Home Blog Page 8390

ప్రభుత్వ ఉద్యోగుల రాజకీయం.. ఏంటిది?


ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని సీఎం జగన్.. చేయకూడదని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు చెరో రూట్ లో ఫైట్ చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి పేరిట అక్కడి రైతులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇటు విశాఖ వాసులు తమ ప్రాంతానికి రాజధాని రావాలని సమర్థిస్తున్నారు.

Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

ఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి విశాఖపట్నంకు మార్చాలనే విషయంలో పార్టీల్లో కూడా నాయకులు చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సీమ, ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర నేతలు, ప్రజలు జగన్ సర్కార్ నిర్ణయంపై విడిపోయారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులుగా రాజధాని ఎక్కడికి మార్చినా పోయి విధులు నిర్వర్తించడం వారి విధి. కానీ తాజాగా హైకోర్టులో జరుగుతున్న రాజధాని మార్పులోకి సచివాలయ ఉద్యోగులు కూడా ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నంకు మార్చడాన్ని సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. వెంకటరామిరెడ్డి హైకోర్టులో ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతానికి మారడానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తప్ప ఉద్యోగులకు వేరే మార్గం లేదని.. తాము సమర్థిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

అయితే ఉద్యోగుల్లో దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వ వాదనను తలకెత్తుకోవడంపై మండిపడుతున్నారు.
అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా మనం ఎందుకు వ్యాఖ్యలు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. అది ప్రభుత్వం అనుసరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించలేనప్పుడు, ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా ఎందుకు వ్యాఖ్యానించాలని ఉద్యోగుల్లోని ఒక వర్గం వాదిస్తోంది.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికోసం పనిచేస్తారు. కానీ ప్రస్తుతం ఉద్యోగులు కూడా పార్టీల వారీగా చీలిపోయి ఏకంగా ప్రభుత్వాలకు మద్దతుగా హైకోర్టులో పిటీషన్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.

జగన్ ‘ఇంగ్లిష్ మీడియం’కు కొత్త చిక్కులు?

CM Jagan


కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టనుంది. గడిచిన 34ఏళ్లుగా కొనసాగుతున్న విద్యా విధానాన్ని సమూలంగా మార్చేందుకు మోడీ సర్కార్ పూనుకుంది. పాత విద్యావిధానం నేటి సాంకేతికకు తగ్గట్లు లేవని భావించినా కేంద్రం కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఇటీవల నిర్ణయం తీసుకుంది. కేంద్రం క్యాబినెట్ నిర్ణయానికి ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది.

Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ

కొన్ని దశాబ్దాలుగా విద్యావిధానంలో ఎలాంటి మార్పులు జరుగలేదు. దీంతో కాలానికి తగ్గట్టు విద్యార్థుల నైపుణ్యాలు పెరగడంలేదని వాదనలు విన్పించాయి. ఇక కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ తాజాగా విద్యావిధానంలో సంస్కరణలు అమలు చేసేందుకు ముందుకొచ్చింది. మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్న విద్యా విధానానికి స్వస్తి పలికింది. ప్రస్తుత సాంకేతికను అందిపుచ్చుకునేలా మోడీ సర్కార్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది.

మోడీ సర్కార్ నూతన విద్యా విధానానికి ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే ఇది జగన్ సర్కార్ కు కొంత ఇబ్బంది తెచ్చిపెట్టేలా కన్పిస్తుంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని రాష్ట్రాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలల్లో ఎలా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. దీంతో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంగ్లీష్ మీడియం చదువులకు బ్రేకులు పడినట్లే కన్పిస్తుంది.

Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

సీఎం జగన్ ఏపీలో ఒకటో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువులను అమలు చేయాలని భావించారు. రానున్న రోజుల్లో విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలని భావించారు. జగన్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు వ్యతిరేకించినా జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులను అమలు చేసేందుకే మొగ్గుచూపారు. జగన్ నిర్ణయంపై పలువురు హైకోర్టుకు కూడా వెళ్లారు.

ఇదిలా ఉంటే కేంద్రం తాజాగా నూతన విద్యావిధానంలో ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యార్థులకు బోధించాలని కండిషన్ పెట్టింది. దీంతో జగన్ ఇంగ్లీష్ మీడియం చదువులకు బ్రేక్ పడేలా కన్పిస్తుంది. మరోవైపు ఐదో తరగతి దాకా తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలంటే అంత సులభం కాదనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ విషయంలో సీఎం జగన్ ఏవిధంగా ముందుకెళుతారో వేచి చూడాల్సిందే..!

మెగాస్టార్ ను చూసి బాలయ్య ఇలా చేయడం విశేషమే !


నట సింహం నందమూరి బాలకృష్ణకు ఒక వీక్ నెస్ ఉంది, నచ్చితే ఆదరిస్తారు, నచ్చకపోతే ఎదురు పడినందుకే కొడతానంటారు. ఏమైనా బాలయ్య స్టైలే వేరు. ప్రస్తుతం బాలయ్య ఓ మంచి పని చేశారు. కరోనాతో పోరాడి రోగానిరోధిక శక్తిని పెంచే మందులను సినీ కార్మికులకు అందచేశారు. నేటితో ఈ కార్యక్రమం పూర్తయింది. దాదాపు పది వేలమందికి పైగా బాలయ్య మందులను పంపిణి చేశారు. అయితే ఇదంతా బాలయ్య చేయడానికి ఓ కారణం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాపిక్ బాగా హల చల్ చేస్తోంది. సీసీసీ అంటూ మెగాస్టార్ నిత్యవసర వస్తువుల పంపణీకి హెడ్ గా ఉంటూ మంచి పేరు కొట్టేశారు. నిజానికి సీసీసీకి కూడా బాలయ్య భారీ విరాళం ఇచ్చారు.

Also Read: తగ్గాల్సిన టైమ్‌లో పెంచేసిన పూజా హెగ్డే!

అలాగే మిగిలిన హీరోలు కూడా భారీ విరాళాలు ఇచ్చారు. కానీ పేరు మాత్రం మెగాస్టార్ కే పోయింది. దాంతో బాలయ్య తనకు కూడా అలాంటి పేరు రావాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు ఈ మందుల కకార్యక్రమాన్ని చేపట్టారట. మొత్తానికి మెగాస్టార్ పేరు చూసి బాలయ్య ఇలా చేయడం విశేషమే. సరే.. ఎవరు ఉద్దేశ్యాలు ఏమయితే ఏం.. కష్టాల్లో ఉన్న కార్మికులు బాగుపడుతున్నారు. ఇలాగే ప్రతి హీరో పర్సనల్ గా కూడా సినీ కార్మికులకు ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇక బాలయ్య అంటేనే యాక్షన్, కానీ బాలయ్య సినిమాలు మారబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య మారాడు. తన సినిమాల కథల విషయంలో ముఖ్యంగా తన సినిమాలోని యాక్షన్ విషయంలో బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Also Read: పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్‌

అందుకే ఇక నుండి తను చేయబోయే సినిమాల్లో కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమాలో కూడా కొత్తదనం ఉండబోతుందట. మెయిన్ గా పాత్రలో వైవిధ్యంతో పాటు, కొత్త తరహా కథల్లో నటించాలని గతంలో తానూ అలాంటి కథల్లోనే నటించానని.. కానీ గత ఇరవై ఏళ్లుగా యాక్షన్ కథలకే పరిమితం అయ్యాననే బాధ బాలయ్యలో ఎక్కువ ఉందట, అందుకే కాస్త కొత్తదనం కోసం బాలయ్య ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏమైనా ఈ తరం యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షుకులను ఆకట్టుకోవాలంటే బాలయ్య కొత్తదనాన్ని నమ్ముకోవడమే ఉత్తమం.

‘పూజా హెగ్డే’ పై నాగ్ అసంతృప్తి !


‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో అఖిల్ అక్కినేని సరసన బుట్ట బొమ్మ అని ఈ మధ్య బాగా ప్రమోట్ చేయించుకుంటున్న ‘పూజా హెగ్డే’ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మొన్న కపుల్ పోస్టర్ పేరుతో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అఖిల్ వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే కాలితో టీజ్ చేసే ఈ స్టిల్ యూత్ కి అండ్ అక్కినేని అభిమానులకు ఎలా ఉందో తెలియదు గాని, అక్కినేని నాగార్జునకు మాత్రం అస్సలు నచ్చలేదు అట. ఇలాంటి పోస్టర్ ను రిలీజ్ చేసేటప్పుడు కనీసం తనకు ఒకమాట చెప్పాల్సింది కదా అని చిత్రబృందం పై అసంతృప్తిని వ్యక్తం చేశాడు నాగ్.

Also Read: మొహమాటం లేకుండా డైరెక్ట్ గా హీరోనే అడిగేసింది!

పూజా హెగ్డే కాలిని అఖిల్ చెవ్వును తాగడం, పైగా పోస్టర్ లో అఖిల్ కంటే కూడా పూజా హెగ్డే సన్నటి కాలే ఎక్కువ హైలైట్ అవ్వడంతో నాగ్ కి బాగా కోపం తెప్పించిందట .రొమాంటిక్ ఫీల్ వ‌స్తుందనే ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసామని వివరణ ఇవ్వబోగా.. నాగ్ కోపంగా లేచి వెళ్ళిపోయారని.. ఆ తరువాత బన్నీవాసు నాగార్జునకి ఫోన్ చేసి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా అవుట్ ఫుట్ పట్ల కూడా నాగ్ పూర్తి సంతృప్తిగా లేరనట్లు తెలుస్తోంది.

Also Read: త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ

ముఖ్యంగా అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ లో అఖిల్ కంటే పూజానే ఎక్కువ హైలైట్ చేశారని.. దానికి తోడు అఖిల్ క్యారెక్టర్ కూడా హీరోయిన్ క్యారెక్టర్ కంటే తక్కువ ప్రాధాన్యత ఉందని నాగ్ ఫీల్ అయ్యారట. మొత్తానికి అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ ప్లాప్ కావడంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు నాగ్. నాగ్ కూడా ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులను చెక్ చేస్తున్నాడు. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ కి అస్సలు టైం కలిసి రావడం లేదు. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

బాబు బ్రాండ్ ఇమేజ్ కాశ్మీర్ దాకా పాకింది.


బాబుకు ఏళ్లుగా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయనను వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసడర్ గా చెప్పుకుంటారు. పిల్లనిచ్చి, పదవులు కట్టబెట్టిన మామ ఎన్టీఆర్ కి గ్రూపు రాజకీయాల దెబ్బేమిటో అప్పట్లోనే చూపించాడు. చంద్రబాబు వైస్రాయ్ హోటల్ రాజకీయం అనేక మందికి స్ఫూర్తిగా నిలిచింది. అందుకే ప్రభుత్వాలను పడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా శాసన సభ్యులను హోటళ్లలో దాచి రాజకీయాలు చేస్తున్నారు. అంత గొప్పగా గ్రూపు రాజకీయాలను జాతీయ స్థాయిలో పాపులర్ చేసిన నాయకుడు చంద్రబాబు. చంద్రబాబు దగ్గర ఉన్న మరో ఉత్తమ క్వాలిటీ అవకాశవాద రాజకీయం. ఎవడైనా అవసరం ఉన్నంత వరకే, తరువాత కనీసం పట్టించుకోవడం కూడా మానేస్తాడు.

Also Read: విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ

అవసరం ఉంటే భజన చేస్తూ చుట్టూ తిరిగే బాబు, లేదంటే కనీసం కన్నెత్తి కూడా చూడడు. అందరికీ తెలిసిన ఈ విషయం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి జె కె ఎన్ సి నేత ఒమర్ అబ్దుల్లాకు ఇప్పుడే అవగతం అయినట్లు ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పట్ల బీజేపీ తీరును విమర్శిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, చంద్రబాబు నమ్మక ద్రోహాన్ని, అవకాశవాద రాజకీయాలను ప్రస్తావించడం జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో ముస్లిమ్ మైనారిటీ ఓట్ల కోసం టీడీపీ తరుపున ప్రచారానికి ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను బాబు దించారు. ఆయన చంద్రబాబును ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడం జరిగింది. అలాగే జగన్ మరియు బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అయిపోయాయి, ఫరూక్ అబ్దుల్లా ప్రసంగాలు పనిచేయలేదని బాబుకు అర్థం అయ్యింది. దానితో ఫరూక్ అనే నేత ఉన్నాడన్న సంగతి బాబు మర్చిపోయాడు.

Also Read: బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

కాగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో సంక్షోభం కొనసాగుతుండగా, బాబు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడాన్ని ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ఆనాడు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం నాన్నగారి చేత ప్రచారం చేయించుకున్న చంద్రబాబు అవసరం తీరగానే పట్టించుకోవడం లేదు అన్నారు. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాకు అనుకూలంగా, బీజేపీ కి వ్యతిరేకంగా బాబు ఎలా మాట్లాడుతాడు చెప్పండి. బాబు అప్పటి అవసరాలు వేరు, ఇప్పటి అవసరాలు వేరు. ఆయన మనసు ప్రస్తుతం బీజేపీ తో స్నేహం కోరుకుంటుంది. ఏది ఏమైనా ఇప్పటి దాకా తెలుగు రాష్ట్రాలకే తెలిసిన చంద్రబాబు అనారోగ్యకర రాజకీయాలు దేశ వ్యాప్తంగా తెలిశాయి. బాబు మార్కు రాజకీయాలు ఎలా ఉంటాయా అని ప్రముఖులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !


సినిమా ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్స్ చాల సహజం. అయినా తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను ఒడ్డి, సర్వస్వం పోగొట్టుకున్న దర్శకనిర్మాతలు ఫిల్మ్ నగర్ లో వినిపించే ప్రతి కామెంట్ వెనుక ఒక్కరు ఉంటారు. ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే హీరో అనే క్రెడిట్ అంత కిక్ ను ఇస్తోంది మరి. అయితే అలాంటి సన్ స్ట్రోక్ యవ్వారమే పూరి ఫ్యామిలీది. తన కొడుకు ఆకాష్ పూరి కోసం పూరి జ‌గ‌న్నాథ్ తనకున్న కాస్త డబ్బును పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ పూరి మొదటి సినిమాకే పూరికి పదిహేను కోట్లు వరకూ లాస్ అని పూరి ఆఫీస్ నుండే బయటకు రూమర్స్ వినపడ్డాయి.

Also Read: త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ

ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్‘ కోసం కూడా పూరి జ‌గ‌న్నాథ్ బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పైగా సినిమాలో మాజీ హాట్ బ్యూటి నగ్మా కూడా నటిస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడం కోసం ఈ విషయన్నిదాచారట.

నగ్మా ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోందని.. అంటే ఆకాష్ పూరికి నగ్మా అత్తగా కనిపించబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో నగ్మా ఎన్టీఆర్ కి అత్తగా కనిపించి బాగానే అలరించింది. ఇప్పటికీ ఏ మాత్రం అందం ఒంటిలో బిగువు తగ్గని ఈ మాజీ బ్యూటీ మోడ్రన్ అత్తగా అలరిస్తుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. నగ్మా లాంటి ఆల్ టైం బ్యూటీని ఆకాష్ పూరికి అత్త అని పిలవడం కాస్త ఇబ్బందే.

Also Read: మొహమాటం లేకుండా డైరెక్ట్ గా హీరోనే అడిగేసింది!

ఏమైనా హాట్ అండ్ మోడ్రన్ అత్త పాత్రలకు నగ్మా పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమాలో ఘాడమైన ప్రేమ సన్నివేశాలతో పాటు యూత్ ను బాగా ఆకట్టుకునే బోల్డ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా.. రాకపోతే మాత్రం పూరి దుకాణం సర్ధేసుకోవడమే. ఎందుకంటే పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూరి బాగా ఖర్చుపెట్టాడు.

ఒక్క ప్లాప్ కే మరీ ఇంత చులకన !


మాస్ డైరెక్టర్.. వరుస హిట్స్.. పైగా ఓ పొలిటికల్ పార్టీ అండదండలు.. పార్టీ యాడ్స్ తోనే కోట్లు సంపాదన.. మొత్తంగా యాక్షన్ అంటూ హడావుడి చేసే ‘బోయపాటి శ్రీను’ గతం ఇది. కానీ, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత, బోయపాటి కాస్త బోయవాడి పిట్ట కోసం వెతుక్కునట్లు సినిమా కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ గతంలో ఇచ్చిన హిట్స్ ఫలితంగా బాలయ్య బాబు, పిలిచి అవకాశం ఇచ్చాడు. అయితే బాలయ్యతో సినిమా సెట్ చేసుకోవడానికి నిర్మాతలను ఒప్పించుకోవడానికి బోయపాటి చాల టైం తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బోయపాటికి ఎన్నో అవరోధాలు.. అన్ని అడ్డంకులు దాటుకుని చివరికి కరోనా ముందు సినిమా ఆపెసుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో బోయపాటి ఉండిపోయాడు.

Also Read: త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ

నిజానికి కరోనా తగ్గాక సినిమా మొదలుపెట్టే ఆలోచనలో మొన్నటివరకూ బోయపాటి ఉన్నా … ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడ్జెట్ విషయంలో మార్పులు చేయాలి. నిర్మాత 10 కోట్లు వరకూ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించమని ఆర్డర్ జారీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేయాలి. బడ్జెట్ తగ్గించే సీన్స్ ను మళ్ళీ రాసుకోవాలి. ఆ సీన్స్ బాలయ్య బాబుకు నచ్చాలి. బాబుకు నచ్చాలి అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు, మొత్తానికి కరోనా తగ్గినా బోయపాటికి ఇప్పట్లో షూటింగ్ అయితే ఉండదు. పాపం ఒక్క ప్లాప్ కే బోయపాటి మరీ ఇంత చులకన అయిపోతాడనుకోలేదు.

Also Read: అరివీర భయంకర.. అధీరా!

కనీసం ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల విజయాలను చూసైనా నిర్మాత బడ్జెట్ ఇవ్వాల్సిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తొన్నా.. గత కొన్ని సినిమాలుగా బాలయ్యకు పది కోట్లు మార్కెట్ లేదు. మరి ప్లాప్ ల్లో ఉన్న బాలయ్య మీద నలభై ఏభై కోట్లు అంటే కచ్చితంగా రిస్క్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్స్ వచ్చినా.. ప్రధానంగా ‘మోనార్క్‌’ అండ్ ‘డేంజర్’ అనే టైటిల్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇక సినిమా టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసినా పెద్దగా సెన్సేష‌న్ క్రియేట్ చేయలేకపోయింది. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా ప్లాప్ వస్తే ఇక కెరీర్ ను ముగించడం మంచింది.

విద్యావ్యాపారాన్ని ప్రక్షాళించిన మోదీ


నర్సరీకే వేలకు వేల ఫీజులు.. ఇక పదోతరగతి వచ్చేవరకు లక్షలు స్కూలు ఫీజుగా కట్టాలి. ఇంటర్ విద్య భరించలేనంతగా ఉంది. ఈ దేశంలోనే అన్నింటికంటే మంచి వ్యాపారం ‘విద్య’నే. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పడకేసిన వేళ ప్రైవేట్ దోపిడీ ఎక్కువైపోయింది. విద్య దేశంలో మంచి వ్యాపారమైంది. నర్సరీకే 30వేల వరకు ఫీజులు వసూలు చేస్తుండగా.. పదోతరగతి వరకు లక్ష రూపాయాలపైనే ముక్కుపిండి తీసుకుంటున్నారు. తల్లిదండ్రులంతా సంపాదన అంతా పిల్లల స్కూల్ ఫీజులకే పోతున్న దైన్యం దేశంలో ఉంది. ఇక ఇంటర్ విద్యా అంటేనే లక్షల్లో పని. ఎంసెట్, ఇంజినీరింగ్ కోర్సుల కోసమంటూ పది లక్షల వరకు ప్యాకేజీలతో తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. దేశంలో ఇలాంటి భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను ప్రధాని మోడీ ప్రక్షాళన చేశారు. ప్రైవేట్ కు కాసులు కురిపిస్తున్న ‘ఇంటర్’ విద్యనే లేపేశారు.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

దేశంలో విద్యావిధానంలో కేంద్రం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యావిధానానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏకంగా మానవ వనరుల అభివృద్ధి శాఖను ‘విద్యా మంత్రిత్వశాఖ’గా మార్పు చేసింది.

ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు చేసింది. ఇకపై ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. బహు బాషలను ప్రోత్సహించే క్రమంలో 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చేయనున్నారు.

మోడీ ఏకంగా 3-18ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశ పెట్టి 2030 వరకు అందరికీ విద్యను అందించడమే ధ్యేయంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

అన్నింటికంటే లక్షల ఫీజులు ఉండే ఇంటర్ విద్యను తీసేశారు. ప్రస్తుతం 10వతరగతి తర్వాత ఇంటర్ రెండేళ్లు , డిగ్రీ 3 ఏళ్ల విద్యా విధానం మార్చేసి.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం ఉంటుదని తేల్చేశారు. డిగ్రీ విద్య 3 నుంచి నాలుగేళ్లు.. పీజీ ఏడాది నుంచి రెండేళ్లు ఉంటుంది.

Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?

దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకే కరికులమ్ పెట్టి.. పాఠ్యాంశాల భారం తగ్గిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని మోడీ సర్కార్ తగ్గించింది. ఇక ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేలా 6వ తరగతి నుంచే వొకేషనల్ , కోడింగ్, ప్రోగ్రామింగ్ కరికులమ్ కోర్సులు ప్రవేశపెట్టింది.

ఇలా మోడీ బట్టి విధానంతో ర్యాంకుల వెంట పడే ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలకు చెక్ పెట్టింది. విద్యార్థుల్లోని తెలివితేటలను పెంచేలా సమూలంగా మార్చేసింది. ఇక నుంచి ర్యాంకులు, బట్టి విధానం ఉండకుండా విద్యార్థుల మేథోశక్తిని పెంచేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దింది. మోడీ ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశ విద్యను సమూలంగా మార్చిన మోడీపై విద్యావేత్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

-ఎన్నం

బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

Chandrababu Politics


ఎవరైనా ఒకసారి తప్పుచేసి బొక్కబొర్లా పడితే దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నారు. మళ్లీ అలాంటివి జరుగకుండా జాగ్రత్త పడతారు. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి అత్యంత అవసరం. 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మాత్రం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ టీడీపీ విషయంలో చంద్రబాబు చేసిన తప్పునే ప్రస్తుతం ఏపీలోనూ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తన ట్రాప్ లోకి లాగి తెలంగాణలో టీడీపీ దెబ్బతీశారు. దీంతో తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్రమంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారు. గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి ఏపీలో అమలు చేస్తున్నారు. టీడీపీని ఒక ప్రాంతానికి పరిమితం చేసేలా కేసీఆర్ నాడు ఎలా సక్సస్ అయ్యారో అలానే జగన్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యూహాంలో భాగంగానే మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడిని అమరావతికే పరిమితం చేయడం ద్వారా మిగిలిన ప్రాంతంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతున్నాయి. జగన్ మూడు రాజధానుల అంశంతో అన్ని ప్రాంతాల్లో వైసీసీ బలపడుతోంది. ఇక టీడీపీ మాత్రం జై అమరావతి స్లోగన్ తీసుకోవడంతో రాయలసీమ, ఉత్తారంధ్రలో ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యాక తెలంగాణపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రాంతంలో దాదాపుగా టీడీపీ కనుమరుగైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధానిపైనే ఫోకస్ పెట్టి మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?

చంద్రబాబు నాయుడు తన అనుభవంతో కర్నూలు, విశాఖ ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలో చెప్పి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటిస్తే రాజకీయంగా అన్ని ప్రాంతాల్లో టీడీపీకి మైలేజ్ ఉండేది. కానీ బాబు మాత్రం కేవలం జై అమరావతి స్లోగన్ తీసుకోవడంతో మిగిలిన ప్రాంతాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ ప్రాంతానికి రాజధాని వస్తే బాబు అడ్డుకుంటున్నారని ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఇక టీడీపీ నేతలు చేసేదిలేక అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. బాబును ఒక ప్రాంతానికి పరిమితం చేయడంలో జగన్ సక్సస్ అవుతున్నారు. టీడీపీ కేవలం అమరావతికే పరిమితం అయితే వచ్చే ఎన్నికల్లో బాబు అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఇకనైనా జగన్ ట్రాప్ నుంచి బయట పడుతారో లేదో వేచి చూడాల్సిందే..!

పయ్యావుల పార్టీ మారబోతున్నారా?


2019 ఎన్నికల తర్వాత టీడీపీకి ఏపీలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన ప్రభంజనంలో టీడీపీ కేవలం 23సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంతో సీఎం జగన్ కు ఎదురులేకుండా పోతుంది. ఇటీవలే సీఎంగా జగన్ ఏడాదికాలం పూర్తి చేసుకున్నారు. సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎంగా పదవీ చేపట్టిన తొలినాళ్లలో జగన్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటి నుంచి త్వరగానే కోలుకుని ముందుకెళుతున్నారు.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

ఓవైపు సంక్షేమం.. మరోవైపు ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చేలా వ్యూహాలతో జగన్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సేలు జగన్ కు జై కొడుతున్నారు. మరికొందరు వైసీపీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జగన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు నాయుడి హయాంలో మంత్రులుగా చేసినంత ఒక్కొక్కరుగా కటకటలా పాలవుతుండటంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ ముఖ్యనేతలంతా సైలంటైపోతున్నారు.

టీడీపీకి నమ్మకమైన నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ తాజాగా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పయ్యావుల కేశవ్ ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తోంది. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు నాడు ఆయనకు ఎమ్మెల్సీ పదవీని కట్టబెట్టారు. ఇక 2019 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిచినా పార్టీ అధికారంలో రాలేదు. కిందటి ఎన్నికల్లో రాయలసీమ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్ ఒకరు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆయనకు పీఏసీ చైర్మన్ పదవీని కట్టబెట్టారు.

Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?

పీఏసీ చైర్మన్ ఉన్న పయ్యావుల కేశవ్ ప్రభుత్వం చేసే ప్రతీరూపాయిని పరిశీలించి ఎండగట్టాల్సిందిపోయి మౌనంగా ఉంటున్నారు. దీంతో పార్టీలో పయ్యావుల తీరుపై చర్చ నడుస్తోంది. సీమలో జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వైసీపీని మరింత బలోపేతం చేస్తుండటంతో టీడీపీ కోలుకునే పరిస్థితి లేదని పయ్యవుల భావిస్తున్నారట. దీంతో ఆయన కూడా టీడీపీ జెండా పీకేసీ వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. అందుకే పయ్యావుల కొద్దిరోజులుగా మౌనంగా ఉంటున్నారని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీతో పయ్యావుల సన్నిహితంగా ఉంటున్నారట.

దీంతో పయ్యావుల కూడా పార్టీ మారుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆయన కూడా పార్టీ మారితే సీమలో టీడీపీ మరింత గడ్డు పరిస్థితులు ఎదురవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో చంద్రబాబు నాయుడు పయ్యావులకు పార్టీ మారకుండా ఉండడానికి ఎలాంటి భరోసా కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో కరోనా.. ఆశ్చర్యపోయే లెక్కలు


తెలంగాణలో కరోనా వ్యాప్తిపై కేసీఆర్ సర్కార్ ఎప్పుడూ నేరుగా చెప్పలేదు. హైకోర్టు హెచ్చరికలతో తాజాగా బులిటెన్ లో మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆశ్చర్యకర లెక్కలు వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో 65 శాతం మందికి పైగా 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు పరీక్షించిన వారిలో 65.7 మంది 21-50 సంవత్సరాల వయస్సులో ఉన్నారని ఆరోగ్య అధికారులు తెలిపారు. 60 ఏళ్లు పైబడిన వారు.. 10 ఏళ్లలోపు వారు తక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు.21-40 ఏళ్లలోపు వారు 47.1 శాతం, 41 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 18.6 శాతం ఉన్నారు. మొత్తం తొమ్మిది వయస్సు వర్గాలలో, 31-40 సంవత్సరాల సమూహం ఎక్కువగా వైరస్ కు ప్రభావితమైంది. 25 శాతం కేసులు వీరివి ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనా వల్ల 300 మంది చనిపోయారు. వీరిలో 192మంది (64శాతం) ఇతర వ్యాధులేవి లేని పూర్తి ఆరోగ్యవంతులు కావడం గమనార్హం. మృతుల్లో 108మంది (36శాతం) మంది మాత్రమే ఇతర వ్యాధులుండి చనిపోయారు.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి పూర్తి వివరాలు బులిటెన్ లో ఉండాలని ఆదేశించింది. తద్వారా కరోనా బారిన ఎవరు పడుతున్నారన్నది తెలుస్తుందని.. అవగాహన పెరుగుతుందని తేలింది. దీంతో తెలంగాణ సర్కార్ బులిటెన్ మార్చేసింది. ఈ బులిటెన్ ద్వారా యువకులు జాగ్రత్తగా ఉండాలని.. సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆరోగ్య అధికారులు విడుదల చేసిన వివరణాత్మక మీడియా బులెటిన్ లో ఈ మేరకు క్లారిటీ వచ్చింది. పరీక్షించిన వారిలో పాజిటివ్ 14.7 మంది 51 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని తెలిసింది.

వైరస్ బారిన పడిన వారిలో 10.9 శాతం మంది 60 ఏళ్లు పైబడినవారని గణాంకాలు చెబుతున్నాయి. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం 3.4 కాగా, 11 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు 5.3 శాతం ఉన్నారు. బులెటిన్ ద్వారా పిల్లలు.. వృద్ధులకు కరోనా వ్యాపించకుండా హాని కలిగించడం లేదని తేలింది. మహిళల కంటే ఎక్కువ మంది పురుషులు పాజిటివ్‌ గా తేలుతున్నారని బులెటిన్ చూపిస్తోంది. అన్ని పాజిటివ్ కేసులలో పురుషులు 65.6 శాతం ఉండగా, మిగిలిన వారు మహిళలు.

Also Read: కరోనా ఎఫెక్ట్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

తెలంగాణ సర్కార్ మృతదేహాల లెక్కలను దాస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఎర్రగడ్డలో రోజుకు 50మందికి దహన సంస్కారాలు చేస్తూ బులిటెన్ లో మాత్రం కరోనా మృతులను 10కి మించకుండా వేస్తుండడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ బులిటెన్ లో ఏదో మతలబు ఉందన్న అనుమానాలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి.

ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

( నిన్నటి భాగం తరువాయి )

andhra-politics

సోము వీర్రాజు నియామకం ఆంధ్రా లో మూడో ప్రత్యామ్నాయానికి బాటలు వేయాలంటే కొన్ని నిర్దిష్ట చర్యలు చేపట్టాల్సి వుంది. నిన్న చర్చించుకున్నట్లు ఈ నియామకం కాపు సామాజిక వర్గంలో కొంత కదలిక వచ్చిన మాట వాస్తవం. కాకపోతే ఇది ఒక్కటే మూడో ప్రత్యామ్నాయానికి, అధికారంలోకి రావటానికి సరిపోవు. గత ప్రజారాజ్యం అనుభవం చూసినా ఇది అవగతమవుతుంది. సామాజిక సమీకరణలు కొంతమేరకే ఉపయోగపడతాయి. అదీ ఒక్క సామాజిక వర్గంతో కాదు. పలు సామాజిక వర్గాల కూర్పు జరగాలి. దానితోపాటు ప్రత్యమ్నాయ విధానం, పటిష్ట నిర్మాణం జరిగినప్పుడే ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. కాబట్టి ఏ ఒక్క కారణం పై ఆధారపడి ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ఆంధ్రా లో వున్న సామాజిక , ఆర్ధిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఓ పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలి. అవేమిటో స్థూలంగా ఒక్క సారి పరిశీలిద్దాం.

Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్ధిక విధానం 

జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం తీసుకోనన్ని సంక్షేమ పధకాలు తీసుకొచ్చాడు. ఈ విషయం లో తండ్రి కన్నా నాలుగాకులు ఎక్కువే చదివాడు. దానితోపాటు గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలు, పాఠశాలల్లో మౌలిక వసతులు , మద్యపాన నియంత్రణ లతో తనదైన ముద్ర వేసాడు. వీటికి దీటుగా ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాల్ని రూపొందించాల్సి వుంది. ఇది మేధావులు, నాయకత్వం కలిసి సంయుక్తంగా రూపొందించాల్సి వుంది. ఇక రాజకీయ విధానం గురించి జగన్ కన్నా బిజెపి-జనసేన కి ప్లస్ పాయింటే వుంది. ఎందుకంటే బిజెపి దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కాబట్టి విధానాల్లో స్పష్టత వుంటుంది. జనసేన తో కలిసి ఆంధ్రా కి సంబంధించిన నిర్దిష్ట అంశాలను జతచేసి రాజకీయ విధానం రూపొందించు కోవటం పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో బిజెపి కి విస్తృత రాజకీయ అనుభవముంది. నా దృష్టి లో మిగతా అన్ని అంశాల కన్నా ఈ ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్ధిక విధానమే ప్రధానమైనది. దీని ద్వారానే ప్రజల్లో ప్రత్యామ్నాయ ఆలోచన దిశగా మార్పు తీసుకు రావచ్చు.

సామాజిక సమీకరణలు 

రెండో అత్యంత ప్రాధాన్య అంశం సామాజిక సమీకరణాల కూర్పు. ఈ విషయం లో ఇప్పటికే జగన్ పటిష్టమైన కూర్పు ని కలిగి వున్నాడు. ఈ రాష్ట్రం లో రెడ్డి సామాజిక వర్గం సమాజంలో అత్యంత ప్రభావమైన వర్గం. గ్రామాల్లో ఇప్పటికీ వీరి ప్రభావం మిగతా వర్గాల పై అధికంగా వుంది. దానితోపాటు దళితులు నూటికి తొంభై శాతం జగన్ వైపే వున్నారు. దీన్ని సడలించటం ఇప్పట్లో జరిగే పని కాదు. ఈ రెండు సామాజిక వర్గాల కూర్పు జగన్ కి కోర్ బేస్. 2019 ఎన్నికల్లో ఈ కోర్ బేస్ తో పాటు మిగతా వర్గాలు కూడా ( ఒక్క కమ్మ సామాజిక వర్గం తప్ప ) జగన్ వైపే మొగ్గు చూపాయి. అందుకే అత్యధిక మెజారిటీ తో గెలుపొందగాలిగాడు. ఈ మూడో ప్రత్యామ్నాయం చేయవలసిందల్లా కాపు సామాజిక వర్గం కోర్ బేస్ తో పాటు జగన్ కోర్ బేస్ ని మినహాయించి మిగతా సామాజిక వర్గాల సమీకరణ. బిసి వర్గాలు, అగ్రవర్ణాల్లో ఎన్ని సెక్షన్లను సమీకరించుకోగలిగితే అంతగా అధికారానికి చేరువవుతారు. ఈ విషయంలో ప్రజారాజ్య గుణపాఠం  తో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాపు సామాజిక వర్గం అతి స్పందన వలన మిగతా సామాజిక వర్గాలు రెండో వైపు సమీకరించబడ్డారు. సహజంగా కాపు సామాజిక వర్గం ఉద్రేక స్వభావం గలవాళ్ళు అవటంతో మిగతా వర్గాలు దూరం అవటానికి కారణ భూతమవుతుంది. ఈ విషయం లో ఇప్పటినుంచే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రజారాజ్య అనుభవం పునరావృతమయ్యే అవకాశముంది. ముఖ్యంగా బిసి సామాజిక వర్గ సమీకరణ కోసం ప్రత్యేక కృషి చేయాల్సి వుంది.

ఆంధ్రలో మత కోణం 

ఆంధ్ర ప్రదేశ్ లో క్రైస్తవ మత విస్తరణ చాప కింద నీరులా జరిగిపోతూ వుంది. ఇది బ్రిటిష్ కాలం నుంచీ జరుగుతూనే వుంది. వై ఎస్ ఆర్ కుటుంబం పేరుకు రెడ్డి సామాజిక వర్గమైనా క్రైస్తవ కుటుంబమే. ఇడుపులపాయ లో వై ఎస్ ఆర్ సమాధి దగ్గర కేవలం బైబిల్ సూక్తులే వుంటాయి. హిందూ ధర్మ ఆనవాళ్ళు మచ్చుకు కూడా కనిపించవు. వై ఎస్ ఆర్ సతీమణి విజయలక్ష్మి బైబిల్ చేతపట్టుకునే ఎన్నికల ప్రచారం చేసింది. షర్మిలా భర్త అనిల్ ప్రతిరోజూ ఉదయం సాక్షి టివి లో క్రైస్తవ బోధనలు ప్రచారం చేస్తాడు. రెండోవైపు హిందూ ధర్మం లోని రెడ్డి సామాజిక వర్గం జగన్ ని తమవాడుగా భావిస్తారు. అంటే మతంకన్నా కుల ప్రభావం అధికంగా ఉందన్నమాట.

రెండో వైపు చూస్తే క్రైస్తవ మత ప్రచారం ఆంధ్ర లో చాలా లోతుగా జరుగుతుంది. ఒకనాడు క్రైస్తవం దళితులందర్నీ ఆకర్షిస్తే గత రెండు మూడు దశాబ్దాలలో ఉత్తరాంధ్ర మన్య ప్రాంతం లోని గిరిజనులందరూ క్రైస్తవం లోకి మారిపోయారు. ఆంధ్రాలోని గ్రామాల్లో ఇప్పటికీ క్రైస్తవ ప్రచారం రోజు రోజుకీ విస్తృత మవుతుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువయ్యిందని వినికిడి. చివరకి హిందూ పుణ్య క్షేత్రల్లోకి కూడా పాకిందని వార్తలు వస్తున్నాయి. అధికారిక జనాభా లెక్కల ప్రకారం 2 శాతం కూడా క్రైస్తవులు లేరు. కానీ వాస్తవానికి దాదాపు 15 నుంచి 20 శాతం మధ్యలో క్రైస్తవ జనాభా ఉండొచ్చునని అంచనా. ఈ అంశం కూడా ఆంధ్రా వరకు ప్రచారాస్త్రం గా ఉపయోగించుకోవచ్చు.

మీడియా పై దృష్టి 

ఆంధ్రలో పత్రికలూ, టివీలు ప్రధానంగా ఒకే సామాజిక వర్గానికి చెందినవి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎన్ టి ఆర్ నుంచి పదవిని లాక్కోవటంలో  ఓ పత్రిక పాత్ర అందరికీ తెలిసిందే. పత్రికల, టివి ల ప్రాధాన్యతని గుర్తించే వై రాజశేఖర రెడ్డి సాక్షి పత్రికని, చానల్ని ప్రారంభించాడు. అదే ఒరవడి లో కెసిఆర్ నమస్తే తెలంగాణా పత్రికని, టి న్యూస్ చానల్ని పెట్టాడు. కాబట్టి మీడియా కూడా ప్రత్యామ్నాయ ప్రచారానికి చాలా అవసరం. ఇక్కడా మనకి ప్రజారాజ్యం అనుభవం అక్కరకొస్తుంది. ప్రజారాజ్యం చేసిన తప్పుల కన్నా వాటిని ప్రజల్లోకి గోరింతలు కొండింతలు చేసి తెసుకేల్లిన తీరు అందరికీ తెలిసిందే. ఈ అనుభవాల దృష్ట్యా మూడో ప్రత్యామ్నాయాన్ని ప్రచారం చేసే పత్రిక, చానలు అవసరం ఎంతయినా వుంది. ఇప్పటికే 99 టివి , V6 చానళ్ళు కొంతమేర ఆ కొరతను తీర్చే అవకాశమున్నా పత్రిక అవసరం చాలా వుంది. కాబట్టి మీడియా కూడా ఓ ముఖ్యమైన అంశమే.

బిజెపి-జనసేన ఐక్య కూటమి 

ఆంధ్రలో బిజెపి కి ప్రజాదరణ లేదు, జనసేన కు నిర్మాణ స్వరూపం లేదు. కానీ బిజెపి కి మోడీ ఇమేజ్, జనసేన కు పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్ వున్నాయి. అదే సందర్భంలో బిజెపి కి మిగతా రాష్ట్రాలంత విస్తారంగా కాకపోయినా ఎంతోకొంత నిర్మాణ స్వరూపముంది. అదిఅన్ని ప్రాంతాలకి విస్తరించటానికి కావలసిన అనుభవం, క్యాడర్ బిజెపి కి వున్నాయి. ఈ రెండు కలిస్తేనే ముందు భాగం లో మాట్లాడుకున్న కాపు సామాజిక కోర్ బేస్ ధృఢంగా వెన్నంటి వుంటుంది. ఈ ఐక్య కూటమి ని చివరిదాకా తీసుకెళ్ల గలిగితేనే జగన్ కి బలమైన ప్రత్యామ్నాయ మేర్పడుతుంది.

Also Read: సోము వీర్రాజు ఎంపికలో సామాజిక కోణం

ఈ పై అంశాలను స్థూలంగా ముందుకు తీసికెళ్ళ గలిగితే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రత్యామ్నాయ కూటమిగా ముందుకు వస్తుంది. అధికారం లోకి వచ్చే అవకాశం కూడా మెండుగా వుంది. ఈ రోజుకి జగన్ కి తిరుగు లేదని అనిపించినా రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు దీర్ఘకాలమే. రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉంటాయని గ్యారంటీ లేదు. పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చు. సోము వీర్రాజు- పవన్ కళ్యాణ్ ల నాయకత్వం సరైన ప్రత్యామ్నాయాన్ని ఆంధ్రా లో నిర్మిస్తారని ఆశిద్దాం.

త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ


తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ త్రిష. సౌత్ ఇండియాలో మంచి స్టార్డమ్‌ ఉన్న నటి. తమిళ్‌, తెలుగు, కన్నడ మూవీస్‌లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వర్షంతో తెలుగుకు ప్రేక్షకులకు చేరువైన ఆమె చాన్నాళ్ల పాటు స్టార్ హీరోల సరసన నటించి టాప్‌ యాక్ట్రెస్‌గా వెలుగొందింది. కానీ, కొన్నేళ్లుగా ఆమె టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. 2016లో ‘నాయకి’ తెలుగులో ఆమె చివరి చిత్రం. ఈ మధ్య పూర్తిగా తమిళ్‌పైనే దృష్టి పెట్టిందామె. ఆమె చేతిలో ఏకంగా ఆరు తమిళ చిత్రాలు, ఓ మలయాళ మూవీ ఉంది.

Also Read: అరివీర భయంకర.. అధీరా!

మరోవైపు హీరో శింబుతో ప్రేమలో ఉన్న త్రిష.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని ఈ ప్రేమ పక్షులు ఖండించలేదు. దీనిపై చర్చ నడుస్తుండగానే త్రిష మరో వివాదంలో చిక్కుతుంది. తమిళ నటి మీరా మిథున్‌ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేవలం కులం కారణంగానే త్రిషకు అవకాశాలు వస్తున్నాయని, కోలీవుడ్‌లో బంధుప్రీతితో పాటు కులపిచ్చి కూడా ఉందని విమర్శించింది. అంతేకాదు త్రిష తన కెరీర్ను నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేసింది. రజినీకాంత్‌ మూవీ ‘పేట’ నుంచి తనను బయటికి గెంటేసేలా చేసిందని ఆరోపించింది. మరెన్నో విషయాలు చెబుతూ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌ చేసింది మీరా.

Also Read: పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్‌

‘నేను కింగ్‌ఫిషరర్ సూపర్ మోడల్‌ అన్న ఒకే ఒక్క కారణంతో త్రిష అభద్రతా భావానికి గురైంది. దాంతో, కోలీవుడ్‌ మాఫియాతో కుమ్మక్కై నన్ను అణగదొక్కే ప్రయత్నం చేసింది. యెన్న అరిందల్‌ మూవీలో నా సీన్స్‌ను కట్‌ చేయించింది. ఇది అక్కడితోనే ఆగిపోలేదు. ఆ మూవీ వచ్చిన ఏడేళ్ల తర్వాత కూడా నాపై త్రిష కక్ష తగ్గలేదు. పేట మూవీ నుంచి నన్ను తప్పించేలా చేసింది’ అని వీడియోలో పేర్కొంది. కోలీవుడ్‌లో కులపిచ్చి ఎక్కువైందని ఆరోపించింది.

https://twitter.com/meera_mitun/status/1288011220134502400

కరోనా ఎఫెక్ట్.. విద్యార్థులకు గుడ్ న్యూస్


దేశంలో కరోనా మహమ్మరి పంజా విసురుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరగడమేగానీ తగ్గుముఖం పట్టడంలేదు. కరోనా కారణంగా విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటింది. పరీక్షల కోసం విద్యార్థుల ప్రాణాలను రిస్కులో పెట్టేందుకు వారి తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున విజ్ఞఫ్తులు రావడంతో పరీక్ష నిర్వహాణను ఆయా రాష్ట్రాలకు పరీక్షలను వాయిదా వేశాయి.

పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు లేకుండా పాస్ చేస్తున్నట్లు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతిని అవలంభించారు. పదోతరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరినీ ప్రమోట్ చేశాయి. ఇక ఇంటర్మీయట్ పరీక్షలు కరోనా ఎంట్రీకి ముందే నిర్వహించారు. అయితే కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అవగా వీరికి సప్లమెంటరీ నిర్వహించేందుకు ప్రభుత్వాలు సన్నహాలు చేశాయి. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఫెయిల్ అయిన విద్యార్థందరికీ ప్రభుత్వం కంపార్ట్మెంట్లో పాసనట్లు ప్రకటించింది.

అయితే యూజీసీ నిబంధనల ప్రకారం డిగ్రీ, పీజీ ఫైనల్ విద్యార్థులకు పరీక్షలు రాయకుండా ప్రమోట్ చేయడం కుదరదు. దీంతో ఈ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ విద్యార్థులకు మధ్యప్రదేశ్ రాష్ట్రంగా తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం డిగ్రీ చివరి సంవత్సరం, పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించనుంది. విద్యార్థులు ఇంటి నుంచే పరీక్షలు రాయొచ్చని.. జవాబుల కోసం అవసరమైతే పుస్తకాల్లో రిఫర్ చేసుకుని రాయవచ్చునని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

ఏది కరోనా.. ఏది సీజనల్.. తెలుసుకోండి?

విద్యార్థులు ఇంటి నుంచి పరీక్షలు రాయడం వల్ల కరోనా బారినపడే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులు పరీక్షలు రాశాక సమాధాన పేపర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసే సంబంధిత కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం కూడా పెద్ద సంఖ్యలో బుక్ లెట్ కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. వీటితోపాటు విద్యార్థులు పోస్టు ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా సమాధాన పత్రాలను పంపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యార్థుల రిజల్ట్ అక్టోబర్ లో విడుదలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ప్రభుత్వం నిర్ణయం వల్ల 5.71 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్ధులకు ప్రయోజనం కలుగనుందట. ప్రస్తుత పరిస్థితులు చూస్తేంటే మధ్యప్రదేశ్ బాటలో మరికొన్ని రాష్ట్రాలు వెళ్లడం ఖాయంగా కన్పిస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే చూసికూడా పరీక్షలు పాస్ కాలేని విద్యార్థుల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?


సమయం, సందర్భాన్ని బట్టి ప్రాధాన్యం మారిపోతుంది. పిల్లనిస్తాం అన్నపుడు పెళ్లి చేసుకుంటే అల్లుడికి వుండే గౌరవం వేరు, కోరి పిల్ల కావాలని చేసుకుంటే దక్కే మర్యాదలు వేరుగా ఉంటాయి. బీజేపీ-జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. 2014 ఎన్నికలలో టీడీపీతో జతకట్టి దెబ్బ తిన్న బీజేపీ, 2019 ఎన్నికలలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం చేసింది. పవన్ అప్పుడు బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపలేదు. అలాగే బీజేపీ పార్టీపై మరియు ప్రధాని అభ్యర్థి మోడీపై పరుష పదజాలంతో సభలలో విరుచుకుపడ్డాడు. ఎన్నిక ఫలితాల తరువాత తత్త్వం బోధపడింది. రెండు చోట్ల ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఒంటరిగా పోరాడండం కంటే అధికార పార్టీ అండతో ముందుకు వెళదాం అనే ఆలోచన కావచ్చు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఒక్కసారిగా మోడీకి అనుకూలుడు మరియు విధేయుడు అయిపోయాడు. మోదీపాలన భేష్ అంటూ పొగడడం మొదలుపెట్టాడు. ఒకరకంగా సిద్ధాంతాలు కూడా మార్చేశాడు. పూర్తి హిందూవాది అయిపోయాడు.

Also Read: కన్నా లక్ష్మీనారాయణ అడుగులు ఎటువైపు?

బీజేపీ కంటే అధిక భాగం ఓటు బ్యాంకు జనసేన పార్టీకి ఉన్నా ప్రాధాన్యం విషయంలో వాళ్ళ తరువాతే. పవన్ చేసిన వ్యాఖ్యలు, విషయాల పట్ల స్పందించే తీరు బీజేపీకి కట్టుబడి ఉండాల్సిందే. బీజేపీతో పొత్తు తరువాత పవన్ స్వేఛ్ఛగా ఏ విషయంపై స్పందించడం లేదు. బీజేపీ స్టాండ్ ఏమిటీ అని తెలుసుకున్న తరువాతే తన అభిప్రాయం చెబుతున్నారు. ఇక అధికారికంగా పొత్తుపెట్టుకున్నా, ఎవరి కుంపటి వాళ్లదే అన్నట్లు వీరి రాజకీయాలు సాగుతున్నాయి. ఎక్కడా కూడా బీజేపీ మరియు జనసేన కలిసి ప్రెస్ మీట్లలో పాల్గొన్న దాఖలు కనిపించడం లేదు.

Also Read: ముక్కోణ పోరులో బాబు అవుట్..!

ఏదిఏమైనా 2024 ఎన్నికల సమయానికి బీజేపీ-జనసేన సంస్థాగతంగా ఎదిగి ఏపీలో నిర్ణయాత్మక పార్టీగా మారాలన్నది వారి ఆలోచన. ఐతే 2024 ఈ కూటమి నుండి సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారు అనేది ఆసక్తికర అంశం. ఎందుకంటే ఒక పార్టీ విజయావకాశాలను నిర్ణయించే అంశాలలో ప్రధానమైనది సీఎం అభ్యర్థి ఎంపిక. సీఎం అభ్యర్థి సమర్థుడు అని భావించినప్పుడు మాత్రమే, నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. బీజేపీ-జనసేన పొత్తులో పెత్తనం అంతా బీజేపీది అయినప్పుడు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ఒప్పుకుంటారా అనే సందేహం కలుగుతుంది. ఒక వేళ ఎన్నికల తరువాత ఆ లెక్కలు చూసుకుందాం అంటే, ప్రజల్లో మరింతగా విశ్వాసాన్ని కోల్పోతారు. గెలుపోటములు అటుంచితే, సీఎం అభ్యర్థిని నిర్ణయించడం అనేది చాలా అవసరం. మరి 2024 ఎన్నికలకు ముందు ఈ విషయం బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఎలాంటి సంఘటనలకు దారితీస్తుందో చూడాలి.

భారత్ కు చేరిన రఫేల్.. శత్రుదేశాల వెన్నులో వణుకు..


భారత్ లోకి రఫేల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటికి క్రితమే వచ్చి చేరాయి. వీటిరాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రఫేల్ యుద్ధవిమానాలు ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధవిమానాలుగా పేరుగాంచాయి. మన పొరుగుదేశమైన చైనా వద్ద కూడా ఇలాంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు లేవు. ఇది భారత్ కు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు భారత ఎయిర్ ఫోర్స్ లో సుఖోయ్ ఫైటర్ జెట్స్ మాత్రమే అత్యాధునికమైనవి. ప్రస్తుతం భారత్ కు చేరిన రఫెల్ యుద్ధ విమానాలు సుఖోయ్ ఫైటర్ జెట్స్ కు అడ్వాన్స్ వర్షన్. వీటి రాకతో భారత గగనతలం మరింత పటిష్టం కానుంది.

Also Read: పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?

భారతదేశానికి చైనా, పాకిస్థాన్ నుంచి ముంచి పొంచి ఉంది. పాకిస్థాన్ కంటే భారత్ ఆయుధ సంపత్తిలో చాలా మెరుగైన స్థితిలో ఉంది. పాకిస్థాన్ తో యుద్ధం వస్తే గెలుపు భారత్ దేనని ఆదేశానికి కూడా తెలుసు. అందుకే పాకిస్థాన్ నేరుగా యుద్ధం చేయకుండా దొడ్డిదారిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పాకిస్థాన్ తోకజాడించిన ప్రతీసారి భారత్ గట్టిగానే ఆ దేశానికి బుద్ది చెబుతుంది. అయితే ఇటీవల చైనా నుంచి భారత్ కు సవాల్ ఎదురవుతోంది. చైనా దేశం భారత సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతూ భారత సైనికులను రెచ్చగొడుతోంది.

చైనా జవాన్లు భారత్ లోని గాల్వానాలోయలోకి చొచ్చుకురావడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా చైనా జవాన్లు సైతం ఎక్కువగా మృతిచెందారు. అయితే చైనా మృతుల వివరాలను వెల్లడించలేదు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ తీసుకొని చైనాకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే చైనాను రక్షణ, ఆర్థిక, అంతర్జాతీయం దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. చైనాకు చెందిన వస్తువులను బ్యాన్ చేయడం, కాంట్రాక్టర్లు రద్దు చేయడం, అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి చేయడం లాంటివి చేస్తోంది.

అయితే రక్షణ పరంగా చైనాను ఎదుర్కొనేందుకు పెద్దమొత్తంలో యుద్ధసామగ్రిని భారత్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందులో భాగంగా గత యూపీఏ హయాంలో ఆగిపోయిన రక్షణ ఒప్పందాలను మోడీ సర్కార్ పట్టాలెక్కించింది. ఫ్రాన్స్ దేశంతో రఫెల్ యుద్ధవిమానాలను కొనుగోలు గతంలోనే జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఆ దేశంతో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై చర్చించారు. వీటిలో భాగంగానే ఫ్రాన్స్ లో భారత్ కోసం తయారుచేసిన ఐదు రఫెల్ యుద్ధవిమానాలు తొలివిడుతలో నేడు భారత్ కు చేరాయి.

రఫేల్ యుద్ధ విమానాల ప్రత్యేక చూస్తే శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటకుండా శత్రుదేశాలపై దాడి చేయగలవు. 60వేల అడుగుల ఎత్తులోనూ లక్ష్యాలను ఖచ్చితంగా చేధించగలవు. 60నుంచి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ధ్వంసం చేయగలగడం ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. ధ్వని వేగం కంటే నాలుగు రెట్లు వేగంగా పయనించగలవు. రాడార్ మార్గనిర్దేశాలను అనుసరించి ఈ యుద్ధ విమానాలు పయనిస్తాయి. ఇందులోని స్కాల్ప్ క్షిపణి 600కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాలను చేరుకోగలదు. ఒక రఫేల్ యుద్ధ విమానం బరువు 10 టన్నులు. నిమిషానికి 2500 రౌండ్లు పేల్చే శక్తి ఈ యుద్ధ విమానాలకు సొంతం.

Also Read: పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?

భారత పరిస్థితులకు అనుగుణంగా రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ తయారు చేయించింది. భారత పర్వత ప్రాంతాల్లో పోరాటానికి ఈ యుద్ధ విమానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్షణ శాఖ ఈ విమానాన్ని అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా భావిస్తోంది. దక్షిణ ఆసియాలోనే ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన యుద్ధ విమానం రఫేల్ మాత్రమేనట. రఫేల్ యుద్ధ విమానంలో 10వేల500 టన్నుల పేలుడు పదార్థాలను ఒకేసారి తీసుకెళ్లవచ్చు. అణ్వాస్త్రాలను మోసుకొని వెళ్లగలడం దీనికి ఉన్న అదనపు ప్రత్యేకత.

నేడు భారత గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు ఎంట్రీ ఇవ్వగా సుఖోయ్ యుద్ధ విమానాలు ఘన స్వాగతం పలికాయి. అంబాలా ఎయిర్ బేస్ లో రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్ గా ల్యాండయ్యాయి. వీటిరాకతో గగతన గస్తీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్  కు మరింత సులువు కానుంది. ఈ యుద్ధ సమయంలో వేగంగా స్పందించడంలో ఎయిర్ ఫోర్స్ దే కీలక పాత్ర. రఫేల్ యుద్ధ విమానాలను భారత్ గేమ్ ఛేంజర్ గా భావిస్తుంది. భారత్ అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ద విమానాలు చేరడంతో శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కన్పిస్తోంది.

మొహమాటం లేకుండా డైరెక్ట్ గా హీరోనే అడిగేసింది!


మాళవికా మోహనన్. ఈ పేరు తెలుగు అభిమానులకు పెద్దగా తెలియదు. కేరళలో పుట్టిన ఈ హీరోయిన్‌ ఇప్పుడిప్పుడే కెరీర్ను నిర్మించుకుంటోంది. హాట్‌ హాట్‌ అందాలతో యువత గుండెలు కొళ్లగొట్టే ఈ బ్యూటీ తొలుత మలయాళంలో నటించి ఆపై కన్నడ, తమిళ్, హిందీ చిత్రాలు కూడా చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పేట’తో కోలీవుడ్‌కు పరిచయమైన మాళవిక అక్కడ క్రేజ్ సంపాదించుకుంది. ఆ వెంటనే కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడు విజయ్‌ సరసన ‘మాస్టర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం సమ్మర్లోనే రిలీజ్‌ కావాల్సింది.కానీ, లాక్‌డౌన్‌ కారణంగా విడుదల వాయిదా పడింది. సౌతిండియాలో విజయ్‌కు మంచి స్టార్డమ్‌ ఉండడంతో ఈ మూవీపై భారీ అశలే పెట్టుకుందీ హాట్‌ బ్యూటీ.

Also Read: అరివీర భయంకర.. అధీరా!

అందుకే ఇప్పటికే కొన్ని ఆఫర్లు వచ్చినా.. ఈ మూవీ రిలీజైతే తన రేంజ్‌ మారిపోతుందని భావించి వాటికి నో చెప్పింది. మాస్టర్ వచ్చాక పెద్ద సినిమాలకే కమిటవ్వాలని ఫిక్సయింది. దాంతో తనను సంప్రదిస్తున్న పలువురు దర్శక, నిర్మాతలకు నో చెబుతూ వచ్చింది. తెలుగులో రవితేజ హీరోగా ప్లాన్ చేసిన ఓ మూవీలో చాన్స్‌ వచ్చినా పొగరుగా రెజెక్ట్‌ చేసిందట. తీరా మాస్టర్ ఇప్పుడప్పుడే రిలీజయ్యే అవకాశం లేదని తేలింది. ఇంటిదాకా వచ్చినా ఆఫర్స్‌ను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడెవరూ మాళవికను సంప్రదించే ప్రయత్నం చేయడం లేదట. దాంతో, దిగొచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పుడు తానే దర్శక, నిర్మాతలు, హీరోలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో తరచూ హాట్‌ ఫొటోలు పోస్ట్‌ చేస్తున్న మాళవిక.. మొహమాటం లేకుండా ఒక్క చాన్స్‌ అని అడుగుతోందట.

Also Read: పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్‌

ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌ను కూడా అలానే అడిగేసింది మాళవిక. నిన్న (మంగళవారం) ధనుష్‌ పుట్టిన రోజు కావడంతో అతనికి విషెష్‌ చెప్పిందామె. పనిలో పనిగా తన మనసులో మాటను కూడా బయటపెట్టింది. ‘హ్యాపీ బర్త్‌డే ధనుష్‌ సార్. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీతో వర్క్‌ చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎవరో ఒకరు మనిద్దరినీ పెట్టి సినిమా తీస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్‌ చేసింది. బహిరంగంగానే ఒక్క చాన్స్‌ ఇప్పించండి అని చెప్పిందామె. మాళవిక పరిస్థితి చూస్తే చేతులు కాలాక… అనే సామేత గుర్తుకొస్తోంది. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ..ముఖ్యంగా హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. క్రేజ్‌ ఉన్నప్పుడు.. అవకాశం వచ్చినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. కానీ, మాళవిక పని చేయక ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఆమెను కొంత దురదృష్టం కూడా వెంటాడుతుందని చెప్పాలని. ఎందుకంటే విజయ్‌ దేవరకొండ హీరోగా తమిళ డైరెక్టర్ ఆనంద్‌ అన్నమలై గతేడాది ప్రకటించిన ‘హీరో’ అనే మూవీలో కూడా మాళవిక హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే, విజయ్‌, ఆనంద్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది.