
కొడితే ఏనుగు (కేసీఆర్) కుంభస్థలాన్నే కొట్టాలి. అందుకే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు మొత్తం ఫైర్ బ్రాండ్స్ తోనే పోటీకి సై అంటున్నారు. తెలంగాణలో బీజేపీ సీనియర్లందరినీ పక్కనపెట్టి సాహసం చేశారు. యువ, ఫైర్ బ్రాండ్స్ తో సీఎం కేసీఆర్ ను డీకొట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇందులో హేమాహేమీలైన బీజేపీ నేతలు ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. అంత కొత్త బ్యాచ్. ఫైర్ బ్రాండ్స్ తో నింపేశారు.
Also Read: పాత, కొత్త.. ఇదే కాంగ్రెస్ కు శాపమవుతోందా?
తెలంగాణ బీజేపీలో అయితే కిషన్ రెడ్డి, లేదంటే లక్ష్మణ్ బ్యాచ్ ఉండేది. ఈ ఇద్దరితో తెలంగాణలో బీజేపీ బలపడింది లేదు. అధికారంలోకి వచ్చింది లేదు. దీంతో ఫైర్ బ్రాండ్ అయిన బండి సంజయ్ ని రంగంలోకి దింపింది బీజేపీ అధిష్టానం. ఆయన తన సైన్యాన్ని అలాగే ఎంచుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడే రఘునందన్ రావు, యెండల, యెన్నం, విజయరామారావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ లాంటి వారికి చోటు కల్పించారు.
తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్టే దూకుడు.. విరుచుకుపడే వారితోనే బండి సంజయ్ కొత్త టీంను రెడీ చేశాడు. ఇందులో మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ సహా డీకే అరుణ, జితేందర్ రెడ్డి, గడ్డం వివేక్ లాంటి ప్రముఖులకు మొండి చేయి చూపడం చర్చనీయాంశమైంది. కార్యవర్గ సభ్యులు, పదాధికారులను ఎన్నుకున్న విధానాన్ని చూస్తే పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై బండి ఎక్కువగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. యువత, మహిళలకు పెద్ద పీట వేసి ఫైర్ బ్రాండ్స్ లాంటి నేతలను తన కార్యవర్గంలో చేర్చుకున్నారు బండి సంజయ్. కేసీఆర్ సర్కార్ ను ఢీకొట్టే బ్యాచ్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి ఈ టైంలో వీరు ఎంత ప్రభావం చూపుతారనేది వేచిచూద్దాం.
మొత్తం 22 మందితో తన టీంను బండి సంజయ్ ప్రకటించారు. ఇందులో 8మంది ఉపాధ్యక్షులు.. నలుగురు పార్టీ ప్రధాన కార్యదర్శులు.. 8మంది కార్యదర్శులుగా నియమించారు.
Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?
విజయరామారావు, చింతల రాంచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బండారు శోభారాణి,
* ప్రధాన కార్యదర్శులు
ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బండారు శృతి, మంత్రి శ్రీనివాసులు
*కార్యదర్శులు
రఘునందన్ రావు, ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి, మాధవి, ఉమారాణి
-ఎన్నం