Home Blog Page 8400

సమంతా, పూజా హెగ్డే, రష్మిక వర్కవుట్ వీడియో వైరల్


టాలీవుడ్ నటీమణుల అందాల వెనుక రహస్యం ప్రతివారూ తెలుసుకోవాలనుకుంటారు. వారు ఫిట్‌నెస్ గా ఉండడం కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేయడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తారు . ముగ్గురు టాలీవుడ్ అందమైన నటీమణులు పూజా హెగ్డే, సమంతా మరియు రష్మిక మండన్న ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో ఎంతగా కష్ట పడుతున్నారో మీరు చుడండి.

https://youtu.be/EzzACu5MIMs

 

జగన్ దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమేనా ఇది?


టీడీపీ వైసీపీ పార్టీల మధ్య విగ్రహాల రాజకీయం మొదలైంది. ఇటీవల కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించినట్లు అధికారులు చెప్పడం జరిగింది. స్థానిక టీడీపీ కార్యకర్తలు, నేతలు దీనిని తీవ్రంగా విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే, ఉద్దేశ పూర్వకంగా కూల్చి వేశారని అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు, చందాలతో ఏర్పాటు చేసుకున్న తన ప్రియతమ నాయకుడి విగ్రహాన్ని కక్ష పూరితంగా తొలగించారంటూ ఆరోపించడం జరిగింది. ఇక నారా లోకేష్ ట్విట్టర్ లో సదరు వీడియో పోస్ట్ చేయడంతో పాటు ఇది… వైసీపీ ప్రభుత్వ దుశ్చర్యగా అభివర్ణించారు.

22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..

అలాగే టీడీపీ నేతలు అందరూ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఐతే ఇది సీఎం జగన్ ఫాలో అవుతున్న దెబ్బకు దెబ్బ సిద్ధాంతంలో భాగమే అని కొందరు భావిస్తున్నారు. 2012లో పోలవరం ప్రాజెక్టు నమూనాతో విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్లో వైఎస్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 12 అడుగుల ఎత్తయిన ఈ కాంస్య విగ్రహాన్ని రూ.30 లక్షల ఖర్చుతో నాటి ఎంపీ లగపాటి రాజగోపాల్ సమకూర్చారు. దీన్ని తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేటలో శిల్పి వడయార్ రూపొందించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని 2016లో అర్థ రాత్రి చడీ చప్పుడు లేకుండా తొలగించారు. జగన్ అధికారంలోకి వచ్చాక వైస్ విగ్రహాన్ని అదే స్థానంలో మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.

కన్నాపై అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా?

అప్పటి టీడీపీ ప్రభుత్వం వైస్ విగ్రహం పట్ల చేసిన అవమానకర చర్యకు ప్రతీకారమే కావలిలో ఎన్టీఆర్ విగ్రహ తొలగింపు అని కొందరు అంటున్నారు. అలాగే కావలిలో మరో చోట ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనుండగా, దాని ఆవిష్కరణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి పిలవాలనేది వైసీపీ నేతల ఆలోచనట. ఈ నిర్ణయం టీడీపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లు అవుతుంది. ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్న ఈ విగ్రహాల రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి

ఆమంచి ఆధిపత్యానికి గండికొట్టిన కరణం..!


టీడీపీ స్థాపించినప్పటి నుండీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులలో ఎమ్మెల్యే కరణం బలరాం ఒకరు. కెరీర్ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం ఒకసారి ఎంపీగా కూడా చేశారు. టీడీపీ పార్టీ నాయకుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన, కారణం ఏమిటో కానీ చంద్రబాబుపై తిరుగుబాటు మొదలుపెట్టాడు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కరణం బలరాం టీడీపీలో రెబెల్ ఎమ్మెల్యే గా మారడం చాల మందిని షాక్ కి గురిచేసింది. ఐతే కరణం బలరాంలో అసహనం పురుడు పోసుకోవడానికి కారణం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని పార్టీలోకి తీసుకోవడమే.

2014 ఎన్నికలలో గొట్టిపాటి రవికుమార్ పై ఓడిపోయిన బలరాం, అధికారం టీడీపీకి దక్కడంతో ఓడినా నియోజకవర్గంలో చక్రం తిప్పవచ్చు అనుకున్నారు. ఐతే వైసీపీ తరపున ఎమ్మెల్యే గా గెలిచిన గొట్టిపాటిని బాబు పార్టీలోకి బలవంతగా లాక్కొని, అధికార పార్టీ ఎమ్మెల్యేని చేశాడు. దీనిటో బలరాం హవా అక్కడ తగ్గింది. ఇక గత ఎన్నికల్లో కూడా బాబు బలమైన అభ్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఎదుర్కోవడానికి, కోరిన నియోజక వర్గం కాకుండా, చీరాల నియోజక వర్గం సీటు ఇవ్వడం జరిగింది. ఆమంచి కృష్ణ మోహన్ పై ఉన్న వ్యతిరేకత ఆయనకు విజయాన్ని కట్టబెట్టింది.

జగన్ ఎస్ అంటే వైసీపీలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్న బలరాం, ముందుగా తన కుమారుడిని వైసీపీలో చేర్చారు. టీడీపీలో రెబెల్ ఎమ్మెల్యే గా ఉంటూ, వైసీపీకి అనుకూలుడుగా ఉంటున్నారు. బలరాం వైసీపీకి దగ్గర కావడం చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచికి చిక్కులు తెచ్చిపెట్టింది.ఓడినా, మొన్నటి వరకు చీరాల నియోజక వర్గంలో హవా మొత్తం ఆమంచిదే. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంజీవని కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనాన్ని కరణం బలరాం ప్రారంభించారు. ఇక సీఎం జగన్ ఆమంచికి పక్కనే ఉన్న పర్చూరు నియోజక వర్గ ఇంఛార్జిగా బాధ్యతలు అప్పగించనున్నాడట. స్థానికంగా పాతుకుపోయిన ఆమంచికి పర్చూరు వెళ్లడం ఇష్టం లేదు. కానీ మరోదారి లేని ఆమంచి జగన్ సూచనలు పాటించక తప్పని పరిస్థితి. పదేళ్లుగా చీరాల నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యం చేస్తున్న ఆమంచికి కరణం చెక్ పెట్టారనేది లోకల్ టాక్.

కంగనా vs తాప్సీ… ‘బీ గ్రేడ్‌’ ఫైట్


కరోనా టైమ్‌లో బాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్‌ ఆగిపోయినా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో బంధుప్రీతి, మూవీ మాఫియాపై రోజూ చర్చ జరుగుతూనే ఉంది. పలువురు బడా హీరోలు, దర్శక, నిర్మాతలు వారి వారసులపై ఏదో రకంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కరణ్‌ జోహార్, సల్మాన్‌ ఖాన్‌, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఈ దాడిలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ముందుంది. బంధుప్రీతి కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని కంగనా ఆరోపించింది. వాటిని రుజువు చేయకపోతే తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తా అని సవాల్‌ విసిరింది. అంత వరకు బాగానే తనలాగే ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తాప్సీ పన్నును ఈ వివాదంలోని లాగింది కంగనా. నెపోటిజమ్‌ డిస్కషన్స్‌లో భాగంగా తాప్సీతో పాటు స్వరా భాస్కర్‌లను ‘బీ గ్రేడ్‌ యాక్టర్స్‌’ అని కంగనా రనౌత్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

వయసు అయిపోయాక స్పీడ్ అందుకుంది !

బాలీవుడ్‌లో బ్యాగ్రౌండ్‌ లేని వాళ్లు చాలా ఇబ్బందులుపడుతున్నారని చిత్రీకరించేలా కొందరు ప్రవర్తిస్తున్నారని, దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చాలా భయపడతారని ఓ ఇంటర్వ్యూ తాప్సీ అభిప్రాయపడింది. అలాగే, కరణ్‌ జోహార్ మంచివాడని, ఏ బ్యాక్‌గ్రౌండ్‌లేని తాను బాలీవుడ్‌లో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నానని తాప్సీ చెప్పడం మింగుడు పడని కంగనా ఆమెను బీ గ్రేడ్‌ నటి అని అవహేళన చేసింది. తాప్సి, స్వరను అత్యాశతో ఉన్న ఔట్‌సైడర్స్‌ అని, అయితే ఆలియా భట్‌, అనన్యా పాండే కంటే మంచి యాక్టర్లే అని అభిప్రాయపడింది. అయితే, దీనిపై తాప్సీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ‘పది, పన్నెండు తరగతుల స్టూడెంట్స్‌ ఫలితాల తర్వాత మా రిజల్ట్స్‌ కూడా వచ్చాయని విన్నాను. మా గ్రేడ్‌ సిస్టమ్‌ ఇప్పుడు అధికారికమేనా? ఇప్పటివరకు నెంబర్‌ సిస్టమ్‌ అనుకున్నానే. దాని ద్వారానే మా వ్యాల్యూ డిసైడ్‌ చేస్తారని అనుకున్నా’ అంటూ కంగనాను ఉద్దేశిస్తూ ట్విట్టర్లో వ్యంగ్యాస్త్రాలు విసిరింది తాప్సీ. మరోవైపు కంగనా కామెంట్‌ను కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని స్వరా భాస్కర్ ట్వీట్ చేసింది. ఇంకోవైపు తాప్సీకి పలువురు స్టార్ హీరోయిన్లు మద్దతు ఇస్తున్నారు. దాంతో, ఈ వివాదం మరింత పెద్దదయ్యేలా ఉంది.

మణిరత్నం ‘నవరస’ సిరీస్‌లో తెలుగు స్టార్లు!


కరోనా కష్టకాలంలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కనిపిస్తున్న ఏకైక మార్గం డిజిటల్‌ మీడియా. ఓటీటీ, ఏటీటీ.. పేరేదైనా గానీ ఫ్యూచర్ డిజిటల్‌ మీడియాదే. ఈ వాస్తవాన్ని గ్రహిస్తూ.. సినీ ప్రముఖులు ఇప్పుడిప్పుడే ఓటీటీల బాట పడుతున్నారు. వాళ్లే కాదు స్టార్లు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్యా మీనన్, ప్రియమణి తదితరులు హిందీ వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. దర్శకుడు క్రిష్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ కోసం పని చేస్తున్నారు. నవదీప్‌, ప్రియదర్శి, సందీప్‌ కిషన్‌, సత్యదేవ్‌, బిందు మాధవి, హెబ్బా పటేల్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు.ఇప్పుడు పలువురు తెలుగు స్టార్ హీరోలు కూడా వెబ్‌ సిరీస్‌కు జై కొట్టబోతున్నారు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది ఎపిసోడ్స్‌ తీసేలా మణిరత్నం వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేశాడు. ఆయనతో పాటు గౌతమ్‌ మీనన్, కార్తీక్‌ నరేన్‌, నంబియార్, హీరోలు సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి మరో ముగ్గురు దర్శకులు ఒక్కో ఎడిసోడ్‌కు డైరెక్షన్‌ వహిస్తారు. నవరసాల్లోని ఒక్కో ఎమోషన్‌ను ఒక్కో ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు. ఎపిసోడ్‌కు ఒకరు చొప్పున తొమ్మిది మంది హీరోలు నటిస్తారని సమాచారం.

చిన్న సినిమాలకు ఇది బంపర్ ఆఫరే !

ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోలు సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి, మాధవన్‌ నటిస్తారని, సూర్య విలన్‌గా క్యారెక్టర్ కు ఒప్పుకున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి . తాజా సమాచారం మేరకు పలువురు తెలుగు స్టార్ హీరోలను సైతం ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురావాలని మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడట. అలా చేస్తే హిందీతో పాటు దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్‌కు ఉపయోగ పడుతుందని అనుకుంటున్నారట. అందుకోసం సీనియర్ హీరో అక్కినేని నాగార్జున్‌తో పాటు ఆయన కొడుకు నాగ చైతన్య, నాని, కార్తికేయ వంటి యంగ్‌స్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే, తెలుగు నుంచి ఒక్కరే కావాలా? ఎక్కువ మందిని తీసుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే, టాలీవుడ్లో ఎవరు ఒప్పుకున్నా ఈ వెబ్‌ సిరీస్‌కు మరింత క్రేజ్ రావడం ఖాయమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

సమాంతర రాజకీయ పరిణామాలు: రామ మందిరం, సచిన్ పైలట్

రామమందిర నిర్మాణం – రాజకీయ కోణం   

ఎట్టకేలకు రామమందిర నిర్మాణం మొదలవుతుంది. ఆగస్ట్ 5వ తేదీ భూమి పూజ ముహూర్తం ఖరారయ్యింది. ప్రధానమంత్రి మోడీ స్వయంగా హాజరవుతున్నట్లు ద్రువీకరించబడింది. మాములుగానయితే ఇది రొటీన్ లో భాగంగా జరిగిపోయేదేమో. ఇప్పుడు దీనికి శరద్ పవార్ వ్యాఖ్యానంతో దేశవ్యాప్త చర్చ మొదలయ్యింది. శరద్ పవార్ ఇప్పుడున్న సమాంతర రాజకీయ నాయకుల్లో సీనియర్, రాజకీయాల్లో ఆరితేరిన చాణిక్యుడు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అందరికన్నా పైఎత్తులో వున్నవాడు. ప్రధానమంత్రి మోడీతో సహా అందరూ తనమాటకి గౌరవం ఇస్తారు. కాకపోతే అప్పుడప్పుడు వివాదాల్లో చిక్కుకుంటాడు. ఆయన ఆగస్టు 5వ తేది భూమి పూజపై తనదైన నర్మగర్భ వ్యాఖ్యానం చేసాడు. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అదేమీ వివాదాంశం కాదు. 100 కోట్ల హిందువుల మనోభావాలకి సంబంధించినది కూడా. అయినా రామమందిర నిర్మాణం పై అలాంటి వ్యాఖ్యానం చేయటం వెనక ఆంతర్యం ఏమిటనేది పరిశీలకులు పలు విధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘కొంతమంది రామమందిర నిర్మాణంతో కరోనా మహమ్మారిని అరికట్ట వచ్చని భావిస్తున్నారు’ అని చెప్పటం వ్యంగంగా రామమందిర నిర్మాణం పై అయిష్టతని వ్యక్తం చేయటమే. అలా ఎందుకు వ్యాఖ్యానం చేసాడో నని కొంతమంది తలలు పట్టుకుంటుంటే ఆయన అనుయాయులు మాత్రం ఇది వ్యూహాత్మకంగా చేసిందేనని సమర్ధించుకుంటున్నారు. మహారాష్ట్రలో మైనారిటీలు అటు కాంగ్రెస్, ఇటు ఎన్ సి పి ల మధ్య చీలి వున్నారు. ఆ వోటు బ్యాంకు పదిలం చేసుకోవటానికే ఇలా మాట్లాడని సమర్ధించుకుంటున్నారు. కానీ ఈ వ్యాఖ్యానం హిందువుల్లో శరద్ పవార్ పై ఆగ్రహం పెల్లుబికింది. శరద్ పవార్ పై సానుభూతి వున్నవాళ్ళు కూడా తను ఇలా మాట్లాడటం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని మహారాష్ట్ర లోని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ప్రధానమంత్రి ఈ భూమిపూజ కు హాజరు కావటాన్ని తప్పుపట్టాడు. సోమనాథ దేవాలయం పునరుద్దరణ తర్వాత ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వెళ్ళక పోవటాన్ని ఉదాహరణగా వుటంకించాడు. కానీ అదే సమయంలో ప్రధమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ హాజరైన సంగతి కావాలనే దాటవేశాడు. వాస్తవానికి నెహ్రూ వెళ్లోద్దని వారించినా రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యాడు. సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రపతి హాజరైనప్పుడు రామమందిరం కడతామని వాగ్దానం చేసిన బిజెపి కి చెందిన ప్రధాన మంత్రి ని వెళ్లోద్దని చెప్పటం హాస్యాస్పదంగా వుంది. మోడీ ని ఎటూ ఆపలేమని తెలిసినా ప్రకటన ఇవ్వటం లో ఉద్దేశం ఆపాలని కాదు , ముస్లిం వర్గాల్లో మేము వ్యతిరేకించామని చెప్పుకోవటం కోసమే నని అర్ధమవుతుంది.

నిజమే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అందరికీ సంబందించింది కాబట్టి మతపర కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పటం వినటానికి మంచిగా అనిపించొచ్చు. కానీ అసలు ఈ సూత్రబద్ధ వైఖరిని మొదట్నుంచీ అధికారం లో వున్న కాంగ్రెస్ ఎప్పుడూ పాటించలేదు. 72 సంవత్సరాలలో ఎక్కువకాలం అధికారం లో వున్న కాంగ్రెస్ నేర్పిన సంస్కృతి ఇదే కదా. ఇప్పుడు సడెన్ గా వీళ్ళకు సెక్యులరిజం గుర్తుకు రావటం ఆశ్చర్యంగా వుంది. ఇంత డొంక తిరుగుడేందుకు మాకు రామ మందిర నిర్మాణం ఇష్టంలేదని డైరెక్టుగా చెప్పొచ్చు కదా. ఇటువంటి చేష్టల వలన మెజారిటీ హిందువుల్లో రోజు రోజుకీ విశ్వాసం కోల్పోతున్నారని వీళ్ళకు అర్ధం కావటం లేదు. అదీ ఈ అంశం ఎన్నో ఏళ్ళనుంచి అపరిష్కృతంగా వుండి  ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మరలా అగ్గి రాజేయ్యటం అవసరమా? ఇదే ముస్లిం మత ప్రాధాన్య అంశ మయితే మాట్లాడే వాళ్ళా? ఈ నకిలీ సెక్యులరిజం తోనే ఇబ్బందల్లా. ఇన్ని వందల సంవత్సరాలుగా నలుగుతున్న ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం దొరికినందుకు సంతోష పడాల్సింది పోయి మరలా దీన్ని కెలుక్కోవటం దేనికి? మైనారిటీ ఓట్ల కోసమేనా? ఇప్పటికైనా ఈ సమస్యకు ఫులుస్టాప్ పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిది. ప్రజలు ఇప్పటికే మతపరంగా విభజించబడి వున్నారు. ఇంకా ఈ క్రీడ కొనసాగించాలని ఈ ‘ సెక్యులరిస్టులు’ కోరుకుంటున్నారా?

సచిన్ పైలట్ నిజంగా అంత దుర్మార్గుడా?

గాంధీ కుటుంబ విధేయులు అదేపనిగా సచిన్ పైలట్ పదవీ వ్యామోహపరుడని, డబ్బులు ఇవ్వజూపాడని, ఇంత యుక్త వయసులోనే అంత పదవీ కాంక్ష పనికిరాదని అన్ని ప్రచార మాధ్యమాల్లోనూ పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అశోక్ గెహ్లాట్ అయితే ఇంకా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యమేమంటే ఎటువంటి అర్హతలు లేని రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు గా వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యానాలు చేయలేదే. అప్పటికి తను చేసిన ఘనకార్యం ఒక్కటి కూడా లేదు. అయినా అధ్యక్షుడయ్యాడు. అటువంటిది పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి ఇటుకమీద ఇటుక పేర్చుకుంటూ వచ్చి అయిదు సంవత్సరాల్లో బిజెపి ని డీ అంటే డీ కొట్టి తిరిగి అధికారం లోకి తీసుకొచ్చిన ఘన కార్యం సాధించిన సచిన్ పైలట్ కి మాత్రం అర్హతలేదు. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా దొడ్డిదారిన అధిష్టానం మెప్పుతో వచ్చి బిఎస్పి బానర్ లో ఎన్నికైన ఆరుగురు ఎంఎల్ఏల ను అమాంతం తన పార్టీలో కలిపేసుకున్నప్పుడు ఈ నీతి రాజకీయాలు ఏమైనాయి? వాళ్ళందరూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండానే కాంగ్రెస్ లో చేరారా? ఇప్పుడున్న సమాంతర రాజకీయాల్లో నూటికి నూరుపాళ్ళు నీతిమంత రాజకీయాలను వెతకటం నేతి బీరకాయలో నేయిని వెదికినట్లే. కాకపోతే వున్నవాళ్లలో మెరుగెవరో వెదుక్కోవాల్సిందే. ఈ రకంగా చూస్తే రాజస్తాన్ లో కాంగ్రెస్ ని తిరిగి అధికారం లోకి తీసుకురావటం లో సచిన్ పైలట్ ది కీలకపాత్ర. అందరిలాగా డిల్లీ నుంచి చక్రం తిప్పకుండా జైపూర్ కి మకాం మార్చి అయిదు సంవత్సరాలు కష్టపడి పార్టీని నడిపించిన తీరు అన్ని వర్గాల్లోనూ ప్రశంసలు కురిపించింది. ఈరోజు తనని, తన క్యారక్టర్నిదెబ్బ తీసేపనిని అదేపనిగా చేయటం మొదటికే మోసమొస్తుందని గ్రహిస్తే మంచిది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో సచిన్ పైలట్ వ్యవహారం ఓ కుదుపు కుదిపిందని అనిపిస్తుంది.

అసలు కాంగ్రెస్ మీదా, గాంధీ కుటుంబం మీదా ఇంత ప్రతికూలత ఎప్పుడూ లేదు. ఒక ప్రజాస్వామ్య, ఉదారవాద జాతీయ పార్టీ గాంధీ కుటుంబ రహితంగా ఏర్పడటానికి భూమిక ఇప్పుడు ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన సానుకూల వాతావరణాన్ని దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త జాతీయ పార్టీకి పునాదులు పడేటట్లు చేయాలి. అందుకు సచిన్ పైలట్ పూనుకోవాలి. కొంతమంది వాదిస్తున్నట్లు ఇంతకుముందు ఎంతోమంది ఈ పనికి పూనుకొని బొక్కబోర్లా పడ్డారని ఇప్పుడు సచిన్ సంగతికూడా అంతేనని పెదవి విరుస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ లాంటి యోధాను యోదులే ఏమీ చేయలేకపోయారని ఈసారి కూడా ఇది వృధా ప్రయాస ప్రయోగమని చెబుతున్నారు. కానీ ఈ మేధావులు అర్ధంచేసుకోవాల్సింది ఏమిటంటే పరిస్థితుల్లో అప్పటికీ ఇప్పటికీ ఎన్నో మార్పులు వచ్చాయని. ఇప్పుడు 21వ శతాబ్దపు తరం మనుషుల్లో ఆలోచనలు, ఆకాంక్షలు విన్నూత్నంగా వున్నాయి. సంప్రదాయ ఆలోచనలు వీళ్ళను ప్రభావితం చేయలేవు. గాంధీ కుటుంబం పూర్తి గా స్వయం వినాశన పంధాలో నడుస్తుంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ కుటుంబం ఇంకా అప్రతిష్ట పాలు కావటం ఖాయం. మోడీ-అమిత్ షా ద్వయం ఈ పనిని పటిష్టంగా నెరవేరుస్తారు. ప్రజల్లో ఈ కుటుంబ పరువు, ప్రతిష్ట అధః పాతాళానికి వెళ్ళటం ఖాయం. అదేసమయం లో జాతీయ స్థాయి లో రెండో ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఎంతయినావుంది. ఆ ఆలోచన కూడా ప్రజల్లో బలంగా వుంది. సచిన్ పైలట్ కి శరద్ పవార్ కున్న స్థాయి, అంగబలం, అర్ధబలం లేకపోవచ్చు. కానీ ఎంతోమంది ఈ ఆలోచనలున్నవాళ్ళు వెన్నంటి నడిచే అవకాశం వుంది. కావాల్సిందల్లా పట్టుదల, ఓర్పు, మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్ష. ఇప్పటికే బిజెపి కొత్త తరాన్ని పట్టుకోవటంలో చాలా ముందుంది. కానీ దానికి కొన్ని పరిమితులు కూడా వున్నాయి. 21వ శతాబ్దపు తరం మతం, కులం, ప్రాంతం లాంటి విషయాల్లో విన్నూత్నంగా ఆలోచిస్తున్నారు. వాటిని ఒడిచిపట్టేపార్టీని కనుక వాళ్ళముందు వుంచగలిగితే అందుకోవటానికి సిద్ధంగా వుంటారు. అమెరికాలో 2016 లో జరిగిన పరిణామాలు చూస్తే ఈ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్ధమవుతుంది. రెండు పార్టీల్లోనూ సంప్రదాయ పద్ధతుల్ని కాదని ఓటు వేసారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా ట్రంప్ ఎన్నిక ఇందుకు ఉదాహరణ. అలాగే డెమోక్రటిక్ అభ్యర్ధి గా బెర్నీ సాండర్స్ తుదిదాకా రావటం కూడా కొత్త తరపు ఆలోచనలు ఎవరి అంచనాలకి అందవని అర్ధమయ్యింది. మన దేశం లో కూడా ప్రజల్లో బిజెపి కి సరయిన ప్రత్యామ్నాయం లేదనే భావం బలంగా వుంది. ఆ ప్రత్యామ్నాయం గాంధీ కుటుంబం ద్వారా రాదని కూడా అదే భావన వుంది. కాబట్టి గాంధీ కుటుంబ రహిత జాతీయ పార్టీ నిర్మాణమే ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా వుంటుంది. ఆ పని సచిన్ పైలట్ చేస్తాడని ఆశిద్దాం.

మహేశ్‌ మెచ్చిన మూవీ రీమేక్‌లో విశ్వక్‌సేన్!


‘వెళ్లపోమాకే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన హీరో విశ్వక్‌సేన్. ఫస్ట్‌ మూవీనే దిల్‌ రాజు బ్యానర్లో చేశాడు. కానీ, ఆ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, తరుణ్‌ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు విశ్వక్. ఆపై, స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్‌నుమా దాస్‌’తో ప్రేక్షకుల మందుకొచ్చాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఫ్యాన్‌ ను మెప్పించాడు. కానీ, ఆ మూవీ అనేక వివాదాలు సృష్టించింది. అలాగే, వివిధ వేదికలపై కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్‌ చేసిన విశ్వక్‌పై రెబల్‌ ముద్ర పడింది. అయితే, యూత్‌ ఆడియన్స్‌ మెచ్చే సినిమాలతో ముందుకెళ్తున్న అతను ఈ మధ్యే ‘హిట్‌’తో మంచి హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ‘పాగల్’ అనే మూవీ చేస్తున్నాడు.

Also Read:ట్రైలర్కూ పైసలు వసూలు చేస్తున్న ఆర్జీవీ

దాని తర్వాత విశ్వక్‌ ‘ఓ మై కడవులే’ అనే తమిళ్‌ సూపర్ హిట్‌ మూవీ తెలుగు రీమేక్‌ చేస్తాడని తెలుస్తోంది. అశోక్‌ సెల్వన్‌, గురు ఫేమ్‌ రితికా సింగ్‌ హీరో, హీరోయిన్లు తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ మూవీ తమిళ్‌లో మంచి విజయం సాధించింది. రీసెంట్‌గా ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఫిదా అయ్యాడు. ‘ఓ మై కడవులే చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశా. మూవీలో అందరి పెర్ఫార్మెన్స్‌ సూపర్‌. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు అద్భుతంగా రాసి, బ్రిలియంట్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో అశోక్‌ చాలా సహజంగా కనిపించారు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు. చిత్ర బృందం కూడా మహేశ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.ఈ మూవీ తెలుగు రైట్స్‌ నిర్మాత పీవీపీ కొనుగోలు చేశారని, హీరోగా విశ్వక్‌ అయితే బాగుంటుందని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్ డైలాగ్స్‌ రాస్తే బాగుటుందని పీవీపీకి విశ్వక్‌ సూచించాడు. పీవీపీ కూడా సరే అనడంతో తరుణ్ ఆ పనిలో ఉన్నాడని తెలుస్తోంది. మరోవైపు మలయాళ హిట్‌ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌లో కూడా విశ్వక్‌ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి..

22న బలపరీక్ష.. ఉత్కంఠగా రాజస్థాన్ రాజకీయం


ఎడారి రాజకీయాలు చివరికి చేరుకున్నాయి. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న సంక్షోభం చివరకు ప్రభుత్వానికి ఎసరు తెచ్చేలా మారుతోంది. డిప్యూటి సీఎం సచిన్ పైలట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తుండని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించిన సంగతి తెల్సిందే. సచిన్ పైలట్ తన మద్దతుదారులతో బీజేపీకి వెళుతున్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం సచిన్ పైలట్, అతడి మద్దతుదారులను పదవుల నుంచి తొలగించి షాకిచ్చింది.

Also Read: జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. సచిన్ పైలట్, అతడి మద్దతుదారులు బీజేపీ వస్తే స్వాగతిస్తామంటూ ఇప్పటికే ఆపార్టీకి చెందిన నేతలు బహిరంగగానే ఆహ్వానం పలికారు. మరోవైపు సీఎం అశోక్ గెహ్లాట్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు సవాల్ విసిరారు. ఈనేపథ్యంలోనే రాజస్థాన్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.

మరోవైపు సీఎం గెహ్లాట్ తనకు స్పష్టమైన మెజార్టీ ఉందని చెబుతూ ఈనెల 22న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్నాడు. 200మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సచిన్ పైలాట్ తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడింది. వీరిలో స్పీకర్ 19మందికి అనర్హత నోటీసులు ఇచ్చారు. అయితే తనకు 109మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గెహ్లాగ్ గవర్నర్ ను కలిసి విన్నవించడం ఆసక్తికరంగా మారింది.

Also Read: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై సీఎం స్పెషల్ ఫోకస్..!

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే షరతుతో గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు బీటీపీ పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్ రోయత్, రామ్ ప్రసాద్ ప్రకటించారు. అదేవిధంగా తిరుగుబాటు చేసిన నేతలు సైతం అధిష్టానం సూచనలతో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. 22న బలనిరూపణకు సిద్ధమవుతున్న గెహ్లాట్ కు పైలట్ వర్గం షాకిచ్చేందుకు రెడీ అవుతుందనే టాక్ విన్పిస్తుంది. అయితే రాజస్థాన్ రాజకీయాలు చివరంకానికి చేరడంతో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

టెస్టింగ్ కిట్స్ విషయంలో ఇంత నిర్లక్ష్యమా..?

Corona Testing kits

కరోనా టెస్టింగ్ కిట్స్ ని సప్లై చేయడంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఒకవైపు ఉంటే అంతే మొత్తంలో అధికారుల నిర్లక్ష్యం తేటతెల్లమౌతోంది. కరోనా టెస్టింగ్ కిట్స్ కొరతతో నగరంలో పలుచోట్ల టెస్టులు నిలిచాయి. కిట్స్ లేకపోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులు టెస్టింగులు నిలిపివేశారు. దీంతో టెస్టుల కోసం వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే కరోనాతో బెంబేలెత్తుతుంటే… కిట్స్ కొరత మరింత ఇబ్బందికరంగా మారిందని వాపోయారు.

దీనిపై అధికారులను మీడియా ప్రశ్నించగా.. శనివారం వరకు కరోనా ర్యాపిడ్ కిట్స్‌ తో 610 టెస్టులు నిర్వహించామని తెలిపారు. అయితే ఈరోజు ర్యాపిడ్ కిట్స్ లేకపోవడంతో టెస్టులు నిలిపివేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో టెస్టులకోసం వచ్చి వారు వెనుదిరుగుతున్నారు. మరోవైపు కొన్నిచోట్ల బోనాలు సెలవు కారణంగా టెస్టులు జరప లేదు. టెస్ట్ కోసం వచ్చిన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..


వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కొత్త మంత్రులను ప్రాంతాల ప్రాతిపదికన కాకుండా సామాజిక వర్గాల ప్రాతిపదికనే ఎంపిక చేశారు. మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వారిలో రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, శ్రీకాకుళం నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజులు ఉన్నారు. వీరిద్దరికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు.

ఎమ్మెల్సీ రేసు.. నేతల్లో పెరుగుతున్న టెన్షన్..!

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కొత్త మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది మంది ముఖ్య నేతలు, అధికారులు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఇస్తారు. మరోవైపు రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇప్పటికే తమ ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా సర్పించగా, గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది.

గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకట రమణ మత్యకార సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన స్థానంలో శ్రీకాకుళం జిల్లాలోని అదే సామాజిక వర్గానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు అవకాశం ఇచ్చారు. ఆయనకు మత్స్య, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు అప్పగించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాల్ కు మంత్రిగా అవకాశం లభించింది. ఆయనకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నారు.

జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?

బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇతర నేతలు కొందరు మంత్రి పదవులు కేటాయింపుపై అసంతృప్తితో ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ రేసులో ఉన్నారు. జోగికి మంత్రి పదవి కేటాయించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొందరు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్ధసారధి వై.ఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. ఆయన మంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నారు. అసంతృప్తులను బీసీ కార్పొరేషన్ పదవులు భర్తీ చేసే సమయంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కన్నాపై అదిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా?


రాష్ట్ర రాజధాని విషయంలో ప్రస్తుత పరిణామాలు కీలకంగా మారాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదం లభిస్తే ఈ బిల్లులు చట్ట రూపంలోకి మారతాయి. మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ స్పష్టమైన వైఖరి కలిగి ఉండగా బీజేపీ వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఓ వైఖరితో ఉంటే జాతీయ స్థాయి నేతలు మరో వైఖరి అవలంభించడం విమర్శలకు తావిస్తోంది.

Also Read: జమిలి ఎన్నికలతో మునిగేది చంద్రబాబేనా?

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరిన వెంటనే వాటిని ఆమోదించవద్దని తొలుత లేఖ రాసింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, అనంతరం ఇతర పార్టీ నేతలు లేఖలు రాశారు. కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాసిన అంశాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. లేఖ రాయడాన్ని తప్పుబట్టిన కేంద్ర నాయకత్వంపై పలు పార్టీలు, ప్రజా సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్టంలోని అధికార పక్షంపై పోరాడుతుంటే, కేంద్ర నాయకత్వం మాత్రం అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తుందనడానికి ఇది మరో నిదర్శనమంటున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలో ఉందని తాము జోక్యం చేసుకోమని గతంలోనే తేల్చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ విషయంలో కన్నాపై ఫైర్ అయ్యారు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు.

Also Read: ఆన్ లైన్ క్లాసుల్లో కూడా బస్సు ఫీజ్ కట్టాలా?

రాజధాని విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోను అనేక లుకలుకలు ఉన్నాయి. కొందరు నేతలు రాజధాని అమరావతికి మద్దతు ఇస్తుంటే మరికొందరు అమరావతికి వ్యతిరేకంగా ఉంటున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారంతా అమరావతికి మద్దతు పలుకుతుంటే స్వతహాగా బీజేపీలో ఉన్న నాయకులు మాత్రం అమరావతికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తాజాగా హిందుత్వ సంస్థల పేరుతో అమరావతి మద్దతు తెలుపుతున్న విషయంలోను… రాజకీయ ప్రయోజనాలతోనే ఈ వ్యవహారం సాగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

బీజేపీ అధిష్టానం కన్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయంపై జోరుగా చర్చ జరుగుతున్న కన్నా గాని లేక ఆ పార్టీ నాయకులు గాని ఎవరూ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు. రాజధానిగా అమరావతిని బలంగా కోరుకుంటున్న వారంతా కన్నా చర్యలను సమర్ధిస్తున్నారు. ఆయనను అభినందిస్తున్నారు. అయితే మూడు రాజధానుల విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటుంది.

రాజకీయాల్లో పవన్ పై పెరిగిన ఒత్తిడి?

Pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ ఒత్తిళ్ళు పెరిగినట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పిన ముద్రగడ పద్మనాభం, రాజకీయాల నుండి, కాపు ఉద్యమం నుండి ఒక్కసారిగా తప్పుకోవడంతో అందరూ అనేక విశ్లేషణలు ఇచ్చేశారు. కొందరు అధికార పార్టీ ఒత్తిడి అన్నారు… మరి కొందరు కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్ల అని అన్నారు. అయితే ఇక్కడ ముద్రగడ తర్వాత కాపులు నడిపించే నాయకుడు ఎవరు? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

సాధారణంగా చూసుకుంటే కులాలకు సంబంధం లేకుండా తెలుగు ప్రజల ఆదరణ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తాను కులాలకి, మతాలకి ప్రాధాన్యత ఇవ్వనని అన్నప్పుడు కాపు వర్గానికి చెందిన వారు కొద్దిగా మనస్తాపానికి గురయ్యారు. అయినా ప్రజాదరణ ఉన్న తమ వర్గానికి చెందిన నేత పై ఇటువంటి కారణంతో విమర్శలు చేయడం సరికాదన్న ఉద్దేశంతో వారంతా పవన్ విషయంలో మౌనంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ముద్రగడ తప్పుకోవడంతో తర్వాత వారి చూపంతా పవన్ కళ్యాణ్ పైనే పడింది. స్థానికంగా ఉండే సమస్యలతో పాటు మిగిలిన సామాజికవర్గాల తో పోలిస్తే కాపు ఓటు బ్యాంకు సమీకరణం కాలేదని విమర్శ ఉండేది. ఎవరికి వారు గా చెల్లాచెదురై ఉన్న తమ వర్గాన్ని ఒకటిగా చేసే శక్తి ఉన్న నాయకుడు ఎవరూ లేరని ఆవేదన ఆ వర్గానికి చెందిన వారిలో ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పైన ఈ దిశగా ఒత్తిడి పెరుగుతోంది.

పవన్ కు వారికి సారథ్యం వహించేందుకు ఇబ్బంది ఏమీ లేదు కానీ అతను చంద్రబాబు తో చేసిన కొన్నాళ్ళ స్నేహానికి ఇప్పటికీ అతనిని చంద్రబాబు బంటుగా వైసిపి వారు ముద్ర వేశారు. మెజారిటీ తెలుగు ప్రజల్లో అదే భావన నాటుకొని పోయింది. ఈ సమయంలో ఆయన కనుక ఇటువంటి సారథ్యాన్ని స్వీకరిస్తే తన మిగిలిన రాజకీయ జీవితం మొత్తం కాపు నేతగా ముద్ర పడిపోతుందేమో అని భయం ఒక వైపు ఉంటే మరో వైపు అతను నమ్మిన సిద్ధాంతాలను రాజకీయ లబ్దికోసం పణంగా పెట్టలేనని పవన్ ఆలోచిస్తున్నాడు. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఆయన్ను కాపుల నేతగా వైఎస్ విజయవంతంగా ముద్ర వేయటాన్ని మర్చిపోలేం. ఈ ముద్ర ప్రభావం ప్రజారాజ్యం మీద పడిన వైనాన్ని ఒప్పుకు తీరాల్సిందే. మళ్లీ పవన్ కు అలాంటి పరిస్థితే ఎదురైతే..ఆయన రాజకీయ ఫ్యూచర్ కు ఇబ్బంది తప్పదు.

ఇక పవన్ కొందరివాడుగా పేరు తెచ్చుకోకుండా అందరివాడే ఎదిగేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ముందు తన వర్గపు ఓటు బ్యాంకును బలపరచుకోవాలన్న వాదన కూడా జనసేన నాయకుల్లో విపరీతంగా వినిపిస్తోంది..! మరి పవన్ దారెటు?

చిన్న సినిమాలకు ఇది బంపర్ ఆఫరే !


కరోనా మహమ్మారి రాకతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలతో పాటు స్తొమత స్థాయిలు కూడా మారిపోయాయని చెప్పాలేమో ప్రస్తుత పరిస్థితి చూస్తే. ఎందుకంటే ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిల్మ్ ల వైపు చూస్తున్నారు. ఏమో చూస్తున్నారు అనేకంటే అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా‘ కోసం చూసేలా చేస్తున్నాడు అనడం కరెక్టేమో. ఆహా కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తూనే.. మరోపక్క రెడీగా ఉన్న చిన్న సినిమాలను కొనడానికి ఒక టీంను రెడీ చేశారు.

మెగాస్టార్ భయం అదే.. కానీ దానికే ఫిక్స్ !

ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సాగుతున్న అరవింద్, ప్రస్తుతం తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ తో తెలుగులో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. అమెజాన్, జీ5, హాట్ స్టార్ మాదిరిగానే ఆహాను ఆ స్థాయిలో నిలబెట్టడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు పోతున్నాడు. నిజానికి కొత్త సినిమాల వరకు సబ్ స్క్రిప్షన్ చేసుకుంటేనే వీక్షించే వీలున్నప్పటికీ.. పాత హిట్ సినిమాల్ని మాత్రం ఫ్రీగానే చూసే వీలు కల్పిస్తూ మిగతా ప్లాట్ ఫామ్స్ కంటే భిన్నంగా ఉండేలా చూస్తున్నాడు ఆహాని.

అడవిలో ‘బందీ’గా హీరో ఆదిత్య ఓం

పైగా సబ్ స్క్రిప్షన్ చార్జీలను కూడా ఇతర ఒటీటీలతో పోల్చితే తక్కువగానే ఉంచి వీక్షకుల్ని బాగానే ఆకర్షించాడు అల్లు అరవింద్. ఇక ప్రస్తుతం ఆహా కోసం కొత్త సినిమాల్ని కొనే పనిలో భాగంగా చిన్న సినిమాల మేకర్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. సినిమా అందరికి నచ్చేలా ఉంటే.. భారీ మొత్తం ఇచ్చి సినిమాని తీసుకుంటామని చోటా నిర్మాతలకు బడా ఆఫర్ ఇచ్చాడు. దీని కోసం ప్రత్యేకమైన స్క్రీన్ లను తన ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. మరి చిన్న సినిమాలకు ఇది బంఫర్ ఆఫరే.

వయసు అయిపోయాక స్పీడ్ అందుకుంది !


టాలెంట్ అండ్ గ్లామర్ ఉన్నా.. హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించలేకపోయింది లావణ్య త్రిపాఠి. తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైనా, ఈ బ్యూటీని స్టార్ హీరోల పెద్దగా ఆదరించలేదు. లావణ్య కంటే అన్నిటిలో తక్కువైనా హీరోయిన్స్ కు కూడా ఛాన్స్ లు ఇచ్చిన మన దర్సకనిర్మాతలు.. ఈ బ్యూటీని మాత్రం పక్కన పెట్టేశారు. అయినా అలుపుసొలుపూ లేకుండా దాదాపు దశాబ్దం నుండి వెండితెర పై గ్లామరస్ యుద్ధం చేస్తూనే ఉంది. అయితే, ఆ యుద్ధంలో గ్లామర్ ను అదుపు తప్పకుండా బ్యాలెన్స్ చేస్తూ వస్తుండటం కూడా లావణ్య వెనుకబడటానికి ఓ కారణం అనుకోవచ్చు.

మెగాస్టార్ భయం అదే.. కానీ దానికే ఫిక్స్ !

అయితే ముందెన్నడూ లేని విధంగా వరుస చిత్రాల్లో ఛాన్స్ లను పట్టేస్తోంది లావణ్య త్రిపాఠి. ఇప్పుడు లావణ్యకి తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన సినిమాలు వస్తున్నాయి. ఆ మధ్య తెలుగులో ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో లావణ్యా త్రిపాఠి అలరించనుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో లావణ్యది హాకీ క్రీడాకారిణి పాత్ర అట. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ కూడా తీసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓన్ గా డబ్బింగ్ కూడా చెబుతుంది. ఇక ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ హీరోగా వస్తోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది.

అడవిలో ‘బందీ’గా హీరో ఆదిత్య ఓం

‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో లావణ్య హ్యాట్రిక్ సినిమాగా ఈ సినిమా వస్తోంది. అలాగే తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్‌ రాయప్పన్‌ అని రానున్న ఓ సినిమాలోనూ ఈ కూల్ గర్ల్ ఆడిపాడనుంది. మొత్తానికి ‘హీరోయిన్ గా చేసే వయసు’ అయిపోయాక లావణ్య త్రిపాఠి కెరీర్ స్పీడ్ అందుకుంది. దానికి ఈ కరోనా ఒక్కటి పాపం.

ఎవరు ఏమన్నా ఎక్స్ పోజింగే కంఫర్ట్ అట !

తల్లి అతిలోక సుందరి కావడంతో శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ కు పెద్దగా కష్టపడకుండానే స్టార్ డమ్ వచ్చింది. స్టార్ డమ్ తో పాటు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దాంతో అమ్ముడుకి ఆ స్టార్ డమ్ తాలూకు బాధ్యత తెలియడం లేదట. తన స్థాయికి తగ్గట్లు బిహేవ్ చేయలేకపోతుందని.. ముఖ్యంగా జాన్వి కపూర్ కి డ్రెస్ సెన్స్ అసలు లేదని బాలీవుడ్ దర్శకనిర్మాతలు జాన్వీని తిడుతున్నారట. ఇంతకీ జాన్వీ పై వీళ్లకు కోపం రావడానికి కారణం, ఆమెకు అసలు టైం సెన్స్ లేదని.. అదే అనుకుంటే అనవసరపు అందాల ప్రదర్శన చేయడం బాగా అలవాటు చేసుకుందని కోప్పడుతున్నారు.

Also Read: పరాన్న జీవి.. ఆర్జీవీ.. ఇప్పుడు డేరా బాబా

జాన్వీ ఎప్పుడు చూసినా ఇన్నర్ వేర్లకు బ్రాండ్ అంబాజిడర్ లా పొట్టి పొట్టి లిక్కర్లతోనే జిమ్ ల చుట్టూ తిరుగుతుందట. అసలు సినిమాలో ఎక్స్ పోజ్ చేయడం వేరు.. ఎక్స్ పోజ్ చేయడానికే డ్రెస్ లు వేసుకోవడం వేరు అని జాన్వీ గురించి బాలీవుడ్ మీడియా కూడా కథనాలు రాస్తుండటం విశేషం. అయినా ఉన్నందతా బయటే ఎక్స్ పోజ్ చేస్తే… ఇక సినిమాలో కొత్తగా ఏమి చూపిస్తుందనేది ఆమెకు అవకాశాలు ఇచ్చినవారి ఆవేదన. మరి వారి ఆవేదన చూసైనా అమ్మడు మొత్తం విప్పేసి తిరగకుండా ఉంటుందేమో చూడాలి.

అయితే, ఆ మధ్య ఇదే విషయం పై ఈ గోల్డన్ బ్యూటీని మీడియా ప్రశ్నిస్తే.. ‘ఎవరు ఏమనుకున్నా తనకు మాత్రం అండర్ వేర్ లోనే కంఫర్ట్ గా ఉందని.. అందుకే డైలీ ఇన్నర్ వేర్ లోనే తానూ జిమ్ కి వెళ్తానని చెప్పుకొచ్చింది. మొత్తానికి నాకు ఛాన్స్ దొరికితే చాలు, ఇన్నర్ వేర్లతో ఎక్స్ పోజింగ్ కి తగుదునమ్మా అంటూ వస్తా అన్నట్టు ఉంది అమ్మడు వివరణ. ఏమైనా శ్రీదేవి అందంతో పోల్చలేము గాని, సెక్సీగా ఫోజులివ్వడంలో.. తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ మతులను పోగొట్టడంలో జాన్వీ తన తల్లినే మించిపోతుంది.

Also Read: నేను ఇబ్బంది పడుతున్నా: రష్మిక

ఇక ‘అయినను పోయి రావలె హస్తినకు’.. అనే టైటిల్ తో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమాలో హీరోయిన్ గా ఈ బాలీవుడ్ యంగ్ బ్యూటీనే తీసుకోవాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. కాగా ఎన్టీఆర్ పక్కన జాన్వి అంటే కాంబినేషన్ అదిరిపోతుంది.

ఇక నుండి వాహనదారులకు కొత్త రూల్స్!

Number plates

Number plates

వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారా? నంబర్ ప్లేటు గుర్తించకుండా ఏవైనా రాతలు రాస్తున్నారా? .. ఇకపై ఇలాంటి ఆటలు సాగవంటున్నది కేంద్ర ప్రభుత్వం. కొత్త నియమాలను దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొస్తున్నారు. నంబర్ ప్లేట్‌ లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాన్ని అతికించి వాహనాన్ని నడపడం ఇకపై నేరంగా పరిగణిస్తారు.

దేశవ్యాప్తంగా వాహనాల నంబర్ ప్లేట్లలో ఏకరూపతను తీసుకురావడానికి, 11 వర్గాల వాహనాల నంబర్ ప్లేట్లలో రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి రంగు గురించి విస్తృత ప్రమాణాలను కలుపుకొని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో మరో రెండు నంబర్ ప్లేట్లను చేర్చారు. మొదటిది తాత్కాలిక నంబర్ ప్లేట్, రెండోది డీలర్ వద్ద నిలిపి ఉంచిన వాహనాల నంబర్ ప్లేట్.

ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) లో మార్పులు చేశారు. వాహనాలు పెద్ద అక్షరాలతో ఆంగ్లంలో సంఖ్యల్లో మాత్రమే వ్రాయాలి. తాత్కాలిక నమోదు సంఖ్యలు పసుపు పలకపై ఎరుపు రంగులో వ్రాయాలి. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌కు సంబంధించి 1989 జూన్ లో నోటిఫై చేసిన సవరణకు సంబంధించి స్పష్టత తీసుకురావడానికి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ చెప్తున్నది. రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లో స్పష్టత తీసుకురావడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశామని, నిబంధనలను కొత్తగా ఏమీ జోడించలేదని మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

రిజిస్ట్రేషన్ నంబర్ తప్ప మరేమీ నంబర్ ప్లేట్‌ లో రాయకూడదని కూడా స్పష్టం చేశారు. ప్రాంతీయ భాషలో రిజిస్ట్రేషన్ నంబర్లను వాహనాలపై చిన్న అక్షరాలుగా వ్రాయడం ఇప్పుడు చట్టవిరుద్ధం. ఈ నియమాలు ఆయా రాష్ట్రాలు వేలం వేసిన వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్లకు కూడా వర్తిస్తాయి. సాదా కాగితంపై కలిపి వ్రాసిన సంఖ్యలు ఇకపై పనిచేయవు. అలాగే సంఖ్యల పరిమాణం, రంగులు కూడా సీఎంవీఆర్ లో వివరించారు. ఉదాహరణకు, ద్విచక్ర వాహనం, త్రీ వీలర్లు మినహా అన్ని వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య 65 మిల్లీమీటర్ల ఎత్తు, 10 మిల్లీమీటర్ల మందం .. వాటి మధ్య 10 మిల్లీమీటర్ల అంతరం ఉండాలి.

ప్రమాణాల ప్రకారం వ్రాయని సంఖ్యలు, రహదారిపై వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్లను స్వయం కదిలే కెమెరాలు పట్టుకోలేవు. నేరస్థులు తాత్కాలిక వాహనాలపై తాత్కాలిక నంబర్ ప్లేట్లను ఉంచడం, అవసరానికి అనుగుణంగా వాటిని తొలగించడం వంటి అనేక సందర్భాలు కూడా ఉన్నాయి.