేలా అనేక మలుపుల మధ్య ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు కూడా సచివాలయ భవన నిర్మాణంలో జోక్యం చేసుకోమని చెప్పడంతో ప్రభుత్వానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.

Also Read: కేంద్రం డబ్బు.. కేసీఆర్ పేరు?

హైకోర్టు అనుమతి వచ్చిన వెంటనే సీఎం ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం సచివాలయ కూల్చివేత పనులను వేగంగా పూర్తి చేస్తోంది. కూల్చివేత పనుల్లో భాగంగా శిథిలాలు సచివాలయం ఆవరణంలో ఉన్న గుడి, మసీదుపై పడటంతో ఆ కట్టడాలు కూడా కూలిపోయాయి. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ కొత్త సచివాలయ నిర్మాణంతో పాటు గుడి, మసీదులను కూడా కొత్తవాటిని ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపారు. సీఎం ముందుగా స్పందించడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నవేళ సచివాలయ కూల్చివేత, నిర్మాణ పనులు ప్రభుత్వం చేపడుతుండటంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

అయినప్పటికీ సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈమేరకు మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సచివాలయ డిజైన్, బాహ్యరూపం, లోపల ఉండాల్సిన సదుపాయాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ, వైభవం ఉట్టిపడేలా భవనం నిర్మాణం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Also Read: కేసులు పెరుగుతున్నాయ్ కానీ.. ఈ శుభవార్త విన్నారా?

ఈనెల 21నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. మంచిరోజులు ఉండటంతో సీఎం కేసీఆర్ ఇప్పటికే ముహుర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. శ్రావణ మాసంలో భవన నిర్మాణాలు పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం నాటికి కొత్త సచివాలయాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఏవిధంగానైతే పర్యవేక్షించారో అలాగే సచివాలయ పనులను కూడా అలాగే పరిశీలిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. ఎట్టకేలకు సచివాలయ నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగడంతో కేసీఆర్ కలల సౌధం త్వరలోనే పూర్తవడం ఖాయంగా కన్పిస్తుంది.

నిమ్మగడ్డ గవర్నర్ కు ఏం చెప్పారు?


హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను విజయవాడలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఇసిగా తనను పునర్నియమించాలని కోరుతూ వినతి ప్రతాన్ని అందజేశారు. ఉదయం 11.30 గంటల నుంచి అరగంట పాటు వీరద్దరి బేటీ కోనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు, ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం, సుప్రీం కోర్టు ఆదేశాలు, అనంతర పరిణామాలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించారు.

వలసలతో ఏపీకి పెరగనున్న కరోనా ముప్పు..!

ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ తాను చెప్పిన అంశాలన్నీ గవర్నర్ విన్నారని తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు. గవర్నర్ తనను మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వానికి సూచిస్తారనే అశాభావాన్ని నిమ్మగడ్డ వ్యక్తం చేశారు. సమస్యకు సానుకూల పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలను వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. సుప్రీం కోర్టు, హైకోర్టు నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వ వైఖరి సరైంది కాదని స్పష్టం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టు విడువకుండా న్యాయస్థానాల్లోనే పోరాటం చేస్తుంది. నిమ్మగడ్డ కేసు సుప్రీం కోర్టులో విచారణలో ఉండగా ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

జూలై 24న కేసీఆర్ పెద్ద ప్రకటన చేస్తారా?

గవర్నర్ ఆదేశాలు వచ్చేలోగా తమకు అనుకూలవైన ఆదేశాలు న్యాయస్థానం నుంచి వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎం చేయాలనే అంశాలపై ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. గవర్నర్ నిమ్మగడ్డ ను తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశాలు ఇస్తే ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ రేసు.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్..!


ఏపీలో ఎమ్మెల్సీ పదవుల రేసు మొదలైంది. వైసీపీ అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీ కోసం నేతలు పోటీపడుతున్నారు. వైసీపీ నేతల రాజీనామాలతో రెండు, గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా ఇప్పటివరకు ఏ ఒక్కపేరు అధికారికంగా వెల్లడికాలేదు. వైసీపీలోని ఆశావహులు ఎమ్మెల్సీ సీటు తమకే దక్కుతుందని నమ్మకంతో ఉన్నప్పటికీ లోలోపల మాత్రం టెన్షన్ పడుతున్నారు.

Also Read: ట్వీట్లకు ఓట్లు రాలుతాయా లోకేష్..?

వైసీపీ నుంచి రోజుకోపేరు తెరపైకి వస్తుండటంతో అధిష్టానం లీకులిస్తుందా? లేదా నేతలే కావాలనే ప్రచారం చేసుకుంటున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీని నమ్ముకొని గతంలో ఎమ్మెల్యే అవకాశం దక్కనివారికి ఈసారి ఎమ్మెల్సీ దక్కుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినవారికే అవకాశం దక్కుతుందని నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే పార్టీలో నేతల మధ్య పోటీతీవ్రంగా ఉండటంతో చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించేందుకే నేతలు మొగ్గుచూపుతున్నారు.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీలో రేసులో ప్రముఖంగా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ విన్పిస్తుంది. ఆయన జగన్ కు నమ్మకస్తుడిగా ఉన్నారు. కిందటి ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎమ్మెల్సీ పదవీని త్యాగంచేసి టీడీపీ నుంచి వచ్చిన విడుదల రజనికీ తన సీటును కేటాయించారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ చేస్తానని జగన్ అప్పుడే హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనకు ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత కొయ్య మోషేన్ రాజు పేరు కూడా బలంగా విన్పిస్తోంది.

Also Read: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..

వీరితోపాటు టీడీపీ నుంచి వైసీపీ చేరిన మాజీ మంత్రి పండుల రవీంద్రబాబు, కడప జిల్లాకు చెందిన మైనార్టీ నేత జకియా ఖాన్ పేర్లు ఎమ్మెల్సీ రేసులో ప్రముఖంగా విన్పిస్తున్నాయి. సామాజిక వర్గంలో కోణంలో వీరిపేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గం నుంచి రవీంద్రబాబు, మైనార్టీ నుంచి జకియా ఖాన్ పేర్లు విన్పిస్తున్నారు. పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ వీరి పేర్లను ముందస్తు లీకుచేసి నేతల అభిప్రాయానని అధిష్టానం తెలుసుకుంటోందనే టాక్ విన్పిస్తుంది.

ప్రస్తుతానికి వీరి పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయని ఆశావహులు భావిస్తున్నారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్సీ సీట్ల రాజకీయం జోరుగా సాగుతుండటం గమనార్హం.

జగన్ పక్కా వ్యూహం.. టీడీపీకి ఎన్టీఆర్ దూరం..!


ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు అవుతాయనే నానుడి ప్రస్తుత ఏపీ రాజకీయాలకు కరెక్టుగా సరిపోతుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఐదేళ్లలోనే చంద్రబాబు పరిస్థితి పూర్తి రివర్స్ అయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ జోరుగా టీడీపీ బొక్కబోర్లా పడింది. టీడీపీ గతంలో ఎన్నడూ చూడని దారుణ పరాభవాన్ని చవిచూసింది. కేవలం 23సీట్లను టీడీపీ దక్కించుకోగా అందులో చాలామంది ఇప్పటికే వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

సీఎంగా జగన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి టీడీపీకి గడ్డుకాలం మొదలైంది. ఆ పార్టీలో నేతలంతా ఒక్కొక్కరుగా జగన్ కు జై కొడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాములను జగన్ సర్కార్ బయటికి తీసి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన నేతలను జైళ్లకు పంపిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు అరెస్టయి జైళ్లకు వెళ్లగా మరికొందరిని పంపించేందుకు జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.

ఇప్పటికే బలహీనంగా మారిన టీడీపీని మరింత దెబ్బతీసేందుకు జగన్ పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును జగన్ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న దివంగత ఎన్టీఆర్ ఓటుబ్యాంకును వైసీపీ తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేయని పని జగన్ సర్కార్ చేయనుంది. దీనివల్ల చంద్రబాబుకు చెక్ పెట్టడంతోపాటు ఎన్టీఆర్ అభిమానులు జగన్ పేరును ఎల్లప్పుడు గుర్తుంచుకుంటారు.

గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

ఒకవేళ ఇది జరిగితే చంద్రబాబు ఎన్టీఆర్, ఆయన కుటుంబాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తడం ఖాయంగా కన్పిస్తుంది. ఇప్పటికే బాబు ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచారనే అపవాదును మోస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు పెట్టలేకపోయారనే నిందనే ఆయన జీవితాంతం మోయాల్సి రావడం ఆయనకు ఇబ్బందికరంగా మారనుంది.

మరోవైపు బాలకృష్ణ సైతం హిందూపురాన్ని జిల్లా చేయాలని కోరాడే తప్ప తన తండ్రి పేరును జిల్లాకు పెట్టాలని సీఎం జగన్ ను ఆయన కోరలేదు. ఇదికూడా జగన్ కు కలిసొచ్చింది. ఎన్టీఆర్ నిజమైన వారసుడు జగన్ అనేలా వైసీపీ నేతలు ఇప్పటికే చెప్పుకుంటున్నాయి. దీంతో ఇప్పటివరకు టీడీపీకి మద్దతుగా ఉన్న ఎన్టీఆర్ వీరాభిమానులు జగన్ సర్కార్ జై కొట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీకి ఇది మరింత ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.

జూలై 24న కేసీఆర్ పెద్ద ప్రకటన చేస్తారా?


సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు.. కేటీఆర్ కు రాష్ట్ర రాజకీయాలు.. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మరోసారి తెరపైకి వచ్చిందని తెలిసింది. రాహుల్ గాంధీలా కేటీఆర్ ఆగం కావద్దని.. కేసీఆర్ ఇప్పుడే రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం టీఆర్ఎస్ లో ఎప్పటి నుంచో ఉంది. తను ఉన్నప్పుడే కేటీఆర్ ను సీఎం చేసి కేసీఆర్ పర్యవేక్షించేలా రంగం సిద్ధం చేసుకున్నాడనే ప్రచారం ఉంది. హరీష్ రావు లాంటి బలమైన నేతను నిలువరించి కేటీఆర్ ను సీఎం చేయాలంటే అది కేసీఆర్ ఉన్నప్పుడే సాధ్యం. అందుకే తాజాగా మరో ప్రచారం ఊపందుకుంది.

కేసీఆర్, జగన్.. అందులోనూ అన్నాదమ్ములే?

కేసీఆర్ తన కొడుకు, మంత్రి కేటీఆర్ కు మార్గం సుగమం చేయడానికి సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ ను త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయబోతున్నారని సమాచారం. శ్రావణ మాసంలోనే దీనికి ముహూర్తం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు.

టీఆర్ఎస్ పై విపరీతంగా విరుచుకుపడే ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కేటీఆర్ ను సీఎంగా పట్టాభిషేకం చేయబోతున్నారంటూ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. కేసీఆర్ పెట్టిన అన్ని పరీక్షలలో కేటీఆర్ పాస్ అయ్యారని.. అధికారం కల్పించడానికి అన్ని అర్హతలు సంపాదించారని కేసీఆర్ డిసైడ్ అయినట్టు రాసుకొచ్చింది.

అంతేకాదు.. జూలై 24న కేసీఆర్ పుట్టినరోజు కావడంతో అదే రోజున కేటీఆర్ ను పట్టాభిషేకం చేయబోతున్నట్టు సంచలన విషయాన్ని లీక్ చేసింది. కేసీఆర్ జూలై 24న ఒక పెద్ద ప్రకటన చేయబోతున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోందని మీడియా సంస్థ తెలిపింది.

మామ సీటు కోసం అల్లుడి వేషాలు..!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ప్రధాని పదవి చేపట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారు. జాతీయ నాయకులతో సంప్రదింపులు జరిపారు. కానీ నెరవేరలేదు. దీంతో రాబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు పగ్గాలు అప్పగించి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేయడానికి ఫుల్ టైం పనిచేయడానికి వీలుగా తెలంగాణ సీఎం బాధ్యతలను కేసీఆర్ వదులుకుంటున్నాడని.. కేటీఆర్ కు అప్ప జెప్పబోతున్నాడని తెలిసింది. మరి ఇది నిజమా కాదా అన్నది జూలై 24న తేలనుంది. అప్పటివరకు వేచిచూడడమే..

జగన్ ఆ నేతకు న్యాయం చేయలేకపోతున్నారా?


వైసీపీనే నమ్ముకొని ఉన్న ఆ నేతకు మాత్రం పదవీ మాత్రం దక్కడం లేదు. జగన్మోహన్ రెడ్డికి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న సదరు నేతకు ప్రతీసారి అన్యాయం జరుగుతుండటం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తయినప్పటికీ ఆ నేతకు సరైన అవకాశం దక్కకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఆ నేత ఎవరనే కదా మీ సందేహం.. ఆయనేవరో కాదు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్.

Also Read: సీటు మారినా పర్లేదు…ఫేటు మారకుండా చూసుకో రాజా..!

వైసీపీ కష్టకాలంలోనూ మర్రి రాజశేఖర్ పార్టీనే నమ్ముకొని ఉన్నారు. కిందటి ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ప్రచారం జరిగింది. ఆయన కూడా సీటు తనకు వస్తుందని చిలకలూరిపేటలో ముందస్తు ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన విడుదల రజనీకీ ఎమ్మెల్యే సీటు దక్కింది. దీంతో ఆయన జగన్ పై అలక చెందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో రాజశేఖర్ కిందటి ఎన్నికల్లో రజనీ గెలుపు కోసం పనిచేశారు. ఈ ఎన్నికల్లో రజనీ విజయం సాధించడంతో రాజశేఖర్ కు ఎమ్మెల్సీ దక్కుతుందని అందరూ భావించారు.

ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో రాజశేఖర్ కు ఛాన్స్ దక్కుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జగన్ సర్కార్ శాసన మండలి రద్దుకే మొగ్గుచూపుతుంది. దీంతోనే ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవీ వెంకటరమణ,, పిల్లి సుభాస్ చంద్రబోస్ లకు జగన్ రాజ్యసభ సీటు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవీ దక్కినా అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: గుట్కాల తయారీ ఎమ్మెల్యే నిర్వాకమేనా?

వైసీపీలో పదవుల కోసం నేతల పోటీ తీవ్రంగా ఉండటంతో రాజశేఖర్ కూడా ఎమ్మెల్సీ దక్కడం కూడా కష్టమనేని పార్టీలో టాక్ విన్పిస్తోంది. దీంతో రాజశేఖర్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి సమస్యగా మారనుంది. పార్టీని, తనను నమ్ముకొని ఉన్న నేతకు న్యాయం చేయలేకపోతే జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కన్పిస్తోంది. జగన్ మాటిచ్చారంటే నిలుపుకుంటారనే ప్రజల్లో టాక్ ఉంది. దీంతో సీఎం జగన్ ఆయనకు ఎలా న్యాయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

గుట్కాల తయారీ ఎమ్మెల్యే నిర్వాకమేనా?


ఏపీ-తమిళనాడు సరిహద్దులో  పట్టుబడ్డ రూ.5.27 కోట్ల విషయంపై ప్రకాశం జిల్లా అధికార పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మరువక ముందే మరో అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన గోదాములో చట్ట విరుద్ధంగా గుట్కాలు తయారీ విషయం బయట పడటం ప్రతిపక్షాల చేతికి మరో అస్త్రం దొరికినట్లయ్యింది. గుంటూరు జిల్లాకు చెందిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫాకు చెందిన గోదాములో నిషేదిత గుట్కాలు తయారు చేస్తుండగా గుంటూరు పోలీసులు దాడి చేసి అక్కడ పని చేస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడంతోపాటు గోదాము, అందులో ఉన్న రూ. కోట్లు విలువ చేసే గుట్కా తయారీ సామాగ్రి, యంత్రాలను సీజ్ చేశారు. జిల్లాలోని పెదకాకాని మండలం కొప్పురావూరు వద్ద ఉన్న ఈ గోదాములో గుట్కాల తయారీ సాగుతుంది. రాజకీయ నాయకుడికి చెందిన వ్యవహారం కావడంతో ఈ తనిఖీల్లో స్వయంగా ఎస్పీ అమ్మిరెడ్డి పాల్గొన్నారు.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గత కొద్ది రోజులుగా వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. కరోనా లాక్ డౌన్ సమయంలో నిబందనలకు వ్యతిరేకంగా అధిక సంఖ్యలో బందువులు, రాజకీయ నాయకులకు విందు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదర్కొన్నారు. ఈ విందులో పాల్గొన్న కొందరికి కరోనా వైరస్ సోకింది. స్వయంగా ముస్తఫా కుటుంబం వైరస్ అనుమానంతో క్వారంటైన్ లో ఉంది. ముస్తఫా ఇచ్చిన విందు విషయంలో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టడంతో… తాను విందు ఇవ్వలేదని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ముస్తఫా వెల్లడించారు. తాజాగా ముస్తఫాకు చెందిన గోదాములో నిషేధిత గుట్కాల తయారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

గుంటూరు నగరానికి చెందిన ఎం.సుధాకర్ రెడ్డి పేరుతో గోదాములో పాన్ మసాలా తయారీకి అనుమతి పొంది నిషేదిత గుట్కాలు తయారు చేస్తున్నారని పోలీసులు తనిఖీలో గుర్తించారు. సంస్థ సూపర్ వైజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోగా సుధాకర్ రెడ్డి, అతని భాగస్వామి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు గోదాములో గుట్కాల తయారీ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని గుంటురు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. ఆ ప్రాంతంలో తనకు పోగాకు వ్యపార నిమిత్తం అనేక గోదాములు నిర్మించానని, ఒక గోదాము ఖాళీగా ఉండటంతో అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

Also Read: నిమ్మగడ్డ కేసులో ప్రభుత్వ తాజా నిర్ణయం ఇదే..

గోదాములో గుట్ట్కాల తయారీకి అధికార పార్టీ నాయకుల అండదండలతోనే సాగుతుందని టిడిపి ఆరోపిస్తుంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ముడి సరుకును బట్టీ చూస్తే భారీగా గుట్కాలు ఇక్కడ తయారు చేసి ఇతర ప్రాంతాలకు పంపతున్నట్లు తెలిసిందని చెప్పారు. పాన్ మసలా తయారీకి అనుమతి పొందిన సుధాకర్ రెడ్డి ముస్తఫా అనుచరుడేనని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలన్నారు. నిషేదిత గుట్కాల తయారీ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓటీటీలో రానున్న కాజల్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’!

Kajl Paris Paris on OTT

భాషతో సంబంధం లేకుండా భారత సినీ పరిశ్రమలన్నీ మూడు, నాలుగు నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొవిడ్ దెబ్బకు థియేటర్లు మూత పడడం, షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఇండస్ట్రీ కుదేలైంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని ఫస్ట్‌ కాపీతో రెడీ ఉన్న చిత్రాలు కూడా రిలీజ్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఓటీటీల రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా భారీ బడ్జెట్‌ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాల విషయంలో మూవీ మేకర్స్‌ ఇంకా వేచి చూస్తున్నారు. చిన్న చిత్రాలను మాత్రం వచ్చిన రేటుకు అమ్ముకొని డిజిటల్‌ రిలీజ్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేసుకొని, వివిధ కారణాలతో విడుదల కాలేకపోయిన చిత్రాలు కూడా కరోనా పుణ్యమా అని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ జాబితాలో స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఫస్ట్‌ టైమ్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన చిత్రం కూడా ఉంది.

Also Read:ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ

హిందీలో సెన్సేషనల్‌ హిట్‌ మూవీ ‘క్వీన్‌’ను తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నలుగురు స్టార్ హీరోయిన్లతో వేర్వేరు దర్శకులు రీమేక్‌ చేశారు. తమిళంలో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ పేరుతో రూపొందిన ఈ చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించింది. తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ పేరుతో తెరకెక్కింది. మలయాళంలో మంజిమా మోహన్‌ ప్రధాన పాత్రల్లో ‘జామ్‌జామ్‌’ టైటిల్‌తో, కన్నడలో పరుల్‌ యాదవ్‌ లీడ్‌ రోల్‌లో ‘ బటర్‌ ప్లై’ పేరునూ రూపొందించారు. నాలుగు భాషల్లోనూ చిత్రీకరణ పూర్తయ్యాయి. కానీ, తమిళ్‌లో వస్తున్న ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రొడక్షన్‌తో పాటు సెన్సార్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి.

Also Read: జులై 26, రాత్రి 8.30కు బ్యాచ్‌లర్ లైఫ్కు నితిన్‌ గుడ్‌బై

రివైజింగ్‌ కమిటీకి వెళ్లి సెన్సార్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి వచ్చిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ మూవీ ట్రైలర్ను గతేడాది విడుదల చేశారు. తమన్నా ‘దటీజ్‌ మహాలక్షి’ తెలుగు టీజర్ కూడా ఎప్పుడో రిలీజైంది. మాతృక ఒకటే కావడంతో అన్ని నాలుగు రీమేక్స్‌ను ఒకేసారి రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే, మిగతా భాషల సంగతి ఎలా ఉన్నా తమిళ్‌లో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ మూవీని ఓటీటీ ద్వారా రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వీలైతే నాలుగు భాషల చిత్రాలను ఒకేసారి ఓటీటీలో విడుదల చేయాలని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, దటీజ్‌ మహాలక్షి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి కావాల్సి ఉంది. మరి, నాలుగు సినిమాలు ఒకేసారి వస్తాయా.. కాజల్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ ముందుగా రిలీజవుతుందా అన్నది చూడాలి.

జులై 26, రాత్రి 8.30కు బ్యాచ్‌లర్ లైఫ్కు గుడ్‌బై

Nithiin Marriage

Nithiin Marriage
యువ హీరో నితిన్‌ రెడ్డి తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు.నితిన్‌ పెళ్లికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. నితిన్, షాలినిల వివాహం ఈ నెల 26న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో జరగనుంది. చాలా రోజుల కిందటే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నితిన్‌.. ఏప్రిల్‌లో దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్‌, షాలిని పసుపు కుంకుమ వేడుక జరిగిన విషయం తెలిసిందే. కానీ, కరోనా దెబ్బకు ఆ ప్లాన్స్‌ క్యాన్సలైంది. కనీసం హైదారబాద్‌లో అయినా ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ కరోనా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దాంతో, ఇక వెయిట్‌ చేసి లాభం లేదన్న ఇరు కుటుంబాలు పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేశాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో వచ్చే ఆదివారం నాడు ప్రేమ పక్షులు నితిన్‌, షాలినికి పెళ్లి నిశ్చయించారు.

Also Read: మహేశ్‌ మెచ్చిన తమిళ్‌ మూవీ..

కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఈ వివాహ వేడుకను ప్లాన్‌ చేస్తున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వేడుకలో పాల్గొంటారు. వారం రోజుల్లో నితిన్‌ తన బ్యాచ్‌లర్ లైఫ్‌ను ముగించబోతున్నాడు. టైమ్‌ దగ్గర పడడంతో నితిన్‌ ఇంట పెళ్ళ సందడి షురూ అయింది. వివాహ మహౌత్సవానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఆయన కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నితిన్‌… వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ‘రంగ్‌ దే’, చంద్రశేఖర్యేలేటితో ‘చెక్‌’ రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్‌’ రీమేక్‌తో పాటు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘పవర్‌ పేట’ సినిమాలకు కూడా కమిటయ్యాడు.

Also Read: ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

మహేశ్‌ మెచ్చిన తమిళ్‌ మూవీ..

Mahesh Babu Praises Tamil Hero

Mahesh Babu Praises Tamil Hero
కరోనా దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అవుతున్నది. కొన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. మూడు నెలలుగా థియేటర్లు, షూటింగ్స్‌ ఆగిపోవడంతో పరిశ్రమ దిక్కుతోచని స్థితిలో ఉంది. స్టార్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సంవత్సరం మొత్తం షూటింగ్స్‌తో బిజీగా ఉండే నటీనటులూ ఈ ఫోర్స్‌డ్‌ బ్రేక్‌లో రకరకాల వ్యాపకాలతో కాలం వెల్లదీస్తున్నారు. ఫ్యామిలీతో టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నారు. పిల్లలతో ఆడుకుంటున్నారు. ఎలాగూ ఖాళీనే కాబట్టి ఇంట్లోనే రకరకాల సినిమాలు చూస్తున్నారు. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్బాబు అయితే ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టకుండా కుటుంబానికే ఫుల్‌ టైమ్‌ కేటాయిస్తున్నాడు.

Also Read:ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

ఈ క్రమంలో ప్రతి రోజు వివిధ భాషలకు చెందిన మూవీస్‌ చూస్తున్నాడు మహేశ్. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ హవా నడుస్తుండడంతో ఎన్నో దేశాలకు చెందిన చిత్రాలను ఇంట్లోనే చూసే అవకాశం కలిగింది. అయితే, మరే చిత్ర నచ్చనంతగా ఓ తమిళ్‌ మూవీ మహేశ్‌ మనసు దోచేసింది. ‘ఓ మై కడవులే’ అనే మూవీ తనకు చాలా నచ్చిందని మహేశ్ తెలిపాడు. ఆ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రాన్ని చూశాడు మహేశ్. తనకు బాగా నచ్చడంతో వెంటనే ట్విటర్‌లో చిత్ర బృందానికి అభినందనలు తెలిపాడు.

‘ఓ మై కడవులే చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశా. మూవీలో అందరి పెర్ఫార్మెన్స్‌ సూపర్‌. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు అద్భుతంగా రాసి, బ్రిలియంట్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో అశోక్‌ చాలా సహజంగా కనిపించారు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. అశోక్‌ సెల్వన్‌, రితికా సింగ్‌ హీరో, హీరోయిన్లు తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ మూవీ తమిళ్‌లో మంచి విజయం సాధించింది. దీని డిజిటల్‌ రైట్స్‌ జీ5 సొంతం చేసుకుంది. కాగా, సౌత్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభినందనలకు ‘ఓ మై కడవులే’ చిత్రం యూనిట్‌ హ్యాపీగా ఫీలైంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆశోక్‌ స్పందించాడు.

Also Read: ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ

‘థాంక్యూ సో మచ్‌ సర్‌! నేను మీకు పెద్ద ఫ్యాన్‌. మా సినిమాను మీరు చూసి అభినందిచటంతో నేను ఇక్కడ డ్యాన్స్‌ చేస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా హీరోయిన్‌ రితికా సింగ్‌ (గురు ఫేమ్‌) ‘ఓ మై గాడ్‌. ఇది నిజమేనా? థాంక్యూ సో మచ్‌ సర్‌! మీ నుంచి వచ్చిన అభినందనలతో మాకు ఈ రోజు చాలా గొప్పగా మారింది’ అంటూ ట్వీట్‌ చేసింది. మహేశ్‌ అభినందనతో తన మైండ్‌ బ్లాక్‌ అయిపోయిందని డైరెక్టర్ అశ్వత్‌ పేర్కొన్నాడు.

https://twitter.com/urstrulyMahesh/status/1284547359473467392

జగన్ కు మరో లేఖ రాసిన రామకృష్ణంరాజు..

MP Raghurama Krishnam Raju

MP Raghurama Krishnam Raju

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారానికి ఓ లేఖ రాస్తూ…రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఎత్తిచూపుతున్న సర్సాపురం ఎంపీ రాఘురామ కృష్ణంరాజు తాజాగా సిఎంకు మరో లేఖ రాశారు. తాజాగా రాసిన లేఖలో గోశాల అభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గోశాల అభివృద్ధికి కమిటీలు వేశారని తెలిపారు. ప్రస్తుతం సింహాచలం దేవస్ధానంలో మూడు గోవులు మృతి చెందాయన్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గోశాలలో వంద ఆవులు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి గోశాలల అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ లేఖల రాసే అలవాటును బీజేపీ నుంచి వంట బట్టించుకున్నారా అంటే అవుననే నమాధానం వస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాష్ట్రంలో వివిధ సమస్యలపై ప్రతి వారం లేఖలు రాసి వంద లేఖలు అయిన అనంతరం పుస్తకంగా ప్రచురించారు. ఇప్పుడు సీఎం జగన్ కు అదే విధంగా లేఖలు రాస్తున్నారు. తెలంగాణా బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ హైదరాబాదులో ఉన్న సమయంలో సిఎం కేసీఆర్ కు వివిధ సమస్యలపై తరచూ లేఖలు రాసేవారు.

Also Read: సీటు మారినా పర్లేదు…ఫేటు మారకుండా చూసుకో రాజా..!

బీజేపీతో సన్నిహిత సంబందాలు ఉన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ నాయకుల తరహాలోనే ఇప్పుడు వారానికి ఓ సమస్యపై సిఎంకు లేఖలు రాస్తున్నారు. మొదటి లేఖలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు తగ్గించాలని, రెండవ లేఖలో భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు సాయం పంపిణీ చేయాలని, తాజా లేఖలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖలపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ స్పందించలేదు.

కేసీఆర్, జగన్.. అందులోనూ అన్నాదమ్ములే?

KCR and Jagan

KCR and Jagan

ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్ తో తెలంగాణ ధనికరాష్ట్రంగా మిగలగా.. రాజధాని కూడా లేకుండా ఏపీ 90వేల కోట్ల అప్పులతో నిట్టూరిచ్చింది. నాటి సీఎం చంద్రబాబు అమరావతి పేరిట ఐదేళ్లు గ్రాఫిక్స్ సినిమా చూపించి సంక్షేమ పథకాల కోసం మరింత అప్పు చేసి జగన్ చేతిలో పెట్టారు. ఇక తెలంగాణ సంపన్న మిగులు రాష్ట్రంను కేసీఆర్.. కాళేశ్వరం సహా సంక్షేమ పథకాల కోసం మరింతగా అప్పు చేసి అప్పుల కుప్పల్లో తెలంగాణను చిక్కుకునేలా చేశారు.

అయితే తమదైన పాలన మార్క్ చూపించాలని అన్నాదమ్ములుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అప్పులే అభివృద్ధికి సంకేతం అంటూ మరిన్ని అప్పులు చేసి ప్రజలపై సంక్షేమ జల్లు కురిపిస్తున్నారు. తాహతకు మించి అప్పులు చేస్తూ మళ్లీ ప్రజలపైనే భారం మోపుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం అప్పులు చేస్తూ తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నట్టు తాజా నివేదికలో తేలింది.

Also Read: కేంద్రం డబ్బు.. కేసీఆర్ పేరు?

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దేశంలో అప్పులు ఎక్కువగా తీసుకున్న రాష్ట్రాల అప్పుల కుప్పపై బులిటెన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలు అప్పులు తీసుకోవడంలో ముందంజలో ఉండడం విశేషం. అన్నాదమ్ములైన తెలుగు సీఎంలు కేసీఆర్, జగన్ లు అప్పులు తీసుకోవడంలోనూ పోటీపడడం గమనార్హం. జనాభా పరంగా దేశంలోనే మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అప్పులు తీసుకోవడంలోనూ నంబర్ 1గా నిలిచింది. దేశంలో అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో యూపీ నంబర్ 1 కాగా.. ఆ తర్వాత తమిళనాడు నిలిచాయి.

ఇక అప్పులు తీసుకోవడంలో దేశంలోనే మూడో స్థానాన్ని మన ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఏపీలో అప్పులు 42శాతం పెరిగాయి. గత ఏడాది ఏపీలో 6వ స్థానంలో ఉండగా.. ఈ సంవత్సరం మరిన్ని అప్పులు తీసుకొని 3వ స్థానానికి చేరింది.

Also Read: మామ సీటు కోసం అల్లుడి వేషాలు..!

ఇక తెలంగాణలో అప్పుల భారం 38శాతం పెరిగింది. అప్పులు తీసుకోవడంలో గత ఏడాది తెలంగాణ 9వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 6వస్థానంలో ఉంది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు స్థానాలు పైకి ఎగబాకి అప్పులు తీసుకోవడంలో ముందంజలో నిలిచాయి. ఇలా దేశంలోనే అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో ప్రముఖంగా నిలిచాయి. కేసీఆర్, జగన్ లు ఏకంగా మూడు మూడు స్థానాలు ఎగబాకడం విశేషం.

ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

Power Star Trailer Price

Power Star Trailer Price

లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్స్‌ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. మూవీ షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడుతుంటే సెన్సేషనల్‌ డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారారు. షూటింగ్స్‌ చేయడమే కాదు వాటిని ఆన్‌లైన్ రిలీజ్‌ చేసి తెగ సంపాదిస్తున్నాడు. గంటలు, రోజుల వ్యవధిలో సినిమాలు పూర్తి చేయడమే కాకుండా.. డిజిటల్‌ మార్కెట్‌ ద్వారా వాటిని రిలీజ్‌ చేసి తెగ సంపాదిస్తున్నాడు. సోషల్‌ మీడియాను తనదైన రీతిలో వాడేసుకుంటూ పైసా ఖర్చు లేకుండా తన మూవీస్‌కు ప్రమోషన్‌ కల్పిస్తున్నాడు.

కంటెంట్‌ లేని చిత్రాలు తీసి, ట్రైలర్స్‌తో హీట్‌ పెంచి అసలు సినిమాలతో ఉసూరుమ నిపించడంలో వర్మ ముందుంటాడు. త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్‌, న‌గ్నం వంటి మూవీలను రిలీజ్ చేశాడు. నగ్నం కేవలం నాలుగు లక్షల రూపాయలతో తీస్తే ఏకంగా 40 లక్షల పైనే వచ్చాయని సమాచారం. కేవలం 20 నిమిషాల మూవీకి రాము వంద రూపాయాలు చార్జ్‌ చేశాడు. అదేమంటే చూస్తే చూడండి లేదంటే లేదు అంటున్నాడు. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన రాము.. ఇప్పుడు ట్రైలర్ చూపించేందుకూ చార్జ్‌ చేస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ విషయంలో అదే చేస్తున్నాడు.

Also Read: ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ

తాజాగా ‘ప‌వ‌ర్ స్టార్’ సినిమా విడుద‌ల గురించి ఆర్జీవీ అనౌన్స్ చేశారు. ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ లో జులై 25 ఉద‌యం 11గంట‌ల‌కు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. అంతకంటే మూడు రోజుల ముందు.. అంటే జులై 22న మూవీ ట్రైలర్ను రిలీజ్‌ చేస్తానని తెలిపాడు. ట్రైలర్ రిలీజ్‌ అంటే అందరూ యూట్యూబ్‌ వైపు చూస్తారు. కానీ, ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రావడం లేదు. ‘ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్’లోనే ఉంటుందని, ఒక సారి ట్రైలర్ చూడాలంటే రూ.25 క‌ట్టి చూడాలన్నాడు. దీనికి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమైన‌ట్లు తెలిపాడు. అంతేకాదు ఇది ప్రపంచంలోనే ఫస్ట్‌ పెయిడ్‌ ట్రైలర్ అని గొప్పలు చెప్పుకుంటున్నాడు.

ఈ సినిమా కోసం రూ. 150తో పాటు జీఎస్టీ క‌ట్టి టికెట్లను బుక్ చేసుకోవ‌చ్చన్నాడు. ఈ ఆఫ‌ర్ జులై 25 ఉద‌యం 11గంట‌ల వ‌ర‌కు మాత్రమే ఉంటుందని తెలిపాడు.లేదంటే బ్లాక్ టికెట్లు కొనాల్సి వస్తుందంటున్నాడు. ఇప్పటికే పలు ఇంట్రస్టింగ్ పోస్టర్స్‌తో ‘పవర్స్టార్’పై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచాడు.
Also Read: కరోనాతో సీనియర్ నటుడి మృతి

కేంద్రం డబ్బు.. కేసీఆర్ పేరు?

CMKCR

CMKCR
సామాన్యులకు ఎంత లబ్ధి చేకూరిందనేదే ముఖ్యం.. ఆ డబ్బు కేంద్రం ఇచ్చిందా? రాష్ట్రం సమకూర్చిందా అన్న వివరాలు అనవసరం. తమను ప్రభుత్వం ఆదుకుందా? ఏ ప్రభుత్వం ఆదుకుంది? ఎవరికి ఓటేయాలన్నదే చూస్తారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు హైజాక్ చేసి తమ పథకాలుగా మార్చేసి పేదలకు పంచేస్తున్నాయి. కేంద్రం డబ్బు.. రాష్ట్ర ప్రభుత్వాలకు పేరు వస్తుంటుంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పథకాలను చాలా తెలివిగా వాడేస్తుంటారనే ప్రచారం ఉంది. మూడో కంటికి తెలియకుండా నిధులను చాకచక్యంగా తన సొంత టీఆర్ఎస్ ప్రభుత్వ పథకంగా మలిచేస్తాడని అంటుంటారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పలు టీఆర్ఎస్ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఆధారాలు కూడా చూపించి ఎండగట్టారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

Also Read: కేసీఆర్ ను ఇరుకునపెడుతున్న మంత్రులు..!

సాధారణంగా మొదటి నుంచి కేసీఆర్ తన ప్రభుత్వ పథకాలకు ఏ రాజకీయ నాయకుడు, గొప్పగొప్ప వాళ్ల పేర్లు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన పథకాలు అన్ని జనంలోంచి వచ్చేవిగానే ఉండేవి. లేదంటే దేవుళ్లు, దేవతల పేర్లు పెడతారు. కానీ కొన్ని రోజులుగా ఆ ట్రాక్ మార్చేశారు. బాలింతలకు ఇచ్చే కిట్స్ కు కేసీఆర్ కిట్ గా నామకరణం చేశారు.

నిజానికి ప్రతీ పథకానికి ఇందిర, రాజీవ్ వంటి దివంగతుల పేర్లను కాంగ్రెస్ పార్టీ బాగా పెట్టేది. అదో కుటుంబ పార్టీగా ముద్ర పడింది. ఇప్పుడు కేసీఆర్ మాత్రం మెల్లిగా ఆ దారిలోకి వస్తున్నారు.

ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్లను కట్టించి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఆ జిల్లా కలెక్టర్ దీనికి ‘కేసీఆర్ కాలనీ’గా నామకరణం చేశారు.

Also Read: వలసలతో ఏపీకి పెరగనున్న కరోనా ముప్పు..!

అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ నిధులను ఇచ్చిందని.. దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఇల్లను నిర్మించాలనే ప్రతిష్టాత్మక పథకంలో ఇవి కట్టారని తెలిసింది.

అయితే మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం మాత్రం కేంద్రం నిధులతో కట్టిన ఈ కాలనీకి కేసీఆర్ పేరు పెట్టడం విశేషం. దీంతో సొమ్ము కేంద్రానికి.. సోకు కేసీఆర్ ది అని బీజేపీ నేతలు ఈసడించుకుంటున్నారు.

ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ

Janhvi Kapoor to Work With JR NTR

Janhvi Kapoor to Work With JR NTR

శ్రీదేవి. అందాల తార. అతిలోక సుందరి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంలోనే కాదు బాలీవుడ్‌నూ ఒక ఊపు ఊపిన దిగ్గజ హీరోయిన్‌. శ్రీదేవి చనిపోయి రెండేళ్లు అవుతున్నా.. ఆమెను ఎవ్వరూ మరచిపోవడం లేదు. బతికుండగానే తన నటవారసురాలిగా పెద్ద కూతురు జాన్వీ కపూర్ (జాహ్నవీ) ను వెండితెరకు పరిచయం చేసిందామె. తాను ఎదిగిన తెలుగులోనే జాన్వీ ఇంట్రడ్యూస్‌ చేస్తుందని అనుకున్నా.. బాలీవుడ్‌ మూవీ ‘ధడక్’‌తో పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా జాన్వీ కపూర్‌ను తెలుగు తెరకు పరిచయం చేయాలని ఇప్పటికే చాలా మంది దర్శక, నిర్మాతలు పలు ప్రయత్నాలు చేశారు.

అలాగే ఫలానా హీరోతో జాన్వీ నటించబోతోందనే వార్తలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. చిరంజీవి, శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని రామ్‌చరణ్‌, జాన్వీతో రీమేక్‌ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ వర్కౌట్‌ కాలేదు. ఈలోపు జాన్వీ హిందీలో మూడు, నాలుగు సినిమాలకు సైన్‌ చేసి బిజీగా మారిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘గుంజాన్‌ సక్సేనా’ వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కాబోతోంది. అయితే, మరో మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉండగా.. ఇంకో మూవీ సెట్స్‌పై ఉంది. ఇవన్నీ హిందీ మూవీసే.

Also Read: రెండో ‘బిచ్చగాడు’ వస్తున్నాడు..

తాజా సమాచారం మేరకు ఆమె తెలుగులో అడుగుపెట్టబోతోందట. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందే పాన్‌ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ నటించనుందట. ఇటీవలే బోనీకపూర్‌, జాన్వీకి దర్శకుడు త్రివిక్రమ్‌ కథ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కథ వారికి బాగా నచ్చిందని సమాచారం. ఎలాగూ పాన్‌ ఇండియా మూవీ, పైగా ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరోతో తెలుగులో జాన్వీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని భావించిన బోనీ ఈ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు టాలీవుడ్‌ టాక్‌. అదే టైమ్‌లో ఇప్పుడు తెలుగు సినిమాల పరిధి చాలా పెరిగింది. బోనీ కపూర్ కూడా పవన్‌ కళ్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’కు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.

Also Read: దీపికతో కాదు కియారాతో ప్రభాస్ రొమాన్స్‌!

తెలుగు పరిశ్రమలో పలువురు ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ఇప్పుడిప్పుడే స్టార్డమ్‌ తెచ్చుకుంటున్న జాన్వీని తెలుగులో కూడా ఇంట్రడ్యూస్‌ చేస్తే బాగుటుందని ఫిక్సయ్యారట. కాగా, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోయే ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ మూవీకి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది.