Home Blog Page 8387

నయనతార అంతే.. నచ్చితేనే చేస్తోంది !

Nayanthara

Nayanthara
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా..? పైగా సౌత్ హీరోయిన్లకు ఆ లక్కీ ఛాన్స్ వస్తే ఏం చేస్తారు ? ఏమైనా చేస్తాం అంటారు.. అవసరమైతే బికినీ షూట్.. ఇంకా అవసరం అయితే సెమీ న్యూడ్ కి కూడా సై అంటారు. కానీ ఒక్క సౌత్ హీరోయిన్ తప్ప. ఏదో ఎక్స్ పోజింగ్ విషయంలో మొహమాటం అనుకుంటే తప్పే.. ఆ మాటకొస్తే ఎక్స్ పోజింగ్ లో ఏ రేంజ్ కైనా ఈ ముదురు ముద్దుగుమ్మ సిద్దమే. ఆమె ప్రేమల రాకుమారి ‘నయనతార’.

Also Read: అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !

నయనతారది ఎంతో విశాలమైన హృదయం.. అందుకే ప్రియుడు హ్యాండ్ ఇచ్చినా మరసటి రోజే మరో ప్రియుడిని దగ్గరకి తీసుకుని సేద తీరుస్తూ ప్రేమను పంచుతుంది, కాకపోతే పెళ్ళే చేసుకోదనుకోండి. ఇంతకీ మెయిన్ మ్యాటర్ లోకి వస్తే.. సల్మాన్ సినిమాలో నటించే అవకాశం వస్తే తిరస్కరించిందట. ఏ.. అమ్మా ఎందుకు అంటే.. రియాక్షన్ లేదట. హిందీ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరక్షన్ లో ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు సల్మాన్.

ఈ ప్రాజెక్టులో ఎక్కువ భాగం చెన్నై ప్రాంతం ఉంటుందట. సొ.. మన హీరోగారు చెన్నై వచ్చినప్పుడు ఇక్కడ ఒకమ్మాయిని ప్రేమించి ఆమెతో నాలుగు సాంగ్స్ రెండు ముద్దు సీన్స్ పెడతాడు. దానికి నేటివిటికి తగ్గట్లు సౌత్ హీరోయిన్ ఉండాలి. సౌత్ లో ముదురు హీరోయిన్స్ లో స్టార్ డమ్ ఎవరికీ ఉంది అని చూస్తే.. ఎప్పుడో ముదిరిపోయినా ఇంకా స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తున్న నయనతార కనిపించింది.. వాళ్ళు సంప్రదించారు. కానీ నయనతార ఏ మూడ్ లో ఉందో గాని నో చెప్పేసింది.

Also Read: గ్రేట్ ముసలి డైరెక్టర్ ని పట్టిన కుర్ర హీరోయిన్ !

నయనతార కెరీర్ స్టార్టింగ్ లో ఐటమ్స్ సాంగ్స్ కూడా చేసింది. కానీ సొంతంగా మార్కెట్ అండ్ స్టార్ డమ్ వచ్చిన తరువాత.. స్టార్ హీరో సినిమా అయినప్పటికీ అన్ని నచ్చితేనే చేసేందుకు యస్ చెబుతుంది.. లేదంటే అన్సర్ కూడా చెయ్యదు ఈ ముదురు ముద్దుగుమ్మ. బాలయ్య సినిమాకి అలాగే చేసింది.

అమరావతికి కొత్త శోభ.. జగన్ ప్లానింగ్ ఇదేనా?

AMRDA to replace APCRDA

AMRDA to replace APCRDA
ఏపీ రాజధాని విషయంలో రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ముందుకెళుతుండగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని(అమరావతి) అంటున్నారు. ఇటీవలే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సీఆర్డీఏ బిల్లు రద్దుతోపాటు మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలయుద్ధంగా తారాస్థాయికి చేరుకొంది. టీడీపీ చెందిన పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా బాటపట్టారు. చంద్రబాబు సైతం రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోనే తాడేపెడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read: జగన్ కి మేలుచేసేలా బాబు విమర్శలు!

వైసీపీ నేతలు టీడీపీకి ధీటుగా జవాబిస్తుండటంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నారు. వైసీపీకీ చెందిన పలువురు మంత్రులు చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసి అన్ని సీట్లు గెలిస్తే రాజధాని విషయంలో వైసీపీ పునరాలోచిస్తుందంటూ ప్రకటనలు చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. అయితే అమరావతి ప్రాంతవాసుల్లో ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతను దూరంగా చేసేలా సీఎం జగన్ పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అమరావతిని మెట్రో నగరంగా తీర్చిదిద్దేలా జగన్ సర్కార్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొస్తుంది.

సీఆర్డీఏ రద్దుకావడంతో ఇక అమరావతిని మెట్రోపాలిటన్ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తాజాగా ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీఆర్డిఏ కంటే ఏఎంఆర్డిఏ పరిధి ఎక్కువ ఉండటంతో ఈప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేదిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏఎంఆర్డీఏపై ప్రత్యేక కమిటీ వేయడంతోపాటు పాలక మండలి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ పాలక మండలిలో ఏఎంఆర్డీఏ కమిషనర్ గా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని నియమించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, డిప్యూటీ ట్రాన్సోపోర్ట్ కమిషనర్లను సభ్యులుగా నియమించింది. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలి.. మెట్రో, ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలనేది ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే అమరావతిని మెట్రో నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఏఏంఆర్డీఏ పాలక మండలిని ఆదేశించింది.

Also Read: బాబు లాగా నష్టపోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు

దీంతో అమరావతిలో జగన్ మార్క్ అభివృద్ధి ఖాయమనే టాక్ విన్పిస్తుంది. అమరావతి నుంచి తరలిపోతున్న రాజధానికి చెక్ పెట్టేలా ఆ ప్రాంతాన్ని మెట్రోనగరంగా మార్చనుండటం ఒకరకంగా అక్కడి ప్రజలకు ఊరటనిచ్చే అంశమే. అయితే జగన్ కూడా బాబులా గ్రాఫిక్స్ కే పరిమితమవుతారా? లేదా అమరావతిని అభివృద్ధిని చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!

సినీ లోకం స్తంభించినా బాలయ్య మాత్రం తగట్లేదుగా ! 

Balayya boyapati movie
Balayya boyapati movie
టాలీవుడ్ లో ఇప్పుడు కరోనా అనంతరం అనే మాటను తరుచుగా వాడుతున్నారు. మరి ఆ అనంతరం ఇప్పట్లో ఉండేలా కనబటం లేదు. చిత్రనిర్మాతలు తమ షూటింగులను తిరిగి ప్రారంభించడానికే భయపడే పరిస్థితి. ఇప్పటికే చాలా మంది చిత్రనిర్మాతలు ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను మరియు విదేశీ షెడ్యూల్‌లను రద్దు చేస్తుకున్నారు.  అయితే  బాలయ్య – బోయపాటి సినిమా ఓ ముఖ్యమైన సీక్వెన్స్ ను అక్టోబర్ మొదటి వీక్ నుండి ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి ఈ సీక్వెన్స్ ను  వారణాసి మరియు హిమాలయాలలో విస్తృతంగా షూట్ చేయాలి. అయితే అది సాధ్యం కాదు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేసి ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. కథకు చాలా కీలకమైన ఈ సీన్స్ లో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఇక స్టూడియోలో సెట్ వేయడం స్టార్ట్ చేశారు. మొత్తానికి కరోనా టైంలో కూడా బాలయ్య బృందం షూట్ చేయడానికి సిద్ధం అవ్వడం విశేషమే.
ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ఆ హీరోయిన్ యాక్టింగ్ బాగాలేదట. అందుకే అంజలిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఇక చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.  బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించినా ఇప్పుడు చేస్తోన్న సినిమా పై పెద్దగా అంచనాలు లేవు.
ఏమైనా కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ లోకం మొత్తం  స్తంభించిపోయినా బాలయ్య మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ముందుకుపోతున్నాడు.

కొల్లుకు పెరుగుతున్న సింపతి.. నానీకి టెన్షన్

Kollu ravinder vs Perni Nani

Kollu ravinder vs Perni Nani
రాజకీయాల్లో సెంటిమెంట్, సానుభూతి అస్త్రాలకు తిరుగులేదనే చెప్పొచ్చు. ఈ అస్త్రాలను ఉపయోగించే తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలు ఏకంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. ప్రజల్లోకి సెంటిమెంట్, సానుభూతిని బలంగా తీసుకెళ్లడం ద్వారా ఎన్నో పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగాయి. ఇటీవల కాలంలోనూ తెలంగాణ సెంటిమ్మెంట్ తో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. ‘ఒక్కఛాన్స్’ అనే సానుభూతిని జగన్ ప్రజల్లోకి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ అస్త్రాలను సరైన పద్దతిలో ఉపయోగించుకుంటే నూటికి నూరుళ్లుపాళ్లు విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. మచిలిపట్నంలోనూ ఇప్పడు సానుభూతి రాజకీయాలు నడుస్తున్నాయి. మచిలిపట్నంలో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి కోల్లు రవీంద్ర, వైసీపీ నుంచి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని పోటీ చేశారు. వీరిలో పేర్ని నాని విజయం సాధించి జగన్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. పేర్ని నాని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రిగా పని చేస్తున్నాయి. అయితే ఇటీవల కొల్లు రవీంద్ర ఓ కేసులో జైలుపావడంతో ఇక జిల్లాలో నానికి తిరుగులేకుండా పోతుందని అందరూ భావించారు. అయితే ఆయన హవా పెరగాల్సిందిపోయి విచిత్రంగా తగ్గముఖం పడుతుందనే టాక్ విన్పిస్తోంది.

బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్రను వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో అరెస్టు చేసిందని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోన్నాయి. కొల్లురవీంద్రకు అనుకూలంగా మీడియాలో రోజుకో కథనం ప్రసారం చేస్తుండటంతో ఆయనపై ప్రజల్లోకి సింపతి పెరిగిపోతుంది. నియోజకవర్గంలో ఎక్కువున్న మత్స్య సామాజికవర్గాల్లో కొల్లు రవీంద్రకు సానుభూతి పెరిగిపోతుందట. కొల్లు రవీంద్రకు అనుకూలంగా ప్రజలు రోడ్లపైకి రావడంతో మంత్రి పేర్ని నానిలో టెన్షన్ మొదలైంది. కొల్లు రవీంద్ర అరెస్టులో రాజకీయ కక్ష లేదని వివరించడంలో నాని విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ప్రజల్లో సానుభూతి పెరుగుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి.

బీసీ వర్గాల్లో కొల్లు రవీంద్రకు సింపతి పెరుగుతుండగా పేర్ని నానికి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇక పేర్ని నాని కాపు వర్గానికి చెందిన నేత. ఇక్కడ జనసేన బలంగా ఉండటంతో కాపులు నేతలంతా జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కాపు ఓట్లు చిలీపోయే ప్రమాదం ఉండటంతో పేర్ని నానిలో టెన్షన్ మొదలైంది. ఈ సానుభూతి కొల్లు రవీంద్రపై ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మంత్రి పేర్ని నానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో టీడీపీకి నేతలకు వస్తున్న సానుభూతిని మంత్రి పేర్ని నాని ఎలా బ్రేక్ చేస్తారో వేచి చూడాల్సిందే..!

జగన్ కి మేలుచేసేలా బాబు విమర్శలు!

Chandrababu vs Jagan
చంద్రబాబు నిజంగా సొంత తెలివితేటలతోనే రాజకీయాలలో ఇంతగా ఎదిగాడా అనే డౌట్ కొడుతుంది. ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఇదే సందేహం కలుగుతుంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు, నిర్ణయాలు ఆయనకు మరియు పార్టీకి మరింత నష్టం చేకూర్చేవిగా ఉంటున్నాయి. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం గవర్నర్ ఆమోదంతో చట్టబద్ధం అయ్యింది. ఇక జగన్ వైజాగ్  కి రాజధానిని తరలించడమే తరువాయి. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా వైజాగ్ మారనుంది. చంద్రబాబు మాత్రం అమరావతిపై పట్టువదిలేది లేదు అంటున్నారు. అమరావతిని కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళతానని  అంటున్నారు.
రాజధాని రైతుల ఉద్యమాలు, టీడీపీ ఆరోపణలు ఏమాత్రం సానుభూతే లేని  పక్షంలో, ప్రజల్లో అభద్రతా భావం కలుగజేయాలని చూస్తున్నారు. 2024 లో ప్రభుత్వం మారితే మరలా రాజధాని మారదని గ్యారంటీ ఏమిటని,  ఆయన కొత్త సమస్యను లేవనెత్తారు. అలా 2024ఎన్నికల తరువాత మరో ప్రభుత్వం వస్తే మరలా అమరావతి రాజధాని విషయం తెరపైకి రావడం, అభివృద్ధి కుంటుబడటం ఖాయం అంటున్నారు. బాబు తెరపైకి తెస్తున్న ఈ అంశం ఎవరికి బాగా నష్టం కలిగిస్తుందో, కనీస రాజకీయ అవగహన ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.  టీడీపీ వస్తే మరలా అమరావతిని రాజధానిగా చేయడం ఖాయం. అంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రజలకు అన్యాయం జరగడం అనివార్యం.  ప్రభుత్వం మారితే రాజధాని కథ మరలా మొదటికి వస్తుంది, మరో ఐదేళ్లు శాశ్వత రాజధానిని అభివృద్ధి చేసుకొనే అవకాశం ప్రజలు కోల్పోతారు. ఈ విషయాన్ని పరోక్షంగా టీడీపీ చెవుతున్న వేళ అసలు ఆ రెండు ప్రాంతాల ప్రజలతో పాటు, న్యూట్రల్ గా ఉన్న గోదావరి జిల్లాలు మరియు ప్రకాశం,  నెల్లూరు జిల్లాల ఓటర్లు బాబుకు ఓటేయడానికి భయపడతారు. మళ్ళీ జగన్ నే గెలిపించుకోవాలి అనుకుంటారు.
ఇక బాబు అమరావతి ఉద్యమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి గుంటూరు, కృష్ణా జిల్లాల ఓటర్లు బాబుకు మాత్రమే ఓటేస్తారు అనడంలో సందేహం లేదు. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఎటూ జగన్ ఈ రెండు జిల్లాల ఓటర్లలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. కాబట్టి బాబు విమర్శ వలన జగన్ కు కొత్తగా వచ్చిన నష్టం లేదు. కాగా 2024 మేము అధికారంలోకి వస్తే తిరిగి అమరావతినే రాజధానిగా చేస్తాను అని బాబు పరోక్షంగా చెప్పడం ద్వారా మిగతా 11 జిల్లాలపై పట్టుకోల్పోతున్నారు.

అనసూయ బిజినెస్ మొదలెట్టేసింది !


జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ‘. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది. అందుకే అనుకుంటా… వచ్చిన డబ్బును మళ్ళీ సినిమాల్లోనే పెట్టాలని… సినిమాలు సీరియల్ల వ్యాపారంలోకి దిగాలని ఎప్పటి నుండో అనసూయ ప్లాన్ చేసుకుంటుంది. ఒక వైపు యాంకరింగ్ తో అండ్ యాక్టింగ్ తో ఫుల్ బిజీగా ఉంటూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ భారీ బ్యూటీ ఎట్టకేలకూ నిర్మాతగా ఒక హాట్ వెబ్ సిరీస్ చేయడానికి సన్నద్ధం అవుతుంది.

Also Read: గ్రేట్ ముసలి డైరెక్టర్ ని పట్టిన కుర్ర హీరోయిన్ !

ఇప్పటికే కథ కూడా ఫైనల్ చేసిందట. పైగా వెబ్ సిరీస్ లో తానే నటిస్తోందట. మరి తన వెబ్ సిరీస్.. పైగా మొదటది. సో.. ఓ రేంజ్ లో హాట్ హాట్ అందాలతో కనువిందు చేయడం ఖాయం అంటున్నారు. ఏమైనా నటిగా కంటెంట్ ఉన్న కథల్ని ఎంపిక చేసుకుంటూనే గ్లామర్ ను చూపిస్తున్న అనసూయ.. వెబ్ మూవీస్‌ ను నిర్మించడానికి ‘అనసూయ పిక్చర్స్’ అనే బ్యానర్‌ ని కూడా పెట్టుకుంది. అనసూయ నిర్మాతగా సక్సెస్ కావడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే గ్లామర్ ఫ్లేవర్‌ ను బాగా ఒంటబట్టించుకున్న అనసూయకి కుర్రాళ్ల మైండ్ సెట్ బాగా తెలుసు.

Also Read: ఏమైంది నాగబాబు.. ఏది ఆగ్రహం?

ప్రస్తుతం ప్రధానంగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని కథలో ప్రాధాన్యం కలిగి ఉన్న పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న ఈ హాట్ బ్యూటీ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ఎమోషనల్ సీక్వెన్స్ లోనూ అనసూయ నటించాలట. రొమాంటిక్ గానే కనిపించే అనసూయలో ఎమోషనల్ యాంగిల్ ఉంటుందా అనేది డౌట్.

బాబు లాగా నష్టపోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు

 


అమరావతి అంశంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షడు సోము వీర్రాజు స్పష్టంగా తన వైఖరి తెలియజేశాడు. అమరావతి విషయంలో బీజేపీ కానీ, కేంద్రం కానీ జోక్యం చేసుకోదు అన్నారు. అది రాష్ట్ర పరిధిలో అంశం కావున దాని విషయంలో మేము కలుగజేసుకొనేది లేదు అన్నారు. అలాగే అమరావతి విషయంలో పూర్తిగా బాబుదే తప్పు అన్నట్లుగా ఆయన తన ప్రసంగంలో తెలియజేశారు. లక్ష కోట్లతో ప్రపంచ స్థాయి రాజధాని కడతానన్న బాబు, ఏమి చేయలేకపోయారని అన్నారు. అమరావతి విషయంలో బీజేపీ ఇలాంటి స్టాండ్ తీసుకోవడానికి కారణం భవిష్యత్ ప్రయోజనాలే అని తెలుస్తుంది. బాబు మాదిరి అమరావతి అంశాన్ని ప్రోత్సహించి, అక్కడ రైతుల పక్షాన నిలబడి రెండు ప్రాంతాల ప్రజలకు దూరంకావడం ఇష్టం లేకే ఆయన అలా మాట్లాడారు అనే అనుమానం కలుగుతుంది.

Also Read: బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్

ఇక మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమరావతికి పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు, సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించారు. రాజధానిని అమరావతి నుండి కదలనీయను అని ఆయన చెప్పడం, అక్కడి రైతులకు ధైర్యం కలిగించింది. తీరా సోము వీర్రాజు రంగంలోకి దిగి పూర్తిగా కొత్త వర్షన్ ఎత్తుకున్నారు. కాగా మూడు రాజధానుల విషయంలో బీజేపీ చేయించిన అంతర్గత సర్వేలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలో వ్యతిరేకత మూటగట్టుకోవడం ఎందుకు అనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తుంది.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

రాజధాని అమరావతికి కట్టుబడి బాబు చేస్తున్న ఉద్యమానికి ఇంత వరకు ప్రజామద్దతు లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కొందరు బాబును ఈ విషయంలో వ్యతిరేకిస్తుండగా, ప్రజామద్దతు ఆశించడం అత్యాశే అవుతుంది. బాబు అమరావతి వలన పొందే ప్రయోజనాలు ఏమైనా కానీ, రెండు ప్రాంతాలకు దూరం అవుతున్నాని తెలిసినా అమరావతి ఉద్యమాన్ని వదలడం లేదు. రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు ఇలా ఉండగా, బీజేపీ దాని జోలికి పోకపోవడం మంచిది కాదని ఆలోచన చేసింది. అలా అని మూడు రాజధానుల నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పక పోవడం గమనార్హం. అలా చెవితే టీడీపీ అడిగే కొన్ని ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే ఈ విషయంలో బీజేపీ మేము ప్రేక్షకులం మాత్రమే అని నిర్ధారించింది.

 

బండి సంజయ్ సైన్యం.. కేసీఆర్ ను ఢీకొంటుందా?


కొడితే ఏనుగు (కేసీఆర్) కుంభస్థలాన్నే కొట్టాలి. అందుకే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు మొత్తం ఫైర్ బ్రాండ్స్ తోనే పోటీకి సై అంటున్నారు. తెలంగాణలో బీజేపీ సీనియర్లందరినీ పక్కనపెట్టి సాహసం చేశారు. యువ, ఫైర్ బ్రాండ్స్ తో సీఎం కేసీఆర్ ను డీకొట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇందులో హేమాహేమీలైన బీజేపీ నేతలు ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. అంత కొత్త బ్యాచ్. ఫైర్ బ్రాండ్స్ తో నింపేశారు.

Also Read: పాత, కొత్త.. ఇదే కాంగ్రెస్ కు శాపమవుతోందా?

తెలంగాణ బీజేపీలో అయితే కిషన్ రెడ్డి, లేదంటే లక్ష్మణ్ బ్యాచ్ ఉండేది. ఈ ఇద్దరితో తెలంగాణలో బీజేపీ బలపడింది లేదు. అధికారంలోకి వచ్చింది లేదు. దీంతో ఫైర్ బ్రాండ్ అయిన బండి సంజయ్ ని రంగంలోకి దింపింది బీజేపీ అధిష్టానం. ఆయన తన సైన్యాన్ని అలాగే ఎంచుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడే రఘునందన్ రావు, యెండల, యెన్నం, విజయరామారావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి వారికి చోటు కల్పించారు.

తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్టే దూకుడు.. విరుచుకుపడే వారితోనే బండి సంజయ్ కొత్త టీంను రెడీ చేశాడు. ఇందులో మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సహా డీకే అరుణ, జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్ లాంటి ప్రముఖులకు మొండి చేయి చూపడం చర్చనీయాంశమైంది. కార్యవర్గ సభ్యులు, పదాధికారులను ఎన్నుకున్న విధానాన్ని చూస్తే పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై బండి ఎక్కువగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. యువత, మహిళలకు పెద్ద పీట వేసి ఫైర్ బ్రాండ్స్ లాంటి నేతలను తన కార్యవర్గంలో చేర్చుకున్నారు బండి సంజయ్. కేసీఆర్ సర్కార్ ను ఢీకొట్టే బ్యాచ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి ఈ టైంలో వీరు ఎంత ప్రభావం చూపుతారనేది వేచిచూద్దాం.

మొత్తం 22 మందితో తన టీంను బండి సంజయ్ ప్రకటించారు. ఇందులో 8మంది ఉపాధ్యక్షులు.. నలుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు.. 8మంది కార్యదర్శులుగా నియమించారు.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

విజయరామారావు, చింతల రాంచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బండారు శోభారాణి,

* ప్రధాన కార్యదర్శులు
ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు

*కార్యదర్శులు
రఘునందన్ రావు, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి

-ఎన్నం

చైనాకు మరో భారీ దెబ్బ


కరోనాను పుట్టించిన పాపం చైనాకు ఊరికే పోవడం లేదు. అంతేకాకుండా సామ్రాజ్యవాదంతో భారత్ సహా పొరుగుదేశాలపైకి దండెత్తడంతో ఇక ప్రపంచం దృష్టిలో చైనా విలన్ అయ్యింది. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. వరుసగా చైనాకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. భారత్ తో కయ్యానికి కాలుదువ్వడంతో మన దేశం ఏకంగా 59 చైనా యాప్స్ పై నిషేధం విధించి ఆర్థికంగా దెబ్బతీసింది. పలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఇలా చైనా ఆర్థిక మూలాలను కదిలించే చర్యలకు దిగడం.. అటు అమెరికా కూడా ఇదే పనిలో హెచ్చరికలు పంపడంతో చైనా మన దేశ సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయింది.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

ఇప్పుడు చైనాను అమెరికా దేశం అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. అమెరికా కూడా టిక్ టాక్ తోపాటు పలు చైనా యాప్ లను బ్యాన్ చేయడానికి సిద్దమైంది.తాజాగా చైనాకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా చైనాకు భారీ షాక్ ఇచ్చింది. తన యాప్ స్టోర్ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్ ను తొలగించింది. వీటిల్లో 26వేలకు పైగా యాప్స్ గేమ్స్ కు చెందినవి కావడం విశేషం. ఈ గేమింగ్ పేరుతో వ్యక్తుల డేటా చోరీ చేస్తోందని ఆ సంస్థపై ఆరోపణలున్నాయి.

గత ఏడాది యాపిల్ సంస్థ గేమింగ్ యాప్స్ రూపొందించే సంస్థలకు ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ లు సమర్పించాలని కోరింది. దీనికి డెడ్ లైన్ ను జూన్ వరకు పెట్టింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాజాగా యాపిల్ తన ప్లేస్టోర్ నుంచి ఈ 29వేల చైనీస్ యాప్స్ ను తొలగించింది.

Also Read: పాత, కొత్త.. ఇదే కాంగ్రెస్ కు శాపమవుతోందా?

ఇక గత నెల మొదటి వారంలోనే సుమారు 2500కు పైగా యాప్స్ ను యాపిల్ సంస్థ తొలగించింది. ఇలా చైనా దుర్భిద్దికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి చర్యలు మొదలయ్యాయి. ఇలానే వ్యవహరిస్తే మరిన్ని ఆర్థిక మూలాలు కూడా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది.

పాత, కొత్త.. ఇదే కాంగ్రెస్ కు శాపమవుతోందా?


100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. దేశంలో మెజార్టీ ప్రధానులను ఇచ్చిన పార్టీ.. ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ ఇప్పుడు బీజేపీ ధాటికి కకావికలం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి రావడానికి పాత, కొత్త నేతల మధ్య వైరమే అసలు కారణంగా చెప్పవచ్చు. ఈ పంచాయితే కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేస్తోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?

కాంగ్రెస్ వ్యవహారాలు ఇప్పుడు దేశంలో పూర్తి గందరగోళంగా మారాయి. పార్టీకి పూర్తి సమయం అధ్యక్షుడు లేనందున ఆ బాధ్యతలను సంవత్సరం నుంచి సోనియా గాంధీ మోస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చలేక కాంగ్రెస్ లో క్యాడర్, నేతలు నిరుత్సాహంలో పడిపోతున్నారు. నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది.

ప్రస్తుతం సోనియా గాంధీ తన కొడుకుకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ రాహుల్ మాత్రం కాంగ్రెస్ వృద్ధ జంబూకాలను పార్టీలో రిటైర్ మెంట్ ప్రకటించి యువతకు అవకాశాలు ఇస్తేనే తాను అధ్యక్ష పదవిని తీసుకుంటానని అంటున్నారు. దీంతో సోనియా ఆ పనిచేయడం లేదు. సీనియర్లను వదలుకోలేక.. యువతకు అధికారాలు, పార్టీని అప్పగించలేక ఆమె రాహుల్ నే పక్కనపెడుతున్నారు.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

సోనియా చుట్టే పాత సీనియర్లు చేరి పార్టీ ప్రక్షాళన చేయకుండా ఆమెకు నూరిపోస్తున్నారన్న చర్చ ఆ పార్టీలో ఉంది. అందుకే రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేస్తే కొత్త యువ నాయకత్వం కాంగ్రెస్ లో వస్తుందని.. తమ పప్పులు ఉడకవని.. అందుకే సోనియా ముందరి కాళ్లకు సీనియర్ నేతలు బంధం వేస్తున్నారని అంటున్నారు.

దీంతో ఈ సంవత్సరంలో అనేక రాష్ట్రాల్లో యువ నేతలు సింధియా, సచిన్ పైలట్ లాంటి వాళ్లు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. రాహుల్ గనుక అధ్యక్ష బాధ్యతల్లో ఉండి వుంటే వీరే ఆ రాష్ట్రాల సీఎంలు అయ్యిండేవారు.ఇప్పటికైనా సోనియా, రాహుల్ లు కలిసి కూర్చొని పాత సీనియర్లకు మంగళం పాడి పార్టీలో యువనేతలకు అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి.

ఏమైంది నాగబాబు.. ఏది నీ ఆగ్రహం?


వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ చేస్తున్న మరో సినిమా ‘అల్లు’. ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ “అల్లు” అంటూ వర్మ మరో సొల్లు తియ్యడానికి రెడీ అవుతున్నాడు. మరి గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీ గురించి వర్మ ఇంత రచ్చ చేస్తున్నా.. కనీసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా స్పందిస్తారని అనుకుంటే ఎవ్వరూ నోరు మెదపకపాయే. కనీసం ఖాళీగా ఉండే నాగబాబు అయినా ఎప్పటిలాగే తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తారనుకుంటే.. ఏదో చిన్న నిట్టూర్పులు విడుస్తూ నాగబాబు బండి లాగిస్తున్నాడు. అదే బాలయ్య మీద అయితే నాగబాబు ఓ రేంజ్ లో విరుచుకు పడతాడు.

Also Read: అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !

దానివల్ల చివరికీ మెగా ఇమేజ్ కే డ్యామేజ్. అప్పట్లో టీడీపీ సపోర్టర్లు వరుణ్ తేజ్ వాల్మీకికి పెద్ద దెబ్బే వేశారు. సినిమా బాగున్నా.. కలెక్షన్లు రాకపోవడానికి కారణం బాలయ్య అభిమానులతో పెట్టుకోవడమే. అయినా నాగబాబు ఎక్కడా తగ్గలేదు. మరి అదే ఊపు వర్మ విషయంలో ఏమైంది ? ఈ మధ్య నాగబాబుకి రాజకీయ బాధ ఎక్కువైనట్టు ఉంది. అయితే మాత్రం మొన్నటికి మొన్న తన తమ్ముడ్ని పవర్ స్టార్ అంటూ ఓ ఆటాడేసుకున్నాడు వర్మ. ఇప్పుడు అల్లు అరవింద్ వంతు వచ్చింది. మరి రామ్ గోపాల్ వర్మ పై నాగబాబు ఎందుకు మౌనంగా ఉన్నట్టు.. తన స్థాయి కాదనుకున్నాడా ? ఆ మాటకొస్తే నాగబాబుకు కంటే కూడా వర్మకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కదా.

Also Read: అయ్యో.. వ్యభిచారంలోకి సినీ ఆర్టిస్టులా !

ఏమైనా నాగబాబు పరిస్థితులకు తగ్గట్లు మూవ్ అవ్వాలి . అసలు వర్మ అనే శాడిస్ట్ డైరెక్టర్ ‘పవర్ స్టార్’ అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడే మెగా బ్రదర్ గా బైటకొచ్చి వీరంగం వేస్తె ఎంత బాగుండేది. మెగా అభిమానులు ఎంత ఆనంద పడేవాళ్ళు. ఒక్కటి మాత్రం నిజం.. మెగా అంటూ హడావుడి చేసే నాగబాబు.. ఆ మెగాకి ఉపయోగం లేకుండా పెద్ద మైనస్ పోయాడు.

గ్రేట్ ముసలి డైరెక్టర్ ని పట్టిన కుర్ర హీరోయిన్ !


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లాసిక్ డైరెక్టర్స్ లో ముందు వరుసలో ఉండే పేరు ‘మణిరత్నం‘. చూడటానికి ఏదో అమ్మాయికుడిగా ఉంటాడు గాని, మహా రొమాంటిక్. మరి లోపల రొమాన్స్ లేకపోతే ఆ రేంజ్ లవ్ స్టొరీలు చేయలేడు కదా.. నిజానికి మణిరత్నం క్లాసిక్ చిత్రాల ఫేవరేట్ డైరెక్టర్ గా మంచి నేమ్ తెచ్చుకున్నా.. ప్రేక్షకులకు మాత్రం ఆయన తీసిన ప్యూర్ లవ్ డ్రామాలంటేనే ఎక్కువ ఇష్టం. రియలిస్టిక్ ఎమోషన్స్ తో పాటు ఇంటర్నల్ మెసేజ్ ఇస్తూ సినిమాలు తీయడంలో మణిరత్నంను మించిన డైరెక్టర్ లేడని తీర్మానం చెయ్యొచ్చు ఏమో. అందుకేనేమో.. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం మణిరత్నంను ఆరాధిస్తుంటారు. ఆ ఆరాధనలో యువ కథానాయకులు కూడా ఉన్నారండోయ్. ముఖ్యంగా ‘అదితి రావు హైదరీ‘కి మణిరత్నం అంటే బాగా ఇష్టమట.

Also Read: హమ్మయ్య ఎట్టకేలకు హీరో దొరికాడు !

అయినా మణిరత్నం అంటే ఇష్టం లేనిది ఎవరికీ అంటారా..మరి మణిరత్నం తీసిన ‘నాయకుడు’, ‘దళపతి’, ‘సఖి’, ‘రోజా’, ‘గీతాంజలి’ వంటి అద్భుతమైన చిత్రాలు నేటికీ క్లాసిక్ చిత్రలుగా వెలిగిపోతున్నాయి అంటే.. అది మణిరత్నం గొప్పతనమే కదా. అందుకే అందరూ మణిరత్నంను ఇష్టపడతారు. కానీ అదితి రావు హైదరీ ఇష్టం వేరు అట. ఆమెకు సుహాసిని అంటే కోపం అట. గొప్ప దర్శకుడిని తన సొంతం చేసుకుందని. ఆ మధ్య ఇదే విషయాన్ని సుహాసిని దగ్గర ప్రస్తావిస్తే.. ఆమెకు ఏమి చెప్పాలో అర్ధం కాక, మణిరత్నం దగ్గరకి వెళ్లి.. మళ్ళీ అదితి రావు హైదరీని నీ సినిమాలో తీసుకుంటే ఊరుకునేది లేదని ఆర్డర్ పాస్ చేసిందట. దాంతో మణిరత్నం ప్రస్తుతం చేస్తోన్న సినిమాలో మొదట అదితికి ఛాన్స్ ఇచ్చినా.. ఆ తరువాత సుహాసిని ఆర్డర్ దెబ్బకు ఆమెను తప్పించాడు.

Also Read: అయ్యో.. వ్యభిచారంలోకి సినీ ఆర్టిస్టులా !

మళ్ళీ ఏమైందో ఏమో.. అదితి కరోనా టైంలో కూడా మణిరత్నం కలవాలని చెన్నై వచ్చి కలిసిందట. దాదాపు రెండు వారాల వరకూ అదితి రావు హైదరీ చెన్నైలోనే ఉందట. మొత్తానికి మణిరత్నంను వదలకుండా మళ్ళీ ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అందరికీ దూరంగా ఉండే మణిరత్నం అదితితో మాత్రం సరదాగా ఉంటాడట. పైగా ఎవరితో తన వ్యక్తిగత విషయాలను పంచుకునే అలవాటు లేని మణిరత్నం.. అదితితో మాత్రం ప్రతిది చెప్పుకుంటాడట. అందుకు కారణం అదితి రావు హైదరీ బిహేవియరేనట. మొత్తానికి కుర్ర హీరోయిన్ ముసలి డైరెక్టర్ ను పట్టిందని కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ సుహాసిని ఏమి చేస్తోందో చూడాలి.

అయ్యో.. వ్యభిచారంలోకి సినీ ఆర్టిస్టులా !


కరోనా.. గత కొన్ని నెలలుగా మన బుర్రలను పట్టి పీడిస్తోన్న అతి చిన్న వైరస్. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ వైరస్‌ సినిమా ఇండస్ట్రీకి థియేటర్ల వ్యవస్థకు పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే థియేటర్లను నమ్ముకుని బతికే కార్మికులు కూలీ పనులకు పోతున్నారు. ఇంతకన్నా మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ లుగా పని చేస్తోన్న అమ్మాయిలు బతుకు బండిని కరోనా కోరలకు బలి చేయలేక.. వ్యభిచార రొంపిలోకి వెళ్తున్నారట. నిజంగా ఇది అత్యంత బాధ పెట్టే సంఘటనలే. వారి కన్నీటి మరకల చాటు మాటు వ్యవహారాలను ఎవ్వరూ పరిష్కరించలేరు. అలా అని తప్పుడు మార్గంలోకి వెళ్తుంటే చూస్తూ ఉండలేము. కాబట్టి ప్రభుత్వమే సినిమా ఇండస్ట్రీలోని అమ్మాయిలను, కార్మికులను ఆదుకోవాలి. కనీసం వాళ్ళు పస్తులతో సావాసం చెయ్యకుండా ప్రభుత్వం కనీస ఆర్ధిక సహాయం చేసినా.. ఎన్నో బతుకులు చీకటి కాకుండా ఉంటాయి.

Also Read: అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !

ఇక కరోనా తీవ్రత భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా సినిమాల పరిస్థితి ఇప్పట్లో మాములు స్థితికి వచ్చే అవకాశం లేదు. సాటి వారి కష్టాలను చూసి చూడనట్టుగా సర్దుకుపోవాల్సిన స్థితి ఒక్క కరోనాతోనో సాధ్యం అయిందని సరిపెట్టకుండా.. సినీ పెద్దలు ఇంకా సాయం అందించాలి. ఐదు నెలలకు రెండు సార్లు సరుకులు ఇస్తే సరిపోదు. ఏ.. కోట్లు తీసుకునే హీరోలు తమ ఇండస్ట్రీలోని పేదలను ఆదుకోలేరా.. వాళ్ళ తీవ్ర ఇబ్బందులను పూర్తిగా తీర్చలేకపోయినా.. కొంతవరకైనా సాయం అందించాలి కదా. నిజమే.. సినిమా రంగం పై కరోనా పంజా విసిరింది. దాని వల్ల రోడ్డున పడింది ఎవరు.. సినీ కార్మికులే కదా. కార్మికులు లేకపోతే సినిమాలు చేయలేరు. ఇప్పుడు ఇలాగే కరోనా మరో ఐదారు నెలలు ఉంటే ఇక ఇండస్ట్రీని నమ్ముకుని ఒక్క కార్మికుడు ఉండదు.

Also Read: హమ్మయ్య ఎట్టకేలకు హీరో దొరికాడు !

అయినా పని లేనప్పుడు.. పొట్ట నిండనప్పుడు ఎందుకు ఇండస్ట్రీలో ఉండాలి. షూటింగ్లు జరపకుండా ఇంకా పంజా ఎప్పుడు విసురుదామా అని కాచుకుని కూర్చున్న కరోనాకి ఎందుకు బలి అవ్వాలని కార్మికులందరూ అనుకుంటే… సినిమాల షూటింగ్ లన్నీ ఆపేయాల్సిందేగా. అప్పుడు కృష్ణ నగర్ కష్టాలు సినిమా పెద్దల్లో ఎక్కువైపోతాయి. కాబట్టి సినీ పెద్దలు.. మరో నాలుగు నెలలు షూటింగ్ లు లేకపోయినా… సినీ కార్మికులు కడుపు నింపండి. అలాగే ఇప్పటికే చిన్న సినిమాల్లో తమ డబ్బులు ఖర్చు పెట్టిన చిన్న నిర్మాతలకు అండగా ఒక భరోసాను కల్పించండి. ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్ట్ లైనా అమ్మాయిలు పక్కదారి పట్టకుండా పెద్ద మనసు చూపండి.

మహేష్ బాబు కుమార్తె సితార డ్యాన్స్ వీడియో వైరల్


సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ముద్దులు కూతురు సితారకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నమ్రత సోషల్ మీడియా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://www.instagram.com/p/CDWJTg7j8sP/

 

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

Manikyarao
Manikyarao

Manikyarao

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(59) శనివారం కన్నుమూశారు. నెలరోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. జూలై 4న ఓ వీడియో విడుదల చేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాణిక్యాల రావు తొలుత హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే అక్కడ శ్వాసతీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తడంతో వారం రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనను వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

మాణిక్యాల రావు 1961 నవంబర్ 1న ఏపీలోని పశ్చిమ గోదావరిలోని తాడేపల్లిగూడెంలో జన్మించారు. అక్కడే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతారు. తాడేపల్లిగూడెంలో వివిధ వ్యాపారాలు చేశారు. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా 14వేల మెజార్టీతో నాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2018 వరకు దేవదాయ,ధర్మాదాయ శాఖమంత్రిగా కూడా పనిచేశారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో మాణిక్యాలరావు సుదీర్ఘకాలం పనిచేశారు. వివిధ పదవులు నిర్వహించారు. ఆయనకు జాతీయస్థాయి బీజేపీ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన ఆర్ఎస్ఎస్‌లో స్వయంసేవక్‌గా తన ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?

మాణిక్యాలరావు మృతిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి మాణిక్యాలరావు మృతికి సంతాపం వ్యక్తంచేసి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారును ఆదేశించారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మాణిక్యాలరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మాణిక్యాల రావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. ఆయన అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలోనే నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?


మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో కీలకమైన నేత. నెల్లూరు రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా ఆయన సొమిరెడ్డి సత్తా చాటుతున్నారు. చంద్రబాబు నాయుడికి అత్యంత దగ్గరైన వ్యక్తుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. బాబు క్యాబినెట్లో మంత్రి పదవీ దక్కించుకొని నెల్లూరు జిల్లాల్లో ఆయన చక్రం తిప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోమిరెడ్డికి కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నారు. తనకు సంబంధంలేని విషయంలో చంద్రబాబుతో చీవాట్లు తినాల్సి వచ్చిందని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: బాబును రాజీ’డ్రామా’లతో కొట్టాలనుకున్న జగన్

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్నిచోట్ల దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను తొలగించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాడు చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటన కావలిలో చోటుచేసుకుంది. కావలి పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేతలు పక్కకు తొలగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారడంతో చంద్రబాబు సోమిరెడ్డికి ఫోన్ చేసి మందలించారట. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్నావు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలబెట్టలేవా? అంటూ అనడంతో ఈ ఇష్యూను ఆయన సవాలుగా తీసుకొని పోరాటానికి సిద్ధమయ్యారనే టాక్ విన్పిస్తోంది.

ఎన్టీఆర్ విగ్రహం పునఃప్రతిష్టించాలని సోమిరెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ వినతిప్రతం అందజేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసి వైసీపీ నేతల తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు టీడీపీ నేతల నుంచి పెద్దగా సపోర్టు రాకపోవడంతో ఆయన పోరాటం వృథా మారుతుందని వాపోతున్నారట.

Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?

ఎన్టీఆర్ విగ్రహా పోరాటంలో జిల్లా నేతలు పెద్దగా సహకరించకపోవడంతో ఉద్యమం రోజురోజుకు నీరుగారిపోతుందని సోమిరెడ్డి ఆందోళన చెందుతున్నారు. జగన్ సర్కార్ ఎలాగూ ఆయన మాట వినే పరిస్థితి లేదని.. మరోవైపు చంద్రబాబు నాయుడు తన సత్తాకు పరీక్ష పెట్టడంతో సోమిరెడ్డి లోలోపల కుమిలిపోతున్నారట. దీంతో ఎన్టీఆర్ విగ్రహం పునః ప్రతిష్టించడం ఆయనకు పెద్దగా సవాలుగా మారిందనే వాదనలు విన్పిస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ నేతకు ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఆయనను పార్టీలో ఒంటిరి వాడిలా మార్చిందనే ప్రచారం జరుగుతోంది. మున్మందు ఈ విగ్రహా రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకోనుందో వేచి చూడాల్సిందే..!

హమ్మయ్య ఎట్టకేలకు హీరో దొరికాడు !

Tiger-Nageswara-rao-movie-updates


‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాల డైరెక్టర్ ‘వంశీకృష్ణ’. పాపం పేరుకు రెండు సినిమాలు చేసినా మనోడికి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. మధ్య మధ్యలో మంచు లక్ష్మి పోగ్రామ్స్ కి డైరెక్టర్ గా చేయడం వల్ల పూర్తి సినిమా డైరెక్టర్ గా సక్సెస్ కాలేకపోయాడు. అయితే వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ అనే బయోపిక్ ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం మొదలైన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో రానా హీరో. రానా పై కొన్ని సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ కూడా చేశారు. షూట్ చేసిన తరువాత ఆ పార్ట్ నచ్చలేదో.. లేక డైరెక్టర్ వర్క్ నచ్చలేదో గాని మొత్తానికి రానా ఈ సినిమా నుండి ఏవో కారణాలు చెప్పి తెలివిగా తప్పుకున్నాడు.

Also Read: అది మెగాస్టార్ గొప్పతనం అంటే.. !

ఆ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాను తీయాలనుకున్నా బెల్లంకొండ కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోయాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ సినిమాకి హీరో దొరకట్లేదాయే. ఏ హీరో దగ్గరకు పోయినా దొంగ పాత్ర అని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాదని కాస్త ఫామ్ లో ఉన్న హీరోలు ఇంట్రస్ట్ చూపలేదు. ఇక ఒకటి రెండు హిట్స్ ఉన్న హీరోలు కూడా సినిమాలో హీరో పాత్ర పక్కా నెగిటివ్ పాత్ర అని సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఏది ఏమైనా హీరో దొరక దాదాపు నాలుగు సంవత్సరాల నుండి అప్ డేట్ లేకుండా పడి ఉన్న ఈ గజదొంగ సినిమాకి మొత్తానికి తాజాగా హీరో దొరికాడు.

Also Read: ట్రాక్ తప్పిన హీరోయిన్.. కెరీర్ క్లోజ్ !

టాలీవుడ్ లో రాకింగ్ స్టార్ గా ఎలివేట్ అవుదామని ఎంట్రీ ఇచ్చి.. ప్లాప్ లతో సైడ్ అయిపోయిన మంచు మనోజ్ గజదొంగ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. మరి మనోజ్ కి ఈ గజదొంగ ఎంతవరకూ హిట్ ని ఇవ్వగలడో చూడాలి. అయితే సినిమాలో హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ కామెడీగా ఉంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లో మంచి ఎనర్జీ ఉంటుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ టైగర్ నాగేశ్వరరావు ఎవరో నేటి యువతకు పెద్దగా తెలియదు. ఇతను ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తి. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడులేండి.