Home Blog Page 8402

సీటు మారినా పర్లేదు…ఫేటు మారకుండా చూసుకో రాజా..!

Rama Krishnam Raju

Raghurama Raju MP Seat

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలివైన రాజకీయాలు చేస్తున్నాడు. ఆయన జగన్ని ఓ పక్క గిల్లుతూనే… మరో పక్క మీరు చల్లగా ఉండాలని అంటున్నాడు. అధికార పార్టీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణం రాజు హై డ్రామా రెండునెలలుగా తెలుగు రాష్ట్రలలో హాట్ టాపిక్ గా ఉంది. ఆయన విమర్శల ధాటి, ప్రతిపక్షాల దాడిని మించిపోయింది. జగన్ పాలన మరియు నిర్ణయనాలను ఆయన ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే రహురామ కృష్ణం రాజు చర్యలతో విసిగిపోయిన వైసీపీ నేతలు ఆయనపై ఒక్కొక్క చర్యకు సిద్ధం అవుతున్నారు.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

కొద్దిరోజుల క్రితం షోకాజు నోటీసులు జారీ చేయడంతో పాటు, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించాలని, లోక్ సభ స్పీకర్ ని కోరారు. అలాగే రఘురామ కృష్ణం రాజును పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ చైర్మన్ గా తొలగించాలని ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండు అంశాలపై స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో ఉంది. తాజాగా ఎంపీ రఘురామ కృష్ణం రాజు లోక్ సభలోని సీటు నంబర్ మార్చివేశారు. ఆయనకు గతంలో కేటాయించిన సీటు నంబర్ 379 ని తొలగించి, 445 నంబరు సీటును కేటాయించారు. రఘురామ కృష్ణం రాజు సీటు నంబర్ 379ని రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మార్గాని భరత్ కి కేటాయించారు.

దీనితో వైసీపీ పార్టీలో ఆయన స్థానం, స్థాయి తగ్గించినట్లు అయ్యింది. బీజేపీ అండ ఉంటుందని దూకుడు చూపుతున్న రఘురామ కృష్ణం రాజుకు ఎల్లవేళలా వారి తోడు ఉంటుందని ఎటువంటి గ్యారంటీ లేదు. వైసీపీ పార్టీతో గొడవను అంతకంతకూ పెద్దది చేసుకుంటున్న ఆయనకు, బీజేపీ హ్యాండిస్తే పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. బీజేపీది ఎప్పుడూ సంకీర్ణ ప్రభుత్వమే గత రెండు పర్యాయాలు మాత్రం సంపూర్ణ మద్దతు తెచ్చుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికలు బీజేపీకి అంత సులభం కాదు. ప్రభుత్వ ఏర్పాటులో స్థానిక పార్టీల మద్దతు తప్పనిసరి కావచ్చు. అలాంటప్పుడు జగన్ ని కాదని ఒంటికాయ శొంఠికొమ్ము కృష్ణం రాజుకు ప్రాధాన్యత ఇస్తారనే గ్యారంటీ లేదు. కాబట్టి ఇకనైనా రాజుగారు ఇగోలు వదిలేసి కాంప్రమైజ్ అయితే బెటర్ అని నిపుణుల సూచన. లేదంటే భవిష్యత్తులో ఫేటే మారిపోవచ్చు.
Also Read: గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

Raghu ramakrishnam raju

Raghu ramakrishnam raju

కొద్ది రోజులుగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించుకున్నందుకు తొలి మూల్యం చెల్లించుకున్నారు. లోక్ సభలో ఆయన సీటును మార్చడంలో వైసీపీ ఎంపీలు విజయం సాధించారు. గతంలో 379 నెంబరు సీటు కేటాయించగా ఇప్పుడు 445 నెంబరు సీటును కేటాయించారు. దీంతో రఘురామ కృష్ణంరాజు చివరి వరుసలోకి వెళతారు. లోక్ సభలో అత్యధికంగా పర్యాయాలు మాట్లాడిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో కెక్కి ఉత్తమ పార్లమెంటేరియన్ అనిపించుకున్నారు. పార్టీకి తలనొప్పిగా తయారైన ఆయన ఇప్పుడు లోక్ సభలో ప్రాధాన్యత లేని వెనుక వరుసలోకి చేరారు.

Also Read: గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎంపీ రాఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు కొద్ది రోజుల కిందట స్పీకర్ ఓం బిర్లాకు వినతి ప్రతాన్ని సమర్పించారు. అంతకు ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుకు సమాధానం ఇవ్వని ఎంపీ లేఖ ఆధారంగా మరికొన్ని కొత్త సమస్యలను పార్టీ మీదకు తెచ్చిపెట్టారు. ఎన్నికల సంఘానికి పార్టీ పేరు విషయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పార్టీ ఢిల్లీ హై కోర్టు నుంచి నోటీసులు అందుకుంది. దీంతో కృష్ణంరాజు విషయంలో పార్టీ ఆచీతూచీ వ్యవహరిస్తోంది. నేరుగా పార్టీ నుంచి తొలగిస్తే మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉందని భావించి అనర్హత పిటీషన్ దాఖలు చేయించారు.

Also Read: నర్సాపురం ఎంపీ బరిలో సినీ నటుడు

సీటు మార్పిడి అంశంపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సింహం కూర్చున్న సీటే సంహాసనమంటూ ట్విట్ చేశారు. సభలో ఎక్కడ కూర్చున్నా తన గళం గతంలో వినిపించినట్లుగానే వినిపిస్తానని పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకున్న తనకు దక్కిన సముచిత స్థానమని చెప్పుకొచ్చారు. అనర్హత పీటీషన్ తో ఏమీ చేయలేకపోయి ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. అయినా తాను పార్టీని వీడేది లేదని స్పటం చేశారు.

చంద్రబాబును ఎన్టీఆర్ తో కొడుతున్న జగన్

Operation Kuppam

Jagan Using NTR

చంద్రబాబు చరిత్రలో ఆయన మామ ఎన్టీఆర్ ది కీలకరోల్.. బాబుకు పిల్లనివ్వడం దగ్గర నుంచి పార్టీలోకి తీసుకోవడం.. అదే పార్టీని చంద్రబాబు లాక్కోవడం.. మామ మరణానికి కారణం అవ్వడం.. ఇప్పుడు నందమూరి వాసనే లేకుండా తెలుగుదేశాన్ని ఏలడం.. ఇలా మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఉనికిని చంద్రబాబు ఎప్పుడూ వదలుకోలేని పరిస్థితి. అలా అని ఆయనను నెత్తిన పెట్టుకోని దుస్థితి. అందుకే ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం అంటుంటారు టీడీపీ నేతలు.

ఇప్పుడు అదే ఎన్టీఆర్ తో చంద్రబాబును కొట్టే ప్లాన్ ను సీఎం జగన్ సిద్ధం చేస్తున్నారని తెలిసింది. అన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి మామ ఎన్టీఆర్ ను గౌరవించని చంద్రబాబును అందరి ముందు దోషిగా నిలబెట్టేలా వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం.

Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ఏపీలోని 13 జిల్లాలను పునర్విభజన చేసి 25 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు కమిటీని నియమించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరో ఆసక్తికర డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు మరోమారు తెరపైకి తెచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతానని కృష్ణ జిల్లా పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారని.. ఖచ్చితంగా ఆయన ఈసారి నెరవేరుస్తారని వంశీ స్పష్టం చేశారు.

కృష్ణ జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ సినీ, రాజకీయాల్లో ధ్రువతారగా ఎదిగారు. అలాంటి ఆయనను టీడీపీ దాదాపు వదిలేసింది. టీడీపీ వదిలేసిన ఆ తెలుగు మహనీయుడిని వైసీపీ తెరపైకి తెచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును దెబ్బకొట్టాలని వ్యూహం పన్నింది. అందుకే వ్యూహాత్మకంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ ద్వారా ఈ డిమాండ్ ను లేవనెత్తారు. జగన్ ఆల్ రెడీ హామీ ఇవ్వడంతో దీన్ని నెరవేర్చడం గ్యారెంటీ..

Also Read: ట్వీట్లకు ఓట్లు రాలుతాయా లోకేష్..?

ఇలా చంద్రబాబును ఏ దశలోనూ వదలకుండా వ్యూహాత్మకంగా ఆయన లోపాలను ఎత్తిచూపుతూ ముప్పేట దాడి చేసేలా ప్రతీ అవకాశాన్ని వైసీపీ అధినేత జగన్ వాడుకుంటుండడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

-నరేశ్ ఎన్నం

గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలమా? వ్యతిరేకమా?

Andhra Pradesh Governor

Andhra Pradesh Governor
మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు రూపొందించిన రెండు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లులపై గవర్నర్ సంతకం చేస్తే అమరావతిలో రాజధానిని విశాఖకు తరలింపు ప్రక్రియ ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకుని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు ఎత్తులు వేస్తున్నాయి. గవర్నర్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరాయని తెలియగానే రాష్ట్ర విపక్ష పార్టీలు స్పందించి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖలు రాశాయి. హరిచందన్ బిజెపి నాయకులు ఆయనను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏపీకి గవర్నర్ గా నియమించింది.

ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి శాసన మండలి ప్రతిపక్షనాయకులు యనమల రామకృష్ణుడు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ గవర్నర్ కు లేఖ రాశారు. ప్రజాప్రయోజనాల దృష్టితో పరిశీలించాలని కోరారు. భారత అటార్నీ జనరల్ అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. గవర్నర్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి బిల్లులు పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గవర్నర్ సోంత పార్టీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానులు రాష్ట్ర పునర్యవస్థీకరణ చట్టానికి విరుద్ధమని, శాసన మండలిలో సెలక్ట్ కమిటీ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నందున ఈ రెండు బిల్లులను ఆమోదించవద్దని తాను రాసిన లేఖలో గవర్నర్ ను కోరారు. మూడు రాజధానులు రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్తుకు ఆటంకంగా మారతాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శైలజనాథ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.9,600 కోెట్లు ఖర్చు చేసి అభివృద్ది భవన నిర్మాణాలు, రోడ్లు నిర్మించారని సీసీఐ కార్యదర్శి కె.రామకృష్ణ గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజధాని రైతులు 214 రోజుగా ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించవద్దని కోరారు.

Also Read: గవర్నర్ వద్దకు చేరిన బిల్లుల పంచాయతీ..

గవర్నర్ బాధ్యతులు చేపట్టిన అనంతరం ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్ ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, సీపీఐ, సీపీఎం, బిజెపి, జనసేన పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. సొంత పార్టీ బీజేపీ నాయకులు గవర్నర్ తీరును తప్పుబట్టారు. న్యాయపోరాటంలో గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ నిలువ లేదు. హైకోర్టు ఆ ఆర్డినెన్స్ ను కోట్టివేసింది. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా హై కోర్టు తీర్పునే సుప్రీం కోర్టు సమర్ధించింది.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. మరోవైపు రాష్ట్ర ఎన్నిక కమిషనర్ గా రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం గవర్నర్ ను కలవనున్నారు. తనను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని కోరనున్నారు. ఇప్పటి వరకూ గవర్నర్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకున్నారు. ఈ రెండు అంశాలపై గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు తనను గవర్నర్ గా నియమించిన సొంత పార్టీ, విపక్షాలు.. మరి గవర్నర్ ఏ వైపు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
Also Read: నర్సాపురం ఎంపీ బరిలో సినీ నటుడు

ట్వీట్లకు ఓట్లు రాలుతాయా లోకేష్..?

Nara Lokesh

Nara Lokesh

ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ ఓ సంచలనం. పార్టీ పెట్టిన పదేళ్లలో ఎవరి సపోర్ట్ లేకుండా సీఎం పీఠం ఎక్కడం అనేది ఎవరికైనా కత్తిమీద సామే. ఏళ్లుగా సీఎం కావాలని ఆశపడి వయసుడిగిపోయి ఆశలు వదిలేసిన నేతలు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ అదిష్టానాన్ని ఎదరిస్తే ఎదురయ్యే పర్యవసానాలు జగన్ కి బాగా తెలుసు , అయినా ప్రజల తోడు ఉంటుందనే నమ్మకంతో సునామీకి ఎదురెళ్లాడు. దాని ఫలితమే అరెస్టు, 16 నెలల జైలు జీవితం. మరొకడైతే అప్పుడే కాంగ్రెస్ తో కాంప్రమైజై ఇచ్చినది పుచ్చుకొని గమ్మున ఉండేవాడు. జగన్ తత్త్వం చాలా భిన్నం. పదేళ్లు పట్టుదల, మొండితనం జగన్ కి ఆ అధికారం దక్కేలా చేసింది. మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్లిన జగన్ సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళి వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. జనం నమ్మి ఓట్లు వేసినందుకు ఏడాది తిరిగేలోపే…ఇచ్చిన హామీలు 90 శాతానికి పైగా పూర్తి చేశారు. జగన్ సక్సెస్ ని చూసి కుళ్ళుకునే వాళ్లు, అసాధ్యం సుసాధ్యం చేశాడని మనసులో మెచ్చుకొనే ప్రత్యర్ధులు ఎందరో ఉన్నారు.

Also Read: చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

దీనితో టీడీపీ నేతలకు విమర్శించడానికి జగన్ ఏమి మిగల్చలేదు. అందుకే ఎప్పటిలాగే జగన్ అవినీతి పరుడు, వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేయడంతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ముఖ్యంగా టీడీపీ ఫ్యూచర్ గా బాబు భావిస్తున్న నారా లోకేష్, ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతుంటాడు. ఆయన సోషల్ మీడియాలో జగన్ పై చేసే వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉంటాయి. లోకేష్ అంటే రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటో అందరికీ తెలుసు. చంద్రబాబుకు కూడా లోకేష్ సమర్ధత బాగా తెలుసు కాబట్టే…ఎమ్ ఎల్ సి కట్టబెట్టి ఆపై మంత్రిని చేశారు. మంత్రి గారు మైకు ముందుకు వస్తే చాలు, సుగుణాలన్నీ బయటపడేవి. ఐదేళ్ల అనుకూల మీడియా ఎంత లేపినా ఇంచు కూడా ప్రజల్లో నాయకుడిగా నిరూపించుకోలేక పోయాడు. అంత పెద్ద పార్టీ అండ, అనుకూల ఓటు బ్యాంకింగ్ ఉన్న చోట కూడా ఓటమి చెంది , అబాసుపాలయ్యాడు.

Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

ఇక బాబు సైతం లోకేష్ రాజకీయ అరంగేట్రమే దొడ్డిదారిన చేశాడు. ఎమ్ ఎల్ సి ని చేయకుండా, టీడీపీ ఖచ్చితంగా గెలిచే ఓ నియోజకవర్గంలో నిలబెట్టి గెలిపించి, ఆపై మంత్రిని చేయాల్సింది. అలా కాకుండా ఎమ్ ఎల్ సి ద్వారా మంత్రిని చేశారు. దీనితో బాబుకే అబ్బాయి లోకేష్ పై నమ్మక లేదని ప్రజలకు అర్థం అయ్యింది. మరి వచ్చే నాలుగేళ్ళకైనా జగన్ కి ధీటుగా లోకేష్ ఎదుగుతాడు అనుకుంటే…ఆయన రాజకీయం అంతా ట్విట్టర్ కే పరిమితం అవుతుంది.ఒక్కసారి కూడా ఓ విషయంపై టీవీ డిబేట్ లో పాల్గొన్న దాఖలాలు లేవు. నిన్ను జనాలు నమ్మాలి అంటే విషయ అవగాహన, పోరాట తత్త్వం ఉందని వారికి తెలియాలి. జనాల్లోకి రాకుండా, ఇలా ట్వీట్స్ వేసుకుంటూ కూర్చుంటే… ఆయనపై జనానికి నమ్మకం కలిగేదేప్పుడు.ట్వీట్స్ కి ఓట్లు రాలవని, ఆయనకు ఎవరైనా చెబితే బాగుండు.

గవర్నర్ వద్దకు చేరిన బిల్లుల పంచాయతీ..


వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల విషయం ఓ కోలిక్కి వచ్చే సమయం ఆసన్నమయ్యింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇందుకు చట్టపరంగా అవకాశం కల్పించే బిల్లులకు ఆమోదం లభించే సమయం వచ్చిందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ బిల్లులు ఆమోదం పొందితే మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వానికి చట్ట పరంగా అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరానికి సచివాలయం, సిఎంఓ తలించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. శాశ్వత భవనాల నిర్మాణం కోసం సిఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, నిర్మాణ రంగా నిపుణులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించిన విషయం విధితమే.

Also Read: ఆ నేతలకు త్వరలో జగన్ ‘స్పెషల్ క్లాస్’..!

శాసన మండలికి రెండవ సారి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను జులై నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పంపింది. అయితే ఈ బిల్లులు చర్చకు రాకుండానే శాసన మండలి నిరవదికంగా వాయిదా పడింది. శాసనసభలో ఈ రెండు బిల్లులకు ఆమోదం లభించింది. రెండవ సారి శానస మండలికి పంపినా బిల్లు ఆమోదించడం, వ్యతిరేకించడం గాని చేయకుండా మండలి నిరవదిక వాయిదా పడటడంతో 30 రోజుల అనంతరం ఆ బిల్లు శాసన మండలి ఆమోదించినట్లుగా భావించి గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆయన ఆమోదం లభిస్తే ఆ బిల్లులు చట్ట రూపాన్ని దాల్చుతాయి. ద్రవ్య వినియమ బిల్లుకు ఇదే విధానంలో ఆమోదం లభించింది. మొదటి సారి సభకు వెళ్లడంతో 14 రోజుల అనంతరం శాసన మండలి ఆమోదించినట్లుగా భావించి ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం పొందింది.

Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా అనేక చిక్కులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఈ బిల్లుల ఆమోదంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలం విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను ఆమోదించిన గవర్నర్ ఈ విషయంలో విపక్షాల విమర్శలు ఎదుర్కొన్నారు. చివరికి సొంత పార్టీ బీజేపీ నేతలు గవర్నర్ తీరును విమర్శించారు. మరొవైపు హైకోర్టు ఈ ఆర్డినెన్స్ ను రద్దు చేసింది. మరొవైపు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపైనా టిడిపి ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో గవర్నర్ పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులను ఆమోదిస్తారా లేక వెనక్కి పంపుతారా అనే విషయంలో ఆశక్తి నెలకొంది. గవర్నర్ న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే మూడు రాజధానులను వ్యతిరేకిస్తోంది. రాజధాని రైతుల చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపారు. దీంతో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయం కత్తిమీద సాము అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ఏపీ పునర్యవస్థీకరణ చట్టానికి వ్యతిరేకమని ప్రముఖ న్యాయవాది జంద్యాల రవిశకంర్ పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన పునర్యవవస్థీకరణ చట్టంలో ఒక్క రాజధానికే అవకాశం ఇచ్చారని, మూడు రాజధానులకు ఏర్పాటు చేయాలంటే ఈ చట్టానికి సవరణ చేయాలని ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. కీలకంగా మారిన ఈ బిల్లులపై గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అన్ని పార్టీలు, రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు.

మామ సీటు కోసం అల్లుడి వేషాలు..!


మామ సీటు కోసం అల్లుడు వేషాలు వేస్తూ ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. మామకు తగ్గ అల్లుడిగా పేరుతెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. దివంగత ఎంపీ, సినీనటుడు శివప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు చిన్ననాటి స్నేహితుడు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో శివప్రసాద్ టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేశాడు. 2009, 2014లో చిత్తూరు ఎంపీగా శివప్రసాద్ గెలుపొందారు. స్వతహాగా ఆయన సినీనటుడు కావడంతో ప్రజా సమస్యలపై ఆయన వేషాలు వేస్తూ అలరించేవారు.

Also Read: సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

రాష్ట్ర విభజన సమయంలోనూ ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ ఆవరణంలో పలురకాల వేషాలు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీ పెద్దలతోపాటు దేశ ప్రజలందరినీ ఆయన రకరకాల వేషాలతో తనవైపు తిప్పుకున్నాడు. అయితే కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గాలి వీయడంతో శివప్రసాద్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయనలా వేషాలు వేసి ప్రజా సమస్యలపై స్పందించేవారు టీడీపీలో కరువయ్యారు.

ఇక శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ కూడా మామ బాటలోనే నడుస్తున్నాడు. 2019లో కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి పోటీచేసి ఓటమి పాలైనప్పటికీ ప్రజల్లోనే నిత్యం ఉంటున్నాడు. ప్రజా సమస్యలపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇటీవల జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నరసింహ ప్రసాద్ తుగ్లక్ వేషంవేసి అందరినీ ఆకట్టుకున్నాడు. టీడీపీ ఆయన మామలేని లోటును ప్రస్తుతం ఆయన అల్లుడు భర్తీ చేస్తున్నాడనే టాక్ టీడీపీ శ్రేణుల్లో విన్పిస్తుంది.

Also Read: ఏపీలో రూ.200కోట్ల వసూళ్ల కలకలం?

ఇకపోతే గతంలో ఆయన మామ మరణంతో ఖాళీగా అయిన స్థానాన్ని తాను భర్తీ చేయాలని నరసింహ ప్రసాద్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి రైల్వే కొడూరులో ఉంటున్నప్పటికీ చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జి నియమించకపోవడంతో తనకు ఆ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నాడట. వచ్చే ఎన్నికల నాటికి చిత్తూరు పార్లమెంట్ నుంచి బరిలో దిగితే తనకు అన్నివిధలా కలిసి వస్తుందని భావిస్తున్నాడు. మామ సీటు కోసం వేషాలు వేస్తున్న నరసింహ ప్రసాద్ ను చంద్రబాబు ఎంతవరకు గుర్తిస్తారో చూడాలి..!

నర్సాపురం ఎంపీ బరిలో సినీ నటుడు


ఏపీ రాజకీయాల్లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నర్సాపురం ఎంపీగా పోటీచేసి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే ఆ వ్యవహారం రోజురోజుకు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీలోనే వైరిపక్షంగా వ్యవహరిస్తుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సదరు ఎంపీకి షాకిచ్చిందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీలంతా లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేశారు.

Also Read: ఏపీలో రూ.200కోట్ల వసూళ్ల కలకలం?

అయితే రఘురామ కృష్ణంరాజు కూడా వైసీపీ ఎంపీలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వైసీపీ అధిష్టానం తీసుకునే చర్యలకు ధీటుగానే బదులిస్తున్నాడు. దీంతో అతడి విషయంలో తాడోపెడో తేల్చుకునేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారట. ఈమేరకు రఘురామ కృష్ణంరాజు వ్యవహారాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారనే టాక్ పొలికల్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.

దీంతో రఘురామ కృష్ణంరాజు బయటికి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రఘురామ కృష్ణంరాజు అడుగులు సైతం బీజేపీ వైపు పడుతున్నాయి. దీంతో నర్సాపురం ఎంపీ సీటును ఎవరీతో భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. కొద్దిరోజులుగా టీడీపీ చెందిన మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ వైసీపీలోకి వ‌స్తే ఆ సీటును ఆయ‌న‌కే ఇస్తార‌నే ప్రచారం వైసీపీలో జరిగింది. అయితే ప్రస్తుతం వైసీపీకి చెందిన సినీనటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మ‌న్ పృథ్విరాజ్‌ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.

Also Read:: సోషల్ మీడియాలోనే తెలుగు తమ్ముళ్ల ఆరాటం..!

తాజాగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనకు నర్సాపురం ఎంపీ సీటు ఇవ్వాలని కోరుతానని అన్నారు. ఆయన తనకు ఆ సీటు కేటాయిస్తే రఘురామ కృష్ణంరాజుపై గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. తాను పార్టీకి విధేయుడిగా ఉంటానని.. రఘురామ కృష్ణంరాజు ద్రోహం చేయనంటూ ఘాటుగా స్పందించారు. నర్సాపురంలో కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో పృథ్వీరాజ్ ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు సై అంటున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి పృథ్వీరాజ్ కు ఛాన్స్ ఇస్తారా? లేదో వేచి చూడాల్సిందే..!

రజినీకాంత్ హీరోయిన్.. భారీ అందాలతో కనువిందు !


మాళవిక మోహనన్ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ రేంజ్ గ్లామర్ ఉన్న బ్యూటీ ఈమె. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరూ మాళవిక అందం ముందు తక్కువని నెటిజన్లు ఈ అమ్మడుకు కితాబు ఇస్తున్నారంటే.. కారణం అందంతో పాటు మాళవిక డ్రెస్ సెన్స్ కూడా. ఎలాంటి దుస్తుల్లోనైనా అందంగా కనిపించడంలో మాళవిక మోహనన్ మాస్టర్ డిగ్రీ చేసినట్టు ఉంది.


ఒకసారి కింద ఫోటోల్లో డ్రెస్ కి తగ్గట్టు ఎక్స్ ప్రెషన్ ను, ఎక్స్ ప్రెషన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎక్స్ పోజింగ్ ను హైలైట్ చేసి ఫోజిలు ఇవ్వడం అంటే ఎంతో అనుభవం ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చి ఇంకా నాలుగు సినిమాలు కూడా పూర్తి చెయ్యలేదు.. ఈ బ్యూటీ అప్పుడే ఓ రేంజ్ అనుభవం సంపాదించేసినట్టు ఉంది. తన కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పేట’ చిత్రంలో అలరించిన ఈ అందాల భామ ఆ సినిమాతో బాగానే క్రేజ్ తెచ్చుకుంది. నిజానికి రజినీకాంత్ సరసన హీరోయిన్ అంటే.. ఆ హీరోయిన్ ఎంత పెద్ద నటి అయినా ఆమెకు పేరు పెద్దగా రాదు. అలా రజిని స్టార్ డమ్ లో కొట్టుకుపోయిన గొప్ప టాలెంటెడ్ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఏదో రమ్యకృష్ణ లాంటి హీరోయిన్స్ తప్ప. అలాంటిది మాళవిక మోహనన్ రజినీకాంత్ సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుని ముందుకు వెళ్తుంది అంటే, ఆ క్రెడిట్ మాళవిక మోహనన్ గ్లామర్ కే దక్కుతుంది.

ఈ పై ఫోటోలు చూస్తే తెలియడంలేదు. ఈ బ్యూటీలో స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయని. అందుకేనేమో సూర్య పట్టుబట్టి మరీ తన పక్కన ఛాన్స్ ఇచ్చాడు. సూర్య హీరోగా, హరి దర్శకత్వంలో వచ్చే ‘అరువా’ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ‘మాస్టర్‌’ చిత్రంలో విజయ్‌ సరసన కూడా ఈ బ్యూటీ నటిస్తోంది. ఈ సినిమా తరువాత అమ్మడు రేంజ్ అమాంతం పెరగనుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ… ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ హాట్ స్టిల్స్‌ తో తనని ఫాలో అయ్యే అభిమానులకు అప్పుడప్పుడు గ్లామర్ టచప్ చేస్తూ ఉంటుంది. ఈ కింద ఫోటోలు చూస్తే నెటిజన్లు అలాగే ఫీల్ అవుతారు మరి.

కేసులు పెరుగుతున్నాయ్ కానీ.. ఈ శుభవార్త విన్నారా?

Corona recovery rate

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు రెండింతలు పెరిగింది. గత 24 గంటల్లో దాదాపు 18 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,750కు పెరిగింది. దేశవ్యాప్తంగా శనివారం నాటికి 2,95,058 కేసులు యాక్టివ్‌ గా ఉన్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని యాక్టివ్ కేసుల్లోనూ ఆసుపత్రులలో, హోం ఐసోలేషన్‌ లో ఉన్న వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది.

గత 24 గంటల్లో 17,994 మంది రోగులు కోలుకున్నారని, రికవరీ రేటు 63 శాతంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, ఇప్పటి వరకు 1,34,33,742 స్వాబ్ శాంపిళ్లు పరీక్షించగా వీటిలో 3,61,024 శాంపిళ్లు శుక్రవారం ఒక్క రోజే పరీక్షించినట్టుమ తెలిపింది. అంటే పరీక్షల సంఖ్య మిలియన్‌ కు 9,734.6కు పెరిగినట్టు వివరించింది. బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశాలలో రోజు వారీ కేసులు పెరుగుతున్నట్టు పేర్కొన్న కేంద్రం వైరస్ వ్యాప్తికి, మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాని కోరింది.

నా బయోపిక్‌లో నేనే నటిస్తా అంటున్న స్టార్ విలన్‌


తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అనేక సినిమాలు చేసిన విలక్షన నటుడు సోనూ సూద్‌. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యాడు. తెరపై విలన్‌ అయినా నిజ జీవితంలో ఆయన అసలైన హీరో. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఆయనలోని మంచి మనిషి, హీరోను దేశం మొత్తం చూసింది. కరోనాను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో చిక్కుకున్న వలస కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసింతే. అలాంటి వలస కార్మికుల పాటిన సోనూ సూద్‌ హీరో అయ్యాడు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలసజీవులను సోనూ సూద్ తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలించాడు. ఖర్చుకు వెనుకాడకుండా వేలమందిని వారి ఇళ్లకు చేర్చి, వారి ముఖాల్లో, కుటుంబాల్లో ఆనందం నింపాడు. మరెందరికో ఆహారం, వసతి కల్పించి నిజమైన హీరో అనిపించుకున్నాడు.

‘విరూపాక్ష’ కాదట.. ‘గజదొంగ’ లేదంటే ‘బందిపోటు’!

లాక్‌డౌన్‌ అనుభవాలతో ఓ పుస్తకం రాస్తానని సోనూ సూద్‌ ఇటీవల వెల్లడించాడు. తాను కళ్లతో చూసిన శ్రమ జీవుల కష్టానికి అక్షర రూపం ఇస్తానని తెలిపాడు. మరోవైపు కార్మికులకు సాయం చేసి దేశ వ్యాప్తంగా ఎంతో మంది మన్ననలు అందుకున్న సోనూ సూద్‌ జీవితం ఆధారంగా బయోపిక్‌ తీయాలని బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని మోగా అనే మారుమూల ప్రాంతం నుంచి రైలులో ఒక్కడే ముంబైకి వచ్చి ఎన్నో కష్టాలకు ఓర్చి ఇంత పెద్ద నటుడిగా ఎదిగిన తీరును వెండితెరపై చూపిస్తే సూపర్హిట్‌ అవుతుందని ఫిలిం మేకర్స్‌ భావిస్తున్నారు. ఈ విషయం సోనూ సూద్‌ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన అతను ఎవరైనా తన బయోపిక్ తీస్తే అందులో హీరో పాత్రను తానే పోషిస్తానని స్పష్టం చేశాడు. తన జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదురైన అనుభవాలు తనకంటే బాగా ఇతరులకు తెలియవని చెప్పాడు. తన బయోపిక్‌లో తానే నటిస్తే.. ఈ ఘనత సాధించిన నటుడిగా సోనూ ఓ రికార్డు క్రియేట్‌ చేయనున్నాడు.

దీపికతో కాదు కియారాతో ప్రభాస్ రొమాన్స్‌!


మహేశ్ బాబు సరనన ‘భరత్‌ అనే నేను’తో టాలీవుడ్‌కు పరిచయమైంది హిందీ భామ కియారా అద్వానీ. ఫస్ట్‌ మూవీతోనే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్‌ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ చేసినా ఆ మూవీ ఫ్లాప్‌ అయింది. దాంతో, టాలీవుడ్‌కు దూరమైన ఆమె బాలీవుడ్‌పైనే ఎక్కువ దృష్టి సారించింది. తెలుగు సూపర్ హిట్‌ మూవీ ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్ సింగ్‌’తో బాలీవుడ్‌లో ఆమె స్టార్డమ్‌ తెచ్చుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో హిందీలో బిజీగా మారిందామె. ఇప్పుడామె మరోసారి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది. అదీ మామూలు సినిమాతో కాదు. బాహుబలి ప్రభాస్‌ సరసన నటించే బంపరాఫర్ అందుకున్నట్టు సమాచారం. ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రెబల్‌ స్టార్ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తాడని వినికిడి. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్‌… భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నాడు.

‘విరూపాక్ష’ కాదట.. ‘గజదొంగ’ లేదంటే ‘బందిపోటు’!

తెలుగు, హిందీ సహా నాలుగైదు భాషల్లో వచ్చే ఈ మూవీలో ప్రభాస్‌ సరసన్‌ నోటబుల్‌ హీరోయిన్‌ను ఎంచుకోవాలని చిత్ర బృందం భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే దీపికా పదుకోన్‌ను సంప్రదించారు. ఆమె ఓకే చెప్పినా.. భారీ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందట. దాంతో పాటు హిందీ హక్కుల్లో కూడా అడిగిందట. దాంతో, చిత్ర బృందం వేరే హీరోయిన్‌ వేటలో పడిందని, ఈ క్రమంలో కియారాను ఎంచుకోవాలని డిసైడైనట్లు టాలీవుడ్‌ టాక్‌. దీపిక అంత కాకున్నా.. కియారా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అక్షయ్‌ కుమార్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ ఓటీటీలో తర్వలోనే రిలీజ్‌ కానుంది. అది హిట్టయితే కియారాకు మరింత పేరు రావడం ఖాయం. ఈ నేనథ్యంలో కియారాను తీసుకుంటే హిందీ మార్కెట్‌ కూడా ప్లస్‌ అవుతుందని నాగ్‌ అశ్విన్ భావిస్తున్నాడట. దీనిపై తొందర్లోనే ప్రకటన వచ్చే చాన్సుందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఆ మూడు దేశాల మధ్య.. శత్రువుకి శత్రువు మిత్రుడు!

Iran china

Iran china
అమెరికా-ఇరాన్-చైనాల మధ్య శత్రువుకి శత్రువు మిత్రుడు అనే నానుడి నడుస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు మద్దతిస్తోందని, అణుకార్యకలాపాలు చేపడుతోందని ఇరాన్‌ పై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్‌ ఆర్థికంగా ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఏ దేశం కూడా అమెరికా భయానికి సాయం చేయటానికి ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌ ముందున్న ఏకైక మార్గం చైనానే. అందుకే చైనాతో ఒప్పందానికి సై అంటోంది.

అటు చైనా కూడా అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ కు సాయం చేయటానికి ముందుకొస్తోంది. దీంతో తన చమురు అవసరాలు(చైనా తాను వాడే చమురులో 75శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది) తీరటంతో పాటు… అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన మధ్యప్రాచ్యంలోనూ పాగా వేసేందుకు చైనాకు సందు దొరుకుతోంది. తన బెల్ట్‌ రోడ్డు ద్వారా యూరప్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న చైనాకు ఇది సానుకూలాంశంగా చెబుతున్నారు. చైనా తన మిలటరీ కేంద్రాలను విస్తరించటానికి కూడా దోహదపడుతుంది. పెర్షియన్‌ గల్ఫ్‌ ముఖద్వారంగా చెప్పుకునే జాస్క్‌ వద్ద చైనా పలు నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదిస్తోంది. మధ్య ఆసియాలోనే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో ఈ ప్రాంతం, ఈ పోర్టు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఇప్పటిదాకా దీనిపై అమెరికా పట్టుంది. ఇప్పుడు చైనా కూడా ఇరాన్‌ తో ఒప్పందం రూపంలో రంగంలోకి దిగుతోంది.

ఒప్పందం ప్రకారం వివిధ రంగాల్లో సుమారు 400 బిలియన్‌ డాలర్ల మేర ఇరాన్‌ లో చైనా పెట్టుబడులు పెడుతుంది. రక్షణ, బ్యాంకింగ్, టెలికాం, పోర్టులు, రైల్వేలు, ఫ్రీ ట్రేడ్‌ జోన్స్‌ నిర్మాణం తదితర రంగాల్లో చైనా సాయం చేస్తుంది. అంతేగాకుండా కీలకమైన మిలటరీ, భద్రత అంశాల్లో పరస్పర సహకారం ఉంటుంది. బదులుగా సుమారు 25 సంవత్సరాల పాటు చైనాకు ఇరాన్‌ తక్కువ ధరలకు చమురును సరఫరా చేస్తుంది.

అయితే ఇరాన్‌ లో మాత్రం ఈ ఒప్పందంపై పూర్తి మద్దతు కన్పించటం లేదు. చైనాకు – దేశాన్ని తాకట్టు పెట్టడమే అంటూ చాలామందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో చైనా ఇలాంటి ఒప్పందాలు చేసుకొని వారిని లొంగదీసుకుంటున్న వైనం చూసి ఇరానియన్లలో ఈ భయం నెలకొంది. కానీ… అమెరికా ఆంక్షలతో ఆర్థికంగా దిగజారుతున్న నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వానికి చైనానే కల్పతరువులా కనిపిస్తోంది.

మామా ఏక్‌ సాల్‌ హోగయా అంటున్న రామ్‌


ఇస్మార్ట్ శంకర్. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు, హీరో రామ్‌ పోతినేనికి పునర్జన్మలాంటి మూవీ ఇది. వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎలాంటి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. ఇద్దరి కెరీర్లో బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. నటనకు స్వస్తిచెప్పి ప్రొడ్యూసర్గా మారిన హీరోయిన్‌ చార్మి కి కూడా టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఈ మూవీ విడుదలై ఈ రోజుకు (జులై 18) సరిగ్గా ఏడాది అవుతోంది. ఈ సందర్భాన్ని చిత్ర బృందం సెలబ్రేట్‌ చేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా వేర్వేరు తమ తమ ఇళ్లకే పరిమితమైన వాళ్లు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. హీరో రామ్‌ ‘మామా.. ఏక్ సాల్ హో గయా’ అని ట్వీట్‌ చేశాడు. ‘జయాపజయాల గురించి ఆలోచించకు… అభిప్రాయాల గురించి ఆందోళన వద్దు… నీకు నచ్చినట్టుగా, నిన్ను సంతోషంగా ఉంచే వాటి గురించి తప్ప వేరే వాటిని అస్సలు పట్టించుకోకు.. ఇస్మార్ట్ శంకర్ నాకెప్పుడూ ప్రత్యేకమే’ అంటూ ఎమోషనల్ మెసేజ్‌ ఇచ్చాడు. #1YearForiSmartShankar అనే హ్యాష్‌ ట్యాగ్‌ జతచేశాడు.

 

కాజల్‌, బెల్లకొండ శ్రీను మధ్య ఏముందబ్బా!

డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రొడ్యూసర్ చార్మి, హీరోయిన్లు నిధి అగర్వాల్‌, చాందిని, సత్యదేవ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్ మణిశర్మకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘మై గన్ !! మిమ్మల్ని కలవడం, మీరు ఇస్మార్ట్ శంకర్ ను నా కళ్ళ ముందే సృష్టించడం చూడటం నా జీవితంలో మరపురాని అనుభవాల్లో ఒకటి. మరెవరూ చేయలేని విధంగా నన్ను భిన్నంగా చూసినందుకు ధన్యవాదాలు. లవ్‌ యూ, మిమ్మల్ని కలకుండా ఉండలేకపోతున్నా’ అని పూరిని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. ఆపై, ‘ప్రతీ రోజూ ఎంతో కష్టపడి పని చేసిన మా లిటిల్ బాస్ నిర్మాత ఛార్మీకి థ్యాంక్స్.. హాట్ హాటర్ హాటెస్ట్ నిధిఅగర్వాల్‌, మై క్రేజీ చాందినీ. మై ఫైర్ గర్ల్స్‌. సత్యదేవ్ చాలా టాలెంటెడ్‌ యాక్టర్. మణిశర్మ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు’ అని వరుస ట్వీట్స్‌ చేశాడు. రామ్‌ ట్వీట్‌పై పూరి కూడా స్పందించాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్ సక్సెస్‌తో నా జీవితంలోకి తిరిగి శక్తి వచ్చింది. నాపై నమ్మకం ఉంచిన రామ్‌కు థ్యాంక్స్. ప్రతి రోజ ఓ పండగలా గడిచింది. నిన్ను కలిసి గట్టిగా హత్తుకోనేదాకా నేను వేచి ఉండలేపోతున్నా. మీ అందరికీ మరోసారి థ్యాంక్స్‌. నువ్వు తురుమ్‌ రా’ అని ట్వీట్‌ చేశాడు.

 

 

ఏపీలో రూ.200కోట్ల వసూళ్ల కలకలం?


10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు..? అవురావురు మంటూ ఉన్నట్టున్నారు.? ఇదే అదునుగా దోచేశారా? అంటే ఔననే అంటున్నారు కార్మిక సంఘాలు.. నిరుద్యోగులు.. అందుకే ఏపీ సీఎం జగన్ ఎంత పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ముందుకెళ్తున్నా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. తాజాగా ఏపీలో ఎమ్మెల్యేలపై రూ.200 కోట్ల వసూళ్ల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఏపీలో ఎమ్మెల్యేలు ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10లక్షల చొప్పున 5వేల మంది నుంచి రూ.200కోట్ల వసూళ్లు చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నట్టు ఆరోపణలొస్తున్నాయి.

Also read:- కరోనా వేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు?

ఏపీలో ఇటీవలే విద్యుత్ శాఖలో 12000 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయ్యాయి. అయితే పర్మినెంట్ అవుతుందని.. జీతాలు బాగా ఉండడంతో చాలా మంది నిరుద్యోగుల నుంచి వీటికి డిమాండ్ ఏర్పడింది.

దీంతో కొందరు ఎమ్మెల్యేలు ఈ ఒక్కో పోస్టును పైరవీలతో రూ.10లక్షలకు నిరుద్యోగులకు అమ్ముకున్నట్టు ఆరోపణలున్నాయి. 5వేల మంది నుంచి డబ్బులు కలెక్ట్ చేశారని అంటున్నారు. మొత్తం రూ.200 కోట్ల వరకు ఈ వసూళ్లు జరిగాయనే ప్రచారం కలకలం రేపుతోంది.

ఈ వసూళ్ల బాగోతాన్ని సీఐటీయూ కార్మిక అనుబంధం సంఘం యూనైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు 10లక్షల చొప్పున రూ.200కోట్లు వసూలు చేశారని ఆరోపించింది. ఈ విషయం సీఎం జగన్ కు తెలియడంతో పోస్టుల భర్తీని నిలిపివేయాలని అప్పట్లో ఆదేశించారు.

Also read:- సోషల్ మీడియాలోనే తెలుగు తమ్ముళ్ల ఆరాటం..!

ఆరోపణలు రావడంతో ఏపీ సీఎం జగన్ ఈ కాంట్రాక్టు పోస్టులను రద్దు చేశారు. వాటి నియామకాలను ఆపు చేశారు. దీంతో నిరుద్యోగులు ఇప్పుడు ఎమ్మెల్యేల వెంట పడుతున్నారట.. తమ పది లక్షలు అయినా ఇవ్వండి లేదంటే ఉద్యోగాలైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.. ఒత్తిడి ఎక్కువ కావడంతో తాజాగా నెల్లూరులో 15మంది ఆపరేటర్లను తొలగించి కొత్తవారిని నియమించారు. ఇది వివాదాస్పదమైంది. సీఐటీయూ, తీసేసిన ఉద్యోగులు ఆందోళన చేయడంతో ఈ వసూళ్ల బాగోతం బయటపడింది.

కోవిడ్ ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు!

Private hospitals

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు అస్సలు అమలు కావడం లేదు. కరోనా బారిన పడ్డ రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే.. లక్షల్లో బిల్లుల మోత మోగుతోంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు గళమెత్తాయి. నెట్టింట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా చికిత్సల కోసం గత నెలలో ప్రైవేట్‌ కి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. ఐసీఎంఆర్ గైడ్‌ లైన్స్ పాటించే ఆస్పత్రుల్లో వైద్యుల సూచనల మేరకే కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న రోగులకు పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు

తెలంగాణ ప్రభుత్వము విడుదల చేసిన సర్కులర్ :-

గత జూన్ 15న తెలంగాణ ప్రభుత్వము ఓ సర్క్యులర్ విడుదల చేసింది. కరోనా టెస్టులకు ఫీజు రూ.2,200గా నిర్ణయించారు. ఇంటికి వచ్చి పరీక్షిస్తే రూ.2800. అలాగే కరోనా రోగులకు వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తే రోజుకు రూ. 7,500, ఐసోలేషన్‌ లో ఉంచితే రోజుకు రూ.4,000, వెంటిలేటర్‌ పై ఉన్న వారికి రోజుకు రూ. 9,000 చార్జి వసూలు చేయవచ్చని ఆ సర్క్యులర్‌ లో పేర్కొంది. అయితే యాంటి వైరల్ డ్రగ్ అవసరమైతే సపరేట్ చార్జీలు వసూలు చేయవచ్చని తెలిపింది. అయితే ఫీజుల అమలు బాధ్యతను మాత్రం గాలికొదిలేసి కోవిద్ కాలాన్ని క్యాష్ చేసుకుందేకే మొగ్గుచూపుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బాధితులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు గర్హనీయమని ఖండిస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ కొంచం స్పీడ్ తగ్గిస్తే మంచిది!

Pawan kalyan

రాజకీయాలు వేరు, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు అనే విషయాన్ని పవన్ ఫ్యాన్స్ మరిచిపోతున్నట్లు ఉన్నారు. జనసేన పార్టీకి విరాళాలు సేకరించాలన్న ఆలోచనతో ఓ జనసేన కార్యకర్త పవన్ కళ్యాణ్ అభిమాని ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రతి జనసేన కార్యకర్త, అభిమాని రూ. 100 పార్టీకి విరాళంగా ఇవ్వాలని ట్వీట్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్‌ డే సందర్భంగా 2 కోట్లు ట్వీట్లు చేస్తూనే రూ.100 పార్టీకోసం విరాళంగా ఇవ్వాలంటూ ఆ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తద్వారా రూ.200 కోట్లు పార్టీకి విరాళంగా సేకరించాలని పిలుపునిచ్చారంటూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన కథనం వైరల్‌ గా మారింది. ట్వీట్ చేసిన జనసైనికుడిని జనసేన పార్టీ అధిష్టానం గుర్తించింది. అప్పటికే ఈ ట్వీట్ వైరల్ అయ్యింది. ఒక్క ట్విటర్ పైనే కాదు ఇతర సోషల్ మీడియా సైట్స్ అంటే వాట్సాప్‌ లలో కూడా ఈ మెసేజ్ సర్క్యులేట్ అయ్యింది. ఈ మెసేజ్‌లో జనసేన పార్టీ బ్యాంకు ఖాతాతో పాటు ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ మెసేజ్‌ ను ఖండించింది జనసేన పార్టీ ఉన్నత వర్గాలు. జనసేన పార్టీ అభిమానుల నుంచి డబ్బులు సేకరించడాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌ తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పిన జనసేన… సర్క్యులేట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్‌ లో డబ్బులు డిపాజిట్ చేయొద్దంటూ అధికారికంగా అభిమానులకు పార్టీ హైకమాండ్ చెప్పలేదు. ఇదిలా ఉంటే మెసేజ్‌లో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబరు జనసేనదే అని మాత్రం పార్టీ ధృవీకరించింది.

ఏది ఏమైనా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార పక్షంపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పలు అంశాలపై నిప్పులు చెరుగుతోంది. వార్తల్లో నిలుస్తోంది. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ట్విటర్‌ కే పరిమితమవుతూ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిల్లో ఆయన ప్రమేయం లేకుండా ఎదుర్కొంటున్న విమర్శలలో ఈ రూ.200 కోట్ల పార్టీ విరాళం కూడా ఒకటి. కాబట్టి పవన్ ఫ్యాన్స్ కొంచం స్పీడ్ తగ్గిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.