ఓటమి ఎరుగుని స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పటిదాకా 11 సినిమాలు తీస్తే అన్నీ విజయం సాధించాయి. కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి రికార్డులు బద్దలు కొట్టాయి. 2015లో వచ్చిన బహుబలి భారత సినీ రంగంలోనే మలుపు. వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆ చిత్రం తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటింది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి రేంజ్ మారిపోయింది. ఈ రెండు చిత్రాలు కలిపి 2 వేల కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడడంతో ఇండియాలో మరే దర్శకుడు సాధించని ఘనతను రాజమౌళి అందుకున్నాడు. బాహుబలి తర్వాత చాలా విరామం తీసుకున్న ఈ దర్శక దిగ్గజం.. ‘ఆర్ఆర్ ఆర్’ మూవీని ప్రకటించాడు. అప్పటి నుంచి ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీగా మారిందీ ప్రాజెక్ట్. పలువురు ఫారిన్ యాక్టర్లు కూడా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగణ్, ఆలియా భట్‌తో పాటు సముద్రకని, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషిస్తునారు. హాలీవుడ్ యాక్టర్లు రే స్టీవెన్సన్, ఒలీవియా మోరిస్, అలీసన్ డూడీ కూడా మేజర్ రోల్స్ ప్లే చేస్తున్నారు. వర్కింగ్ టైటిల్‌నే రౌధ్రం రణం రుధిరం అనే ఫుల్‌ఫామ్ ఇచ్చి టైటిల్ ఖరారు చేసిన చిత్ర బృందం.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలన్ని ప్లాన్ చేసింది.
Also Read: పవన్ సరనన రకుల్.. నిజమేనా క్రిష్!
ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్కు, రామ్ చరణ్ అల్లూరి పాత్రను రివీల్ చేస్తూ వచ్చిన టీజర్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో దాదాపు యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. జోరుగా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లో కరోనా మహమ్మారి ఈ మూవీ ప్లాన్స్‌ను దెబ్బకొట్టింది. లాక్‌డౌన్ కారణంగా మార్చి నుంచి షూటింగ్ ఆగిపోయింది. మూడు నెలల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌కు అనుమతించాయి. దాంతో, టెస్టు షూట్ చేసి తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావించింది. కానీ, హైదరాబాద్‌లో కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు రాజమౌళి. కనీసం టెస్టు షూట్ కూడా చేయలేకపోయారు. అయితే, పరిస్థితులు మెరుగైతే ఆగస్టు నుంచి అయినా తిరిగి సెట్స్‌పైకి వెళ్లాలని అనుకున్నారు. అది కూడా జరగడం లేదు.
Also Read: డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !
ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో వ్యాక్సిన్ వచ్చేదాకా షూటింగ్ పేరెత్తకూడదని చిత్రబృందం ఓ అంచనాకు వచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన కనీసం నవంబర్ వరకూ చిత్రీకరణ వద్దని నిర్ణయించుకున్నారట. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్‌తో తీస్తున్న మూవీ. నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 300 నుంచి 400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు తొందరపడి పని చేసి.. నటీనటులను కానీ, సాంకేతిక సిబ్బందిని కానీ రిస్క్‌లోకి నెట్టకూడదని దానయ్య, రామమౌళి ఏకాభ్రియానికి వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో, నవంబర్ వరకూ వేచి చూడడమే మంచిదని, ఈ విషయాన్ని యూనిట్ మొత్తానికి తెలియజేశారని సమాచారం. దాంతో, ఇప్పటికే 2020 నుంచి 2021కి వాయిదా పడిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో కూడా రిలీజయ్యే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ లోపు వ్యాక్సిన్ రాకపోతే ఈ మూవీ 2022కు వాయిదా పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే విషయం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని ఆశిస్తున్న అభిమానులు మరికొంతకాలం నిరీక్షించక తప్పదు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Rrr movie to be release in 2021
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com